వాయు మహా పురాణము

Table of Contents

24 - శార్వస్తవం

వాయువు పలికెను:- భారతవర్షమున మునులు నాలుగు యుగములని తెలిపిరి. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము తిష్యయుగము అని నాలుగు యుగములు-1. వీని వేయి వరకు బ్రహ్మకు పగలు అనబడును. యామాదులైన గణములు ఏడు, రోమవస్త్రములు పదునాలుగు-2. తోడుగా వచ్చునవై సశరీరములై జనోలోకమునాశ్రయించుచున్నవి. ఈ విధముగ దేవతలు మహర్లోకము నుండి జనోలోకమును తపోలోకమును దాటగా మన్వంతరములు గడచిపోయినవి. మహౌజస్కులైన దేవతలందరు ఊర్థ్వలోకమును జేరిరి. ఆకల్పమునందున్న వారితో సహయోగమును బొందిరి-3,4. అపుడా దేవతలు సంకలనమును (కలయికను) బొందగా ఆ పదునాలుగు గణములు మహర్లోకములను వదలిరి-5. అపుడు భూతాదులు మిగిలిన స్థావరాన్తములు, భువర్లోకము మొదలుకొని మహర్లోకము వరకున్న లోకములు శూన్యములైనవి. కల్పవాసులైన దేవతలు ఊర్థ్వలోకమున జనమును జేరిరీ-6. దాహముతో గూడిన వర్షముచేత యుగము క్షయము గోగా పైవారి సమూహముతో బ్రహ్మ బ్రహ్మర్షి గణములను దానవుల నందరినీ సంస్థాపించును-7.

నేనీదివరకు గడచిపోయినట్లుగా చెప్పిన యేడవ కల్పము ఏడు సముద్రములు గాఢముగా కలిసి యొక్కటైన మహా సముద్రములచే భయంకరమై చీకటి నిండి విభజింపరాని యేకార్లవ మయ్యెను. (అంతయు ఒకే సముద్రమయ్యెను)-8. మాయతో నా విధముగా ఏకసముద్రము దానియందు శంఖము చక్రము గదను ధరించినవాడు, మేఘమువలె నల్లనైనవాడు, కమలనేత్రుండును, కిరీటము, శ్రీపతియునైన హరి-9 నారాయణ ముఖము నుండి వెలువడిన యెనిమిదవ పురుషోత్తముడై యుండెను. అతడెనిమిది బాహువులు గలవాడు. విశాల వక్షస్థలముగలవాడు. అతడు లోకములకంతటికిని కారణభూతుడని చెప్పబడుచున్నాడు. అతడు యోగముతో గూడిన యాత్మ గలవాడు చింతింపనలవిగాని, యనిర్వచనీయమైన యోగమునందున్న వాడు. యోగమును తెలిసినవాడు. అతడు ఆదిశేషుని విశాలమైన వేయి పడగలనానుకొని బంగారు పాన్పుపై పడుకొనుచున్నాడు. ఆయాదిశేషుడు సమస్త మహాఫణములు గల సర్పముల కధిపతి. సాటిలేని తేజస్సు గలవాడు-10,11.

ఈ విధముగా నచటపడుకొనుచున్న సర్వసమర్థుడైన ప్రభువై యాత్మారాముడైన (తనలో తానే యానందించువాడైన విష్ణువుచేత క్రీడ కోఱకై (విలాసమునకై) నాభియందు కమలము సృష్టింపబడినది-12. ఆ కమలము నూరు యోజనముల వెడల్పయినది. ఉదయించిన సూర్యునికాంతి గలది. వజ్రము దండము (నాళముగా) గలది. మహ్నోతమయినది. ఇట్టి కమలము ప్రభువైన విష్ణువుచే లీలగా సృష్టింపబడినది-13.

ఈ విధముగ నాడుచున్న యాదేవమీఢుషునియొక్క సమీపమునకు బంగారు బ్రహ్మాండమువలన బుట్టిన బ్రహ్మ స్వేచ్ఛగా వచ్చెను. ఆ బ్రహ్మ బంగారు వర్ణము గలవాడు. ఇంద్రియములకు మించిన (ప్రత్యక్షముగాఁని) వాడు. నాలుగు ముఖములు గలవాడు. అట్టి బ్రహ్మ మంచి గంధము కాస్తియు గల క్రొత్త శోభతో గూడిన పద్మముతో నాడుకొనుచున్న యా విష్ణువును జూచి ఆశ్చర్యమును బొందెను- 14, 15.

తరువాత నా బ్రహ్మ తన సంపూర్ణ వాక్కుతో బలికెను. మీరెవరు సముద్రము జల మధ్యము నాశ్రయించి పడుకొనుచున్నారు అని-16. తరువాత బ్రహ్మయొక్క యా శుభవాక్కును విని అచ్యుతుడు ఆశ్చర్యముతో విప్పారిన కన్నులుగలవాడై పాన్పు నుండి లేచి కూర్చుండెను-17. ప్రత్యుత్తరముగా దీవి, అంతరిక్షము, భూతము పరమపదము గూడ ప్రభువైన నేనే అని-18.

ఈ విధముగా భగవంతుడు పలికి మరలనిట్లనెను. ఓ భగవాన్! నీవెవడవు? నా సమీపమునకెందులకు వచ్చితివి? ఇటునుండి యెక్కడికి బోవలసియున్నది? నీయాశ్రయము (నివాసము) ఎక్కడ? విశ్వమూర్తిగానున్న నీవెవ్వడవు? నాతోనీకు బనియేమి? అని యీ విధముగ బలుకుచున్న వైకుంఠుడైన విష్ణువును గూర్చి బ్రహ్మ ప్రతివచనమీవిధముగ బలికెను. 20 వారు ఆదికర్తయైనట్లే నేను గూడ యాదికర్తయైన ప్రజాపతిని (బ్రహ్మ) సర్వము నాయందున్నవి. అని నారాయణునితో చెప్పెను-21.

విష్ణు వాశ్చర్యకరమైన బ్రహ్మమాట విని లోకవర్తనమయిన బ్రహ్మచే ననుమతింపబడినవాడై విశ్వకారణుడైన వైకుంఠుడైనను విష్ణువు-22, కుతూహలముతో మహాయోగియై యోగశక్తి గలవాడై బ్రహ్మయొక్క ముఖమును బ్రవేశించెను. ఆ విధముగా బ్రవేశించిన మహాతేజస్వియైన విష్ణువు సముద్రముతోను పర్వతములతోను గూడిన యీ యెనిమిది ద్వీపములను నాలుగు వర్ణములతో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములతో సమాకులమైన బ్రహ్మ మొదలుకొని వరి గంట (యొక్క మధ్య భాగము) వరకు గల సనాతనములైన యేడు లోకములను వీనినన్నింటిని బ్రహ్మయొక్క కడుపులో జూచెను. తరువాత మహాయశస్కుడైన విష్ణువు. “ఆశ్చర్యమీతని తపస్సు యొక్క ప్రభావము” అని తనలో మాటిమాటికి బలికెను-23,24. ఆ విధముగా విష్ణువు వివిధములైన లోకములను అనేక విధములైన యాశ్రమములను తిరుగుచుండెను. వేయి యేండైనను విష్ణువపుడు దానికన్తమును జూడలేదు-25.

అపుడు గరుడధ్వజుడైన విష్ణువు బ్రహ్మదేవుని ముఖమునుండి వెలువడెను. తరువాత శత్రువులే పుట్టని భగవంతుడైన విష్ణువు భగవాన్, పుణ్యాత్ముడవైన నీ యొక్క కడుపు యొక్క మద్యమును, చివరను, కాల దిక్కుల యొక్కయనములను నేను జూడలేదు-26,27. అనియిట్లు పలికి విష్ణువు బ్రహ్మతోనిట్లనెను. ఓ బ్రహ్మా! ఇపుడు నీవు గూడ శాశ్వతమైన నాయుదరము (కడుపు)ను బ్రవేశించి సాటిలోని యీలోకములను జూడుము-28. తరువాత బ్రహ్మ ఆ విష్ణువు యొక్క మనోహరమైన వాక్కును విని యభినందించి-లక్ష్మీపతియైన విష్ణువు యొక్క యుదరమును బ్రవేశించెను-29. గర్భములో బ్రవేశించియుండిన యా చింతింపనలవిగాని పరాక్రమముగల బ్రహ్మయాలోకములనే చూచెను. అచట తిరిగి తిరిగి యాదిదేవుడైన విష్ణువు యొక్క (గర్భములో) యన్తమును చూడలేదు-30.

సర్వాత్తర్యామియైన విష్ణువు ఆ బ్రహ్మ వెలుపలికి రానున్నాడని తెలిసియన్నీ ద్వారములు మూసి వెంటనే మహాజలసమూహమున సుఖముగా నిద్రింపదలచెను. మహాజల సమూహమున నిద్రించితిని అనేను-31. అంత సమస్త ద్వారములు మాయబడినట్లు గనబడినవి. అంత బ్రహ్మ తన రూపమును సూక్ష్మముగాజేసి (విష్ణువుయొక్క) నాభియందు ద్వారమును తెలిసికొనెను-32. పద్మసూత్రమును (తామరతూటి దారమును) అనుసరించిన మార్గములనుసరించి వెళ్ళియా బ్రహ్మ నాలుగు ముఖముల యాతామరదుంప నుండి తనరూపమును పైకిలాగి ప్రకాశింపజేసెను. అపుడు పద్మగర్బముతో సమానమైన కాస్తిగలవాడై కమలమున నున్న బ్రహ్మ ప్రకాశించెను-33. ఇంతలో (ఈ మధ్యలో) ఆ సముద్ర మధ్యమున వారిరువురిచే మొత్తము పైన పరస్పరము మిక్కిలి సంతోషముగలుగుచుండెను-34.

సూతుడు ఆనెను:- తరువాత ఆదిశేషుని పడగలపైని ప్రభువై (పరుండి)న విష్ణువు ఉన్న యాచోటికి ఇంతింతని చెప్పనలవిగాని స్వరూపము గలవాడు, భూతములకు ప్రభువు, ఈశ్వరుడు, శూలము చేత ధరించినవాడు, బంగారు వస్త్రములు ధరించి కప్పుకొన్నవాడును ఐన మహాదేవుడు (శివుడు) వచ్చెను-35. వేగముగా నడచుచున్న యా శివుని పాదములచే మిక్కిలి పీడింపబడి వెంటనే యాకాశమున నేత్తుగా లేవగొట్టబడిన లావైన (సముద్ర) జల బిందువులు (కాలివేగపు తాకిడిచే) యత్యుష్టములై (గాలిచే) అతి శీతలములును ఐనవి. అచట వాయువు మిక్కిలి గొప్పదై వీచెను-36.

 ఆ మహాశ్చర్యమును జూచి బ్రహ్మ విష్ణువుతో నీటి బిందువులు లావై వేడియైనవి. (వానివలన) కమలము మిక్కిలి కంపించుచున్నది. ఈ నా సంశయమును గూర్చి నీవేమి చేయదలచినది చెప్పుము-37.

బ్రహ్మ ముఖము నుండి వెలువడిన యీ విధమయిన మాటలను విని సాటిలేని క్రియాకారియైన రాక్షససంహారకారియై భగవంతుడైన విష్ణువు-38, “ఇది యేమిటి? యిచట నా నాభియందు వేరొక భూతము (ప్రాణి) నివాసమేర్పరచికొనినది? నీకు నాచే అనిష్టము చేయబడినప్పటికిని అది అత్యంత ప్రియము (ఇష్టమైనది)గా జెప్పుచున్నారు-39. అనీ మనస్సులో ననుకొని యుత్తమముగా నీ మటను బటికేను. ఓ భగవన్ నీవిచట ఆ కమలమునందు ఎందుల కాశ్చర్యము జెందితివి-40. నేను నీకేమి జేసితినని నీవు నాతో మిక్కిలి ప్రేమతో మాటలాడుచున్నావు? ఓ పురుషశ్రేష్ఠ! అది యెందులకు? నీజము జెప్పుము-41. ఈ విధముగా జెప్పుచున్న దేవేశుడైన విష్ణువును గూర్చి కమలకాంతిగలవాడు వేదనిధి, ప్రభువు అయిన బ్రహ్మ నిజముగా జరుగు లోకయాత్రను (లోకము నడకను) బదులుగా బలికెను-42. నీ కోరికతో నేను పూర్వము నీ కడుపులో బ్రవేశించితిని. నీచేత నా కడుపులో సర్వలోకములు చూడబడినట్లే నాచేతగూడ నీ కడుపులో సమస్త లోకములు జూడబడినవి-43. వేయి యేండ్ల తరువాత మరలిన నాకు ఓ పుణ్యుడా! నన్ను వశముజేసికొన గోరి నీవు మాత్సర్యముతో (అసూయతో) వెలుపలికి వచ్చు ద్వారములన్నియు మూసివేసితివి-44. తరువాత ఓ మహాభాగా! నేను నా మనస్సుతో చింతించగా (యోగధారణ చేయగా) నాభిలో నాకు ప్రవేశము లభించినది. కమలనాళపు దారము నుండి వెలువలి వచ్చుట జరిగినది-45. (అది విష్ణువు) ఓ భగవన్ బ్రహ్మా! నీ మనస్సునకిట్టి వ్యాఘాతము (దెబ్బ) ఏ విధముగనైనను కొద్ది మాత్రముగూడ కలుగకుండుగాక- ఇది విష్ణువు (నేను) తన పనులు వికటించినపుడు వానిననుకూలము చేయుట కనుసరించు రీతి-46. నేనే పనిని జేయవలసియున్నదో! ఏపని నీయందు నిశ్చితమయియున్నదో! నిన్ను బాధింపకుండును గోరి, ఆ పనికై నా యిష్టముతోనే, ఒకమాటగా (విలాసముగా) వేగముగా నీవు వెలుపలికి రాదగియున్న ద్వారములను మూసివేసితిని-47. కావున నీవు వేరుగా అవమానింపబడినవానిగా దలంపదగదు.నీవు నాకు గౌరవింపదగినవాడవు. పూజింపదగినవాడవు. ఓ కల్యాణుడా! నేను నీకు జేసిన యపకారమునంతయు క్షమింపుము. కావున ఓ ప్రభో! నేనే జెప్పినట్లు పద్మము నుండి క్రిందికి దిగుము-48.

తేజోమయుడవై గురువైన (బరువైన) నిన్ను సహింపలేను. (అని విష్ణువనెను). ఆ బ్రహ్మగూడ వరమును జెప్పుము (ఇమ్ము) నేను పద్మము నుండి దిగెదను అని యనెను-49.

విష్ణువనెను:- ఓ శుత్రునాశకుడా! నాకు పుత్రుడవు గమ్ము శోభనమైన ముదమును (సంతసమును) బొందగలవు. నీవు సత్యధనుడవు మహాయోగివి. (అందరిచే) స్తుతింపదగిన వాడవు. ప్రణవస్వరూపుడవు-50. ఇవ్వేళటి నుండి ఓ సర్వేశ! తెల్లని తలపాగా అలంకారముగా గలవాడవు. పేరుతో పద్మయోనిపై ప్రసిద్ధుడవుగా గలవు. ఓ బ్రహ్మన్! సర్వలోకాధిపుడవైన ఓ ప్రభో! నాకు పుత్రుడవు కమ్ము-51. తరువాత ఆ భగవంతుడైన బ్రహ్మ కిరీటీ (విష్ణువు) నుండి వరమును దీసికొని సంతసించిన యాత్మగలవాడై యసూయలేని వాడై అట్లేయగుగాక’ యనియనెను-52. ఇంతలో సమీపమునకు వచ్చినదియు బాలసూర్యుని కాంతిగలదియు, అత్యద్భుతమైనదియు నైన భూతమును జూచి బ్రహ్మ నారాయణునితో ననేను-53.

పరిమితిలేనివాడు పెద్ద ముఖము గలవాడు కోరలుగలవాడు, విరిసిన తల వెంట్రుకలు కలవాడు, పదిబాహువులు గలవాడు, త్రిశూలము (గుర్తుగా) ధరించినవాడు, మూడు కన్నులతో నన్ని వైపుల ముఖములు గలవాడు-54. లోకమునకు ప్రభువు. సాక్షాత్తుగా వీకారమయినయాకారము గలవాడు, ముంజగడ్డితో జేసిన మొలనూలు గలవాడు. పైకి లేచిన పెద్ద పరుషాంగముచేత భయంకరముగ ధ్వనిజేయుచున్నవాడు-55. అయిన యీ పురుషుడెవడు? ఓ విష్ణో! ఈతడు తేజోరాశియై మహాకాంతి గలిగి, అన్ని దిక్కులను ఆకాశమును వ్యాపించి యిటువైపే వచ్చుచున్నాడు. అని బ్రహ్మ విష్ణువుతోననెను-56.

బ్రహ్మతోనిట్లు చెప్పబడిన భగవంతుడైన విష్ణువు బ్రహ్మతో నిట్లనెను. ఆతడు అనాదియై ప్రళయమును జేయు భగవంతుడైన యీశ్వరుడు సముద్రమున నడచుచున్న యాతని కాలియడుగుల తాకిడికి జలాశయములు వేగముతోనెగిరి పీడింపబడినవి. ఆ నీటి గుంపులచే విష్ణువుకంటే పద్మసంభవుడైన బ్రహ్మయొక్కువగా తడిసిపోవుచున్నాడు. ముక్కునుండి వచ్చినగాలిచే నీతో (బ్రహ్మతో) సహా స్వేచ్చగా నా నాభియందు బుట్టిన కమలము కదులుచు ఊగుచున్నది-57, 58. కావున భగవంతుడైన వృషభధ్వజుని (శివుని) నీవును నేనును స్తోత్రముచే ఉపాసించెదము-59.

ఆ తరువాత కమలకాంతిగల బ్రహ్మ కోపించినవాడై విష్ణువుతో నిట్లనెను. నీవు (నాకన్న) తక్కువైన నిన్ను లోకములకు ఉత్తమమైన యోనిగా కారణముగా) తెలియవు-60. అట్లే నన్ను లోకకర్తయై సనాతనుడైన బ్రహ్మనుగా గూడ దెలియవు. ఓయి! ఈ శంకరుడను వాడెవడు? మన యిరువునకు వ్యతిరేకముగనున్నాడు. (అనియనెను)-61. విష్ణువా బ్రహ్మయొక్క కోపంమువల్ల గలిగిన మాటను విని యిట్లనెను. వలదు ఓ కల్యాణుడా! మహాత్ముడైన శఙ్కరుని యొక్కయు ఏ వాదమును ఇట్లనుము-62. కారణమేమనగా ఈతడు మాయా యోగేశ్వరుడు. ధర్ముడు తిరస్కరింపనలవిగానివాడు, వరములనిచ్చువాడు ఈ జగమునకు కారణుడు. పురాణమైన పురుషుడు నాశములేనివాడు. జీవులకీతుడు జీవుడు ఒకే జ్యోతి రూపుడై ప్రకాశించును. దేవుడైన శఙ్కరుడు బాలురను ఆట బొమ్మలచేత స్వయముగా వాడుకొనుచుండును-63, 64. ఈతడు నాశనములేని ప్రధానము. వ్యక్తముగాని జ్యోతి. తమోరూపమైన ప్రకృతి నిత్యము సృజించుటయే ధర్మముగల యీతని నామము లవి. దుఃఖపీడితులైన యతులచేత శివుడు యః (ఎవడు?) కః (ఎవడు) సః (వాడు) అని పిలువబడును-65. ఈ శివుడు బీజవంతుడు. బ్రహ్మవైన నీవు బీజము (బీజమవు) నేను సనాతనమైన యోనిని. (బీజము నిక్షేపించుస్థానమును) అని యీ విధముగా జెప్పబడిన విశ్వాత్ముడైన బ్రహ్మ విష్ణువుతో నీ విధముగ మాటాడెను-66.

నీవు (విష్ణువు) యోనివి. నేను (బ్రహ్మను) బీజమును మహేశ్వరుడు బీజి (బీజముగలవాడు) ఎట్లు? ఈ సూక్ష్మమై యవ్యక్తమైన సంశయమును దీర్పగోరుచున్నాను (అని బ్రహ్మ విష్ణువు నడిగెను)-67. లోక తంత్రముగలవాడైన బ్రహ్మచే జరుగు ఉత్పత్తిని దెలిసి విష్ణువు బ్రహ్మయొక్క సాటిలేని పై ప్రశ్నకు సమాధానముగా జెప్పెను-68. ఓ బ్రహ్మన్! ఈ శివుని కంటే మించిన మరొక భూతములేదు. అది మహత్తునకు పరమమయినధామము, (స్థానము) శివము, ఆధ్యాత్మకులకు నెలవైనది-69. అతడు రెండు విధములుగాన తనలో ప్రవేశించియుండెను. అతడు నిష్కలుడు (రూపములేనివాడు) సూక్ష్ముడు అవ్యక్తుడు, సకలుడు (సమస్త స్వరూపుడు) అయిన మహేశ్వరుడు-70. మాయావిధిని దెలిసి యితరులకు చేరనలవిగాని గంభీరుడైన యీ మహేశ్వరునియొక్క లింము పూర్వము నీవు (బ్రహ్మవు) బీజముగా గలది ఆదిసృష్టి గలది-71. అది యోనియైన నా యందు (విష్ణువునందు) చక్కగా సంపూర్ణముగా కలిసినది. (బీజనిక్షేప చేయబడినది) కాలక్రమమున ఆ బీజము అంతులేని బంగారు (తేజో) మయమయి ఆ విష్ణు యోనిలో అండముగా నయ్యెను-72. వేయి యేండ్లు ఆ యండము నీటియందు నిలుపబడినది. వేయేండ్ల చివర వాయువుచే నాయండము రెండుగా జేయబడినది-73. దాని ఒక్కకపాలము (చిప్ప) ఆకాశమయ్యెను. మరొక కపాలము (చిప్ప) భూమియయ్యెను. దానియొక్క యెత్తైన ఉల్బముయొక్క భాగము ఈ బంగారు (మేరు) పర్వతము-74. తరువాత దాని నుండి మేలుకొన్న యాత్మగల దేవుడు, దేవవరుడు, ప్రభువు, భగవంతుడైన హిరణ్యగర్భుడు (బ్రహ్మవైన నీవు) నాలుగు భుజములు గలనేను (విష్ణువును) బుట్టితిమి. 75

తరువాత వేయి యేండ్లచివర వాయువుచేత ఆ యండము రెండుగా చేయబడినది. అపుడు తారలు చంద్రుడు నక్షత్రములు లేని లోకమును జూచి ఇక్కడ వీడెవడుండడవలెనని (శివుడు) ధ్యానింపగా ప్రియదర్శనులు (సుందరులు) మంచి శరీరములవారు. నీకంటే (బ్రహ్మకంటే) పూర్వమున బుట్టినవారునై గడచినవారునైన (యా) కుమారులు బుట్టిరి 76. మరల వేయేండ్ల చివర ఆయండము నుండియే నీ యాత్మజులు (పుత్రులు), నీటివలేను అగ్నివలెను శుద్దులు, కమలపు రేకులవంటి కన్నులు గలవారును-77. ఆయిన ఊర్థ్వరేతస్కులైన శ్రీమంతుడు సనత్కుమారుడు, ఋభువును, సనాతనుడు, సనకుడును సనందనుడు బుట్టిరి. వారు సమకాలముననే బుద్దిచేత ఇంద్రియములచే ప్రత్యక్షముగాని వానిని (పరమాత్మను) జూచువారైరి-78. అట్లు పుట్టినవారు ప్రతీఘాత్ములై యప్పుడే మాట్లాడిరి. ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మికములను తాపత్రయములను వదిలినవారై కర్మలను ప్రారంభింపరైరి-79.

ఈతని (శంకరుని) శాంతమైన జీవన మరణ పునర్జన్మలు బహుకష్టములగలపై జరా (ముసలితనము) దుఃఖములతోగూడినవి-80. పునఃసృష్టిలోనివి స్వప్న (ప్రాయములైనవి. అట్లే దుఃఖములును నరకములును (స్వప్న ప్రాయములైనవి.) ఇదియంతయు రాబోవునది. తప్పనిసరిగా జరుగబోవునది. అని సనకాదులు దెలిసికొనిరి-81. వారు ఋభువు సనత్కుమారుడును నీ (బ్రహ్మ) వశమున నుండినట్లు చూచిరి. ఆనీకుమారులైన సనకాదులు మువ్వురు త్రిగుణములను (సత్వరజస్తమో గుణములను) వదిలి వైవర్త జ్ఞానముతో (ఆత్మవైపు తిరిగి జ్ఞానముతో మహాతేజోవంతులై నివృత్తులైరి (తొలగిరి)-82. తరువాత ఆ మువ్వురు.సనకాదులు తొలగిపోగా శంకరుని మాయచే నీవు (బ్రహ్మవు) విమూఢుడవు (ఏమి తెలియని వాడవు) అగుదువు-83.

ఈ విధముగా కల్పము వికల్పముగాగా ఓ పాపరహితుడా! నీ పేరు నశించును. సూక్ష్మములు పార్థివము (భూసంబంధమైన) లైన కల్సశేషములు గతించినవి-84. జగమునకు సంబంధించినట్టి యా ఐశ్వరీ (ఈశ్వరసంబంధమైన) మాయ చెప్పబడినది. ఈ కనబడు ఆ పర్వతమే దేవలోకమున మేరువని చెప్పబడినది-85. నీ మహాత్మ్యమును జూచి, తనతో తనను దెలిసికొని ఈశ్వరుని యునికిని దెలిసికొని, కమలనేత్రుడినైన (విష్ణువు) నన్ను దెలిసికొని-86, మహాయోగీ, భూతములకు (ప్రాణులకు) వరమునిచ్చువాడు. ప్రభువు, ప్రణవ (ఓంకార) స్వరూపుడునైన మహాదేవునిజేరి, జగద్గురువైన యాతనికి నమస్కరించి కోపించినచో నీతడు (మహాదేవుడు) ఒక్క నిట్టూర్పుతోనే నిన్ను (బ్రహ్మను) నన్ను (విష్ణువు) దహించును-87. అని తెలిసికొని మహాయోగమున యెత్తుగా నిలుచునుచు. మహాబలుడవై నేను (విష్ణువును) నిన్ను (బ్రహ్మను). ముందడుకొని అగ్నీతేజస్కుడైన శంకరుని స్తుతింతును-88.

సూతుడు పలికెను:- తరువాత ఆ గరుడుడు ధ్వజముగాగల విష్ణువు బ్రహ్మను ముందడుకొని, గడచినవి, రానున్నవి ప్రస్తుతమున్నవియు నైన ఛాందసములగు వైదికములు ఛందోబంధములు నామములతో స్తోత్రమున స్తుతించెను. 88

భగవంతుడవైన నీకు నమస్కారము సువ్రతుడవైన నీకు నమస్కారము. అనన్త తేజస్కుడవైన నీకు నమస్కారము. క్షేత్రాధిపతి (ధీరాధిపతి)వైన నీకు నమస్కారము. బీజవంతునకు శూలికి నీకు నమస్కారము-90. సాటిలేని మేడ్రము (పురుషాంగము) గలవానికి, మహోన్నతమైన పురుషాంగము గలవానికి, వైకుంఠమురేతస్సుగా గలవానికి నీకు నమస్కారము. జ్యేష్ఠునకు శ్రేష్ఠునకు మొదలులేని మొదటిదానికి నమస్కారము-91. హవ్య (హోమము చేయదగిన) రూపమమైన వానికి, పూజ్యునకు సద్యోజాతునకు నీకో నమస్కారము. గుహారూపునకు కుబేర రూపునకు బంగారు వస్త్రములను ధరించినవానికి నీకు నమస్కారము-92. మాబోటి ప్రాణులను బుట్టించువానీకి, వేదములు చెప్పిన పరిశుద్ద కర్మలకును ద్రవ్యములకును పుట్టుస్థానమైనవానికి నీకు నమస్కారము-93. యోగ ప్రభువునకు సాంఖ్య ప్రభువునకు నీకు నమస్కారము. ధ్రువ నీశీధులకు ఋషులకు పతియైనవానికి నీకు నమస్కారము-94. మెరుపులు పిడుగులు మేఘములు గర్జములు వీనికి ప్రభువైనవానికి నీకు నమస్కారము. సముద్ర ప్రభువునకు ద్వీపముల ప్రభువునకు నీకు నమస్కారము-95. పర్వత ప్రభువు నీకు వర్ష ప్రభువునకు నీకు నమస్కారము. నదముల ప్రభువునకు నదుల ప్రభువునకు నీకు నమస్కారము-96. ఓషధి ప్రభువునకు వృక్షప్రభువునకు నీకు నమస్కారము. ధర్మాధ్యక్షునకు ధర్మ స్వరూపునకు నీకు స్థితుల ప్రభువునకు నీకో నమస్కారము-97. రసముల ప్రభువుకు రత్నముల ప్రభువునకు నీకు నమస్కారము క్షణముల ప్రభువునకు క్షణము 16000 కనురెప్పపాటు కాలము) నీకు నమస్కారము-98. కనురెప్పలపాటు కాలమైన నిమేషమునకు ప్రభువైనవానికి కాష్ఠలకు ప్రభువైన వానికి (కాష్ఠ = 18 కనురెప్పపాటు) నీకు నమస్కారము. రాత్రింబగళ్ళకు సగము నెలలకు నెలలకును ప్రభువైన నీకు నమస్కారము-99. ఋతువుల ప్రభువునకు సంఖ్య యొక్క ప్రభువునకు నమస్కారము. బ్రహ్మయాయువులో సగము పదార్థము అట్టి పరార్థకాలమునకు ప్రభువైన నీకు నమస్కారము. బ్రహ్మయాయువు పరము. అట్టి పరమునకు ప్రభువైన నీకు నమస్కారము-100. ప్రాచీనముల ప్రభువునకు, యుగముల ప్రభువునకు నీకు నమస్కారము తొలుగు విధములై సృష్టికి ప్రభువైన నీకు నమస్కారము. అనన్తములైననేత్రములు గల నీకు నమస్కారము-101. కల్పప్రారంభమున నేర్పరచిన వృత్తులకు ప్రభువైన నీకు నమస్కారము. విశ్వప్రభువునకు నీకు నమస్కారము-102. విద్య ప్రభువునకు నీకు నమస్కారము 103. పితృదేవతల పతికి, పశుపతికి నీకు నమస్కారము. వాక్ శ్రేష్ఠరూపునకు నీకు నమస్కారము. పురాతనమైన బీజములు వర్ణించువానికి నీకు నమస్కారము సర్వ బీజములను, వర్షించు పురాణ వృషభ స్వరూపుడని భావము)-104. మిక్కిలి సుందరమైన వెంట్రుకలు గలవానికి ఊర్థ్యముగా నేత్రములు శిరమును గలవానికి నీకు నమస్కారము. పశువుల పతికి గోవు వృషభ శ్రేష్ఠము ధ్వజముగా గలవానికి నీకు నమస్కారము-105. ప్రజాపతుల బ్రహ్మలకు) పతికి, సిద్దుల పతికి నీకు నమస్కారము. గరుడులకు ఉరగములకు సర్పములకు పక్షులకును పతియైన నీకు నమస్కారము-106. గోకర్ణస్వరూపునకు, గోవునందుండువానికి శంకుకర్ణునకు నీకు నమస్కారము. వరాహావతార రూపునకు జ్ఞానాతీతునకు రక్షస్సుల యధిపతికి నీకు నమస్కారము-107. అప్సరసల పతికి గణముల పతికి జలములకు తేజస్సులకు పతికి నీకు నమస్కారము-108. లక్ష్మీపతికి శ్రీమంతునకు ప్రీమంతునకు నీకు నమస్కారము. బలాబల స్వరూపునకు అక్షోభ్యుల క్షోభింపజేయువానికి నీకు నమస్కారము-109. పొడవైన ఒకే కొమ్ము గలిగి మంచి యెత్తైన మూపురముగల వృష స్వరూపుడవైన నీకు నమస్కారము ఛైర్యముగలిగి తేజోవంతమైన మంచి కాంతిగల శరీరము గల నీకు నమస్కారము-110. భూతభవిష్యద్వర్తమాన స్వరూపునకు నీకు నమస్కారము. మంచి వర్చస్సు లిగి అందరి నతిక్రమించి వీరశూరతలు గలవానికి నీకు నమస్కారము-111. వరమునిచ్చువానికి, వరింపదగిన వానికి సర్వమునందున్న వానికి నీకు నమస్కారము. భూతభవిష్యత్కాల స్వరూపునకు మహాదేవుడై భవుడవైన నీకు నమస్కారము-112. జనస్వరూపునకు తపస్స్వరూపునకు వరదునకు నీకు నమస్కారము నమస్కరింపదగిన వానికి మోక్షస్వరూపునకు జనరూపునకు నరకరూపునకు నీకు నమస్కారము-113. భవునకు అందరిచే సేవింపబడువానికి యజ్ఞ స్వరూపునకు యజ్ఞము చేయించు పురోహిత స్వరూపునకు మహోదార స్వరూపునకు, మిక్కిలి ప్రకాశించిన ప్రకాశ స్వరూపునకు (పరమాత్మ స్వరూపునకు) నిర్గుణ స్వరూపునకు-114. పాశహస్తునకు తనకు తానే యాభరణ (అలంకార) మైన వానికి హోమము చేయబడిన ద్రవ్యరూపునకు అపహుతునకు హోమము చేయబడని ద్రవ్య స్వరూపునకు) ప్రహుత ప్రశి(సి)తునకు (అధికముగా హోమము చేయబడిన హోమద్రవ్యమునందు అత్యంతాసక్తి గల నీకు నమస్కారము 115. ఇష్టస్వరూపునకు (యజ్ఞ స్వరూపునకు ప్రియ స్వరూపునకు) హోమదానాదిక్రియ అంతర్వేదిలో దానమీయబడినది ఇష్టము తత్స్వరూపునకు), మూర్తిమత్స్వరూపునకు (చెరువుల దేవాలయములు మొదలగువాని నిర్మాణముల స్వరూపునకు ఋతస్వరూపునకు సత్యస్వరూపునకు భూతాధిపతియైన నీకు. నమస్కారము-116. సదస్య (యజ్ఞ సభలోని సభ్యుల) స్వరూపునకు దక్షిణావబృథ స్వరూపునకు లోకుల యహింసా స్వరూపునకు పశుమన్త ఔషధి స్వరూపునకు నీకు నమస్కారము 117. తుష్టినిచ్చువానికి త్ర్యంబకునకు (మూడు కన్నుల వానికి) మంచి గంధముగలవానికి ఇంద్రియములయధిపతికిని అన్ని దోషములకు పరిహారమైన వానికి (పూల) మాలలు ధరించిన వానికిని నీకు నమస్కారము-118. విశ్వుడును, విశ్వరూపుడును. అంతటను నేత్రములు ముఖములు లవాడును అంతటను చేతులు కాళ్ళుగలవాడును రుద్రుడును ప్రమితుడును (నిజముగా నెరుగబడినవాడు) అగు నీకు నమస్కారము-119. హవ్య (దేవయోగ్యమయిన అన్నము) స్వరూపునకు, కవ్య (పితరులకు యోగ్యమయిన యన్నము) స్వరూపునకు హవ్యకవ్య స్వరూపునకు నీకు నమస్కారము. సిద్ద స్వరూపునకు పవిత్రాత్మునకు, చేష్టా స్వరూపునకు నాశములేనివానికి నీకు నమస్కారము-120. చక్కని వీరునకు, చక్కని భయంకరునకు క్షోభింపనలవిగాని వారిని గూడ క్షోభింపచేయువానికి చక్కని మేధావంతునకు చక్కని సంతానముగలవానికి, ఉజ్జ్వల ప్రకాశవంతునకు, సూర్యస్వరూపునకు నీకు నమస్కారము-121. చక్కని రెక్కలు గల గరుడస్వరూపునకు, బంగారు కాంతిగల వానికి నీకు మరల మరల నమస్కారము విరూపమయిన కన్నులు గలవానికి మూడు కన్నులు గలవానికి, పింగళస్వరూపునకు (సూర్య స్వరూపునకు) మహాతేజస్వికి నీకు నమస్కారము-122. దృష్టిని (కుదృష్టిని) పోగొట్టువానికి, శాంతమైన చూపులు గలవానికి, పొగవర్ణము గలవానికి, తెల్లనైనవానికి, నల్లనైన వానికీ ఎఱ్ఱనైనవానికి నీకు నమస్కారము-123. మాంస స్వరూపునకు, కోతివర్ణము గలవానికి, పచ్చనైనవానికి, అమ్ములపొది గలవానికి, విశేష స్వరూపములు గలవానికి, ఏ విశేషములు లేనివానికి నీకు నమస్కారము-124. పద్మమువంటి వర్ణముగలవానికి, మృత్యువును (యముని) జంపినవానికి మృత్యుస్వరూపునకు, శ్యామునకు (నల్లనివానికి) గౌరునకు (తెల్లనివానికి) కద్రు (గోరోచన) వర్ణము గలవానికి, ఎఱుపువానికి నీకు నమస్కారము-125. కాస్తునకు (మనోహరునకు) సంధ్యాకాల మేఘము వంటి వర్ణము గలవానికి, బహురూపములు గలవానికి, పుఱ్ఱెచేతియందు గలవానికి దిక్కులే వస్త్రములుగాగల దిగంబరుడైన వానికి, జటాజూటముగలవానికి నీకు నమస్కారము-126. జ్ఞానాతీతునకు శర్వునకు, వధింపనలవిగాని వానికి, వరు (శ్రేష్టు)నకు, ముందును, వెనుకను స్వరూపములను ధరించినవానికి, అగ్ని స్వరూపనకు నీకు నమస్కారము-127. చేరనలవిగాని వానికి, మహత్స్వరూపునకు, అడ్డినవానికి, కపిల వర్ణము గలవానికి, సూర్యకాంతి వంటి శరీరము గలవానికి బలవంతునకు, వేగవంతునకు నీకు నమస్కారము-128. పినాకమనుధనువు ధరించిన వానికి, ప్రసిద్దునకు స్పీతు (విశాలు)నకు, ప్రసరించినవానికి, చక్కని మేధాస్వరూపునకు, దిక్కులే వస్త్రములు గలవానికి శిఖగల వానికి నీకు నమస్కారము-129. చిత్ర స్వరూపునకు చిత్రమైన వర్ణములు గలవానికి, విచిత్రునకు సర్వము ధరించువానికి, చేకితానునకు, తుష్టునకు, అనిహితునకు (ఎక్కడను ఉంచబడని వానికి) నీకు నమస్కారము-130. క్షానునకు (క్షమగలవానికి) శాన్తునకు (శరణుగలవానికి), వజ్రము వంటి శరీరము గలవానికి రాక్షసుల జంపువానికి, దక్షయజ్ఞమును ధ్వంసము జేసినవానికి, నల్లని కంఠమును ఊర్థ్వరేతస్సును గలవానికి నీకు నమస్కారము-131. శుత్రవుల సంహరించువానికి యమస్వరూపునకు తీక్ష్మమైన యాయుధముల ధరించినవానికి, మోదము (సంతోషము)తో గూడిన వానికి, అతిసంతోష స్వరూపునకు, శూన్యస్వరూపునకు నీకు నమస్కారము-132. ఓంకార స్వరూపునకు ఓంకారాధీశ్వరుడవు భక్తులకు సుఖమునిచ్చువాడవు, మృగమును వేటాడు వాడవు సమర్థుడవు. దక్షయజ్ఞ ధ్వంసముజేసినవాడవునైన నీకు నమస్కారము-133. సర్వమైనవాడవు. త్రిపురముల ఛేదించినవాడవు, శాస్త్రుడవు, సుగంధుడవు వరులకు గూడ ప్రభువైనవాడవునైన నీకు నమస్కారము-134. పుష్పవన స్వరూపుడవు (సూర్య చంద్ర స్వరూపుడవు), భగనేత్రాన్తకుడవు (ఇంద్రాంతకుడవు) కణాదస్వరూపుడవు, వరిష్టుడవు. కొముని శరీరముగాల్చిన వాడవునైన నీకు నమస్కారము-135. సూర్యుని భయంకర చక్ర స్వరూపుడవు. నాగరాజు నణచిన వాడవు దైత్యులకంతకుడవు, దివ్యులకు రోదనము గలుగజేయువాడవునైన నీకు నమస్కారము-136. శ్మశాన ప్రియుడవై నిత్యడవైన నీకు నమస్కారము. మూడు నేత్రములు ధరించువాడవు, ప్రాణములను పాలించువాడవు, కదలుచున్నమాలలను ధరించువాడవునైన నీకు నమస్కారము-137. శోకము వీడిన యనేక ప్రాణులచే బాగుగా స్తుతింపబడినవాడవు. నరనారీ శరీరము (అర్థనారీశ్వర శరీరము) గలవాడవు. పార్వతీదేవికి ప్రియమును జేయువాడవునైన నీకు నమస్కారము-138. జటాధారివి దండధారివి సర్ప యజ్ఞోపవీతముగల వాడువైన నీకు నమస్కారము. నృత్య స్వభావముగలవాడవు. వాద్యములు నృత్యములు ఇష్టమైనవాడవునైన నీకు నమస్కారము-139. మను (కోప) స్వరూపుడవు, చల్లని శీలము లవాడవు, చక్కనీ గీతులను గొనముజేయువాడవు. కంకణములు చేతులలో నలంకరించుకొన్నవాడవు. భయంకరుడవు. భయంకరరూపమును ధరించినవాడవునైన నీకు నమస్కారము-140. విభీషణుడవు (మిక్కిలి భయంకరుడవు, భయంకరుడవు, సూర్యుని (దక్షయజ్ఞములో) మథించినవాడవు. సిద్ద సమూహములచే గానము జేయబడినవాడవు మహాభాగుడవు (మహాభాగ్యవంతుడవు నైన నీకు నమస్కారము-141. పెద్ద నవ్వుగలవానికి, సింహనాదము చటుచుట లేక చీల్చుటయు గలవానికి, ధ్వనిచేయుచున్నవానికి, దుముకుచున్న వానికి మిక్కిలి సంతసించిన వానికిని నీకు నమస్కారము-142. అద్భుత రూపునకు, నిద్రించువానికీ, పరిగెత్తువానికి, పీడించుచున్నవానికి, (పరిగెత్తుచున్నద్రవీభావము జెందుచున్నవానికి, నీకు నమస్కారము-143. కదులుచున్నవానికి, ఆడుచున్నవానికి, లావైన కడుపు శరీరము గల వానికి నీకు నమస్కారము కృతస్వరూపుడు వికార రూపములైన చేతులుగల వానికి, నీకు నమస్కారము-144. పిచ్చివేషముగలవానికి చిరుగజ్జెలు గలవానికి, వికృత వేషము గలవానికి క్రూరునకు నీకు నమస్కారము-145. జ్ఞానాతీతునకు ఉజ్జ్వల ప్రభావంతునకు, ప్రభాస్వరూపునకు, నిర్గుణునకు, ప్రియునకు నాదస్వరూపునకు ముద్రలను మణులను ధరించిన వానికి నీకు నమస్కారము-146. అపత్య (సంతాన) స్వరూపునకు సూక్ష్మ శరీరికి, గుణములచే సాటిలేనివానికి, గుణ స్వరూపునకు, యక్ష (రహస్య రూపునకు, తెలియనలవిగాని దానిని గూడ దెలిసికొను వానికి నీకు నమస్కారము-147.

లోకమును ధరించునది (నీకు) భూమి నీ పాదములు సజ్జనులచే సేవింపబడినవి. నీయుదరము సమస్త సిద్ధయోగముల కధిష్టానము-148. నీ నడుము తారాగణములతో నలంకరింపబడినదై విశాలమైన యంతరిక్షము (ఆకాశము) నీ వక్ష స్థలమున తారాపథము (పాలవెల్ల చుక్కల మార్గము)వలే హారము ప్రకాశించుచున్నది-149. నీ పదిభుజములు కేయూరములతో (భుజకీర్తులతో) అంగదములతో (మరికొన్ని భూజాలంకారములతో) నలంకరింపబడిన పదిదిక్కులు. నీ కంఠము వెడల్పై వైశాల్యము గలదై నల్లని మేఘసమూహము వంటిదై-150. శ్రీమంతమై (విషముగలదై) బంగారు సూత్రములతో నలంకరింపబడినదై ప్రకాశించుచున్నది. కోరలచే భయంకమైన దుర్భరమై తిరస్కరింపనలవి కానిదై సాటిలేనిది నీ ముఖము 151. కమలమాలలతో తలపాగాగా చుట్టబడిన నీ శిరస్త్రాణము (లేదా నీ విరబోసిన తల వెంట్రుకలు) ఎంత చక్కగా ప్రకాశించుచున్నది. నీ యుజ్జ్వలకాంతి సూర్యుని యుందున్నది. నీ శరీరము (కాంతి) చంద్రునియందున్నది. నీ ఛైర్యమున భూమియున్నది. నీ బలమున వాయువున్నది-152. నీ తీక్షత అగ్నిలోనున్నది. నీ కాంతి చంద్రునియుందున్నది. నీశబ్దమాకాశమునందున్నది. నీ చల్లదనము నీటిలోనున్నది. పండితులు ఈ నీగుణములను అక్షరములై (నాశరహితములై) ఉత్తమములై (అత్యున్నతములై) నిష్పదములై ఏ మాత్రము కదలికలేనివైనవిగా స్థిరమైనవిగా దెలియుదురు-153.

జపస్వరూపుడు, జపింపదగినవాడు, మహాయోగి, మహాదేవుడు, మహేశ్వరుడు పరమునందు శమించువాడు గుహలో (బుద్దిలో) నుండువాడు ఆకాశమున చరించువాడు. రాత్రియందు చరించువాడు-154. తపోనిధీ కుమారస్వామి నందనుడు (ఆనందింపజేయువాడు) గుఱ్ఱపుతల గలవాడు (ఐశ్వర్యమును వాహనముగా జేసికోన్న వాడు)-155. తెలియదగినవాడు. తెలియజేయువాడు. నేత (పరమపదమును జేర్చువాడు) ధూళిని వహించువాడు. దుష్టులను కంపింపజేయువాడు. బృహద్రథుడు (గొప్ప రథము, బృహత్సామము రథముగా గలవాడు) భయంకరమైన కర్మగలవాడు. విశాలమైన కీర్తి గలవాడు. ధనంజయుడు (అగ్ని స్వరూపుడు సర్వవ్యాపియైన ధనంజయ వాయుస్వరూపుడు)-156. ఘంటా ప్రియుడు, ధ్వజముగలవాడు ఛత్రము గలవాడు. జండాగల సేనకు పతియైనవాడు. కవచము గలవాడు పట్టీ (ఆయుధశ విశేషము గలవాడు. శంకముగలవాడు. పాశము హస్తమందుగలవాడు. పరశ్వమను ఆయుధము గలవాడు-157. పొందనలవిగానివాడు. పాపరహితుడు, శూరుడు ఇంద్రశత్రువులైన రాక్షసులను జంపువాడు. నిన్ను ప్రసన్నుని జేసికొని పూర్వము మాచేత యుద్ధమున శత్రువులు చంపబడిరి-158. నీ వగ్నివి సముద్రడవు అందరిని త్రాగుచు గూడ తృప్తి చెందవు. నీవు కోపమున కిల్లును. ప్రసన్నమైన యాత్మగల వాడువు. కాముని జంపినవాడవు. కోరికల నిచ్చువాడవు. ప్రియుడవు-159. బ్రహ్మణ్యుడవు. వైదిక కర్మలకు సాధువయినవాడవు. బ్రహ్మచారీవీ. గోఘ్నుడవు (ఇంద్రియములను జంపువాడవు) నీవు శిష్టులచే (వేదము చెప్పి నడుచుకొనువారిచే) పూజింపబడినవాడవు. వేదములకు తరగని కోశము (నిధి) ఐనవాడవు. నీ చేతనే యజ్ఞము కల్పింపబడినది 160 వేదమును వేదోక్తమయిన హవ్యమును హవ్యవాహనుడైనచో మేమందరము ప్రీతులమగుదుము-161. నీవు భవానీశుడవు. పుట్టువు లేని యశుడవు. లోకములకు నెలవైన రాశిపై కర్తవైన బ్రహ్మవు. నీవు ఆది సృష్టి స్వరూపుడవు. సాంఖ్యుడు నిన్ను ప్రకృతులకంటే పరమునిగా దెలిసికొని క్షీణించిన ధ్యానముగలవాడై మృత్యువులో బ్రవేశింపరు-162. ధ్యానయోగులు తమ ధ్యానముచే నీతో నిత్యము గూడినవారై నిన్ను దెలిసికొని యా భోగములనైతే పూర్తిగా వదలివేయుదురు. ఇక తదితరులైన మానవులు నిన్ను శరణుబొంది పరిశుద్ధులై కర్మలచే దివ్యభోగములను అనుభవించుచుందురు-163. జ్ఞానాతీతమైన పరమాత్మవైన నీ తత్త్యము యొక్క అపామైన మాహాత్మ్యమును మా శక్తికొలది తెలిసికొన్నంతవరకు మేము కీర్తించితిమి. నీవు ఎవడవైన వాడి నగదువుగాక (నీవు ఎవడవైనను అగుదువు గాక) అట్టి నీకు నమస్కారము. మాకు మాత్రమంతటను శివుడవగుమని వేడుచున్నాము.

ఇది శ్రీ వాయుమహాపురాణమున శార్వస్తవమను నిరువది నాల్గవ యధ్యాయము