వాయు మహా పురాణము

Table of Contents

18 - యతిప్రాయశ్చిత్తవిధిర్నామ

వాయురువాచ:-

ఆ పైన యతుల యొక్క నిజముగా అకామకృతములైన వానికి (తెలియక చేసిన పాపకర్మలకు) ప్రాయశ్చిత్తములను నిశ్చయముగా జెప్పనున్నాను. ధర్మసూక్ష్మమును దెలిసిన వారు కామకృతములకు (కావలెనని తెలిసి చేసిన పాపములకు)ను ప్రాయశ్చిత్తములున్నవనియందురు-1, పాపము మూడు విధములు మాటతో లిగినది, మనస్సుతో కలిగినది, శరీరముతో గలిగినది. ఈ త్రివిధపాపముచే రాత్రింబవళ్లు ఈజగము బాధింపబడుచున్నది-2. కర్మలు ఉండవు, కర్మలజేయువాడు గూడ ఉండడు- అని శ్రేష్ఠమైన వేదములో చెప్పినది. ఆయుష్యము స్థిరముగా నిలువనిది గావున ప్రాయశ్చిత్తము క్షణకాలమే ప్రయోగింపదగినది-3. ధీరుడైయుండవలె. అప్రమత్తుడైయుండవలె. యోగమేయుత్కృష్టమైన బలము. నరులకు యోగముకన్న వేరైన బలమేదియు లేదు. కావున ధర్మయుక్తులైన విద్వాంసులు యోగమును ప్రశంసింతురు-4.

విద్యచే అవిద్యను దాటి, ఉత్తమోత్తమమైన యైశ్వర్యమును బొంది, పరాపరమును (పరమును అపరమును) చూచి ధీరులు ఆపరమపదము నొందుదురు-5.

భిక్షువులకు కొన్ని వ్రతములు ఉపవ్రతములు విధింపబడినవి. వానిలో నొక్కొక్కటీ పాటింపబడనప్పుడు వానికి ప్రాయశ్చిత్తము విధింపబడును-6. కామముతో స్త్రీని పొందినప్పుడు ప్రాయశ్చిత్తమును చెప్పవలెను. అతడు ప్రాణాయామముతోబాటు సాంతపన వ్రతమును (మూడు దినములు పగళ్లును, మూడు దినములు రాత్రులును భుజించి, మూడుదినములు ఆయాచిత పదార్థములను భుజించి, పిమ్మట మూడు దినములు నిట్రుపాసముండెడు వ్రతము. కొందరిమతమున పంచ గవ్యమును కుశోదకమును బుచ్చుకొని యొకరాత్రియు ఏవాసముండువ్రతమును) చేయవలెను-7. రువాత పై చెప్పిన సాంతపనవ్రతము చివర సమాహితుడై (సమాధియుందున్నవాడై) చెప్పినదానిని చేవలెను. తరువాత ఆశ్రమమునకు మరలవచ్చి సోమరితనము వీడి భిక్షువు చరింపవలెను. కిటుకులు గల మాటలు హింసింపవని పండితులందురు-8. ఐనను ఈ ప్రసంగము మిక్కిలి దారుణము, చేయరాదు. అహోరాత్రములు (ఒకదినము ఒక రాత్రి) మీంచిన యధర్మములేదు. అని శ్రుతి చెప్పినది. (చేసిన యధర్మము ఒక రాత్రింబవళ్లుతో కూడిన దినమునకు మించియుండదని శ్రుతి చెప్పినది-9.

ఈ హింస దేవతలచేతను మునులచేతను సృష్టింపబడి పెద్దదైనది. ఈ డబ్బనునది బహిరమున చరించు ప్రాణములు (పంచప్రాణములు)-10. ఈ విధముగాననుకొనివాడు దుష్టాత్ముడు, భిన్నమైన నడవడి గలవాడై వ్రతమునుండి భ్రష్టుడగును. వాడు మరల దుఃఖమును బొంది చాంద్రాయణ వ్రతమును జేయవలెను-11. శాస్త్రము చెప్పిన తీరుగా చాంద్రాయణ వ్రతమును సంవత్సరము జేయవలెనని శ్రుతి యనుచున్నది. తరువాత సంవత్సరాన్తమున మరల క్షీణించిన పాపముగలవాడై మరల వైరాగ్యము జెందినవాడై సోమరితనము లేక భిక్షువు తన ధర్మమును చరింపవలెను-12.

బిక్షువు మనస్సుతో, మాటతో, శరీరముతోను సర్వప్రాణుల యెడ అహింసను పాటించవలె. కావలెనని కాక, ఆబుద్ది పూర్వకముగనైనను, భిక్షువు పశువులను మృగములను హింసించినచో కృచ్చాతికృచ్చవ్రతమునుగాని, చాంద్రాయణ వ్రతమునుగాని ప్రాయశ్చిత్తముగా జేయవలెను-13. యతి స్త్రీని చూచి యింద్రీయ దౌర్బల్యమున వీర్యస్థలనముగావించెనేని. పదహారు ప్రాణాయామములు ప్రాయశ్చిత్తముగా జేయవలెను-14. పగలు వీర్యస్థలనముగావించిన బ్రాహ్మణునకు (యతికి) మూడు రాత్రులుపవాసమును, నూరు ప్రాణాయామములును ప్రాయశ్చిత్తముగావిధింపబడినవి-15. రాత్రియందు వీర్యస్థలనముగావించినవాడు స్నొనముజేసి శుచియై పన్నెండు ధారణలు (యోగముచే మనస్సు నాత్మయందు నిలుపుటలు) ప్రాయశ్చిత్తముగాజేయవలె. బ్రాహ్మణుడైన యతి ప్రాణాయామముతో శుద్ధాత్ముడును రజోగుణములేని శుద్ధసాత్త్యికుడగును-16. యతులు ఏకాన్నమును (కేవలాన్నమును) మధువును (మద్యమును), మాంసమును, ఆమశ్రాద్ధమునందలి భోజనమును, ప్రత్యేకముగానున్న లవణములను తినరాదు-17. నిషేధమునుదాటి ఒక్కొక్కదానిని భుజించినపుడు ప్రాయశ్చిత్తము విధింపబడినది. ప్రాజాపత్యవ్రతముచేతను కృచ్చవ్రతముచేతను ఆ పాపమునుండి విముక్తుడగును-18. నియమమునతిక్రమించి వాక్కు-మనస్సు- శరీరములతో చేసిన పాపములకు సజ్జనులైన విద్వాంసులతో గూడిన వారు నిర్ణయించి చెప్పిన ప్రాయశ్చిత్తమును జేసికొనవలెను-19. విశుద్ధబుద్దియై, మట్టి, బంగారములను సమముగా జూచువాడై, సర్వభూతములందు చరించు సమాధియందుండువాడు, శాశ్వతము, నాశములేని స్థిరమైన పరమైన స్థానమును బొంది పునర్జన్మరహితుడగును-20.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున యతిప్రాయశ్చిత్త విధియను పదునెనిమిదవ యధ్యాయము.