వాయు మహా పురాణము
6 - కశ్యపీయ ప్రజాసర్గః
ఋషులనిరి :
ఆ సూతుని యీ మాటలను విని నైమిషారణ్యవాసులైన మునులు యథాక్రమ వచనమునకు శ్రేష్ఠుడైన సూతునడిగిరి లోకమున ఏడు మన్వంతరములలో ఇంద్ర - విష్ణు ప్రధానులైన మహౌజస్వులైన ఆదిత్యులు (అదితి పుత్రులు) ఎట్లు పు రోమహర్షణ! సూత! ఇదియంతయు మాకు విస్తరముగా జెప్పుము (2). బ్రహ్మవాదులైన మహరులతో నిట్లడుగబడిన వినయ. ప్రవక్తలలో శ్రేష్ఠుడును ఐన సూతుడప్పుడు ఇట్లనెను (3).
సూతుడనెను :
సంతానేచ్ఛతో బ్రహ్మముఖము నుండి సృష్టింపబడిన యా దేవతలు అందరును మన్వంతరములలో నీ లోకమున మంత్రశరీరులు - (మంత్రము శరీరముగా గలవారు) అనబడిరి (4), దర్శుడు, పౌర్ణమాసుడు, బృహత్తైన, రథంతరము, వారిలో ప్రథముడైన ఆకూతుడు, తరువాత అకూతీయు, తరువాత అధీష్టుడును, తరువాత విత్తి, సువిత్తి, అధీతియు, విజ్ఞాతియు, విజ్ఞాతుడును, మానవుడును వీరు పండ్రెండుగురు (5, 6). ఇట్లు ద్వాదశ పుత్రులు గలవాడని పన్నెండు మాసములు గల సంవత్సరముతో సమానుడనియు తెలియవలెను. ఆతనిని చూచి బ్రహ్మ - ‘జయ’ దేవతలను గనెనని యనెను (7) దారాగ్ని హోత్ర (గార్హస్థ్యాగ్ని) సంయోగమున మిథ్యను (మిథునభావమును) మొదలిడుడనెను. ఈ విధముగా బలికి బ్రహ్మ యచటనే యంతర్థానమందెను (8).
తరువాత వారు (ఋషులు) బ్రహ్మ యొక్క యా మాటనభినందించలేదు. వాక్కు - మనస్సు - కర్మలు - వీనివల్ల నీలోకములో బుట్టిన కర్మలు సత్యస్వరూపునకు సంబంధించినవే. ఎవరైతే దోషమును జూచి కర్మలందు నిలచియుందురో! వారు కర్మల ఫలమును క్షయాతిశయయుక్తముగా జూచీ (10), సంతానమునేవగించుచు అలసతలేనివారును, మమకారము లేనివారునునైరీ. మాటికి కోరికలను గోరుచున్నవారై (అందులో) దోసము జూచి విరక్తులై అర్థమును, ధర్మమును, కామమును వదిలి చక్కగా న పౌరుషమైన (విష్ణుసంబంధమైన) జ్ఞానమును బొంది తేజమును సంక్షేపించి కూడ నుండిరి (11, 12), వారియొక్క యా యభిప్రాయ దెలిసి బ్రహ్మకోపించెనట. అపుడు నిరుత్సాహులగు ఆ సురల నోట్లనెను (13). ప్రజ కొఱకే మీరుద్దేశింపబడితిరి. నేను ప్రజను స వానిని. వేరుకాదు. “నేను పూర్వము సంతానమును గనుడు, జయింపుడు” - అని చెప్పియే యుంటిని (14). ఏ కారణవ మాటను తిరస్కరించి వైరాగ్యము నొందితిరో! ఆ కారణమున మీ స్వ జన్మను ఏవగించువారై సంతతిని అభినందింపకుందు. (15). అమరణమును గోరి కర్మల యొక్క సంన్యాసము గూడ జేయబడినది. కావున మీరు ఏడు మారులు అనాదరించి త (సంతతిని) బొందుదురు (16). బ్రహ్మచేత శపింపబడి యా జయులు ఆ బ్రహ్మను శాంతింపజేసిరి. ఓ ప్రభో ఓదేవ! ఓ మ అజ్ఞానము వలన జేసిన మా పనిని క్షమింపుము (17) అని నమస్కరించి సానునయముగా బలికిరి. బ్రహ్మ వారితో మరల్చనిట్లనే లోకమున నాచే ననుమతింపబడని పోడెవడు స్వాతంత్ర్యమునకరుడగును ? నాచేతనంతయు తెలీయబడినది. శుభము అశుభమును గాని, నా యిష్టము లేక భూతములు ఎట్లు తెలియగలవు? పొందగలవు ? (19) లోకమున సత్త్వము అసత్త్వము వ్యవస్థితమైనదంతయు బుద్ధాత్ముడనైన నౌచే వ్యాపింపబడినది. లోకమున నన్నెవ్వడును వంచింపలేడు (20). భూక తర్కించినదియు ధరించినదియు, విచారించినదియు అంతయును నాకు దెలియును (21). నాచేత సుస్థితమైన యీ స్థావర జంగమా జగమునంతయు ఆశామయమైన తత్త్వముతో నిటనేట్లు చేదింపనుత్సహింతును (22). నేను సృష్టి కొఱకై వివృత్తుడనైతిని (అవతార. మార్పు జెందితిని) వేరుకాదు కావుననే లోకమున ఎవడు కర్మలనారంభింపక నౌ యిష్టము నుండి విడివడగలడు? (23) అని తరువాత బ్రహ్మ నష్టచేతస్కులై దేవతలై దండమున నిలచిన యాజయలను గూర్చి యిట్లు పలికెను (24). ఏ కారణమున పు నన్ను వంచించి మీ సన్యాసము చేయబడినదో! ఏ కారణమున అంతులేని యీ విఫలమేదైతే చేయ బడినదో! ఆ కారణమున స భవిష్యత్ఫలము గలుగును. దేవతలు భావములలో (మనస్సులలో) జన్మింతురు గాక (25). ఓ సురోత్తములారా! మీ స్వేష్ట ప్రక మీ జన్మలు కలుగగలవు. మీరందరు ఆలు మన్వంతరములలోనికి వెళ్లగలరు (26). స్వాయంభువముతో మొదలై వైవస్వత మన్వంత ముగియు మన్వంతరములలో దేవతలట్లే జన్మింతురు. వారిని దెలిసి యచట బ్రహ్మ పురాతనమైన శ్లోకమును గానము జేసిన త్రయిని (ఋగ్యజుస్సామవేదములను) విద్యను, బ్రహ్మచర్యమును, సంతానమును, శ్రాద్ధమును, యజ్ఞమును, దానమును జేయు ఆ బ్రహ్మ విరజుడై (రజోగుణము లేనివాడై) ఇతరుల ప్రశంసతో నుండును (28). బ్రహ్మ యీ విధముగా శ్లోకమును జూచి జం దేవతలతో వైవస్వత మన్వంతరము గడవగనే యిట నా సమీపమునకు రండు అని పలికెను (29). తరువాత మీరు నా శాశ్వతమైన సిద్ధిని బొందగలరు. ఈ విధముగ వారితో చెప్పి బ్రహ్మ యచటనే యంతర్ధానమొందెను (30).
ఈశ్వరుడైన బ్రహ్మ యంతర్థానము జెందగా, ఎక్కడినుండి కూడభయము లేని వారై దేవతలు అణిమాది సిద్దులతో గూడినవారును, యోగబలముతో గూడినవారునునైరి (31). తరువాత వారి శరీరములు పండ్రెండు మడుగులైనవి. అవి జయములని చక్కగా బిలువబడినవియు, సముద్రముతో సమానమైనవియునైనవి (32). తరువాత స్వాయంభువ మన్వంతరమున నా సృష్టిలో సురలు పుట్టిరి. రుచికి అజితయందు బుట్టిన పుత్రులు పండ్రెండుగురు అజితులు అనబడిరి (33). విధి, మునయుడు, క్షముడు, నందుడు, అవ్యయుడు, ప్రాణుడు, అపానుడు, సుధాముడు, క్రతు - శక్తి - వ్యవస్థితుడు, అజితుడు ఈపండ్రెండుగురు అజితులనబడిరి. వీరందరు మానసపుత్రులు (34). వారు యజ్ఞమున దేవతలతో బాటు యజ్ఞభాగమును బొందువారనబడిరి. స్వాయంభువ మన్వంతరమునను పూర్వము స్వారోచిషమన్వంతరమునను మరల స్వరోచికి తుషితయందు పుత్రులు పుట్టిరి (35). వారు తుషితులను పేర నుండిరి. వారు ప్రాణులను పేరుగల యాజ్ఞకులు. మరలవారు ఉత్తమ మన్వంతరమున తుషితులను దేవతలు. వారు స్వయముగా ఉత్తమునకు సత్యయందు బుట్టిన శుభులైన పుత్రులు. కావున ఉత్తమ మన్వంతరమున సత్యులని పిలువబడిరి (37). మూడవ ద్వాపరాంతరమున వారు యజ్ఞభాగమును బొందువారైరి. తామసమన్వంతరము రాగా ఆ సత్యులు మరల దేవతలైరి (38). హరులు పండ్రెండుగురు తమసునకు పుత్రులుగా జన్మించిరి. వారు హరులను పేర దేవతలు యజ్ఞభాగమును బొందువారుగనైరి (39). తరువాత ఆ హరులను దేవతలు చారిష్ణవమన్వంతరము రాగా వైకుంఠయందు చరిష్ణువునకు సురలై జన్మించిరి. పంచమమన్వంతరమున వారు వైకుంఠులను దేవతలు (40). తరువాత ఆ వైకుంఠ దేవతలు చాక్షుష మన్వంతరమును జేరి సాధ్యయందు ధర్మపుత్రులుగా పండ్రెండుగురు పుత్రులై జన్మించిరి (41). తరువాత మరల వారు చాక్షుష మన్వంతరము బాగుగా క్షీణింపగా వైవస్వత మన్వంతరసృష్టి రాగా సాధ్యులైరి (42). వైవస్వత మన్వంతరమున మొదటి త్రేతాయుగ ప్రారంభము రాగా మారీచుడైన కశ్యపుని వలన అదితియందు ఆ సాధ్యులే అంశముగా బుట్టిరి (43). వీరు వర్తమాన చాక్షుష మన్వంతరమున ద్వాదశాదిత్యులు (44). తరువాత స్వాయంభువ మన్వంతరమున ఆ సాధ్యులు పండ్రెండుగురు దేవతలుగా జన్మించిరి. ఈ మొదలుగా గల జయులు అపుడు శాపముతో బుట్టిరి (45). దేవశాసనమున నెవడీ దేవతల సప్తసంభూతిని (ఏడుజన్మలను) శ్రద్ధాయుకుడై పఠించునో, వాడు ప్రత్యవాయమును (పాపమును) బొందడు (46). అని యీ జయులయొక్క యేడు లక్షణములు గల యేడు జన్మలు సంపూర్ణముగా నివ్వేళ చెప్పబడినవి. మరల నింకేమి వినగోరుచున్నారు అని సూతుడనేను (47).
ఋషులనిరి :
దైత్యుల యొక్కయు, దానవుల యొక్కయు, గంధర్వ - ఉరగ - రక్షస్సుల యొక్కయు, సమస్త భూత పిశాచముల యొ పశువుల యొక్కయు, పక్షులయొక్కయు, తీవలయొక్కయు జననమును మరణమును విస్తరముగా మాకు జెప్పుము (48), ఈ వి నడుగబడిన సూతుడు ఋషిసత్తములతో నిట్లనెను. కశ్యపుని వలన దితికి పుత్రద్వయముగలిగెనని మాచే వినబడినది (49). కశ్యపపు వారిరువురు కశ్యపుని యాశ్వమేధిక యజ్ఞమునందు అతిరాత్రము యొక్క సూత్యదినమున అందరికన్న మొదటివారుగా బుట్టి యనబడిరి (50). హిరణ్యకశిపుడనగా మొదటి ఋత్విజుని యాసనము, దితియొక్క గర్భము నుండి బయల్వెడలి ఉన్నతమై వేదసభయందు గూర్చుండెను. ఆ కారణమున ఆ పనిచేత నాతడు హిరణ్యకశిపుడనబడెను (51).
ఋషులనిరీ :
మహాత్ముడైన హిరణ్యకశిపుడను రాక్షసుని యొక్క పుట్టుకను ప్రభావమును ఓ ప్రభూ! మాకు విస్తరముగా జెప్పుము (52).
సూతుడనెను :
పూర్వము పుష్కర ప్రదేశమున కశ్యపుని యశ్వమేధయాగము జరిగెను. అది ఋషులతోను, దేవతలతోను, గంధర్వులతోను ప్రకాశించినది (53). అచట ఉత్కృష్టమైన విధానముచేత శాస్త్రీయముగా 69ఖ్యాన ప్రారంభమున ఐదు బంగారు ఆసనములు చక్కగా కల్పింపబడినవి (54). ఇచట కుశలచే పవిత్రములైన మూడు ఆసనములు, కూర్చము ఒక ఫలకమున్ను కల్పింపబడినవి. నలుగురు ముఖ్యులైన ఋత్విక్కులు. ఆ ఋత్విక్కులకు ఆ యాసనములను కల్పింపవలెను (55). అచట శుభమైన యాసనము హోతకోటకు ప్రకల్పింపబడినది. అది బంగారుమయమైనది. అట్లే దివ్యమైనది. దివ్యమైన చిత్రాసనము పరచినది (56). గర్భవతియైన దితి భార్యగానుండెను. ఆమె గర్భము పదివేల సంవత్సరములుండెను (57). ఆ హిరణ్యకశిపుడు తల్లియొక్క గర్భమునుండి బయలువెడలి హోతకొఱకై ప్రకల్పింపబడిన బంగారు ఆసనమున గూర్చొనెను. అచట నట్లు గూర్చున్న గర్భము (గర్భముననున్న హిరణ్యకశిపుడు) (58), ఆఖ్యానపంచమములైన వేదములను కాశ్యపుడు చెప్పిన విధముగనే చెప్పెను. అతనినిజూచిన మునులాతనికా పేరు (హిరణ్యకశిపుడని) పెట్టిరి (59). దానివలన హిరణ్యకశిపుడా పనిచేత ప్రసిద్ధుడయ్యెను. ఆతని తమ్ముడు (తరువాత బుట్టిన వాడు) హిరణ్యాక్షుడు. ఆతని చెల్లెలు సింహిక విప్రచిత్తిని పెండ్లాడినందున రాహువునకు జన్మనిచ్చిన తల్లియయ్యెను (60). హిరణ్యకశిపుడను రాక్షసుడు నూరువేలయేండ్లు నిరాహారుడై తలక్రిందులుగా నుండి గొప్ప తపము జేసెను (61). బ్రహ్మ యాతని వరముతో ననుగ్రహించెను. బ్రాహ్మణులనుండియు, సర్వభూతములనుండియు చావులేక అమరత్వమును బొంది యోగము వలన దేవతలనందరిని జయించి సర్వదేవుడై నిలిచేను (62). దానవులును అసురులును, దేవతలును హెచ్చుతగ్గులు లేక సమానులగుదురుగాక, మారుతీయొక్క మ హైశ్చ నాకు వరముగా నీయబడుగాక. (అని హీరణ్యకశిపుడు బ్రహ్మనుండి వరమును గోరెను). ఈ విధముగా నడుగబడిన బ్రహ్మ య కోరినది యిచ్చి యింకను నాతనికి దివ్యములైన వరములను గూడనిచ్చి యచటనే యంతర్థానమొందెను. రాక్షస హిరణ్యకశిపుడు శ్లోకములతో నిట్లు గానము జేయబడెను (63, 64), రాజైన హిరణ్యకశిపుడే దిక్కునకు బోవునో ఆయాదిక్కునకెల్ల దేవతలు మహా బాటు నమస్కరించిరి (65). ఓ బ్రాహ్మణులారా! రాక్షసరాజైన హిరణ్యకశిపుడిటువంటి ప్రభావము గలవాడు. పూర్వము నరసింహరూపుడైన యా విష్ణువు మృత్యువయ్యెనట. ఆ నరసింహ విష్ణువుచే గోళ్లతో నాహిరణ్యకశిపుడు చీల్చబడినాడు. దొ నఖములు శుద్ధములనబడినవి (66). హిరణ్యాక్షుని పుత్రులు ఐదుగురు. విక్రమము బలమును గలవారు - ఉత్కురుడు, కాలనాభుడు, విక్రమించిన మహానోభుడు, భూతసంపనుడును - హిరణ్యాక్షసుతులైన వీరు దేవతలకు గూడ జయింపనలవికా (68). వారియొక్క పుత్రులు పౌత్రులును సగణుడైన బాడేయుడనబడెను. నూరువేలున్న పోరు తారకామయమున నిహతులై హిరణ్యకశిపుని పుత్రులు నలుగురు మహాబలులు. వారిలో మొదటివాడు ప్రహ్లాదుడు, తరువాతివారు అనుహ్లాదుడు, సంప్రద ప్రదుడును. ప్రదుని పుత్రులను వినుడు (70). ప్రదుడు నిసుందుడును - వీరు ప్రదపుత్రులైరి. విక్రమించిన సుందోపసుందులి నీసుందుని తనయులు (71). బ్రహ్మఘ్నుడు, మహావీర్యుడు, మూకుడును - వీరు ప్రదుని కుమారులు. మారీచుడైన సుందష తొడకను జేరెను (72), ఆ తాడక బలవంతుడైన రామునిచే జంపబడినది. మూకుడు కిరాతమున సవ్యసాచియైన యః జంపబడెను (73). స్వయంభావితులై మహాతపముతో బుట్టినవారును మణివర్తమున నివసించువారును దేవతలచేత గూడ వధింపన వారును నైన మూడు కోట్ల రాక్షసులు సవ్యసాచిచే జంపబడిరి (74). అనుహ్లాదుని సుతుడు వాయువు శినీవాలియును. వారియొ హాలాహలమను గణము - అనబడినది (75). ప్రహ్లాదపుత్రుడు వైరోచనుడు. ఆతనికైదుగురు పుత్రులు. వారు - గవేష్ఠి, కా జంభుడు, భాష్కలుడు, శంభుడు పై నలువురి తమ్ముడు - వీరందరు ప్రహ్లాదపుత్రులు (76). ప్రాధాన్యమును బట్టి శత్ర జయింపనలవిగాని యా ప్రహ్లాదపుత్రుల పుత్రులను జెప్పెదను. శుంభుడు, నిశుంభుడు, విష్వక్సేనుడు - అనుపోరు మహోజ గవేష్ఠి పుత్రులు (77). జంభునకు శతదుందుభి, దక్షుడు, ఖండుడు - అను మువ్వురు పుత్రుల (78). విరోధుడు, మనువు, వృక్షా కుశలీముఖుడు - వీరు బాష్కలుని పుత్రులు. కాలనేమి సుతులను వినుడు (79). బ్రహ్మజిత్తు, క్షత్రజిత్తు, దేవాంతకుడు, నరా - వీరు కాలనేమి పుత్రులు. శంభుని పుత్రులను వినుడు (80). ధనుకుడు, అసిలోముడు, నాబలుడు, గోముఖుడు, గ గోమంతుడు - వీరు శంభు పుత్రులనబడిరి (81). విరోచనునకు బలీయొక్కడే ప్రతాపవంతుడైన పుత్రుడు. బలికి నూరుగురు : పుట్టిరి. వారందఱును రాజులే (82). వారిలో ప్రధానులు నలుగురు విక్రమము బలమును గలవారు. వారిలో జ్యేష్ఠుడ బాహువులు గలిగి ద్రవీణసమ్మతుడైన బాణుడు. కుంభనాభుడు, గర్గభాక్షడు, కుశి - అనుమొదలగువారు తక్కిన పుత్రులు (83) పూతన - అను నిరువురు బలికి పుత్రికలైన కన్యలు. బలియొక్క పుత్రులును, పౌత్రులును నూర్లకొలదియు వేలకొలదియు న (84). బలీయను పేర ప్రసిద్దమైన గణము. విక్రమము పౌరుషమును గలది. చంద్రమనస్సు గల బాణునకు ఎఱుపు దగియుండును (85).
విశేషముగా నశించిన పుత్రులు గల దితి భర్తయైన కశ్యపుని (తన సేవతో) సంతోష పెట్టేను. ఆ కాశ్యపుడు ప్రసన్నమైన యాత్మ గలవాడై యామేచే చక్కగా సారాధింపబడినవాడై వరముతో నామేననుగ్రహించెను. తరువాతనామె కూడ వరమును కోరుకొనెను (86). ఆ భగవత్స్వరూపుడై ప్రభువైన కశ్యపుడు ఆమెకు కోరిన వరమిచ్చెను. ఓ మంగళకరురాలా! నా యెడ నీవేమి కోరుచున్నావు - అని పలికెను (87). సంతుష్టి జెందిన మారీచుడై కశ్యపుడైన తన భర్తను చేతులు జోడించి యిట్లడిగెను. ఓ భగవత్స్వరూపుడా అదితికి బుట్టిన నీ కుమారులచే నేను హతపుత్రనైతిని (88). కావున దీర్ఘతపముతో గూడి ఇంద్రహంతమైన పుత్రుని బడయగోరుచున్నాను. నేను తపమాచరించెదను. నాయందు గర్భమును గలుగజేయుము (89), ఆమె యొక్క యా మాటను వీని మారీచుడైన కశ్యపుడు మహాతేజస్వియై మిక్కిలి దుఃఖితురాలైన దితికి మారు పలికెను (90). అభ్యగుగాక నీకు భద్రమగుగాక. ఓ తపోధనురాలా! పవిత్రురాలవు గమ్ము. యుద్ధమున నింద్రుని జంపగలుగు సత్పుత్రుని గనగలవు (91). నిండునూరేండ్లు పవిత్రురాలుగానున్నచో ముల్లోకములను అధిపతిగా జరించు పుత్రుని నీవు గనగలవు (92). ఈ విధముగా బలికి ప్రభువైన యామహాతేజస్వి యామెతో సంగమించెను. ఆమె నాలింగనము జేసీకోని భగవంతుడైన యా కశ్యపమహర్షి ముల్లోకమును జేరనేగెను (93). ఆ విధముగా భర్త వెడలిపోగా ఆ దేవియైన దితి మిక్కిలి సంతసించినదై కుశలమైన (దర్భలు నిండిన) వనమును జేరి మిక్కిలిదారుణమైన తపము జేసెను (94). సహస్రాక్షుడై దేవశ్రేష్ఠుడైన యింద్రుడు తపము జేయుచున్న యాదితికి ఉత్తమగుణ సంపదతో పరిచర్య (సేవ) జేసెను (95). అగ్నిని, సమిధలను, దర్భలను, కట్టెలను, ఫలములను కందమూలములను, ఇంకను కావలసిన యన్నింటిని ఇంద్రుడు తెచ్చి యిచ్చెను (96). శ్రమను బోగోట్టునట్టి ఒడలుపట్టుటల చేతను ఇంద్రుడు సర్వకాలములందా దితిని సేవించేను. ఇట్లారాధింపబడిన దితి సంతోషముతో నింద్రునితో నిట్లనెను (97).
దితియనెను :
ఓ సురశ్రేష్ఠుడా! ఓ ప్రియపుత్ర! నీ విషయమున సంతుష్టురాలనైతిని. ఇంకను పదియేండ్లు మిగిలియున్నవి. నీకు భద్రవ ఆ తరువాత నీవు తమ్ముని జూడగలవు (98). జయవాంఛను మనముననుంచుకొన్నాను. ఆ జయమునిచ్చునట్టి పుత్రుని బొందన ఓ పుత్రుడా! ఆతనితో ముల్లోకముల విజయమును బొందగలను (99). ఈ విధముగా నీంద్రునితో బలికీ, సూర్యుడు మధ్యాహ్న రాగా, మోకాళ్లపై తలయుంచి నిద్రావశురాలయ్యెను (100). పాదముల పై బడిన తలవెంట్రుకలు కలదగుటచే అశుచియైన జూచీ యింద్రుడు ఆమె విషయమున ఒక యవకాశమును బొంది నవ్వి సంతసించెను (101). అపుడేంద్రుడు తెరచుకొన్న శరీరమున బ్రవేశించెను. ప్రవేశించి మహాతేజస్సులతో అమితమైన గర్భమును జూచెను. మహాయశస్వియైన యింద్రుడు ఆప్రళ గర్భమును వజ్రముతో భిన్నము జేసెను (102). నూరు కణుపులు గల యా వజ్రముతో భేదింపబడుచున్న యా గర్భము కంపి సస్వరముగా మరల భయంకరముగా రోదనము జేసెను. ఇంద్రుడు - ఏడువకుము అని యా గర్భముతో బలికెను (103). విధములుగా నైన యా గర్భమున మరల నొక్కొక్కటీ యేడు విధములగునట్లు ఇంద్రుడు వజ్రముతో భిన్నము జేసెను. అం మేలుకొనెను (104). చంపరాదు చంపరాదు అని దితి పలికెను. తల్లి మాట పై గౌరవము వలన వజ్రము ధరించిన యింద్రు కడుపునుండి కిందబడెను. వజ్రముతోనే యింద్రుడు చేతులు జోడించి దితితో నిట్లనెను (105). ఓయమ్మా! పొదముల వెంట్రుకలు బడునట్లుగా నపవిత్రురాలవై నిద్రించితివి. ఆయవకాశమును దీసికొని యుద్ధమున నింద్రుని జంపగల నీ యీ గర భిన్నము జేసితిని. నన్ను క్షమింపుము అనెను (106). ఆ గర్భము విఫలము గాగా దితి మిక్కిలి దుఃఖితురాలై తన తల్లికి కం పోడయిన యింద్రునితో నిట్లనెను (107). నా యపరాధముననే యీ గర్భము విఫలము జేయబడినది. ఓ దేవరాజా! ఋ మహాబల! నీయపరాధమేమియు లేదు (108). నీ శత్రువును జంపుటలో నీకు దోషము లేదు. దానం జేసి ఓయి! నిన్ను శపింపన ప్రియమునే జేయగోరుదును. నా గర్భమునకు శ్రేయమును గూర్చుము (109). నా పుత్రులకు ఆకాశమున ఏడు స్థానములేర్పడు? పుత్రులు ఈ యేడు వాతస్కంధములను చరింతురు గాక. సప్తసప్త కులైన నలుబది తొమ్మిది నా పుత్రులు మరుద్గణ ప్రసిద్దిజెందుదురుగాత (110). పృథివియందు మొదటిస్కంధము, భాస్కరునియందు, రెండవ స్కంధము సోమునియందు మూడవస జ్యోతిర్గణమునందు నాలుగవ స్కంధము (111), గ్రహములందు ఐదవ స్కంధము, సప్తర్షిమండలమున ఆరవస్కంధము, ధ్రువుని ఏడవస్కంధము (112). నా యీ పుత్రులు పై స్కంధములను ఇపుడు ప్రతికాలమునదిరుగుదురు. నా పుత్రకులు ఈ పాతస్కంధములను దిరుగురుదు గాక (113). భూమియందలి మొదటి స్కంధము - అపవిత్రముల నుండి ప్రవహించు ఆవహము (ఆవహవాయుస్థానము). మొదటిదైన చరించుగుణముగా నా పుత్రకులు ఇందు చరింతురు గాక (114). రెండవది కూడ పవిత్రప్రదేశముల నుండి సూర్యుని వరకు ప్రవహించునది ప్రవహ వాయుస్థానము. ఈ వాతస్కంధమున రెండవచరించు గుణము చరించుగాక (115). సూర్యునకు పైన చంద్రుని నుండి ప్రవహించు వాయువు ఉద్వహమనబడును. దానిని మూడవవాతస్కంధమందురు. దీనియందు మూడవ చరించుగుణము చరించుగాక (116). సోమునకు పైన నక్షత్రముల నుండి ప్రవహించు వాయువు నాలుగవది సువహమనునది. సో పుత్రులగు నాలుగవచరించు గణము అచట చరించుగాక (117). యక్షులకు (నక్షత్రములకు) పైన గ్రహముల వరకు ప్రవహించు వాయువు వివహము ఐదవది. ఈ యెదవదానియందు యైదవస్కంధమున చరించు గణము చరించుగాక (118). గ్రహములకంటే పైన ఋషులవరకు చరించు వాయువు ఆరవది పరాహతము (పరావహము). అచట ఆరవగణపు నా పుత్రులు చరింతురు గాక (119). సప్తరులకును పైన ధ్రువ నక్షత్రము వరకు చరించు నేడవ వాయు స్కంధము పరివహము అచట నొపుత్రులుందురుగాక (120). ఈ నా పుత్రులు దీనినంతయు ప్రతికాలమున చరింతురు గాగ. అచట ఆ పేరుతో మరుత్తులు అగుదురు గాక (121).
తరువాత నా తల్లికొడుకులు (దితి - ఇంద్రులు) వారికి పేరులను బెట్టిరి. దానికై మరుత్తులు తమ కర్మలతో వేరువేరుగానైరి (122), సత్త్వజ్యోతి, దిత్యుడు, సత్యజ్యోతీ, తిర్యగ్ జ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మంతుడు (123), ఇది ప్రథమగణము అనబడినది. రెండవ గణమును వినుడు. ఋతజిత్తు, సత్యజిత్తు, సుషేణుడు, సేనజిత్తు (124), సత్యమిత్రుడు, అభిమిత్రుడు, హరిమిత్రుడు - ఇది. రెండవగణము. మూడవగణమును వినుడు (125). కృతుడు, సత్యుడు - ధ్రువుడు, ధర్త, విధారయుడు, ధ్వాంతుడు, ధుని, ఉగ్రుడు, భీముడు, అభియువు, సాక్షిపుడు, ఆహ్వయుడు - ఇది మూడవగణమనబడినది (126). ఈదృక్కు, అన్యాదృక్కు, యాదృక్కు, ప్రతికృతు, సమితి, సంరంభుడు, - ఇది నాల్గవగణము (127). ఈదృక్కును, పురుషుడును, అన్యాదృక్షమైన (ఇతరులతో సమానమైన) చిత్తము నుండి వెలసినవారును, సమితాసమితులతో సమానమైన చిత్తము నుండి వెలసినవారును, ఎదుటి (విరోధి) తో సః చిత్తము నుండి వెలసినవారును - గణముల వారు (128). వీరు నలుబది తొమ్మండుగురు మరుత్తులు పేరులతో జెప్పబడిరి. ఇంద్రులిద్దరిచేత అట్లు చక్కగా లెక్కింపబడిరి గదా (129) - దితి యామరుత్తుల పేర్లను విని ఇంద్రునితో నిట్లనెను. ఓ పుత్రకి ఈ నాపుత్రులు వాతస్కంధమును చరింతురు గాక. నా పుత్రులు దేవతలతో గలిసి చరింతురు గాక. నీకు భద్రమగుగాక (130 యొక్క యా మాటను విని సహస్రాక్షుడైన యింద్రుడు. చేతులు జోడించినవాడై తల్లీ! అది యట్లేయగుగాక - అనెను (131). జెప్పినట్లంతయు జరుగగలదు. సంశయము లేదు. మహాత్ములైన నీకుమారులు దేవసమ్మతులైన దేవతలగుదురు. అట్లే దేవతలతో బాటు యజ్ఞభాగమునందువారును గాగలరు (132). కావున నీ మరుత్తులైన దేవతలు అందరును ఇంద్రుని త యమరులు. కశ్యపముని వల్ల దితికి పుత్రులైనవారందరు అమరులుగా దెలియవలెను (133). ఈ విధముగ తపోధనులై కొడుకులు (దితి - ఇంద్రులు) ఇరువురు నిశ్చయమును దెలిసి స్వర్గమునకు వెళ్లిరి. ఇంద్రుడు కూడ స్వర్గమునకు వెళ్లాను (13 మరుత్తులయొక్క మంగళకరమైన జన్మను విన్నవాడును చదివినవాడును వర్షములేమి వల్ల గలుగు భయమునందడు. దీర్ఘమైన యాయువు గలవాడుగను అగును (135).
ఇది శ్రీవాయుమహాపురాణమున కాశ్యపీయప్రజాసర్గమను ఆఱవ అధ్యాయము సమాప్తము.
