వాయు మహా పురాణము
30 - దక్షశాపవర్ణనం
సూతుడనెను:- పూర్వపుదైన స్వాయంభువ మన్వన్తరమున పుత్రులను సృజించు బ్రహ్మనుండి ఆ జలములు బుట్టినవి. మనుష్యులు, అసురులు, దేవతలు గూడ బుట్టిరి-1. (ఈ విధముగ తండ్రి వలె భావింపబడుచున్న యీ బ్రహ్మకే పితరులు జనించిరి. వారి యొక్క స్వభావము పూర్వము జెప్పబడినది. దాని విస్తరము జెప్పబడినది. దాని విస్తరము చెప్పబడగలదు 2. దేవాసురమనుష్యులను జూచి దేవుడు (బ్రహ్మ) పలికెను. తండ్రివలె భావింపబడుచున్న యాతనికి (బ్రహ్మకు) ఉపయక్షితులైన(ఉపలక్షితులైన) మధువు (వసంతుడు) మొదలగు నాజు (వసంత గ్రీష్మ వర్షా శరత్-హేమంత-శిశిరములు) ఋతువులు బుట్టినవి. ఆ ఋతువులను పితరులుగా జెప్పుదురు. ఋతవః పితరో దేవో: ఋతువులు పితృదేవతలు అను నర్థముగల యిది వేదనిబద్దమైన శ్రుతి (వాక్యము)-3, 4, గడచినట్టియు రానున్నట్టియు అన్ని మన్వన్తరములలోని ఈ స్వాయంభువ మన్తరమున వీరందరు ముందుబుట్టిరి-5.
వారే (ఋతువులైన పితరులు) అగ్నిష్వాత్తులనియు, బర్హిషదులనియు పిలువబడిరి. అగ్నిష్వాత్తులనబడువారు అనాహితాగ్నులైన పితరులు-6. వారిలోయజ్వానులు సోమపీథులైన పితరులు. బర్హిషదులనబడువారు అగ్నిహోత్రులైన పితృదేవతలని నిశ్చయమైన మతము-7.
చైత్రవైశాఖ మాసములు (వసంత) రసరూపములుగా దెలియవలెను. జ్యేష్టాషాఢమాసములు (గ్రీష్మ) అగ్నిరూపములు శ్రావణ భాద్రపదమాసములో రెండున (వర్ష జీవరూపములనబడినవి-8. ఆశ్వయుజ కార్తీక మాసములు (శరత్) సుధా (అమృతము)వంతములుగా జెప్పబడినవి. మార్గశీర్షపుష్యమాసములు (హేమంత) మన్యు(కోపము)మంతములుగా జెప్పబడినవి. మాఘఫాల్గుణ మాసములు శిశిర ఋతు సంబంధములై ఘోరములైనవి-9. పైన జెప్పిన రెండేసి మాసములతో గూడిన యారు ఋతువులు కాలముయొక్కదశలు. అట్టి యివి ఋతువులుగా జెప్పబడినవి. ఇవి చేతనములును అచేతనములును -10. ఋతువులు బ్రహ్మయొక్క పుత్రులు. అవి నెలలయొక్కయు నేలలోని సగము భాగములయొక్కయు స్థానములందు అభిమానముగలవి. ఆ స్థానముగూడ ఋతువులు, ఋతుసంబద్దములును స్థానములయొక్క వ్యతిరేకముచే సంబంధముచే వానిని స్థానాభిమానులుగా దెలియవలెను. పగళ్ళు, రాత్రులు, నెలలు, ఋతువులు, అయనములు, సంవత్సరములు కాలావస్థాభిమానియొక్క స్థానములు నిమేషములు (రెప్పపాటుకాలములు), కలలు(కల=540రెప్పపాట్ల కాలము) కాష్ఠములు (కాష్ఠము-18 రెప్పపాట్లకాలము), ముహూర్తములు (ముహూర్తము=రెండు గడియల48 నిమిషముల కాలము) పగళ్లు, రాత్రుళ్లు 11, 12, 13. వీనియందు అభిమానులై కాలావస్థ(దశయందు అభిమానులై కాలావస్థ(ధవ)ల యందుండు వారు (దేవతలు) తన్మయులై యుండుటచేత తదాత్ములయిన వారిని జెప్పబోవుచున్నాను వినుడు-14.
పర్వణియొక్క తిథులు సంధ్యలు పక్షములు నెలలోని సగము భాగములు. రెండు సగమునెలలు నెల రెండు నెలలు ఋతువనబడును-15. మూడు ఋతువులు అయనము ఆయనములు దక్షిణాయనము ఉత్తరాయణము అనునవి రెండు. సంవత్సరము సుమేకుడు. ఇది స్థానులయొక్క స్థానాభిమానులగు దేవతల యొక్క స్థానములు-16. ఋతువులను సుమేక పుత్రులను ఎనిమిది విధములుగా దెలియవలెను.(?) ఆలుగురు ఋతుపుత్రులు. (వసంత గ్రీష్మ వర్గా- శరత్- హేమన్ల శిశిరములు). ఋతుసుతులు ఐదుగురు. ఋతుప్రజలు (సంతానములు) ఆర్తవ లక్షణము గలవారు-17. కారణము స్థాణువులు (వృక్షములు) జంగమములు (పశుపక్ష్యాదులు) ఆర్తవేయవులు(వృక్షములు) జంగమమములు (పశుపక్ష్యాదులు) ఆర్తవ్యములుగనే (ఋతుసంబంధములుగలవిగనే) బుట్టుచున్నవి. (కావున) పితరులు ఆర్తవులు (ఋతు సంబంధము గలవారు) ఇక పితామహులు (తండ్రితండ్రి) ఋతురూపులే-18. సుమేరునినుండి ప్రజాతులు పుట్టుచన్నారు. చచ్చుచున్నారు. కావున ప్రజలకు (సంతానములకు) సుమేకుడు ప్రపితామహుడు (తండ్రి, తండ్రి)-19. స్థానములయందు వీరు స్థానితులై (స్థానముగలవారై) స్థానాత్ములుగా జెప్పబడినారు. ఆ స్థానము పేరుగా గల వారై తన్మయులగుట వలన తదాత్ములుగా తలపబడిరి-20.
ఎవడు ప్రజాపతియని తలపబడినవాడో వాడే సంవత్సరుడుగా సమ్మతింపబడినవాడు. సంవత్సరుడే అగ్నియని తలపబడినాడు. ద్వీజులచే నాతడు ఋతమనబడినాడు-21. ఋతువులు ఋతమునుండి బుట్టినందున ఋతువులనుండి మాసములు ఆఋతువులును, వానికి బుట్టినవని తెలియవలెను. ఐదుగురు ఆర్తవులైన (ఋతుసంబంధముగల) సుతులును 22. రెండు పాదములుగల మనుష్యాదులకు, నాలుగు పాదములుగల గవాదులకును, పక్షులకును ప్రాకునట్టి పాములకును, ఐదుస్థావరములకును కాలముననుసరించి వచ్చు ఆర్తవము(ఋతురసము) పుష్పముగా తలపబడినదీ-23. ఋతుత్వము ఆర్తవత్వము పితృత్వము అనియు ప్రకీర్తితమైనది(చెప్పబడినది) ఋతువులు ఆర్తవులు నైన వీరందరు పితరులని తెలియవలెను-24. తరువాత వారినుండి సర్వభూతములు ఋతుకాలము వలన బుట్టిరి. కావున ఈ పితరులుగూడ ఆర్తములని మేము వింటీమీ-25. అన్ని మన్వన్తరములలోను, కాలాభిమానులు (దేవతలు) ఉన్నారు. స్థానాభిమానులైన వీరు అతిసంయమముతో నిటనున్నారు-26.
అగ్నిష్వాత్తులు బర్హిషదులు అని పితరులు రెండువిధములని చెప్పబడిరి. ఆ పితరులనుండి లోకప్రసిద్ధులైన యిరువురు కన్యలు జనించిరి-27. వారు మేనా ధారిణీ-అనువారు. వారి చేత ఈ విశ్వము ధరింపబడినది. శుభస్వరూపులైన (తమ)కన్యలను ఆ పితరులు (వివాహ) ధర్మార్థముగానిచ్చిరి. వారిరువురు బ్రహ్మవాదినులు (బ్రహ్మను తెలిసి చెప్పువారు) వారిరువురు యోగినులును.
అగ్నిష్వాత్తులనబడువారికి 'మేన' మానసీకన్యయనియు, బర్హిషదులకు 'ధారిణి' మానసీకన్యయనియు తలపబడిరి 29. శుభస్వరూపమైన ధారిణిని మేరువునకు భార్యగానిచ్చిరి. వారు (ధారిణినిచ్చినవారు) సోమపీథులైన బర్హిషదులను పితరులుగా తలపబడిరి-30. ఇక అగ్నిష్వాత్తులు మేనను హిమవంతునకు భార్యగా నిచ్చిరి. వారికి (ధారిణీమేనలకు) బుట్టినవారు దౌహిత్రులనబడిరి. ఆ దౌహిత్రులను చెప్పెద వినుడు-31. హిమవంతుని భార్యమేన మైనాకుని గనెను. నదీశ్రేష్ఠమైన గంగలవణసముద్రునకు భార్య, మైనాకునకు తమ్ముడు క్రౌంచుడు. ఆతడే క్రౌంచద్వీపమనబడెను-32. మేరువుయొక్క భార్యయైన ధారిణి దీవ్యౌషధులతో గూడిన మందరుని (పర్వతమును) పుత్రుని గాను ప్రసిద్దలైన మువ్వురు కన్యలను గనెను-33. వారు వేల నియతి, ఆయతి-అనువారు. ఆయతధాతయొక్క భార్య నియతివిధాతయొక్క భార్య-అనియనబడిరి 34. పూర్వము స్వాయంభువ మన్వన్తరమున, వారియొక్క సంతానముగూడ చెప్పబడిరి. సాగరునివల్ల ‘వేల’ ఒకయనిందితయైన కన్యనుగనెను.
సావర్ణిచేత సాముద్రికలిగినది. సాముద్రి ప్రాచీనబర్హిషుని భార్య తరువాత సవర్ణమైన సాముద్రి ప్రాచీనబర్హిషుని వల్ల పదుగురిని గనినది. వారందరు ప్రచేతసులను పేరుగల వారు. ధనుర్వేదమును సాంతముగా దెలిసినవారు-36. వారిలో ప్రభువై స్వయంభువుపుత్రుడైన దక్షుడు చాక్షుషమన్వంతరమున త్ర్యంబకుని (ముక్కంటి) యభిశాపముచే పుత్రుడుగా బుట్టెను-37. ఇది విని తరువాత శాంశపాయనుడు ఈ విధముగ సూతునడిగెను. పూర్వము చాక్షుషమను వంశమున శివుని యభిశాపమువల్ల దక్షుడెట్లు పుట్టెను. దీనినడుగుచున్న మాకు జెప్పుము-38. ఇట్లడుగబడిన సూతుడు. శాంశపాయనుని బిలిచి శివునిశాపకారణరూపమయిన దక్షుని కథను జెప్పదొడగెను.
దక్షునకు ఎనమండుగురు కూతురులుండిరని నాచే నిదివరకే చెప్పబడినది. తండ్రి వారిని వారివారి యిండ్లనుండి తీసికొని వచ్చి తనయింట పూజించెను-40. వారిలో పెద్దది సతి శివునియొక్క భార్య రుద్రుని ద్వేషించుచు తనకూతురైన యా సతిని పిలువలేదు-41. అల్లుడైన మహేశ్వరుడు మామయైన యాదక్షునియెడ ఎప్పుడును నమస్కరించలేదు. స్వభావసిద్దమైన తేజస్సులోనుండెను-42. తరువాత "సతి" తనచెల్లెండ్లందరు తండ్రి యింటికి వచ్చిరని తెలిసి పిలువబడకయే తన తండ్రి యింటికి వెళ్లినది-43. తరువాత కోపముచే సహనము లేనిదై తండ్రితో నిట్లనినది. ప్రభో ఈ చిన్న వారందరిలో పెద్దదానినైన నన్ను అనిష్టురాలిగా నవమానించితివి ఇక యీ పూజనే (సూతాపూజనే) నిందీతముగ జేసితివి-44. నేనందరిలో పెద్దదానిని. శ్రేష్ఠురాలను. అట్టినాకసత్కారము జేయదగవు. ఇట్లనగనే దక్షుడు కండ్లెఱ్ఱ జేసిన వాడై సతితో నిట్లనెను-45. నీవు శ్రేష్ఠురాలవు వరిష్ఠురాలవు. ఎల్లప్పుడును నాకు పూజింపదగినబాలవు. కాని వారి భర్తలు నా కెల్లప్పుడు మిక్కిలి యిష్టులు-46. ఓ సతి! వారందరు బ్రహ్మిష్ణులు (వేదజ్ఞులు) తపిష్టులు (తపమునందున్న వారు), మహాయోగులు, చక్కని ధార్మికులు. గుణములతోగూడ ముక్కంటి కన్న గొప్పవారై కొనియాడదగినవారు.
వసిష్ఠుడు, పులస్త్యుడు, అంగిరసుడు, పులహుడు, క్రతువు, భృగువు, మరీచి-వీరుశ్రేష్ఠులైన నాయల్లుండ్రు-48. ఆతనికాతడే యాత్మ ఆతడెవ్వరిని గొప్పగా భావింపడు) నీకు ఆతడుశర్వుడు(నాశకుడు) అట్టివానిని నీ వెల్లప్పుడు సేవించు భక్తురాలవు. కావున నిన్ను పూజింపదలపను. శివుడు నాకు ప్రతికూలుడు-49. అని దక్షుడు మిక్కలి మూఢమైన చిత్తముతో బలికెను. పరమ+ఋషులుగూడ తనను శపించుటకై(శపించుమని) చెప్పిరి-50. ఆ విధముగ జెప్పబడినదై కోపించిన సతీదేవి యిట్లనెను. మాటలో మనస్సులో చేతలోను దోషములేని నన్ను నిందించితివి. కావున తండ్రి నీయాత్మనుండి బుట్టిన యీ దేహమును నేను త్యజించుచున్నాను-51. ఆ తరువాత ఆ దేవి యవమానము చేతను దుఃఖము చేతను సహింపనిదై మహేశ్వరునకు నమస్కరించి యీ మాటలు పలికెను-52. ఎచ్చట నేను మరల ప్రకాశించు దేహముతో బుట్టుదునో యచ్చట గూడ అజ్ఞానము లేని ధార్మికురాలనై మరల ధర్మప్రకారము ముక్కింటికి (శివునకు) ధర్మపత్నీత్వమునే పొందుదును-53. ఆ శివుని యందే యోగముచే గలిసి కూర్చున్న దాననై సమాధినందెదను. అని మనస్సుతో తన యొక్క యోగాగ్ని ధారణను (ఆగ్నేయ దిక్కునకు సంబంధించిన (అగ్నిధారణను) ధరించెను-54. వెంటనే ఆగ్నేయి నుండి లేచిన వాయువుచే బాగా పైకి లేచిన వాయువుచే ప్రేరేపింపబడినదై యగ్ని సర్వాంగములనుండి బయలువెడలి యామెను భస్మము జేసెను.
తరువాత శూలధారియై దేవుడైన శంకరుడు సతియొక్క మరణమును విని, యట్లే దక్షసతులయొక్క సంవాదమును జరిగినది జరిగినట్లుగా దెలిసికొనెను. వెంటనే ప్రభువైన యా భగవంతుడు దక్షునియెడను ఋషులయెడను కోపించెను 56. ఓ దక్ష ఏకారణమున నాకొఱుకు గాను నా సత్యవమానింపబడినదో తక్కిన కూతుళ్ళు అందరు తమ భర్తలతోబాటు ప్రశంసింపబడిరో!-57. ఆకారణమున వైవస్వతమన్వన్తరమున మరల మహర్షులు నా రెండవ యజ్ఞమున నయోనిజులై జన్మింపగలరు-58. చాక్షుషమన్వన్తరమున బ్రహ్మచేత పవిత్రమైన హోమము జేయబడగా ఋషులను బలికి (శపించి) మరల దక్షుని జేరెను-59. చాక్షుషమన్వన్తరమున చాక్షుషుడను వాడు రాజుగాగలడు. ఇతడు ప్రాచీన బర్హిషుని పౌత్రుడు ప్రచేతసుని పుత్రుడు-60. చాక్షుష మన్వన్తరము రాగా శాఖులయొక్క కన్యయైన మార్షయందు దక్షుడను పేరుతోనే నీవు జన్మింపగలవు-61. దక్షుడనెను. నేనక్కడగూడ ఓ దుర్మతీ! నీకు విఘ్నమును జేయగలను. ఇచట ధర్మార్థకామపురుషార్థములతో గూడిన యజ్ఞాది కర్మలందు మాటిమాటికి విఘ్నము జేయుదును-62. నౌకారణముగా నీవు ఋషులను క్రూరముగ బలికినందున, ద్విజులు (బ్రాహ్మణులు) దేవతలతో బాటునిన్ను యజ్ఞమున బూజింపరు-63. తరువాత ఆహుతిని హోమము జేసి క్రూరులై యజ్ఞకర్మలలో నీరును వదులుదురు. అట్లే నీవు యాగక్షయమువరకు (యుగక్షయమువలన) స్వర్గమును వదిలి యిచటనే యుండగలవు.
రుద్ర ఉవాచ:-
రుద్రుడనేను:- అన్నిలోకములలో భూలోకము మొదటిది(బహ్మ యాజ్ఞచే నేను దానిని ధరింతును-65. ఈ భూమియందు చుట్టియున్న లోకములన్నియు భాస్కరములై (సూర్యప్రకాశముగలవై) యున్నవి. నేను వాని నెల్లప్పుడు ధరింతును. నీయాజ్ఞతోగాదు-66. దేవతలకు చాతుర్వర్ణ్యము గలదు. వారు కూడ నొక్కచోట భుజింతురు. నేను వారితో గలిసి భుజింపను. కావుననే వారు (భుజింప జేయు హోతలు) వేరుగా (హవిస్సులను) ఇత్తురు. కావుననే యాతడు (రుద్రుడు) దేవతలతో బాటు పూజింపబడడు (హవిస్సు ఈయబడడు). వేరుగా పూజింప (హవిస్సీయబడి) పడును.
తరువాత అంతులేని తేజస్సుగల రుద్రునిచే అభివ్యాహృతుడైన (శపింపబడిన) దక్షుడు స్వాయంభువమన్వన్తరమున పూర్వపు ప్రజాపతిత్వమును వదిలి భూలోకమున మనుషులలో బుట్టెను-68. గృహపతియైన దక్షుడు జ్ఞానములకీశ్వరుడైన ప్రభువును(శివుని) తెలిసికొనెను. ఆ దక్షుడను వాడు దేవతలతో గూడి మహాయజ్ఞములతో (శివుని) పూజించేను-69. ఆ తజువాత సతీదేవిని వై స్వతమన్వంతరము రాగానే శైలరాజైన హిమవంతుడు మేనయందు ఉమా దేవిగా జనింప జేసెను-70 ఆమే పూర్వము సతీదేవి ఆతజువాత ఉమయైనది. ఈమె భవునకు (శివునకు) సహచారిణీ వ్రతముజేయు భార్యయైనది. ఈ భూలోకమున మన్వంతరములలో నుండదలచినంతవజుకు ఆశివుడామెచే విడువబడడు (అర్ధనారీశ్వరుడగును)-71. మరీచి పుత్రుడైన కశ్యపుని అనువ్రతయైన యదితిదేవివలె, సాధ్యుడైన నారాయణుని శ్రీ (లక్ష్మి)వలే, ఇంద్రుని శచీదేవివలె-72, విష్ణువును కీర్తివలె, సూర్యునీ రుచివలె, వసిష్టుని అరుంధతివలె, మహేశ్వరుని ఉమ విడువలేదు. పై జెప్పిన స్త్రీలందరు ఏమైనను తమ భర్తలను విడువలేదు. చుట్టివచ్చు కల్పములలో గూడ వారు తమ భర్తలతోబాటు మరల జన్మింతురు-73. ఈ విధముగ ప్రాచేతసుడు దక్షుడు చాక్షుషమన్వంతరమున ప్రాచీన బర్హిషుని పౌత్రుడుగను. ప్రచేతసుని పుత్రుడుగను బుట్టెను.
రెండవ మన్వంతరమున రుద్రుని శాపముచే పదుగురు ప్రచేతసులవలన మార్షయందు మరల నీ రాజు(దక్షుడు) బుట్టెను. అని వినికిడి. శ్రుతి (వేదము). మొదటి త్రేతాయుగమున పూర్వము వైవస్వతమనువునకు భృగువు-మొదలగు మహర్షులందరు బుట్టిరి-75, 76. ఈ విధముగ ధీమంతుడైన ముక్కంటికిని ప్రజాపతియైన దక్షునకును జాత్యంతరమువల్ల అనుబంధ ద్వేషము కలిగెను. కావున జాత్యంతరగతుడైనను శుభాశుభములచే భావితుడైన వానికి నిటనెప్పుడు గూడ శత్రువుల యెడ భాంధవ్యమును జేయరాదు. ఖ్యాతి యనగా వైరుల కెప్పుడు వైరము విడువదు, అది ప్రాణిని విడువక నశింపజేయునను ప్రసిద్ధి. ప్రాణిని విడువదు. అది సహజము కావున చక్కని తెలివితో నడుచుకొనవలెను.
ఓ సూత! వైవస్వతమన్వంతరమున
ఋషులనిరి:- ప్రజాపతియై ప్రాచేతసుడైన దక్షునియొక్క హయమేధయజ్ఞము ఎట్లు వినాశమందినది-79. దేవి స్వయముగా మరణించినదని కోపించిన సర్వాత్మకుడై ప్రభువైన శివుని దక్షుడెట్లు శాంతింపజేసి యనుగ్రహింపజేసికొనెను? ఆయజ్ఞము చివర కెట్లు సాధింపబడెను? అని యడిగిరీ.
సూత ఉవాచ:-
సూతుడనెను:- ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా: పూర్వము జ్యోతిష్కుమను పేరుగలిగి సవితృ (సూర్య) సంబంధముగలిగి. సకల రత్నములచే నలంకరింపబడి ముల్లోకముల ప్రసిద్ధిచెందిన మేరు పర్వతము యొక్క శిఖరముండెను-81. అది. యింతయని తెలియనలవి కానిది, దేని చేతను భిన్నముగానిది. సర్వలోకులచే నమస్కరింపబడినది. అన్ని ధాతువులచే నలంకరింపబడిన యాపర్వతరాజమందు పొస్సునందువలే మహాదేవుడు ప్రకాశించుచు కూర్చుని యుండెను-82. పర్వత రాజు కూతురు పార్వతియు నెల్లప్పుడీతని ప్రక్కనేయుండెను. (మహాత్ములైన యాదిత్యులును (ద్వాదశసూర్యులు) ఆంతులేని ఓజస్సు(బలము) గల వసువులును-83. అట్లే మహాత్ములైన వైద్యులలో శ్రేష్ఠులైన యశ్వినులును, అట్లే గుహ్యకుల పరివారముగలవాడై (చుట్టబడి)-84. యక్షుల కీశ్వరుడై కైలాసనిలయుడై ప్రభువై రాజైన కుబేరుడును, మహామునియైన ఉశనుడు (శుక్రుడు) ను ఆమహాత్ముడైన శివుని ఉపాసింతురు. సనత్కుమారుడు మొదలగు మహర్షులును-85. అంగిరసుడు మొదలగు తక్కిన దేవరులును, విశ్వావసువు(సూర్యుడు)ను, గంధర్వుడును, అట్లే నారదపర్వతులును-86. అప్సరోగణసంఘములును అనేక పర్యాయములీటకు వచ్చిరి. మంగళకరమై సుఖకరమైన అనేకసుగంధములతో నిండి పవిత్రమైన వాయువు వీచెను-87. అట్లే అన్ని ఋతువులలో బూయుపూవులతో పుష్పవంతములు వృక్షములయ్యెను. అట్లే విద్యాధరులు, సిద్దులు, తపోధనులును అచట పశుపతి యైనమహాదేవుని చుట్టుగా నుండి సేవింతురు. తరువాత, నట్లే నానా రూపములు ధరించిన భూతములు సేవింతురు-88, 89. అనేక రూపములు ధరించి సంతుష్టులైన వారు అనేకాయుధములనెత్తి బయలు దేరిన వారు మహాబలులు మహాకోపిష్టులునైన రాక్షసులు పిశాచులును-90. శివుని యొక్క యనుచరు(సేవకు)లై అగ్నితో సమానులైన వారచటనుండిరి. భగవంతుడైన నందికూడ మండుచు స్వతేజముతో ప్రకాశించు చున్న శూలమును బట్టుకొని యా శివుని యిష్టప్రకారమే యుండెను-91. సమస్త తీర్థ జలముల నుండి బుట్టినదియు, నదులన్నింటిలో శ్రేష్ఠమై దేవరూపిణియైన గంగగూడ ఓ ద్విజోత్తములారాః ఆ దేవుడైన శివుని సేవించేను-92. ఈ విధముగా నచట మహాభాగులైన దేవతలచేతను దేవరులచేతను బ్రకాశించుచున్న వాడై యామహాదేవుడు (శివుడు) ఉండెను.
పూర్వము దక్షుడు హిమాలయముపైన ఋషులు సిద్ధులు సేవించిన శుభదేశమైన గంగాద్వారమున యజ్ఞమారంభించెను 94. తరువాత ఇంద్రుడు మొదలగు దేవతలు ఒకచో గలిసి యపుడా దక్షుని యజ్ఞమునకు వెళ్లదలంచిరి-95. అగ్నివంటి తేజముగల మహాత్ములైన యాదేవతలు ప్రకాశించుచున్న తమ తమవిమానములతో శివసంకల్పముతో గంగాద్వారమునకు వెళ్లారని వినికిడి-96. ఆప్రదేశము గంధర్వులతోను అప్సరసలతోను నిండినది. అనేక వృక్షములతోను తీవలతోను జుట్టబడినది. ఋషి సంఘములతో జుట్టబడిన దక్షుడు ధర్మధారులలో శ్రేష్టుడు-97. భూమ్యాకాశములలోను స్వర్గలోకమునను ఉన్నయందరును ప్రజాపతియైన దక్షునిని చేతులుజోడించి సమీపమున జేరిరి-98. ఆదిత్యులు, వస్తువులు, మరుద్గణములతో బాటు రుద్రులు ఇంద్రునితో సహా అందరును యజ్ఞభాగులై యటకు వచ్చిరి-99. ఊష్మపులు (ఆవిరిని చీల్చువారు) సోమపులు (పోమరసమును(దావువారు) ఆజ్యపులు (నేతిని (దావువారు) అట్లే అశ్వినీదేవతలు పితృదేవతలును బ్రహ్మాతో బాటు అచటికి వచ్చిరీ-100. వీరును, తక్కిన యనేక భూతసమూహములును, అట్లే జరాయుజులును (మావినుండి బుట్టువారు) అండజములును గ్రుడ్డు నుండి బుట్టువాగు) స్వేదజులును (చెమటనుండి బుట్టు నవీయు) యందరు దేవతలును తమతమ వాహనములతో గూడవేద మస్రములతో బిలువబడిన వారై, మండుచున్న యగ్నులవలె వెలుగుచున్నవారై, విమానములందున్న వారై ప్రకాశించుచున్నారు.
వారిని జూచిన దధీచ మహాముని కోపావిష్టుడై యీ మాట బలికెను. పూజంపదగనీ వానిని పూజించుట యందును, పూజింపదగిన వానిని పూజింపకుండుటయందును నరుడు మహాపాపముందును ఇట సంశయము లేదు-103. బ్రహ్మర్షి (దధీచుడు) ఇట్లు పలికి మరల దక్షునితో నిట్లనెను. పూజింపదగిన ప్రభువైన పశుపతినెందుల' కి'ట నాహ్వానింపవైతివి? అని.
దక్ష ఉవాచ:-
దక్షుడనెను- శూలమును ధరించి జటలుగలిగిన రుద్రులు నాకు చాలమంది గలరు. వారు ఏకాదశ(పదునొకండు) అవస్థలలో నుందురు. వేరైన మహేశ్వరుని నేనెజుగను-105. దధీచుడు పలికెను- దేవతలందరును బిలువబడిరి. ఏకారణమున శివుడు పిలువబడలేదు? శంకరుని కన్నమించిన వేరైన దైవమును నేనెఱుగను. కావున దక్షుని యీ విశాలయజ్ఞము జరుగదు. (అని యనిపించుచున్నది).
దక్ష ఉవాచ:-
దక్షుడనెను:- ఓ శూరుడవైన దధీఛాః ఈ యజ్ఞమున సువర్ణపాత్రమున మన్రపూతమై యాహవనీయాగ్నియందు నిత్యమైన హవిస్సునంతయు ప్రభువై సర్వవ్యాపియై సాటిలేని విష్ణువునకే జేరునట్లిత్తును-107. అప్పుడు సాధ్యమైన సతీదేవి దేవతలనందరిని దక్షునియజ్ఞమునకు వెళ్లిన వారినిగా దెలిసికొని పశుపతియైన శివునితో నిట్లు మాట్లాడెను.
ఉమోవాచ:-
ఉమయనెను:- భగవన్! ఇంద్రుడు మొదలైన దేవతలెక్కడకు వెళ్లిరి? నాకు గొప్ప సంశయమగుచున్నది. నిజముగా నీజమును జెప్పుము-109.
మహేశ్వర ఉవాచ:-
మహేశ్వరుడనెను:- ఉత్తమప్రజాపతియైన దక్షుడను మహాభాగుడు హయమేధయాగము జేయుచున్నాడు. దేవతలందరు అక్కడికి వెళ్లిరి.
దేవ్యువాచ:-
సతీదేవియనెను:- ఓ మహాభాగ్యవంతుడా! ఈ యజ్ఞమునకు నీ వేల వెళ్ళవైతివి? ఏ కారణముచే నీవచటికి వెళ్ళుట నిషేధింపబడినది.
మహేశ్వరుడనెను:- ఓ మహాభాగ్యవంతురాలా! ఇది యజ్ఞములన్నింటిలోను నాకు భాగము కల్పింపబడలేదు-112. ఓ ఉత్తమురాలా! పూర్వాచారము చేనేర్పడిన మార్గమున బుద్ధిమంతుడైన దక్షునియొక్కయజ్ఞమున దేవతలు నాకు భాగము నీయరు.
దేవ్యువాచ:-
సతీదేవి యనెను:- ఓ భగవంతుడా! నీవు సర్వదేవతలలో అధికగుణములచే విశిష్ఠ కాంతిమంతుడవు. తేజస్సుతోను కీర్తితోను సంపదచేతను జయింపనలవిగానివాడవు తిరస్కరింపనలవికానివాడవును-114. ఓ మహాభాగుడా! ఈ పేరునుట్టంకించి ప్రతిషేధించుటచే నేను మిక్కిలి దు:ఖమును బొందితిని. ఓ పాపరహితుడా నాకు కంపముగూడ గలిగినది 115. అచిత్యుడు భగవంతుడునైన నా భర్త యివ్వేళ యజ్ఞము యొక్క సగభాగమును గాని లేదా మూడవ భాగమునుగాని పొందునట్టి యేదానమును ఏ నీయమవ్రతమును ఏతపమును నేను జేయవలయును?-116. అచింత్యుడైన శివుడు ఈ విధముగ జెప్పుచు క్షోభజెందిన తనభార్యతో చిరునవ్వుతో బలికెను. ఓ దేవతలకీశ్వరురాలా సన్నని నడుముగలదానా: నీవు తెలియకున్నావు. నీకు ఈ విధముగ బలుకుట తగునా?-117. ఓ విశాలాక్షి సత్పురుషులు నేను ధ్యానముచే సర్వమును దెలియుదునని యందురు. ఈ నాడు ఇంద్రుడు గాని లోకత్రయముగా మోహముచే అన్ని విధములుగా విజ్ఞాన హీనముగా లేదు-118. యజ్ఞమున నన్ను శంసించు వారు(స్తుతించువారు) స్తుతింతురు. రథంతరమున (రథమ్రరసామమున) గానము జేయదగిన సామమును(నాకై) గానము జేయుదురు. (బ్రహ్మసత్రమనుయాగమున బ్రాహ్మణులు నన్ను బూజింతురు. ఆధ్వర్యులు (యజ్ఞమునందు యజుర్వేదమన్తములనుజదువువారు) నన్ను గూర్చి(నాకు) భాగమును కల్పింతురు.
దేవ్యువాచ:-
సతీదేవియనెను:- భగవంతుడా! పండితుడైనను సమస్త స్త్రీ జనుల సభలలోతనుతాన్ను స్తుతించును. రక్షించుకొనును. సంశయము లేదు-120. భగవంతుడైన శివుడనుచున్నాడు! ఓ దేవతలకీశ్వరియైన దానాః నన్ను నేను స్తుతించుటలేదు. ఓ ఉత్తమురాలా! యజ్ఞ భాగముకొలకెవనిని సృష్టింతునో చూడు తెలిసికొనుము (తోడువేడలుము)-121. భగవంతుడు శివుడు ప్రాణప్రియురాలైన భార్యతోనిట్లని తనముఖమునుండి బుట్టి కోపాగ్నిని బోలినవానిని సృష్టించెను–122. ఆతడు వేయితలలు గలవాడు. దేవుడు వేయికాళ్ళు కండ్లు కలవాడు వేయి ముద్గరములను (ఇనుపగుదియలు) ధరించిన వాడు. బాణములుగ వేయి చేతులు గలవాడు-123. శంఖము చక్రము గద వీనిని చేతులలో ధరించిన వాడు. ఉజ్జ్వలముగ బ్రకాశించుధనస్సులు గలవాడు. గండ్రగొడ్డలి కత్తి వీనిని ధరించిన దేవుడు మహాకోపముతో భయంకరుడు-124. భయంకరరూపముతో మండుచున్నవాడు. చంద్రరేఖయలంకారముగా గలవాడు. పులిచర్మమును ధరించిన వాడు-125. గొప్ప రక్తమును స్రవించునట్టి కోరలతో క్రూరమైన పెద్ద ముఖమును ధరించిన వాడు. పెద్ద కడుపు గలవాడు. మెఱుపు నాలుకగలవాడు. పెద్దగా వ్రేలాడు పెదవులు గలవాడు. వ్రేలాడు పెద్ద చెవులుగలవాడు. దగ్గరికి పోనలవిగానివాడు-126. వజ్రాయుధముతో మెఱయు చేతులు గలవాడు. కాంతులతో మండుచున్నట్లున తలవెంట్రుకలు గలవాడు. జ్వాలలమాలలచే గప్పబడినట్లున్నవాడు. ముత్యాలహారములతో నలంకరింపబడిన వాడు-127. ప్రళయకాలాగ్నివలె తేజస్సుతో మండుచున్నవాడు. చెవులవరకు చీల్చినట్లున్న నోటి యిరుచివరలుగలవాడు. నలుదెసలకు భయంకరుడు-128. మహాబలుడు. మహాతేజుడు. మహాపురుషుడునైన యీశ్వరుడు. విశ్వమును హరించు గొప్పశరీరముగలవాడు గొప్పమఱిచెట్టు చెట్టుమండలము వలెనున్నవాడు. ఒకే మారు నూరు చంద్రుల వలెను. మన్మథాగ్నివలెను ఒక్క మారు మండుచున్న వాడు-129. తెల్లని వాడికోరలుగల నాలుగు పెద్ద ముఖములుగలవాడు. గొప్పభయంకరమైన తేజముతోను బలముతోను సంతోషముతోను ఒప్పినవాడు. ప్రళయకాలమందలి వేలసూర్యాగ్నుల కాంతిగలవాడు. వేల చంద్రుల నిర్మలకాంతిచే మనోహారుడు ఎక్కువగా ప్రకాశించిన మౌషధులుగల మంధర పర్వతమువలేనున్న వాడు. సుమేరు పర్వతముతో హిమాలయముతోను కైలాస పర్వతముతోను సమానమైన కాంతి గలవాడు-130. ప్రళయకాలసూర్యుని వలెనున్న వాడు. మహాబలవంతుడు. చక్కని ముక్కుగలవాడు. పెద్దముఖముగలవాడు. భయంకరమైన చెక్కిళ్ళుగలవాడు. మండుచున్న కండ్లు గలవాడు. అగ్నిజ్వాలలచేతులచే కలుషమైన ముఖముగలవాడు-131. సింహచర్మము వస్త్రముగాగలవాడు. మహాసర్పములతో జుట్టబడిన వాడు. తలపాగాగలవాడు. చంద్రుని ధరించిన వాడు ఒకప్పుడు భయంకరుడు. ఒకప్పుడు సమముగా నుండువాడు-132. అనేక విధములైన పుష్పములు ధరించిన శిరస్సుగలవాడు. బహువిధములైన గంధముల బూసికొన్నవాడు. అనేక రత్నములచే విచిత్రమైన శరీరము గలవాడు. అనేకా భరణములనలంకరించుకొన్నవాడు. కొండ గోగుపూలమాలచే ప్రకాశించుచున్నవాడు. కోపముచే పైకి తిరిగిన కండ్లుగలవాడు. ఒకచోట చిత్రమైన శరీరముండునట్లుగా నాట్యముజేయును. ఒకచోట చక్కని స్వరముతో బలుకును 134. ఒకచోట ఆత్మయోగముతో ధ్యానముజేయును. ఒకచోట లావుగ మృదంగము వాయించును. ఒక బోట విశ్వాత్ముడై గొనము చేయును. ఒకచోట మాటిమాటికి ధ్వని జేయును-135. జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము తపము సత్యము క్షమధైర్యము ప్రభుత్వము ఆత్మజ్ఞానము(మొదలగు) అన్నిటినాక్రమించుగుణములతో గూడిన వాడు-136. ఆతడు మోకాళ్లతో భూమినానుకొని నమస్కరించిన వాడై చేతులు జోడించి నిలబడెను. ఓ దేవేశుడా! నేను నీకొఱకేమి చేయవలెనో నీవాజ్ఞాపింపుము. అనెను.
మహేశ్వరుడు దక్షుని యజ్ఞమును ఆవరించి (ధ్వంసముజేసి) వేయుము అని మావీరభద్రుని తో ననెను. ఈ శివుని యనుమతిని విని మహాబలుడైన వీరభద్రుడు దేవేశుడైన ఉమాపతి పాదములకు నమస్కరించి-138. బోనులో నుండివదలిన సింహతలతో సతీదేవి తనకోపముతో యోగాగ్ని దగ్ధయగుట దలచి యాదక్షుని యజ్ఞము ధ్వంసము చేయబడినది-139 కోపముచే మహాభయంకరురాలు మహేశ్వరియైన భద్రకాళి తనయొక్క (వీరభద్రుని యొక్క) సర్వసాక్షిగా వీరభద్రునితో బాటు వెంబడి వెళ్లినది.
ఆ యితడు కోపించిన భగవంతుడగు శ్మశానవాసియైన శివుడు వీరభద్రుడని ప్రసిద్ధిచెందినవాడు. దేవియైన సతియొక్క కోపమును జల్లార్చువాడు-141. ఆతడు తనరోమకూపములనుండి (వెంట్రుకల మొదల్లనుండి) రౌద్రులను గణేశ్వరులను సృష్టించేను. వారు రుద్రుననుసరించి వచ్చువారు మహాబలవంతులు. రుద్రునితో సమానమైన బలపరాక్రమములు గలవారు 142. వారందరు రుద్రసేవకులు వారందరు రుద్రునితో సమానముగ కాంతిగలవారు. అట్టివారు వేగముగా నూర్లకొలది వేలకొలది వచ్చిపడిరి-143. అంత కిలికిలయనుశబ్దము ఆకాశమును నింపుచున్నట్లు వ్యాపించేను. ఆ గొప్పశబ్దముతో ఆ దేవతలందరును-144. తిరుగుచుండెను. వరుణలోకమున నుండు బ్రాహ్మణులు గూడకలతజేంద్రీ-145. అగ్నులు మండలేదు. సూర్యులు ప్రకాశింపలేదు. గ్రహములు కూడ ప్రకాశింపలేదు. నక్షత్రములు తారకలును వెలుగలేదు. గ్రహములు కూడ ప్రకాశింపలేదు. నక్షత్రములు తారకలును వెలుగలేదు-146. ఋషులు దేవతలును దానవులును మాట్లాడలేకుండరి. అవమానింపబడిన గణేశులు గణములును ఈ విధముగ చీకటినిండిన యజ్ఞమును నిశ్శేషముగ దహించుచుండిరి-147. భయంకర రూపులై మహాబలులైన ప్రమథగణవీరులు సింహనాదము జేయుచుండిరి. భయంకరులైన మరికొందరు (యజ్ఞమంటపవస్తువును) పగలగొట్టుచుండరి. యూపస్తంభములను పెరికి వేయుచుండిరి-148. మరికొందరు అచటి వారిని మర్దించుచుండిరి. మరికొందరు వికటనృత్యము జేయుచుండిరి. యజ్ఞములోని వారు వాయువేగమనోవేగములతో పరువులెత్తి పోవుచుండిరి-149. యజ్ఞపాత్రములను ముక్కలుగాను చూర్ణముగను జేయుచుండిరి. అప్పుడు యాగస్థలములు ఆకాశమునుండి రాలిన చుక్కలవలె యజ్ఞవస్తువులు తుత్తునియలై చెల్లా చెదరుగబడి కనబడుచుండెను-150. దివ్యములైన యన్నములు పానీయములు (త్రాగునవి) భక్ష్యములు(సమితి తినునవి) వీని యొక్క రాసులు పర్వతములవలె నుండెను. పాలనదులు ప్రవహించుచుండెను. తక్కిన నేయి పాయసములు బురుదలుగా నేయ్యెను. తేనె మిగడల పానీయములు ద్వివ్యముగా నుండెను. ఖండశర్కరలు ఇసుక కుప్పలవలె పడియుండెను-151. మనోహరములైన బెల్లపు కాలువలు షడ్రసములను బ్రవహించుచుండెను. ఉత్తర దక్షిణములనంటే పడియున్న మాంసములు, వివిధములైన భక్ష్యములు-152. ఇంక ననేక దివ్యభోజ్యములు బడియుండెను. లేహ్యములు (నాకి తినునవి) చోష్యములు (జుఱ్ఱిత్రాగునవి) ను ఉండెను. వీనినన్నింటిని తక్కిన ప్రమథగణములు అనేకవిధములైన ముఖములచే భుజించు చుండిరి. తరువాత నన్నివిధములుగా పొర్లాడుచుండిరి. క్రీడించుచుండిరి. వివిధాకారములు గలవారై దేవతా స్త్రీలను ఒకచో నుంచిరి (పడవేసిరి).
రుద్రకోపముచే ప్రయోగింపబడిన రుద్రకల్సులైన ప్రమథులు సర్వదేవతలచేత సురక్షితమైనను దక్షయజ్ఞమును శీఘ్రముగా ధ్వంసము జేసిరి-154. అట్లే తక్కిన కొందరు సర్వభూతభయంకరమైన నాదములజేసిరి. మరికొందరు యజ్ఞము యొక్క శిరమును ఖండించి భయంకరముగ గర్జించుచుండిరి-155. యజ్ఞపతియై దక్షుడైన దక్షప్రజాపతి ముగ(లేడి) రూపమున నాకాశమున పరుగులిడ బ్రారంభించేను-156.తెలియరాయాత్మ స్వరూపముగల వీరభద్రుడు దక్షుని బలమును దెలిసికొని యప్పుడు ఆ మహాత్ముడై (ఆకాశమంతట వ్యాపించు మహత్స్వరూపుడై) వెంటనే యాకాశముననున్న దక్షుని శిరమును ఖండించెను-157. ప్రజాపతియైన దక్షుడు గూడ నశించి భ్రమించుచున్న చేతనము (ప్రాణము) గల వాడయ్యెను. కోపించిన వీరభద్రునిచే తన పాదముచే దక్షుని శిరము పీడింప(పిండిగా జేయ) బడెను. ముసలితనముచే తిరస్కరింపబడి తీవ్రమైన యాత్మగలవాడై భూమి పై బడెను-158. విమలాత్మకులైన ముప్పది మూడు కోట్లదేవతలు సింహబలుడై యగ్నిబలుడైన వీరభద్రునిచే పాశముచే బంధింపబడిరి-159. తరువాత నాసర్వదేవతలు మహాబలుడు మహాత్ముడైన వీరభద్రుని కడకువచ్చిరి. ఓ ప్రభో, రుద్రదేవా, సేవకులయెడ అనుగ్రహించి ప్రసన్నుడవగుము. కోపింపకుము.
తరువాత బ్రహ్మాదిదేవతలు ప్రజాపతియైన దక్షుడును. చేతులు జోడించినవారై మీరెవరో చెప్పుడనిరి-161. వీరభద్రు డనెను. దేవుడను గాడు. ఆదిత్యుడను గాడు. ఇచట భుజించుటకును రాలేదు. కుతూహలముతో గూడిన వాడనై దేవేంద్రులను తిలకించుటకును గూడ రాలేదు-162. దక్షయజ్ఞవినాశము కొఱకిచటికి వచ్చిన వానినిగా నన్ను దెలిసికొనుము. రుద్రకోపమువలన బయలు వెడలిన భద్రకాళిగా దెలియదగినది. దేవదేవుడైన శివునిచే పంపబడినదై యిచటి యజ్ఞ సమీపమునకు వచ్చినది-163,164. ఓ రాజేంద్ర నీకు దేవుడైన యుమాపతిని శరణు బొందుము. రుద్రుని కోపమైనను మేలు. (రుద్రభిన్న) దేవులనుండి వరదానముకాదు.
వీరభద్రుని మాటను విని ధర్మమును ధరించువారిలో శ్రేష్ఠుడైన దక్షుడు దేవేశుడై శూలముచేత ధరించిన మహేశ్వరుని సంతోషపెట్టసాగేను-166. యజ్ఞవాటికయంతయు చెడిపోయినది. బ్రాహ్మణులందజు పారిపోయిరి. రుద్రసంబంధమైన భయంకరమైన మహాగ్ని తారామృగమయమై (ఆకాశమున మృగశీర్షానక్షత్ర రాశినావరించి) మండినది-167. పరీచారకులు శూలములతో బిగిసిన ముఖములతో కూతలుబెట్టుచున్నారు. యూపములు తవ్వి పేజీకి వేయబడినవి. విరువబడి యిటు అటు వేయబడినవి-168. మాంసమును గోరిన గ్రద్దలు ఎగురుచున్నవి వ్రాలుచున్నవి. తమరెక్కలు విదుల్చుటచే వచ్చిన ధ్వనులు అచటి నూర్ల కొలది నక్కల కూతలతో గలిసి వ్యాపించినవి. ఈ విధముగ యజ్ఞవాటిక యంతము దూషితమైనది.
ఆ తఱువాత బహుదృష్టులు గలవాడును శత్రువుల జయించువాడునైన దేవదేవేశుడైన శివుడు ప్రయత్నముతోడ నిలకడతో ప్రాణాపాన వాయువులను నిరోధించి యంతట దృష్టిని విశేషముగా ప్రసారించి-170. అకస్మాత్తుగా అగ్నికుండము నుండి (వెలుపలికి) వచ్చెను. వేలకొలది చంద్రసూర్యులయొక్క తేజము ప్రళయము వలెనుండెను-171. భగవానుడు నవ్వి యీ దక్షునితో నీ మాట బలికెను. నీ యొక్కయజ్ఞానము వలన యజ్ఞము నష్టమైనది. ఇప్పుడు నీకు నాయందు ప్రీతి కలిగినది-172. దేవతల గురువుతో గూడ వినిపించిన విషయమును చక్కగా జెప్పి చిరునవ్వునవ్వి నీకేమి చేయవలెనో చేప్పుమనియనేను-173. ప్రజాపతియైన దక్షుడు భయముజెంది శంకతో మిక్కిలిభయపడినవాడై కన్నీరు నిండిన ముఖము కన్నులు గలవాడునై చేతులు జోడించి యా(శివ) దేవునితో నిట్లనెను-174. భగవంతుడవైన నీవు ప్రసన్నుడవైనచో, నేను నీకు ప్రియుడనైనచో, నేను నీకనుగ్రహింపదగిన వాడనైనచో, నాకు వరమియదగినదైనచో, ఏది తినబడినదో నమల బడినదో, త్రాగబడినదో భుజింపబడినదో యేది నశింపజేయింపబడినదో, చూర్ణము జేయబడినదో, విరిచి తొలగింపబడినదో అట్టి యజ్ఞసంభార మంతయు-176. చాలకాలముగా మహాప్రయత్నముతో కూర్చుకొనబడినది. అదినాకు మిథ్య (అసత్యము లేనిది. శూన్యము) కారాదు. నేనీ వరమును గోరుచున్నాను.
అట్లే యగుగాక యని భగవంతుడై భగనేత్రహరుడైన హరుడనెను. ప్రజాపతియైన దక్షుడు మోకాళ్లతో భూమి పైకి వంగి ధర్మాధ్యక్షుడు మహాదేవుడు ముక్కంటియునైన శివునకు నమస్కరించి, యా శివుని నుండి వరమును బొంది, వేయియెనిమిది (అష్టోత్తరసహస్ర) నామములచే ఆ వృషభద్వజుడైన శివుని స్తుతించెను.
దక్షకృతోష్ట సహస్రనామస్తుతి
దక్ష ఉవాచ :-
దక్షుడు శివాష్టోత్తర సహస్రనామ స్తుతితో స్తోత్రము జేయుచు పలికెను. (1) దేవాయ(తే) నమః= దేవునకు నమస్కారము జగన్నిర్మాణ పరుడవై ప్రత్యక్షాది ప్రమాణ గోచరుడవై బ్లేయుడవైన నీకు నమస్కారము. (2)దేవేశాయనమః= దేవతల కీశ్వరుడవైన నీకు నమస్కారము. ఇంద్రియాత్మకుడవును బుద్ధ్యాత్మకుడవును నైన నీకు నమస్కారము. జ్ఞాన, జ్ఞాతృరూపుడవైన నీకు నమస్కారము. (3)దేవాది బలసూదనాయనమః= దేవతల శత్రువులైన రాక్షసుల బలమును నశింపచేయు నీకు నమస్కారము. ఇంద్రియవృత్తులైన శమాది దేవతలకు శుత్రువులైన కామాదుల బలమును నశింపజేయు. నీకు నమస్కారము. (దేవా! ఇంద్రియములు శమాదులును ఈశః= అసురాః కామాదులు. (4)దేవేంద్రాయ నమః= దేవేంద్ర స్వరూపుడవైన నీకు నమస్కారము. ఇంద్రియములకు సమస్త ఙ్ఞాన ప్రకాశక దీప్తినిచ్చు (ఆత్మ స్వరూపుడవగు) నీకు నమస్కారము. (5)అమర శ్రేష్టాయ నమః మృతిజెందని దేవతలలో శ్రేష్టుడవైన నీకు నమస్కారము. (6)దేవదానవ పూజితాయనమః= దేవతల చేతను (ఇంద్రాదులచేతను) రాక్షసుల చేతను (బాణాదులచేతను) పూజింపబడిన నీకు నమస్కారము.
సహస్రాక్షాయ నమః= వేయి కన్నులుగలవాడవగు నీకు నమస్కారము. ఒకే మారు అన్ని విషయములను దెలియజేయు నింద్రియములు గలిగి సర్వజ్ఞుడవగు నీకు నమస్కారము. (8)విరూపాక్షాయ నమః= మనయింద్రియముల వలె గాక వ్యవధానమున (అడ్డంకులున్నను) గూడ విషయములను గ్రహించు విశిష్ట రూపమైన యింద్రియములు గల నీకు నమస్కారము. (9)త్ర్యక్షాయ నమః= మూడు (సోమ- సూర్య- అగ్ని రూపములైన కన్నులుగల నీకు నమస్కారము. యక్షులకు రాజైన ప్రియ మిత్రుడవైన నీకు నమస్కారము. (10)సర్వతః పాణి పాదాయ నమః= అన్నివైపుల చేతలు కాళ్ళు సర్వకర్తయు సర్వగన్దయువైన నీకు నమస్కారము. (11)సర్వతో 2 క్షిశిరోముఖాయ నమః= అన్నివైపుల నేత్రములు తల ముఖముగల నీకు నమస్కారము. (ముఖమంతయు అంతేకాక తలయంతయు కన్నులు గలవాడు). (12)లోకే సర్వతః శ్రుతిమతే నమః= లోకమున అన్నీవైపుల వినగల చెవిగల నీకు నమః, (13)సర్వానావృత్య తిష్ఠతే నమః= అందరినావరించియున్న నీకు నమః.
(శంకుకర్ణాదులు ఈశ్వరగణములు సర్వాఽభిన్నుడగు శివుడు వారితో గూడ నభిన్నుడే.) (14)శంకుకర్ణాయ నమః= శంకువు వంటి చెవులు గల గుణ స్వరూపునకు నమస్కారము. (15)మహాకర్ణాయ నమః= పెద్ద చెవులుగల గణ స్వరూపునకు నమః, (16) కుంభకర్ణాయ నమః= కుండవంటి చెవులుగల గణస్వరూపునకు నమ:. (17)అర్ణవాలాయ నమః= సముద్రంలో నివసించు గణ స్వరూపునకు నమః. (18)గజేంద్ర కర్ణాయ నమః= గజరాజు చెవులవంటి చెవులు గల గణస్వరూపునకు నమః. (19)గోకర్ణాయ నమః= గోవుల వంటి చెవుల గల గణస్వరూపునకు నమః (20)పాణి కర్ణాయ తే నమః= చేతులవంటి చెవులుగల గణస్వరూపునకు నమః.
(21)శతోదరాయ నమః= అనంతములైన కడుపులతో విశ్వరూపుడవైన నీకు నమ: (22)శతావర్తాయ నమః= అనంతములైన తేజో(రాశి) సుళ్ళు (galaxies) గలిగి విశ్వరూపుడవైన నీకు నమః (23)శతజిహ్వాయ నమః= అనంతములైన నాలుకలు గలిగి కొల విశ్వరూపుడవైన నీకు నమ: (24) శతాననాయ నమః= అనంత ముఖములతో విశ్వరూపుడవైన నీకు నమః (25)త్రిసంధ్యాసు గాయత్రీ జపగీతాయ నమః= మూడు సంధ్యలలో గాయత్రీ జపపరులచేగానము జేయబడు నీకు నమః. (26)త్రిసంధ్యగాయత్రీ త్రిసంధ్యలలో నర్చింపబడు (సూర్యరూపునకు) నీకు నమః.
(27)దేవదానవ గోత్రే నమః= రాక్షస బాధల నుండి దేవతలను, పాప ఫలితముగా సంహారమునిచ్చి కైవల్యము నిచ్చుటచే దానవులను రక్షించు నీకు నమః. (28)బ్రహ్మణే నమః= బ్రహ్మాత్మునకు నీకు నమః. (29)శతక్రతవే నమః= ఇంద్రాత్మునకు నీకు నమః. (30)మూర్తీశాయనమః= పృధివి-నీరు-అగ్ని వాయువు. ఆకాశము-సూర్యుడు-చంద్రుడు-యజమాని అను అష్టమూర్తులతో నీశుడవగు నీకు నమః. (31)మహామూర్తయే నమః= లింగాకారమున (క్రింద పైన) విశ్వమంతయు వ్యాపించిన యాకారముల నీకు నమః. (32)సముద్రాంబుధరాయనమః= సముద్ర జలమును తేజోరూపమున ధరించు నీకు నమః (అగ్నే రాపః శ్రు).
(33)గవా గోష్ఠ ఇవ సర్వదేవతానాం నివాసాయనమః= గోవులకు గోశాలవలె సమస్త దేవతలకు నివాసమైన నీకునమః. (34) సోమ శరీరాయ నమః= చంద్రుడు శరీరమైన వానికి నమః. (35)అగ్ని శరీరాయనమః= అగ్నిశరీరమైన వానికి నమః. (36)వరుణ శరీరాయ నమః= వరుణుడు శరీరమైన వానికి నమః (37)ఆదిత్య శరీరాయనమః= సూర్యుడు శరీరమైనవానికి నమః. (38) విష్ణు శరీరాయనమః= విష్ణువు శరీరమైన వానికి నమః. (39)బ్రహ్మ శరీరాయనమః= బ్రహ్మశరీరమైన వానికి నమః. (40)బృహస్పతి శరీరాయనమః= బృహస్పతి శరీరమైనవానికి నమ: (సోమాదుకాత్మయైన వాడని భావము.
(41)క్రియా స్వరూపాయ నమః= సర్వక్రియా స్వరూపునకు నమః. (42)కార్యాయ నమః= సర్వకార్య స్వరూపునకు నమః. (43)కారణాయ నమః= సర్వకారణ స్వరూపునకు నమ:. (44)కర్రే నమః సర్వకర్తకునమః. (45)కరణాయనమః= సర్వకరణ (సాధకతమ సాధన) స్వరూపునకు నమః.
(46)అసతే నమః= సత్తాస్పూర్తి శూన్యునకు నమః (మాయా శబలిత సగుణ బ్రహ్మ స్వరూపునకని భావము). (47)సదసదే నమః= సదసత్స్వరూపునకు నమః. (48) ప్రభవ్యాయాయనమః= జన్మమృత్యు స్వరూపునకు నమః. (49)భవాయ నమః= సర్వోత్పత్తి స్థానరూపునకు నమః. (50)శర్వాయ నమః= దుష్టులను జంపువానికి నమః (51)రుద్రాయ నమః పాపములను ద్రవింప (కరుగ) జేయువానికి నమః. (52)వరదాయ నమః= భక్తులకు వరములనిచ్చువానికి నమః.
(53)పశూనాం పతయే నమః= బ్రహ్మాది స్థావరాంత జీవులైన పశువులను రక్షించు పతియైన వానికి నమః. (54)అంధక ఘాతినే నమః= అంధకుడను రాక్షసుని సంహరించిన వానికి నమః. (55) త్రిజటాయ నమః= మూడు జడలు గలరూపము గలవానికి నమః. (56)త్రిశీర్షాయ నమః= మూడు తలల రూపము గలవానికి బ్రహ్మాత్మ స్వరూపునకు నమ:. (57)త్రిశూల వర ధారిణే నమః త్రిశూలమను సాయుధశ్రేష్ఠమును ధరించిన వానికి నమః- 188. (58)త్ర్యంబకాయ నమః= శాస్త్రాచార్యాధ్యయన రూపములైన మూడు నేత్రములు గలవానికి నమః. (59)త్రినేత్రాయనమః= సోమ సూర్యాగ్ని రూపములైన మూడు నేత్రములు గలవానికి నమః. (60)త్రిపురఘ్నాయ నమః= ఆకాశమున లోహ రజతకనక పురములను నిర్మించుకొని, యజేయులైన కమాలాక్ష విద్యున్మాలిలను త్రిపురాసురుల పురములను మూడవ నేత్రముతో ధ్వంసముజేసిన నీకు నమ: (61)చండాయనమః= కోపముచే అందరిని జంపుటకు సమర్థుడైనవానికి నమః (చడికో పే). (62)ముండాయ నమః= అందరిని శోధింపజేయువానికి నమః (ముడి మార్జనే). (63) ప్రచండాయ నమః= పాపులను నిశ్శేషముగా ఖండించువానికి నమ: (ముండిఖండనే). (64)ధరాయ నమః= సర్వమును ధరించువానికి నమః.
(65) డిండిమాసక్త కర్ణాయ నమః= డిండిమమను వాద్యవిశేష ధ్వనియందు తాండవ సమయమున లగ్నమైన కర్ణేంద్రియములుగల నీకు నమః. (65)దండినే నమః= దండములను ధరించిన నీకు నమ:. (66)సమకర్ణాయ నమః= సమమైన కర్ణములు గల నీకు నమః. (66)దండిమండాయ నమః దండము ధరించిన ముండనము జేసికొన్న పరివ్రాజక రూపునకు మ.భా.పా. ప్రకారము నీకు నమః. (67)అర్థదండ కేశాయ నమః సగము దండముతో సమానముగా పొడవైన తలవెంట్రుకలు గల నీకు నమః. (68)నిష్ణాయ నమః= బంగారు రూపము గలవారికి నమః. (69)వికృతాయ నమః= వికార రూపము జెందిన నీకు నమః-190. (70)విలోహితాయనమః= మిక్కలి యెఱ్ఱనైన నీకు నమః. (71)ధూమ్రాయ నమః= పొగవర్ణము గల నీకు నమః. (72)నీలగ్రీవాయ తే నమః= కాలకూట విషము ద్రాగుటచే నల్లని కంఠముగల నీకు నమః. (73)అప్రతిరూపాయ నమః= ప్రతిరూపము (సాటిరూపము) లేని నీకు నమః. (74)శివాయ తే నమః= మంగళకళ స్వరూపుడవైన నీకు నమ:-191. (75)సూర్యాయ నమః= సూర్య స్వరూపుడవైన నీకు నమః (76)సూర్యధ్వజపతాకినే నమః= సూర్యుడు ధ్వజమునందును జెండాయందును గల నీకు నమ:. (78)ప్రమథనాథాయ నమః= ప్రమథులకు (సర్వులను మధించగల బలము గలవారికి) ప్రభువైన నీకు నమః. (79) వృషస్కంధాయ నమః= ఆబోతు వంటి భుజములుగల నీకు నమః. (80)ధన్వినే నమః= ధనుస్సు ధరించిన నీకు నమః.
(81)హిరణ్యగర్భాయ నమః= సువర్ణమయమైన తేజోమయమైన గర్భముగల నీకు నమః (82)హిరణ్యకవచాయనమః= జ్ఞానతేజోమయమైన (బంగారుమయమైన) కవచముగల నీకు నమః. (83)హిరణ్యకృతచూడాయనమః= బంగారము (సొమ్ములు) నిండిన కొప్పుగల జ్ఞానతేజోమయమైన జటాజూటముగల) నీకు నమః-193. (85)సత్రఘాతాయ నమః= దక్షయజ్ఞ ధ్వంసము జేసిన నీకు నమ:. (86)దండాయనమః= దండనీతి స్వరూపుడవగు నీకు నమః. (87)వర్ణపాన పుటాయనమః= ఇష్టమైన పానపాత్ర (దోణి)గల నీకు నమః (?). (88)స్తుతాయ నమః= స్తోత్రము జేయబడిన నీకు నమ:. (89)స్తుత్యాయ నమః= స్తోత్రము జేయదగిన నీకు నమః (90) స్తూయమానాయ నమః= అందరిచే స్తుతింపబడుచున్న నీకు నమః- 194. (91)సర్వాయనమః= సర్వస్వరూపుడవగు నీకు నమః. (92)అభక్ష్య భక్ష్యాయ నమః కాలుడు భక్షింపనలవిగాని వానినైన భక్షించ గల నీకు నమః. (93)సర్వభూతాన్తరాత్మనే నమః= సర్వభూతముల కన్తరాత్మవైన నీకు నమః. (94)హోత్రాయ నమః హోమము జేయదగిన హవిస్పు (చేయి) మొదలగు వాని స్వరూపుడవగు నీకు నమః. (95)మన్తాయ నమః= హోమమన్ల స్వరూపుడవగు నీకు నమః. (96) శుక్ల ధ్వజ పతాకినే నమః= తెల్లని ధ్వజము జెండా కల నీకు నమః-195.
(97)నమాయ నమః= నమస్కార స్వరూపుడవగు నీకు నమః (తన్నమ ఇత్యుపాసీత). (98)నమ్యాయ నమః= నమస్కరింప దగిన స్వరూపముగల నీకు నమః. (99)కిలికిలాయ నమః= కిలికిలియను హర్షానంద సూచక విశిష్ట శబ్ద స్వరూపునకు నమః. (100)శయమానాయ నమః= సుఖముగా యోగనిద్రను అనుభవించుచున్న నీకు నమః (101)శయితాయ నమః= నిద్రించినవానీ స్వరూపుడవగు నీకు నమః. (102)ఉష్ఠితాయ నమః= నిద్రమేలుకొన్న స్వరూపునకు నమః.
స్థితాయ నమః= నిలకడగానున్న నీకు నమః (104)చలమానాయనమః= కదులు (నడుచు) చున్న నీకు నమః. (105) ముద్రాయ నమః= అంతట సంతోషము నిచ్చు నీకు నమ: (ముదం రాతి ఆదత్తే ఇతి ముద్ర:). (106) కుటిలాయనమః= నాట్యముజేయు స్వభావముగల నీకు నమ:. (108)ముఖవారిత్రకారిణే నమః= ముఖముతో వీణా వేణు మృదంగతాళ వాద్యనాదముల జేయు నీకు నమః-197. (109)నాట్యోపహారలుబ్ధాయ నమః= నాట్యపు కానుకలందాసక్తి గల నీకు నమ:. (110)గీత వాద్యరతాయ నమః= దుష్టులకు కుటిల స్వరూపుడవైన నీకు నమ:. (107)నర్తన శీలాయ నమః= పాటల యందును వానికి దగిన వాద్య ధ్వనులయందును ఆసక్తుడైన నీకు నమ:. (111)జ్యేష్ఠాయ నమః= అందరి కంటేను పూర్వుడవైన (పెద్దవైన) నీకు నమ:. (112)శ్రేష్ఠాయ నమః= అందరికంటెను గుణాధికుడవైన నీకు నమ:. (113)బల ప్రమథనాయనమః= బలాభిమానియగు దేవత ఇంద్రుని మథించి యోడించిన నీకు నమ:-198. (114) కలనాయ నమః= సర్వమును దెలిసికొను నీకు నమ:. (115)కల్పాయనమః= వేదాంగవీధి స్వరూపుడవగు నీకు నమ:. (116)క్షయాయ నమః= మహాప్రళయ స్వరూపుడవగు నీకు నమ:. (117)ఉపక్షయాయ నమః= అవాంతర ప్రళయ స్వరూపుడవగునీకు నమ:. (118)భీమదుందుభిహాసాయ నమః= భయంకరమైన బేరి ధ్వనివంటి నవ్వుగల నీకు నమ:. (119)భీమసేన ప్రియాయ నమః= భీమసేన ప్రియుడవైన నీకు నమః-199. (120) ఉగ్రాయ నమః= భయంకర స్వరూపుడవగు నీకు నమ:. (120)దశబాహవే నమః= పది చేతులు గల నీకు నమ:. (122)కపాలహస్తాయ నమః= మనిషి పుట్టె చేతియందు గల నీకు నమ:. (123)చితా భస్మప్రియాయనమః= కాటి బూడిద యిష్టమైన నీకు నమః.
201 (124)విభీషణాయ నమః= నిర్భయునకు నీకు నమ: (125) భీష్మాయనమః= భయంకరుడవగు నీకు నమః (126)భీష్మవ్రత ధరాయ నమః= భయంకరములైన నిరాహారాది వ్రతముల ధరించిన నీకు నమ:. (127) వికృతవక్షాయ నమః= విశాలముగా చేయబడిన వక్షస్థలముగల నీకు నమ:. (128) ఖడ్గజిహ్వాగ్ర దంష్ట్రిణే నమః= ఖడ్గమువంటి నాలుకయు కోరలను గల నీకు నమః.
(129) పక్వాయ మాంసలుబ్దాయ నమః= యజ్ఞమున పక్వమైన, శ్మశానమున ఆమమై (అపక్వమైన) మాంసముల యందాసక్తి గల నీకు నమ:. (130)తుంబవీణా ప్రియాయ నమః ఎండిన సొరకాయతో చేసిన వీణ నిష్టపడు నీకు నమ: (131)వృషాయనమః= వృష్టికర్తవగు నీకు నమ:. (132)వృష్యాయ నమః= ధర్మవృద్దికర్తయగు. నీకు నమః. (133)వృష్ణయే నమః= యాదవ కృష్ణస్వరూపునకు నీకు నమ:. (134)వృషణాయనమః= విశ్వప్రాణి తేజోరూపమయిన రేతస్సును వర్షించు నీకు నమః-202. (135) కటింకటాయనమః= వాయ్వాది రూపమున నిత్యము గమనశీలుడవగు నీకు నమస్కారము. (136)చండాయ నమః= మిక్కిలి కోపియైన నీకు నమస్కారము. (137)సావయవాయ నమః= అవయవములుగల యవయవి స్వరూపుడవగు నీకు నమస్కారము. (138)వరకృష్ణాయ నమః= పుత్రవరదానాదులవలన కృష్ణుడెవని వలన వరుడుగా జేయబడెనో వరః శ్రేష్ఠః కృష్ణం యస్మాత్స:) అట్టి పరమేశ్వరునకు నీకు నమస్కారము. (139)వరాయ నమః= వర స్వరూపుడవగు నీకు నమస్కారము (140)వరదాయ నమః= ఈప్సితవరస్వరూపుడవగు నిన్ను భక్తులకు స్వాత్మగా నిచ్చు నీకు నమస్కారము (141)వరగంధమాల్య వస్త్రాయనమః= ఇష్టమై శ్రేష్టములైన పుష్పమాలలు వస్త్రములును గల నీకు నమః (142)వరాతివరయే నమః= కోరిన దానికన్న నధికముగ నిచ్చునీకు నమ:. (143)వర్షాయ నమః= వర్ష స్వరూపుడవగు నీకు నమ:. (144)వాతాయ నమః= వాయు స్వరూపుడవగు నీకు నమ:. (145)ఛాయాయై నమః= నీడరూపుడవైన నీకు నమ:. (146)ఆతపాయనమః= ఎండరూపుడవైన నీకు నమః-204. (147) రక్త విరక్తాయ నమః= రాగవిరాగో భయాత్మకుడవగు నీకు నమ:. (148)శోభనాయ నమః= సుందరస్వరూపుడవగు నీకు నమ:. (149)అక్షమాలినే నమః= అకారాదిక్షకారాన వర్ణమాలారూపమైన జపమాలగల నీకు నమ:. (150)సంభిన్నాయనమః= కారణ రూపముననంతట వెన్నంటియున్న నీకు నమ:. (151)విభిన్నాయనమః కార్యరూపమున వేరైన ఆవరింపబడిన రూపము గల నీకు నమ:. (152)వివిక్త వికటాయ నమః= ఏకాంతముచే వక్రస్వభావము గల నీకు నమః-205. (153) అఘోరరూపరూపాయ నమః= అంతకంటే భయంకర రూపములేని శాంతరూపమైన యాకారముగల నీకు నమ:. (154)ఘోరఘారతరాయ నమః= భయంకరుడవును మిక్కిలి భయంకరుడవునైన నీకు నమ:. (155)శివాయ నమః= సజ్జన మనస్సులందుండు నీకు నమ: (156) శాస్త్రాతరాయ నమః= మనస్సంయమముగల నీకు నమః. (157)శాస్తతరాయ నమః= మిక్కిలి మనస్పంయముగల నీకు నమః-206. (158) ఏక పదే నమః= ఇతరులకు లేని మహిమతో ముఖ్యమైన పాదములు గల నీకు నమ:. (159)బహు నేత్రాయనమః= సర్వమును జూడగల బహు నేత్రములుగల నీకు నమ:. (160)ఏకశీ నమః= సర్వాత శయముతో సాటిలేని శిరస్సుగల నీకు నమ:. (161)కృద్ధాయ నమః= లుబ్దాయనమః అన్ని విధముల సర్వోత్తమముగా వృద్ధిచెందిన నీకు నమ:. (162) లజ్ఞాయ నమః= భక్తజన సుఖమును గోరు నీకు నమ: (163)సంవిభాగ ప్రియాయ నమః= సర్వసుఖ సాధనమైన చక్కని విభాగము నిష్టపడు నీకు నమః.
(164) పంచమాలార్చితాంగాయ నమః= రెండు పాదములు రెండు చేతులు ఒక శిరము ఐదు పుష్ప మాలలచే పై యేదంగములు పూజింపబడిన నీకు నమః (165)పాశుపతాయ నమః= పశుపతి యధిదైవతముగల యహ్రస్వరూపుడవగు. నీకు నమ:. (166) చండాయ నమః= తీవ్ర స్వరూపుడవైన నీకు నమ:. (167)ఘంటాయనమః= ఘంటస్వరూపుడవగు నీకు నమః. (168)ఘంటాజగ్గరండ్రిణే నమః= ఘంటచేత ఆవరింపబడిన చెవి రంధ్రములుగల నీకు నమ:. (169)సహస్ర శతఘంటాయనమః లక్ష ఘంటానాదములుగల నీకు నమ:. (170)ఘంటామాటా ప్రియాయనమః= ఘంట మాలలను ధరింప నిష్టపడు నీకు నమ:. (171) ప్రాణదండాయనమః= హృదయగత ప్రాణమే యోగదండముగాగల నీకు నమ:. (172) త్యాగాయనమః= కోరినవన్ని యిచ్చు త్యాగ స్వరూపునకు నమ:. (173)హిలిహిలాయ నమః= హిలిహిలాయని (సంతోషముననో మాంత్రికముగనో) పలుకు నీకు నమః-209. (274)హూంహూంకారాయనమః= దూషణునీ 'హూం' అను ప్రళయ హూంకారముతో జంట య వస్తీ క్షేత్రమున మహాకాళరూపమున వెలసిన నీకును, (అవన్త క్షేత్రమాహత్మ్యము) అణిమాద్య ష్వైశ్వర్యములతో గూడి హైమీ సహితుడవై సర్వవ్యాధి నివార కుడవైన నీకును నమస్కారము నొ= అణిమాద్యషైశ్వర్యయుత శివుని ఊమ్ హైమక బీజము పార్వతిని జెప్పునదీ సర్వవ్యాధి నివారణము (శ్రీ గరుడ తంత్రము). (275)పారాయ నమః= భూరాది లోకములకంటె పరమై శాంతమైన పరబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. (276)హూం హూంకార ప్రియాయ నమః= ఛిన్న మస్తాశక్తి ప్రియుడవైన నీకు నమస్కారము. (హూం= ఛిన్న మస్తా బీజము (మంత్ర సిద్ది) ఆకాశ రూపమున సర్వవ్యాపివైన శివుడవై పృధివియందంతట నెలకొని దుష్టులకు కాల రుద్రుడవై సర్వలక్ష్మిని జయము. నిచ్చు ఆకారమే ప్రియమైన నీకు నమస్కారము హ్ = శివ ఆకాశ బీజము ఊ= పృథివీ బీజము. మ్= కాలరుద్ర= (లక్ష్మీ) రమా బీజమై జయప్రదము (మంత్ర సిద్ధి). (277)శంభవే నమః= సుఖమును రక్షించియిచ్చు హరిహరస్వరూపునకు నమస్కారము. (శంభుః శివుడు విష్ణువు బ్రహ్మ గు.భా.ప్ర.). (278)నిత్యం గిరి వృక్షకలాయ నమః= ఎల్లప్పుడును పర్వతములకును వృక్షములకును కళాస్వరూపుడవైన నీకు నమస్కారము-210. (279)గర్భమాంస శృగాలాయ నమః= యజ్ఞేశ్వరుడవై వపామాంసమునందు లోభముగలవాడవైన నీకు నమస్కారము. (280)తారణాయనమః= యజ్ఞభోక్తృత్వముచే పాపమోచకుడవైన నీకు నమస్కారము. (284)తరాయ నమః= సంసారసాగరమును తరింపజేయు సాధనమైన నీకు నమస్కారము. (285)యణ్ణాధిపతయేనమః= యజ్ఞేశ్వరుడవైన నీకు నమస్కారము. (286)ద్రుతాయనమః= వేగ స్వరూపుడు కరిగిన రసస్వరూపుడును ఐన నీకు నమస్కారము. (287)ఉపద్రుతాయనమః= అనుకూల వేగవంతుడవైన నీకు నమస్కారము-211. (288) యజ్ఞవాహాయనమః= ఋత్విక్కులు మొదలగువాని రూపమున యజ్ఞనిర్వాహకుడవైన నీకు నమః దానాయనమః= హవిర్ధాన స్వరూపుడవైన నీకు నమస్కారము. (289)తప్యాయ నమః= సత్యమయుడవై తపోమయుడవైన నీకు నమస్కారము. (290)తపనాయనమః= సూర్య స్వరూపుడవై తపింప జేయువాడవైన రజోరూపుడవైన నీకు నమస్కారము. (291) తటాయనమః= సంసార సాగరమునకు తరస్వరూపుడవైన నీకు నమస్కారము. (292)భవ్యాయ నమః= క్షేమ స్వరూపుడవైన నీకు నమస్కారము. (293)తడితాం పతయే నమః= మెఱుపులకు పతియైన నీకు నమస్కారము-212.
అన్నదాయనమః= అన్నము నిచ్చువాడవగు నీకు నమస్కారము. (295)అన్నపతయే నమః= అన్నమునకు సర్వాధికారపతివైన నీకు నమస్కారము. (296)అన్నభవాయనమః= అన్నమువలన బుట్టిన మానవమనః స్వరూపుడవగు నీకు నమస్కారము (అన్నము సూక్ష్మరూపము మనస్సని ఛాం ఉప). (297) సహస్ర శీర్షే నమః= అనంత శిరస్సులుగల దివ్య పురుష స్వరూపుడవగు నీకు నమస్కారము. (298)సహస్రచరణాయ నమః= అనంత పాదములు గల దివ్య పురుషోత్తమ స్వరూపుడవగు నీకు నమస్కారము-213. (299) సహస్రాద్యత శూలాయనమః= అనంత శూలముల నెత్తి ధరించిన యనంత హస్తములు గల దివ్య పురుషోత్తమ స్వరూపుడవగు నీకు నమస్కారము. (300)సహస్ర నయనాయనమః= అనంతములయిన కన్నులు గల దివ్య స్వరూపుడవగు నీకు నమస్కారము. (301)బాలరూపాయనమః= బాలస్వరూపుడవగు నీకు నమస్కారము. (302)బాలరూపధరాయ నమః= బాలుడగు కృష్ణాది దివ్యరూముల ధరించినవాడవగు నీకు నమస్కారము-214. (303)బాలానాం చైవ గోత్రే నమః= బాలురనుగూడ రక్షించు కృష్ణుడవైనట్టి నీకు నమస్కారరము. (304)బాల క్రీడన కాయనమః= బాలభక్తులకు లింగ రూపమున క్రీడా స్వరూపమైన నీకు నమస్కారము. (305)శుద్ధాయనమః= ఏ కల్మషములేని శుద్ధ స్వరూపుడవగు నీకు నమస్కారము. (306)బుద్దాయనమః= ఆత్మజ్ఞానిస్వరూపుడవైన నీకు నమస్కారము. (307)క్షోభణాయ నమః= శత్రువులను క్షోభింపజేయువాడవైన నీకు నమస్కారము. (308)క్షతాయనమః= దుష్టులకు దెబ్బవంటి వాడవైన నీకు నమస్కారము 215. (309) తరంగాంకిత కేశాయ నమః= గంగాతరంగములతో నొప్పిన తల వెంట్రుకలుగల నీకు నమస్కారము. (310)ముక్తకేశాయ నమః= ఆకాశగంగను జటాబద్దము జేయుటకై విరబోసిన తల వెంట్రుకలు గల నీకు నమస్కారము. (311) షట్కర్మనిష్ణాయ నమః= యజ్ఞము జేయుట- యజ్ఞమును జేయించుట వేద శాస్త్రాదులను జదువుట వానిని జదివించుట దానము ధర్మములు చేయుట దానము స్వీకరించుట అను నీ యాజు కర్మలయందుండు వాడవగునీకు నమస్కారము. (312)త్రికర్మనిరతాయ నమః= యజన- అధ్యయన దానకర్మలందు మిక్కిలి యాసక్తిగల నీకు నమస్కారము-216. (313) వర్ణాశ్రమాణాం విధివత్ పృథక్కర్మ ప్రవర్తినే నమః బ్రాహ్మణాది వర్ణములకును బ్రహ్మచర్యాది. ఆశ్రమములకును శాస్త్రీయముగను వేరువేరుగను తగిన ధార్మిక కర్మలను ప్రవర్తిల్లజేయు నీకు నమస్కారము. (314)ఫష్యాయనమః= నాదముచే ధ్వనింపదగిన నీకు నమస్కారము. (316) కలకలాయనమః= కోలాహల స్వరూపుడవగు నీకు నమస్కారము-217. (317)శ్వేత పింగళ నేత్రాయనమః= ఎఱుపును గోరోచన వర్ణమును గలిగిన కన్నులుగల నీకు నమస్కారము. (318)కృష్ణరక్తీక్షణాయ నమః= నలుపు ఎఱుపుగల చూపులు గలవానికి నీకు నమస్కారము. (319)ధర్మార్థ కామమోక్షాయ నమః= నాలుగు విధములగు ధర్మాది పురుషార్థముల స్వరూపముగల నీకు నమస్కారము. (320)క్రభాయనమః= శత్రువులకు హింసా స్వరూపుడవగు నీకు నమస్కారము. (321) క్రధనాయనమః= శత్రువులను హింసించునట్టి నీకు నమస్కారము.
(322)సాంఖ్యాయ నమః= నిరీశ్వరవాదియై సాంఖ్యసిద్ధాన్తవర్తకుడైన కపిలముని స్వరూపుడవగు నీకు నమస్కారము. (323)సాంఖ్యము ఖ్యాయ నమః= సేశ్వర పాతంజల స్వరూపుడవగు నీకు నమస్కాము. సాంఖ్యమన వేదాన్తవిచారము వేదాంత విచార విచారముఖ్య స్వరూపుడు పరమేశ్వరుడని భావము. (324)యోగాధిపతయే నమః= పాతంజల యోగమునకు అధిపతుడవైన నీకు నమస్కారము. నిధిద్యాసనరూపమైన యోగమునకు అనుగ్రహద్వారా వీనియందు సర్వ ప్రవర్తకుడవగు నీకు నమస్కారము. (325)రథ్యవిరణ్యాయ నమః= రథమునకు రథభిన్నమునకును తగినవాడవగు నీకు నమస్కారము. రథమార్గమందును రథభిన్నములైన యశ్వాది మార్గములందును ప్రవీణుడని భావము. (326)చతుష్పథరతాయ నమః= జల- అగ్ని-వాయు- ఆకాశ మార్గముల సంచరించుటలో మిక్కిలి యాసక్తి గల నీకు నమస్కారము-218. (327)కృష్ణాజినోత్తరీ యాయనమః కృష్ణ మృగచర్మము ఉత్తరీయముగా ధరించిన నీకు నమస్కారము. (328)వ్యాళయజ్ఞోపవీతినే నమః= సర్పము యజ్ఞోపవీతము (జందెము)గాగల నీకు నమస్కారము. (329) ఈశానాయ నమః సర్వప్రాణులకీశ్వరుడవైన నీకు నమస్కారము. (330) వజ్రసంహాయ నమః= వజ్రశరీరముగల నీకు నమస్కారము. (331)హరికేశాయ నమః గోరోచన వర్ణముగల వెంట్రుకలు గల నీకు నమస్కారము. (332)అవివేకైకనాథాయ నమః= అజ్ఞానులకు జ్ఞానాతీతులకును ముఖ్య ప్రభువైన నీకు నమస్కారము. (333)వ్యక్తా వ్యక్తాయ నమః= కార్యరూపుడవును కారణరూపుడవగు నీకు నమస్కారము-220. (334)కామాయ నమః= కామరూపుడవగు నీకు నమస్కారము. (335)కామదాయ నమః= కోరిన కోరికలనిచ్చు నీకు నమస్కారము. (336)కామఘ్నాయ నమః= కాముని సంహరించిన నీకు నమస్కారము. (337)ధృష్ణాయ నమః= దిట్టతనముగల నీకు నమస్కారము. (338)దృప్త నిషూదనాయ నమః= మదించినవానిని సంహరించు నీకు నమస్కారము. (339)సర్వాయ నమః= సర్వస్వరూపుడవైన నీకు నమస్కారము. (340)సర్వదాయ నమః= అన్ని యిచ్చు నీకు నమస్కారము. (341) సంధ్యారాగాయ నమః= సంధ్యాకాలమువల నెఱ్ఱనైన నీకు నమస్కారము-221. (342) మహాబలాయ నమః= మహాబలవంతుడవగు (మహాబలేశ్వరుడవగు) నీకు నమస్కారము. (343)మహాబాహవే= గొప్పబాహువులు గల నీకు నమస్కారము. (344) మహాసత్యాయ నమః= మహాప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కాము. (345)మహాద్యుతయే నమః= గొప్ప కాంతిగల నీకు నమస్కారము. (346)మహామేఘవర పేక్షాయ నమః గొప్ప మేఘశ్రేష్టునివలె నల్లనైన చూపులు గల నీకు నమస్కారము. (347)మహాకాలాయ నమః= ఉజ్జయినీ మహాకాల స్వరూపునకు నీకు నమస్కారము-222. (348)స్థూలాయనమః= మిక్కిలి లావైన యాకారముగల నీకు నమస్కారము. (349)జీర్ణాంగాయనమః= సన్నని యవయవములు గల నీకు నమస్కారము. (350)జటినేనమః= జటలుగల నీకు నమస్కారము. (351)వల్కలాజినధారిణే నమః= నారవస్త్రములు కృష్ణ మృగ చర్మములను ధరించిన,నీకు నమస్కారము (352)దీప్త సూర్యాగ్ని జటినే= మండుచున్న సూర్య అగ్నుల వంటి జటలుగల నీకు నమస్కారము. (353)వల్కలాజీనవాససే నమః= నార చీరలు కృష్ణ మృగచర్మములు వస్త్రములుగా గల నీకు నమస్కారము. (354)సహస్రసూర్య ప్రతిమాయనమః= వేయి సూర్యులతో సమానమైన నీకు నమస్కారము. (355)తపోనిత్యాయ నమః= నిత్యము తపముగల నీకు నమస్కారము 223. (356) ఉన్మాదనాయ నమః= వ్యామోహక స్వరూపుడవగు నీకు నమస్కారము. (357)శతావర్త గంగాతోయార జాయ నమః= నూరు పొరలికలు గల గంగా జలము గల సగము తల వెంట్రుకలు గల నీకు నమస్కారము. తక్కిన సగభాగము అర్థనారీశ్వరుడుగా పార్వతీ శిరోజములతో గంగ యుండదు. పార్వతి తన సవతి గంగను తన తలలో ధరింపదుగదా అని భావము. (358)చంద్రావర్తాయ నమః= చంద్రుని మాటిమాటికి తన శిరమున ద్రిప్పు నీకు నమస్కారము. (359)మేఘావర్తాయ నమః= మేఘములను కాల స్వరూపుడవై మాటిమాటికిని ద్రిప్పు నీకు నమస్కారము-224. (360) అన్నాయ నమః అన్న స్వరూపుడైన నీకు నమస్కారము. (361)అన్న కర్రే నమః= అన్నమును చేయు నీకు నమస్కారము. (362)అన్నదాయ నమః= అన్నమునిచ్చు నీకు నమస్కారము. (363) అన్నప్రస్టే నమః= అన్నమును సృష్టించు నీకు నమస్కారము. (364)అన్నపర్లే నమః= అన్నమును వండు నీకు నమస్కారము (365)పక్వభుక్తపచే నమః= వండి తినినయన్నము జీర్ణముచేయు జఠరాగ్ని రూపునకు నీకు నమస్కారము-225. (366) జరాయుజేనమః= మావితోబుట్టి స్వరూపుడవగు నీకు నమస్కారము. (367)అండజాయ నమః= అండమువల్ల బుట్టి ప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కారము. (368) స్వేదజాయ నమః= చెమటవలన బుట్టు ప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కారము (369) ఉద్భిజాయ నమః= భూమిని ఛేదించుకొని మొలకెత్తు ప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కారము. (370)దేవాయ నమః= సర్వదేవ స్వరూపుడవగు నీకు నమస్కారము. (371)దేవేశాయ నమః= ఇంద్రస్వరూపుడవగు నీకు నమస్కారము (372)చతుర్విధ భూత గ్రామాయ నమః= జరాయుజ అండజు స్వేదజ ఉద్భిజ్జ రూపములైన నాలుగు విధములైన ప్రాణుల యొక్క సమూహ స్వరూపునకు నీకు నమస్కారము-226. (373) చరాచర బ్రహ్మణే నమః= చరాచర ప్రపంచ సృష్టికర్తయైన బ్రహ్మవగు నీకు నమస్కారము (374)ప్రతిహర్రే నమః= ఆచరాచరమును ప్రతిహరించు నీకు నమస్కారము. (375)విదుషాం బ్రహ్మణే నమః= విద్వాంసులకు బ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. (376)బ్రహ్మవిదాం వరాయనమః బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవగు నీకు నమస్కారము-227. (377)సత్యస్య పరమయోనయే నమః= బలమునకు గాని సత్యగుణమునకు గాని మూలకారణ స్వరూపుడవగు నీకు నమస్కారము. (378) అబ్నిధయే నమః= నీటికి నిధానమైన నీకు నమస్కారము. (379)వాయు నిధయే నమః= వాయువునకు నిధివైన నీకు నమస్కారము. (380)జ్యోతిర్నీధయే నమః= తేజస్సునకు నిధివైన నీకు నమస్కారము. (381)రుగ్రూపాయనమః= ఋక్కుల స్వరూపముగల నీకు నమస్కారము. (382)సామరూపాయ నమః= సామముల (సామవేద మంత్రముల) స్వరూపముగల నీకు నమస్కారము. (383)ఓంకార రూపాయ నమః= ఓంకార స్వరూపుడవగు నీకు నమస్కారము-228. (384) హవిర్షావినే నమః= హవిసే (హోమము జేయు నేయి మొదలగునవి) విలాసముగా గల నీకు నమస్కారము. (386)హూవాం వాచాహుతయై నమః= హోమము జేయు పదార్థములకు వాగ్రూపమైన యాహుతివైన నీకు నమస్కారము. హవిర్హనీయనియు, హవోహావాయనియు, హూవావాచాహుతియనియు చేయు సామ గీతి స్వరూపునకు నీకు నమస్కారము. (387)సురశ్రేష్ణాయనమః= దేవతా శ్రేష్ఠుడవగు నీకు నమస్కారము. (388)బ్రహ్మవాదిభిః= సామభిర్గీయమానాయ నమ: వేదనాదులచేతను తత్య బ్రహ్మవాదులచేతను సామములచే గానము జేయబడుచున్న నీకు నమస్కారము-229. (389) యజుర్మయాయనమః= యజుర్వేదమంతయు నిండియున్న నీకు నమస్కారము. (390)ఋజ్మయాయ నమః= ఋగ్వేదమంతయు నిండిన నీకు నమస్కారము. (391)సామమయాయనమః= సామవేదమంతయు నిండియున్న నీకు నమస్కారము. (392)అధర్వమయాయనమః= అధర్వవేదమంతయు నిండియున్న నీకు నమస్కారము. (393) బ్రహ్మవిద్భిః= కలోని షదాంగణోః పఠ్యమానాయ నమః బ్రహ్మవేత్తలచే కల్పశాస్త్రముచేత ఉపనిషత్తుల సమూహము చేతను పఠింపబడుచున్న నీకు నమస్కారము.
బ్రాహ్మణాత్మనే నమః= బ్రాహ్మణ రూపుడవగు నీకు నమస్కారము. (395) క్షత్రియాత్మనే నమః= క్షత్రియస్వరూపుడవగు నీకు నమస్కారము. (396)వైశ్యాత్మనే నమః= వైశ్యస్వరూపుడవగు నీకు నమస్కారము. (397)శూద్రాత్మనే నమః= శూద్రాత్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. (398) వర్ణావరాత్మనే నమః= నాలుగు వర్ణములకన్న తక్కువైన వర్ణము సంకర (జాతి) కాత్మస్వరూపుడవగునీకు నమస్కారము. (399)మేఘసంఘాత్మనే నమః= సృష్టినిచ్చు మేఘసంఘ స్వరూపుడవగు నీకు నమస్కారము. (400)విశ్వస్మై నమః= విశ్వ స్వరూపుడవగు నీకు నమస్కారము. (401)స్తనితాయనమః= మేఘము యొక్క దివ్య శబ్దస్వరూపుడవగు నీకు నమస్కారము. (402)గర్జితాయనమః= మేఘ గర్జన స్వరూపుడవగు నీకు నమస్కారము. (402)గర్జితాయనమః= మేఘ గర్జన స్వరూపుడవగు నీకు నమస్కారము-231. (403)సంవత్సరాయనమః= కాలావయవమైన సంవత్సర స్వరూపుడవగు నీకు నమస్కారము. (404)ఋత్వాత్మనే షడృతు స్వరూపుడవగు నీకు నమస్కారము. (405)మాసాయ నమః= మాస స్వరూపుడవగు నీకు నమస్కారము (406)మాసార్దాయ నమః= పక్షస్వరూపుడవగు నీకు నమస్కారము. (407)కలాత్మనేనమః ముప్పది కాష్టల కాలావయవ స్వరూపుడవగు నీకు నమస్కారము. (408)కాష్టాత్మనేనమః= పదునెనిమిది కనురెప్పపాటు కాలావయవ స్వరూపుడవగు నీకు నమస్కారము (409)నివేషాత్మనే నమః= ఒక్కకనురెప్పపాటు కొలావయ స్వరూపునకు నీకు నమస్కారము. (410)నక్షత్రాత్మనే నమః= నాశములేక స్థిరమైన చుక్కల స్వరూపుడవగు నీకు నమస్కారము. (411)యుగాత్మనే నమః= కృతాదియగస్వరూపుడవగు నీకు నమస్కారము. (412)గ్రహాత్మనే నమః సూర్యాదినవగ్రహ స్వరూపుడవగు నీకు నమస్కారము-232. (413)వృషాణాం కకుదేనమః వృషభ ప్రధానుడైన నందీశ్వర స్వరూపునకు నీకు నమస్కారము. (414)గిరీణాం శిఖరాత్మనేనమః హిమాలయ పర్వతములలో సమస్త శిఖర స్వరూపుడవగు నీకు నమస్కారము. (415)మృగాణాం సింహాత్మనే నమః మృగరాజసింహ స్వరూపుడవగు నీకు నమస్కారము. (416)పతతాం తార్దాయనమః పక్షిరాజ గరుడ స్వరూపుడవగు నీకు నమస్కారము. (417)భోగినామనస్తాయ నమః సర్పరాజాది శేషస్వరూపుడవగు నీకు నమస్కారము-233. (418) ఉదధీనాం క్షీరోదాయ నమః సముద్ర శ్రేష్ట క్షీరసముద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము. (419)యంత్రాణాం ధనుషే నమః యంత్రశ్రేష్ఠ ధనుః స్వరూపుడవగు నీకు నమస్కారము. (420) ప్రహరణానాం వజ్రాయ నమః ఆయుధములలో వజ్రయాయుధ స్వరూపుడవగు నీకు నమస్కారము. (421)వ్రతానాం సత్యాయ నమః వ్రతములలో సత్యనారాయణ వ్రత స్వరూపుడవగు నీకు నమస్కారము. (423)ద్వేషాయనమః ద్వేష స్వరూపుడవగు నీకు నమస్కారము. (424)రాగాలు నమ: ప్రేమ స్వరూపుడవగు నీకు నమస్కారము. (425)మోహాయనమః మోహస్వరూపుడవగు నీకు నమస్కారము. (426)క్షామాయ నమః క్షమాస్వరూపుడవగు (సహనము) నీకు నమస్కారము (427)దమాయ నమః అనుచిత విషయముల బ్రవర్తించకుండునట్లు ఇంద్రియాదుల నణచు రూపమైన దమముయొక్క రూపమునందిన నీకు నమస్కారము. (428) శమాయ నమః సర్వేంద్రియ శాంత స్వరూపుడవగు నీకు నమస్కారము. (429)వ్యవసాయాయనమః పురుష ప్రయత్న స్వరూపుడవగు నీకు నమస్కారము. (430)ధృతయేనమః ఆత్మ స్థిరస్థితికారణమైన ధైర్యము నీ స్వరూపము అట్టి నీకు నమస్కారము. (431)లోభాయనమః సద్గుణలోభ స్వరూపుడవగు నీకు నమస్కారము (432)కామాయనమః కామస్వరూపుడవగు నీకు నమస్కారము. (433)క్రోధాయనమః కోప స్వరూపుడవగు నీకు నమస్కారము. (434)జయాయనమః సర్వజయ స్వరూపుడవగు నీకు నమస్కారము. (435)అజయాయనమః గదాధరుడవగు నీకు నమస్కారము. (437)శరిణేనమః శరములు బూనిన నీకు నమస్కారవ (438)చాపినే నమః ధనుర్ధారీవగు నీకు నమస్కారము. (439)ఖట్వాంగినేనమః మంచము ఆయుధముగా ధరించిన నీకు నమస్కారము. (440)ఝాఝరిణేనమః కైముడియను వాద్య విశేషమును చేత ధరించిన నీకు నమస్కారము. (441)ఛెత్రే నమః ఛేదించు (కోయు) నీకు నమస్కారము. (442)చేత్రేనమః ఛేదించు పగుల గొట్టు) నీకు నమస్కారము. (444)నేత్రేనమః సర్వజయమును గూర్చుచు నీ సారూప్యమునకు గొనిపోవు నీకు నమస్కారము. (445)అంతకాయనమః నీస్వాత్మలయమునకై భక్తులయైహిక జీవనమునంతమొందించు నీకు నమస్కారము-236. (446)దశలక్షణసంయుక్త ధర్మాయనమః హింసించకుండుట, సత్యము బలుకుట, దొంగిలించకుండుట, బ్రహ్మచర్యము, ఇతరుల నుండి దానము నేదియు స్వీకరింపకుండుట, అనేయైదు యమములు, శౌచము, సంతోషము తపము, స్వాధ్యాయము (వేదాదుల జదువుట), ఈశ్వర ప్రణిధానము (ఈశ్వర ధ్యానము) అను నీయైదు నీయమములు ఈ యోగోక్తములైన యీ పది లక్షణములతోగూడి యున్న ధర్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. లేదా మనువు జెప్పిన క్షమాసత్యాదులతో గూడినవాడనీ గూడ జెప్పవచ్చును. (447)దశల లక్షణ సంయుక్తార్థాయ నమః పై జెప్పిన పది లక్షణములు గల యర్థ (ధన) స్వరూపుడవగు నీకు నమస్కారము. (448)దశల లక్షణ సంయుక్త కామాయనమః పై విధముగ పది లక్షణములు గల కామ స్వరూపుడవగు నీకు నమస్కారము (449)ఇంద్రాయనమః ఇంద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము. (450)సముద్రాత్మనే నమః సముద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము. (451)సరిదాత్మనే నమః నదీ స్వరూపుడవగు నీకు నమస్కారము. (452)పల్వలాత్మనే నమః నదీ స్వరూపుడవగు నీకు నమస్కారము. (453)సరోరూపిణేనమః సరస్సుల రూపమునందిన నీకు నమస్కారము-237. (454)లతాత్మనే నమః సంభాదులను బట్టుకొను తీగరూపముననున్న నీకు నమస్కారము. (455)వల్ల్యాత్మనే నమః చుట్టుకొను తీగరూపమున నున్న నీకు నమస్కారము. (456)తృణాయనమః పశువుల మొదలగునవి తినదగిన గడ్డిరూపమున నున్న నీకు నమస్కారము. (457)ఓషధ్యాయ నమః ఫలపాకాంత జీవనముగల అరటి వరి గోధుమ జొన్న మొదలగు నోషధీవృక్ష స్వరూపుడవగు నీకు నమస్కారము. (458)పశ్యాత్మనేనమః పశు స్వరూపుడవగు నీకు నమస్కారము. (459)మృగాత్మనేనమః మృగస్వరూపుడవగు నీకు నమస్కారము (460)పక్షిణేనమః= పక్షి స్వరూపుడవగు నీకు నమస్కారము. (461)ద్రవ్యకర్మ గుణారంభాయనమః= పృథివ్యాదుల యొక్కయు, ఎత్తుల దించుట, ముడుచుట, చూచుట, నడచుట మొ. కర్మలయొక్కయు శబ్ద, స్పర్శ, రూప రస గంధాదిగుణముల యొక్కయు ప్రారంభకుడవైన నీకు నమస్కారము. (462)కాలాయనమః= కొల స్వరూపునకు నీకు నమస్కారము. (463)పుష్పఫల ప్రదాయనమః= సుగంధములై అత్యంత సమీప భవిష్యత్తు గలుగబోపు ఫలమును సూచించుచు పుష్పములను, తరువాత ఫలములను ఇచ్చు నీకు నమస్కారము-238. (464)ఆదయే నమః జగదాది స్వరూపునకు నీకు నమస్కారము. (465)అంతాయనమః= మహాప్రలయరూపమున జగదంత స్వరూపునకు నీకు నమస్కారము (466)మధ్యాయనమః= ప్రవృద్ధమైన జగన్మధ్య స్వరూపునకు నీకు నమస్కారము. (467)గాయత్ర్యం కారాయనమః= గాయత్రి మంత్రాత్మకుడవై ఓంకార స్వరూపుడవైన నీకు నమస్కారము. గాయత్రీ మంత్రమున భర్గ శబ్దము శివునే జెప్పును గదా. (468)హరితాయ నమః= ఆకుపచ్చని వర్ణముగల నీకు నమస్కారము (469)కృష్ణాయనమః= కృష్ణవర్ణుడవగు నీకు నమస్కారము. (471)నీలాయనమః= నీలవర్ణునకు నీకు నమస్కారము (472)పీతాయనమః= పసుపు వర్ణముగల నీకు నమస్కారము. (473)అరుణాయనమః= కొద్ది యెఱుపు వర్ణముగల నీకు నమస్కారము-239. (474)కద్రవేనమః= గోరోచనము వంటి వర్ణముగల నీకు నమస్కారము. (475)కపిలాయనమః= కపిల వర్ణముగల నీకు నమస్కారము. (476)కపోతాయనమః= బూడిద వర్ణముగల నీకు నమస్కారము. (477)మేచకాయనమః= నెమలిపురి వర్ణముగల గల నాకు నమస్కారము. (478)సువర్ణ రేతసేనమః= సువర్ణము రేతస్సుగాగల నీకు నమస్కారము. (479)విఖ్యాతాయ నమః= జగత్ర్పసిద్దుడవైన నీకు నమస్కారము. (480) సుపర్ణాయ నమః= గరుడ స్వరూపునకు నీకు నమస్కారము.
(481)సువర్ణ నామేనమః= సువర్ణము (తేజము) నామము (పేరు)గా గల నీకు నమస్కారము (482)సువర్ణ ప్రియాయ నమః= సువర్ణము తేజము ప్రియమైన వాడవగు నీకు నమస్కారము. (483) ఇంద్రాయనమః= ఇంద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము (484) యమాయ నమః= యమ స్వరూపుడవగు నీకు నమస్కారము. (485) వరుణాయనమః= వరుణ స్వరూపుడవగు నీకు నమస్కారము. (486) ధనదాయనమః= కుబేర స్వరూపుడవగు నీకు నమస్కారము. (ఇంద్రాదులు తూర్పు మొదలుకొని యుత్తరము వరకున్న నాలుగు దిక్కులకధిపతులు. వారి స్వరూపముననున్న వాడీశ్వరుడే యని భావము). (487)అనలాయనమః= అగ్ని స్వరూపుడవగు నీకు నమస్కారము-241. (488) ఉత్బుల్లాయనమః= వికసించిన (పుష్ప) స్వరూపము గల నీకు నమస్కారము. (489)చిత్రభానవే నమః= జ్ఞాన ప్రకాశము లైన యనేక విధములగు కిరణములు గల సూర్యుని స్వరూపముననున్న నీకు నమస్కారము (490)స్వర్భానవే నమః= స్వర్లోకమున భాసించు రాహుస్వరూపునకు నీకు నమస్కారము (481)హోత్రాయ నమః= హవిస్సు మొదలగునవి హోమము జేయబడు యజ్ఞాగ్ని హోత్ర స్వరూపుడవగు నీకు నమస్కారము (492)హోత్రేనమః= హోమము జేయు యజమాని స్వరూపుడవగు నీకు నమస్కారము. (493)హోమాయ నమః= హోమ స్వరూపుడవగు నీకు నమస్కారము. (494)హుతాయనమః= హోమము చేయబడిన ద్రవ్య స్వరూపుడవగు నీకు నమస్కారము. (495) ప్రహుతాయనమః= విశిష్టముగా హోమము చేయబడిన ద్రవ్య (సోమ) స్వరూపుడవగు నీకు నమస్కారము (496)ప్రభవేనమః= యజ్ఞఫలములనిచ్చు ప్రభుస్వరూపునకు నీకు నమస్కారము-242. (497)సుపర్ణాయనమః= మంచిరెక్కలుగల గరుడ స్వరూపుడవు మంచియాకులు గల వృక్షస్వరూపుడవుగాని యైన నీకు నమస్కారము. (498)బ్రహ్మణే నమః= పరబ్రహ్మ స్వరూపుడవు వేద స్వరూపుడవు నైన నీకు నమస్కారము. (499)యజుషాం శతరుద్రియాయనమః= యజుర్వేద యజుస్సులకు సంబంధించిన శత రుద్ర (నమక)మునందున్న నామ సమూహములు గల నీకు నమస్కారము. (500) పవిత్రాణాం పవిత్రాయనమః= పవిత్రులైన వారికెల్ల పవిత్రుడవైన నీకు నమస్కారము. (501)మంగళానాం మంగళాయ నమః= సర్వమంగళములకు మంగళ స్వరూపుడవగు నీకు నమస్కారము-243. (502)గిరయే నమః పర్వత స్వరూపునకు నీకు నమస్కారము. (503)స్తోకాయనమః= పర్వత సమూహ స్వరూపునకు నీకు నమస్కారము. (504)వృక్షాయ నమః= వృక్షస్వరూపునకు నీకు నమస్కారము. (505)జీవాయనమః= ఎల్లప్పుడు జీవించు జీవస్వరూపునకు నీకు స్వరూపునకు నీకు నమస్కారము. (506)పుర్గలాయనమః= పరమాణు స్వరూపునకు దేహ స్వరూపునకు నీకు నమస్కారము.(507)సత్యాయనమః= భూతభవిష్యద్వర్తమాన కాలత్రయముచే బాధింపనలవిగాని నట్టియు, వికారహేతువున్నను వికారము జెందనట్టియు నీకు నమస్కారము. (508) రజసే నమః= ప్రేరకమైన సక్రియమై దు:ఖ హేతువైన రజోగుణ స్వరూపుడవగు నీకు నమస్కారము. (ధూళి స్వరూపుడవైన నీకు నమస్కారము. (509)తమసే నమః= భారముగలదైన సత్యము నావరించునదై మోహింపజేయు. గుణమైన తమోగుణ స్వరూపునకు, చీకటి రూపునకు, నీకు నమస్కారము. (510)ప్రజననాయనమః= సంతానము గలుగజేయు నీకు నమస్కారము-244. (511)ప్రాణాయనమః= ప్రాణి హృదయమున నడుచు ప్రాణవాయు స్వరూపునకు నీకు నమస్కారము. (512)అపానాయనమః= గుదస్థానమందుండి యశుద్దమును వెడలజేయు నపాన వాయు స్వరూపునకు నీకు నమస్కారము. (513)సమానాయనమః= కంఠమున నుండి వాగాదులను వెలువరింపజేయు నీకు నమస్కారము. (515)వ్యానాయనమః= సమస్త శరీరమున నుండి శరీరమునంతయు సచేతనముగ జేయు నీకు నమస్కారము. (516)ఉన్మేషాయనమః= నేత్రముల విప్పారచేయు కూర్మవాయు స్వరూపుడవగు నీకు నమస్కారము. (517)నిమేషాయనమః= కన్నులుమూయజేయ వాయు స్వరూపుడవగు నీకు నమస్కారము. (518)జృంభితాయనమః= ఆవులింత గలుగచేయు దేవదత్త వాయు స్వరూపునకు నీకు నమస్కారము. క్షుతాయనమః= తుమ్మును గలుగజేయు క్రుకరవాయు రూపునకు నీకు నమస్కారము. మ.భా. పాఠము-245. (519)లోహితాంగాయనమః= ఎజ్జుని శరీరము గల నీకు నమస్కారము, (520)గదినేనమః= గదాధరునకు నీకు నమస్కారము. (521)దంష్టిణే నమః= కోరలుగలిగిన నీకు నమస్కారము. (522)మహావక్రాయ నమః= విశాలమైన గొప్పనోరు గలిగిన నీకు నమస్కారము. (523)మహోదరాయనమః= గొప్పకడుపు గలిగిన నీకు నమస్కారము. (524) శుచిరోప్లేనమః= పవిత్రమైన వెంట్రుకలు గల నీకు నమస్కారము. (525)హరిచ్చశ్రవేనమః= పచ్చని మీసములు గలిగిన నీకు నమస్కారము. (526) ఊర్థ్వకేశాయనమః= పైకి ఆకాశమునకు ఎగసిన తల వెంట్రుకలు గలిగిన నీకు నమస్కారము. (527)త్రిలోచనాయనమః= మూడు కన్నులు గలిగిన నీకు నమస్కారము. (528) గీతావాదిత్ర, నృత్యాంగాయనమః= గీతము వాద్యము నృత్యము వీనికి దగిన దేహముగల నీకు నమస్కారము. (529)గీతవాదనక ప్రియాయనమః= గీతములు వాద్యములును ఇష్టమైన నీకు నమస్కారము. (530)మత్స్యాయనమః=, మత్స్యవంటి జీవస్వరూపుడవైన నీకు నమస్కారము. (531)జలినేనమః= జలమువంటి సంసారము గలిగిన నీకు నమస్కారము. (532)జలాయనమః= జలమువంటి సంసారస్వరూపునకు నీకు నమస్కారము. (533)జల్యాయనమః= జలాభిషేక యోగ్య (లింగ) స్వరూపునకు నీకు నమస్కారము. (534) జవాయనమః= వేగ స్వరూపునకు నీకు నమస్కారము. (535)కాలాయనమః= కాల స్వరూపునకు నీకు నమస్కారము. (536)కలినేనమః= ధరణరూపమైన ధర్మమున ధరించిన నీకు నమస్కారము. (కలనం= ధరణం) (537)కలాయనమః= ధర్మ స్వరూపునకు నీకు నమస్కారము-247. (538)వికారాయనమః=.విగతమైన కాలస్వరూపునకు నీకు నమస్కారము (539)సుకొలాయనమః= మంచికాలము యొక్క రూపముననున్న నీకు నమస్కారము (539) దుష్కాలాయనమః= చెడు కాలముయొక్క స్వరూపమున నున్న నీకు నమస్కారము (541)క(కా)లనాశనాయనమః= బంధ హేతువైన ధర్మమును, కాలమును నశింపజేయు నీకు నమస్కారము. (542)మృత్యువే నమః= జీవులకు మృత్యుస్వరూపుడవైన నీకు నమస్కారము. (543)క్షయాయనమః= విశ్వక్షయ స్వరూపునకు నీకు నమస్కారము. (534)అంతాయ నమః= విశ్వాంత స్వరూపునకు నీకు నమస్కారము. (545)క్షమాకరాయ నమః= భక్తులను క్షమించు నీకు నమస్కారము. (546)అపాయకరాయ నమః= అపాయమును గలుగజేయు నీకు నమస్కారము (547) హరాయ నమః= భక్తుల పాపముల హరించు నీకు నమస్కారము-248. (548)సంవర్తకాయ నమః= ప్రళయకారక స్వరూపునకు నీకు నమస్కారము. (549)అన్తకాయ నమః= సర్వమునంతమొనరించు నీకు నమస్కారము. (550)సంవర్తక బలాహకాయ నమః= ప్రళయకాల మేఘ స్వరూపునకు నీకు నమస్కారము. (551)ఘటాయనమః= ఇష్టరూపమున భక్తులకు ఘటించు నీకు నమస్కారము. (552)ఘటికాయనమః= జనులకు కర్మఫలములను ఘటింపజేయు నీకు నమస్కారము (553)ఘంటికాయనమః= వాద్యఘంట గలిగియున్న నీకు నమస్కారము. (554)చూడాలోలాయ నమః= జటాజూటముతో ప్రకాశించు నీకు నమస్కారము. (555)బలాయ నమః= సర్వబల సంపన్నునకు నీకు నమస్కారము. (556)అబలాయ నమః= బలాతీతుడవగు నీకు నమస్కారము-249. (557)బ్రహ్మకొలాయనమః= బ్రహ్మయొక్క కాలముగల నీకు నమస్కారము (558) అగ్ని వజ్రాయ నమః= యజ్ఞస్వరూపుడవై యగ్నియే ముఖముగా గల నీకు నమస్కారము. (559)దండినే నమః= దండధారి (పార్వతీ తపః పరీక్షలో కపటవటు దండధారివైన నీకు నమస్కారము. (560)ముండినే నమః= పరమహంస స్వరూపునకే నీకు నమస్కారము. (561)దండధృగ్రూపాయనమః= అపరాధ శిక్షారూప దండధారివగు నీకు నమస్కారము (562)చతుర్యుగాయ నమః కృతాది చతుర్యుగ స్వరూపునకు నీకు నమస్కారము. (563)చతుర్వేదాయ నమః= ఋగ్వేదాది చతుర్వేద స్వరూపునకు నీకు నమస్కారము. (564)చతుర్దోత్రాయనమః= నలుగురు హోతలు కలిపి తీసికొన్న హవిస్ స్వరూపునకు నీకు నమస్కారము. (565)చుతుష్పథాయనమః= చతుష్పధ బ్రాహ్మణ వేదస్వరూపునకు నీకు నమస్కారము.
(565) చతురాశ్రమ వేత్రే నమః= బ్రహ్మచర్యగృహస్థ వానప్రస్థ (భిక్షు) సన్యాసములను నాలుగాశ్రమముల తత్యమును దెలిసిన నీకు నమస్కారము. (566)చాతుర్వర్ణ్య కరాయనమః= బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణములను లోక కల్యాణమునకై యేర్పరచిన నీకు నమస్కారము. (567)క్షరాక్షర ప్రియాయనమః= నశించుదానియందు ఇది యెట్లైనను నశించునదనియు వాస్తవికతను జూపకయు, ఇది నశింపనిదని దీనిని జూడనవసరంలేదని వాస్తవికతను జూపక క్షరమునందు ఉద్భవించు బుద్ధితోను అక్షరమునందు క్షరాపత్తి లేకుండునట్లు చూచుటతోను అవి తనకు ప్రియములైనట్లు చూచు నీకు నమస్కారము. (568)ధూర్తాయనమః= క్రూరులను వంచించు నీకు నమస్కారము. (569)అగణాయనమః=గణాతీతుడవైన నీకు నమస్కారము. (570)అగణ్యాయ నమః= లెక్కకు మించిన నీకు నమస్కారము. (571)గణాధిపాయనమః= ప్రమధ గణముల కధిపతియైన నీకు నమస్కారము-251. (572)రుద్రాక్షమాల్యాంబరధరాయనమః= రుద్రాక్షల యొక్క మాలలను, రుద్రాక్షయొక్క వస్త్రమును (కవచమును) ధరించిన నీకు నమస్కారము. (573)గిరికాయనమః= కషాయవర్ణము గలిగిన నీకు నమస్కారము. (574)గిరికప్రియాయనమః= కాషాయ వస్త్రములు ప్రియమైన నీకు నమస్కారము. (575)శిల్పీశాయ నమః= చిత్రముల వ్రాయుట చెక్కుట మొదలగు శిల్పకళ గల శిల్పుల కధిపతివైన నీకు నమస్కారము. (576)శిల్పినాం శ్రేష్ణాయనమః= విశ్వమను శిల్పమును సృష్టించు బ్రహ్మాదులలో శ్రేష్ఠుడవైన నీకు నమస్కారము. (577)సర్వ శిల్పప్రవర్తకాయ నమః= అన్ని శిల్పకళలను ప్రవర్తింపజేయు (నడపు) నీకు నమస్కారము-252. (578) భగనేత్రాంతకాయ నమః= దక్షాధ్వర ధ్వంసమున సూర్యుని నేత్రములను బెరికి వేసిన నీకు నమస్కారము. (579) చంద్రాయనమః= షోడశకళాత్మక చంద్రుని ధరించి చంద్రాత్ముడవైన నీకు నమస్కారము. (580)పూష్ణోదన్త వినాశనాయ నమః= దక్షాధ్వరధ్వంసమువలన సూర్యుని దంతముల బెరికి వేసిన నీకు నమస్కారము. (581)గూఢావర్తాయనమః= రహస్యమైన పరిభ్రమణము గల నీకు నమస్కారము. (582)గూఢాయనమః= అభేద్యమై రహస్యస్వరూపునకు నీకు నమస్కారము. (583) గూఢప్రతినిషేవిత్రే నమః= గూఢముగా, వాంఛిత ఫలదానముతో భక్తులను సేవించు నీకు నమస్కారము-253. (584)తరణాయనమః= సంసారమును తరింపజేయు నావవైన నీకు నమస్కారము. (585)తారకాయ నమః= ప్రణవ స్వరూపుడవైన నీకు నమస్కారము (586) సర్వభూతసుతారణాయ నమః= సర్వప్రాణులను సంసారము నుండి సులభముగా తరింజేయు నీకు నమస్కారము. (587)ధాత్రేనమః= ఆదికర్తయైన విష్ణువగు నీకు నమస్కారము. (588)విధాత్రే నమః= భౌతిక స్రష్టయైన చతుర్ముఖ స్వరూపునకు నీకు నమస్కారము. (589)సత్వానాం నిధాత్రే నమః= ప్రాణులను చక్కగా పాడుచు నుండజేయు నీకు నమస్కారము (590) ధారణాయనమః= సర్వాధిష్టాన భూత కారణాత్మరూపునకు నీకు నమస్కారము. (591) అధరాయనమః= నిన్ను ధరించువాడు లేనట్టి నీకు నమస్కారము. సర్వబాధావధిభూత శుద్దాత్మునకు నీకు నమస్కారము-254. (592) తపసేనమః= బ్రహ్మవిద్యాసాధనమైన తపోరూపునకు నమస్కారము. (593)బ్రహ్మణేనమః= వేద స్వరూపునకు బ్రహ్మ స్వరూపునకు నమస్కారము. (594)సత్యాయనమః= బ్రహ్మ విద్యాసాధనమైన సత్యరూపునకు నీకు నమస్కారము. (595)బ్రహ్మచర్యాయ నమః= బ్రహ్మ విద్యాసాధనమైన బ్రహ్మచర్య రూపునకు నమస్కారము. (596)ఆర్జవాయనమః= బ్రహ్మ విద్యాసాధనమైన ఋజుభావ (వంకర ప్రవర్తన లేక చక్కని ప్రవర్తన)ముగల నీకు నమస్కారము. (597)భూతాత్మనేనమః= జరాయుజ అండజ ఉద్భిజ్ఞములైన సర్వప్రాణులకు ఆత్మయైన నీకు నమస్కారము. (598)భూతకృతే నమః= ఆకాశ వాయు అగ్నిజల పృథివీ అను. పంచభూతముల బుట్టించు నీకు నమస్కారము. (599)భూతాయనమః= నిత్య సిద్దస్వరూపుడవగు నీకు నమస్కారము (600)భూతభవ్యభవోద్భవాయ నమః= భూతవర్తమాన భవిష్యత్ కాలములకు ఉత్పత్తి స్థానమైన యా శబల బ్రహ్మకు గూడ ఉత్పత్తి స్థానమైన నీకు నమస్కారము-255. (601)భూలోకాయనమః= భూలోక స్వరూపునకు నీకు నమస్కారము. (602)భువర్లోకాయనమః= భువర్లోక స్వరూపునకు నీకు నమస్కారము. (603)స్వర్లోకాయ నమః= "స్వర్లోకస్వరూపునకు నీకు నమస్కారము. (604)ఇతాయనమః= సర్వగత స్వరూపునకు నీకు నమస్కారము. (605) ఉత్పత్తయే నమః= సర్వమునకు ఉత్పత్తి స్వరూపుడవైన నీకు నమస్కారము. (606)మహేశ్వరాయనమః= ఇతరులైన బ్రహ్మాదులకంటెను గొప్పనైన నీకు నమస్కారము. (607) ఈశానాయనమః= సర్వభూతములకు సర్వాధిపతివైన నీకు నమస్కారము. (608) వీక్షణాయనమః= సర్వదేవతలకంటే విశిష్టమైన చూపుగల నీకు సాక్షివైన, నీకు నమస్కారము. (609)శాస్త్రాయనమః= శాన్తస్వరూపునకు నీకు నమస్కారము. (610)దుర్దాక్షాయనమః= దుష్టులను దమింపజేయు (అణుచు) నీకు నమస్కారము. (611)అదాననాశనాయ నమః= ఇంద్రియములకు వశవర్తుడై వానిని నశింపచేయు నీకు నమస్కారము-256. (612)బ్రహ్మావర్తాయనమః= నవబ్రహ్మలు నా వర్తింప (త్రిప్పు)చేయుకాల స్వరూపునకు నీకు నమస్కారము. (613)సురావర్తాయ నమః= దేవతలను (పుణ్యము క్షీణించగా) మర్త్యలోకమునకు చేర్చి భూస్వర్గములకు దీప్పు కాడవగు యజ్ఞపుణ్య ఫలవగుటచే నీకు నమస్కారము. (614)కామావర్తాయ నమః= సంసారమున బంధించి కోరికలలో మానవులను త్రిప్పు నీకు నమస్కారము (615) కామబింబని హర్రేనమః= కాముని యొక్క యాకరమును దహింపచేసిన నీకు నమస్కారము. (616) కర్ణికార రజః ప్రియాయ నమః= కొండగోగు పుప్పొడి ప్రియమైన నీకు నమస్కారము-257. (617)ముఖ చంద్రాయ నమః= చంద్రాభిన్న ముఖ స్వరూపుకనకు నీకు నమస్కారము (618)భీమముఖాయ నమః= భయంకరమైన ముఖము గల నీకు నమస్కాము. (619)సుముఖాయనమః= చక్కని మంగళకరమైన ముఖముగల నీకు నమస్కారము. (620)దుష్టులకు దుష్టమైన ముఖములు గల నీకు నమస్కారము (621)అముఖాయ నమః= ముఖముల కతీతుడవైన (హృదయ సన్నిహితుడవైన) నీకు నమస్కారము. (622) చతుర్ముఖాయ నమః= నాలుగు ముఖములుగల బ్రహ్మ స్వరూపమునకు నమస్కారము. (623)బహుముఖాయ నమః= ప్రాణులతోనేకమై యున్నందున అనేక ముఖములు గల నీకు నమస్కారము. (624)రణీసదా అభిముఖాయనమః= యుద్దమున నెల్లప్పుడు శత్రువులకెదురు ముఖముగలవాడై యుండు నీకు నమస్కారము-258. (625) హిరణ్యగర్భాయ నమః= తేజస్సు గర్భమున గల బ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. (626)శకునయేనమః= పక్షివలె భూసంగము లేక ఆకాశమున విహరించు నీకు నమస్కారము. (627)మహోదధయే నమః= మహా సముద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము. (628)పరాయనమః= అందరి కన్న మించిన నీకు నమస్కారము. (629)విరాజేనమః= విరాట్ స్వరూపునకు నమస్కారము. (సమష్టి స్థూల సూక్ష్మ కారణ శరీరోపహిత చైతన్య స్వరూపునకు నమస్కారము). (630)అధర్మహస్రనమః= అధర్మమును నశింపచేయు నీకు నమస్కారము. (631)మహాదండాయ నమః= గొప్పదండముగల నీకు నమస్కారము. (632)దండధారాయనమః= శిక్షాదండమును ధరించు నీకు నమస్కారము. (633)రణప్రియాయనమః= రణము ప్రియమైన నీకు నమస్కారము-259. (634)గోతమాయనమః= ఉత్తమ గో స్వరూపునకు నమస్కారము (గో–ఆవు) ఇంద్రియము, వాక్కు కావున గోశ్రేష్ఠ స్వరూపునకు నమస్కారమని భావము. ఉత్తమ వాక్ స్వరూపునకు నమస్కారము. (635)గోప్రతారాయనమః= గోవులను విషజలము నుండియు శిలావృష్టి నుండియు గోవర్ధన పర్వతము నెత్తుటచే వాని నాపద నుండి తరింపజేసిన శ్రీకృష్ణ స్వరూపునకు నీకు నమస్కారము (636)గోవృషేశ్వరవాహనాయనమః= గోవృషముల కీశ్వరుడవైన నందీశ్వరుడు వాహనముగా గలిగిన నీకు నమస్కారము (637)ధర్మకృతేనమః= ధర్మకర్తయైన నీకు నమస్కారము. (638)ధర్మసస్టేనమః= ధర్మమును సృష్టించి. (నిర్మించి)న నీకు నమస్కారము. (638)ధర్మాయనమః= ధర్మస్వరూపుడవగు నీకు నమస్కారము. (639)దర్మవిదేనమః= సత్యమైన ధర్మమును దెలిసిన నీకు నమస్కారము. (640)ఉత్తమాయనమః= అత్యంత మహోన్నత స్వరూపునకు నీకు నమస్కారము-260.
త్రైలోక్య గోత్రే నమః= ముల్లోకములను రక్షించు నీకు నమస్కారము. (642)గోవిందాయనమః= భూమిని గోవులను సువాక్కులను ఇంద్రియములను రక్షించు నీకు నమస్కారము. (643)మానదాయనమః= దుష్టుల దురభిమానమును ఖండించు నీకు నమస్కారము. (644)మానాయనమః= పూజింపదగిన చిత్త సమున్నతి స్వరూపునకు నీకు నమస్కారము. (645)తీష్ణతేనమః= యోగాసనమున గూర్చుండు నీకు నమస్కారము. (646)స్థిరాయనమః= కావుననే చలనము లేకుండు నీకు నమస్కారము. (647)స్థాణవే నమః= త్రైలోక్యధారణ స్తంభమైన నీకు నమస్కారము. (648)నిష్కంపాయనమః= ఏమాత్రము కదలికలులేని నీకు నమస్కారము. (649)కంపాయనమః= కాలానుగుణమైన భూకంపాది స్వరూపునకు నీకు నమస్కారము-261. (650)దుర్వారణాయనమః= మృత్యురూపమువచ్చి దుఃఖముతో అతికష్టముతో గూడ వారింపనలవిగానీ నీకు నమస్కారము. (651)దుర్విషదాయనమః= అమృత స్వరూపుడవై దుష్ట విషమునైనను హరించు నీకు నమస్కారము. (652)దుఃసహాయ నమః= యుద్దమున నెదిరించి సహింప నలవిగాని నీకు నమస్కారము. (653)దురతిక్రమాయమః= యుద్దమున నతి కష్టముననైనను శత్రువు మించి పోనలవి గాని నీకు నమస్కారము. (654)దుర్ధరాయ నమః= యుద్ధమున శత్రువులచే నతికష్టమున గూడ ధరింపనలవి గాని నీకు నమస్కారము. (655)దుష్టకంపాయ నమః= అతి కష్టమున గూడ శత్రువుచే భయపెట్టనలవిగాని నీకు నమస్కారము. (656)దుర్విదాయనమః= అతి దుఃఖముతో గూడ శౌర్యపరాక్రమాదులలో నింతయని తెలియనలవిగాని నీకు నమస్కారము. (657)దుర్జయాయనమః= దుష్ట ప్రక్రియలతో గూడ జయింపనలవిగాని నీకు నమస్కారము. (658)జయాయనమః= రణమున కేవల జయస్వరూపివగు నీకు నమస్కారము. (659)శశాయనమః= శీఘ్రగమనముగల కుందేలువగు నీకు నమస్కారము. (660)శశాంకాయనమః= శీఘ్రగమనముగాగల చంద్రస్వరూపుడవగు నీకు నమస్కారము. (661)శమనాయనమః= యమధర్మరాజు స్వరూపుడవగు నీకు నమస్కారము. (662)శీతోష్ణాయనమః= శీతస్వరూపుడవై దుష్టులకు ఉష్ణమైన యగ్ని స్వరూపుడవై యుభయ స్వరూపుడవైన నీకు నమస్కారము. (663)దుర్జరసేనమః= దుష్టులకు దుష్టమై తొందరలో మరణదాయియైన ముసలితనపు స్వరూపముగల నీకు నమస్కారము. (664) తృషే నమః= సంసారబద్ధులకు దప్పిక మరియు ఇచ్ఛా స్వరూపము దాల్చిన నీకు నమస్కారము. (665)ఆధయే నమః= మానసీ వ్యధారూపునకు నీకు నమస్కారము. (666)వ్యాధయే నమః= పొపులకు వ్యాధి స్వరూపునకు నీకు నమస్కారము. (667)వ్యాధి హస్తే నమః= భక్తసజ్జనులవ్యాధులను నశింపజేయు నీకు నమస్కారము. (668) వ్యాధిగాయ నమః= వ్యాధిని హెచ్చించుటకును తగ్గించుటకును వ్యాధిలోనంతర్గతుడుగా నున్న నీకు నమస్కారము-263. (669)సహ్యాయ నమః= ఆరోగ్య సుఖ స్వరూపుడవగు నీకు నమస్కారము. (670)యజ్ఞాయ నమః= యజ్ఞస్వరూపుడవగు నీకు నమస్కారము. (671)మృగవ్యాధి నమః= యజ్ఞ మృగమునకు వ్యాధుని వలే సంహరించు వాడవగు నీకు నమస్కాము. (672)వ్యాధనామాకరాయ నమః= వ్యాదులకు నిధలై దుష్టుల బాధించు నీకు నమస్కారము. (673)ఆకరాయ నమః= సద్భక్తులకు వ్యాధులను కలుగజేయని నీకు నమస్కారము. (674)శిఖండినే నమః= వ్యాధరూపమున నెమలి కను ధరించిన నీకు నమస్కారము. (675)పుండరీకాక్షాయ నమః= కమలముల వంటి నేత్రములు గలిగి విష్ణుస్వరూపుడవైన నీకు నమస్కారము. (676)పుండరీకావలోకనాయ నమః= కమల నేత్రములు గల నీకు బెబ్బులి చూపులును గల నీకు నమస్కారము-264. (677)దండధరాయ నమః= యమస్వరూపునకు నీకు నమస్కారము. (678)సదండాయ నమః= కపటవటువై ఏలాశదండమును ధరించిన నీకు నమస్కారము. శ్మశానవాసియై కాలదండమును ధరించిన నీకు నమస్కారము. (679)దండముండ విభూషితాయ నమః= చేతిలో కాల దండముచేతను కొరిగిన తలచేతను లేక, కంఠమున తల పుట్టెల మాల చేతను అలంకరింపబడిన నీకు నమస్కారము. (680)విషషాయ నమః= కాలకూటవిషమును (సముద్ర మథనమున బుట్టిన దానిని) పానము చేసిన నీకు నమస్కారము. (681)అమృతపాయ నమః= కాలకూటవిషపానము జేసి దేవతలకై యమృతమును రక్షించిన నీకు నమస్కారము. (682)సురాపాయ నమః= తాత్త్యి కానందరసమును ద్రావు నీకు, రక్షంచు నీకు నమస్కారము. (683)క్షీరసమపాయ నమః= క్షీరము వంటి సోమరసమును ద్రావు నీకు నమస్కారము-265. (684)మధుపాయ నమః= తేనెను పానము జేయు నీకు నమస్కారము. (685) అజ్యపాయ నమః= హోమద్రవ్యమైన నేతిని ద్రావు నీకు నమస్కారము. (686) సర్వపాయ నమః= ప్రళయకాలమన సర్వము పానము చేయు నీకు నమస్కారము. (687)మహాబలాయ నమః= మహాబలేశ్వర స్వరూపునకు నీకు నమస్కారము. (688)వృషాశ్వవాహ్యాయ నమః= వేగమున అశ్వమువంటి వృషభముచే (ఆబోతుచే నందించే) మోయదగిన నీకు నమస్కారము. (689)వృషభాయ నమః= నందీశ్వర స్వరూపునకు నీకు నమస్కారము. (690)వృషభలోచనాయ నమః= కామముల వర్షించు కన్నులుగల నీకు వృషభముయొక్క కన్నులవలె విశాలములైన కన్నులుగల నీకు నమస్కారము-266. (691)వృషభాయ నమః= వర్షించునట్టి మేఘస్వరూపునకు నీకు నమస్కారము. (692)లోకానాం విఖ్యాతాయ నమః= లోకములకు విశిష్టముగా ప్రసిద్ధి చెందిన నీకు నమస్కారము. (693)లో కసత్కృతాయ నమః= లోకములచే సత్కరింపబడిన నీకు సమస్కారము. (694)చంద్రాదిత్యచక్షుష్కాయనమః= చంద్రసూర్యులు నేత్రములుగాగల నీకు నమస్కారము. (695)పితామహహృత్కాయ నమః= బ్రహ్మయే హృదయముగాగల నీకు నమస్కారము. (696)అగ్నియే నమః= అగ్ని స్వరూపునకు నీకు నమస్కారము. (697)అపాం స్వరూపాయనమః= జల స్వరూపునకు నీకు నమస్కారము. (698)దేవాయ నమః= దివ్యలీలల నోలలాడు నీకు నమస్కారము. (699)ధర్మకర్మ ప్రసాదితాయ నమః= ధర్మకర్మలచే నలంకరింపబడిన నీకు నమస్కారము-267. (700) బ్రాహ్మణ్యో వేద్యమహిమ్నే నమః= బ్రహ్మకు గూడ దెలియనలవిగాని మహిమగల నీకు నమస్కారము. (701)గోవిందస్యాప్యవేద్యమహిమ్నే నమః= ఉపనిషద్వాక్కులచే దెలియబడు గోవిందునకు గూడ దేలియనలవిగాని మహిమగల నీకు నమస్కారము. (702)పురాణ ఋషీణామప్యవేద్యమహిమ్నే నమః= పురాణఋషులకు. గూడ దెలియనలవిగాని మహిమగల నీకు నమస్కారము-268. (703) అదృశ్య సూక్ష్మమూర్తిభిః అస్మద్రక్షిత్రే నమః= చూడనలవిగాని సూక్ష్మమూర్తులచే మమ్ములను నీ పుత్రులనువలె రక్షించు నీకు నమస్కారము-269. (704) భవద్రక్ష్యాస్మ దక్షత్రే నమః= నీకు రక్షింపదగిన మమ్ముల రక్షించు నీకు నమస్కారము. (705) భక్తానుకంపినేనమః= భక్తుల దయదలంచు నీకు నమస్కారము. (706) భగవతే= సర్వైశ్వర్యముగల భగవంతునకు నీకు నమస్కారము.
పుంసాని కాని సహస్రాణి సమాహృత్య దుర్దశాయ నమః= వేలకొలది పురుషులను అజ్ఞానులను ఒక్కచో జేర్చి వారిని బాగుచేయుట కతికష్టదశనొందిన నీకు నమస్కారము. (708)సముద్రానే తిష్ఠతే ఏకస్మై నమః= కామముల చివరజేయ జ్ఞాన - జ్ఞాతృ భావ శూన్యుడగు నొక్కనిగా ప్రకాశించిన నీకు నమస్కారము. (సముద్రములు- కామములు). (709)నిత్యం మదోత్రే నమః= ఎల్లప్పుడు నన్ను రక్షించు నీకు నమస్కారము-271. (710)వినిధైః జితశ్వాసైః సత్యస్థ: సమదర్శిభిః స్వాత్మయోగేన దృశ్యమానాయ జ్యోతిషే నమః= నిద్ర వీడి ప్రాణాయామములచే శ్వాసను జయించి సత్యముతో సమదర్శనులైన వారిచే స్వాత్మయోగమున జూడబడుచున్న జ్యోతి స్వరూపుడవగు నీకు నమస్కారము. (711)యోగాత్మనే నమః= సాక్షాద్యోగ స్వరూపుడవగు నీకు నమస్కారము-272. (712)యుగాన్త సర్వభూత సంభక్షకాయనమః= యుగాన ప్రళయమున సర్వభూతములను చక్కగా దిను నీకు నమస్కారము. (713)తతో జలశాయినే నమః= ఆ తరువాత సముద్రజలమున శయనించిన విష్ణు స్వరూపునకు నీకు నమస్కారము-273. (714)రాహువదనే ప్రవిశ్యనిశి సోమగ్రసతే నమః= రాహు ముఖమున ప్రవేశించి చంద్రగ్రహణమును జేయు రాహుస్వరూడవగు నీకు నమస్కారము. (715)రాహువదనే ప్రవిశ్య దివి. అరంగ్రసతే నమః= రాహు ముఖమున ప్రవేశించి పగలు సూర్యుని గ్రహణముజేయు రాహుస్వరూపుడవగు నీకు నమస్కారము. (716)సోమ్నాయే నమః= సోమచంద్ర స్వరూపునకు నీకు అగ్ని స్వరూపునకు నీకు నమస్కారము-274. (718)సర్వదేహి దేహస్థాంగుష్ఠ మాత్ర పురుషాయనమః= సమస్త శరీరధారుల శరీరమందు బొటన వ్రేలియంతటి పురుషుని రూపమున నున్న నీకు నమస్కారము. (719)గర్భాదుత్పతితృస్వరూపాయ నమః= గర్భమునుండి పైకెగిరి వెలువడి స్వాహాకారమును బొందు రూపమున నున్న నీకు నమస్కారము. (720)గర్బాదధోభాగ గన స్వరూపాయ నమః= గర్భము నుండి క్రిందుగా వెలువడి స్వధను బొందు వారి రూపమున నున్న నీకు నమస్కారము-276. (721)ప్రాణినాం రోదన కారణాయనమః= ప్రాణులేడ్చుటకు కారణుడవైన నీకు నమస్కారము. (722)ప్రాణినాం రోదన ప్రేరకాయ నమః= ప్రాణులనెడ్పింపజేయు నీకు నమస్కారము. (723) ప్రాణినాం హర్షకారణాయనమః= ప్రాణులు సంతసించుటకు కారణమగు నీకు నమస్కారము. (724)ప్రాణినాం హర్షణ ప్రేరకాయనమః= ప్రాణులు ఇతరులను హర్షింపజేయుటకు ప్రేరకుడవైన నీకు నమస్కారము-277. (725)సముద్రగత ప్రాణి స్వరూపాయనమః= సముద్రమున నున్న ప్రాణుల స్వరూపుడనగు నీకు నమస్కారము. (726)నదీ దుర్గగత ప్రాణి స్వరూపాయనమః= నదీ దుర్గములనున్న ప్రాణు (రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము. (727)పర్వతగత స్వరూపాయనమః= పర్వతమున నున్న ప్రాణు(రుద్రల) స్వరూపుడవగు నీకు నమస్కారము (728)గుహాగత ప్రాణి స్వరూపాయనమః= గుహలోనున్న (రుద్రు)స్వరూపునకు నీకు నమస్కారము (729)వృక్షమూలగత ప్రాణి స్వరూపాయ నమః= వృక్షమూలమున నున్న ప్రాణు(రుద్రు)ల స్వరూపాయనమః= గోవుల కొట్టమున నున్న ప్రాణుల(రుద్రు) స్వరూపుడవగు నీకు నమస్కారము. (730)కాక్షారగహ గతప్రాణి స్వరూపాయ నమః= దట్టమైన యడవులనున్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము-278. (731)చతుష్పథగతప్రాణి స్వరూపాయ నమః= నాలుగు ద్రోవలు గలసినచోటవున్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము. (732)రథ్యాగతప్రాణి స్వరూపాయ నమః= రాజమార్గమున నున్న ప్రాణు (రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము (733)చత్వరగత ప్రాణి స్వరూపాయ నమః= అగ్నిహోత్ర గృహమున ముంగిలో నున్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము. (734)సభాగత ప్రాణి స్వరూపాయ నమః= సభలో నున్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము. (735)చంద్రార్క మధ్యగత వ్యక్తి స్వరూపాయ నమః= చంద్రసూర్యుల మధ్యనున్న (రుద్రుల) స్వరూపుడవగు నీకు నమస్కారము. (736)చంద్రార్క రశ్మిగత వ్యక్తి స్వరూపాయనమః= చంద్రసూర్యుల కిరణములలో నున్న (రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము-279. (737) రసాతల గత వ్యక్తి స్వరూపాయ నమః= పాతాళలోకముననున్న రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము. (738) రసాతలాతారంగత వ్యక్తి స్వరూపాయ నమః= పాతాళముకంటె నింకను లోతుగా వెళ్ళిన రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము. (739)సూక్ష్మగత వ్యక్తి స్వరూపాయ నమః= సూక్ష్మములలోనున్న రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము. (740)స్థూల గత వ్యక్తి స్వరూపాయ నమః= స్థూలములలో నున్న రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము. (741)కృశగత వ్యక్తి స్వరూపాయ నమః= కృశించి నీ వారిలోనున్న రుద్రుల స్వరూపముగల నీకు నమస్కారము (742)హ్రస్వగత వ్యక్తి స్వరూపాయ నమః= పొట్టిగానున్న వారిలో నున్న రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము.
సర్వస్మై తే నమః= అంతటనున్న దేవుడవగు నీకు నమస్కారము. (744)సర్వగాయ దేవాయ తే నమః= అంతటనున్న దేవుడవగు నీకు నమస్కారము. (745)సర్వభూతపతయే భవతే నమః= సర్వప్రాణులకు పతివైన నీకు నమస్కారము. (746) సర్వభూతాంతరాత్మనే నమః= సర్వప్రాణులయందరాత్మవైన నీకు నమస్కారము. కావున నీవు యజ్ఞమునకు బిలువబడలేదు-281. (747)వివిధ దక్షిణెః యజ్జి: ఇజ్యమానాయ తే నమః= అనేక విధ దక్షిణలు గల యజ్ఞములచే యజ్ఞముచేయ (యజ్ఞముచే పూజింపబడు నీకు నమస్కారము. (748)సర్వస్య కర్తె తే నమః= సమస్తమునకు కర్తయైన నీకు నమస్కారము. కావుననే నీవు ప్రత్యేకముగా నా యజ్ఞమునకు బిలువబడలేదు-282. (749) సంసూక్ష్మమాయా మోహకాయ. తే నమః= నీ సూక్ష్మమాయచే నన్ను మోహింపజేయు నీకు నమస్కారము. ఈ కారణము వలననే నీవు నా యజ్ఞమున బిలువబడలేదు-283. (750) శరణాగత ప్రసన్నాయ నమః= రక్షింపుమని వచ్చిన వారి ననుగ్రహించు నీకు నమస్కారము. (751)దేవదేవేశాయ నమః= దేవతల దేవతలకు ఈశ్వరుడవైన నీకు నమస్కారము. (752) మద్ధతయే తే నమః= నాకు గమ్యస్థానమై జ్ఞానస్వరూపుడవగు నీకు నమస్కారము. (753)మత్ర్పతిష్టాయ నమః= నా యొక్క ప్రతిష్టాత్మకుడవగు నీకు నమస్కారము. (754) మదేకైక గతయే నమః= నాకు వేరొక గతిలేని యొకే గతివైన నీకు నమస్కారము-284. దక్ష ప్రజాపతి యీ పై విధముగా మహాదేవుడగు శివుని స్తుతించి విరమించెను. (ఆగెను) భగవంతుడైన శివుడు గూడ మిక్కిలి సంతసించేను. తరువాత మరల దక్ష ప్రజాపతిని గూర్చి యిట్లు పలికెను.
ఓ దక్ష ఓ సువ్రత! ఈ నీ స్తుతి చేత నేను సంతుష్టుడనైతిని. ఇట పెక్కు మాటలు చెప్పనేల? నీవు నా సమీపమునకు చేరగలవు-286. త్రైలోక్యాధిపతియైన భవుడు వాక్యనైపుణ్యముతో తిరుగులేని విధముగాను ఓదార్పు రీతిలో నీ విధముగాననేను 287. ఓ దక్షా! - దక్షా! జరిగిన యజ్ఞ విఘ్నమును గూర్చి కోపింపవలదు. యజ్ఞమును ధ్వంసము జేయగల శక్తి నా కొక్కనికే గలదు. మరెవ్వరికిని లేదు. పూర్వము గూడ ఎవ్వరికీని యీ శక్తియున్నట్లు కనబడదు.
ఓ సువ్రతుడా! దక్షా! నానుండి బహుళమైన యీ వరమును గ్రహింపుము. ప్రసన్నముఖముగలవాడనై యేకాగ్రమైన చిత్తముతో వినుము-289. ఓ దక్షప్రజాపతీ! నా యనుగ్రహమున నీవు వేయి యశ్వమేధ యాగముల యొక్కయు, నూరు వాజపేయ యాగముల యొక్కయు ఫలములను పొందువాడవుగాగలవు-290. నేను, ఆఆంగములతో గూడిన వేదములను, సాంఖ్యములను యోగములను, సంపూర్ణముగా నుద్ధరించియు, దేవదానవులచేతగూడ చేయనలవిగాని విపులమైన తపమును జేసియు, సర్వపాపవిమోక్షణమై శుభమైన ఒక పాశుపతవ్రతమును బుట్టించితిని. (ఏర్పరచితిని). ఐదు విధములైన యర్థములతో (సద్యోజాతానికి పంచబ్రహ్మమంత్రములతో నాగ్నేయ భస్మనుగ్రహించి త్రియంబక మంత్రమున జలముతో దడిపి పూసుకొనుట) గూఢమైనది. ప్రాజ్ఞులను మించినవారిచే నిర్మింపబడినది. బ్రాహ్మణుడి వర్ణములచేతను బ్రహ్మచర్యాది ఆశ్రమములచేతను జేయబడినదై యొకచోట విపరీతమైనది.( విరుద్దమైనది) ఒకచోట సమమైనది. వేదార్థములచేతనే నిశ్చయింపబడినది. పశువులయొక్క (జీవులయొక్క) పాశమును,(అవిద్యా సాంసారికాది బంధమున) వదిలింపజేయునది ఓదక్షా నా చేత పాశుపతవ్రతము అన్ని యాశ్రమములవారికీని (సన్యాసులకు గూడ) నాచరణీయమైనదిగా ఈ పాశుపతవ్రతము నిర్మింపబడినది. శుద్దమైనది, సర్వపాపములను తొలగించునది-290,293. దీని నాచరించినందువలననే చక్కని యనంతమైన ఫలము గలుగునో యాఫలము ఓ మహాభాగ్యుడవైన దక్షా! నీకు గలుగు గాక, మానసికమైన జ్వరమును వదిలి పెట్టుము.
అపరిమిత పరాక్రమియైన మహాదేవుడీ విధముగా బలికి భార్యతోను తన పరివారముతోను దక్షున కదృశ్యుడయ్యెను 295. తరువాత భవుడు (శివుడు) బ్రహ్మచే యజ్ఞభాగమును పొంది, సర్వధర్మములు దెలిసినవాడై (యంతకు పూర్వము దక్షయజ్ఞము లేడియై రుద్రభయమున పరుగిడగా దానిని వెంబడించినపుడు రాలిన తన చమటబిందువు నుండి బుట్టిన జ్వరము యజ్ఞమును దహించివైచెను.) యా జ్వరమును సర్వప్రాణుల శాంతికై యచట అనేకవిధములుగా విభజించెను. ఆ విధము ఓ బ్రాహ్మణులారా! వినుడు.
ఏనుగలకు తలనొప్పి, పర్వతములకు శిలారుజము (శిలాజిత్తు అను ఖనిజము), నీటికి నాలిక (నాచువంటిది), పాములకు కుబుసము-297. ఎద్దులకు కుంటితనము కొలిరోగము, భూమికి చౌ డు, ఏనుగులకు (పశువులకు)గూడ కనుచూపు అడ్డుకొనుట-298, గుఱ్ఱములకు కంధరంధ్రములో మొలచిన మాంసఖండము, నెమళ్లకు పింఛములు రాలుట, కోకిలలకు కంటిరోగము, ఇవి ఒక్కటిగానున్న జ్వరము అనేక విధముగా విభజింపబడి యనేక స్థానములలో తన్నాశకముగానుంచబడినది అని మహాత్ములచే చెప్పబడినది-299. అన్ని మేకలకు ఒక విధమైన పిత్తము జ్వరము అని వినికిడి. అన్ని చిలుకలకును మంచు జ్వరమని చెప్పబడినది-300. మనుష్యులయందు మాత్రము ఓ సర్వజ్ఞుడా! ఈ జ్వరము మరణమున పుట్టుకలోను, ఈరెంటిమధ్యను ఎల్లప్పుడు ప్రవేశించునని చెప్పబడినది-301. ఈ జ్వరమనునది మిక్కిలి భయంకరమైన తేజము. ఇది సర్వప్రాణులకు ఈశ్వరుడుగా నమస్కరింపదగినది. గౌరవింపదగినది.
దీనమయిన మనస్సులేక, ఏకాగ్రచిత్తుడై యెవడు ఈజ్వరోత్పత్తిని జదువునో వాడు సర్వరోగ విముక్తుడై సంతోషముతో గూడి తాను గోరిన కోరికలను పొందును-303. దక్షుడు చెప్పిన యీస్తోత్రమును ఎవడు వినునో పఠించునో, వానికెట్టీ యశమును గలుగదు. దీర్ఘాయువునుగూడ బొందగలడు-304. సర్వదేవులలో యోగవంతుడై హరుడు వరిష్ఠుడైనట్లే యీ సహస్ర నామస్తుతియు అన్ని స్తుతులలో బ్రహ్మనిర్మితమైవరిష్ఠము-305. కీర్తి, రాజ్యసుఖైశ్వర్యములు, లాభముగా పొందబడిన విత్తము, ఆయువు, ధనము- వీనిని గోరువారికి శివుడే స్తుతిచే స్తోత్రము జేయదగినవాడు. విద్యను గోరినవారికి విశేషముగా భక్తితో నతి ప్రయత్నమున నీ స్తుతిచే స్తుతింపదగినవాడు-306. రోగము నందినవాడు, దుఃఖమునందినవాడు, దొంగలచే భయముజెందినవాడు, తక్కినభయములచే పీడింపబడినవాడు, రాజ్యకార్యనియుక్తుడైనవాడును మహాభయముచే విముక్తుడగును-307. ఈదేహముచేతనే వాడు గణములకు పతియగును. ఈలోకమున సుఖమును బొంది గణమునందేయుండును-308. ఏ గృహమున శివుడు స్తుతింపబడునో ఆగృహమున యక్షులు, పిశాచులు, నాగులు, వినాయకులను ఎట్టి విఘ్నములును జేయజాలరు-309, ఈ స్తుతిని భక్తితో బ్రహ్మచారిణియై విన్నగాని, చదివినగాని, స్త్రీ తనతండ్రి పక్షమువారిచేతను భర్త పక్షమువారిచేతను దేవునివలె పూజ్యురాలగును.
ఈ మొత్తము స్తోత్రము విన్నవారికిని మాటి మాటికి చెప్పినవారికిని వారి సమస్త కార్యములు నిర్విఘ్నముగా సిద్దించును 311. ఈ స్తోత్రమును పలువురితోబాటు చదవినచో మనస్సులోననుకొన్నదియు, మాటతో చెప్పినదియు సర్వమును సుసంపన్నమగును-312. కుమారస్వామితో గూడుకొనియున్న శివునియొక్కయు దేవియైన పార్వతియొక్కయు, వాహనమైన నందీశ్వరునియొక్కయు, నిగ్రహనియమములతో తనవైభవముకొలది పూజనుజేసి -313, ఏకాగ్రచిత్తమైన యోగమునందున్నవాడై వెంటనే వరసగా నీ నామములను (స్వీకరించి) పఠింపవలెను. అట్లు చేసిన మానవుడు కోరినకోరికలను సుఖములను పొందును. మరణించినపుడు వేలస్త్రీలతో జుట్టబడినవాడై స్వర్గమునందును-314. సాంసారిక సర్వకర్మలతో వదిలి పెట్టినంతగానంటి పెట్టుకొన్నను, సమస్త పాపములతో గూడియున్నను,దక్షుడు చేసిన యీస్తుతిని పఠించుచు నా పాపములనుండియు బంధములనుండియు పూర్తిగా విముక్తుడగును. మరణించినవాడై శివగణసాలోక్యమును (వారున్నలోకముననివసించుటను) పొందును. సురాసురులచే పూజింపబడును. ఇంద్రునివలే శాస్త్రవిధితో గూర్చిన విమానమున విరాజిల్లును. పంచభూతప్రలయము జరుగువరకు ఉండువాడై రుద్రునకు సేవకుడగును-316. అని ప్రభువైన పరాశరసుతుడైన వ్యాసుడనెను. దీనినెవ్వడు తెలియడు దీని నెవ్వరికిని (అయోగ్యునకు) వినిపించరాదు-317. పరమ రహస్యమైన యీస్తోత్రమును విని పాపకారులైన వైశ్యులు, స్త్రీలు, శూద్రులును రుద్రలోకమునందుదురు-318. బ్రాహ్మణుడీస్తోత్రమును ప్రతి పర్వములందు బ్రాహ్మణులకు వినిపించి రుద్రలోకమును బొందును. ఇందులో సందియము లేదు.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున దక్షశాపవర్ణనమను ముప్పదియవ యధ్యాయము.
