వాయు మహా పురాణము

Table of Contents

26 - స్వరోత్పత్తిర్నామ

సూతుడనెను:- ఓ మహామతియైన వాయుదేవా! నీవు చెప్పిన రహస్యములు లోకానుగ్రహకారణమున తత్యముననుసరించి యాశ్చర్యకరములు-1. శూలధారియైన శివుని యొక్క అవతారముల విషయమున నాకు సంశయము గలదు. మహాదేవుడైన శివుడు మిక్కిలి భయంకరమైన కలియుగమును బొంది పూర్వములైన యుగములను వదలి. యవతారమును బొంది పూర్వములైన యుగములను వదలి యవతారమును జేయుటలో (పరిగ్రహించుటలో) కారణమేమి? 2. ఓ ప్రభో ఈ వైవస్వత మన్వంతరము రాగా ఆ శివుడేవిధముగా అవతరించెనో తెలిసికొన గోరుచున్నాను-3. నీ కీలోకమున గాని పరలోకమునగాని తెలియని దేమియులేదు. భక్తులకుపదేశించుటకై యడుగుచున్నాను. ఓ ప్రాజ్ఞా! ఆ మహామతము (గొప్ప వారి కిష్టమైనది) మేము వినదగినచో చెప్పుము.

 లోమశుడనెను:- ఈ విధముగ నడుగ బడిన భగవంతుడు. లోకహితము జేయుటలో నాసక్తుడు, లోకములచే నమస్కరింపబడిన వాడు మహాతేజోవంతుడు నైన వాయువు ఇది పలికెను-5. ఓ గాధేయుడా! నీవునన్నడుగుచున్నది మిక్కిలి రహస్యమైనది. దాని నంతయు వరుసగా జెప్పెదను. వినుము-6. పూర్వమంతయు ఒకే సముద్రమైనది. దేవమానముతో వేయవర్షములు గడచినవి. అపుడు బ్రహ్మ ప్రజలను సృష్టింపగోరి దు:ఖితుడై చింతించెను-7. అట్లు చింతించునాతనికి ఒక కుమారుడు గలిగెను. ఆతడు దివ్యగంధము గలవాడై సుధను గోరినవాడై దివ్యమైన (శృతివేదము) ని ఉచ్చరించుచుండెను.8. శబ్దము, స్పర్శ, రూపము, గన్టము, రసము లేని యాశ్రుతి నుచ్చరించుచుండెను. దానిని దేవుడైన చతుర్ముఖుడు (బ్రహ్మ) తెలిసికొనెను-9.

తరువాత బ్రహ్మధ్యానయుక్తుడై భైరవుడైన శివుని మనస్సులో నిలిపి యీ మూడవవాడెవ్వడా యని చింతించెను-10. ఆ విధముగ చింతించునోతనికి శబ్ద-స్పర్శ-రూప-రస. గన్టములు లేని యొక యక్షరము ప్రాదుర్భవించెను-11. ఆ తరువాత నా బ్రహ్మలోకములలో నుత్తమమైన తన మూర్తిని గూడ జూచును. అపుడు ధ్యానము జేయుచు తరువాత నీతనిని గూడ మరల జూచును. ఆ యీతడు వర్ణమునందు (అక్షరమునందు) ఉన్నవాడు. తెల్లనివాడు, ఎఱ్ఱనివాడు, పచ్చనివాడు, నల్లనివాడు,స్త్రీ కాదు. పురుషుడును కాడు. ఈ విధమైన యీతని జూచును.

అదియంతయు చాలకాలము దెలిసికొని ఆ యక్షరమును చింతించు (ధ్యానించు చుండెను. ఆ విధముగా ధ్యానించుచున్న (బహ్మయొక్క కంఠమునుండి యా యక్షరము పైకి వెలువడెను-14. కేవలమొక్కమాత్ర గలది. గొప్ప ధ్వని గలది. తెల్లని వర్ణము గలది. చక్కగా నిర్మలమైనది. యైన యా ఓంకారం వేదమై యుండవలెను. నాశము లేని (అక్షరమైన మహేశ్వరుడే యైయుండును.

తరువాత యక్షరమును ధ్యానించుచున్న బ్రహ్మనుండి బుట్టిన రక్తము (యెట్టనివాడు) మొదటి దేవుడనబడెను. ఆతని మొదటి ఋగ్వేదము అగ్నిమీళే పురోహితమ్ (అను మంత్రము మొదటగలది) మహాతేజస్వియైన లోకకారకుడైన బ్రహ్మయీ ఋక్కును జూచి యాయక్షరమేమిటని ధ్యానించెను.

అట్లు ధ్యానము చేయుచున్న బ్రహ్మయొక్క యా యక్షరమునందు మహేశ్వరుడు రెండు మాత్రలు గల యక్షరముగా బుట్టెను. అది యీశ్వరుడు గలిగియుండుటచే మూడు మాత్రలు గలదైనది-18. తరువాత బ్రహ్మ మరల ద్విమాత్రమైన యక్షరమునే ధ్యానించెను. దాని (అక్షరముయొక్క) ఛేదనమునగలిగిన రక్తమును స్వీకరించి ఆయజుస్సు-19. “ఇషేత్వోర్జేత్వావాయవస్థ దేవో వః సవితా పునః” అనుమస్త్రము మొదట గలది జనించినది. తరువాయజుర్వేదమును ద్విమాత్రకమైన యక్షరమును జూచి, యీశ్వరుడైన బ్రహ్మ ద్విమాత్రకమైన యక్షరమును జాచి, యీశ్వరుడైన బ్రహ్మ ద్విమాత్రమైన యా యక్షరమును మరల ధ్యానించుచుండెను-20,21. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మకు ఓంకారము కలిగెను. తరువాత బ్రహ్మ ఆయక్షరమైన ఓంకారమును ధ్యానించెను-22. తరువాత బ్రహ్మ దానినుండి పైకి బయలుదేరిన పచ్చని ఋక్కును జూచెను. అది "అగ్న ఆయా హెవీతయే గృణానో హవ్యదాతయే" - అనునది.

తరువాత మహాతేజస్వియైన బ్రహ్మ ఆయక్షరమైన ఓంకారమును ప్రాత:సంధ్యలోను మధ్యాహ్న సంధ్యలోను సాయం సంధ్యలోను మూడు మారులు ధ్యానించి(తామంతటతాము) తనకు స్పురించిన వేదమును జూచెను. మూడు (అ..మ్) వర్ణములు గలది, ప్రాతః కాలమున, మధ్యాహ్నకాలమున, సాయంకాలమునను జేయు యజ్ఞ స్వరూపమైనదియు నైన ఓంకారము బ్రహ్మయని గుర్తింపబడినది-24. మూడింటి సంయోగమువలన త్రివర్ణమైనది యాయక్షరము లక్ష్యమై కనబడినదై, అలక్ష్యమై (కనబడనిదై) ప్రదృశ్యమై (చక్కగా నేక్కువగా గనబడినదై) బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కలిసి విహరించునదై (త్రిదివమై) మూడైది-25. మూడు మాత్రలు గలది. మూడు పదములు గలది. మూడు యోగములు గలదియై మాయక్షరము(20) శాశ్వతమైనది. కావుననే భువైన బ్రహ్మ యాయక్షరమును ధ్యానించేను-26. కావుననే యాయక్షరము, బ్రహ్మ బ్రహ్మయొక్క బ్రహ్మరూపము పదునాలుగు ముఖములు గల దేవునిగా జూచును. కావుననే బ్రహ్మయొక్క ముందు ఓంకారమును జేర్చి బ్రహ్మ తెలియబడును.

ఆ బ్రహ్మ ముఖమునుండి పదునాలుగైన వివిధ స్వర వర్ణములు (అఆఇఈఊఊఋ ఋలులూ, ఏఐ,ఓఔ) అను అచ్చులు) ద్వివ్యమై మొదటిదైన ఆ ఓంకారాక్షరమును బుట్టినవి. ఆ ముఖమునుండియే అకారమునుండి బుట్టినవి. అరువది మూడు (63) వర్ణములుగా జెప్పబడినవి.

తరువాత వర్ణముల యొక్క సాధారణార్థముకొఱకు బ్రహ్మనుండి మొట్టమొదట అకార రూపము నిలిచెను. అది మొదటి స్వరము (అచ్చు)-29. తరువాత మన్వన్తరమున ఆ స్వరములనుండి పదునాలుగు మహాముఖములుగల మనువులు దివ్యములైన స్వరములును బుట్టినవి-30. పదునాలుగు ముఖములుగల అ కారం బ్రహ్మ యను పేర బిలువ బడినది. అన్ని వర్ణములు గల ప్రజాపతి (బ్రహ్మ) బ్రహ్మకల్పముగా జెప్పబడెను-31. ఆతని మొదటి ముఖము నుండి స్వాయంభువ మనువు వచ్చినట్లు స్మరింపబడెను. ఆతడు బ్రహ్మ యొక్క తెల్లని వర్ణముగల వాడని తెలియవలె-32. ఆ బ్రహ్మ రెండవ ముఖమునుండి 'ఆ' కారము బుట్టినట్లు స్మరింపబడెను. అది పేరుతో స్వారోషమనువు రంగు తెలుపు-33. మూడవముఖము నుండి యజుస్సులకు శ్రేష్ఠమైన 'ఇ' కారం బుట్టినది. అదియజుయన ఆదిత్యుడు ఆతని నుండి యజుర్వేదము వచ్చి నట్లు స్మరింపబడినది-34. ఈ కారము రక్తవర్ణుడై ప్రతాపవంతుడైన మనువని తెలియవలెను. ఆతని నుండి క్షత్రియజాతి బయలు దేరెను. కావున క్షత్రియుడు రక్తవర్ణుడు-35. బ్రహ్మనాలుగవ ముఖము నుండి ఉకారస్వరము వచ్చినదనబడినది. దాని రంగు తామ్రము (రాగివర్ణము) కావున (దాని నుండి బుట్టిన) మనువుతామసుడనబడెను-36. బ్రహ్మ యైదవ ముఖము నుండి ఊకారమనునది బుట్టెను. రంగుతో అది పచ్చనిది (అందుబుట్టిన) మనువుగూడ చరిష్ణవుడు (అనువాడు)-37. తరువాత బ్రహ్మయారవముఖము నుండి ఓంకారము బుట్టినది. అది కపిల వర్ణము గలది యనబడినది. దానినుండి వరిష్టుడు మహాతపస్వియునైన విజయుడు బుట్టెను-38. బ్రహ్మయేడవ ముఖమునుండి ఋకార స్వరము వైవస్వత మనువును బుట్టిరి. అచట రంగు నలుపనబడినది-39. బ్రహ్మ యెనిమిదవ ముఖము నుండి ఋకారము బుట్టినది. రంగునలుపు, శ్యామాక్షరముతో సమర్థుడు (సమానమైన వర్ణము గలవాడు) అగుటచే దానినుండి సావర్ణి యను మనువు బుట్టి నట్లు చెప్పబడినది-40. బ్రహ్మతొమ్మిదవ ముఖమునుండి తొమ్మిదవ వర్ణమైన లుకారము బుట్టినది. దానిరంగు ధూమ్రవర్ణము అందుబుట్టిన మనువుగూడ దూముడనబడేను-41. బ్రహ్మపదియవముఖమునుండి ప్రభువైన 'ఇ' కారము బుట్టినది. దానినుండి సముడైన సవర్ణుడైన సావర్ణికుడను మనువు ప్రకాశించెను-42. బ్రహ్మపదునొకండవ ముఖమునుండి 'ఏ' కారము దానిరంగు పిశంగవర్ణము మనువు పిశంగుడు-43. బ్రహ్మ పెన్నేండవ ముఖమునుండి ఐ కారము అది పిశంగము భస్మముతో సమానమైనకాంతి గల పిశంగుడను వాడు మనువు (బుట్టిరి)-44. బ్రహ్మ పదమూడవ ముఖమునుండి ఓ కారము అది పంచవర్ల సమాయుక్తము (ఐదురంగులు గలది) ఉత్తమము-45. తరువాత బ్రహ్మయొక్క పదునాలుగవ ముఖము నుండి ఔకారము బుట్టినది. దీని వర్ణము కర్బూర (చిత్ర) వర్ణము సావర్ణి మనువు కల్పమును బట్టి ఈ వీరు మనువులు స్వరములు వాని రంగులును- అని స్వరమునుండియు వర్ణమునుండియు తత్త్యముననుసరించి తెలియవలెను-47. ఏ కారణమువలన పరస్పరము సవర్ణములైన వర్ణములు వరింపబడినవో ఆకారణమువలననే సవర్ణమగుట వలన అన్వయము చెప్పబడినది-48. కల్పమున బుట్టినవి సవర్ణములును సమానములును అయినందున ఈ లోకమున సర్వసంధులు సవర్ణములగును-49. న్యాయమునుబట్టియు అర్థమును బట్టియు వర్ణములు శిలల సమూహమువలె (యథాశైలం) ఏకము అగును. అందువలననే అభ్యాసమును బట్టి సంధులు (వర్ణసంధులు) గూడ స్వరము లేయని తెలియవలెను.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున స్వరోత్పత్తి యను నిరువది యారవయధ్యాయము.