వాయు మహా పురాణము

Table of Contents

58 - చతుర్యుగాఖ్యానం  

సూతుడనెను:- ఆ తరువాత మరల ద్వాపరయుగము యొక్క విధిని జెప్పెదను. అచట త్రేతాయుగము క్షీణింపగా ద్వాపరయుగము వచ్చును, ద్వాపరయుగ ప్రారంభమున, ప్రజలకు త్రేతాయుగము నందున్న సిద్ది, యుము మారుట వలన నశించును-2. తరువాత ద్వాపరమునందు ప్రజలకు లోభము, అధైర్యము, (వ్యాపార) వైశ్యయుద్దము, త్యముల అవినిశ్చయము వర్ణముల సాంకర్యము, కార్యముల నిర్ణములేమి, యజౌషధియైన పశువునకు దండము, మదము, దంభము, ఓపిక లేమి బలమువీనియొక్క రజస్తమోగుణములతో గూడిన ప్రవృత్తి ద్వాపరయుగమున జెప్పబడినది, మొదటి కృతయుమున ధర్మముండును. త్రేతాయుగమున నది చక్కగా ప్రైవర్తిల్లును. ద్వాపరయుగమున నది వ్యాకులమయి, కలియుగమున నశించును. వర్ణములయొక్క విశిష్టమైన సర్వనాశము చక్కగా పొగడబడును. అట్లే శ్రమయు ప్రశంసింపబడును. ఆయుమున శ్రుతియందును స్మృతియందును ద్వైధీభావము (ఏకీభావములేమి) జనించును. ద్యైధీభావమున శ్రుతినుండిగాని స్మృతినుండి గాని నిశ్చయము తెలియదు. అనిశ్చయమువలన ధర్మ తత్యము నిక్కముగా జెప్పబడదు. ధర్మతత్త్యమున భేదముజెందినది మానవులకు మతి భేదము గలుగును, దృష్టలయొక్క పరస్పరబేధముచేతను భ్రమచేతను ఇది ధర్మము ఇది యధర్మము అని నిశ్చయముగలుగదు. కారణముల వికలత్వము వలనను. కారణము నిశ్చయముగానందునను వారి దృష్టులలో మతి భేదముగలుగుటచే విభ్రమము గలుగును-9. తరువాత దృష్టిలో విభిన్నులైన వారిచే ఈ శాస్త్రకులముచేయబడినది. త్రేతాయుగమున నాలుగు పాదములుగల యొక్క వేదవిధింపబడినదీ. ఆయువు యొక్క సంరోధము( అరికట్టుట) వలన నాకారము ద్వాపరయుగములో గూడ గనబడును. ద్వాపరాదులలో వేదవ్యాసులచేత నాలుగువిధములుగా (నీవేదం) వేరుచేయబడినది. దృష్టి విభ్రమముగల ఋషి పుత్రులచేత మంత్ర బ్రాహ్మణముల విన్యాసములచేతను స్వరవర్ణ(అచ్చుల)ములు తారుమారుగుటచేతను వేదములు భేదములబెందులు. సామాన్యముగను వికారము జెందుటవల్లను, ఒక్కొక్కచోట వేదములచే ఋక్యజుస్సామవేదములయొక్క సంహితలు ధ్వంసము చేయబడినవి. బ్రాహ్మణము, కల్పసూత్రములును, మంత్రప్రవచనములును, ఇతరులును తీర్థములచే పంపబడిరి. కొందరు వారిని గూర్చి నిలబడిరి. ద్విజులు భిన్మములైన వృత్తములు (పనులు) ఆశ్రమములు గలవారై ద్వాపరయుగములో బ్రవర్తింతురు. పూర్వమొకే యాధ్వర్యవము(యజ్ఞములోని యజుర్వేదప్రక్రియ) ఉండెడిది. తరువాతనది రెండు విధములైనది. సామాన్య విపరీతార్థములచేత ఈ శాస్త్రకులము చేయబడినది. ఆధ్వర్యవ ప్రస్తావములచే అనేక విధములుగా వ్యాకులముగా చేయబడినది.అట్లే వికల్పములేని అధర్వ-బుక్ సామములయొక్క వికల్పములచేత వ్యాకులము చేయబడినది. ద్వాపరముభేదింపగా నది భిన్నదర్శనములచే చేయబడును. వికల్పములచేత గూడ నశింపనియావేదముల యొక్క భేదములును ప్రభేదములను ద్వాపరమున చక్కగా ప్రవర్తిల్లును. మరల కలియుగమున నశించును. దారముననైతే వాని యొక్క (వేదములయొక్క) వ్యత్యాసములు కలుగును. అవి-వర్షములేమి, మరణము వ్యాధులు, ఉపద్రవములును అగును. మాట-మనస్సు-కర్మ-వీనివల్లగలిగిన దు:ఖములచే మరల నిర్వేదము (వైరాగ్యము) గలుగును. నిర్వేదము వలన వాని యొక్క దుఃఖమోక్షముల విచారణ గలుగును ఆవిచారణవల్ల వైరాగ్యము. వైరాగ్యమువల్ల దోషదర్శనము, దోషదర్శనము వలన ద్వాపరమున జ్ఞానోత్పత్తియు జరుగును. పూర్వము మొదటి స్వాయంభువ మన్వంతరమున ద్వాపరయుగములో ఆమానవంతుల యొక్క శాస్త్రములకు శత్రువులు బుట్టుదురు. ఆయుర్వేద వికల్పములును, వేదాంగముల యొక్కయు, జ్యోతిషము యొక్కయు వికల్పములును అర్థశాస్త్ర వికల్పమును హేతు శాస్త్ర వికల్పమును. స్మృతిశాస్త్రప్రభేదములును. వేరువేరు ప్రస్థానములును ద్వాపరమున ప్రవర్తిల్లుచుండును. అట్లే మానవులకు మతి భేదములు గూడ ప్రవర్తిల్లుచుండును. ద్వాపరమున సర్వప్రాణులకును కాయకష్టముతో గూడినదై మనోవాక్ కాయకర్మలతో కష్టముగా వృత్తి (అర్థానర్థ విచారవిద్య) సిద్దించును. లోభము, ధైర్యము, వ్యాపారులయుద్దము, తత్యముల అనిశ్చయస్థితి, వేదశాస్త్రముల దీసికొని పోవుట, ధర్మముల సంకరమును, రోగము, లోభము, వధయు, వర్ణాశ్రమ ధ్వంసము, కామద్వేషములును ద్వాపరయుగమున బ్రవర్తిల్లును. అట్లే మానవుల పరమాయువు నిండు రెండువేలు ఆద్వాపరము నిశ్శేషముగా దాని సంధ్య పాద(పావుభాగ)ముగా నుండును. గుణములతో హీనమైనది ద్వాపరముయొక్క ధర్మము. అట్లే దానియొక్క యంశము సంధ్యాపాదముగా నుండును. ద్వాపర యుగములోని (వర్ష) సంవత్సరము యొక్క ప్రతిపత్తి (జ్ఞానము)ని వినుడు. ద్వాపరాంశము మిగులు నందే కలియుగము యొక్క ప్రతిపత్తి కలుగును.

  హింస, అసూయ, అసత్యమాడుట, మోసము, తపము జేయు మునులను చంపుట, ఇవి కలియుగము యొక్క స్వభావములు. ప్రజలు వీనిని సాధింతురు. ఇదియే ధర్మముగా జేయబడినది. నిజమైన ధర్మమంతయు క్షీణించును. వృత్తి (జీవనము) మనస్సుతోను, క్రియతోను, పొగడ్తల రూపమైన మాటతోను సిద్ధించునో లేదో సందిగ్దార్థమే. కలియుగమున బహళముగా జంపునది రోగము. ఎల్లప్పుడు ఆకలి భయములుండును. వర్షములేని కాటకముయొక్క భయము ఘోరమగును. దర్శనము వ్యత్యాసమగును.కలియుగమున లోకమందు స్మృతికి ప్రామాణ్యముండదు. ఒకడుర్భముననుండి యేమరణింపగా మరొకడు యౌవనమున నుండి యే మరణించును. కలియుగమున ప్రజలు వృద్ధాప్యమున అధార్మికులు, అనాచారులు, తీక్షకోపులు, అల్పతేజ(వీర్యముగలవారు, ఎప్పుడు అసత్యమాడువారునునైన ప్రజలు పుట్టుదురు. బ్రాహ్మణులయొక్క దుష్టమైన కోరికలచేతను (దుష్టమైన యజ్ఞకర్మలచేతను), దుష్టమైన యధ్యయనముల(చదువుల) చేతను, యాగమము (వేదశాస్త్రము)లచేతను ఈ విధములైన దుష్టకర్మలచేతను ప్రజలకు భయము గలుగును. కలియుగములో ప్రాణుల కంతటను హింస, మాయ, అసూయ, కోపము, ఈర్ష్య, ఓపిక లేమి (సహనము లేమి) అబద్దమాడుట, రాగములోభము-ఇవి కలుగుచుండును. కలియుగమును పొంది మిక్కిలి సంక్షోభము గలుగును. బ్రాహ్మణులు వేదముల జదువరు. యజ్ఞముల జేయరు. క్రమముగా నరులు వైశ్యులతోబాటు క్షత్రియులును నశింతురు. కలియుగమున క్షుద్రులకును అంత్యజులకును పడక-కూర్చొనుట, భోజనము-వీనిలో బ్రాహ్మణులతో సంబంధములు గలుగుచుండును. శూద్రజాతులవారు రాజులగుదురు. వారు పాషండులకు (వేద బాహ్యులకు) ప్రవర్తకులగుదురు. ప్రజలు భ్రూణ(గర్భశిశువు) హత్యలు చేయుదురు. ఈ విధముగ ప్రజ ప్రవర్తించును-40. ఆయువు, మేధాబలములు, రూపము, కులము-ఇవి క్షీణించును. శూద్రులు బ్రాహ్మణాచారముల జేయగా బ్రాహ్మణులు శూద్రాచారముల జేయుదురు. దొంగలు రాజవృత్తిలోనుండగా రాజులు చోరవృత్తిని(దొంగతనము) జేయుదురు. సేవకులు తమ మిత్రుల గోల్పోవుదురు. కలియుగము రాగా నిది జరుగును . కలియుగమురాగా స్త్రీలు శీలములేనివారు వ్రతములేని వారును, మాంసప్రియలునునై మాయమాత్రమే తమలో మిగిలిన వారుగా నగుదురు. కలియుగమున పులులు ప్రబలమగును (ఎక్కువగును) గోవులుక్షీణించును. సాధువులు మరలి పోవుదురు. అపుడు భోగులకు సూక్ష్మమున రాగల మహాఫలము, అట్లే బ్రహ్మచర్య గృహస్థవానప్రస్థ-సన్యాసాశ్రమములు శిధిలములగుటచే ధర్మము మిక్కిలి చలించిపోవును. అపుడు విశాలమై గొప్పనైన భూదేవి స్వల్పఫలమిచ్చునదిగా నగును. కలియుగమురాగానే శూద్రులు తపము జేయుదురు. త్రేతాయుగమున సంవత్సరకాలముండు ధర్మము ద్వాపరయుగమున నెలవరకుండుధర్మము. అది కలియుగమున ఒక దినపు ధర్మమగును. కాని యది (కాలప్రభావమున్న) ఒక దినముకన్న మించిపోవును. కలియుగములలో ప్రజలను రక్షింపని వారై రాజుల ప్రజలిచ్చిన పన్నులనుహరించి వారై రాజులు ప్రజలిచ్చిన పన్నులను హరించి స్వరక్షణ పరాయణులగుదురు. కలియుగమున క్షత్రియులు గాని వారు రాజులగుదురు. వైశ్యులు శూద్రులనాశ్రయించి జీవింతరురు. సమస్త బ్రాహ్మణులును. శూద్రులకు నమస్కరించు వారగుదురు. ఈ కలియుగమున  ఒక్క స్త్రీకి పెక్కురు పతులుందురు. కలియుగము చివరదేవుడు(వరుణుడు) చిత్రముగా వర్షించును. కలియుగమున నందరు వ్యాపారము జేయువారు గూడనగుదురు. మిక్కిలి మోసపు కొలతలచే సరకుల నమ్ముదురు. కలియుగము వచ్చినపుడు నాట్యచర్యవ్యాపించును. వ్యర్థరూపము(వేషము)లు గలిగిన వేదబాహ్యులచే నావరింపబడును. పురుషులల్పమై స్త్రీలధికమై యుండును. లోకము బహుభిక్షుకులతో నిండిపోవును. పరస్పరముగా జనము మాంసభక్షకమై క్రూరవాక్కుగలదై, కుటిలమై, అసూయగలదై యగును-53. చేసిన (చెడు) పనికి ప్రతి కర్తయుండకుండుటచే లోకము క్షీణించును. పతితుడైనను శంకించదు-ఇది కలియుగలక్షణముభూమి నరులు లేక శూన్యమగును. ఇచట దేశములలోను, నగరములలోను మండలములు ఏర్పడును. భూమి అల్పజలముగలదై యల్పఫలమునిచ్చున దగును. రక్షించువారు రక్షింపని వారై శాసనము లేక ప్రభువులగుదురు. జనులు పరుల రత్నములను హరించు వారును. పరస్త్రీలను జెఱచువారును, కాముకులను, దురాత్ములును, ఆధర్మమువలన సాహసప్రియులును అగుదురు కలియుగమున నష్టచేతనులుగాని పురుషులు, విదిలించిన వెంట్రుకలుగలపిలకజుట్టులు, పది హేనేండ్లవయస్సుగల వారునునై ప్రజలుజన్మింతురు కలియుగము వచ్చినపుడు శూద్రులు తెల్లని శుభ్రమై దంతములుగల వారును, ఇంద్రియములను జయించిన వారును, తలగోరగించుకొన్నవారును, కాషాయవస్త్రములు ధరించిన వారునునై ధర్మము నాచరింతురు. పంటలు దొంగిలించువారు పుట్టగలరు. అట్లే బట్టల నూడదీయువారును బుట్టగలరు. దొంగలనపహరించు దొంగలు, అపహరించు వారినే అపహరించు వారును గలుగగలరు. జ్ఞానకర్మ నశింపగా లోకము నీప్రియముగా పురుగులు, ఎలుకలు, సర్పములును, మానవులను మట్టుబెట్టగలవు. సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, సామర్థ్యము-ఇవి దుర్బలమగును.ఆకలిభయములతో పీడింపబడిన దేశములలో గుడ్లగూబలు వికసించును. దుఃఖములతో నావరింపబడిన వారికి పరమాయువు నూరేండ్లు మాత్రమే యుండును. కలియుగమున సమస్తవేదములను కనబడికనబడకుండ పోవును. అట్లే యజ్ఞములు కేవలమధర్మంచే పీడింపబడినవై నశించును. కాపాలికులు కాషాయవస్త్రములు ధరించిగ్రంథములు లేని వారగుదురు-64. వేదబాహ్యులైన యితరులు వర్ణాశ్రమములకు శత్రువులగుదు. కొందఱు వేదములనమ్ముదురు. మణికొందఱు తీర్థ(ప్రవిత్రదేవాలయాది) స్థలములను అమ్ముదురు-65. కలియుగమురాగానే పై విధములైన జనులు పుట్టుదురు. వేదములను జదువరు. శూద్రులు ధర్మార్థములలో పండితులగుదుర. శూద్రజన్ములైన రాజులు అశ్వమేధయాగము జేయరు. ప్రజలు స్త్రీవధను, గోవధను జేసి పరస్పరము జంపుకొందురు. ప్రజలు ఒండొరులజంపుకొని పోవుదుర. దుఃఖప్రచారమువలన అల్పాయువు, దేశనాశము, రోగములతో నిండియుండుట, మోహము, బాధ, అట్లే అసౌఖ్యము తామసప్రవృత్తి-ఇవి కలియుగమున నుండునని చెప్పబడినది. ప్రజయంతయు భ్రూణహత్యలకు బూనుకొనును. కావున కలియుగముననున్న వారికి ఆయువు, బలము, రూపము విశేషముగ క్షీణించును. దుఃఖమావరించిన మానవులకు పరమాయువు నూరేండ్లు కలియుగమున వేదములన్నియు కనబడియు కనబడవు. యజ్ఞములు కేవలము ధర్మపీడితములై నశించును. కలియుగకాలమున మానవులు అల్పకాలముననే సిద్ధినిబొందుదురు.కలియుగాంతమునబ్రాహ్మణసజ్జనోత్తములుధన్యులై చరింతురు. వారు శ్రుతిస్మృతులు చెప్పిన ధర్మమున నసూయలేకనడుచుకొందురు. త్రేతా యుగమున సంవత్సరమాచరించు ధర్మము ద్వాపరమున నొక నెలలో నాచరింపబడినది. కలియుగమున దానిన తనశక్త్యానుసారము ఒక దినముననాచరించి ఫలమునందును

ఇది కలియుగము యొక్క స్థితి. ఇక సంధ్యాంశమును గూర్చి నావల్ల వినుడు, యుగయుగమున సిద్దులు మూడు మూడు పాదములను 1/4 భాగము పోగొట్టుకొనును- యుగప్రభావమువలన నీ పాదములు పాదపాదముగనుండును. సంధ్యాస్వభావము వలన అంశములందు అవి సంధ్య: పాదములుగా నిలిచియుండును. కలియుగమున నీ విధముగా సంధ్యాంశకాలము రాగా భృగువంశీయుల మరణమున బుట్టిన వాడును-75. యసాధువులను శాసించు వాడును చంద్రుని గోత్రమునకు సంబంధించిన వాడును పేరున ప్రమతి యని పిలువబడును. ఆతడు పూర్వము స్వాయంభువమన్వంతరమున మాధవుని యంశమున బుట్టినవాడు. ఆతడిరువది నిండు సంవత్సరములు భూమిని దీరుగుచు గుజ్జములు రథములు, ఏనుగలును గల సేననాకర్షించెను (కూర్చెను) విశేషముగా నాయుధములను గ్రహించిన నూర్ల కొలది వేలకొలది బ్రాహ్మణుల (ద్విజు)లచే నెల్లప్పుడును జుట్టబడిన వాడై యతడు (ప్రమతి), వేలకొలది మ్లేచ్చులను జంపును. ఆ ప్రభువు అంతటనుండువాడై శూద్రజన్ములైన యా రాజులను జంపి, తరువాత వేదబాహ్యుల నందరినీ తుదముట్టించేను మిక్కిలి ధార్మికులు గాని వారిని గూడ నంతట జంపును. వర్ణవ్యత్యాసమువలన బుట్టిన వారిని, వారిననుసరించి జీవించు వారిని అంతట జంపివేయును. ఉత్తర దేశములను, మధ్యదేశములను, పర్వత ప్రాంతములను, అట్లే తూర్పుదేశములను, పశ్చిమ దేశములను వింధ్యవెనుకటి యపరాంతిక దేశములను. దాక్షిణాత్య దేశములను, సింహళములతో బాటు ద్రవిడ దేశములను, గాంధార దేశములను పారద దేశములను, పహావ దేశములను, యవన దేశములను. తుషార దేశములను, బర్బర దేశములను, చీన దేశములను శూలికదేశములను, దరదదేశములను, ఖసదేశములను, లంపాకదేశములను-వీనిలోని ప్రజలను కేతులను కిరాతజాతులను గూర్చుకొని వీరితో రాజ్యచక్రము నేర్పరచుకొని (చక్రవర్తి) మ్లేచ్చులను జంపి ప్రభువై, సర్వప్రాణులకజేయుడై భూమిని దిరిగెను. ఆతడు దేవుడైన విష్ణువు యొక్క యంశమున బుట్టిన వాడు. పూర్వజన్మవిధులను దెలిసినవారిచే వీర్యవంతుడైన ప్రమతియనియు, చంద్రవంశ(గోత్ర)జుడైన ప్రభువనియు బిలువ బడెను. ముప్పదిరెండేండ్ల అభ్యుదయవర్షము ప్రారంభముగాగా, ఇరువదియేండ్లు. సర్వప్రాణులను వేలకొలది మానవులను జంపుచు తన రూఢమైన కర్మచే భూమిని తనపరాక్రమము మాత్రమే మిగిలినదానిగా జేసెను. పరస్పరనిమిత్తకమైన యాకస్మికకోపముచేతను. సామాన్యముగాన ధార్మికులైన నీచులగు శూద్రులను సాధించెను. (వశము జేసికొనెను) తరువాగంగాయమునల మధ్యమున తన సేవకులతో గూడి నిష్ఠను (సమాధిని) బొందెను. అంత, సమస్తరాజులను, వేలకొలది మేచ్చులను పెణికివైచి సత్యసైనికుడైన యాయమాత్యుడు (రాజును) గడచిపోయెను. అచట కలియుగమున సంధ్యాంశకాలమురాగా ఇచ్చటచట ప్రజలు అల్పావిశిష్టు(కొద్దిగా మిగిలినవారు)లైరపగ్గములులేని వారై గుంపులు గుంపులుగా లోకచేష్టలు చేయువారై పరస్పరము హింసించుకొనుచుండిరి. రక్షణము గోరుచుండిరి. (కలి) యుగవశమున అరాజకము వచ్చి జీవితసంశయమేర్పడినది. ఆ సమస్త ప్రజలు పరస్పరభయములచే పీడింపబడిరి. వారు భార్యలను ఇండ్లను వదిలి వ్యాకులులై యలిసిపోయిరి. తమ ప్రాణములను జూచుకొనుచు మిక్కిలిదు:ఖితులై చేటును బొందిరి. శ్రుతిస్మృతులు జెప్పిన ధర్మము నశించినది. అపుడు మర్యాద, పిలుపు, స్నేహము, సిగ్గు, ఇవి యేమియు లేని వారైరి. వర్షము నష్టము గాగా కొట్టబడిన వారై హ్రస్వకులు (పొట్టివారును) పంచవింశలు కులనునైరి. భార్యాపుత్రులను వదలి దుఃఖముతో కలత జెందిన యింద్రియములు గలవారైరి. (సర్వేంద్రియములు దెబ్బతినినవి). వర్షము లేమిచే జచ్చిరి. జీవనవృత్తులువదిలి దుః:ఖితులైరి. తమపల్లెలను వదలి సమీపములోని నగరదేశములను సేవించిరి-96. అపుడు జనులు నదులను, సముద్రములను, బావులను, పర్వతములను జేరిరి. మిక్కిలి దుఃఖించిన వారై మధుమాంసములతోను, మూల ఫలములతోను, జీవించుచుండిరి. నారచీరలను చర్మములను ధరించిరి. వారికి ఆకులు గూడ లభించలేదు. ఏదానములు గూడ లేవు. వర్ణాశ్రమములనుండి భ్రష్టులై ఘోరమైన సంకరమునొందిరి. ప్రజలీ దశకు జేరి కొద్ది మాత్రమే మిగిలిరి. ముసలితనము వ్యాధి ఆకలి వీనిచే నలమటించి దుఃఖమును వైరాగ్యమును బొందిరి. నిర్వేదము నుండి విచారణమును, విచారణమునుండి సామ్యావస్థను, సామ్యావస్థలలో సంబోధము(జ్ఞానము)ను, సంబోధమునుండి ధర్మశీలతను మానవుడు పొందును-. కలి శిష్టములైన పైనిజెప్పబడినవి. రాత్రింబవళ్లు ఉపగమము (అంగీకారము)తో గూడిన వైనపుడు వానియొక్కయుగము మారును. వానికి (నిర్వేదఽ విచారణ 3 సామ్య 4 సంబోధ 5 ధర్మశీలత 6 ఉపగమము) ఏడవదిగా చిత్తసంమోహనమును గూర్చి రాబోవు ఆర్థము యొక్కబలమువలన తరువాత కృతయుగమేర్పడెను.

తరువాత మరల కృతయుగము ప్రవర్తిల్లగనే కలియుగమున మిగిలిన వారు కృతయుగపు వారుగా ప్రజలు పుట్టిరి. ఇచట సిద్దులుగా నున్న వారును చక్కగా నబడి తిరుగుచుండిరి. ఆ సప్తర్షులు గూడనచట చక్కగా నివసించియుండిర. ఇచట బీజప్రాయులుగా జెప్పబడిన బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులు కలిలోబుట్టినవారును అప్పుడు సమానముగా నుండిరి. సప్తర్షులు వారి యొక్కధర్మమును ఇతరుల విషయమున గూడ చెప్పుచుండిరి. వర్ణాశ్రమాచారయుక్తుడు శ్రాతుడనియు స్మార్తుడనియు రెండువిధములు. తజువాత, కృతయుగమున ఆక్రియావంతులలో ప్రజలుండిరి. శ్రాతస్మార్త క్రియలు కృతములైనందున కృతయుగమును పేరువచ్చినది.) కృతయుగపువారికి శ్రాతము (వేదోక్తము) స్మార్తము (స్మృతులలో జెప్పబడినది)అయిన ధర్మము సప్తర్షులచే జెప్పబడినది. (శుతి స్మృత్యుక్త ధర్మమే కృతయుగధర్మము). ప్రజలలో నాధర్మమును వ్యవస్థాపించుటకై మునులు యుగాంతమువరకు మన్వంతరాధికారములలోనుండిరి.

ఈ లోకమున వేసంగిలో (ఎండకాలములో) కారు చిచ్చుతో భూమి పైన గడ్డియంతయు తగులబడి పోవును. మరల వర్షకాలమున మొదట నా కాలిన గడ్డి మూలముననే క్రొత్త గడ్డి మొలకలు పుట్టును. అట్లే యుగమునుండి యుగమునకు ఎడతెగకుండగ మన్వంతరక్షయమగువలకు పరస్పరము సంతాన సంక్రమము జరుగుచుండును. సుఖము ఆయువు- బలము-రూపము-ధర్మము-అర్థము-కామములును- ఈ మూడును యుగములలో పాదక్రమముగా క్షీణించును. యుగములయొక్క ధర్మసిద్దులు సంధ్యంశలలో క్షీణించును. ఓ ద్వీజులారా! ఈ విధముగా మీకు ప్రతిసంధి చెప్పబడినది.

పై జెప్పిన లక్షణములతోనే నాలుగు యుగములయన్నింటి యొక్క క్రమనిర్మాణము. ఈ నాలుగు యుగముల యావృత్తి వేయి వజకు జరుగుచుండును-. ఆ వేయి యుగములు బ్రహ్మకొక పగలు. అట్టిమరొక వేయియుగములు బ్రహ్మ యొక్క రాత్రియనబడినది. ఇదియే సమస్తయుగములకు లక్షణము. ఈ నాలుగు యుగములు డెబ్బదియొక్క మారులు తిరిగినచో మన్వంతరమనబడును. నాలుగుయుగములలో (ప్రతి) ఒకదాని యందు పూర్వము విన్నవిధముగ జరుగును. అట్లే అన్ని చతుర్యుగములలో గూవరుసగా ప్రతియుగము జరుగును. ప్రతి సర్గమున (సృష్టియందు) భేదములుత్పన్నమైన విధముననే (యుగములు) యిరువదియైదు విధములు. అంతకు తక్కువగాని యెక్కువగాని లేవు. అట్లే కల్పయుగములతో గూడ సమాన లక్షణములు గలవగును. సమస్తమన్వంతరమున కిదియే లక్షణము. అట్లే యుగస్వభావము వలన పరివర్తనములు చాలకాలము నుండియే జరిగినవి. ఆ విధముగా జీవలోకము క్షయ - అభివృద్ధులతో దిరుగుచునుండదు-119. అని యీవిధముగా సంగ్రహముగా నిచట మన్వంతరములలో భూత-భవిష్యద్యుగముల లక్షణము చెప్పబడినది. ఆ విధముగనే విజ్ఞాని భవిష్యద్యుముల విషయమై తరింపవలెను. సమస్తమన్వంతరములోను భూతభవిష్యద్యుగములను గూర్చి యూహింపవలెను. ప్రతి కల్పమునను ఒక్కమన్వంతర (వివరణ)ముతో సమస్తమన్వంతరములు వివరింపబడినట్లు తెలియవలెను. నామరూపములతో నందరు ఈయుగాభిమానులగుదురు. ఇచటనెనిమిది విధములైన దేవతలు మన్వంతరాధిపులు.. ప్రయోజనములతో ఋషులు, మనువులు. అందజును సమానులే. ఈ విధముగ యుగయుగమున వర్ణాశ్రమములవిభాగము. ప్రభువెల్లప్పుడు యుగస్వభాగమును జేయును (ఈ విధముగ అనుషంగము చెప్పబడినది. సృష్టిసర్గమును వినుడు. ఇచట ఆనుపూర్వితో విస్తరముగా యుగములలోని స్థితిని జెప్పెదను.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున చతుర్యుగాఖ్యానమను నేబదియెనిమిదవ యధ్యాయము.