వాయు మహా పురాణము

Table of Contents

21 - కల్పనిరూపణం

సూతుడు పలికెను:- అగ్నికల్పులు, నైమిషారణ్యవాసులునైన ఋషులలో ఋషి వేదములు చదివి ధారణలోనుంచుకొన్న వాడు ప్రాజ్ఞుడు సావర్ణియను పేరుగలవాడుండెను-1. మాట నేర్పరియైన యాతడు వారందరికిని ముందుగా నుండి ప్రియము కొరకేల్లప్పుడు సత్రయాగము చేయునట్టి మహాద్యుతి (తేజో) వంతుడైన వామువును సవినయముగా సమీపించి యిట్లడిగెను-2. సావర్ణి పలికెను. ప్రభో! సర్వదర్శియైన మీయనుగ్రహమున పురాణ సంబంద్ధమైన వేదసంహితమైన కథను చక్కగా వినదలచుచున్నాము-3. భగవంతుడైన హిరణ్యగర్భుడు (బ్రహ్మ) తన నుదుటి నుండి నీలలోహిత తేజస్కుడై దేవుడైన శివుని తన పుత్రునిగా నెట్లు పొందెను-4. భగవంతుడైన కమలము నుండి బుట్టిన బ్రహ్మయెట్లు పుట్టెను. మరి తన కుమారుడైన శర్వునకు (శివునకు) రుద్రత్వమెట్లు వచ్చినది?-5. విష్ణువునకు రుద్రునితో నుత్తమోత్తమమైన ప్రీతి (స్నేహము) ఎట్లు కలిగినది? సమస్త దేవతలు విష్ణుమయులు. సమస్త గణములును విష్ణుమయములే-6. విష్ణువునకు సమానమైన దారియొకటి లేదు. అని యీ విధముగా దేవతలు గానము చేసి చెప్పుదురు. ఇట సంశయములేదు. అట్టి విష్ణువు భవునకు (శివునకు) నిత్యమును ఎందులకు ప్రణామము చేయును-7.

సూతుడు పలికెను:- ఇట్లడుగగా భగవంతుడైన వాయువు సావర్ణితో నీ విధముగ జెప్పెను. ఓ సజ్జనుడా! నీవు చక్కగా నడిగితివి. నీ ప్రశ్న ఉత్తమోత్తమము. శివుడు పుత్రుడుగా జన్మించుటయు, బ్రహ్మకాతడు పుత్రుడైన విధము, బ్రహ్మ పద్మమున బుట్టుటయు, శంకరునకు రుద్రత్వము-9, హరిహరులిద్దరికిని చక్కని స్నేహము, విష్ణువు నిత్యము శంకరునకు ప్రణామము జేయుటయు మొదటి నుండి విస్తరముగా జెప్పెద వినుడు-10.

ఓ బ్రాహ్మణోత్తమా! మన్వంతరము యొక్క సంహారమునందు పశ్చిముడను మహాత్మునకు (?) పద్మమను నేడన కల్పముండెను. ఇప్పుడు వారికి వరాహకల్పము. ఆ వరాహ కల్పము యొక్క విస్తరమును చెప్పుచున్నాను-11. సావర్ణి పలికెను. ఎంతకాలములో కల్పమెట్లు సంభవించును. కల్పము యొక్క ప్రమాణమేమి? అని యడుగుచున్న మాకు సమాధానము జెప్పుము-12.

వాయువు పలికెను:- ఏడు మన్వంతరములకు వరుసగా సంగ్రహముగా కాల సంఖ్యను జెప్పెదను వినుడు-13. రెండు వేల కోట్లు (20000000000) ఎనిమిది కోటి నూర్లు (80000000000) అరువది రెండు కోట్లు (620000000000), డెబ్బది లక్షలు (70,00000) కల్పము యొక్క సగమునకు సంఖ్యతో నీ మొత్తము జెప్పబడినది-14. పూర్వోత్తములైన గుణచ్చేదములు రెండు వర్షాగ్రమ లబ్దముగా జెప్పవలె (?) నూరుకోట్లు (10000000000) డెబ్బది యెనిమిదికోట్లు (78000000) రెండునూర్ల వేలు (200000) తొంబది లక్షలు (9000000)- 15. మానుష (లోక) ప్రమాణముతో వైవస్వత మన్వన్తరము చివరివరకు ఇది కల్పము సగముతో ద్విగుణీకృతమైన కల్పము అని తెలియవలె-16. రాబోవు ఏడు మన్వన్తరములకు గూడ వరుసగా నిదియే కాల సంఖ్యా ప్రమాణము. ఇది టైశ్వరమతము అని తెలియవలె -17.

ఏబది యెనిమిది లక్షలు (5800000) అట్లే ఎనుబదినూరులు (8000), ఎనిమిది వందల నలుబది లక్షలు (8400000) ప్రమాణములు-18. సప్తర్షులు మనువు, ఇంద్రుడు మొదలుకొని దేవతలును ఈ కాలమునకు ప్రమాణముగ వర్షాగ్రమును దెలియవలెను-19.

ఈ విధముగ వారికి మన్వన్తరము మానుషాన్తముగ జెప్పబడినది. ప్రణవము అంతముగా గల దేవతలు, సాధ్యులు, దేవగణములు విశ్వేదేవులు, నిత్యులై గణములుగా జీవింతురు-20. ఈ జరుగుచున్న కల్పము, వారాహకల్పమనబడును. ఈ కల్పమున స్వాయంభువు మొదలగు పదునాలుగురు మనువులు గలరు-21.

ఋషులనిరి:- ఇది యెందులకు వారాహకల్పమనబడినది? ఏ కారణమున దేవుడు (విష్ణువు) వారాహుడనబడినాడు-22. భగవనుడైన వరాహుడెవరు? ఆతడెవరికి జన్మస్థానము? ఏమి స్వరూపముగలవాడు?-23.

వాయువు పలికెను:- వారాహము బుట్టిన విధము, అట్లు వారాహ రూపము కల్పించుటకు ప్రయోజనము, వారాహకల్పమేర్పడిన విధము. కల్పత్వము కల్పన-24, రెండు కల్పముల మధ్య కల్పించిన భేదము మొదలైనదంతయు విన్నరీతిగను కన్నరీతిగను జెప్పెదను-25. పూర్వము లోకాదిలో భవుడు (భూమియొక్క) ప్రథమ కల్పమని ప్రసిద్ధిచెందినది. ఇచట స్వయముగా ప్రస్తుతుడై యానురూపుడైన భగవంతుడు తెలియదగినవాడు-26. ఇది దివ్యమైన బ్రహ్మస్థానము. ఇది దివ్యము నుండి బుజ్జీ లభించినది. ఇది భూమియొక్క రెండవ కల్పము. మూడవది తపమనబడును-27. నాలుగవది. భవకల్పము. ఐదవది రంభకల్పము. ఆరవది ఋతుకల్పము. అట్లే యారవది(?) ఏడవది క్రతుకల్పమనబడినది-28. ఎనిమిదవది వహ్ని కల్పము. తొమ్మిదవది హవ్యవాహన కల్పము. పదవది సావిత్రి కల్పము. భూమియొక్క ఏకాదశ కల్పము(?) అనబడినది-29. పండ్రెండవది ఉశిక కల్పము. పదమూడవది కుశిక కల్పము. పదునాలుగవది గన్జర్వకల్పము. అచట ఉత్పన్నమైన స్వరము గాంధర్వము. అచట ఉత్పన్నమైన నాదము గంధర్వమైనట్లే యచట బుట్టినవాడు గంధర్వులు-30. ఓ బ్రాహ్మ ఆ తరువాత పదునైదవ కల్పము ఋషభకల్పము. అచట బుట్టినవారు ఋషులు. అచట బుట్టిన ఋషభ స్వరము లోకమనోహరము-31. పదునారవది షడ్డకల్పము. అచటి షడ్జనులు ఋషులు శిశిరము వసస్తము, నిదాఘము, వర్షము-32, శరత్తు, హేమనము, అనునవి బ్రహ్మయొక్క మనస్సుచే గలిగిన సుతులు. అచట బుట్టినవారు షడ్డసంసిద్దులు. వీరు పదునారవ  కల్పము నందలి పుత్రులు-33. దాని నుండి బుట్టిన యాలుగురిచే సద్యోజాతుడు మహేశ్వరుడు అతని నుండి బుట్టిన సడ్జస్వరము సముద్రముతో సమానము-34.

ఆ తరువాత పదమేడవది మార్జాతీయ కల్పమనబడినది. మార్జాతీయ కర్మ నుండి బ్రాహ్మము కల్పితమైనది. 35 తరువాత పదునెనిమిదవది మధ్యమమను కల్పము. దానియందు దైవతపూజితమైన మధ్యమ మనుస్వరము బుట్టినది. సర్వ భూతములలో మధ్యమము స్వయంభువు-36. తరువాత పంతొమ్మిదవది వైరాజక కల్పమనబడినది. అటవైరాజుడు బ్రహ్మ సుతుడైన భగవంతుడైన మనవు-37. అతని పుత్రుడు ధర్మాత్ముడు. దధీచియను ధార్మికుడు. అతడు మహా తేజస్కుడైన ప్రజాపతి. అతడు త్రిదశేశ్వరుడయ్యెను-38. యజ్ఞము చేయుచున్న ప్రజాపతిని గాయత్రి కామించెను. అతని నుండి దట్టమైన స్వరము బుట్టినది. అది దధీచియొక్క పుత్రుడు-39.

ఆ తరువాత ఇరువదియవది నిషాద కల్పము అనబడినది. ప్రజాపతి స్వయంభువు నుండి బుట్టిన యాతనిని జూచి, యపుడు ప్రజలను సృష్టించుట విరమించెను. నిషాదుడు తపమును తపించెను (చేసెను)-40. ఆహారములేక జితేంద్రియుడై వేయి దివ్యవర్షములాతడు తపము జేసెను. లోక పితామహుడు మహాతేజస్కుడైన బ్రహ్మ-41, ఊర్థ్వముగ బాహువులు లేపియున్నవాడు తపస్సునందే లగ్నమైనవాడు దుఃఖితుడు అకలి దప్పులచే పీడింపబడిన వాడునైన యూనిషాదునితో నిట్లు పలికెను. పితామహుడు (బ్రహ్మ) శాన్లుడైన యీ పుత్రుని నిషేద (కూర్చొనుము) అనియనెను. దానివలన నిషాదుడు బుట్టెను. ఆ స్వరము నిషాదవంతమయ్యెను-42. ఓ బ్రాహ్మణులారా! ఇరువదియొకటవది పంచమమను కల్పము అని తెలియవలె ప్రాణము.అపానము, సమానము, ఉదానము, వ్యానము అనునవి బ్రహ్మయొక్క మానస పుత్రులు. ఈ యైదుగురు బ్రహ్మతో సమానులు. అర్థమును వచించువానితో గూడిన వాక్కులచే మహేశ్వరుడు ఇష్టార్థముగా జెప్పబడెను-43, 44. చుట్టుజుట్టిన యా యైదుగురు మహాత్ములచే గానము చేయబడిన స్వరము దట్టమైన పంచమమైనది. కావున కల్పముగూడ పంచమకల్పము-45.

అట్లే పండ్రెండవ కల్పము మేఘవాహన కల్పము అని తెలియవలె అచట మహాబాహువైన విష్ణువు మేఘముగానయి చర్మ వస్త్రమును ధరించిన శివుని వేయి దివ్యవర్షములు మోసెను-46. ఆ బరువుచే నాక్రాంతుడైన దమ్ముదీయుచున్న విష్ణువు యొక్క ముఖము నుండి మహాకాయుడు లోకములను బ్రకాశింపజేయువాడునైన నల్లనివాడు (కాలుడు) బయలువెడలెను. ఆ విష్ణువును విప్రులు కశ్యపాత్మజుడనియందురు-47. పదమూడవ కల్పము చిన్తకమని తెలియవలె. ప్రజాపతి సుతుడు శ్రీమంతుడు చితియును వీరిద్దరు మిధునము-48. ధ్యానము జేయుచున్న బ్రహ్మ నుండి చింత బయలుదేరెను. దానివలన స్వయంభువు ఆ కల్పమును చింతక కల్పమనేను-49. ఇరువది నాలుగవది యాకూతి కల్పము అనబడును. ఆ కూతీయు అట్లేదేవియును మిధునమయిరి-50.

ప్రజాపతి ఆకూతిని ప్రజలను సృష్టించుమనెను. అందువలన ఆ పురుషుడు ఆకుతి కల్పమనబడెనని తెలియవలె-51. ఇరువదియైదవది విజ్ఞాతియు దేవియు మిథునముగనెను-52. పుత్రకాముడై ధ్యానించువానికి యొక్క మనస్సున అధ్యాత్ముడను పేరుతో తెలియబడినవాడు అప్పటినుండి సంగ్రహముగ విజ్జాతియనబడినవాడు-53. తరువాత పదునారవ కల్పము మనః కల్పమనబడినది. దేవి శాంకరియను నామె మిథునమును గనెను-54.

ప్రజలను సృష్టింపదలచి చింతించుచున్న యాతనికి దేవిశాంకరి మిధునమును ప్రసవించెను. కావున స్వయంభువుడైన బ్రహ్మచే ప్రజాసంభవనముల్లబుట్టెను ఆ ప్రజాసంభవము నుండి భావనా సంభవము వచ్చినదనబడెను. ఇరువదియేడవ కల్పము భావకల్పమనబడెను. అట్లే పౌర్ణమాసియనుదేవి మిధునమును పొందెను-55, 56. పరమేష్ఠియైన బ్రహ్మ ప్రజాసృష్టి చేయదలిచేను. పరమధ్యానమును చేయుచుండెను. పరమాత్ముడైన యీశ్వరుని జూచెను-57. అగ్ని మండలముగానీయీ కిరణజాలముతో జుట్టబడెను. మహాదేహము గలవాడై భూమిని స్వర్గమును చక్కగా నిలిచి వ్యాపించెను-58. తరువాత వేయి వర్షముల చివర ఆ జ్యోతి మండలము సంపూర్ణమయ్యెను. అట్లా వేశించుటచే తోడుగానే బుట్టిన సూర్యమండలమును జూచేను-59. అతడు భూతములకు కనబడనివాడు. కాని పరమేష్ఠియైన బ్రహ్మచే జూడబడినవాడు. అతడు భగవంతుడు దేవుడు సంపూర్ణ మండలుడైన సూర్యుడు-60. సమస్త యోగములు మన్తములును ఆ సూర్యమండలముతోబాటే బయల్వెడలినవి. ఈ కల్పము చూడబడినందున నిది దర్శకల్పమనబడినది-61.

పరమేష్ఠియైన బ్రహ్మయొక్క మనస్సున పూర్వము భగవంతుడైన సోముడు సంపూర్ణుడైనందున పౌర్ణమాసి యనబడినది-62. కావున పర్వమైన దర్శనమున (అమావాస్యయందు) ఉభయ పక్షములందును తమ హితముగా నుండునది) అయినది. బ్రహ్మలోకము నుండి యెప్పుడు గూడ వాటికి పునరావృత్తిలేదు-64. ఆహితాగ్ని కానివాడు, ప్రయతుడు (నియమములు గలవాడు) వీర మార్గమును బొందినవాడును మనస్సును ఏకాగ్రసమాధిలో నుంచి, మెల్లగా నీమన్తమును తీవ్రముగా నుచ్చరింపవలేను-65.

ఓ అగ్నీ! నీవు రుద్రుడవు, అసురుడవు. మహివి (భూమివి), దీవమవు (స్వర్గమవు), నీవు శర్వుడవు, వాయువు వెనుక ప్రేరణా సమర్థుడవు. నీవు పాశగంధర్వ శిషమవు (?) నీవు సూర్యుడవు మమ్ములను విశేషముగ ధరించి రక్షింతువు(?) బ్రాహ్మణుడు ఈ మన్తమునే చక్కగా నుచ్చరింపవలె. అట్లు అగ్నిలో ప్రవేశించినవాడు రుద్రలోకమును జేరును-66. సోముడు, అగ్ని కాలుడు వీరు భగవంతుడైన రుద్రుడే అని శ్రుతి చెప్పుచున్నది. కావున అగ్నిలో ప్రవేశించినవాడు రుద్రుని చేరి నివర్తింపదు (మరలదు)-67.

ఇరువది యెనిమిదవ కల్పము బృహత్ కల్పము అనబడినది. బ్రహ్మపుత్ర కాముడై ప్రజలను సృష్టింపదలచి మనస్సుచే రథంతరమను బృహత్సామమును ధ్యానము జేసెను-68. అచట బృహత్తు నుండి సర్వతోముఖమైయుత్పన్నమైనందున తత్వచింత కులచే నది బృహత్కల్పమని తెలియదగినది-69. ఎనుబది యెనిమిది యోజనముల ప్రమాణ దూరమున నన్ను సూర్యమండలము ఉత్కృష్టమైన రథన్తరముగా దెలియవలెను. కావున సూర్యమండలమలిము ఒక భేధింపనలవిగాని, యండమని తెలియవలెను-70. సూర్యమండలము గూడ బృహత్సామరూపమై చేధింపబడును. దీనిని ఛేధించుకొని యోగాత్ములు దృఢవ్రతులునైన బ్రాహ్మణులు (పరమ పదమును స్వాత్మను) బొందుదురు. వారు సంఘముగానయి రథన్తరమున వేరు కల్పములగుదురు-71. అనియిది నాచేచెప్పబడిన చిత్రమైన యధ్యాత్మ దర్శనము. దీని తరువాత శుభకరమైన కల్పముల విస్తరమును జెప్పుదును-72.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున కల్పనిరూపణమనునది ఇరువది యొకటవ యధ్యాయము 21.