వాయు మహా పురాణము

Table of Contents

59 -  ఋషిలక్షణం

సూతుడనెను:- యుగములలోబుట్టు ప్రజలను వినుడు. ఏయుగమున అసురజాతి పుట్టుకయు, సర్ప-గో-పక్షి పిశాచజాతి పుట్టుకయు, యక్షరాక్షస జాతి పుట్టుకయు గలుగునో వారి జీవితము మొత్తము (నిండు)గా నుండును. పిశాచులు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సర్పములు-వీరు మృత్యు వధలు లేకుండగా ఒక్కయుగమంతయు జీవింతురు. స్థావరములతోబాటు మనుష్యులయొక్కయు, పశువులయొక్కయు, పక్షులయొక్కయు ఆయువు యుగధర్మములలో నంతటను వ్యాపించినది కలియుగమునందు ప్రాణుల యాయుష్యమునకు ఒక స్థితి కనబడదు. కలియందు మనుష్యులకు పరమాయువు నూరేండ్లనబడినది. దేవాసురుల ప్రమాణమునుండీ మేడంగుళములు తగ్గుచు (మానవుల యెత్తు) నిండుగా నూటయేబదియెనిమిది యంగుళములైనది. కలియందు బుట్టినవారిచే దేవ-అసురులయెత్తుల ప్రమాణము వారిఎనుబది నాలుగంగుళములుగా జెప్పబడినది-6. మనుష్యుని పాదములనుండి తలవరకు గలయెత్తు తన యంగుళ ప్రమాణముతో జెప్పబడినది. ఈ మనుష్యుని యెత్తు ఇచట కలియుగమున తగ్గుచుండును. అన్నియుగముల కాలములలోను, భూతభవిష్యత్కాలములలోను తన యంగుళ ప్రమాణముతో నరుడు ఎనిమిది తాలముల ప్రమాణముగలవాడుగా నుండును. (తాలము=బొటన వేలు నడిమివేలు ఇవి రెండును చాచగా నేర్పడిన నడిమికొలత) అని చెప్పబడినాడు. పాదమునుండి తలవజుకు తొమ్మిది తొలముల ప్రమాణము ఎత్తుగలవాడును, శరీరమధ్యమునకు సందులులేక యాను కొనగలిగి మోకాళ్లవజుకు పొడవుగా నున్నబాహువులు(చేతులు)గలవాడు అసురులచేత గూడ పూజింపబడును-9: గోవులు, ఏనుగులు, దున్నపోతులు మజీకదలక స్థిరముగా నుండు వృక్షాదులు-వీనికి ప్రేకాలయోగము చేత యుగయుగమున తరగుట పెఱుగుట యును గలుగుచుండును-. పశువుల(యెద్దుల) మూపురము డెబ్బది యాజుంగుళముల యెత్తుండుననియు, ఏనుగల యెత్తుసంపూర్ణముగా ఎనిమిది వందల యంగుళములుండుననియు వృక్షములకుండుననియు. జెప్పబడినది. ఐదువందల యంగుళములు గుఱ్ఱములకుండుననియు జెప్పబడినది. తత్త్యదర్శనము జేసినందున మనుష్య శరీర సన్నివేశము వంటిదే దేవతల శరీరసన్నివేశము(కూర్పు) ఉండునని కనుగొనబడినది. దేవతల శరీరము బుద్ధ్యతిశయముతో గూడినదనియు, దేవతలను మించని మనుష్యశరీరమనియు జెప్పబడినది. ఇయ్యవి దేవమనుష్యులను జుట్టియున్న భావములు. పశువులయొక్క పక్షుల యొక్కయు స్థావరములైన వృక్షాదులయొక్కయు, భావములను వినుడు. గోవులు, మేకలు, దున్నలు, గుఱ్ఱములు ఏనుగులు, పక్షులు, పర్వతములు. ఇవి యిచట(భూలోకమున) యజ్ఞ క్రియలలో నంతట నుపయుక్తములైనవి- ఆ రూపములలో నుండియే యవి మరల దేవస్థానములలో బుట్టును. దేవతలయొక్క శుభమూర్తులు వారి యాశయముననుసరించిన యుపభోగములగును. వానియొక్క రూపములకు తగిన ప్రమాణములు గలిగినట్టియు, మనోహరములైనట్టియు, సత్యభావములను దెలిసినట్టి స్థావరజంగమములచే సుఖవంతులు సమీపించిరి.

అందువలన శిష్టులను గూర్చియు, సత్పురుషులను గూర్చియు, సాధువులను గూర్చియు జెప్పెదను. సత్ అనునది బ్రహ్మయొక్క(వాచక) శబ్దం బ్రహ్మవంతులు బ్రహ్మసాయుజ్యమున నుందురు. కావున వారు సంతులనబడుదురు. దశాత్మకమైన విషయమైనను అష్టలక్షణములు గల కారణమునను కోపింపక సంతసించియుండువారు జితాత్ములనబడుదుర. సామాన్యధర్మములందును వైశేషిక (విశేష) ధర్మములందును బ్రాహ్మణ-క్షత్రియవైశ్యులు యుక్తులైయుందురు. కావున వారు ద్విజాతులనబడిరి. శ్రాత-స్మార్త ధర్మము యొక్క జ్ఞానమువలన వర్ణాశ్రమములందున్నదియు స్వర్గమార్గము నందాచరించునదియు నైనది ధర్మమనబడున. విద్యను సాధించుట వలన సాధువనబడుచున్నాడు. బ్రహ్మచారియై గురువునకు హితుడై క్రియలను సాధించుట వలన గృహస్థుడు సాధువనబడుచున్నాడు. అరణ్యమున తపస్సును సాధించుట వలన వైఖానసుడు సాధువనబడుచున్నాడు. ప్రయత్నము జేయుచున్న యతి గూడ యోగమును సాధించుట వలన సాధువనబడినాడు. గృహస్థుడును, బ్రహ్మచారియు, వానప్రస్థుడును భిక్షుకుడును. ఈ విధముగ నాశ్రమ ధర్మములను సాధించుటవలన సాధువులనబడినారు. ఇది యధర్మము ఇది యుధర్మము-అని చెప్పువారు. అభిన్నదర్శనులు (జీవాత్మ పరమాత్మైక్యమును జూచువారు. దేవతలు గారు. పితరులుగారు, మునులును గారు. మానవులును గారు, మానవులును గూడ (అభేదము జూచువారు) గారు.

ఇచట ధర్మాధర్మశబ్దములు క్రియాత్మకముగా జెప్పబడినవి. కుశలా కుశలకర్మలు ధర్మాధర్మములనబడినవి- 27. ధారణ యనగాధృతియనునర్థముగల (ధ) ధాతువువలన ధర్మమను శబ్దము చెప్పబడినది. ధరింపనపుడు మహత్యము లేనపుడు అధర్మమని చెప్పబడును-28. ఇచట ఇష్టములను (కోరిన వానిని)పొందించు ధర్మములు ఆచార్యులచే నుపదేశింపబడును. వృద్దులు. లోభములేనివారు, ఆత్మవంతులు, దంభములు లేనివారు. మంచి వినయము గలవారు. ఏ వంకరలు లేక చక్కగానడచుకొనువారును-వీరిని ఆచార్యులుగా జెప్పుదురు. ఆచార్యుడు తానాచరించినందునను, ఆచారమును స్థాపించి నందునను, యమములతోను మంచి నియమములతోను గూడిన వాడై శాస్త్రార్థములను పరిశీలించియు చేయదగినవానిని సమకూర్చుకొన్నందునను -అవి యాచారములైనవి. సప్తర్షులు పూర్వుల నుండి తెలిసికొని యిచట (భూలోకమున) శ్రాతమును (వేదధర్మమును) జెప్పిరి. ఋక్కులు(ఋగ్వేదము), యజుస్సులు(యజుర్వేదము), సామములు (సామవేదములు), వేదాంగములును (శిక్ష్యావ్యాకరణ ఛందస్-నిరుక్త-జ్యోతిషములు)-ఇవి శ్రుతి యనబడును. (వీని జెప్పబడిన ధర్మము (శౌతము) గడచిన మన్వంతరము యొక్క యాచారమును స్మరించి యాచారమును మరల ఋష్యాదులు జెప్పిరి. కావున వర్ణాశ్రమ విభాగము వలన బుట్టి స్మరింపబడి ధర్మము స్మార్తమయినది. ఆయీ రెండు విధములైన (తస్మార్త) ధర్మము ఇచట శిష్టాచారమన బడినది. శేషశబ్దమువలన శిష్టశబ్దమేర్పడినది. శిష్టమయిన యాచారము శిస్టాచారమనబడినదీ మన్వంతరములలో మిగిలియున్న వారిట ధార్మికులుగా నుందురు. లోకసంతానకారణమువలన ధర్మార్థముగా మిగిలిన మనువు, సప్తర్షులును ఉన్నది యున్నట్లుగా నాచారమును జెప్పుదురు పూర్వయుగమునుండి మిగిలియీ యుగమునున్న వారును నాచే పూర్వము జెప్పబడినవారునునైన శిష్టులచే ప్రతియుగమున చక్కగా నాచరింపబడినది ధర్మము. త్రయీ, వార్తా, దండనీతి, ఇజ్యా, వర్ణ శ్రమములును శిష్టులచేతను మనువుచేతను పూర్వులచేతను మరల మరల నాచరింపబడినవై పూర్వగతమైనందునను ఆ శిష్టాచారము (ధర్మము) శాశ్వతము-36. దానము, సత్యము, తపస్సు, లోభము లేమి, విద్య, ఇజ్యా, (యాగముచేయుట), ప్రజనీ (సంతానము) దయ-అను నీ యెనిమిదింటి యాచరణములును, ఆచారము యొక్క లక్షణము, సమస్త మన్వంతరములలో శిష్టులును, మనువు సప్తర్షులును నీయాచారము నాచరించుటచే శిష్టాచారమనబడినది. చెవులతో వినుటచే తెలిసినది (భౌతము. స్మరించుట వల్ల వచ్చినది స్మార్తము-అనబడినవి. వేదాత్మమైన యజ్ఞము శ్రాతము. వర్ణాశ్రమాత్మకమైనది స్మార్తము. వాని ప్రత్యంగములను ధర్మము యొక్క లక్షణముగా జెప్పెదను.

అధికధనమును జూచియు ఇతరులడిగినపుడు దాచకుండుట జరిగినది జరిగినట్లు చెప్పుటయు- అను నిది సత్యమట్లు యొక్క లక్షణము బ్రహ్మచర్యము, తపము, మౌనము, ఆహారము లేమియు అనునవి. తపస్సునకు మూలము. అవి భయంకరమై పొందనలవిగానివి. పశువులయొక్కయు, ద్రవ్య-హవిస్సుల యొక్కయు, ఋక్సామ యజుర్వేదముల యొక్కయు, ఋత్విక్కుల యొక్కయు, దక్షిణలయొక్కయు సంయోగము యోగమనబడును-42. తనయందువలనే సర్వప్రాణుల యందును హితాహీతములై సమముగా బ్రవర్తించిన దృష్టియంతయు దయయన బడినది లాగబడినను కొట్టబడినను ఏడువక, కొట్టక మనో-వాక్-కర్మలతో నోరువహించియుండుట క్షమయనబడును మట్టిలో స్వామిచే (ధనస్మామిచే) రక్షింపబడుచున్నవి గాని, యితరులసొమ్ములను దానము జేయుకుండుట యిట అలోభమని చెప్పబడును, మైధునము నాచరింపకుండుట సీసంభోగము చేయకుండుట), దానిని చింతింపకుండుట, దానిని కల్పించుకొనకుండుట ఈ విధముగా దానినుండి నివర్తించుట బ్రహ్మచర్యము. అది యచ్చిద్రమైన(రంధ్రములేని) దమమనబడును. తనకై గాని పరులకై గాని ఇంద్రియములను అసత్యముగా బ్రవర్తింపజేయకుండుట శమముయొక్క లక్షణము-47. దశాత్మకమైన విషయమున ఎనిమిది లక్షణములుగల కారణముండగా ఎట్టయెదుటగొట్టబడియు కోపింపనివాడు జితాత్ముడని విశిష్టముగ భావింపబడును. న్యాయముగా వచ్చినదియు తనకు మిక్కిలి యిష్టమైనదియు నైన ద్రవ్యమును గుణవంతనకీయవలెనని యిచ్చుట దానలక్షణము దానమన్నది కనిష్ఠము, జ్యేష్ఠము, మధ్యమమని మూడు విధములు. అందులో సర్వమంగళమునకై (మోక్షమునకై చేయుదానము జ్యేష్ఠము. స్వార్థసిద్ధికై చేయు దానము కనిష్టము. సర్వభూతములకు కారుణ్యముతో నిచ్చునదియు బంధువులలో చక్కగా విభాగము జేసియిచ్చునది యధమము.

శృతిస్మృతులచే చెప్పబడినది వర్ణాశ్రమాత్మకమైనది ధర్మము శిష్టాచారమునకు విరుద్ధముగానిది. సత్సాధువులనంటి యున్నది ధర్మము. ఇష్టముగాని వారిని ద్వేషింపకుండుట ఇష్టమైన వారిని అభినందింపకుండుట, ప్రీతి తాపము, విషాదము వీని నుండి మజలిపోవుట-విరక్తతయనబడున. చేసిన వానిని చేయనివాని జేర్చియుంచుట (చేయనట్లుగా భావించుట) సంన్యాసము. కుశలమును అకుశలమును రెంటిని వదలుట త్యామనబడును. ఈ అచేతనమున అవ్యక్తమునుండియు అవిశేషమునుండియు వికారము గలుగును. చేతన-అచేతనత్వముల విజ్ఞానమే జ్ఞానమనబడును. పూర్వము స్వాయంభువ మన్వంతరమున ధర్మతత్వజ్ఞుల చేత నీది ధర్మము యొక్క ప్రత్యంగముల లక్షణమని చెప్పబడినది.

 ఇచట మీకు మన్వంతరవిధిని ఇతరేతరవిధిని, చాతుర్వర్ణ్య విధిని వివరింతును. ప్రతిమన్వంతరమున వేరు శ్రుతి విధింపబడును. ఋక్కులు యజుస్సులు, సామములు భూతప్రళయమువజుకును ఒక శతరుద్రీయమును వదిలి ప్రతిదేవతను గూర్చి యున్నది యున్నట్లే యుపయోగింపబడును. విధియు, హోత్రమును, స్తోత్రమును పూర్వమువలెనే ప్రవర్తిల్లును. ద్రవ్యస్తోత్రము, గుణస్తోత్రము, కర్మస్తోత్రము ఆభిజనికస్తోత్రమని స్తోత్రము నాలుగు విధములు. మన్వంతరముల యన్నింటిలోనున్న దేవతలకు నాలుగు విధములగు బ్రహ్మస్తోత్రము ప్రవర్తింపజేయబడును. ఈ విధముగ మంత్రగుణముల యుత్పత్తియు నాలుగు విధములు. అథర్వ యజుస్ సామవేదములలో వేరువేరుగానీ లోకమున ఆచరింపనివి కాని యుగ్రతపమును ఋషులాచరించుచుందుర పూర్వమన్వంతరములలోనిట (తపమాచరించు మునుల యొక్క) సంతోషము వలనను, భయమువలనను, దుఃఖమువలనను, సుఖమువలనను, శోకమువలనను, మంత్రములు ఐదు విధములుగా బుట్టినవి. స్వేచ్ఛగా ఋషులతపమును పూర్తిగా జూచుటచేత ఋషుల ఋషిత్వమును లక్షణములతో జెప్పెదను.

భూతభవిష్యత్కాలములలోని ఋషులు ఐదువిధములుగా జెప్పబడుదురు. అందువలన ఋషులపుట్టుకను, ఋషి సంబంధముల పుట్టుకను జెప్పెదను. ఏ యెక్కువ తక్కువలులేక సత్యరజస్ తమోగుణములు సమోములై నపుడు సర్వసంప్రలయ మేర్పడును. దేవతలకు ఇంద్రియములకు అతిచారము వచ్చినపుడును అతిదేశమువచ్చినపుడును జరిగినట్లే ఆత్మతత్త్యము చేతనమునకై ప్రవర్తించును. అందుచేత అబుద్ధిపూర్వకముగనే (అనుకోకుండగనే) ఆత్మతత్యము చేతనతో నధిష్ఠింపబడును. చేప, నీరును కలిసియున్నట్లే చేతనాధిష్టితమైన తత్యము గుణ స్వరూపమై ప్రవర్తించును. కరణమగుటవలన దానికి కారణము గూడ ప్రవర్తించును. విషయమున విషయందగుట వలనను అర్థమున అర్థిఅగుట వలన-67, కాలమునుబట్టి పొందదగినభేదములు కారణాత్మకములగును బుట్టినవి. ఆ భూతములయొక్క భేదములు వాని పరస్పర భేదములవలన బుట్టినవి. సంసిద్ధికారణమైన కార్యము అప్పటికప్పుడే మారును. కొఱవి విజుగుచు నొక్కమారుగ పైకి బోవును. అట్లే క్షేత్రజ్ఞుడు, (జీవుడు) ఓకే కర్మతో వివృత్తుడగును. (మార్పుజెందును). చీకటిలో మిణుగురు పురుగు అకస్మాత్తుగా గనుబడినట్లే క్షేత్రజ్ఞుడు (జీవుడు) అవ్యక్తము నుండి మార్పుచెంది (వెలిగిన) మిణుగురు పురుగు వలెనే స్పష్టమయి కనిపించును-71. ఆ మహాన్ (గొప్పవాడు-మహద్రూపుడు) సశరీరుడై యెదుట నున్నచోటనే ద్వారశాలాముఖమునున్నవాడై విద్వాంసుడుండును. మహానుడు తమస్సునకు బయట వైలక్షణ్యము వలన భావింపబడును. అచటనే తమస్సునకు చివర విద్వాంసుడుండునని వేదము చెప్పును. పరిభ్రమించుచు మారుచున్నవాని నాలుగు విధములైన బుద్ధి పుట్టినది. జ్ఞానము-వైరాగ్యము-ఐశ్వర్యము-ధర్మం-అనునవినాలుగువిధములు.ఇక, వస్పష్టములైన సాంసిద్దికములు ఆ మహత్స్వరూపుని సశరీరుడైన మహత్స్వరూపుని యొక్క తిరిగి వచ్చుట వలన సిద్ది కలుగునని చెప్పబడినది. ఇచట పురము (శరీరము) నందు శయనించుటచేత గాని జీవులయొక్క శరీరమున శయనించుట చేతగాని, పురమున శయనించుటవల్లను, క్షేత్రజ్ఞానమువల్లను పురుషుడనబడుచున్నాడు. క్షేత్రజ్ఞుడు (జీవుడు) తన క్షేత్రమగుశరీరమున దెలిసికొనుటచే భగవంతుడైన మతియనబడుచున్నాడు. బుద్దితో శయనించుట వల్లనాతడు బోధాత్మకుడైనాడు. సంసిద్దికొటికి వ్యక్తా వ్యక్తమచేతనమైనది. ఈ విధముగా క్షేత్రజ్ఞ (జీవ) రూపమైన నివృత్తి క్షేత్రజ్ఞు(జీవు)ని చే నభిసంహితమై (కూడినదై)నది క్షేత్రజ్ఞు (జీవు) నిచే పూర్తిగా దెలియబడిన వీడు భోగ్యమైన విషయము అని చెప్పబడినది.

ఋషి యను ధాతువు గతియందును, శ్రుతి యందును, సత్యమునందును తరువాత తపస్సునందును వర్తించును. ఇది (గత్యాద్యర్థము) ఋష ధాతువున సన్నియతముగాగా బ్రహ్మచేత నా ఋషి యాయర్ధముననే స్మరింపబడెను. నివృత్తికి సమకాలముననే బుద్దిచే స్వయముగా ఋషి వ్యక్తమయ్యెను. పరమాతనిచే పొందబడును గాన పరమర్షి యనబడినాడు. మొదటినుండియు గత్యర్థకమైన ఋషధాతువునుండి ఋషినామ నిర్వత్తి జరిగినందునను, ఋషి స్వయంభూతుడగుట వల్లను, ఆత్మర్షి యనబడినాడు. ఈశ్వరులు బ్రహ్మయొక్క మానసము నుండి స్వయముగా బుట్టిన వారనబడినారు-81. గొప్పవాడు ఎదుటనందరితో జుట్టబడినవాడై తక్కువగా లెక్కింపబడడు. ధీరులు అంతటను గుణములచే గొప్పవాని జేరుదురు. అందువలన మహర్షులు బుద్దికంటే పరమమును జూచువారుగా చెప్పబడినారు-82. ఆ ఋషులు ఆ యీశ్వరులకును శుభస్వరూపులు. వారు అహంకారమును తమస్సును వదిలి ఋషీత్వమునుబొందిరి-83. అందువలన నాఋషులు (పంచ) భూతములకు ముందే తత్త్యదర్శనులు (తత్త్యమును జూచువారు) ఋషిపుత్రులైన ఋషీకులు మైధునము వలన గర్భంనుండి బుట్టినవారు-84. ఈ మహౌజస్కులు తన్మాత్ర (శబ్దస్పర్శరూప రసగంధము)లను, సత్యమును బొందుదురు. అంతవారు సత్యర్థులై పరములై సత్యదర్శనులగుదురు. 85. ఋషులయొక్క పుత్రులైన వారు ఋషి పుత్రకులు, శ్రుతమును దాని విశేషములను నిజముగా బొందుచున్నారు గావున శ్రుతమును (వేదమును) పూర్తిగా జూచువారై వారు శ్రుతరులగుదురు-86. అవ్యక్తాత్మ-మహాత్మ-అహంకారాత్మ-భూతాత్మ-ఇంద్రియాత్మ-అని యాఋషుల జ్ఞానముగా జెప్పబడినది. ఈ విధముగా ఋషుల జాతులు పేరులతో నైదు వానిని వినుడు-87.

భృగువు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, మనువు, దక్షుడు, వసిష్ఠుడు, పులస్త్యుడు- అని వారు పదుగురు-88. మహాత్ములై ప్రవర్తించినందున నాఋషులు మహర్షులనబడినారు. ఈ ఋషులు ఈశ్వరులయొక్క సుతులు. వారిని గూర్చి వినుడు-89. కావ్యుడు, బృహస్పతి, కశ్యపుడు, ఉశనసుడు, ఉతథ్యుడు, వామదేవుడు, అపోజ్యుడు, ఐశిజుడు, కర్దముడు, విశ్రవసుడు, శక్తి, వాలఖిల్యులు, ధరులు-అనువీరు జ్ఞానమున ఋషిత్వముబొందిన ఋషులుగా జెప్పబడినారు. ఋషిపుత్రులై గర్భమున బుట్టిన ఋషికులను గూర్చి వినుడు. వత్సరుడు,నగ్రహుడు, భారద్వాజుడు, బృహదుక్తుడు, శరద్వతుడు, అస్త్యుడు, ఔశిజుడు, దీర్ఘతమర్షి, బృహదుక్తుడు, శరద్వతుడు. వాజశ్రవసుడు, సువిత్తుడు, సువాక్కు వేష పారయణుడు, దధీచుడు, శంఖమంతుడు, వైశ్రవణరాజు-అనువీరు సత్యమువలన ఋషిత్వమును బొందిన ఋషికులుగా జెప్పబడినారు.

 ఈశ్వరులు, ఋషికులు, అట్లే చెప్పబడిన తక్కినవారును-వీరందరు మంత్రకర్తలు వారిని గురించి పూర్తిగా వినుడు. భృగువు, కావ్యుడు, ప్రచేతసుడు, దధీచి, ఆత్మవంతుడు, ఔర్వుడు, జమదగ్ని, విదుడు, సారస్వతుడు. అద్విణుడు, అరూపుడు, వీతరావ్యుడు, సుమేధసుడు, వైన్యుడు, పృథువు, దివోదాసుడు, ప్రశ్వారుడు, గృత్సమదుడు, నభుడు ఈపంతొమ్మండు ఋషులు మంత్రవాదులు. అంగిరసుడు, వేధసుడు, భారద్వాజుడు, బాష్కలి, అమృతుడు, గౌర్యుడు, శానీ, సంహృతి. పురుకుత్సుడు, మాంధాత, అంబరీషుడు, ఆహార్యుడు, అజామీఢుడు, ఋషభుడు, బలి. పృషదశ్వుడు, విరూపుడు, కణ్వుడు, ముద్గలుడు, యువనాశ్వుడు, పౌరుకుత్సుడు, త్రాసదస్యుడు, దస్యుమంతుడు-100. ఉతథ్యుడు, భరద్వాజుడు, వాజశ్రవసుడు, ఆయాప్యుడు, సువిత్తి, వామదేవుడు, జౌగజుడు, బృహదుక్తుడు, దీర్ఘతపుడు, కక్షివంతుడు ఈ ముప్పది ముగ్గురు అంగిసోవరులనబడిరి. వీరందరు మంత్రకర్తలు ఇక కాశ్యపులను వినుడు.

కాశ్యపుడు, వత్సారుడు, విభ్రముడు, రైభ్యుడు అసితుడు, దేవలుడు,- ఈయాజుగురు బ్రహ్మవాదులు. అత్రి అర్చిసనుడు, శ్యామావంతుడు, నిష్టురుడు, వల్లూతకుడు, మునిధీమంతుడు, పూర్వాతిథి- వీరు అత్రులనబడిరి. వీరు మంత్రకారులైన మహర్షులు. వసిష్ఠుడు, శక్తి, పరాశరుడు, నాల్గవవాడు ఇంద్రప్రమతి, ఐదవ వాడు భరద్వసువు, ఆజవవాడు మైత్రావరుణుడు, ఏడవ వాడు కుండినుడు, ఎనిమిదవ వాడు సుద్యుమ్నుడు, తొమ్మిదవ వాడు, బృహస్పతి, పదవవాడు భరద్వాజుడు- వీరు మంత్ర బ్రాహ్మణ కారకులు. వీరుకర్తలు, విధర్మధ్వంసకారులు. స్వర్వశాఖీయుల బ్రహ్మకు (వేదమునకు) ఇది లక్షణముగా జెప్పబడినది.

  హేతుశబ్దము హననార్థకమైన హి ధాతువునుండి యేర్పడినట్లుగా జెప్పబడినది. ఇతరులచే వనెత్తిన వాదమును ధ్వంసముచేయబడినది. ఇతరులచే లేవనెత్తినవాదమును ధ్వంసము జేయునది అనునర్థమున హేతు శబ్దమేర్పడినది లేదా గతికర్మకమైన హిధాతువువలన కార్యరూపమైన యర్థమును బొందును అనునర్థమున హేతుశబ్దమేర్పడినది. వాక్యార్థమును నిశ్చయించునట్లుగా నిర్వచనమును జెప్పవలయును. ఏ దోషమువలన వాక్కు(మాట) నిందింపబడునో దానిని నిందగా నాచార్యులు జెప్పుదురు. ప్రపూర్వమైన ‘శంసు’ ధాతువునుండి ప్రశంసా పదమేర్పడినది. గుణవంతమని చెప్పుట ప్రశంస ఇది యిది కాదు. అని నిశ్చయింపలేమి సంశయము. ఇదియే చేయతగినది- యనునది విధి యనబడును. ఇతరులకు చెప్పబడుటవలన బుధులచే పరకృతి యనబడును. ఏది యతిమిక్కిలిగా జెప్పబడినదో యది. పురాకల్పమనబడును. పూర్వపు విక్రాంతమును (పరాక్రమించుటను) జెప్పుటవలన పురాకల్పముయొక్క కల్పన జరుగును. మంత్రబ్రాహ్మణ కల్పముల చేతను. శుద్దమై విస్తరమైన నిగమముల (వేదముల) చేతమును నిశ్చయింపక చేయబడిన దానిని వ్యవధారణ కల్పన మందురు. ఇది యెట్లో అది యట్లే ఇది కూడ నెట్లో అది కూడ నట్లే-అని యీ విధమగు బ్రాహ్మణునియొక్క యుపదేశము పదవది. అనునిది బుధుడు బ్రాహ్మణునకు మొదట జెప్పిన లక్షణము. ఆ బ్రాహ్మణునకు ఆ వృత్తి యుద్దేశింపబడినది. బ్రాహ్మణులచే వెంటనే వ్యాఖ్యగూడ ఉద్దేశింపబడినది. వేదవిధిచే జూడబడిన కర్మలలో మంత్రముల కల్పనము గూడ నుద్దేశింపబడినది. మంత్ర యను ధాతువునుండి మంత్రము (శబ్దము) వచ్చినది. బ్రహ్మ (వేదము) యొక్క రక్షణమువలన బ్రాహ్మణుడయినాడు. (వేదరక్షణము బ్రాహ్మణ లక్షణము). అల్పాక్షరములు గలదియు, సందేహము లేనిదియు, సారవంతమైనదియు, విశ్వతోముఖమైన దియు (అంతట ప్రవర్తిల్లునదియు) ఆపులేనిదియు, నిందలేనిదియు సూత్రమని సూత్రవేత్తలు చెప్పుదురు.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ఋషిలక్షణమను నేబదితొమ్మిదవ యధ్యాయము.