వాయు మహా పురాణము
28 - ఋషివంశానకీర్తవం
సూతుడనెను:- భృగువునకు ఖ్యాతి పుట్టెను ఆ తరువాత సుఖదుఃఖములకీశ్వరులును, సమస్త ప్రాణులకు శుభాశుభములనిచ్చువారును, మన్వన్త విచారిణులునునై దేవతలైన ధాత విధాత అనువారలును బుట్టిరి-1. వారిలో జ్యేష్ఠయైయక్కయైనది. లోకభావినియై దేవియైన 'శ్రీ' అనునామే ఆమె సుందరుడై దేవుడైన నారాయణుని పతిగా బొందెను. ఆ సాధ్వియైన లక్ష్మీదేవి నారాయణుని పుత్రులనుగా బల-ఉత్సాహులను వారలను గనెను. ఆమెకు మానసపుత్రులు, పుణ్యకర్ములైన దేవతలకు విమానములనడుపువారును, దివ్యులై చరించువారును జనించిరి-3. విధాతకును ధాతకును ఆయతి నియతి యనువారలు ఇరువురు కన్యలు భార్యలయిరి. వారిరువురికీ దృడవ్రతులగు పుత్రులిరువురు పాండువు మృకండుడు అనువారు గలిగిరి. వారు బ్రహ్మకు (జ్ఞానమునకు) కోశము (నిధి)ఐనవారు సనాతనులైన వారును. మృకండునకు మనస్వినియందు మార్కండేయుడు పుట్టెను-4,5, మార్కండేయునకు మూర్థన్యయను(నామె) భార్యయందు వేదశిరుడను. వాడు జన్మించెను. వేద శిరునకు పేవరియను భార్యయందు వంశకరులైన పుత్రులు పుట్టిరి. వీరందరు వేదపారగులైన ఋషులై మార్కండేయులని ప్రసిద్ధి జెందిరి-6.
పాండువునకు పుండరీకయందు కుమారుడు గా ద్యుతిమంతుడు స్పజవానుడు అను నిరువురు పుట్టిరి. వారిరువురికిని పుత్రులును మనుమలును గలిగిరి. భార్గవులకు (భృగుసంతానములకు) పరస్పరముగా సంతానములు గలిగినవి. స్వాయంభువ మన్వంతరము గడచిపోగా మరీచి (ప్రజాపతికి) గలిగిన సంతానమును వినుడు? మరీచి భార్య సంభూతి పూర్ణమాసుడను కుమారుని గనెను. వారి కన్యలు కృష్టి, పుష్టి, త్విషా, అపచితి, శుభా అనువారు పూర్ణమాసుడు సరస్వతియను, తన భార్య యందు ఇరువురి పుత్రులను గనెను. వారు ధర్మిష్ఠుడైన విరజుడు, పర్వసుడు అనువారు-7,8,9. విరజునకు కుమారుడు విద్వాంసుడైన సుధాముడనువాడు ప్రసిద్ధిజెందెను. సుధామసుతుడైన వైరాజుడు తూరుపు దిక్కున (నెలకొనెను) నాశ్రితుడయ్యెను-10. లోకపాలుడు, చక్కనిధర్మాత్ముడు, గౌరీపుత్రుడై ప్రతాపవంతుడు అయిన పర్వసుడు సర్వగణములకు ప్రవిష్టుడైన (వారితత్త్యము దెలిసిన) మహాశయుడు-11. పర్వసుడు పర్వసయను నామేయందు ఇరువురి సుతులనుగనెను. వారు శ్రీమనుడైన యజ్ఞవాముడు కాశ్యపుడును వారిరువురికి బుట్టిన పుత్రులు గోత్రకరులు (వంశకరులు) ధర్మముచే నిశ్చయింపబడినవారు-12, ఆంగిరసుని భార్య స్మృతి యాయిరువురి కుమారులను పుణ్యాత్ములు లోకప్రసిద్ధురాండ్రు అయిన నలుగురు కన్యకలను గూడగనెను-13. వారు సినీవాలి, కుహు, రాక, అనుమతి యనువారు, అట్లే వారిరువురును భరతాగ్ని కీర్తిమంతుడు-అను ఇరువురిని గనిరి-14.
అగ్ని పుత్రుడైన పర్జన్య ప్రభువును సంహుతి యను నామెకనెను. బంగారు రోమములు గల పర్జన్యుడు మారీచియందు ఒకనిని బుట్టించెను. ఆతడు భూత ప్రళయమువరకుండు లోకపాలుడుగా స్మరింపబడెను-15, కీర్తిమంతుని వల్ల ధేనుకయను నామె యిరువురిని కనీనది. వారు వరిష్ణుడు ధృతిమనుడు, వీరాంగీరసులలో (ఆంగీరస వంశీయులలో) శ్రేష్ఠులు-16. వారిరువురికిని (వరిష్ఠ ధృతిమంతులకు) పుత్రులు పౌత్రులును గలిగిరి. వారు వేలకొలదిగా మించిరి, అనసూయకూడ అత్రిపుత్రులనుగా పాపరహితులైన యైదుగురిని గనేను-17.
అనసూయ శ్రుతియను కన్యను గూడ గనెను. ఆమె శంఖపదునకు తల్లి పులిహప్రజాపతియైన కర్దముని యొక్క భార్య సత్యనేత్రుడు, హవ్యుడు, ఆపోమూర్తి, శనీవరుడు, సోముడు అనునైదుగురు స్యాయంభువమున్వంతరములో ఒకయామము గడచిపోగా అనసూయాత్రిమునులకు బుట్టి ఆత్రేయులుగా ప్రసిద్ది జెందిరి-18,19. స్వాయంభువ మన్వంతరమున యామము గడవగా మహాత్ముడైన యత్రియను గ్రహమున పై యైదుగురికి పుత్రులు పౌత్రులును నూర్లకొలదియు వేలకొలదియు జనించిరి.
పులస్త్యభార్యయైన ప్రీతియను నామెయందు దత్తాలియనువాడు వారి కుమారుడుగా బుట్టెను. పూర్వజన్మలోనాతడు స్వాయంభువమన్వంతరమున అగస్త్యుడనబడెను. మధ్యముడు, దేవబాహువు, వినీతుడు-అనునీ ముగ్గురు వారి పుత్రులు 21. వారి చినచెల్లెలు సద్వతియను నామె ప్రసిద్ది జెందినది. పర్జన్య జననియైన శుభ్రయనునది పౌలస్త్య ఋషికి పత్నియై మొదట శుభయనబడినది-22. ప్రీతికి పుత్రుడై ధీమంతుడైన దత్తాలియొక్క భార్య సుజంఘుడు మొదలగు ననేక పుత్రులనుగనెను. వారందరు. స్వాయంభువ మన్వస్తరమున పౌలస్త్యులనబడి ప్రసిద్ధిజెందిరి-23.
పులహ ప్రజాపతియొక్క పుత్రులను క్షమయనునామెకనెను. వారు అగ్నితేజస్కులు. వారికీర్తి సుప్రతిష్ఠితము-24. కర్దముడు, అంబరీషుడు, సహిష్ణుడు అనువారు ఆమువ్వురు. ఋషియైన ధనకపీవానుడు శుభయైన కన్యపీఠియను నామము వారికి జనించిరి-25. కర్దమునకు శ్రుతి యను నది భార్య ఆత్రేయి యను నామె సుతులను గనెను. పుత్రుడు శంఖపదుడనువాడు కన్యకామ్యయను నామే-26, ఆశంఖపదుడే శ్రీమంతుడై లోకపాలుడై ప్రజాపతియయ్యెను. దక్షిణ దిక్కునందు ఆసక్తుడై ప్రియవ్రతునకు కొమ్యనిచ్చెను-27. ఆ కామ్య ప్రియవ్రతుని వల్ల స్వయంభువైన బ్రహ్మతోసమానులగు పదుగురు పుత్రులను, ఇద్దరు కన్యలను గనెను. వారిచేత క్షత్రియజాతి చక్కగా వ్యాపించెను. (నెలకొనెను).
పుత్రుడైన ధనకపీవానుడు సహిష్ణువని పేరుగాంచెను. యశోధారియైన యాతడు సుమధ్యముడైన కామదేవుని గనెను 29. ఋతువునకు క్రతుసముడైన పుత్రుడు గలిగెను. ఆసంతతి శుభమైనది. వీరందరికి భార్యగాని పుత్రుడుగాని లేరు. వారందరు ఊర్థ్వరేతుస్కులు. ఈయజువది వేల మంది వాలఖిల్యులని ప్రసిద్ధిజెందిరి-30. వీరు సూర్యుని జుట్టుకొని యరుణుని ముందుగా బోవుచుందురు. మహాభూతప్రళయము వరకు వీరు సూర్యునితోడుగా నడుచువారే.
పుణ్యాత్మసుమతీయనునాచిన్న చెల్లెండ్రు పూర్ణమాససుతుడైన పర్వసునకు కోడండ్రు-32. వసిష్ఠునకు ఊర్జయను నామెయందు ఏడుగురు పుట్టిరి. వారికి పెద్దచెల్లెలు సుమధ్యమయైన పుండరీకయను నామె-33. ఆమె పాండువైన ద్యుతిమంతుని యొక్క ప్రియపట్టపురాణి, ఆమెయందు వసిష్ఠవంశీకులైన ప్రసిద్ధిజెందిన యేడుగురు జనించిరి-34. రజసుడు. పుత్రుడు, అర్థబాహువు, సవనుడు, అదనుడు, సుతపుడు, శుక్లుడు-అనువీరందరు సప్తర్షులనబడిరి-35. రజసునినుండి మార్కండేయ యశస్వినిని గనెను. ప్రతీచీదిక్కునందు క్షత్రియుడైన ప్రజాపతియైన కేతుమంతునిగనెను-36. ఆవాసిష్ఠులైన మహాత్ముల యొక్క పేరులతో బాటు గోత్రములు స్వాయంభువమన్వన్తరమున గడిచిపోయినవి. అగ్ని యొక్క సంతతిని వినుడు-37. అనియీ ఋషి సృష్టి సానుబంధముగా జెప్పబడినది. ఆనుపూర్వీతో విస్తరముగా అగ్నిసంతతిని వినుడు-38.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ఋషివంశానుకీర్తనమను ఇరువదియెనిమిదవ యధ్యాయము.
