వాయు మహా పురాణము

Table of Contents

51 -  జ్యోతిష్ప్రచారో

సూతుడనెను:- స్వాయంభువ(మన్వంతర) సృష్టిలో ఉత్తర విషయములన్నియు వ్యాఖ్యానింపబడినవి. వాని యొక్క సమస్త భవిష్య విషయములను క్రమముగా జెప్పెదను. ఇది విని మునులు లోమహర్షణుని (సూతుని) సూర్యచంద్రుల యొక్క సంచారమును. అంతట గ్రహములయొక్క సంచారమును గూర్చి యడిగిరి. ఋషులనిరి. ఆకాశమున ఈ జ్యోతిస్సులు (కాంతిగలవస్తువులు) ఎట్లు మండలముగా తిరుగుచున్నవి? అడ్డముగను సమూహముగను కలియకుండనుఎట్లు తిరుగుచున్నవి? వానినెవ్వడు త్రిప్పుచున్నాడు? లేదా అవి స్వయముగనే తిరుగుచున్నవా?. ఓ మహాజ్ఞానవంతుడా ఇది మేము తెలియదలచితిమి. దానిని మాకు జెప్పుడు. ఇది ప్రాణులందరి నాశ్చర్యమున ముంచునది. దీనిని వినగోరిక గలుగుచున్నది.

సూతుడనెను:- ఇది ప్రాణుల కాశ్చర్యకరము దీనిని జెప్పెదవినుడు. ప్రత్యక్షముగా గనబడుచునే ప్రజలనాశ్చర్యపరచును. ఎవడు శింశు మారచక్రము యొక్కతోకయందు నాలుగు దిక్కుల (బ్రకాశించుచు) చక్కగా స్థిరపడియున్నాడో వాడు ఉత్తానపాదుని పుత్రుడై యాకాశమున మేఘీ భూతుడై ధ్రువుడు (గొఱ్ఱయాకారముననున్నవాడు), అతడు తన చుట్టు తాను తిరుగుచు గ్రహములతో బాటు చంద్రసూర్యులను త్రిప్పుచున్నాడు. తిరుగు చున్నయా ధ్రువుని ననుసరించి నక్షత్రములు చక్రమువలె దీరుగును. ధ్రువుని యొక్క మనస్సుతోనే యీ నక్షత్రగణము స్వయముగ గదిలిపోవును. గ్రహములతో బాటు సూర్యచంద్రులు తారా నక్షత్రములును స్వయముగా కదిలిపోవుచున్నవి. వాయువను సేనతో నిండినబంధములచే గ్రహములతోగూడిన తారనక్షత్రములు కట్టబడినవి. వానియొక్క యోగములు, భేదములు, అట్లే కాలచారములు. అట్లే అస్తోదయములు, ఉత్పాతములు, దక్షిణోత్తరాయణములు, విఘవత్తులు, గ్రహముల వర్ణములను మొత్తము ధ్రువుని నుండీయే ప్రవర్తిల్లును. వర్షములు, ఎండ, మంచు, రాత్రి సంధ్యదినము, అట్లే ప్రజల శుభాశుభులు, సమస్తము ధ్రువునినుండియే ప్రవర్తిల్లును. ధ్రువునిచే నదికృతులైన వారిని తొలగి సూర్యుడుండును. కావున అట్టి ఈ సూర్యుడు మండిన కిరణములుగలిగిన సూర్యుడు కాలాగ్నివలె నుండున. ఓ మహాజ్ఞానులైన బ్రాహ్మణులారా తిరుగునట్టి క్రమమున తన కాంతులతో దిక్కులను వెలిగించుచు(చూచుచు) వాయువుతో గూడిన కిరణజాలముచే సమస్త జగముయొక్క అంతటను జలమును లాగును. సూర్యునిచే త్రాగబడిన జలము సూర్యాగ్నినుండి చంద్రుని సంక్రమించును. వాయువుతో గూడిన (సూర్య) నాడులచే లోకముల యునికి జరుగును. సూర్యుడు చంద్రుడినుండి స్రవించిన జలమును మేఘముల చివరలలో నుండును. వాయువు తాకిడిచే మేఘములు జలమును భూమి పై గురియును. ఈ విధముగా జలము పైకి లేపబడును. మరల క్రింద భూమి పై బడును. అదే జలము అనేక విధముల మారుచుండును. భూతముల నిలుపుటకు ఈ మాయ (విశ్వునిచే) విశ్వవంతయు నిర్మింపబడినది. ఈ మాయచేతనే చరాచరములతో గూడిన మూడు లోకములును వ్యాపించబడినవి.

విశ్వేశుడును, లోకకారకుడును, దేవుడును, వేయికిరణములు గలవాడును. ప్రజాపతియు, బ్రహ్మయును, సమస్తలోకమునకు ప్రభువును, విష్ణువునునైనవాడు దివాకరుడు (సూర్యుడు). సర్వలోకములలోని జలము ఆకాశమున చంద్రుడి నుండి స్రవించినందున ఈ జగమంతయు చంద్రుడాధారముగా గలది. ఇది నిజమని చెప్పబడినది. సూర్యునినుండి జలమువేడిమై స్రవించును. చంద్రునినుండి యది చల్లనగును. శీతోష్ణవీర్యులైన యీ చంద్రసూర్యు లిరువురును గలిసి జగత్తును ధరించుచున్నారు. చంద్రుడాధారముగాగల నది గంగ పవిత్రమై స్వచ్చమైన జలములు గలది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! మహానదులు చంద్రపుత్రులు మొదలైనవి. సర్వప్రాణుల శరీరముల జలములు అనుగతములై యున్నవి. స్థావరజంగమ ప్రాణులైన యవి కాల్పబడుచుండగా నీట ఆ జలములు పొగరూపములై యంతట వెలువడును. దానిచేత ఆయా చోట్లలో నిలిచి యున్న జలముల యొక్క మేఘములు ఏర్పడును. సూర్యతేజస్సు తన కిరణములచేత ప్రాణులనుండి జలమును లాగుకొనును. సూర్యకిరణములు వాయుసంయోగమున సముద్రమునుండి జలములధరించును. ఋతువశమున వర్షకాలమున సూర్యుడు తిరిగినవాడై తన తెల్లని కిరణములచేత తెల్లని నీటిని మేఘములకీచ్చును. మేఘములందున్న జలములు వాయుప్రేరితములై సర్వప్రాణులహితమునకై(వర్షముగా)పడును. ఆ వాయువుల చేతనే సర్వప్రాణులవృద్ది కొఱకు ఆజుమాసములంతట వర్షించును. అపుడు వాయువ్యదిక్కున మెలుపువలన వచ్చిన యగ్నితోబుట్టిన గర్జనము కలుగును. తడుపుట యనువర్షముగల మీహధాతువునుండి మేఘ శబ్దము బుట్టినది. మేహనము(తడుపుటను) చేయుట వలన మేఘమయినదని వ్యాకర్తలు వ్యంజింపజేసిరి. వీనినుండి జలములు జారి పడవు గావున (న భ్రశ్యంతీతి) మేఘములు అభ్రములైనవి అనికవులు వ్యత్పత్తిని జూపుదురు. మేఘములు బుట్టుకోరణములు మూడు అని చెప్పబడినది. ఆగ్నేయములు, బ్రహ్మజములు, పక్షజములు-అని మూడు విధములని మేఘములు చెప్పబడినవి. వాని పుట్టుకను జెప్పెదను. ఆగ్నేయములు (అగ్నినుండి బుట్టినవి) ఐన మేఘములు సముద్రమున బుట్టినవని చెప్పబడినవి. కావున ఆగ్నేయ మేఘములు సముద్రమునుండి బుట్టును. చల్లదనము, మేఘములు ఆకాశమునిండగప్పియుండుట, వాయువులు వీచుట-ఇవి వానిస్వగుణములు. దున్నపోతులు, పందులు, మదపుటేనుగలపై బోవువానిగా నయి భూమిమీదికి వచ్చి చరించును దమించును. జీమూతములను మేఘము ఈ ప్రాణులనుండి బుట్టినవి. మెఱుపులు లేనివి. జలధారలవలే ఆకాశమునుండి నల్లగా వ్రేలాడునవి. మూగవి (గర్జింపనివి) ఘనములు (దట్టమైనవి) ఆకాశమంతయు వ్యాపించినవి, జలప్రవాహమునకు వశమై పోవునవి. ఒక క్రోశము ఎత్తునుండి గాని ఒకటిన్నర కోశము ఎత్తునుండి గాని వర్షించును. పర్వతాగ్రములందును పర్వతమధ్యములందును వర్షించును క్రీడించును. కొంగలు గాడిదలును క్రీడించును. కొంగలు గర్భము ధరించును. ఇక బ్రహ్మజములను మేఘములు:- అవి బ్రహ్మ నిట్టూర్పులవల్ల బుట్టినవి. అవి మెఱుపుతీవలతో గూడియుండును. ధ్వని ప్రియములై గర్జించుచుండును. ఆమేఘముశబ్దధ్వనిచే భూమితన శరీరము పై వృక్షాదుల యంకారములు గలది యగును. రాజుచే పట్టాభిషిక్తురాలైన రాణీ వలె మరల యౌవనవతి యగును. భూతముల (ప్రాణుల) జీవనోత్పత్తికి కారణమై భూమి యా మేఘములందు ప్రేమాసక్తయగును. జీమూతములను నా మేఘములనుండి జీవము బుట్టును. ఆ మేఘము రెండవదైన ప్రవహమను వాయువునాశ్రయించి యుండును. ఇవి ఒక యోజనము (ఎత్తు)నుండిగాని, సార్థార్ధమునుండిగాని, నిష్కృమునుండి గాని వర్షమును గురియును. వాని వర్షధారలు జడివానలుగా నుండుననబడినవి. పుష్కరావర్తకములను మేఘములు పక్షము (ఱెక్క)లనుండి బుట్టినవి. మహాబలముగలిగి, స్వేచ్ఛాగమనము గలిగి బాగా పెరిగిన పర్వతముల లెక్కలు ప్రాణుల యొక్క మంగళమును గోరి యింద్రునిచే తన వజ్రాయుధముతో ఖండింపబడినవి. పుష్కరావర్తకములా పక్షము(ఱెక్క)లనుండి బుట్టినవి. పుష్కరములను నామేఘములు చాల పెద్దవి. జలముతో(మహాజలమున్నదని)మాత్సర్యమును జెందినవి. ఆ కారణముచేతనే యచటసువి పుష్కరావర్తక (జలముజుట్టియున్నవి) శబ్దముతో బిలువబడినవి. అవి యనేకరూపముల ధరించినవి. మిక్కిలి భయంకరములైనవి. కల్పప్రళయవర్షమును గురియగలివి. సంవర్తమను ప్రళయాగ్నిని జల్లార్పగలవి. ఇవి యుగాన్తములలో వర్షించును. ఇవి మూడవవిగా జెప్పబడినవి-అనేక రూపములు, అనేకస్థావరములును గలవై భూతలము నంతయు జలముతో నింపుచున్నవే పరమను వాయువును కల్పసాధకములై ఆశ్రయించును. ప్రాకృతికమైన యండము(పగిలిదాని)నుండి బ్రహ్మపుట్టెను. అతడు నాలుగుముఖములు గలవాడు. స్వయంభువు (తనకుతానే పుట్టినవాడు) ఆ పగిలిన బ్రహ్మాండకపాలమునుండియే జలములు బుట్టినవో అవి యన్నియు మేఘములే యుబడినవి. ఆ జలములకు తృప్తికరమైన నివాసము ధూమము. ఇది యన్ని మేఘములకు సామాన్యము వానిలో శ్రేష్ఠమైనది. పర్జన్యుడు, నాలుగుదిగ్గజములను. ఏనుగులకును, పర్వతములకును, మేఘములకును, పాములకును వేరుగానైన కులమొక్కటే. వానికి పుట్టుస్థానము ఒక్కటే. అది జలమనబడినది. పర్జన్యుడు, దిగ్గజములును హేమనమున శీతమునుండి బుట్టినవి అవి సర్వసస్యముల వృద్దికొఱకు మంచు వర్షమును గుజపించును. శ్రేష్ఠమైన పరివహమను వాయువు వానికి ఉపాశ్రయము. ఈ భగవత్ స్వరూపుడైన పరీవహవాయువు ఆకాశమున గనబడుగంగను భరించును. ఆ గంగ దివ్యమైనది. బహుజలములుగలది. పుణ్యయైనది. సర్వమార్గమున నున్న విద్యయైనది. ఆ గంగ యొక్క కదలికలవలన లిగిన జలమును దిగ్గజములు తమ విశాలములైన తొండములచే తుంపరగా నేగజిమ్మును. అది మంచనబడినది. హిమాలయమునకుత్తరమున దక్షిణముగానున్న గిరి హేమకూటమనబడినది. ఉత్తర హిమాలయమునుండి దక్షిణమున పుండ్రమను నగరమున్నదనబడినది. దానిపై బడిన వర్షము మంచు నుండి పుట్టినది. తరువాత ఆవహమను వాయువు హిమశైలమునుండి వీచుచు తనతాకిడిచే నా మహాగిరిని తడుపుచు నావర్షమును దీసికొనివచ్చును. హివవస్త్రమును దాటి తరువాతి ప్రదేశమున మిగిలిన వర్షము పడున. రెండు మేఘము లీవిముగ తమ వర్షములతో తృప్తిని గలిగించును. ఇదియంతయు చెప్పబడినది. చివరకు సూర్యుడే వర్షములను సృష్టించువాడని చెప్పబడుచున్నది.

 ధ్రువునిచే సూర్యుడు ఆవేషింపబడును.(చుట్టబడును) వారిరువురిచేత వర్షము కలుగును. ధ్రువునిచే జుట్టబడిన వాయువు మరల వర్షమునుపసంహరించును. సూర్యగ్రహమునుండి బయలువెడలి సమస్తమైన నక్షత్రమండలమున వారము చివర ధ్రువునిచే జుట్టబడిన సూర్యుని (జలము) ప్రవేశించును. అందువల్ల ఇక సూర్యరథముయొక్క సన్నివేశమును వినుడు. భగవంతుడైన సూర్యుడు ప్రకాశించు నొకే చక్రముగల రథముచేత నాకాశమున కదలిపోవును. ఆ చక్రము బంటిది, చక్కగా నమర్చబడినది. ఐదు ఆకులు గలది. మూడు నాభులు(బండికంటి తూములు) గలది. బంగారముతో నిర్మింపబడినది.(తేజస్సుతో నిర్మింపబడినది), అమావాస్యాదిపర్వముతో గొప్ప ఓజస్సు(తేజోబలము) గలది. నశించిన దారిచీకటిగలది, ఆయువిధములుగా నున్న ఒక్కచక్రపుటంచు(పట్టా)గలది. ఇట్టి చక్రముగల రథముతో నాకాశమున సూర్యుడు కదలిపోవును. ఈ రథముతో పదివేలయోజనముల విస్తారము పొడవుగలదనబడినది. రథమునందున్న యీషాదండము యొక్క (నాగటి కోలయొక్క ప్రమాణమును బట్టి రెండింతలుగా రథముండును. సూర్యుని యారథము ప్రయోజనవశమున బ్రహ్మచే సృష్టింపబడినది. అది సంగములేనిది. బంగారు మయమైనది. దివ్యమైనది. మిక్కిలి వేగముగా బోవుగుజ్జములు పూన్చినది. గుజ్జములరూపమున నున్న ఛందస్సులతో శుక్రుడున్నవైపుననున్నది. అది వరుణుని రథముయొక్క లక్షణములతో నిట సమానముగా నున్నది. అట్టి ప్రకాశించు రథములతో సూర్యుడు ఆకాశమున కదలిపోవును. తరువాత ఇవి సూర్యుని రథముయొక్క ప్రత్యంగములు (అవయవములు) అవి వరుసగా సంవత్సరము యొక్క యవయవములతో కల్పింపబడినవి. అహస్సు(పగలు) సూర్యుని యొక్క నాభి. అదియే యేక చక్రమనబడినది. ఆ చక్రముయొక్క యైదు ఆకులు ఐదు ఋతువులు అనబడినవి. రథము యొక్క నీడము (చోటు-గూడు) సంవత్సరమన బడినది. రెండు కూబరములు(నోగళు) దక్షిణోత్తరాయణములు. దాని (రథము) బంధరుములు (ఎత్తుతంతలు) ముహూర్తములు. దాని కంటిచీలలు కళలనబడినవి. (ముప్పది కాష్ఠలకాలములు). దానిముక్కు కాష్ఠలు (పదునెనిమిది రెప్పపట్ల కాలములు) దాని యీషాదండము క్షణములు. దాని యనుకరము (నొగచివరిమానితుండు) నిమేషములు. దాని యీష (నాగటికోల) లవములనబడినవి-62. వరూధము (చక్రపుటాకులలో జొప్పించునెమ్ము లేదా కప్పుతోలు) రాత్రి త్తుగా లేపబడిన ధ్వజము ఎండకాలము. దాని యొక్క కాడి చివరలు(బండికన్ను చివరలను) అర్థకామములు రెండనబడినవి. ఏడుగుఱ్ఱముల రూపములైన ఛందస్సులు భూమికి ఎడుమగా లాగుకొనిపోవును. ఆ ఛంధస్సులు- 1గాయత్రి, 2త్రిష్టుప్, 3అనుష్టుప్,  4జగతి, 5పంక్తి, 6బృహత్, ఏడవది ఉస్లిక్ అక్షమున (ఇరుసున) చక్రము బంధింపబడినది. ధ్రువునియందు ఇరుసు జొప్పింపబడినది. చక్రముతో బాటు ఇరుసు తిరుగును. ఇరుసుతో బాటు ధ్రువుడు తిరుగును. ఈ యిరుసు ధ్రువునిచే ప్రేరేపింపబడినదై చక్రముతో బాటు తిరుగును, ఈ విధముగా ప్రయోజనమువలన సూర్యుని రథము యొక్క సన్నివేశమగును. ఆ విధముగా సంయోగభాగముతో ప్రకాశమైన సూర్యుని రథము సంసిద్దమగును. దానిచేత సూర్యదేవుడు ఆకాశమున వేగముగా కదలిపోవును. రథముయొక్క నొగలిరంధ్రముల చివరలకుకట్టబడిన రెండు పగ్గములవంటి రెండు కిరణములు. ధ్రువునితో దిరుగుచున్న చక్రములు లేని నొగల యొక్క(యందలి) రెండుపగ్గములు ఆకాశమున చరించుచున్న సూర్యుని రథము యొక్క మండలములుండును. అవి రథము యొక్క దక్షిణముగా నున్న నొగలిబండి కన్నుల చివరలు అవి రెండు చక్రముల తెల్ల త్రాడువలె ధ్రువునిచే చక్కగా పట్టుకొనబడినవి. ఆ రెండు పగ్గములు (తనచుట్టుతాను) తిరుగుచున్న ధ్రువుని వెంబడించి తిరుగును. అవి ఆ సూర్యరథముయొక్క దక్షిణము వైపుగా నున్న నొగలిబండికన్నులచివరలు. మేకునకు బిగించిన త్రాడు అన్ని దిక్కుల దిరిగినట్లే, ఉత్తరాయణమున మండలములందు ఆరథము యొక్క కిరణములను (పగ్గములను) తగ్గించును. దక్షిణమున మండలములను దిరుగుచు ఆరశ్ములే వృద్ధిజెందును. ధ్రువునిచే సంగ్రహింపబడిన యారశ్ములు ఆకర్షింపబడును. అపుడు ఆసూర్యుడు అభ్యంరమున మండలములను దిరుగును. ధ్రువునిచే విడువబడుచున్న రెండురశ్ములతో రెండు కాష్ఠల కాలముతో (ముప్పదియాలు రెప్పపాట్ల కాలములో) ఎనుబది నూర్లమండలములను (సూర్యుడు) దిరుగును అట్లే వెలుపల గూడ మండలములను దిరుగును. వేగముగా పైన జుట్టుచు మండలములను దిరుగును.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున జ్యోతిప్రచారమనునేబదియొకటవ యధ్యాయము.