వాయు మహా పురాణము

Table of Contents

46 - భువనవిన్యాసో

సూతుడనెను:- ఇది విని యా ఋషులు సమాధానమును వినగోరిన వారై సంతసముతో లోమ హర్షణుని నీ విధముగా నడిగిరి-1.

ఋషులనిరి:- భారత వర్షమును గూర్చి ఉన్నది యున్నట్లు చెప్పినట్లే (ఓసూతా) మాకు కింపురుష వర్షమును గూర్చియు హరివర్షమును గూర్చియు తత్యస్థితిని జెప్పము. ఈ విధముగా బ్రాహ్మణులచే నడుగబడిన సూతుడు మునులు పూర్మము చెప్పినట్లుగా విశ్లేషించి ప్రశ్నానుగుణముగా నీ విధముగా జెప్పెను-3. సూతుడనెను. ఓ బ్రాహ్మణులారా! మీరు వినగోరినది సంతోషముతో వినుడు. ప్లక్షఖండమను కింపురుషదేశముచాల గొప్పది. అది నందనవనముతో బోలును-4. కింపురుషదేశమున మానవులస్థితి పదివేలయేండ్లు అనబడినది. అచటి మానవులు బంగారువన్నెగలవారు. స్త్రీలు అప్సరలవలె నందగత్తెలు-5. వారందరు రోగములులేని వారు. దుఃఖములేనివారు. నిర్మలమైన మనస్సుగలవారు. అట మానవులు కాచిన బంగారు కాంతిగలవారై పుట్టుదురు. ఆ పుణ్యమైన కింపురుష దేశమున తేనెలు వహించు మంగళకరమైన ప్లక్ష (జువ్వి) చేట్టుగలదు. కింపురుష దేశవాసులందరు. దాని యుత్తమ రసమును ద్రావుదురు-7. కింపురుష దేశము తరువాత హరివర్షము (దేశము)గూర్చి చెప్పెదను. అచట మానవులు బంగారుకాంతిగల వారై పుట్టుదురు-8. అంతటను వారు దేవలోకమునుండి జారినవారై దేవరూపులగా నుందురు. హరీవర్షదేశమున మానవులందరు శుభమైన చెరుకు రసం ద్రావుదురు? హరివర్థమున మానవులు సంతుష్టమనస్కులై పదునొకండువేలయేండ్లు జీవించరు. అచట నరులను ముదిమి బాధింపదు. వారు క్షీణింపరు-10.

మధ్యన్నదని నాతో జెప్పబడినది. యిలా వృతవర్షము(దేశము) అచట సూర్యుడు ప్రకాశింపడు. మానవులు క్షీణింపరు. ఇలావృతదేశమున చంద్రసూర్యులప్రకాశముండదు. అచటి మానవులు పద్మపురంగుగలవారు. పద్మకాంతి గలవారు పర్మదళముల వంటి కన్నులు గలవారు. జంబూరస-ఫలములాహారము గలవారు. కపంములేని వారు. సువాసన గలవారు. మానవంతులు. సుఖములనుభవించినవారు. సత్కర్మ ఫలముల ననుభవించువారు. వీరు అందరు దేవలోకమునుండి జారివచ్చియిచట అజరామరులై (ముదీమీ చావును లేనివారై) పుట్టుదురు. ఆ నరశ్రేష్ఠులయొక్క యాయు ప్రమాణము పదమూడు వేలయేండ్లు. ఇలా వృతము మేరువు యొక్క ప్రతి దిక్కున తొమ్మిదివేల (యోజనముల) విస్తారముగల దేశము. ఇచట మానవులు, వేలయేండ్లు జీవింతురు. దాని విస్తారము ఇరువది యారు యోజనములు. అంతట చతురస్రముగనదే ప్రమాణములో నున్నది అది మూకుడువలె నున్నది.

మేరువు యొక్క తొమ్మిదివేల (యోజనముల) పరిమితమైన పశ్చిమభాగమున గంధమాదనపర్వతముగలదు. అదియుత్తరదక్షిణములుగా నీలనీషధపర్వతములవజుకు ముప్పది నాలుగు వేల (యోజనముల?) పొడవు గలదు. భూతలమునుండి నలుబదివేల యోజనముల) యెత్తు పెరిగినది. వేయి (యోజనముల) వరకు భూమిలో మునిగి యున్నది. వేయివఱకే (యోజనము వరకే?) ధిష్టితమైనది. (విస్తారములో నిలచియున్నది).

తూర్పువైపుగా నున్న మాల్యవత్పర్వతము అంతే (గంథమాదనమంతే) ప్రమాణము గలది. అది నీలపర్వతమునకు దక్షిణముగా నిషధ పర్వతమునకు ఉత్తరముగా గలదు. వాటి మధ్యలో మహామేరుపర్వతము మంచి ప్రమాణము గలదిగా చెప్పబడినది. అది యన్ని శైలములకు లోతుగా నున్నట్లుండును. దాని విస్తారము గూడ అంతే ప్రమాణము గలదు. పొడవున లక్ష (నియుతము) ప్రమాణము గలదని చెప్పబడినది. సముద్రము చుట్టుగా గుండ్రముగా నుండుట, వలన భూమండలమని భావనము గలదు. మొత్తముగా పొడవులు చతురస్రములుగా తగ్గును. చదుకముచే చుట్టబడనివై మధ్యనున్నవి భిన్నము (వేరు) అగును.

అచట మర్థించిన కాటుక వలె నల్లనైన జంబూఫల రసముగల నది (జంబూనది) కలదు. మేరు పర్వతమునకు దక్షిణ ప్రక్కగా నిషధ పర్వత (దేశమునకు ఉత్తరముగా, ప్రాచీనమైన సుదర్శనమను నొక పెద్ద జంబూ వృక్షము గలదు. అది నిత్యము పుష్ప ఫలములతో గూడియుండును. సిద్దులచేతను చారణులచేతను సేవింపబడును. ఆ జంబూవృక్షము పేరుతోనే పిలువబడు జంబూద్వీపమున జంబూవృక్షము వృక్షరాజము. ఈ మహావృక్షము ఎత్తు లక్షయోజనములు. అది యంతట నాకాశమును తాకును. తత్యద్రష్టలైన మునులు ఆ జంబూఫలప్రమాణమును ఎనిమిదివందల యజువది యొక్క మూరలు (861) లెక్కించి చెప్పిరి, భూమి పైబడుచుండు నా జంబూఫలములు విశాలమైన ధ్వనిని గలుగజేయును. ఆ భూమియందు జంబూఫలరసము నదిగానయి ప్రవహించును: మేరువును ప్రదక్షిణముజేసి క్రింది జంబూవృక్షమును బ్రవేశించును. అచటి వారు జంబూరసఫలములచే జుట్టబడినవారై యా రసమును సంతుష్టులై త్రాగుదురు. వారు జంబూఫలరసమును ద్రావి ముదిమిని బొందరు. గుఱ్ఱపు సుడిని బొందరు. రోగమును బొందరు. మరణమును గూడ బొందరు. అచట జాంబూనదమున బంగారము దేవభూషణమైయుండును. అది యా రుద్రపురుగువలె నెట్టనిదై ప్రకాశవంతమగును, అది యన్ని వర్ష (దేశ) వృక్షముల యొక్క శభమైన ఫలరసము. అది స్టలితమై శుక్రమగును. అది దేవభూషణమై బంగారము, వారి మూత్ర పురీషములను అన్ని దిక్కులలో భాగములుగా భూమి గ్రసించును. మృతులైనవారిని గూడ (భూమి) గ్రసించును. రాక్షసులు పిశాచులు యక్షులు అందరు హైమవతులుగా జెప్పబడిరి. హేమకూటమున నున్నవారు అప్సరోగణములతోగూడిన గంధర్వులుగా దెలియవలె. నిషధమున శేష-వాసుకి తక్షకులైన సమస్త నాగులు గలరు. మహా మేరువున ముగ్గురు యాజ్ఞికులు సరయిను దిరుగచుందురు. వైడూర్యమయమైన నీలపర్వతమున సిద్ధ బ్రహ్మర్షులు తిరుగుదురని తెలియవలెను. దైత్యులకు దానవులకును శ్వేతపర్వతము తిరుగు స్థానమని చెప్పబడినది. పర్వత శ్రేష్ఠమైన శృంగవత్పర్వతము పితృదేవతలు సంచరించుస్థానము. ఒక విభాగముగానున్న యీయన్ని తొమ్మిదింటిలో నివసించియున్న భూతములు గమనము గలవియు స్థిరముగా నుండినవియునై యున్నవి. వారిలో దేవ మనుష్యుల వివృద్ధియెక్కువగా గనబడును. అనుభవింపగోరువానిచేత చక్కగా లెక్కించుట సాధ్యపడదని విశ్వసింపవలె.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను నలుబది యాఱవ యధ్యాయము.