బ్రహ్మ మహా పురాణము
246 - అస్య శ్రవణ పఠన కర్తౄణాం ఫలప్రాప్తి కథనమ్
ఓ బ్రాహ్మణులారా! పూర్వము మహామతి యగు వ్యాస మహాముని శాస్త్రము నందు చెప్పబడి నవియు ఉచ్చారణమునకు సంబంధించి నవియు అగు పదు నెనిమిది దోషముమలు (ఇవి వ్యాకరణ భాష్యము నందు చెప్పబడి యున్నవి.) లేనివియు మిగుల సార భూతములును దోషములు లేనివియు శుద్ధములును అనేక శాస్త్ర సముదాయ రూపములును అయిన వాక్యములతో నిండి నదియు స్వభావము చేతనే శుద్ధమగు విషయ సమాయోజనముతో కూడినదియు సాధువు లగు వ్యాకరణ విరుద్ధము లను శిష్టులకు అసమ్మతము లును కాని శబ్దములతో ఉప శోభితమును పూర్వపక్ష వచనములతో సిద్ధాంత వ్యవస్థాపనముతో కూడినది అగు ఈ బ్రహ్మ పురాణమును శాస్త్ర న్యాయా నుసారముగ నుండు నట్లు మృదువగు వాక్కుతో వినిపించి మగించెను. (పూర్వ పక్ష వచనముల తోను సిద్ధాంత వ్యవస్థాపనము తోను కూడి శాస్త్ర న్యాయా నుసారముగ నున్నది. అనుట చేత మీ మాంసా శాస్త్ర సిద్ధమగు లక్షణము ననుసరించిన విషయ విభాగ క్రమము కూడ ఈ పురాణ విషయ ప్రతిపాదనములో పాటింప బడినదని తెలియ వలెను. అధికరణము అనగా విషయో విషయశ్చైవ పూర్వ పక్షస్తథోత్తరమ్, ప్రయోజనం సంగతిశ్చ ప్రాంచోధికరణంవిదుః అని చెప్ప బడినది. దీని వివరణము పెద్దల వలన తెలియ దగినది, అనువాదకుడు.) అ ముని శ్రేష్ఠులును వేదములతో సమానమును నర్వవాంఛా ఫలప్రద మును ఆధ్యమును అగు బ్రహ్మ పురాణమును విని హర్షమును ప్రీతిని ఆశ్చర్యము పొందిన వారై కృష్ణద్వైపాయన వ్యాస మహామునిని మరల మరల ప్రశంసించిరి.
ఎంత ఆశ్చర్యమిది! ఓముని శ్రేష్ఠా! మీరు వేదములతో సమానమును సర్వాభీష్ట ఫల ప్రదమును సర్వ పాపహరమును ఉత్తమమును విచిత్ర పదములతో అక్షరములతో కూర్చబడి నదియు అగు
(-----------------------missing pg#714 --------------------------)
ఇది బ్రహ్మచారులును గ్పహస్థులును యతులును కూడ శ్రవణము చేయ దగినది. పవిత్రము. నరులకు ధన సౌఖ్య ప్రదము, పాప నాశనము, బ్రహ్మ తత్త్వము నెరుగ గోరిన బ్రాహ్మణాది వర్ణముల వారందరును శ్రేయోభికాంక్షు లగు వారును ప్రయత్నముతో లెస్సగా దీనిని విన వలెను. అందు వలన బ్రాహ్మణుడు విద్యను క్షత్రియుడు రణమున విజయమును వైశ్యు డక్షయ ధనమును శూద్రుడు సుఖమును పొందును. పురుషుడు శుచి మనస్కుడై ఏఏ కోరికను అభిధ్యానించుచు ఈ పురాణమును వినునో ఆ కోరిక నెల్ల పొందును. అందు సందేహము లేదు. ఈ పురాణము విష్ణుని పరమ దైవతముగా ప్రతిపాదించు నది. సర్వపాప నాశనము. పురుషార్థము లన్నింటిని సంపాదింప జేయునది. అన్ని శాస్త్రముల కంటె విశిష్ట మయినది. నేను మీకు వినిపించిన వేద సంమితమగు ఈ పురాణము వినిన వారికి సర్వ దోషముల వలన కలిగిన పాప రాశియు నశించును. ప్రయాగ పుష్కర కురు క్షేత్రార్బుద క్షేత్రము లందు ఉపవసించుట వలన కలుగు పుణ్యము కలుగును. నరుడు సంవత్సరము పాటు అగ్ని హోత్రమును చక్కగ వేల్చుట వలన కలుగు సుమహా పుణ్యఫలము కలుగును. జ్యేష్ఠ శుక్లైకాదశి నాడు మధురలో యమునా జలమున స్నానము చేసి శ్రీకృష్ణుని దర్శించుటచే కలుగు ఫలము కలుగును. కేశవుని యందు మనస్సు అర్పించి, నిలిపి, సరియగు మనస్స మాధానముతో హరి కీర్తనము చేయుటచే కలుగు ఫలము ఈ పురాణ శ్రవణము నందు (ని) హితమై నిలుపబడి యున్నది. దీని శ్రవణము వలన యజ్ఞక్రియా దర్శనముచే కలుగు ఫలము కలుగును. వేద సదృశ మగు ఈ పురాణమును పఠించి నను విన్నను అతడు విష్ణు లోకమునకు ఏగును. ఏకాదశి ద్వాదశి వంటి పర్వ దినము లందు శుచియై బ్రాహ్మణులచే ఈ పురాణమును వినిపించిన, వినిపించు కొనిన వారు విష్ణు లోకమునకు పోవుదరు. ఇది యశమును ఆయువును సుఖమును కీర్తిని బలమును పుష్టిని కలిగించును. ధన్యునిగా చేయును. దుఃస్వప్నముల నశింప జేయును. చక్కని మన స్సమాధానముతో శ్రద్ధతో ఈ శ్రేష్ఠ మగు ఆఖ్యానమును వినిన వారు సర్వము లగు ఈప్సితము లను పొందుదురు. రోగార్తుడు రోగము నుండి బద్ధుడు బంధనము నుండి భీతుడు భయము నుండి ఆపన్నుడు ఆపదల నుండి విముక్తు డగును. నరుడు పూర్వ జన్మ స్మృతిని విద్యను పుత్రులను మేధను పశువులను ధైర్యమును ధర్మార్థ కామ మోక్షములను. ఇంతయే కాదు ప్రయత మగు, శుచి యగు, మనస్సుతో ఏ కోరికలను సంకల్పించి వినునో ఆ కోరికల నెల్ల పొందును. అందు సందేహమే లేదు. స్వర్గ మోక్ష ప్రదుడును లోకములకు గురుడును (తల్లి తండ్రి విద్య నుపదేశించిన వాడు హితము నుపదేశించు వాడు ఇట్టివారు గురువు లన బడుదురు.) వరముల నిచ్చువాడు నగు విష్ణుని నమస్కరించి భక్తియుక్త మగు ఏక చిత్తముతో శుచియై ఈ పురాణమును నిరతమును వినువారు సమస్త పాపములను నశింప జేసికొని ఇహ లోకమున సమస్త సుఖములను అనుభవించి స్వర్గమున దివ్య సుఖమును పొంది కడపట ఈ ప్రకృతి జన్యము లగు గుణముల నుండి విడుదలను పొంది ముక్తులై మిగుల విమల మగు శ్రీహరి స్థానమును చేరుదురు. అందు వలన స్వధర్మ నిరతులును ముక్తి మార్గమును మాత్రమే కోరు వారును అగు బ్రాహ్మణ శ్రేష్ఠులును నియమ పరులును శాశ్వత శ్రేయస్సును కోరువారు నగు క్షత్రియ పుంగవులును విశుద్ధ వంశమున జన్మించిన వైశ్యులును ధార్మికులగు శూద్రులును ఉత్తమమును బహు ఫల ప్రదమును ధర్మార్థ మోక్ష ప్రదము నగు ఈ పురాణము అనుదినమును విన వలయును. పురుషోత్తము లగు మీ కందరకును ధర్మము నందు బుద్ధి స్థిరమగు గాక! పరలోకము నకు మీరు ఏగి నప్పుడు మీకు బంధువు అది యొక్కటియే. అర్థ కామము లను రెండు పురుషార్థములను మీరు ఎంత జాగరూకులై సేవించినను అవి మీపై సత్ఫలమును చూప జాలవు. వాని ఫలములు స్థిరములై యుండవు. ధర్మముచే నరుడు రాజ్యమును స్వర్గమును ఆయువును కీర్తిని తపస్సును ధర్మమును దానిచే మోక్షమును పొందును. ఇహమునను పర లోకము నను ధర్మమే తల్లి దండ్రులును మిత్రుడును రక్షకుడును మోక్ష ప్రదమును. ధర్మము తప్ప మఱింకేదియు లేదు. ఈ పురాణము రహస్యమును శ్రేష్ఠమును వేదములతో సమానమును. బుద్ధి దోషము కల వానికిని. విశేషించి నాస్తికునకును, ఇంద్రియ గోచరము కాని దేదియు నమ్మ దగినది కాదను వానికిని దీనిని అందించ రాదు. శ్రేష్ఠమును పాప నాశకమును ధర్మమును వృద్ధి చేయు నదియు అగు ఈ పురాణమును నేను ప్రవచించితిని పరమ రహస్య మగు దీనిని మీరు వింటిరి. అయ్యా! పోయి వచ్చెదను. ఆజ్ఞ ఇండు.
శ్లోక సంఖ్య ఆరంభము నుండి - 13,783
బ్రహ్మ మహా పురాణము సర్వమూ సమాప్తము
* * * * *
Summary of chapter 1 of the Brahma Mahā Purana is as follows:
The Gautamī Māhātmya opens with a systematic classification of tīrthas into four types — Daiva (celestial), Āsura (demonic, i.e., obtained by tapas of asuras), Ārṣa (of ṛṣis), and Māṇuṣa (human). The twelve sacred rivers of Bhārata are enumerated. The tīrthas of mountains, sages, and kings are described, establishing the theological framework within which all subsequent tīrtha narratives of the Gautamī will be understood.