బ్రహ్మ మహా పురాణము
183 - కంస విచార కథనమ్
అంతట గంసుండు మనసు తోట్రువడి ప్రలంబుడు కేశి మొదలయిన యసు రప్రముఖులం బిల్చి యిట్లనియె.
ఓ ప్రలంబ! మహావీర! కేశీ! ధేనుక! పూతనా! అరిఫ్ణుడు మున్నగు వారితో నామాట నాలింపుడు. దురాత్ములు అమరులు నన్ను జంప యత్నించు చున్నారు. నేను వీండ్రను లెక్క సేయను. దేవకికి బుట్టిన పిల్ల చెప్పిన మాట లాశ్చర్యముం గల్గించినవి. వారెంత యత్నము సేయు చున్నను వారియెడ నాకు పరిహాసము గల్గు చున్నది. అయినను నా దుష్టుల కపకారము సేయ యత్నింప వలసినదే. త్రికాలము లందు నిత్యమయిన మృత్యువు నా కొఱుకు బుట్టినట్లా బాలిక చెప్పినది. కావున నేపిల్లవాని యందు మిక్కిలి బలము గాన్పించునో వెదకి వానిం దుద ముట్టింపుడు.
ఇట్లాజ్ఞ ఇచ్చి కంసుడింట బ్రవేశించి, దేవకీ వసుదేవులతో వైరము దోపకుండ యిట్లనియె.
ఊరక మీ శిశువులను నేను జంపితిని. కాని యెవ్వడో మఱి యొకడు నా నాశనమునకు బుట్టి యున్నాడు. మీరు బాధ పడకుడు. భావి తప్పదు. మీ యిద్దరి పిల్లలు లేరు గదా! అయుర్దాయ సమాప్తి యందెవడు చంప బడడు.
అని దేవకీ వసుదేవుల ననునయించి కారాగారము నుండి వదలిపెట్టి, సంతోష పరచి తన యంతర్గృహముం బ్రవేశించెను.
Summary of chapter 76 of the Brahma Mahā Purana is as follows:
Troubled by the repeated demonic attacks in Gokula, the elders — led by Nanda and advised by Upananda — decide to relocate. The entire cowherd community, with all its cattle, carts, and families, moves to the beautiful forest of Vṛndāvana on the banks of the Yamunā. The new setting, with its sacred groves and the river, becomes the principal stage for Kṛṣṇa's childhood and adolescent līlās.