ధీశాలి బలభద్రుని పరాక్రమము శౌర్యమును గూర్చి విన గోరెదము. యమునా నదీ సమాకర్షణము మొదలగు నవి విన్నాము. అతడు మఱి యేమిసేసె నన
వ్యాసుడు అనంతుడు భూమిని మోయు నాదిశేషుడు నగు బలరామ మూర్తి లీలలు వినుండు. స్వయంవర మున దృష్టి వెట్టుకున్న దుర్యోధనుని కూతురును జాంబవతి కుమారుడు సాంబుడు బలాత్కారముగ హరించెను. దాన కోపించి కర్ణ దుర్యోధ నాదులు భీష్మ ద్రోణాదులును వానిని బోర నోడించి బంధించిరి. అది విని యాదవులు దుర్యోధ నాదులందు కోపము గొని వారిని గడతేర్తు మని ప్రతి క్రియకుం బూను కొనిరి. వారిని వారించి బలరాముడు సగర్వముగ నేనొక్కడన యేగెద. నా మాటచే వానిని విడచెదరని నాగసము అనుపురికేగి వెలుపలి యుద్యానవన మందు విడిసెను. నగరములోని కేగడయ్యె. బలభద్రుడు వచ్చెనని తెలిసి దుర్యోధనాదులు హలికి గోవును పాద్యార్ఘ్యములను నొసంగిరి. అవి స్వీకరించి కౌరవులతో ఉగ్రసేను నాజ్ఞ యిది. సాంబుని వెంటనే విడుపుడు. అన భీష్మ ద్రోణాదులు కర్ణ దుర్యోధను లును విని కోపించిరి. బాహ్లికాదులతో నందరును యదు వంశము రాజ్యార్హము గాదని చూచి ముసలా యుధునితో నిట్లనిరి.
బలభద్ర! నీయన్న మాట యిదేమి? ఉత్తమ వంశ మందు బుట్టిన వారి కొక యాదవు డెవ్వడాజ్ఞ యిచ్చుటా? ఉగ్రసేనుడు గూడ కౌరవుల కాజ్ఞ సేయు నేని రాజుల కుచితమైన శ్వేత చ్ఛత్ర మీ కెందులకు, అలంకార ప్రాయములివి యెందులకు? బలభద్ర! నీవు సనుము. అన్యాయ వర్తనుని సాంబుని నీయొక్క కాని ఉగ్రసేనుని యొక్క కాని యాజ్ఞను విడిచి పెట్టము. కుకురాంధ కాదులు రాజులు మాకు ప్రణతు లైనారు. అట్టి ప్రణతి సేయక పోగా పైని స్వామికి భృత్యుడిచ్చి నట్టాజ్ఞ సేయుట యేమి? సహాసన సహపంక్తి భోజనములచే మీరు గర్వ మెక్కింప బడినారు. మీ తప్పేమి! ఓ బల! నీ చెప్పిన యీ యుగ్రసేనుడు మాకు పూజనీయు డగుట ప్రేమ చేతనే. కులమును బట్టి కాదు. ఈ మా మర్యాద మీ కులమునకు దగదు. అని కౌరవు లందురు హరి కుమారుని సాంబుని విడువ రైరి. అందరేక నిశ్చయమున గజసా నగరముం జొచ్చిరి.
అదిక్షేపము చే గల్గిన కోపముచే మత్తుగొని ఘూర్ణించుచు లేచి నేలను మడమలం ద్రొక్కి తాటించెను. దాన నీ భూమి పగిలి పోయెను. పెద్ద ధ్వని దిక్కుల బిక్కటిల్ల హలి బాహువులం జరచి కనులెఱ్ఱ వడ కనుబొమలు ముడిపడి మొగము కుటిలము గాగ బలదేవుం డిట్లనియె
అహో! వట్టి నీరసులు దురాత్ము లైనవారి కేమి పొగరిది! మాపై కౌరవుల పెత్తనము కాల ప్రభావము. ఉగ్రసేను నానతి యనుల్లంఘ నీయము (దాట గూడనిది) అని యను కొనరే ఆయన యాజ్ఞను దేవతలతో గూడ శచీపతి సధర్మముగ గైకొనునే. శచీ ప్రియుని యా సుధర్మా సభను ఉగ్రసేనుడే వేళ నధిష్ఠించు చున్నాడు. ఛీ ఛీ! నూరుగురు మనుష్యుల యుచ్ఛిష్ట మైన రాజాసనము నందు వీరికి సంతుష్టియట. పారిజాత తరుపుష్ప మంజరులను ఎవ్వని బంట్రౌతుల యబలా జనము కొప్పులందురుము కొందుఱో యట్టి యుగ్రసేనుడు గూడ వీరికి దొర గాడట. సమస్త సార్వభౌములకు నధి నాథుడైన యుగ్రసేనుం డట్లుండుట! ఇప్పుడు ఉర్వినెల్ల నిష్కౌరవ మొనర్చి యా పురికే నేగెదను. కర్ణుని దుర్యోధను ద్రోణుని యిప్పుడ భీష్ముని బాహ్లికుని దుశ్శాస నాదులను భూరి శ్రవస్సును సోమదత్తుని శలుని భీముని అర్జునుని యాధిష్ఠిరునితో కవలను (నకుల సహదేవులను) మరియుం గల కౌరవులను సాశ్వరథ కుంజరముగ హత మొనర్చెదను. ఆ మీద సాంబుని సభార్యకముగ జేకొని యాపురి కేగెదెను. ద్వారక కేగి యుగ్ర సేనాది బంధువులం జూచెదను. లేదా! ఎల్ల కురు వర్గముతో కౌరవుల భారము హరింప దేవాధీశు ప్రేరణమున శీఘ్రముగ నాగస మను నా నగరమును భాగీరథి లోనికి విసరివై చెదను. అని యిట్లు కోపమున నెఱువువారిన చూపులతో దాలాంకుడుగ ప్రాకారవ్రప్రముస అధో ముఖముగ నాగలి (క్రిందు ముఖముగ) గ్రుచ్చి లాగెను. అతట కౌరవులు గగ్గోలువడి యిట్లు గోల వెట్టిరి.
రామ! రామ! మహావీర! క్షమింపు క్షమింపుము. కోపము నుపసంహరింపుము. ప్రసన్ను డవగుము! ఇడుగో సాంబుడు పత్నితో నీచె వెలువరింప బడినాడు. నీ ప్రభావ మెఱుగని యపరాధులను క్షమింపుము. అని కౌరవులు త్వరగ దమ పురమున కేగి భార్యతో సాంబుని విడిచిరి.
బలవంతుల కెల్ల బలవంతు డగు బలుడు భీష్మ ద్రోణ కృపా చార్యాదులకు ప్రణామములు సేసి శాంతుడ నైతినని పలికెను. ఇప్పటికిని ద్వారక పెల్లగిల్లినది పెల్లగిలి నట్లు కనబడు చున్నది. ఇది బలశౌర్య శాలి బలరాముని ప్రభావము. ఓ ద్విజులార! అవ్వల కౌరవుల సాంబుని హరి సహితంబుగ బూజించి పెండ్లి కానుకలు సారె చీరలు వెట్టి భార్యతో ద్వారకకు బంపిరి.
Summary of chapter 101 of the Brahma Purāṇa is as follows:
Ominous signs of the coming end of the Yādava clan appear — the divine conch and weapons behave ominously, the city of Dvārakā is troubled by bad portents. Sensing the approach of the end of his earthly mission, Śrī Kṛṣṇa prepares the Yādavas for what is to come. The chapter narrates the final period of Kṛṣṇa's earthly sojourn and the portents signaling the conclusion of the divine avatāra's work on earth.