బ్రహ్మ మహా పురాణము
21 - పాతాళ ప్రమాణకథనమ్
ముని శ్రేష్ఠులరా! భూమి యొక్క వైశాల్యము డెబ్బది వేల యౌజనములు, దాని యెత్తునంతే. ఒక్కొక్క పాతాళము వైశాల్యము పదివేల యోజనములు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము, యనునవి సప్త పాతాళములు. అచట కృష్ణా శుక్లా అరుణా పీతా శర్కరా శైలకాంచనీ అను భూములు ఉత్తమ సౌధములతో నొప్పు చుండును. ఆ ప్రదేశము లందు దైత్య దానవ జాతులు వందల కొలది గలరు. బ్రాహ్మణో త్తములారా! అచట పెద్ద సర్ప జాతులు కూడ గలవు.
స్వర్గము కంటెను పాతాళములు రమ్యములని పాతాళముల నుండి స్వర్గమున కేగి సభా మధ్యమున నారద మహర్షి చెప్పిరి. వీరి యందాహ్లాద జనము లైన పరిశుభ్ర కాంతి భరితములైన రత్నము లున్నవి. నాగాభరణ భూషణములు పెక్కు లున్నవి. ఇట్టి పాతాళము దేనితో సాటి యగును. దైత్య దానవ కన్యా రత్నము లిందందు క్రీడింతురు. ఇట్టి పాతాళము ముక్తుడైన వానికి గూడ ప్రీతి జనకమై యుండును. పగటి సూర్యుని కిరణము లిచ్చట కాంతి నొసంగును గాని యెండ వేడిమిని కలిగింపవు. రాత్రి చంద్ర కాంతులును చలిని గాక చక్కని వెలుగును మాత్రమే యిచ్చును. భక్ష్య భోజ్య లేహ్య పానీయ రూపమైన యాహారములచే మదించిన భోగులగు దానవాదులు కాల గమనము నిచట గమనింప సేగమనింపరు. వనములు నదులు సరోవరములు పుంస్కోకిలల కలకలా రావములతో మనోహరములై యుండును. ఇచటి ప్రజలు ధరించు భూషణములు మిగుల రమ్యములు. అంగరాగములు గంధాదులు పరిమళ భరితములు. నిరంతరము వీణా వేణు మృదంగ నాదము శ్రవణ మనోహరముగ వినిపించును. ఇచటి భాగ్యభోగ్యములు పరమ మనోహరములు. పాతాళ వాసులగు దానవులు ద్తెత్యులు నాగులును ఆ భోగము లనుభవించు చుందురు.
పాతాళమున కడుగున విష్ణువు యొక్క తమోమయ శరీరము శేషుడను పేర అనంత కళ్యాణ గుణ నిలయమై తేజరిల్లు చుండును. దేవ, దేవర్షి, సిద్దులచే నత డనంతుడని కీర్తింప బడును. స్యస్తిక ముద్రాంకితములైన వేయి శిరశ్సులచే సహస్రణామణి కాంతి పుంజములచే దెసలను రంజింప జేయు చుండును. లోక హితమునకై ఆయన యచటి యనురులను తన తేజముచే నిర్వీర్యుల నొనరించు చుండును. ఎల్లప్పుడు నొకే కుండలము నాభరణముగ ధరించి, కిరీట ధారియ్తె, పుష్ప మాలా లంకృతుడై మదఘార్ణిత నేత్రుడై అగ్ని సహిత శ్వేతా చలమట్లు ప్రకాశించు చుండును. నీల వసనుడు మదోత్సీక్తుడు శ్వేత వరోప శోభితుడు ఆకాశ గంగాప్రపాత సంయుత కైలాస వర్వత మన్నట్లు ఈ శేషుడు ఒకచేత నాగలియు మరొక చేతి రోకలియు ధరించి వారుణి యను నాగాంగ నతో గూడి యుపాసింప బడును.
కల్పాంత మందు సహస్ర ముఖముల నుండి విషానల జ్వాలలు గ్రమ్ముకొన సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగ త్రయమును మ్రింగి వేయును. గిరి మండలమట్లు అశేష క్షితి మండలమును ఫణాగ్రమున ధరించి ఆశేషు యాశేష సురస మర్చితుడై పాతాళ మూల మంధ ధిష్టించి యున్నాడు. దేవతలు కూడ యతని వీర్య ప్రభావ రూప వైభవము వర్ణింప జాలరు. తెలసికొన జాలరు ఆయన ఫణామణి శిఖాలచే అరుణ మయి కుసుమ మాలిక వలె నిలాతల మఖిలము నిలిచి యున్నది. అట్టి మహానుభావుని శక్తి నెవ్యడు వర్ణింప గలడు.
మదముచే తిరుగ డువడు కన్నులతో నయ్యనంతు నెప్పుడు విజృంభించునో అపుడు భూ మండలమున పర్వత సముద్రముగ కంపించును. గంధర్వాప్సర స్సిద్ధ కిన్నరోరగ వారణులు కూడ ఆశేషాహి గుణముల యంతు తెలియ లేదు. కావుననే యాయన అనంతుడను పేరొందెను. నాగ కన్యా తిలకములు తమ మృదుల కర కమలములచే నతనికి పూయు హరి చందనము శ్వాసా నిలములచే విసరబడి దెసలకు సువాసన భరిత వట వాసమై (పరిమళ చూర్ణమై) వాసించును. ఆ ఫణిరాజు నారాధించి పురాణ మహర్షి గర్గాచార్యుడు జ్యోతి శ్చక్రము యొక్క రహస్యములు నెణుంగనెను. సకల శకున ఫలితములను దెలుప గల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసా వహింప బడిన యీ వసుంధర దేవాసుర మానుష విశేష సహీతము లయిన సర్వ లోకములను ధరింప గల్గుచున్నది.
Summary of chapter 21 of the Brahma Mahā Purana is as follows:
The seven upper cosmic planes — Bhūloka, Bhuvarloka, Svarloka, Maharloka, Janaloka, Tapoloka, and Satyaloka — are described. The nature of each loka, its inhabitants, and the duration of residence there are presented. Brahmaloka at the apex is described as the abode of liberated beings, establishing the vertical cosmological architecture of the purāṇic universe.