దక్ష ప్రజాపతి శంభు ప్రభావముగని ప్రాంజలియై ప్రణతుడై యిట్లు స్తుతంప నారంభించెను. (ఈ దక్షకృత శివస్తుతి శివ సహస్ర నామావళి రూపము. పారాయణ ప్రథానము కావున 2-81 శ్లోకము దాక తాత్పర్యము వ్రాయ బడలేదు శివుని విరాడ్రూ పమున వినుతించిన ఘట్టము.)
ఫలశ్రుతి 81 నుండి 100 దాకా తాత్పర్యము వ్రాయ బడుచున్నది. ఓ సదాశివా ! నీ కన్నులు చాంద్రా దిత్యులు. హృదయము బ్రహ్మ. ధర్మకర్మ సంపాదిత మైన యగ్నిష్టోమము శరీరము. నీ యథార్థమైన మహిమ బ్రహ్మ హరి ఋషులునుం గూడ యెఱుంగ లేరు. నీ శివ మూర్తులు (మంగళ కరము లయిన యాకారములు) సూక్ష్మములు. అవి నాకు దర్శన మిచ్చుగాక! తండ్రి కన్న కొడుకు నట్లా నీ మూర్తులతో నన్ను రక్షింపుము. నీ సంరక్షణలో నుండ దగిన నన్ను రక్షింపుము. నీవు భక్తానుగ్రాహ కుడవు. నేను నీ భక్తుడను. ఏ మూర్తి వేలకొలది పురుషుల నావరించి సముద్ర మవ్వల నుండనో ఆమూర్తి నాకు రక్షక మగుగాక! నిద్ర జయించి శ్వాస నరికట్టి సత్త్వ గుణ స్థాయినంది సమదర్శనులై పరంజ్యోతిని (భ్రూమధ్య స్థానమున) సంయొజన సేసి చూతురో అట్టి యోగాత్మకుడ వైన నీకు నమస్కారము. ప్రళయ మందెల్ల భూతముల భక్షించి జల మధ్యమున శయనించు నా శివునకు నమస్కారము. రాహు ముఖము జొచ్చి రాత్రి సోముని త్రావును. పగలు సూర్యుని గ్రసించును. అట్టి నీ మూర్తికి నమస్కారము. సోముడు అగ్ని అంగుష్ఠ మాత్రులై సర్వ దేవరుల దేహ మందండు పురుషులు (శివ మూర్తులు) నన్నె ల్లపుడు రక్షింతురు గాక నన్నా ప్యాయనము సేయుదురు గాక సంతృప్తుని గావింతురు గాక యని భావము. ఎవ్వరి వలన పిండోత్పత్తి (గర్భోత్పత్తి) జరుగునో యెవరు జల గర్భముం దుందురో స్వాహా స్వధా కారమున హవిర్భాగముల నందు కొందురో అరగింతురో యెవని వలన దేహ ధారులు పుట్టుదురో ఏ మూర్తులు జీవుల నేడి పింతురో (రుద్ర రూవులన్న మాట) ఆనంద పెట్టుదురో క్లేశము గల్గింనరో యట్టి నీ మూర్తులకు నమస్కారము. సముద్ర మందు నదీ దుర్గమందు పర్వతము లందు గుహలందు వృక్షమూల మందు గోశాల లందు నడవులలో గహనములలో చతుష్పథము లందు (నాలుగు దార్లు కలిసిన చోట) వీధు లందు (రాచబాట లందు) చత్వరము లందు (సంస్కృత భూమి) సభలలో ఏనుగు గుఱ్ఱముల సాలలందు పాడు వడిన యుద్యాన వనము లందు ఆలయము లందు పంచ భూతములలో దిక్కులలో విదిక్కులలో ఇంద్ర సూర్యుల నడుమ సూర్య చంద్ర కిరణము లందు బాతాళ మందు అంత కంటెను మీదను నే నీ మూర్తులు గలవో వానకి నమస్కారము. సత్వము నీవే సర్వత్ర వీవే సర్వ భూతపతివి, సర్వ భూతాంత రాత్మవు నీవు, అందుచే నీవు నిమంత్రితుడవు గావు. (పిలువ బడువాడు) వివిధముల దక్షిణలు గల యజ్ఞములచే నీవే యజింప బడుదువు. అంతకును నీవే కర్తవు. అందుచే నీవు నిమంత్రి తుడవుగావు సూక్ష్మమైన మాయయు నీవే. దానిచే నేనును మోహింప బడితిని. (పొరబడితి నన్నమాట) అందు చేతగూడ నిన్ను నేను నియంత్రింప లేను. నిన్ను పేర్కోన లేదని భావము. నాయెడల బ్రసన్నుడ వగుము. నాకు నీవే దిక్కు. నీవే నా గతివి. నీవే నా ప్రతిష్ఠయు (ఉనికి లేక ఆధారమన్న మాట). నీకంటె మఱి యొక్కడు లేడని నా తలంపు. అని యిట్లు మహేశ్వరుని దక్షుడు స్తుతించి యూరు కొనెను.
భగవంతుడు ప్రీతుడై దక్షునింగని మఱియు నిట్లనియె.
నీ చేసిన స్తవముచే సంతుష్టుడ నైతిని. నీవుత్తమ వ్రత నిష్ఠుడవు. ఎక్కువ మాట లెందులకు? నీవు నా సన్నిధికి వత్తువు అని త్రి లోకేశుడు భవుడు సర్వజ్ఞుడు దక్షుని కాశ్వాస కరముగ (ఓదార్పుగ) పలికి! దక్షా! యజ్ఞ ధ్వంసమునకు దుఃఖ పడవలదు. చూచితివి గదా. యజ్ఞ హననము సేసినది నేనే. ఇదిగో నీ యజ్ఞ ఫలము నుత్తమ మైన దానిని నా వలన మఱుల బడయును. ప్రసన్న సుముఖుడవు యేకాగ్ర మనస్కుడ వునై నామాట వినుము. వేయి ఆశ్వ మేధములు నూరు వాజపేయములు సేసిన ఫలము నా ప్రసాదముచే నీవిప్పుడంద గలవు. షడంగ వేదములను సమగ్రసాంఖ్య యోగములను (జ్ఞాన యోగములను) నీవు తెలిసి కొనుము. పండ్రెండేండ్లు దేవ దానవులు చేయలేని ప్రజ్ఞా హీనులు (అజ్ఞానులు) నిందించు నట్టిదియు వర్ణాశ్రమ ధర్మములతో గూడి నదియు లొంగని దియు వ్యవసితమును (వ్యవస్థ చేయ బడినదియు) పశుపాశ విమోచనము సేయునది. (జీవుల యజ్ఞాన పాశముల ద్రెంచునది) సర్వాశ్రమస్థులకు నను వైనదిగ నేను సర్వ పశుపాప విమోచన మంత్రమును రూపొందించి తిని. ఇది లెస్సగ నాచరించిన యెడల పుష్కలమైన ఫలము గల్గును. అది నీకు అనుష్టేయ మగుగాక ! మహానుభావ! మానసిక జ్వరమును(తాపమును) విడువుము.
ఇట్లు దేవేశుండు పలికి ఉమాదేవితో పరివారముతో యంత ర్థానమయ్యెను. మఱియు నా భవుడు సర్వధర్మజ్ఞుడు గావుస సర్వభూత శాంతి కొఱకు దక్షయజ్ఞ ధ్వంసమునకు దానా విర్భవింప జేసిన జ్వరము నీ క్రింది విధముగా విభజించెను. ఈ వివరము నో విప్రోత్తము లారా వినుండు.
ఆ జ్వరము గజములలో శిరోతాపము గను, పర్వతములలో శిలాజితము గను, నీటిలో నీలిక (అను పేరుతోను) పాములలో కుబుసము గను అవులలో ఖోరకము భూమి యందు ఊషరము(చవిటి నేల) కుక్కలకు నేత్రా వరోధము (గ్రుడ్డి తనము) గుఱ్ఱములకు రంధ్రా గతము నెమళ్లకు పించెము లూడి పోవుట కోకిలలకు నేత్ర రాగము గను మహాత్ములకు ద్వేషము సర్వ జనులకు భేదము(ఒంటెత్తు తనము. ఒకరి కొకరికి బడక పోవుట) చిలుకల కెక్కిళ్లు పులులకు శ్రమ(అలసట) మనుష్యులకు కేవలము జ్వర రూపమైన వ్యాధియే ఇది నరులకు పుట్టు నపుడు గిట్టు నపుడు ఆరెంటికి నడుమను గూడ, నుంచ బడినది. ఇది మాహేశ్వర తేజస్సే. జ్వరము (శివ జ్వరము) అనుపేర మిక్కిలి దారుణమై యున్నది. సర్వ ప్రాణులకును ఈశ్వరుడు నమస్కరింప వలసిన వాడు మాన్యుడు(పూజ నీయుడు) ఈ జ్వరోత్పత్తి నిండు మనసుతో జదివిన వాడు రోగ ముక్తుడై సంతోషముతో గూడి సర్వాభీష్టముల నందును.
దక్షుడు సేసిన యీ శివస్తవమును బారాయణము సేసిన వాడె న్నడును అశుభము నందడు. దీర్ఘాయు వందును సర్వ దేవులందు మహా దేవుడు భగవంతుడు శ్రేష్ఠుడయి నట్లు దక్ష కృతమైన యీ శివస్తుతి కూడ సర్వస్తుతి వరిష్ఠము. కీర్తి స్వర్గము దేవైశ్వర్యము ధనము జయము గోరు వారును విద్యా కాములను ఈ స్తవమును భక్తితో పఠింప వలయును. వ్యాధి, దుఃఖము భయమునకు గురియైన వాడు రాజకార్య నియుక్తుడును నీ స్తుతి పఠించిన భయ విముక్తు డగును. అతడీ దేహము తోనే శివ గణములను భవించు మహేశ్వర సుఖమును( పరమేశ్వర విభూతిని) ఇహమంద నుభవించి, గణాధిపతి యగును. యక్షులు పిశాచులు నాగులు వినాయకులును ఆ భక్తుని కెట్టి విఘ్నములు గల్గింపరు. ఈస్తుతిని భక్తితో శివునిపై భావము నిల్పి విన్నచో పుట్టింటను అత్తింటను బూజ్యు రాలగును. దీనిని విన్నను కీర్తించి నను వానికి నిర్విఘ్నముగ సర్వ కార్వసిద్ది యగున. ఇది కీర్తించుటచే మనసు చేత సంకల్పించి నది మాటచే నన్నది యెల్ల పనులు నెరవేరును. కుమార స్వామికి గౌరికి నందీశ్వరునికి ఇంద్రియని గ్రహముతో నియమముతో వేర్వేరు బలిని (పూజను) నోనరించి యా మీద నీ శివ నామములను గ్రమముగ బారాయణకు గ్రహింప వలెను. అందు వలన మానవు డిష్టార్థములను భోగములను పురుషార్థములను బడయును. మరణించి అప్సరః స్త్రీ సహస్రముతో స్వర్గమున కేగును. కోరికలతో పాతకములతో నున్న వాడైన నీ దక్షకృత శివస్తుతి పఠించి సర్వపాప ముక్తు డగును. దేహ పాతా నంతరము గణ సాయజ్య మందును. సురాసుర లపుడు వానిం బూజింతురు. అతడు భూత ప్రళయము దాక వృషభ వాహన మెక్కి, విమాన మెక్కి రుద్రానుచరు డగును.
ఈ విధముగ పరాశర నూనుడు వ్యాస భగవానుడు పలికినాడు. ఇది యెవ్వడు నెఱుగడు. దీని నెవ్వనికి వినిపింప రాదు. ఇది గుహ్యమైన (మంత్ర సమ్మితమైన) స్తవము. పాప జన్ముల యినను వైశ్యులు స్త్రీలు శూద్రులు నీస్తుతి పఠించి విని రుద్రలోక మందుదురు. విప్రులకు ప్రతి పర్వమందు దీనిని వినిపింప వలెను. అందుచే ద్విజుడు రుద్రలోక మందును సందియుము లేదు.
Summary of chapter 40 of the Brahma Purāṇa is as follows:
The sacred land of Utkala (Oḍiśā) is described as a supremely holy territory blessed by the presence of Puruṣottama (Jagannātha). The divine significance of this land, its sacred rivers and forests, and the merit of residing or dying within its boundaries are extolled. The chapter begins the extended Puruṣottama-kṣetra section that continues through many subsequent chapters.