బ్రహ్మ మహా పురాణము
33 - మార్తండ మాహాత్మ్యమ్
పితామహ! సూర్య కథ నెంతవిన్నను తృప్తి లేదు. అగ్నిరాశి వలె వెలుంగు నీ మూర్తికి ప్రభావ మెందుండి యయ్యెనో తెలియ నెంతుము. ఇంకను నా శుభ చరిత్ర మాకానతిమ్ము.
లోకములు తమః ప్రాయములు కాగా చరాచర సృష్టి నష్టప్రాయము కాగా ప్రకృతి యొక్క గుణ వికారమునకు గారణమై బుద్ధి జనించెను. అందుండి యహంకారము, దాన మహా భూతములు నవ్వల నొక యండము జనించెను. ఈ లోకము లెల్ల దాని యందున్నవి. అందు నేను, విష్ణువు, శివుడు నుండి తామస వృత్తులమై యీశ్వరుని ధ్యానించితిమి అపుడు విజ్ఞాన స్వరూపుడు ధ్యాన యోగ మందు మాకు సూర్య రూపుడై గోచరించెను. విశ్వ రూపునిగ మే మాయనను స్తుతించితిమి. “ఆది దేవోసి దేవానాం” “నీవు దేవతల కెల్ల మొదటి దేవతవు” ఇత్యాదిగ మూల శ్లోకములు పారాయణార్హములు వీని భావము సుగమము.
జగత్ ప్రభూ! నీ తేజో రూపము నెవ్వడును సహింప నేరడు. కావున లోక హితము కొఱకది ప్రశాంతమగు గాక! అనినంతట సూర్య భగవానుడు ఘర్మమును వర్షమును జలువను గూడ నీయ గలవాడు కావున జగత్కార్య సిద్ధి కట్లే యగు గాక యనెను. సాంఖ్యులు, యోగులు ముముక్షువులు భాస్కరుని హృదయ మందు చైతన్య రూపమున నున్నవాని గని ధ్యానింతురు. బహు దక్షిణము లైన క్రతువులు వానికి నాధార మైన వేదములు సూర్య నమస్కారము యొక్క కలా మాత్రమున కేని (లేన మాత్రమున కేని) సరిగావు, అది తీర్థముల కెల్ల తీర్థము. మంగళముల కెల్ల మంగళము. పవిత్రముల కెల్ల పవిత్రము నైన దివాకర మూర్తి నందరు శరణందుదురు. సూర్య నమస్కారము సర్వ పాప హరము.
“ప్రజాపతీ! చాల కాలము నుండి మాకు సూర్యుని యష్టోత్తర శతనామములను విన వలెనని కోరిక యున్నది. కాన దయచేసి తెలుపుమని” మును లడిగిరి.
బ్రాహ్మణులారా! మిక్కిలి రహస్యమును స్వర్గ మోక్షముల నిచ్చునదియు నగు సూర్యుని అష్టోత్తర శత నామములను చెప్పు చున్నాను. వినుడు.
గొప్ప తేజశ్శాలి యగు శ్రీ సూర్యుని అష్టోత్తర శత నామములు చెప్ప బడెను. సురాసుర సిద్ధ పితృ యక్ష గణ సేవితుడును, సువర్ణము అగ్ని యొక్క కాంతి వంటి కాంతి గల వాడును నగు భాస్కరుని నా శ్రేయస్సు కొరకు నమస్కరింతును. సూర్యోదయ కాలమున ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును సావధాన చిత్తుడై చదివిన వాడు యోగ్యమైన భార్యను పుత్రులను ధన రత్న సముదాయమును, పూర్వ జన్మ స్మృతిని, జ్ఞాపక శక్తిని, గొప్ప ధారణా శక్తిని పొంద గలడు. సంసార దావాగ్ని సాగరము నుండి విముక్తి నందును. మనోరథముల నెల్ల పొందును.
Summary of chapter 33 of the Brahma Mahā Purana is as follows:
Śiva, wishing to test the steadfastness of Pārvatī's devotion, sends the Saptarṣis in disguise to dissuade her from her vow, enumerating Śiva's inauspicious characteristics — his ash-covered body, wandering lifestyle, lack of wealth, and association with ghosts. Pārvatī firmly rebuts each objection, declaring her unconditional devotion. Śiva himself then appears disguised as a brahmacārin and argues further against his own worthiness, only to be firmly rejected, thus proving Pārvatī's steadfastness beyond doubt.