బ్రహ్మ మహా పురాణము
242 - వసిష్ఠ కరాల జనక సంవాద వర్ణనమ్
వసిష్ఠుడు:
ఈ చెప్పిన విధముగా ఆ అక్షర తత్త్వము జ్ఞాన్వరూపు డయియు అప్రతి బుద్ద, అజ్ఞాన సహిత, రూపుడై అప్రతిబుద్దులగు మన వంటి వారి ననువర్తించు చున్నది. దేహము నుండి మఱియొక దేహములో ప్రవేశించుచు వేల కొలది జన్మలను పొందు చున్నది. వేల కొలది తిర్యగ్యోను లందును దేవతల యందును తపో వంతుడై మహా సద్గుణ యుక్తుడుగా గుణ క్షయముచే మనుష్యుడుగా జన్మించి పుణ్య వశమున స్వర్గమునకు పోవును. మనుష్య లోకమునకు వచ్చును. పాపముచే నరకమునకును పోవును. పట్టు పురుగు తన దేహము నుండి తీసిన దారముతో తన్నే చుట్టు కొన్నట్లు తన నుండి నిష్పన్నము లైన త్రిగుణములతో తన్నే బంధించుకొని ఆ అక్షరుడు తాను స్వభావముచే ద్వంద్వా తీతుడై యుండియు సుఖ దుఃఖ రూపములగు ద్వంద్వములకు లోబడి శిరో రోగము నేత్ర రోగము దంత శూల గల గ్రహము జలోదరము అతిసారము గండమాల విచ్చర్చిక బొల్లి కుష్ఠము అగ్ని దాహము అపస్మారము మొదలగు బాధలను పొందుచు దేహము నేనే అనియు దేహము నాదే అనియు మాయా వశమున కలిగిన అభిమానముచే ఆ బాధలును తనకే అని అభిమానమును పొందు చున్నాడు.
అభిమానముచే కలుగు ఈ ద్వంద్వ జనిత దుఃఖములతో పాటుగ ఆ దేహ త్మాభిమాన వశముననే అహంకార మమకార వశముననే అతడు కొన్ని సుకృతము లను కూడ ఆచరించు చున్నాడు. అవి ఇట్లు ఉండును. ఒకే వస్త్రము ధరించుట నాలుగు వస్త్రముల ధరించుట నేలపై పరుండుట కప్ప వలె పరుండుట వీరాసనములో కూర్చుండుట వీరాసనము తోను ఆకాశము నందును శయనించుట ఇటుకల కుప్పపై బూడిద రాశిపై భూమిపై పండు కొనుట వీర స్థానమున జలముతో తడిసిన చోట కొయ్య, రాతి పలకలపై పరుండుట కాయలతో పండ్లతో పశువులతో పక్షులతో నిండిన చోట ఉద్యానములో కళ్లములో పండుకొనుట పూసలతో వెంట్రుకలతో చేసిన వస్త్రములు వ్యాఘ్ర చర్మము సింహ చర్మము చెట్ల బెరడు పట్టములు నారతో పురి కొసతో నేసిన పట్టాలు మొదలగు నవి. చాపలు, చాపల వంటి ఇతర వస్తువులు నార వస్త్రములు మొద లైనవి తన అభిరుచి ననుసరించి ధరించుట ఒక రాత్రి వదలి మఱియొక రాత్రియు దినమున కొకే మారును నాలుగు భోజన కాలముల కొకమారు ఎనిమిది భోజన కాములకు ఒకసారి ఎనిమిది నాళ్ళకు ఒకసారి ఆరు నాళ్లకు ఒకసారి భోజనము చేయుట మాసో పవాసము చేయుట మూలములు పండ్లు తిని యుండుట వాయువును నూనె పిండి వంటలను పెరుగును గోధుమలతో యవలతో చేసిన వంటలను గో మూత్రమును ఱెల్లు పూవులను నాచును ఎండు టాకులను వివిధములగు పండ్లను భుజించి జీవనము గడపుట కృచ్ఛమ్రులు చాంద్రాయణములు మొదలగు కఠిన వ్రతములు ఆచరించుట వివిధ వేషములు చిహ్నములు అవి నాలుగు ఆశ్రమములలో వేటికి సంబందించిన వైనను ధర్మాధర్మము లలో దేనికి చెందిన వైనను వాటికి సన్నిహితమైన ఇతర లక్షణములను వేద విరుద్థము లైన వానిని ధరించుట వివిక్త మగు శిలల నీడలను సెలయేళ్లను ఇసుక తిన్నెలను అడవులను పర్వత గుహలను వివిధ నియమములను తవస్సులకు యజ్ఞ ములను వివిధ యజ్ఞములను ఆశ్రయించుట బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతి ధర్మములలో తోచిన వాటిని ఆవలంబించుట దీనులు అంధులు మొదలగు వారికి వివిధ దానములు చేయుట వివిధ గుణములను స్వభావములను అలవాటును పాటించుట ధర్మార్థ కామము లతో తనకు అభిమత మగు పురుషార్థము నందు ప్రవృత్తు డగుట ఇవన్నియు దేహాత్మా భిమానము అహంకార మమకారము అనెడి వాని వలన మాయా వశమున కలుగు ప్రవృ త్తులే. స్వాహాస్వధా వషట్ నమస్కారములు యజన యాజ నాధ్య యనాధ్యాపన దాన ప్రతి గ్రహములు జన్మ జరా మృత్యువులు హింస శుభాశుభ కర్మల న్నియు ఈ అభిమానవశ మున కలుగునవే. ఇట్లు ఆ అక్షర తత్త్వమే క్షర రూపమున తన్ను తాను వివిధ రూపము లలో విభజించు కొనుచు వ్యక్త మూర్త రూపమున కనబడు చున్నది.
పూజ్యురాలగు ప్రకృతి దేవియే భయమును ప్రళయమును కూడ కలిగించును. బ్రహ్మ యొక్క పగలు = సృష్టి కాలము అయిన తర్వాత శ్రీ మహా విష్ణువు ప్రళయ మును జరిపి ఈ త్రిగుణములకును వాటి వలన కలుగు సమస్త లక్షణములకును అతీతుడై ఏకైక తత్త్వ మగు తాను మాత్రమే ఉండును. సృష్టి జరుగక నిలిచి పోయిన రాత్రి = ప్రళయ కాలమున సూర్యుడు తన కిరణములను వలె కొంత కాలము పాటు ఆయా గుణ ధర్మములను తన లోపల ఆయన నిగ్రహించి యుంచును. ఇది యంతయు ఆయన ఇట్లు లీలా క్రీడార్థమై చేయుచు తన హృదయము నకు ప్రియములైన ఈ తన రూప గుణములను తనవి అను అభిమానముతో, మమకారముతో, చూచును. ఆయన త్రి గుణాత్మకుడ, త్రిగుణముల కధిపతి, క్రియా ప్రవృత్తి మార్గము నందు ఆసక్తి కలవాడు. క్రియా ప్రవృత్తుల తోను యజ్ఞాది క్రియలతోను సంతతమును కూడి యుండువాడు. అందుచే ఈ సృష్టి ప్రళయ రూపమగు ప్రవృత్తి యందు ముందునకు సాగుచు ఇది నాది యను మమకారమును లీలార్థమై మాత్రమే వహించును. వాస్తవమున ఆ మహానుభావునకు అహంకార మమకార ములు ఏవియు లేవు. ఈ జగ మంతయు ప్రకృతి ధర్మముచే కన్ను గానక రజ స్తమో గుణ ధర్మములచే అనేక విధములుగా వ్యాప్తమై యున్నది. ఈ ద్వంద్వములు సుఖ దుఃఖ, శీతోష్ణాదులు. నాచే అతీతములై నానుండి యుత్పన్నము లగుచు నా యందే లయము నొందు చున్నవి. అని ఆయన ఎరుగును. అవి తనచే లెస్సగ సృజింప బడినవే యైనను తాను సామాన్య జీవుడై యున్నపుడు మాయా వశమున ఏమియు ఎరుగక పోవుటచే అయ్యో! ఇవి యన్నియు నేను తరించ వలెను. దేవ లోకమున నేను ఈ ఫలము లనుభవింప వలెను. ఈ లోకములో నున్నపుడు కర్మ వశమున కలుగు శుభాశుభ ఫలము లనుభవింప వలసి యున్నది. ఈ విధమగు కర్మము లాచరించి సుఖములను సంపాదింప వలెను. ప్రతి జన్మము నందును నాకు సుఖమే కలుగుటకు యత్నించ వలెను. ఇహమున నాకు అనంత మగు దుఃఖములు నరకమున యాతనలు ఉండరాదు. ఒకవేళ నరకమునకు పోయినచో మరల మనుష్య జన్మమును తరువాత దేవత్వమును పొందుదును. అని యిట్లు బ్రహ్మణాది జన్మములు పొందిన ఈ మానవులు ఆయా గుణములతో ఆవరింప బడి భావన చేయుచు అందుకు తగినట్లు కర్మము లాచరించుచు నరకమునో మనుష్యత్వ దేవత్వము లనో పొందుచు కేవలము మమకార వశమున ఈ జనన మరణ రూప సంసార గతిలో తిరుగు చుందురు.
ఈ విధముగా జీవుడు శుభాశుభ ఫలాత్మక మగు కర్మల నాచరించుచు జనన మరణముల నడుమ అనేక రూపములలో సంచరించు చున్నాడు. కాని ఈ జీవుల ప్రవృత్తుల లోను తిర్యగ్యోని మనుష్యత్వ దేవత్వ ప్రాప్తులలోను ప్రకృతియే హేతువు. అది స్వతంత్ర మైనది. జీవుడు ప్రకృతికి అతీతమైన తత్త్వము నందు వ్రణము లేదు. కర్మఫల సంగము లేదు. వ్రణ ద్వారము లనదగిన జ్ఞాన కర్మేంద్రియములు త్రిగుణ జన్యము లైన రాగ ద్వేషాదులు తోడు కాగానే యీ జీవుడు అహంకార మమ కారములు కలిగి తనకు ఇంద్రియములు వ్రణములు చిహ్నములు కాలము సత్తా మరణములు సంచరణము క్షేత్రము సంగము, తత్త్వము, సంసారము నాశము లేకున్నను ఆజ్ఞాన వశమున తనకివి యన్నియు ఉన్నవని భావించుచు పెద్దలను సేవించి వివేకమును సంపాదించక దేవత్వము మొదలు నరక పాతము వరకు గర్భ ప్రకాశము మొదలు మరణము వరకు వివిధ స్థితులకు కారణము లగు వేల కొలది సృష్టులలో సంచరించుచు సంసరించు చున్నాడు. చంద్రునకు పదునారు కలలున్న వని శాస్త్రము చెప్పు చున్నది. వానిలో పదు నైదింటిని మాత్రము దేవత లనుభవింతురు. పదు నారవ కళ మాత్రము దేవతల అనుభవమునకు అందక నిలిచి యుండుచు తానే దేవతలను అనుభవించుచు మరల మరల చంద్రుడు వృద్ధి క్షయములు పొందుటకు మూలమగు చున్నది. అట్లే శుద్ధ మగు ఆత్మ తత్త్వము కూడ అజ్ఞాన వశమున ప్రకృతికి లోబడి ఆయా జన్మ పరంపరలలో వృద్ధి క్షయములను పొందు చుండియు శుద్ధ తత్త్వమునకు ఏమియు అంటక నిలుచును కావున ఆ తాత్త్విక స్థితిని వృద్ధజన సేవనముచే వివేకము పొందియు యోగాది సాధన చేసియు భగవద నుగ్రహము పొంది నప్పుడు గ్రహంచి ముక్తుడగు చున్నాడు.
Summary of chapter 135 of the Brahma Mahā Purana is as follows:
The dialogue deepens with philosophical analysis of the individual soul's relationship to the supreme Puruṣa, the mechanics of bondage through identification with Prakṛti's evolutes, and the precise point at which liberation occurs — when the discriminative insight (viveka) between Puruṣa and Prakṛti becomes perfectly established in the meditating mind. Janaka's perceptive counter-questions sharpen the exposition.