బలరామ కృష్ణులు గలసి యావులను గాచుచు నావనములం దిరుగుచు జక్కని తాల వనమునకు వెళ్ళిరి. ఆ వనమందు నర గో మాంసము లను దినుచు గాడిద రూపమమున ధేనుకుడను దానవుడు వసించు చుండెను. ఆ వనములో దాటి పండ్లు సమృద్ధిగా నుండుట జూచి గోపకులు కుతూహలములో
నో రామ కృష్ణ! ఈ ప్రాంతము ధేనుకుని గాపుదలలో యున్నందున సువాసన గల యీ పండ్లు వదల బడి యున్నవి. వీనిని మేము గోరు చున్నాము. మీకది సమ్మత మైనచో వీనిని రాల గొట్టుదము అన బలరాముడు, కృష్ణుడును వానిని బడగొట్టిరి.
ఆ చప్పుడు విని రాక్షసుడు గర్దభాకారుడు కోపము గొనివచ్చి వెనుక కాళ్ళతో వాని యెదురు రొమ్ముపై గొట్టగా నా కాళ్ళను పట్టుకొని గిరగిర ద్రిప్పి ఆకసమున కెగురు వేసెను. వాడు ప్రాణములను బాసెను. అట్లు పడుచున్న వాని తాకిడికి పండ్లు గుట్టలుగ బడినవి. వాని జ్ఞాతులు ఖరాసురు లెందరో యెదిరింప వాయువు మోఘములను జెదరి గొట్టినట్లు వారి నందరను బలరామ కృష్ణులు ఆ చెట్ల మీదకు విసరిరి. దాన దాటి పండ్లన్నియు నేలపై బడి చూడనిం పుగ దోచెను. క్రూరులగు నా గర్దభా కారులు మడసి పడినంత నయ్యడవి నిరాబాధమై గోపకులు గోవులు హాయిగ సంచరింప మిగుల రమణీయమై యొప్పెను. అందలి పచ్చని లేబచ్చికల యందు నాగొల్ల పిల్లలు తాళ ఫలముల నారంగించిరి.
Summary of chapter 79 of the Brahma Purāṇa is as follows:
Kṛṣṇa persuades the cowherds to worship the Govardhana Mountain rather than performing the traditional Indra-yajña, arguing that the mountain and its pastures sustain their lives more directly. Indra, enraged, unleashes torrential rains and storms. Kṛṣṇa lifts the entire Govardhana Mountain on his little finger, using it as an umbrella to shelter all the inhabitants of Vṛndāvana for seven days, until Indra, humbled, withdraws the storm.