సర్వ భూతము లకును జరుగు ప్రతి సంచరము. అనగా ప్రళయము మూడు విధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతికము 3. అత్యంతికము. వానిలో 1. బ్రహ్మ దేవుని ఆయుః కాలము సమాప్తికాగా కల్పాంతమున జరుగు ప్రళయము నైమిత్తికము. 2. జీవునకు మోక్షము లభించుటయే అత్యంతిక ప్రళయము. 3. రెండు పరార్ధముల కొకసారి జరుగునది ప్రాకృత ప్రళయము అని వ్యాసుడు పలికెను.
మాకు పరార్ధ కాల పరిమాణము తెలిసినచో దానికి రెట్టింపు కాలమగు ద్విపరార్ధముల తరువాత జరుగు ప్రాకృత ప్రళయము మాకవగత మగును. కనుక దానిని తెలుపుమని మునులు వ్యాసుల నడిగిరి.
సంఖ్యల లెక్కింపులో కుడి వైపు నుండి ఎడమ వైపునకు పోగా స్థానపు విలువ పదిరెట్లు పెరుగు చుండును. అట్లు పోగా పదు నెనిమిదవ స్థానముతో పరార్ధ మగును. ఒకట్లు, పదులు, నూర్లు, వేలు, లక్ష, పది లక్షలు, కోటి పదికోట్లు, ఇటు పోగా పదు నెనిమిదవ స్థానములో ఏర్పడు సంఖ్య పరార్థము. అనగా 100,000,000,000,000,000 ఇది పరార్ధ సంఖ్య. ఇన్ని సంవత్సరాల కాలమునకు రెట్టింపు చేసినచో ద్వి పరార్థము. ఇట్టి ద్విపరార్ధ కాలమున కొకసారి జరుగు ప్రళయము ప్రాకృత ప్రళయము. అప్పుడు ఈ వ్యక్త స్పష్ట రూపము కల ప్రపంచ మజతయు తన మూల కారణముతో కూడ అవ్యక్త మగు ప్రకృతి మూల తత్త్వము నందు లయము నొందును.
నైమిత్తిక ప్రళయము వివరింతును. కాల పరిమాణములో మానవుని ఱెప్పపాటు అన్నిటికి మూల పరిమాణము. అట్టి నిమేషములు పదునైదు (పదు నెనిమిది) కాష్ఠ అన బడును. ముప్పది కాష్ఠలు కల పదునైదు కలలు నాడిక. రెండు నాడికలు ముహూర్తము. ముప్పది ముహూర్తములు ఒక రాత్రింబగలు. ముప్పది అహో రాత్రములు మాసము. పండ్రెండు మాసములు సంవత్సరము. ఇట్టి మూడు వందల అఱువది సంవత్సరములు దేవతల సంవత్సరము. పండ్రెండు వేల దేవ సంవత్సరములు ఒక చతుర్యుగము. అనగా కృత త్రేతా ద్వాపర కలి యుగములు నాలుగు అగును. వేయి చతుర్యుగములు బ్రహ్మ దినము. అదియే కల్పము. కల్ప కాలములో పదు నాలుగు మంది మనువులు సృష్టిని లోక వ్యవహారమును నిర్వహింతురు అట్టి కల్పాంతము, బ్రహ్మతో కూడ నైమిత్తిక లయుము జరుగును. దాని స్వరూపము మిగుల భయంకరయు. అది మొదట మీకు తెలిపి పిమ్మట ప్రాకృత ప్రళయ స్వరూపము వివరింతును వినుడు.
వేయి చతుర్యుగముల తరువాత మహీతలము చాల వరకు క్షీణించి పోగా నూరేండ్లు ఎడతెగని అనావృష్టి ఏర్పడును. బలమంతగా లేని ప్రాణు లనేకములు భూమిపై మిగుల పీడల పాలై నశించును. అంతట విష్ణు భగవానుడు రుద్రుని రూపమున సమస్త ప్రజలను తనలో లయము చేసి కొనుటకు యత్నించును. అతడు సూర్యుని ఏడు కిరణముల యందును నిలిచి సమస్త జలమును త్రాగును. ప్రాణు లన్నియు అందుచే శోషించును. సముద్రముల నదుల కొండల సెలయేళ్ళ పాతాళముల లోనున్న నీరంతయు ఇంకి పోవును. దానిచే నీరు మాత్రమే ఆహారముగా గల జీవ రాశులును నశించి పోవును. అంతట ఏడు మంది సూర్యుల ఆవిర్భవించి వారు అన్ని దిక్కులకును ప్రజ్వలించుచు పాతాళ తలము వరకు గల లోకము నంతటిని కాల్చి వేయుదురు. వారి మూలమున ఈ భూమి పర్వతముల సముద్రము లతో కూడ దగ్ధమయి తాబేలు వీపు వలె అయి పోవును. అంతట ప్రళయ కాలాగ్ని రుద్రుని ఆది శేషుని నిశ్శ్వాస వాయువుల తాపముచే సప్త పాతాళము లను కాల్చి వేయును. ఆ అగ్నియే పాతాళము నుండి భూలోకము నకు అచటి నుండి స్వర్గమునకు కూడ పోయి వరుసగా మూడు లోకములను పూర్తిగా కాల్చి వేయును.
అపుడు ఈ మూడు లోకములు జ్వాలల సుడులతో చుట్టి వేయబడి కాలుచున్న వేపుడు మంగలము వలె నుండును. ముల్లోకముల లోని బ్రాహ్మణులును తాపముతో నిండి బలము ఉపక్షీణమై ఎచ్చటను నిలుచుటకు అవకాశము లేక మహర్లోకమునకు పోవుదురు. అచ్చటను మహా తాపముతో తపించి అంతకు పైనున్న జన లోకమునకు పోవుదురు. అంతట రుద్ర రూపుడగు విష్ణువు తన నిట్టూర్పు అవిరులచే మేఘముల సృష్టించును. సంవర్తకము లను పేరుతో ఆ మబ్బులు పెద్ద ఉరుములతో మెఱపులతో ఆకాశ మంతట క్రమ్మును. ఏనుగుల వలె కాటుక వలె నల్ల కలువ పూలవలె న్లలనివి కొన్ని పొగ రంగుతో కొన్ని పచ్చనివి కొన్ని పసుపు వలె లక్క వలె వైడూర్య రత్నముల వలె ఇంద్ర నీలముల వలె శంఖముల వలె మల్లె పూలవలె జాజి పూలవలె అర్ద్ర పురుగుల వలె మనః శిలవలె తామర పూరేకుల వలె వెలిగెడి ఆ మేఘములు అంతటను వ్యాపించును. నగరముల వంటి పర్వతముల వంటి గిడ్డంగుల వంటి మిట్ట నేలల వంటి అకారములతో పెద్ద శరీరము లతో పెద్ద ధ్వనులతో అవి ఆకాశమున నిండును. పెద్ద వానలు కురియించి అభయంక రాగ్ని జ్వాలలను అర్పి వేయును. ఆ అగ్ని చల్లారిన తరువాత కూడ ఆ మేఘములు ఎడతెగక వర్షించుచు లోకము నంతటిని నీటితో ముంచును. అవి బండి ఇరుసంత లావైన జలధారల నీటితో భూమిని నింపిన తరువాత ఊర్ధ్వరుకములను లోడ నింపును. ఇట్లు స్థిర్నర జీవులు జడ చేతనే పదార్థములు అన్నియు నశించి లోక మంతయు అంధకారావృత మైయుండగా ఆ మేఘము లట్లు నూరు సంవత్సరములకు పై కాలము ఎడ తెగక వర్షించు చునే యుండును.
Summary of chapter 125 of the Brahma Purāṇa is as follows:
The naimittika pralaya (Brahma-night dissolution) — in which all beings are absorbed at the end of Brahmā's day and then re-projected at the beginning of his next day — is described. This cyclical dissolution and creation, the cosmic night of Brahmā during which all manifestation withdraws into the unmanifest and then re-emerges, is distinguished from the final dissolution and presented as the natural rhythm of the universe.