ఇట్లు ముచుకుందునిచే బొగడ బడి సర్వభూతే శ్వరుండగు హరి నీ కోరిన దివ్య లోకముల నందుమని యా రాజునకు దెల్పెను. నా సాకతము అవ్యాహతై శ్వర్యముతో దివ్య భోగము లచట ననుభవించి పూర్వజన్మ స్మృతి వడసి యుత్తమ కుల మందు బుట్టి యవ్వల ముక్తి నందుదువు. అన నా రాజు పరమేశ్వరునకు మ్రొక్కి గుహ నుండి వెలువడి వచ్చి వెలి నున్న అల్పాల్ప శరీరులను నరులం జూచును. దానిచే కలి యుగము వచ్చెనని గ్రహించి నర నారాయణ స్థానమైన గంధ మాదనమున (బదరి కాశ్రమమున) తపము సేయ నేగెను.
కృష్ణుడు నుపాయముచే శత్రువును గాలయవనుని గూర్చి వాని సేననెల్ల గొనివచ్చి ద్వారకయం దుగ్రసేనునికి సమర్పించెను. అవ్వల యదు కులము శత్రు భయశంక వోయి స్వస్థత నందెను. బలరాముడును యుద్ధము లెల్ల శాంతింప తన జ్ఞాతులను దర్శించు వేడుకతో నంద గోకులమున కేగెను. గోపికలు గోపకులును ముందటి యట్ల సబహుమానముగ బ్రేమతో గలిసి కొని యచ్చట నుండెను. కొందఱు వచ్చి కౌగిలింప గౌగలించు కొనెను. కొందఱితో నవ్వెను. కొందఱితో ముచ్చట లాడెను. వారు నెన్నో ప్రియ వాక్యములను బలరాముం బలుకరించిరి. కొందఱు గోపికలు ప్రేమతో కొందరీర్ష్య తోడను గూడ ప్రశ్నసేసిరి.
నాగరిక కామినులకు ప్రాణమైన వాడు నిలకడ లేని వలపు తీపులను దొలకు కృష్ణుడు సుఖముగ నున్నాడు గదా! ఆ క్షణమాత్ర సౌహృదుడు (నిమిష మాత్రము వట్టి మెఱపు వలె మెరమిచ్చులు గొలుపు వాడు) నైన చెలిమి గల హరి వారికడ మా చైదముల యెడ బరిహాసము వారి సౌభాగ్య గర్వాతిశయము చేయుట లేదు గదా! బృందావనమున వేణు గానమును విని అనుసరించి వచ్చిన మా రాకను తలంచు చున్నాడా? కన్నతల్లిని జూడ నొక మాటైన నితడు ఇటకు వచ్చునా! ఐనను వాని ప్రసంగము లెందుకు? వేరు మాటలు చెప్పు కొందుము, మనము లేకుండ ఆతనికి, అతడు లేకుండ మనకు సాగదు. అతనికై మేము తండ్రి, తల్లి సోదరుడు భర్త బంధు జనము అను వీరిలో వదలి పెట్టని వారెవరు? అనగా తనకొఱ కిందరను గాదని వచ్చినారము. అట్టి మమ్ములను వదలి యున్న యాతడు కృతఘ్నుడు గదా! ఐన నటకు తిరిగి తాను రాదగిన ఆత్మీక మగు నేదో వస్తువు నుద్దేశించి యుండును. లేదా అట్టి వారెవరికో తన సందేశమిచ్చి యుండ వలెను. అతని వచనామృతము నీవు తెలుప దగును. ఈ దామోదరుడు గోవిందుడు పురస్త్రీలపై నంటిన మనస్సుచే నా యెడల ప్రీతి తొలగి నాడు. ఇక మాకు కనపడడని తోచు చున్నది.
ఇట్లు గోపికలు బలరామునితో పలుకుచునే మైమరచి కృష్ణా దామోదరా యని సుస్వరముగ బిలుచుచు గలకల నవ్విరి. అవ్వల కృష్ణుని సందేశమును మంచిగ మధురముగ నిండుప్రేమ దొలుక స్వాతిశయ మించుకయు గన పడకుండ మధుర స్వర సరసముగ కృష్ణుడు పంపిన సందేశము వినిపించి బలరామునిచే నా గొల్లభామ లోదార్చ బడిరి. అవ్వల బలభద్రుడు మునుపటి యట్ల పరిహాస సుందరులగు గోపకులతో నా వ్రేపల్లె యందు ప్రేమ పూర్వకముగా సంభాషణములు నెఱపెను.
Summary of chapter 90 of the Brahma Purāṇa is as follows:
Balarāma, on a festive occasion, asks the river Yamunā to come to him. When she refuses, he uses his ploughshare to drag her toward him, forcing a new channel. The episode demonstrates Balarāma's immense divine strength even in playful moods, and the Yamunā, subdued, flows where Balarāma directs — confirming the divine authority of both Kṛṣṇa and Balarāma over the forces of nature.