ధర్మజ్ఞా భూమి యందెన్ని పుణ్య తీర్థములు క్షేత్రములు నున్నవో వినవలతుము మెఱింగింపుము!
ఎవని చేతులు పాదములు మనస్సు స్వాధీనములు చేయ బడునో, జ్ఞానము తపస్సు కీర్తియు నెవ్వనికి గల్గునో ఆతడు సర్వ తీర్థముల సేవించిన ఫల మందును. ఎవని మనస్సు మాట, ఇంద్రియములు పరిశుద్ధములో అవి వాని శరీర మందున్న తీర్థములే, అవి స్వర్గ మార్గమును జూప గలవు. అంతః కరణము దుష్టమైన యెడల తీర్థము లందెన్నింట మునిగినను అశుచి యైన కల్లుకుండ నూరు మారులు నీట గడగినను శుచి గానట్లు పరిశుద్ధము గానేరదు. తీర్థములు దానములు వ్రతములు ఆశ్రమములు దుస్స్వభావుని దాంభికుని విశృంఖల సంచారము లయిన యింద్రియములు గల వానిని బవిత్రుని జేయలేవు. ఇంద్రియముల నొదిగించి కొని మనుజుడెం దెందున్నను అదియది వానికి కురుక్షేత్రము ప్రయాగ పుష్కరమును. కావున భూమింగల తీర్థ క్షేత్రములను గురించి క్లుప్తముగ దెల్పెదను వినుడు.
బ్రాహ్మణులారా! మొదటిది పుష్కర తీర్థము. నైమిశారణ్యము ప్రయాగ ధర్మారణ్యము ధేనుకము చంపకారణ్యము సైంధవారణ్యము పవిత్రమైన మగధారణ్యము దండకారణ్యము గయ ప్రభాస తీర్థము శ్రీ తీర్ధము దివ్యమైన కనఖలము భృగు తుంగము హిరణ్యాక్షము భీమారణ్యము కుశస్థలి లోహాకులము కేదారము మంద రారణ్యము మహాబలము కోటి తీర్థము సర్వపాప హర తీర్థము రూప తీర్థము శూకరవ తీర్థము మహా ఫలదాయక చక్ర తీర్థము యోగ తీర్ధము సోమ తీర్థము సాహోటక తీర్థము కోకాముఖ తీర్ధము పవిత్రమైన బదరీ పర్వతము సోమ తీర్థము తుంగ కూటము స్కందాశ్రమము కోటి తీర్ధము అగ్నిపద తీర్థము పందశిఖము ధర్మోద్భవము కోటి తీర్థము బాధ ప్రమోచన తీర్ధము గంగా ద్వారము పంచకూటము మధ్య కేసరము చక్రప్రభ మతంగ తీరము కుశదండ తీర్థము దంష్ట్రాకుండము విష్ణు తీర్ధము సార్వకామిక తీర్ధము మత్స్యతిల తీర్ధము బదరీ సుప్రభ బ్రహ్మకుండము వహ్నికుండము సత్యపద తీర్ధము చతుస్స్రోతస్తీర్ధము చతుశ్శృంగము ద్వాదశ ధారక శైలము మానసము స్థూల శృంగము స్థూల దండము ఊర్వశీ తీర్ధము లోక పాలము మనువరము సోమ శైలము సదాప్రభ మేరు కుండము సోమాభిషేచన తీర్ధము మహాస్రోత స్తీర్ధము కోటరకము పంచధార త్రిధారక సప్తధార ఏకధార అమరకంటక తీర్థము శాలగ్రామ తీర్ధము చక్ర తీర్ధము కోటిద్రుమ తీర్ధము బిల్వ ప్రభము దేవహ్రదము విష్ణు హ్రదము శంఖప్రభ పున్నాగ తీర్ధము దేపప్రభ విద్యాధరము గాంధర్వము ళ్రీతీర్ధము బ్రహ్మహ్రదము సాతీర్ధము లోకపాల తీర్ధము మణిపూర గిరి పంచహ్రదము పుణ్యమైన పిండారక తీర్ధము మాలవ్య తీర్థము గోప్రభావ గోవర తీర్థము వటమూలక తీర్ధము స్నాన దండము ప్రయాగ గుహ్య విష్ణుపద కన్యాశ్రమ వాయు కుండ జంబూ మార్గ గభస్తితీర్ధ యయాతి పతన కోటితీర్థ భద్రవట తీర్థప్రజ అర్బుద మహా కాలవన నర్మదా తీర్థ పింగు తీర్థ వాశిష్ఠ పృధునంగమ దౌర్వాసిక పింజరక ఋషితీర్థ బ్రహ్మ తుంగ వనుతీర్ధ కుమారిక శత్రుతీర్ధ పఞ్చనద రేణుకా తీర్ధ పైతా మహ విమల రుద్రపాద మణిమత్త కామతీర్ధ కృష్ణ తీర్ధకుశావిల యజన యాజన బ్రహ్మవాలుక పుష్పన్యాన పుండరీక మణిపూర దీర్ఘసత్ర హయపద అనశన గంగోద్భేద శివోద్భేద నర్మదోద్భేద వస్త్రాపద దారుబల ఛాయారోహణ సిద్ధేశ్వర మిత్రబల కాలికాశ్రమ వటాపట భద్రవట కౌశాంబి దివాకర సారస్వత ద్వీవ విజయ కామద రుద్రకోట సుమనస నద్రావనామిత స్యమంత పంచక బ్రహ్మతీర్థ సుదర్శన సతత పృధివీ సర్వ పారిప్లవ పృధూదక దశాశ్వమేధిక సర్పిజ విషయాంతిక కోటితీర్థ, పంచనద, వారాహ, యక్షిణీహ్రద తీర్ధ పుండరీక సోమతీర్థ ముంజివాట బదరీవన ఆసీన రత్నమూలక లోకద్వార పంచ తీర్థ కపిలా తీర్థ సూర్య శంఖినీ గోభవన యక్షరాజ బ్రహ్మావర్త సుతీర్థ కామేశ్వర మాతృతీర్థ ళీతవన స్నానలోమావహ మాన నంసరక దశాశ్వమేధ కేదార బ్రహ్మోదుంబర సప్తర్షికుండ దేవీతీర్థ సుజమ్బుక ఈహాస్పద కోటికూట కిందాన కింజప కారండవ అవేద్యన త్రివిష్టప పాణిఖాత మిశ్రక మధూవట మనోజవ కేశికీ దేవలోక ఋణ మోచన దివ్య నృగధూమ విష్ణుపద అమరహ్రద కోటితీర శ్రీకుంజ శాలితీర్థనై మిశేయ బ్రహ్మస్థాన సోమకన్యా లోక బ్రహ్మ తీర్థమనస్తీర్థ కారుపావన సౌగంధిక వనమణి సరస్వతి ఈశాన వ్రవర పావన పాంచయంజిక త్రిశూలధర మాహేంద్ర దేపస్థాన కృతాలయ శాకంభరి దేవతీర్ధ సువర్ణాక్ష కలిహ్రద క్షీరస్రవ విరూపాక్ష భృగు కుశోద్భవ బ్రహ్మతీర్థ బ్రహ్మయోని నీలపర్వత కుబ్జాంబ భద్రవట వశిష్ఠపద స్వర్గద్వార ప్రజాద్వార కాళికాశ్రమ రుద్రావర్త సుగంధాశ్వ కపిలావన భద్రకర్ణహ్రద శంకుకర్ణహ్రద సప్త సారస్వత ఔశనస కపాల మోచన అవకీర్ణ కామ్యక చతుస్సాముద్రిక శతిక సహస్రిక రేణుక పంచవటక విమోచన ఔజసస్థాణు కురుతీర్ధ స్వర్గద్వార కుశధ్వజ విశ్వేశ్వర మాణవక కూప నారాయణాశ్రను గంగాహ్రదవట బదరీపాటన ఇంద్రమార్గ ఏక రాత్ర క్షీరకావాస సోమ దధీచ శ్రుత కోటితీర్ధస్థలీ భద్రకాళీ అరుంధతీ వనబ్రహ్మావర్త అశ్వవేది కుబ్జావన యమునా ప్రభవ వీరప్రమోక్ష సింధూత్థ ఋషి కుల్యా సకృత్తిక ఉర్వీసంక్రమణ మాయావిద్యోద్భవ మహాశ్రమ వైతసికారూప సుందరి కాశ్రమ బాహుతీర్థ చారుసదీ విమలాశోక పంచనద మార్కండేయ సోమ సితోద మత్స్యోదరి సూర్యప్రభ సూర్యతీర్ధ అశోకవన అరుణాస్పద కామద సవాలుక శుక్ర పిశాచమోచన సుభద్రాహ్రద విమల దండకుండ చండీశ్వర జ్యేష్ఠస్థానహ్రద బ్రహ్మసర జై గీషవ్యగుహా హరికేశవన అజాముఖనర ఘంటాకర్ణహ్రద పుండరీకహ్రద కర్కోటకవాపీ సుపర్ణోదపాన శ్వేతతీర్ధహ్రద ఘర్ఘరికా కుండ శ్యామాకూప చంద్రికా శ్మశాన స్తంభకూప వినాయక హ్రద, సింధూద్బవమాప బ్రహ్మనర రుద్రావాన నాగతీర్థ పులోమక భక్తహ్రద క్షీరనర ప్రేతాధార కుమారక బ్రహ్మావర్త కుశావర్త దధికర్ణోధపాన శృంగమహాతీర్ధ మహానదీ బ్రహ్మసరగయా శీర్ష అక్షయవట దక్షిణ గోమయ ఉత్తరగోమయ రూపశీతిక కపిలాహ్రద గృధ్రవట సావిత్రీహ్రద ప్రభాసన సీతవన యోనిద్వార ధేనుక ధన్యక కోకిలా మతజ్గహ్రద పితృకూప రుద్రతీర్థ శక్రతీర్థ సుమాలి బ్రహ్మస్థానస ప్తకుండమణి రత్నహ్రద కౌశిక్య భరత జ్యేష్ఠాలికా విశ్వేశ్వరకల్పనర కన్యానంవేద్య నిశ్చీవాప్రభవ వశిష్ఠాశ్రమ దేపకూట కూప వసిష్టాశ్రమ వీరాశ్రమ బ్రహ్మసర బ్రహ్మవీర అవకాపిలి కుమారధార శ్రీధారా గౌరీ శిఖర శునఃకుండ నందితీర్థ కుమారవానశ్రీ వాసజౌర్వసీ తీర్థకుంభ కర్ణహ్రదతీర్థ కౌశికిహ్రద ధర్మకామ తీర్థ ఉద్ధాలక సంధ్యా కారతోయ కపిల లోహితార్ణవ శోణోద్భవ వంశగుల్మ ఋషభ కలతీర్థ పుణ్యావతీ హ్రద బదరీకాశ్రమ రామతీర్థ పితృవస విరజా మార్కండేయ వన కృష్ణతీర్థ వటతీర్థ రోహిణీ వ్రవర తీర్థ ఇంద్రద్యుమ్న నరతీర్థ సానుగర్త మహేంద్ర తీర్థ శ్రీనద ఇషుతీర్థ వార్షభ కావేరీహ్రద కన్యా గోకర్ణ గాయత్రీ స్థాన బదరీహ్రద మధ్యస్థాన వికర్ణక జాతీహ్రద దేవకూప కుశప్రవణ సర్వదేవవ్రత కన్యాశ్రమహ్రద వాలఖిల్య మహర్షి అఖండిత హ్రద నామక తీర్థము లివి. వీనిని శ్రద్ధతో సేవించి స్నానాది విధులు చేసి ఉపవసించి జితేంద్రియుడై దేవర్షి పితృ తర్పణములు గావించి దేవతార్చనము చేసి మూడు రాత్రు లిందుపవ సించిన వారికి వేరు వేరు ఫలము లనంత ములు కల్గును, దాన నశ్వమేధ యాగ ఫలము గల్గును. సంశయము లేదు. ఈ తీర్థ మహాత్మ్యము నిత్యము విన్నను పఠించి నను సర్వ పాప విముక్తి గల్గును.
Summary of chapter 25 of the Brahma Purāṇa is as follows:
The Bhāratavarṣa is described in loving detail: its mountains including the Himālayas and Vindhya; its great rivers — Gaṅgā, Yamunā, Sarasvatī, Godāvarī, Narmadā, and Sindhu; its regions and kingdoms. Bhāratavarṣa is extolled as the supreme karma-bhūmi, the only land in all the worlds where human beings can perform sādhana and accumulate merit toward liberation.