బ్రహ్మ మహా పురాణము
58 - నృసింహ మాహాత్మ్య వర్ణనమ్
ఇట్లు బలరాముని కృష్ణుని సుభద్రను జూచి మ్రొక్కిన యతడు ధర్మది పురుషార్థములను నాల్గింటిని బడయును. దేవాలయము వెడలి నమస్కరించి యిసుకలో దాగి యున్న యింద్ర నీలమణి స్వరూపుడగు విష్ణుని దర్శించిన భక్తుడు వైకుంఠమున కేగును.
హిరణ్యకశిపుని సంహరించిన నరసింహ మూర్తి సర్వ దేవతా మయము నిచట దర్శించిన నతడు సర్వపాప విముక్తు డగును. నరసింహ భక్తుల కసాధ్యము లేదు. సర్వాభీష్టములు లభించును. ఆయన సర్వ పురుషార్థ ప్రదాత.
నరసింహమూర్తి ప్రభావమును విపులముగా వినవలతుము. ఆయన యెట్లు ప్రసన్ను డగును. ఆయన వలన కలుగ సిద్దులేవి. దయచేసి తెల్పుము. ఆన బ్రహ్మ యిట్లనియె.
మునులారా! ఆయన యజయ్యుడు “ఊహ కందడు. భుక్తి ముక్తి ప్రదుడు. ఆయన గుణ సంపద దెలుప వశము గాదు. ఆయన యనగ్రహముచే దైవమానను సర్వ సిద్దులు లభించును. ఆయన దయచే స్వర్గ మర్త్య పాతాళాదు లందు నప్రతిహతమైన గమన మేర్పడును. చరాచరముల యందు నరసింహ భక్తున కసాధ్యము లేదు. నరసింహా స్వామి ప్రసన్ను డగుటకు సురాసురులకు గూడ తెలియని యాయన తత్వమును, ఉపాసనా కల్పమును చెప్పెదను. వినుండు.
నృసింహో పాసకుడు ఆకులు, దుంపలు,యవల, పండ్లు, పేలపిండి, ఒలము మాత్రముతో వర్తించుచు పట్టుగోచి పెట్టుకొని యరణ్యము నందు నదీ సంగమము నందు ఊషర క్షేత్రము నందు సిధ్ద క్షేత్రము నందు స్వామిని ప్రతిష్ఠించి జితేంద్రియుడై సమాధి నిష్ఠుడై కల్ప విధానముచే బూజింప వలెను. శుక్ల పక్ష ద్వాదశి నాడు ఉపవసించి నృసింహ మంత్రము నిరువది లక్షలు జపింప వలెను. దానిచే మహాపాత కోప పాతకముల నుండి ముక్తు డగును.
స్వామికి ప్రదక్షిణ మాచరించి షోడ శోపచార పూజల నొనరించి నమస్కారము చేయవలెను. పచ్చ కర్పూరము నలదు నద్దిన పూవులను శిరసు నందుంచిన సిద్దిని బడయ గలరు. అన్ని పనులు అప్రతిహముగ సఫల మగును. బ్రహ్మ రుద్రాదు లేని యాయాన తేజస్సును నోర్వ జాలరు. దానవ, సిద్ద, గంధర్వ, మానుషాదుల విషయము చెప్పనేల. ఆసురములైన మంత్రములు నాభిచారికము లును నృసింహ మంత్ర జపముచే బ్రళయము చెందును. నృసింహ కవచము నొక్కసారి జపించిన సర్వో పద్రవముల నుండి రక్షించును. రెండుసార్లు జపించిన దేవ దానవ యక్ష భూత ప్రేత పిశాచాదుల బాధలు నశించును. మూడు సార్లు జపించిన పండ్రెండు యోజనముల మేరలో నురాసురలకు నభేద్య డగును.
ఇట్లా భగవంతుని పూజించి యాసాధకుడు నృసింహ బిల ద్వారమున కేగి మూడు రాత్రులు మోదుగ సమిధలచే నగ్నిని జ్వలింప జేసి త్రిమధు రస పూతము లైన మోదుగ సమిధలను హోమము చేయ వలెను. రెండు వందల హోమములను వషట్కార పూర్వకముగా జేయ వలెను. అంతట నరసింహ బిల ద్వారము తెరుచు కొనును. నిశ్శంకముగా నృసింహ కవచ న్యాసము చేసికొని లోనికి ప్రవేశించిన సాధకునకు దమో మోహము కల్గును. వెంటనే సువిశాలమైన రాజ మార్గము కనిపించును. ఆట తేనెతీట గల బాధ కనిపించదు. నృసింహుని స్మరించుచు నట నుండి సాధకుడు పాతాళము ప్రవేశించును.
ఆ లోని కేగి నృసింహ మంత్ర జపము జేయగా వీణా మేళనము జేయు వేల కొలది స్త్రీలెదురై స్వాగత మిచ్చి చేయి పట్టుకొని లోనికి బ్రవేశింప జేయుదురు. తరువాత నొక దివ్య రసాయన పానముచే దివ్య శరీరరియు బల శాలియు నగును. భూత వ్రళయము దాక నా కన్యలతో గ్రీడించి శరీరము బాసి వాసుదేవుని యందు లీన మగును.
ఆ గుహ యందు వలసింవ గోరని వాడట నుండి వెలికి వచ్చి పట్టము శూలము ఖడ్గము రోచనము మణి రసము రసాయనము పాదుకాంజనము కృష్ణాజినము మనోహరమైన కమండలువు. అక్షమాల సంజీవని విద్యయును. శస్త్రములను జేకొని బ్వలించెడి విస్ఫులింగము లచే నావరింప బడిన త్రిశిఖము నొక్కసారి హృదయ మందు నానించి నంతనే ననేక కోటి జన్మ పాపము. దహింప బడును. ఆ త్రి శూలమును విషము నందుంచిన విషము విరిగి పోవును. శరీరమునకు దాకించిన కుష్ఠు వ్యాధి పోవును. తన దేహ మందు మోపిన బ్రూణ హత్య మొదలైన పాపములు పోవును. తీవ్ర మయిన హ్రబాధలు జ్వలించు నాత్రిశూలమును ధ్యనించి నంతనే నశించును. బాలురకు కంఠమందు గట్టిన రక్ష యిచ్చును . అది గళ రోగములను. గండపిండ కలూతాది రోగములను నశింప జేయును. ఆవు నేతితో ఆవుపాలతో సమిధలతో నొకనెల మూడు సంధ్యల యందును. నామంత్ర జపముచే హోమము చేసిన యెడల నసాధ్య రోగములు కూడ నశించును. త్రిలోకము లందేది కోరినను సిద్దించును. నృసింహుని పూజించిన యెడల కోరిక కెల్ల సిద్దించును.
నరసింహుని యష్ణోత్తర శత నామములతో బూజించి పుట్టమన్ను స్మశాన మందలి మట్టి రాజ వీధిని నాలుగు దారులు కలియు చోట నుండియు నేడేసి మట్టి యుండలు గ్రహించి రక్త చందనము కలిపి యావు పాలతో మెదిపి యారంగుళము నరసింహ ప్రతిమ తయారు జేసి భూర్జ పత్రము నందు గోరోచనముతో మంత్రమును వ్రాసి నరసింహ స్వామి కంఠము నందు గట్టి మంత్రమును లెక్క లేకుండగ మడుగులో నిలిచి యేడు రోజులు పూజించి జపింప వలెను. అందు వలన ముహూర్త మాత్రములో నెల్ల భూమియు జల సమృద్ధ మగును. ఎండిన చెట్టు చివర నరసింహ మూర్తిని పూజించి నూట యెనిమిది మార్లా మంత్రము జపించిన యెడల వర్షమాగి పోవును. అట్లే నరసింహ స్వామిని పిండిముద్దలో నుంచి గిరగిర త్రిప్పిన యెడల వెంటనే పెనుగాలి వీచును. తరువాత నేడు సార్లు జపించి మంత్రించిన జలముచే నా ప్రతిమ నభిషేకించి దానిని దాను ధరింప వలెను.
దానిని యెవ్వని గృహ ద్వారమందు పాతి పెట్టునో వాని వంశము నశించును. ఆ ప్రతిమను వెలికి దీయగా నా యుపద్రము శాంతించును. కావున సర్వా భీష్టముల నొసంగు నరసింహ మూర్తిని భక్తితో బూజింప వలెను. దానిచే పాప ముక్తుడై విష్ణులోక మందును. బ్రాహ్మణాది వర్ణముల వారు ఆంత్యజులు కూడా నా స్వామిని పూజించి యమంగళము లను తరింప గలరు. అంతియ కాదు దేవత్వ దేవేంద్ర త్వములు యక్ష విద్యాధర గంధర్వాది దేవ విశేష భావములను రాజ్య స్వర్గ సుఖములను దుర్లభమైన మోక్షమును గూడ బొంద గలరు. నృసింహ దర్శన మొకసారి చేసినను పాప విముక్తి నంది యభీష్టము నొందగలరు. యుద్ద మందు. సంకటము లందు దొంగలు కిరాతులు మొదలైన వారి పీడచే దుర్గమమ మైన యడవి యందు ప్రాణ సందేహము కల్గి నపుడు విషాగ్ని జలో పద్రవముల నుండియు రాజుల వలన సముద్రము వలన గ్రహముల వలన కలుగు పీడ నుండి తరించును. నృసింహ స్వామిని స్మరించి నంతనే రాజో పద్రవములు నుండి ముక్తు డగును. ఉదయ మందు జీకటి విడి పోయినట్లు స్వామి దర్శనముచే సమస్త కష్టములు నశించును. ఘటిక కాటుక, పాదుక యను వాని యందు రసాయన సిద్దిని పొంద వచ్చును. ఎల్ల కోరికలు ఫలించును.
స్వామిని పూజించి నమస్కరించి దర్శించి యశ్వమేధ యాగముల ఫల మందును సద్గుణ సంపన్న డగునున. జరా మరణములు లేని వాడయి, చిరు గంటలతో మెరయు మొరయు కామద మైన స్వర్గ విమానమెక్కి యుదయ సూర్యుని వలె దివ్యవర్చస్సుతో ముత్యాల హారములు మెరయు దివ్య స్త్రీ శతముతో గంధర్వ గాన రమ్యమైన విమాన మెక్కి యిరువది యెక్క తరముల వారి నుద్దరించుచు సాక్షా ద్దేవతా స్వరూపముతో నమ్మోదముతో సుఖముతో అప్సరసలు స్తుతింప విష్ణు లోకమున కేగును. అందనుపమ భోగముల ననుభవించి చతుర్భజముల దాల్చి మనోహరమైన రూపముతో భూత ప్రళయము దాక నానంటించి యా పుణ్యము భుక్త మయిన తరువాత నుత్తమ మయిన యోగుల కుల మందు బుట్టి చతుర్వేద వేదాంగ పారగుడయి విష్ణు దేవతా భక్తి యోగము నంది మోక్షమును బొందును.
Summary of chapter 58 of the Brahma Mahā Purana is as follows:
The complete rules for the formal worship (pūjā) of Puruṣottama (Jagannātha) are presented — the sequence of upacaras (ritual offerings), the specific mantras, the proper mental attitude, the times and occasions of worship, and the particular offerings that are especially pleasing to the Lord. The mantras prescribed here are declared of supreme efficacy when recited within the divine kṣetra.