బ్రహ్మ మహా పురాణము
245 - అజస్యాపి విక్రియయా నానాభవనమ్
ఆ ప్రబుద్ధావస్థలో నుండు జీవుడు అవ్యక్తమును నిర్గణమును నగు ఇరువది యైదవ తత్త్వమును కూడ సగుణ తత్త్వముగా భావించును. ఆతత్త్వము నందు ఆరోపింప బడు గుణములను సృజించుచు ఉపసంహరించుచు ఉన్నట్లు కల్పన చేసికొనును. ఓ జనక రాజా! ఆ మూల తత్త్వము అజము జన్మ రహితము ఐనను క్రీడార్థమై వికారములను పొందు చున్నాడు. తన్ను తాను అనేక తత్త్వముల రూపమున కల్పించుకొని నానా రూపముల నొందిన వాడు వలె చెప్పబడు చున్నాడు. ఇట్లు వికృతి నొందు చుండియు ఇట్లని వాస్తవ స్థితిని ఎరుగ లేకున్నాడు. అవ్యక్త తత్త్వ స్వరూపము ఇది యని తత్త్వబొధ చేయ బడినవుడు జ్ఞాన సాధన దశలో అతడు బుధ్యమానుడు, బోధమును, జ్ఞనమును అందుకొను చున్నవాడు అని వ్యవహరింప బుడు చున్నాడు. కాని ఇట్లు బోధింపడు చుండియు సగుణ మైనది వలె కనబడు ఈ అవ్యక్త తత్త్వమును వాస్తవమున నిర్గుణమైన దానినిగా గుర్తింప లేక పొవు చున్నాడు. ఇరువది యైదవది యగు ఈ అవ్యక్త తత్త్వ స్వరూపమును దాని నిర్గుణత్వమును ఒకానొకప్పు డీతడు తెలిసికొన గలిగిన యెడల ప్రతిబుద్ధుడు అని వ్యవహరింప బడును. బుధ్యమాన దశలో జీవుడు మమకారా వృతుడు. అన్ని తత్త్వములకును అతీతమగు ఇరువది యారవ తత్త్వము విమలమును, బుద్ధమును, జ్ఞానాత్మకమును, ఆప్రమేయమును. ఇట్టిది అని ఎరుగ శక్యము కానిది సనాతనము, శాశ్వత మైనది. దానిని గుర్తింప గలిగి నప్పుడు సృష్టి ప్రళయ ధర్మ యుక్తమగు ఇరువది యైదవ తత్త్వముగా నుండుటను గూడ అతిగతమై అత్యున్నత దశ నందుకొనును. అప్పు డీతడు వస్తుతః గుణ రహితమును జడమును నగు ప్రకృతిని సగుణత్ము నొందిన దానినిగా గురైరుగును. తాను కేవల జ్ఞానాత్మకుడై అవ్యక్త తత్త్వమును గూడ వాస్తవ రూపమున దర్శింప గలుగును.
ఓ రాజా! తత్త్వముల నాశ్రయించిన నేకాని నరుడు తత్త్వజ్ఞుడు కాజాలడు. నాయనా! తత్త్వజ్ఞుడు సంసార గతులలో మునుగడు. తత్త్వము లిరువది యైదని విద్వాంసులు చెప్పు చున్నారు. వీని లక్షణమును తెలిసి కొన్నచో వీటి మూల తత్త్వమును కూడ చేర గలుగను. ఏలయన, ఇరువది యారవది సర్వమూ తత్త్వము. ఇతడు ఇదియే ఇరువది యారవ తత్త్వమని సరిగా గుర్తించి నచో జరా మరణములు లేక శుద్ధ యోగ బలముచే సమతా స్థితిని పొందును. సందేహము లేదు. ఐనను అజ్ఞానానికి జ్ఞాన బోధ చేయుటకై తత్త్వములు ఇరువది నాల్గేయని ఇరువది యైదే యని ఏకత్వము నుండి నానాత్వము జరిగిన విధము ఇదియని సాంఖ్య దర్శనము. ఎపుడు చేతన తత్త్వము కూడిన ఈ పంచ వింశతితమ తత్త్వమ యొక్క ఏకత్వము బుద్ధి యందు స్థిరమై ఆవగత మై నిలుచునో అపుడు ముముక్షువు సమత్వము పొందును. ఏలయన నిఃసంగుడై యుండియు పరమాత్ముడు మాయా కృతమైన సంగ వశమున నంసారములో వరిభ్రమించు చున్నాడు. మాయ దూరమై నపుడు ముక్తినందు చున్నాడు. నిఃసంగ రూపుడగు పంచ వింశతితమ తత్త్వమును ఎరిగిన తరువాత అజుడగు, జన్మరహితు డగు ఆ ఇరువది యారవ తత్త్వము నెరుగ గలుగును. అవ్యక్త తత్త్వము నెరుగుట చేతనే ఈ పరమ విబోధము జ్ఞానము కలుగును. చతుర్వింశతి తత్త్వముల నెరుగుట కూడ ఈ ఇరువది యారవ తత్త్వము నెరిగి ముక్తి నందుటకు సాధనమే. ఓ అనఘుడ వగు జనక రాజా! నీకిట్లు సాంఖ్య విధానమున బుద్ధ, బుద్యమాన, అప్రతిబుద్ధుల లక్షణములను తెలిపితిని. ఈ తెలిపిన తత్త్వముల నానాత్వము ఏకత్వముల సంబంధము చేపకు నీటికిని, మేడి కాయకు దాని యందలి పురుగులకును గల సంబంధము వంటిది. జ్ఞానము విజ్ఞానము అని వ్యవహరింప బడుట ముక్తి స్వరూప మిదియే. ఈ దేహమున సాక్షి తత్త్వముగా నున్న ఇరువది యైదవ అవ్యక్త తత్త్వము నెరుగనిదే ముక్తి కలుగదు. ఈ ఇరువది యారవ తత్త్వము పర తత్త్వము పరమగు ధర్మము కలిగినది. ఏ మాత్రమును ఆశుద్ధము కాని శుద్ధ తత్త్వము, విశుద్ధ మగు ధర్మము కలది, జ్ఞాన శాలి, జ్ఞానాత్మకుడు, వాస్తవమున ఆలోచించినచో సర్వ ధర్మముల నుండి విముక్తుడు కాని సంయోగ వియోగ ధర్మములు కల ఈ చుతుర్వంశతి తత్త్వత్మక మగు ఈ ప్రకృతితో సంబధము కలుగుట వలన బుద్ధుడై నందున మరల దాని నుండి విడివడి నప్పుడు ముక్తి నందెనని వ్యవహరించుట, వాస్తవమున అతనికి బంధము మోక్షము లేవు. అట్లతడు విమోక్షిగా, శుచి కర్మునితో కలిసిశుచిగా విమలాత్మునితో కలిసి విమలాత్ముడుగా కేవలునితో కలిసి కేవలాత్ముడుగా అగు చున్నాడు . స్వతంత్రునితో కలిసి స్వతంత్రుడై స్వాతంత్ర్యమును పొందు చున్నాడు.
ఓ మహారాజా! ఇంతవరకు నేను నీకిట్లు యథార్థ తత్త్వము తెలిపితిని. నీవును విశుద్ధమును, ఆద్యమును, సనాతనము, శాశ్వాతమును అగు బ్రహ్మ తత్త్వమును అమత్సరుడవై మనో దోషము లేవియు లేనివాడవై ప్రతి గ్రహించితివి. నీవును ఈ పరమ విద్యాను శాసనమును వేదనిష్ఠ, వేదముల యందును, శాస్త్రముల యందును ప్రామాణ్య బుద్ధి, కలిగి ప్రబోధము నొందుటకై ప్రణతుడై తెలిసి కొనగోరి ఆడిగిన వానికి మాత్రమే ఈయ వలెను. అసత్యవాది, మోసగాడు, కపట బుద్ధి, ఆసమర్థుడు, జ్ఞాన పరులగు పండితులను నొప్పించు వాడు అగువాని కీయరాదు. శిష్యులకు జ్ఞానము కలిగించుటకై నీవీ విద్యను శ్రద్ధ కలవాడు సద్గుణ వంతుడు పరనింద చేయనివాడు వివేచనతో కూడిన శీలము కలవాడు వేద శాస్త్ర విధి యందు ప్రీతి కలవాడు వివాదములు చేయని వాడలు అనేక శాస్త్రములను పెద్దల వలన వినిన వాడు వినయమును తెలుపు వేషము కలవాడు హేతు వాదము చేయని వాడు, ఇట్టి వానికి మాత్రమే తెలుప వలయును. విశుద్ధ మగు పరబ్రహ్మ తత్త్వమును ఈ సద్గుణములు లేనివాని కీయరాదు. ఇచ్చినచో అపాత్ర దానము వలన ప్రవచనము చేసిన గురువునకు కూడ శ్రేయస్సు కలుగదు. వ్రత నియమములు లేని వాడు తాను సమస్త రత్నములతో ఈ భూమి నంతటికి విద్యకు ప్రతిఫలముగా ఇత్తు ననినను అట్టి వానికి విద్యను బోధించ రాదు. ఓ నరేంద్రా! తత్త్వము నెరుగ గోరి జితేంద్రియుడై ప్రయతుడైన, ఇంద్రియని గ్రహము శుచిత్వము కలిగిన వానికి మాత్రమే ఇది బోధించ వలెను. ఓ జనకా! నీవు పరమ పవిత్రమును అత్యంతము శోక రహితమును అనాది మధ్యమును ఆగు బ్రహ్మ తత్త్వమును వాస్తవ ముగ ప్రవచించగా వింటివి. నీకిక సంసార భయము లేదు. ఈ తత్త్వము అగాధము, అజరామరము, దోష రహితము, భయ రహితము, శుభ కరము, సంవాదము అను పేరు గల ఈ తత్త్వర్థము తెలిసికొని మోహ స్వరూపమును గుర్తించి విడువుము. ఓ రాజా! పూర్వము హిరణ్య గర్భబ్రహ్మ సనాతన పరమాత్మ నుండి ఈ విద్యను గ్రహించెను. మహా తేజస్వి యగు ఆ బ్రహ్మ నుండి నేను ఆయనను అనుగ్రహింప జేసికొని గ్రహించితిని. నీవడిగి నందున నేను నీకిది ప్రతి పాదించితిని. ఇదియు నేను బ్రహ్మ వలన ఎంత ఎట్లు తెలిసి కొంటినో అంతయ అట్లే తెలిపితిని కాని ఏ మాత్రము మార్పులు చేర్పులు చేయ లేదు.
ఓ ముని శ్రేష్ఠులారా! వసిష్ఠుడు పంచ వింశతితమ తత్త్వ సంబంధి యగు తత్త్వమును ఇట్లు తెలిపెను. ఈ తత్త్వము ఎరిగి దాని ద్వారమున షడ్వింశ = ఇరువది యారవ తత్త్వమును చేరిన వారికి జనన మరణ రూప సంసారములో పునరావృత్తి యుండదు. ఇది పరమ మగు జ్ఞానము. దీనిని మించిన జ్ఞానము లేదు. ఇది ఎరిగిన వారు అజరామర మగు తత్త్వము చేరుదురు. ఓ ద్విజులారా! నిఃశ్రేయస కరమగు ఈ పరమ జ్ఞానము దేవర్షి యగు నారదుని వలన విని నేనున్న దున్నట్లు మీకు తెలిపితిని. ఏలయన హిరణ్య గర్భుని నుండి వసిష్ఠుడును అతని నుండి నారదుడును అతని నుండి నేనును వింటిమి. దీనిని విని నందున మీకును సంసారములన శోకము కలుగదు. క్షరాక్షర తత్త్వముల భేదాభేదము నెరిగిన వారికి భయ ముండదు. ఎరుగని మూఢాత్ముడు మాత్రము అనేక జన్మ పరంపరల నొంది మరల మరల ఉపద్రవముల పొందును. జననము, మరణము, దేవ లోకము, నరక లోకము, నరక లోకము, తిర్యగ్యోనులు, మనుష్య జన్మము ఇదే క్రమమున పునః పునరా వృత్తి పొందును. అవ్యక్తాగాధ మగు అజ్ఞాన సముద్రమున మునుగును. ఓముని శ్రేష్ఠులారా! నేనిట్లు మిగుల సారతమ మగు పరతత్త్వమును మీకు తెలిపితిని. దీనిని తెలిసి కొనిన వారు పరమ మోక్షమును పొందుదురు. మరల జనన మరణ పునరావృత్తి పొందరు. ఓ విప్రులారా! దీనిని నాస్తికుడు అభక్తుడు దుష్టమతి శ్రద్ధా రహితుడు అగు వానికి తెలుప రాదు.
Summary of chapter 138 of the Brahma Mahā Purana is as follows:
The concluding chapter of the main body of the Brahma Mahā Purāṇa is a maṅgala (auspicious conclusion) celebrating the text itself. The immeasurable merit of reciting, hearing, preserving, and gifting this Purāṇa is declared. Those who listen devoutly are freed from sin, those who gift it are freed from all worldly bonds, and those who preserve it ensure blessings for their lineage. The chapter formally closes the main text before the Gautamī Māhātmya begins.