బ్రహ్మ మహా పురాణము
17 - శ్యమంతకోపాఖ్యానము
శ్రీ కృష్ణుడు సత్రాజిత్తునకు మణి రత్నము నొసంగగా, దానిని బభ్రువు, (అక్రూరుడు) భోజ వంశీయు డగు శతధన్వునిచే హారింప జేసెను. అక్రూరుడ వకాశము కనిపెట్టి సత్యభామను స్యమంతక మడుగుచుసే యుందెను. శతధన్వుడు సత్రాజిత్తును సంహరించి రాత్రి వేళ మణింగొని వచ్చి అక్రూరున కొసంగెను. అక్రూరడది గొని యీ యంశ మెవ్వరికి నెన్నడును దెలుపనని వానిచే ప్రమాణము సేయించెను.
తండ్రి హతు డగుటకుం దపించి సత్యభామ రథమెక్కి వారణావత మునకేగెను. అక్కడ ధోజ వంశీయు డగు శతధన్వుని యీ వృత్తాంతమును భర్త కుందెలిపి కంటనీరు గ్రుక్కు కొనెను, లక్క యింట దగ్ధులైన పాండవుల కుదక క్రియసేసి కృష్ణుడు సాత్యకిని వారి యొక్క ఉత్తర క్రియ యందు నియోగించి వెంటనే ద్వారక కేతెంచి బలరామునితో నిట్లనెను.
సింహము ప్రసేనుని జంపినది, శతధ్వనుడు సత్రాజిత్తును జంపెను. స్యమంతకము నాకు జెంద వలసి యున్నది. కావున త్వరగా రథ మెక్కుము. అ భోజుం గూల్చి యమ్మణిం తెత్తుము, ఆ స్యమంతకము మనది కాగల దనియె.
శతధ్వనుడు కృష్ణునితో బోరుచు సక్రూరు డెక్కడు న్నాడని చూచు చుండెను. అక్రూరుడు శక్తుడయ్యు శాపభీతిచే యుద్ధమున తోడ్పడ డయ్యెను, అప్పుడు భోజుడు భయార్తుడై వెనుదిరుగ నిశ్చయించెను. “హృదయ” ఆను వాని గుఱ్ఱము నూరు యోజనములు మించి దూక గలదు. భోజుని స్వాధీనము ననున్నది. దానితోనే కృష్ణునితో దలపడెను. నూరు యోజనములు మేఱ యరిగి వేగముడు గుటయు, తన రథ వేగ మెచ్చుటయుం జూచి కృష్ణుడు శతధన్వుని నొప్పించెను. అ గుఱ్ఱము డిల్లవడి తుదకు ప్రాణములు గోల్పోవుట చూచి కృష్ణుడు బలరామునితో నిట్లనియొ.
ఓ శూరాగ్రేసర! నీవిక్కడే యుండుము. గుఱ్ఱము నష్ట మైనది. పాదచారినై వెళ్లి మణి రత్నమైన స్యమంతకము హరించ గలను. అని
అటు పిమ్మట హరి పాదచారియై వెళ్ళి శతధన్వుని పైకేగి మిధిలా ప్రాంతమున వానిని సంహరించెను. కాని వాని దగ్గర స్యమంతకము కాన రాదయ్యె. మరలి వచ్చిన కృష్ణునిం గని హలాయుడు డగు బలరాముడు మణి నిమ్మని యడిగెను. కృష్ణుడు లేదని బదులు చెప్పెను. అంతట బలరాముడు రోషము గొని ఛీఛీ యని కేకలు వేసి కృష్ణునితో నిట్లు పలికెను.
తమ్ముడ వని సైరించితిని. నీకు స్వస్తి యగుగాక. నాకు ద్వారకతో గాని, నీతో గాని, వృష్ణులతో గాని పనిలేదు, నేను వెళ్ళు చున్నాను. అని
బలరాముడు మిథిలం బ్రవేశించెను. మిథి లాధిపతి సత్కార మంది, ఇష్టోప భోగియై యక్కడనే యుండెను.
ఈ సమయము లోనే బుద్ధి శాలియగు బభ్రువు (అక్రూరుడు) పెక్కు విధములగు క్రతువుల నాచరించెను. గాంధీ పుత్రుడగు నా అక్రూరుడు దీక్షా మయమైన రక్షా కవచమ్ము దొడిగికొని స్యమంతకము కొఱకు యజ్ఞము చేసెను. అరువ దేండ్లు వివిధ రత్న ధనరాసుల నధ్వరము లందు వినియోగించెను. “అక్రూర యజ్ఞము” లను పేర నవి ప్రఖ్యాతి వవసినవి. అవి విపులాన్న దాన దక్షిణులు సర్వ కామ ప్రదములునై విలసిల్లెను. అంతట దర్యోధనుడు మిథిల కేగి బలరాముని కడ గదా యుధ్ధ శిక్షణమును వడసెను.
మహారథులగు వృష్ణ్వంధకులతో పోయి కృష్ణుడు బలరాముని ద్వారకకు మరల దెచ్చెను. బంధువులతో గూడ నిద్రలో వున్న సత్రాజిత్తును జంపిన అక్రూరు డంధకులతో బాటు మరల ద్వారకకు వచ్చెను. అప్పుడు కృష్ణడు జ్ఞాతులతో బెడియు నను భయము వలన వాని నుపేక్షించెను. అప్పు డక్రూరుడు మిథిలకు పోగా నింద్రుడు వర్షించడయ్యె. అనావృష్ఠితో రాజ్యమనేక విధముల క్షిణించి పోయెను. అందు వలన కుకురాంధకులు అక్రూరునిం బ్రసన్నుం జేసికొని మరల ద్వారకకుం గొని వచ్చిరి. అంత దానవతి యగు నతడు ద్వారకకు రాగానే జలనిధి తీరమున వాసవుడు బాగుగా వర్షించెను. అక్రూరుడు శీలవతి యగు తన చెల్లెలిని వాసుదేవునకి ప్రీతి కలుగ నిచ్చెను. అంతట కృష్ణుడు యోగ శక్తిచే స్యమంతకమణి యక్రూరుని దగ్గర నున్నదని గమనించి సభా మధ్యమున నక్రూరుని గూర్చి యిట్లు పలికెను.
నీ చేజిక్కిన మణిని నాకిమ్ము. నా మర్యాద గాపాడుము. అఱువది యేండ్లు నాకీ మణి నిమిత్తముగ రోషము గల్గినది, కాల మెంతో గడిచి పోయినది.
అంతట నక్రూరుడు కృష్ణుని పలుకు లంబట్టి సర్వ యాదవ సమాజము నందు మణింగొని వచ్చి మనస్సు నొచ్చకుండ బుద్ది మంతుడు కావున దానిని హరి కిచ్చెను. అరిభీకరుడైన కృష్ణుడు బభ్రు హస్తము నుండి సూటిగ లభించిన యా మణిని చేకొని హర్షము గొని తిరిగి దాని నక్రూరునకే యిచ్చెను. గాంధినీ పుత్రడగు నక్రూరుడు క్భష్ణుని హస్తము నుండి లభించిన యా స్యమంతక మణి రత్నమును దాల్చి సూర్యుని వలె దేజరిల్లెను.
Summary of chapter 17 of the Brahma Mahā Purana is as follows:
A detailed account of Jambūdvīpa, the central continent containing Bhāratavarṣa, is presented. The nine varṣas (regions) of Jambūdvīpa and its great mountains — Meru, Himavat, Hemakūṭa, Niṣadha, Nīla, Śveta, and Śṛṅgī — are described. The rivers, sacred centres, and cosmological significance of Mount Meru at the centre of the world are expounded.