స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

52వ అధ్యాయము

తా శ్రీ సూతులిట్లనిరి - తిరిగి నేను సేతువునకు చెందిన వైభవాన్ని చెబుతున్నాను. మీరు ఓ మునులార! ఆదరంతో వినండి (1) స్థానములన్నింటి కంటెను ఈ స్థానము మహత్తరమైనది. ఇక్కడ జపము, హోమము, తవను, దానము ఏది చేసినా అది అక్షయమని చెప్పబడింది (2) ఈ మహాస్థాన మందే ధనుష్కోటి యందు స్నాన మాచరిస్తే వారాణసి యందు పది నంవత్సరాలుంటే వచ్చే పుణ్యఫలము లభిస్తుంది (3) ఆ స్థల మందు ధనుష్కోటి యందు స్నాన మాచరించి రామేశ్వరుని చూచి, నరుడు భక్తి యుక్తుడై మూడు రోజులుండాలి, ఓ ద్విజులార (4) దాని వలన వుండరీక పురమందు వదిసంవత్సరములుంటే వచ్చే పుణ్యము లభిస్తుంది. ఓ విప్రులార ! అది మహాపాతక నాశకము (5) ఇక్కడ ఆద్యమైన షడక్షర మంత్రాన్ని వేయి ఎనిమిది సార్లు భక్తితో జపిస్తే ఆనరుడు శివ సాయుజ్యమును పొందుతాడు (6) మధ్యారునము, కుంభకోణము, మయూరము, శ్వేతవనము, పోలాన్యము, గజారణ్యము, వేదారణ్యము, నైమిషము (7) శ్రీ వర్వతము, శ్రీరంగము, శ్రీమత్ వృద్ధగిరి, చిదంబరము, వల్మీకము, శేషాద్రి, అరుణాచలము (8) శ్రీమత్ దక్షిణ కైలానము, వేంకటాద్రి, హరిస్థలము, కాంచీ వురము, బ్రహ్మవురము, వైద్యేశ్వర వురము (9) ఇతర శివస్థానములు, విష స్థానములు ఇక్కడ సంవత్సర కాలము ఉంటే వచ్చే పుణ్యము, నరుడు ఆనందంతో ధనుష్కోటి యందు (10) మావుమాసమందు స్నానం చేస్తే పొందుతాడు, అనుమానంలేదు. ఈ సేతువునుద్దేశించి, రెండు సముద్రములు అని శ్రుతి (11) బ్రాహ్మణ శ్రేష్టమైనది, మాతృభూతమైనది, సనాతనమైనది “అదోయడ్డారు” అని ఒక శ్రుతి ఉంది మునులార! (12) విష్ణువు కర్మలను చూచేది పేతు వైభవమును ప్రశంసించేది మరొక శ్రుతి కూడా ఉంది. “తద్విపో” అని అవసరమైనది (13) ఓ తపోధనులార ! ఇతిహావ పురాణములు, స్మృతులు, ఒకే రీతిగా సేతు మాహాత్మ్యమును చెబుతున్నాయి (14) చంద్ర సూర్యుల గ్రహణ మందు సేతువు యందు స్నానమాచరించిన అవిముక్త మందు పది సంవత్సరాలుంటే లభించే గంగాస్నాన ఫలము, లభిస్తుంది (15) కోటి జన్మలలో చేసిన పాపము ఆక్షణంలోనే నశిస్తుంది. ముఖ్యమైన అశ్వమేధ సహస్రముల ఫలాన్ని పొందుతాడు (16).

విషవత్తు, అయనము, సంక్రాంతివినియుందుసోమవారము, వర్వమందు సేతువును దర్శించినమాత్రంతో ఏడుజన్మలలోపొందినఅశుభము (17) నశిస్తుంది. ఓద్విజవుంగవులార! సరస్వతిని కూడాపొందుతారు. సూర్యుడుమకరరాశి యందుండగామానుమానముందుకొద్దిగాసూర్యుడుదయించాక (18) మూడురోజులుధనుష్కోటియందుస్నానంచేవననరుడు పాతకరహితుడైగంగాదివర్వతీర్థములలోస్నానంచేస్తే కలిగేవుణ్యమునుపొందుతాడు (19) ధనుష్కోటియందుఐదురోజులు స్నానంచేవననరుడు అశ్వమేధాదులవల్ల కలిగేపుణ్యమునునపొందుతాడు ఓబ్రాహ్మణోత్తములార! (20) చాంద్రయణము మొదలగుకృచ్చ్రములను ఆచరించినఫలమును పొందుతాడు. వాలుగువేదములపారాయణవలమును పొందుతారు (21) మూవువనంలోపదిరోజులు ధనుష్కోటియుందుస్నానమాచరించినవదివేలబ్రహ్మహత్యల పాపమునశినంది. ఇందులో ఆలోచించాల్సిందిలేదు (22) మాఘమాస ముందు దనుష్కోటియందు పదునైదురోజులు స్నానంచేసి నమనుజుడువైకుంఠమునుపొందుతాడు (23) మాఘమాసమందు రామ సేతువుయందుఇరువదిరోజులు స్నానమాచరించినవారు శివ సామీప్యమునుపొందుతారు. శివునితో కలిసి ఆనందిస్తారు. (24) ఇరువదియైదురోజులుస్నానముచేవ సారూప్యమును పొందుతారు. ముప్పదిరోజులుస్నానమాచరించిన సాయుజ్యమును పొందుతాడు. (25) అందువల్లఓద్విజులార! మాఘమాస మందురామ సేతువుయందు తప్పకుండా విద్వాంసుడుసూర్యుడుకొంచంఉదయించాకస్నానం ఆచరించాలి. (26)

చంద్రసూర్యలగ్రహణమందు, ఆర్థోదయమందు, మహోదయమందురామ పేతువుయందుస్నానమాచరించిన (27) నరుడు అనేక క్లేశములతో కూడినగర్బవాన మునుపొందడు. ఇదిబ్రహ్మహత్యాదిపావవాశనము పంపదలకన్నింటికనీస్థానమనిచెప్ప బడింది. (28) నరకములన్నింటినినశింపచే సేదనిచెప్పబడింది. వంపదలకన్నింటికిస్థానమనిచెప్పబడింది.(29)ఇంద్రాదిపర్వలోకములయొక్కసాలోక్యముమొదలగువానినిఇచ్చునది. చంద్రసూర్యగ్రహణమందుఅట్లాగేఅరోదయమందు (30) మహా దయమందుధనుష్కాటియందుస్నానమాచరించుట తప్పకనిశ్చయమైనది. రావణుని వివాళనముకొరకు పూర్వమురాముడు నిర్మించబడినట్టిది. (31) సిధ్ధచారణగంధర్వ కిన్నరఉరగులతో సేవింపబడినది. బ్రహ్మర్షిదేవర్షి, పితృసంఘములతోసేవింప బడినది. (32) బ్రహ్మాదిదేవతాబృందముతోభక్తిపూర్వకముగా సేవింపబడినది పుణ్య ప్రద మైనది, ఐనరామ సేతువునున్మరించి నరుడు (33) ఏతటాకాదిజలాశయములందుస్నానమాచరించినా, ఆతని దుష్కృతము ఏమి ఉండదు. భవిష్యత్తులో కలుగదు కూడా (34)

సేతుమధ్యమందున్నతీర్థములలోపిడికెడు మాత్రమే నదానంచేయటంవలనన సకలరోగములు, అట్లాగేభ్రూణ హత్యాదీపావ ములునశిస్తాయి. (35) రాముడుగీసినధనునుయెక్కరేఖనువుణ్యమైనదానినిచూచినవారికి వైకుంఠమునుండి పునరావృత్తి ఎవ్వడుఉండదు. (36) ఈలోకంలోధనుష్కోటియు ప్రసిద్ధమైనపావనాశక మైనదానినిధీమంతుడై నరాముడు వీభీషణునిప్రార్థనతో ఏర్పరచాడు (37) ధనుష్కోటిమహాపుణ్యప్రదమైనది. అందుభక్తిపూర్వకముగాస్నానంచేసిధనము, భూమి, గోవులు మొదలగునవిదానంచేయాలి (38) నువ్వులు, బియ్యము, ధాన్యము, పాలు, వస్త్రములు, భూషణములు, మినుములు, అన్నము (39) పెరుగు, నేయి, నీరు, శాకములు, వగంనీళ్ళుగలమజ్జిగ, శుద్ధమైనశర్కర, పండ్లు, తేనె అట్లాగే (40) లడ్డూలు, అప్పాలు, ఇంకాఇతరమైనదానములురామ పేతువుయందుచేయాలనిచెప్పారు. ఒద్విజులార! ఇవినర్వాభీష్టములనుఇచ్చేవి (41) అందువల్లరామ సేతువుయందుత్తలోభంలేక ఉండిదానంచేయాలి. ఇక్కడచేసిన దానము, హోమము, తపము, జవము, నియమాదులు (42) ఈశ్రీరామధనుష్కోటియందుఅనంతఫలమునిస్తాయి. అందువలనవేదములునంతోషిస్తాయి, అట్లాగేపితరులునంతోషిస్తారు (43) మునులందరునంతోషిస్తారు అట్లాగేబ్రహ్మ విమశిశువులు, వాగులు, కింపురుషులు, యక్షులు, అందరునంతోషిస్తారుఇదినిశ్చయము (44) ధనుష్కోటినిచూడటంవలన స్వయముగాపవిత్రుడౌతాడు. తనవంశంలో పుట్టినమనుజులనందరిని, పితామహులనుపవిత్రులను చేస్తాడు. (45) ధనుష్కోటినిచూడటంవలన కులమంతాతరిస్తుంది. రాముడుధనస్పుకోటితోచేసినరేఖప్రాంతమునమునుగుటవలన (46) కోట్లకొలదివంచపాతకములు ఆ క్షణంలోనే నశిస్తాయి, నిశ్చయము. శ్రీరాముడు ధనస్సు చివరతో చేసిన రేఖను చూచిన నరుడు (47) అనేక క్లేశములతో కూడినగర్బవానమును పొందడు. సీత అగ్నిప్రవేశంచేసిన కుండమందుస్నానంచేసినయెడల (48) క్షణకాలంలో, నూరుభ్రూణహత్యలవల్లకలిగినపావమునశిస్తుంది. రాముడెట్లాగో పేతువుఅట్లాంటిది. గంగ ఎట్లాంటి దోహరి అట్లాంటివాడు.

ఓగంగ, హరి, రామ సేతు, అని నరుడు సంకీర్తన చేస్తూ ఇతరత్ర ఎక్కడ స్నానం చేసినా దానితో ఉత్తమ గతిని పొందుతాడు. గంధమాదనపర్వతమందు సేతువు యందు అర్ధోదయందు స్నానం చేసి తరులనుద్దేశించి ఆవగింజంత మాత్రమైన పిండ మిచ్చినా

ఆతనిపితరులుసూర్యచంద్రులున్నంతకాలముతృప్తినందుతారు. పితరులనుద్దేశించిభక్తి తోశమీఆకు ప్రమాణంతో (52) ద్విజుడుపిండముఇస్తే అన్నిపాపములనుండి విముక్తులై ఆతనివితరులున్వర్గమందుంటే ముక్తి నందుతారు. నరక ముందుంటే స్వర్గమునకువెళ్తారు. (53) సేతువుయందు, వద్మనాభమందు, గోకర్ణమందుపురుషోత్తమందునముద్ర స్నానముఅన్నినమయములందు, కాలమునందుకోరతగినదే (54) శుక్ర, మంగళ, శనివారములందునే ముద్రమందు సంతానము కావాలని కోరుపోడు. సేతువునకన్నఇతరమైనచోట ఎక్కడాస్నానంచేయరాదు. (55) విద్వాంసుడుపేతకార్యము చేయనివాడు. లేదా గర్భిణి భర్తకాని సేతువునకన్నఇతరమైనఏసముద్రప్రాంతమందైనాస్నానంచేయరాదు (58) పేతుస్నాన మందుకాలంకొరకు ఎదిరిచూడటంఅవసరంలేదు. నిత్యస్నానముప్రశస్తమైనది. వారతిధినక్షత్రనియమములు సేతువునకన్న ఇతరత్రస్నానమందే, ఓ ద్విజులార ! (57) బ్రతికి ఉన్న వారినుద్దేశించి స్నానం చేయాలి. మృతులను గూర్చి స్నానం చేయరాదు. కుశలతో ప్రతిరూపాన్ని చేసి తీర్థవారితో స్నానం చేయించాలి (58) ప్రసన్న ఇంద్రియ మానవములు కలవాడై ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేయించాలి. “నీవు దర్భవు నీవు పవిత్రమైన దానివి. విష్ణువు పూర్వం ధరించాడు (59). నీవు స్నానం చేస్తే ఆతడు స్నానం చేస్తాడు. ఈముడితో బంధించటము ఆతనికి చెందినదే” అని మంత్రము. ఎల్లప్పుడు ప్రతి వర్వమందు సముద్రము అంతట పుణ్యప్రదమైనదే (60) సేతువుయందు సింధు, అబుల సంయోగమందు (సరస్సుల), గంగా సాగర సంగమ మందు,గోకర్ణమందు, పురుషోత్తమ మందు నిత్యస్నానము చెప్పబడినది (61) పర్వము కానివాడు (వర్వదినములు ఐదు కృష్ణ అష్టమి, చతుర్దశులు వూర్లి, సూర్యసంక్రమణము, అమవాస్య) సరితనాధుని ఇతరమైన చోట ఎక్కడా తాకరాదు. ఏతరులు, సర్వదేవతలు, మునులు అందరు వింటుండగా (62) సీతా లక్ష్మణులతో కూడి రాముడు ప్రతిజ్ఞ చేశాడు. నేనిక్కడ నిర్మించిన సేతువు యందు స్నానం చేసిన నరులు (63) నా అనుగ్రహం వల్ల వారందరు తిరిగి జన్మను పొందరు. నా సేతువును చూడటం వలన పాపములన్ని నశిస్తాయి. (64) రామనాథుని మహాత్మ్యాన్ని, నా సేతువు వైభవమును నూరుకోట్ల సంవత్సరముల కాలానికైనా నేను వర్ణింవ శక్తుడనుతాను. (65) అవే రాముని మాటను దేవ మహరులు విని, బాగుబాగు అని, సంతుష్టులై ఆ మాటలను ప్రశంసించారు (66) సేతు మధ్య మందు బ్రహ్మ సర్వదేవతలతో కూడి ఈశ్వరుని ఆజ్ఞతో ఎల్లప్పుడు దాని రక్షణ కొరకు అధివసించి ఉన్నాడు.

రామ సేతువుయందురక్షణకొరకు సేతుమాధవుడను పేరుతోమహావిష్ణువు దేవతలందరితోకూడినివసించి ఉన్నాడు (68) మహరులు, పితరులు, ధర్మశాస్త్రప్రవర్తకులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, ఉరగులు, (69) విద్యాధరులు, చారణులు, యక్షులు, అట్లాగే కింపురుషులు, ఇతరవెననర్వజూతములు, రాత్రింబగళ్ళు ఇక్కడ నివసిస్తున్నాయి. (70) అట్టి ఈరామ సేతువునుచూచిన, దానిగూర్చి విన్న, దానినిస్మరించిన, తాకిన, అందుస్నానమాడినాఇదీఅన్నిపాపములనుండి రక్షిస్తుంది, ఒద్విజోత్తములార! (71) అర్థోదయకాలమందు సేతువుయందుస్నానమాచరించినఆనందప్రాప్తికి హేతువు. అది ముక్తి నిచ్పేది. మహాపుణ్యకరము. మహానరకనాశకము (72) పుష్యమానం, విషరనక్షత్రంలోసూర్యుడుకొంచంఉదయించి నాకనాగవంలేని అమావాస్యతో తుడినపుడు, రాహువ్వుషయుందున్నవుడుఅర్లో దు ముపుణ్యప్రదమై నది (73) ఆఆర్ధో దయముందు సేతువుయందుస్నానము సాయుజ్యమున తుకారణము. వేయివ్యతీపాతములతోఒకఅమావాస్యసమమైనది. (74) భానువారమైతే అదిపదివేల అమావాస్యలతోసమానమైనది.శ్రవణనక్షతముభానువారంతోకలిస్తే(75)వరస్సరయోగంవలన పుణ్యప్రదమనేతెలుసుకోవాలి స్నానదాన జవ అర్చనాదులవలన ఒక్కొక్కటి అమృతమునిచ్చేవి. (76) ఒక వేళ ఐదుకలిస్తే చెప్పాల్సిందే ముందిక్కడ. జ్యోతిష్యులతుశ్రవణముషము. తిథులలో అమావాస్యశ్రేష్టమైనది (77) యోగములలోవ్యతీపాత యోగము. వారములలో ఆదివారము శ్రేష్టమైనది. ఈనాళింటియోగమునూర్యుడు మకరరాశియందుండగాసంభవిస్తే (78) ఆలమందు రామ సేతువు యందుమానవుడు స్నానంచే స్తే తిరిగితల్లిగర్భవాసాన్ని పొందడు. పైగాసాయుజ్యాన్ని పొందుతాడు. (79) ఆర్ధో దయకాలంతో నమానవెనకాలము గతంలోలేదుభవిష్యత్తులోరాదు. అట్లాగేమహోదయకాలము ధర్మలమని చెప్పబడింది. (80) ఈపుణ్యకాలము లందు సేతువుయందు దానము చేయాలనిచెప్పారు. ఆచారము, తపస్సు, వేదములు, వేదాంతశ్రవణము (81) శివుడు విష్ణువు మొదలగు వారిపూజ, వురాణార్థము లచెప్పగలిగేశక్తిగలిగినవిప్రునిదానమునకు పాత్రునిగా గుర్తించాలి. (82) పాత్రుడైన ఆబ్రాహ్మణునకు పేతువుయందుదానం చేయాలి. సేతువుయందుఆచారవంతుడైన పాత్రుడులబించకపోతే (83) నత్పాత్రుని ఉద్దేశించి సంకల్పముచేసి గ్రామమునకువచ్చాక దానంచేయాలి. అందువల్ల ఫలమునుకోరేవారుఅధమపాత్రునకు దానము చేయరాదు. సేతుమాహాత్మ్యమును చెప్పినవారికి ఇచ్చుట ఉత్తమము. ఇతరులకు కాదు. (84)

 ఇక్కడవసిష్టుడుచెప్పినముఖ్యమైనఇతిహాసాన్నిచెప్తాను. దానపాత్రుడెవడు. అని తెలుసుకోదలచినదిలీప మహారాజు నడుచెప్పినదిది (85) దిలీమునివచనము - బ్రహ్మపుత్ర! మరోహితదానవెవ్వరికి వ్వాలి. ఓమహామునినీ తు శిష్యుడైననాడు దీనినియదార్థముగాచెప్పండి (86) వసిష్టునివచనము - దానపాత్రులలో ఉత్తమపాత్రుడు దాచారవరాయణుడు. అతనికన్న            ఎక్కువైనపాత్రుడుశూద్రాన్నముతిననివాడు (87) వేదములు, పురాణములు, మంత్రములు, శివవిషువులు మొదలగువారి పూజ, వర్ణాశ్రమాదిఅనుష్టానమువీటిని ఎప్పటికిని ఆచరించేవాడు (88) దరిద్రుడు, కుటుంబముకలవాడుఅట్టివాడుఉత్తమ పాత్రుడుఅని చెప్పబడింది. అట్టి పాత్రున తుఇవ్వబడినదానము ధర్మరామమోక్షములనుఇస్తుంది. (89) పుణ్యక్షలమందు విశేషించిన తాతము కానిదానముతగదు. నత్పాత్రదానముచేయనిచోవదిజన్మలు తొండజన్మిస్తాడు. (90) మూడుజన్మలు గాడిదౌతాడు. రెండుజన్మలు కప్పగా జన్మిస్తాడు. ఒకజన్మలో చండాలుడౌతాడు వెదవశూద్రుడౌతాడు. (91) పిదపక్షత్రియడు వైశ్యుడుక్రమంగావివ్రుడౌతాడు. దరిద్రుడైబహురోగములతో కూడినవాడౌతాడు. (92) దుష్కడైనపాత్రునకు దానంచే స్తే ఈవిధముగాఅనేక దోషాలునంభవిస్తాయి. అందువల్ల అన్నివిధముల ప్రయత్నించిన పాత్రులకు దానం చేయాలి. (93) అటువంటి పాత్రుడులభించని పక్షంలో అప్పుడుసంకల్ప పూర్వకముగాఒకనత్ పాత్రుని ఉద్దేశించినీటినిభూమి పైవదలాలి. (94) ఉద్దేశించినపాత్రుడు మరణిస్తే ఆతనివుత్రుసరుదానంచేయాలి. ఆతడు కూడా మరణిస్తే మహాదేవునతున మర్పించాలి. అందువల్ల అధమపాత్రున తుతీర్థప్రదేశములో విశేషించిదానంచేయరాదు. (95) శ్రీనూతలవచనము - ఓద్విజోత్తములార! ఈవిధముగావసిషుడుదిలీపున రుచెప్పాడు. (96) నాటి నుండి తాత్రునకు ఉత్తమ వెనదానమునుఇచ్చాడు. అందువల్ల ఓ మునిపుంగవులార! పుణ్యస్థలమై నఈ సేతువుయందు కూడా (97) నత్పాత్రుడులబిస్తే అప్పుడుధనాదులను ఇవ్వాలి. లేనిచోసంకల్పవూర్వకముగా ఉత్తమమైనవిశిష్టపాత్రుని (98) ఉద్దేశించి, భక్తితోభూమీ పై జలమును వదలాలి. పిదపతనగ్రామమునకువచ్చి ఆపాత్రునకు ఇవ్వాలి. (99) పూర్వమునంకల్పించినధనాన్ని ఇవ్వాలి. లేనిచో ధర్మలోవమౌతుంది. తిరిగిదుఃఖాన్నిపొందడు. కానిసాయుజ్యాన్నిపొందుతాడు (100)

అర్థోదయకాలముతోన మానమైనఉత్తమకాలముగతంలోలేదు. భవిష్యత్తులోరాదు. కుంభకోణము, సేతు మూలము, గోకర్ణము, నైమిషము, (101) అయోధ్య, దండకారణ్యము, విరూపాక్షము, వేంకటాచలము, శాలిగ్రామము, ప్రయాగ, కంచి, ద్వారావతి (102) మధుర, పద్మనాభము, విశ్వేశ్వరునిఆలయమైన, అన్నినదులు, వముద్రములు, బంగారుపర్వతము అనిచెప్పబడిన (103) ఈస్థానములందుముండనము, ఉపవాసము ఆచరించవలెనని చెప్పబడినది. లోభమువలన, మోహమువలన వీటిని ఆచరించకుండ తనఇంటికి వెళ్ళేసరుడు (104) వెంటతడాచరించిన పాతకములుఅతనిఇంటిలోఅతనితో ప్రవేశిస్తాయి. గంధమాదన పర్వతమందు ఇరువది నాలుగు తీర్థములున్నాయి (105) అక్కడలక్ష్మణతీర్థమందువపనమునుమునులుచెప్పారు. లక్ష్మణతీర్థమందుశివుని ఆజ్ఞ ప్రకారం వెంట్రుకలులేకుండా (106) తలను మాత్రమేకొరిగించుకొని, దక్షిణను ఇచ్చిలక్ష్మణతీర్థమందు స్నానమాడిలక్ష్మణశంకరుని దర్శించిన (107) పాపములన్నింటి నుండి విముక్తుడైనఆనరుడు శంకరునిచేరుతాడు. అర్ణోదయమందు ఎల్లప్పుడు సేతువుయందు ఇట్లాస్నానముచేయాలి. (108) సేతువుతోనమానమైనతీర్థములేదు. సేతువుతోన మానమైనతవములేదు. సేతువుతో సమానంగా పుణ్య ప్రదమైనదిలేదు. సేతువుతోసమానమైనస్థానములేదు. (109) వేయిగ్రహణములతోన మానమైనది. అర్ధోదయము అనిచెప్పబడిండి. నంసారం నుండి ముక్తిని కల్గించే కాలముఅర్ధోదయంతోనమానమైనదిలేదు. (110) అర్థోదయమందు రామ సేతువుయందుస్నానం చేస్తే వచ్చేషుణ్యములోన మానంగాఎల్లప్పుడునర్వశాస్త్రములు చదివినారాదు (111) అరువదివేలసంవత్సరాలు బాగీరధిలో మునుగుటవలనవచ్చేముణ్యమునుబుషులుచే ప్పొరు. కాని ఓ మునులార! అంతటి పుణ్యము (112) ఒక్కసారిరామ సేతువు యందుస్నానముచేయుటవల్లలభిస్తుంది. నిశ్చయము, ప్రత్యేకించిఅర్థోదయకాలమందు, మహోదయకాలమందుచేసే స్నానము (113) సూర్యుడు మకరరాశియందుండగామావమానమందు, పాప వేచనమైనవయాగయందు, వేయిమావుస్నాన ములలో లభించే పుణ్యమును, నరుడు (114) అక్టోదయకాలమందురామ సేతువుయందుమునుగుటవలన, ఒక్కసారికే అంతటి పుణ్యమును పొందుతాడు. ఇందులోఅనుమానములేదు (115) ముల్లోకములందలితీర్థములోస్నానంచేసినవారికి లభించేవలము ఒక్కసారి అరోదయ కాలమందు సేతువుయందుస్నానమాచరిస్తేఅంతటివుణ్యమునుపొందుతాడు (116)

బ్రహ్మజ్ఞానవిహీనులు, కృతఘ్నులు, దురాత్ములు, పావులు, ఇతరమహాపాతకులు, వీరందరు (117) సేతువు యందు అర్థోదయకాలమందుస్నానంచేస్తేవిశుద్ధలౌతారు. ఇది నిశ్చయము. వేరుశలములందుకృతన్నులకు ఎక్కడాపాన నిష్కృతిలేదు (118) సేతువుయందురో దయలస్నానంవలంవారిగూడానిష్కృతిలభిస్తుంది. సేతువుయందు ఆర్థోదయ మందుమోహంతోస్నానం చేయనివారు (119) అంధులుక్రిందపడునట్లునంసారమందుమునిగిపోతారు. సేతువుయందు అర్థోదయస్నానంచేసినవారుభాస్కర మండలమునుచేదించి (120) బ్రహ్మలోకమున తుచేరుతారు. ఇందులోఆలోచించాల్సిన దిలేదు. అర్థోదయంవచ్చినవుడు ముక్తినిచ్చే సేతువు యందుస్నానంచేసి (121) చేసినీతతోకూడినజగన్నాథుడైనరాముని, రామేశ్వరునిమహాదేవుని సుగ్రీవుడు మొదలుగు వానరులను (122) ధ్యానించిదేవతలను, ఋషులను, పితృగణములను ధ్యానించిదారిద్ర్యము నుండి విముక్తి కొరకు వారందరికి తర్పణం వదలాలి. (123) అర్ణోదయముళుధమై నదీ. అవ్వడు జగన్నాథునిపూజించాలి. సేతువుయందు అర్థోదయకాలమందు పూజించినకేశవుడుసంతోషిస్తాడు (124) ఓదివాకర! నీకు నమస్కారముఓతేజోరాశి, జగత్పతినీకునమస్కారము. ఈఅర్ఘ్యమును స్వీకరించు. వ్యతీపాతమహాయోగముగలవాడ మహా పాతకములకునాశకుడ! (125) అమృత కుంభుడ, ఓభగవాన్ నీకు నమస్కారము. ఈఅర్ఘ్యమునుస్వీకరించు, వ్యతీపాత మహా యోగముగలవార! మహాపాతకముల కునాశకుడ! (126) సహస్రబాహ! వర్వాతనీకు నమస్కారము. ఈఅర్ఘ్యమును స్వీకరించుతిథినక్షత్రవారములకు అధీశుడ, వరమేశ్వర (127) మానవరూపుడ ఈ అర్ఘ్యమును స్వీకరించు. కాలరూపుడ నీకునమస్కారము. అనివేరువేరుమంత్రములతోనరుడుఅర్ణోదయమందు అర్ఘ్యమునుఇచ్చి (128) బ్రాహ్మణులకుతనకుగల ద్రవ్యశక్తి ననుసరించికానుకలు ఇవ్వాలి. పదునాలుగు, లేదా పన్నెండులేదా ఎనిమిది,లేదా ఏడులేదాఆరులేదా ఐదుగురు బ్రాహ్మణులను (129) శక్తికొలదిఅన్నపానములు మొదలగువానితోవేరువేరుగా మంత్ర ములతో పూజించాలి. కాంన్యపాత్రను కానిలేదాకొత్తగాకట్టెతోచేసిన పాత్రను కొనితెచ్చి (130) బ్రాహ్మణులఎదురుగాఉంచిదానిని నీటితో నింపి,పండు, బెల్లము,నేయి, తాంబూలము, దక్షిణ, (131) యజ్ఞోపవీతము, పాలిచ్చేదూడతో కూడినఆవును వీటన్నిటినిదానం చేయాలి. అలంకరించబడిన బ్రాహ్మణుల కుశక్తి కొలది పై ఇచ్చి ఇట్లా చెప్పాలి. (132)

ఓ జగన్నాథ! శ్రవణ నక్షత్రమందు, నీ జన్మ నక్షత్ర మందు ఓ కేశవ ! నేను యాచకులకు చేసిన దానము ఇక్కడ వారు అక్షయముగా ఉండని (133) నక్షత్రములకు అధిపతి, దేవతలకు అమృతమిచ్చువాడ, రోహిణీకాంత, నన్ను రక్షించు. కలాశేష (ఒకకళ మిగిలిన) నీకు నమస్కారము (134)దీననాథ! జగన్నాథ, కలానాథ, కృపాకర, నారు నీ పాదపద్మ ద్వయ మందు భక్తి అచలంగా ఉండని (135) వ్యతీపాత, నీకు నమస్కారము, సోమసూర్య అగ్నులతో సమంగా వెలుగువాడ, నేను చేసిన ఈ కొద్ది దానములు మొదలగునవి నీకు అవి అక్షయంగా ఇక్కడ ఉండని (136) ఓ వాసుదేవ, జనార్దన, నీవు యాచకులకు కల్పవృక్షమువు. మాన,ఋతు, ఆయనకాలములకు, ప్రభువ, హరి, నా పాపమును శమింప చేయి (137) అని పూజించి, ఓ విప్రులార ! ఆ పిదప శ్రాద్ధ మాచరించాలి. హిరణ్య శ్రాద్ధము కాని ఆమశ్రార్ధము కాని పాక లొఠముకాని (138) ఆచరించాలి. పిదప పార్వణమాచరించాలి. విత్తలోభము చేయించరాదు. పిదప వస్త్రము, భూషణములు, కుండలములతో ఆచార్యుని పూజించాలి. (139) ఆ పిదప అతనికి ప్రతిమను, గోవును, గొడుగు, చెప్పులు వీటిని అర్పించాలి. ఈ విధముగా అర్థోదయమందు సేతువు యందు వ్రత మాచరించాలి. ఓ ద్విజులార ! (140) దానితోనే ఆతడు కృతకృత్యుడౌతాడు. చేయవలసింది. మరొకటిలేనే లేదు. ఇతరలములందు కూడాఇట్లాగే అరోదయమందువ్రతమాచరించాలి. (141) గంధమాదనమందున ముద్రమందు సేతువును రాముడు నిర్మించాడు. ప్రాజులు సేతువు అనిఆతనినామాన్ని స్నానకాలంలోకీర్తించినందువలన (142) మనుష్యులకోట్ల కొలదిపాతకములు ఆ అచ్యుతవదమునకు కూడాచేరుతారు. (143) ఒకనిమిషముకాని, నిమిషంలో సగభాగంకాలంలో కాని సేతువుయందున్ననరుని దృష్టిలోపడుటకు యమకింకరులు అశక్తులౌతారు (144) రామ సేతువును, ధనుష్కోటిని, రాముని, సీతను, లక్ష్మణుని, రామనాథుని, హనుమంతుని సుగ్రీవుడు మొదలుగా గల కవులను (145) విభీషణని, నారదుని, విశ్వామిత్రుని, అగస్త్యుని, వసిష్టుని, వామదేవుని, జాబాలిని, కాశ్యవుని (148) అట్లాగే ఇతరులైన రామభక్తులను అప్పుడు మనస్సులో చింతిస్తూ ఉంటే అన్ని దుఖముల నుండి విముక్తుడౌతాడు. పరమ పదమునకు వెళ్తాడు (147) సత్యక్షేత్రము, హరిక్షేత్రము, కృష్ణ క్షేత్రము, నైమిషము, శాలగ్రామము, బదరి, హస్తి శైలము, వృషాచలము (148) శేషాద్రి, చిత్రకూటము, లక్ష్మీక్షేత్రము, తురంగ క్షేత్రము, కంచి, కుంభకోణము, మోహినీ వురము (149) ఐంద్రము (ఐన) శ్వేతాచలము, పుణ్యప్రదమైన వద్మనాభమహాస్థలము, వుల్లగ్రామము, ముటికాద్రి పరిస్థలమైన సారక్షేత్రము,(150) శ్రీనివాస్ మహాక్షేత్రము, భక్తుడైన వాథ(ముని) మహాస్థలము, ఆలిందా అను పేరుగల మహాక్షేత్రము, శుక క్షేత్రము, వారుణము (151) మధుర అనబడు హరి క్షేత్రము, శ్రీగోతి, పురుషోత్తమము, శ్రీరంగము, పుండరీకాక్షము, ఇతరహరిస్ధలములు (152) వీనియందు స్నానము చేయుట వలన నశించే పావములు, ఓబ్రాహ్మణోత్తములార! అవన్ని సేతుస్నానము వలన నశిస్తాయి నిశ్చయము (153).

మహామునులు సేవించే, రఘునాథుడు నిర్మించిన సేతువు యందు స్నానము చేయని, నరులకు నంసారము నుండి నివృత్తిలేదు. (154) ఎవరు శుభమైన పంచాక్షర మంత్రమును నమ శివాయ అనుదానిని పలకరా వినరో స్మరించరో (155) ప్రణవముతో కూడిన, నమో నారాయణ అను అక్షర మంత్రమును కానీ ఎవరు జపించరో, న్మరించరో (156) అదే విధముగా శ్రీరామచంద్రుని యొక్క షడక్షరమంత్రమును ఎవరు జపించరో, వినరో స్మరించరో అట్టివారి (157) పావములు రామ సేతువు యందు స్నానమాడుట వలన నశిస్తాయి. శుభమైన హరిదినమందు ఉపవసించని వారు (158) త్రిపుండ్ర ఉదూలనాదులతో భనమును జాబాలో వనిషన్మంత్రము లేడింటితో తల మొదలగు చోట్ల ధరించని వారు (159) శివునికాని, విష్ణువును కొని, లేదా ఇతర దేవతలను కాని వేదోక్త మార్గముతో పూజించని వారు (160) ఓ ద్విజ వుంగవులార ! వీరందరి పాపములు రామ సేతువు యందు స్నాన మాడుట వలన నశిస్తాయి. శివుడు విష్ణువు మొదలగు దేవతలకు ధూపము, దీవము, చందనము (161) పుష్పములు భక్తి పూర్వకముగా ఇవ్వని వారు, శివవిష్ణ్వాది దేవతలను శ్రీ రుద్రనమకములతో (162) శ్రీమత్ పురుష సూక్తముతో పవమానాది నూక్తములతో, త్రిమధుత్రి సువర్ణ మంత్రములతో పంచశాంతులు మొదలగు వానితో (163) అభిషేకించని నరులు పాప చేతనులు, వారి పాపములు దనుష్కోటి యందు స్నానం చేయటం వలన నశిస్తాయి (164) శివ విష్ణ్వాది దేవతలకు నమస్కార ప్రదక్షిణలు భక్తితో చేయని, పాపోహత బుదులు (165) ధనుర్మాస మందు ఉషః కాలమందు పూజచేయని, శివవిష్ణ్వాది దేవతలకు నైవేద్యమర్పించని వారు (166) వారి పాప ములు రామ సేతువు యందు మునుగుట వలన నశిస్తాయి. విష్ణువు యొక్క కొని శివుని యొక్కకొని నామములను కీర్తించని వారు (167) శాలిగ్రామ శిలా చక్రమును శివనాభమును, ద్వారకా చక్రమును కావి మోహముతో పూజించనీ నరులు (168) గంగమట, తులసి మృత్తిక, గోపీ చందనము లలాట మందు, వక్షః స్థలమందు ధరించని మూఢులు (169) రెండు చేతుల యందు (భుజములు) కంఠమందు, షార్వపాప వూహముల శాంతి కొరకు మంచిగ రుద్రాక్షను తులసి కాస్త్రమును ధరించని నరులు (170) వీరందరి పాపములు ధనుష్కోటి యందు మునుగుట వలన, నశిస్తాయి.

బ్రాహ్మీముహూర్తమురాగానే నిద్రను వదలి ప్రసన్నమైన బుద్ధిగలవాడై (171) హరిశంకర నామములను లేదా వారి స్తోత్రములను నిత్యము తలచే (చని) వాని వారి విశిష్ట మంత్రమును కాని తలచే (చని)(172) నరుని పావములు ధనుష్కోటి యందు మునుగుట వలన నశిస్తాయి. ప్రొద్దున్నే జలాశయమునకు వెళ్ళి స్నానము చేసి, ఆచమించి, శుద్ధమైన బుద్ధిగలవాడై (173) ప్రసన్నమైన ఆత్మగలవాడై, ఓ మునిశ్రేషులార ! వంధ్య ఉపాసన పూర్వకముగా వేదమాతయైన గాయత్రిని ఉపాసించని నరుని (174) సాయం ప్రాతః కాలములందు శ్రద్ధతో (కునుకుపాటులేక) ఔపాసన చేయని వారి, పావముతో హతమైన కోరికలు గలవారై మాధ్యాహ్నికము చేయనివారి (175) బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవము, మధ్యాహ్నమందు అతిధిపూజ, సాయంత్రమందు, అతిథులకు నమ్మతమైన పూజను ఆచరించనివారి (176) వీరందరి పాపములు ధనుష్కోటి యందు మునుగుట వలన నశిస్తాయి. మధ్యాహ్నము పూట యతులకు భిక్షమీయని నరుల (177) చదివిన వేద విద్యను,కు బుదులై మరచిన విప్రుల, వేములను గాని, వేదాంగములను గాని చదవని వాని (178) ప్రతి సంవత్సరము తలిదండ్రులకు శ్రాద్ధమాచరించని వారి, మహాలయ శ్రాధము, ప్రతిరోజు అష్టకాలౌధముఠానీ (179) ఇతరమైన నైమిత్తిక లౌధముకాని, లోభముతో చేయనివాని, చైత్రపూర్ణిమ యందు చిత్రగుప్తుని తుష్టి కొరకు (180) పానకము, కదలివక్వము, శర్కరతో కూడిన పాయసాన్నము, బెల్లము, మామిడిపండు, నన మొదలగు వండు కలిగి (181) తాంబూలము, పాదుకలు,ఛత్రము, వస్త్ర పుష్పములు, చందనము లోభముతో చెడిన బుద్ధిగలవాడై బ్రాహ్మణుల కివ్వని వారి (182) వీరందరి పాపములు ధనుష్కోటి యందు మునుగుట వలన నశిస్తాయి. చెడునడవడిక లేదా మంచి నడవడిక కలవాడుగాని వాడు ధనుష్కోటిని సేవించేవాడైతే (183) ఆతనికి పునర్జన్మలేకుండా నంసారవిచ్ఛిత్తి కలుగుతుంది. ఓ ముని పుంగవులార! నంసారసాగరమును దాటుటకు ఇచగించే నరుడు (184) ఆలసించకుండా రామచంద్ర ధనుష్కోటికి ఆతడు వెళ్ళాలి. నత్యం చెబుతున్నాను. వాతం చెబుతున్నాను. పాతమైన సారమునే తిరిగి చెబుతున్నాను (185) ముక్తి సాధించే కొరకు రామచంద్ర ధనుష్కోటికి వెళ్ళండి. విముక్తి కొరకు రామచంద్ర ధనుష్కోటి యందు స్నాన మాచరించాలి (186) ఓ విప్రులార! మరొక ఉపాయము లేదు. మాటి మాటికి చెబుతున్నాను. రామచంద్ర ధనుష్కోటి యందు స్నానం చేసిన నరులకు (187) ఏ ప్రయత్నం లేకుండా సంసార భయనాశనము సిద్ధిస్తుంది. నత్యము, జ్ఞానము, అనంతము, పూర్ణమైన పనాతన బ్రహ్మ (188) ప్రాప్తి ధనుష్కోటియందు మునుగుట వలన లభిస్తుంది. ఈ విషయంలో అనుమానములేదు.

శ్రీ సూతులిట్లనిరి - ఈ విధముగా మీరు ఉత్తమమైన సేతు మాహాత్మ్యమును చెప్పాను. ఓ విప్రులార! (189) మహాదుఖ శమనము, మహారోగములను తొలగించేది, దుఃస్వప్ననాశకము, పుణ్యప్రదము, అపమృత్యునివారకము (190) మహాశాంతినిచ్చేది, చదివే వారికి, వినే వారికి సరులకు స్వర్గమును అవవర్గమును ఇచ్చేది, పుణ్యకరము, నర్వతీర్థముల ఫలమునిచ్చేది (191) పుణ్యప్రదమైన దీనిని కీర్తించిన, చక్కగా విన్నను ఆతడు అగ్నిష్ణోమాది యజ్ఞములు చేసిన ఫలమును పుష్కలముగా పొందుతాడు (192) అంగములతోటి నాలు వేదములను నూరు మారులు ఆ వృత్తిచేసిన వచ్చే ఫలితాన్ని ఈ మాహాత్మ్యమును కీర్తించుట వలన పొందుతాడు (193) ఇక్కడ ఒక అధ్యాయమును చదివిన విన్నను, ఓ మునులార అశ్వమేధ యజము యొక్క ఫలమును సంపూర్తిగా పొందుతాడు (194) రెండు అధ్యాయములను చదివిన, విన్నను గోమేధ యజ్ఞ ఫలమును ముఖ్యమైన దానిని పొందుతాడు (195) పది అధ్యాయములు చదివిన, భక్తితో విన్నను న్వర్గలోకమును పొంది ఇంద్రునితో కూడి ఆనందిస్తాడు(196) ఇరువది అధ్యాయములను చదివిన, విన్నను ఓ మునులార! బ్రహ్మలోకమును పొందుతాడు బ్రహ్మతో కలిసి ఆనందిస్తాడు (197) ముప్పది అధ్యాయములను పఠించినను విన్నను ఏసులోకమును చేరుకుంటాడు విషువుతో తుడి ఆనందిస్తాడు (198) నలుబది అధ్యాయములను చదివినను, విన్నను రుద్రలోకమును చేరి రుద్రునితో కలిసి ఆనందిస్తాడు (199) ఏబది అధ్యాయములను చదివినను, విన్నను సాంబుని హరుని, శివుని, అర్థచంద్రుని తలలో గల వానిని ఆతడు పొందుతాడు (200) ఈ ఉత్తమమైన మాహాత్మ్యాన్ని పూర్తిగా చదివిన లేదా విన్నవారు సాంబశివుని సాలోక్యమును పొందుతారు అనుమానము లేదు (201) దీనిని రెండు మారులు చదివిన లేదా చిన్నవారు, ఓ ముని నత్తములార! శ్రేష్టమైన విమానమందు కూర్చొని శివ సామీప్యమును చేరుతారు (202) చక్కగా మూడు మారులు దీనిని చదివిన లేదా వినిన వారు, శివునకు ప్రీతి కలిగినూ శివసారూప్యమును పొందుతారు (203) నాలుగు మారులు దీనిని ఉత్తమమైన దానిని వరించిన లేదా విన్నవారు గిరిజాపతియైన శివుని సాయుజ్యమును పొందుతారు (204) ప్రతిరోజు శ్లోకమునుగాని నగము శ్లోకమును గాని చదివిన నరుని పాదమును గాని పాదములో కొంతగాని అక్షరముగాని వర్షముగాని చదివిన వరుని (205) ఆయా దినములలో చేయబడ్డ పాపము ఆక్షణంలోనే నశిస్తుంది.

ఈ సేతు మాహాత్మ్యము పూర్తిగాచదివినా, విన్నను (206) ఈశ్లోకములలో ఎన్నివర్ణములు (అక్షరములు) ఉన్నాయో, అన్ని బ్రహ్మహత్యలు మద్య సేవనములు (207) అన్నిబంగారుదొంగతనములు, అన్నిగురుదారగమనములు, అన్ని సంసర్గదోషములు ఆక్షణంలోనేనశిస్తాయి. (208) ఈమహాపుణ్యమాహాత్యంలో ఎన్నివర్ణరాళులుఉన్నాయో, అన్ని మారులుచతుర్వింశత్తీర్ధములలో (24) స్నానంచేసి వలములనుంది. (209) సేతుమధ్యమందున్న ఇతరతీర్థ ములందు స్నానంచేసి నవలమును ఈమాహాత్మ్యము నుచదువుటవలన, లేదావినుటవలనసాందుతాడు (210) ఈఉత్తమమైన సేతుమాహాత్మ్యమునుభక్తిలిఖించినవారువారి అజానసంతా నమునశించిశివ సాయుజ్యమును పొందుతారు. (211) శుభమైనఈమాహాత్మ్యమువ్రాయబడిఎవరిఇంట్లో ఉంటుందో, వారికి భూతవేతాల కాదుల నుండి భయములేదు. (212) వారికి వ్యాధిపీడ, అక్కడదొంగలభయములేదు. శని కుజుడుమొదలగు ముఖ్యగ్రహముల వీడఅక్కడలేదు. (213) ఉత్తమమైనవుణ్యప్రదమైనమాహాత్మ్యము ఏఇంట్లో ఉంటే, ఆఇంటినిరామ సేతువుగా తెలునుకోండి, ఓ మునిపుంగవులార! (214) ఇరువదినాలుగుతీర్థ ములుఅక్కడే ఉన్నాయి. పుణ్య మైనగంధమాదనపర్వతముఅక్కడేఉంది. (215) బ్రహ్మవిష్ణుమహేశులు అక్కడే సాదరంగాఉంటారు. సేతు మహాత్మ్యమును వ్రాసి బ్రాహ్మణులకునివేదించాలి. అట్లాచేస్తేనాలు నముద్రములవరకు గలభూమిని ఆతడుదానంచేసినట్లే (216) సేతు మాహాత్మ్యదానముత్రము - ఇతరదానములన్ని సేతు మాహాత్మ్య దానము యెక్కవదహారవకలనుగూడా పొందలేవు. అందువల్ల నాకుళాంతినివ్వు. ఎక్కువగాచెప్పనవసరంలేదు. ఇక్కడ ముల్లోకములునివ సిస్తున్నాయి. (217) శ్రాద్ధకాలమందుఒక అధ్యాయమును ఎవరు వినిపిస్తారో, ఆతనిధమందలి దోషాలునశిస్తాయి. ఆతనివితరులు చాలాసంతోషిస్తారు. (218) పర్వతాలమువచ్చినపుడు మాహాత్మ్యమును బ్రాహ్మణులకు వినిపించిన ఒక అధ్యాయము కాని, ఒకశ్లోకమైనా వినిపించినఆతనిగోవులు ఆపదలులేకుండా ఉంటాయి. ఎక్కువగా పాలనను, దూడలతోగూడి ఉంటాయి. వాటికి బశిలుజన్మిస్తాయి. (219) దీనినిపుణ్యమైనదీనిని మతమందు దేవాలయమందుఠాని, నదీతటాకతీర ములందు పవిత్రమైన అరణ్యభూములందు శ్రోత్రి యులగృహమందు కాని పఠించాలి. ఇతరచోట్ల ఎక్కడాచదువొద్దు. (220)

విషువతయందు, అయనకాలమందు పుణ్యప్రదమైనహరివాసరమందు, అష్టమి, చతుర్దశిఈతిధులందు విశ్లేషించి దీవినిచదువాలి (221) దీనిని శ్రావణభాద్రపదమాసములందుచదువాలిధమురాసమందుచదువాలి. ఉత్తరాయణముందు చదవాలి. (222) ఓద్విజులార! ఈమావేశాన్ని నియమంతోచదువాలి. ఉత్తమమైనదీనిని శ్రోతలు కూడానియమములతో కూడి వినాలి.(223) ఈమాహాత్మ్యమందుఅనేక పుణ్యతీర్థములుకీర్తింపబడుతున్నాయి. అట్లాగేవుణ్యశీలులైనరాజర్షినత్తములు కూడాకీర్తింపబడు తున్నారు. (224) ప్రధానమైనదీనియందుమహాభాగులైనఋషులు కీర్తింపబడుతున్నొరు. ఓద్విజవుంగవులార! పుణ్యప్రదమైనదీనియందు ధర్మఅధర్మములు కీర్తింపబడుతున్నాయి. (225) ఇందుబ్రహపరుద్రులు త్రిమూర్తులుకీర్తింప బడుతున్నారు. ఇదీవవిత్రమైనది. పాప ములహరించేది. వేదఅర్థములతో పెంచబడినది (228) సతి కర్తలకు ఇష్టమైనది. ద్వైపాయన మునికి ప్రియమైనది. తన కుయున్పునుకోరు తునేవాడు. ఏనాలిచదువాలి. (227) వినిపించే వ్యక్తికి, ఏదోకొంతబంగారము వెదలైనవి ఇవ్వాలి. తనశక్తికి తగినటఇవ్వాలి. ధనలోభంచేయరాదు. (228) వస్త్రము, బంగారము, ధాన్యము, భూమి, గోవు ఏదైనాశక్తికి తగినట్లు ఇవ్వాలి. వినేవారు, ఈమహాతాన్ని చెప్పిన వ్యక్తిని దానమివ్వడం ద్వారాగౌరవించాలి. (229) ఈమాహాత్య్మంచెప్పినవానిని పూజిస్తే త్రిమూర్తులు పూజింపబడతారు. త్రిమూర్తులువూజింపబడితే ముల్లోకములుపూజింపబడినట్లే, (230) హరి,దశరథుని కుమారుడు రాముడుగా సాక్షాత్తుగా ఈభూమి పై అవతరించాడు. ఆతడు సీతాలక్ష్మణులతోకూడి ప్రతిరోజుఈమాహాత్మ్యన్ని విన్నవారికి, వినిపించినవారికి (231) ఈలోకమందు సుఖములనిచ్చి, అంత మందుముక్తినిస్తాడు. ద్వైపాయనునిముఖవద్మమునుండి వెలువడినదిది. మిక్కిలి శుభమునిచ్చేది. (232) ఈ సేతుమావేశాన్ని యుధిష్ఠిరుడైన ధర్మరాజు, భీమసేనుడు మొదలుగా గలతమ్ములందరితో కూడి (233) నియమాచారము లతోకూడి, సైన్యముతోపాటు ప్రతిదినముపురోహితుడైన ధౌమ్యమహర్షి చదువు తుండగా వినేవాడు (234)

శ్రీసూతులిట్లన్నారు. ఓతపోధనులార! అందరూనైమిషారణ్యవాసులార, నానుండిరహస్యమైన, శ్రుతి సమ్మతమైనఈమాహాత్మ్యాన్ని (235) మీరంతావిన్నారు. ప్రతిరోజుఆదరంతో, నియమంగా దీన్నిచదవండి. నియమితులై నతమశిష్యులతో ఎల్లపుడుచదివించండి. (236) అవి మునులతోవలికి వెతుడురోమాంచిత శరీరుడై, గురువై నవ్యావునిహృదయంలోవరిస్తూ ఆనందబాష్పాలురాలుస్తూ నాట్యంచేడు (237) ఇంతలోమహావిద్వాంసుడైనపారాశర్యమహాముని, శిష్యులను అనుగ్రహించాలనే కోరికతోత్వరగాఅక్కడివ్రత్యక్షమైనాడు. (238) వచ్చిన, సత్యవతినుతుడై నమునినిచూచిసూతుడు, నైమిషారణ్య వాసులందరితో కూడి (239) వ్యానుని పాదాంభోజ ములకు దండ మువలెసాష్టాంగ నమస్కారము చేసి, ఆనందబాష్పాలను తనకన్నులనుండికార్చాడు.(240)నమస్కరించినతనప్రియశిష్యునిఆమునితనచేతులతోలేవనెత్తి, ఆశీస్సులతో అభినందించి ఆతనినిమాటిమాటికకౌగిలించుకొని (241) నైమిషారణ్యమునులు తెచ్చినవరముఆసనమునందు తపోధనుడు, మహాతేజస్సంపన్నుడు ద్వైపాయనుడు కూర్చున్నాడు. (242) ఆతని ఆజ్ఞతోమునులు కూర్చున్నపిదప, సూతుడు కూడా కూర్చున్న పిదపశౌనకాదిమునులందరితో శక్తి పౌత్రుడుఇట్లు పలికాడు. (243) ఓనైమిషారణ్యవాసులార. ఇదంతానాకుతెలుసు. నాశిష్యుడైనసూతుడు, ఉత్తమమైన సేతు మాహాత్మ్యాన్ని మహాపాతకనాశకమైన దానిని మీరుచెప్పాడు. (244) శ్రుతులలోని, నృతులలోని అట్లాగేవురాణములలోని శాస్త్ర, ఇతిహాసములోనిఇతరమైనవాటినన్నింటిలోని వంపూర్ణమైన (245) పర్యవసన్నమైనఅర్థము, ఈమాహాత్మ్యము. ఇదిచాలాగొప్పది. వురాణములన్నింటిలోఇదినాకుఇష్టమైనది.(246)నాఆజ్ఞతోధర్మరాజునిత్యముధౌమ్యునినుండి దీనిని వింటున్నాడు. అందువల్ల మీరు కూడాఎల్లప్పుడు ఉత్తమమైన సేతు మహాత్మ్యాన్ని (247) చదవండి. వినండి. అట్లాగే శిష్యులతోచదివించండి కూడా. ఆతని మాటలను విని వారుఅట్లాగే అనిపలికారు. (248) పిదపవ్యాసుడుశిష్యుడైననూతునితో కలిసి, మునులందరికి ఆజ్ఞ ఇచ్చికైలాన వర్వతమునకు వెళ్ళాడు. (249) నైమిషారణ్యవాసులైనఋషులందరుఆనందపడివారు ప్రతిరోజు సేతు మాహాత్మ్యమును వింటున్నారు. చదువుతున్నారు కూడా. (250) అని స్కాంద మహాపురాణమందు ఏకాశీతినహస్రనంతయందు తృతీయమైనబ్రహ్మ ఖండమందు సేతు మాహాత్మ్య మందు ఏబది రెండవ అధ్యాయము.

స్కాందమహావురాణాంతర్గతమైన బ్రహ్మఖండాంతర్గతమైనసేతుమాహాత్మ్యము ఇది సమాప్తమైనది