స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
16వ అధ్యాయము
తా ॥ సూతులిట్లనిరి - స్వయంగా రుద్రుడు సేవించిన హనుమత్కుండంలో స్నానం చేసి శ్రద్ధగా, పిదప అగస్తీ తీర్థమునకు వెళ్ళాలి ఈ తీర్థాన్ని అగస్త్యుడే స్వయంగా నిర్మించాడు. పూర్వం మేరు, వింధ్య పర్వతములకు కలహం జరుగుతుండగా వింధ్య పర్వతములోళముల పూర్ణతను అడ్డగిస్తూ పెరిగింది. ప్రాణులంతా ఉచ్వాసహితులు కాగా దేవతలు కైలాస పర్వతమునకు వెళ్ళి ఈ విషయాన్ని శివునకు విజ్ఞాపన చేశారు అప్పుడు శివుడు పార్వతీపాణి గ్రహణమందు ఉత్సుకత కలవాడై పార్వతిని యాచించుటకు వసిష్ఠాదిమునులను పంపి, తుంభజ!. నీవు వింధ్య పర్వతాన్ని నిగ్రహించు అని ఆతనిని అనుశాసించాడు అవ్వడు తుంభజుడు ఎవారితో ఇట్లా అన్నాడు. మీ వివాహపు వేషాన్ని చూడలేను గదా ఎట్లు ప్రభు ! అని అంటే శివుడు తిరిగి కుంభజునితో ఇట్లా అన్నాడు. కుంభజ! నీకు వివాహ వేషమంటే నేను పార్వతితో కూడినదే మహాపుణ్య ప్రదమైన వేదారణ్యంలో కనిపిస్తాము అనుమానంలేదు. అందువల్ల ఓ ముని తొందరగా వింధ్యాదిని, నిగ్రహించుటకు వెళ్ళు అని శివుడనగా ఆ అగస్త్యుడు వింధ్యాదిని, నిగ్రహించి, పాదమును ఆక్రమించుట ద్వారా (పాదం మోపి) నే భూమిని చక్కజేసి దక్షిణ దేశాలు తిరుగుతూ గంధమాదనము వెళ్ళాడు. ఆ మహర్షి గంధమాదన వైభవాన్ని తెలుసుకొని తన పేరుతో ఆముని మహా పుణ్యప్రదమైన తీర్థాన్ని నిర్మింప చేశాడు. లోపాముద్ర సఖుడైన కుంభజుడువేటకి గూడా అక్కడున్నాడు. అక్కడ స్నానం చేసి జలపాసం చేసిన యెడల తిరిగి జన్మరాదు. ఈ లోకంలో త్రికాలములందును ఆ తీర్థముతో సమానమైన తీర్థములేదు. అది పుణ్యప్రదమైనది. భుక్తిముక్తి ఫలములనిచ్చేది. అన్ని కోరికలతీర్చేది. ఆ తీర్థస్నాన వైభవం వల్ల సుదీర్ఘ తమముని పుత్రుడు కవంతుడను వాడు, స్వనయుని కూతురైన మనోరమ అనుదానివి భార్యగా పొందాడు. ఈశ్రీవతుని కథ పుణ్యమైంది పావవాశకమైంది ఆకథను మీకు చెప్పెదను, ఓ మునులారా ! మీరు వినండి పరమధార్మికుడు, దీర్ఘతముడను ముని ఉండేవాడు. అతనికి కవంతుడను పేరు గల వుత్రుడుండేవాడు ఉపనయనం ఐన ఆ కక్షివంతుడు బ్రహ్మచారి జితేంద్రియుడు. వేదభ్యాసము కొరకు ఆతడు గురుకులముందు వానము కల్పించుకున్నాడు .
తా । గురువైన ఉదంకుని ఇంట్లో ఉంటూ దీర్ఘతముని కొడుకు నాలుగువేదములను అంగములతో కూడా శాస్త్రము లారింటిని ఇతి హాసపురాణములు, ఉపనిషత్తులు అభ్యసించాడు. కక్షివంతుడు గురునన్నిధిలో అరవై సంవత్సరాలు ఉండి తన ఇంటికి వెళ్తూ గురువునకు దక్షిణ ఇచ్చాడు. వూజ్యుడు, విద్వాంసుడు బ్రహ్మవిత్తముడుఐన కక్షివంతుడు గురువుతో ఇట్లా అన్నాడు కక్షివంతుని మాట - ఓముని నేను ఇంటికి వెళ్తున్నాను అనుజ్ఞ ఇవ్వండి. కృపాదృష్టితో నన్ను చూచి ఓ ఉదంక! నన్ను రక్షించు అని ఇట్ల ఉదంకునితో అనగానే ఆతడు కక్షివంతునితో ఇట్లా అన్నాడు ఉదంకునిమాట - ఓ కక్షివంత! ఇంటికి వెళ్ళటానికి అనుజ్ఞ ఇస్తున్నాను. నీ ఇంటికి వెళ్ళు నీవివాహము కొరకు నీకు ఉపాయాన్ని చెబుతాను. దాన్ని విను. రామ సేతువునకు గంధమాదన పర్వతానికి నీవు వెళ్ళు. అక్కడ అగస్త్యుడేర్పరచిన తీర్థముంది. అన్ని కోరికలను తీర్చేది. పాపాలన్నీ తొలగించేది. భుక్తి ముక్తి ప్రదము అన్ని మంగలముల సాధించే దానిలో నీవు స్నానం చేయి. నియమాచారములతో కూడా అక్కడ నీవు మూడు సంవత్సరాలుండు మూడు సంవత్సరాలు గడిచాక నాల్గవ సంవత్సరంలో ఆ ఉత్తమ తీర్థమునుండి ఒక ఏనుగు బయటికి వస్తుంది నాలు కోరలు, భాగీశరీరము, శరత్కాల మేవుంవలె తెల్లని కాంతి గలదీ అదీ. కొండలాగా ఉండే ఆ ఏనుగును స్నానం చేసి అధిరోహించు ఆ ఏనుగును ఎక్కి ననయుని వురానికి వెళ్ళు. నాలుగు కోరలు గల ఏనుగు పై అపర ఇంద్రునిలా ఉన్న నిన్ను చూచి రాజర్షి, బుద్ధిమంతుడైన వ్వనయుడు ఆనందంతో చంచలమైన నేత్రములు కలవాడై తన మనసులో ఉన్న తన కన్యను గూర్చిన దుఃఖాన్ని వదిలేస్తాడు ఆతని కూతురు మనోరమ పూర్వం ప్రతిజ్ఞ చేసింది. నాలుదంతములు కలది, మహాకాయముగలది, అంతా తెల్లగా ఉన్నట్టిది ఐన ఏనుగును ఎక్కి వచ్చినవాడే నా భర్తకావాలి అని. తనకూతురు ప్రతిజ్ఞను దానిని విన్న ఆ రాజు దుఃఖంతో నిండిన మనస్సు కలవాడై ఎవ్వడు విచారిస్తుండేవాడు. స్వనయుడు ఇట్లా చింతిస్తూ ఉండగా నారదుడొచ్చాడు. వచ్చిన ఆమునిని చూచి అతిధార్మికుడైన రాజర్షి ఎదురేగి సంతోషంతో కూడినవాడై పాద్యఅర్ఘ్యములతో పూజించాడు. రాజు, నారదునకు నమస్కరించి ఇట్లా అన్నాడు. ఓ. దేవర్షి ! ఈ నాకూతురు పూర్వం ప్రతిజ్ఞ చేసింది నాలుదంతములు, మహాకాయము, సర్వాంగ పాండురము ఐన ఏనుగును ఎక్కివచ్చిన వాడే నాభర్త కాగలడని చతుర్ధంతములు, మహాకాయము, నర్వాంగ పాండురము ఐన గజము ఇంద్రభవనంలో ఉండొచ్చు. భూతలంలో లేదు దుస్తరమైన ప్రతిజ్ఞను ఈ అమాయకురాలు చేసింది. ఈ ప్రతిజ్ఞ ఎప్పుడూ నన్ను మిక్కిలిగా బాధిస్తోంది వివాహంకాని అమ్మాయి తండ్రికి ఎప్పుడూ దు:ఖాన్ని కల్గించేది. అనే ఆతని మాటలను విని స్వనయునితో నారదుడు ఇట్లా అన్నాడు బాధపడకు ఓ రాజర్షి ! ఆమె యొక్క ఇలాంటి కోరిక ఈ భూమి మీద తప్పకుండా తీరుతుంది, త్వరలోనే బ్రాహ్మణుడు కక్షివంతుడను పేరుగల ప్రసాదుడు నీకు అల్లుడౌతాడు. ఇట్లా చెప్పి నారదముని ఆకాశమార్గంగుండా వెళ్ళిపోయాడు స్వనయుడు, నారదుడు చెప్పిన మాటలను విని అటువంటివాని సమాగమముకొరకు రాత్రింబవళ్ళు కోరుకుంటున్నాడు.కనుక ఓ మహాభాగ! బాలతావన ! సౌమ్య! కక్షివంతుడ! వేగంగా నీవు అగస్త్య తీర్థానికి ఇప్పుడే స్నానం చేయటానికి వెళ్ళు నర్వమంగళసిద్ధి నీకు కలుతుంది అనుమానం లేదు.
తా । ఉదంకుడు ఇట్లా చెప్పాక కక్షివంతుడు గురువు అనుజ్ఞను పొంది గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అగస్త్య తీర్థమును చేరి జితేంద్రియుడైన ఈతడు స్నానం చేశాడు ఈ మునీశ్వరుడు ఒకరోజు క్షేత్రోవవాసము చేశాడు. మరుసటి రోజు మరల స్నానం చేసి ఆ బ్రాహ్మణుడు పారణ చేశాడు ధర్మతత్పరుడైన కక్షివంతుడు రాత్రియందు అక్కడే పడుకొన్నాడు. ఈ రకంగా నియమవంతుడైన ఆ కక్షివంత మునికి ఒకరోజు తక్కువగా మూడు సంవత్సరాలు గడిచాయి. మూడవ సంవత్సరం చివర ఆ రోజేముని పశ్చిమ నంధ్యను ఉపాసించి దాని తీరమందు హాయిగా నిద్రించాడు. రాత్రి ఒక రూముమాత్రమే మిగిలి ఉందనగా పెద్దధ్వని ప్రళయకాల సముద్రంలోని అలలకోలాహలంతో సమానమైన పెద్దశబ్దంగా కక్షివుడు మేల్కొన్నాడు పిదప బలవంతుడైన, అనుచరులతో కూడిన స్వనయుడనే రాజు, మధురావతి వేటాడే కౌతుకంతో అక్కడికి వచ్చాడు అతడు ఏనుగులను, సింహాలను, పందులను, దున్నలను, దువులను చంపుతూ వచ్చాడు. ఇంకా ఇతర మృగ విశేషములను కూడా ఆరాజు బాణములతో చంపాడు. మంత్రులతో రథములు గుణములు ఏనుగులతో కూడినవాడై వేటయందానక్తి కలవాడై భటులతో కూడి అగస్త్య తీర్థము సమీపమునకు వచ్చాడు. ఆరాజు వేటాడి అలసిపోయి, అలసిన సైన్యం కలవాడై ఆ తీర్ణప్రాంతమందు విశ్రమించాడు పిదప తెల్లవారాక కక్షీవముని అగస్త్యతీర్థంలో స్నానంచేసి పూర్వసంధ్యను ఉపాసించి ఆ తీరతీరంలో మంత్రములు జవస నియమంగా ఉన్నాడు. ఇంతలో ఆ తీర్థమునుండి ఒక నియమంగా ఉన్నాడు. ఇంతలో ఆ తీరమునుండి ఒక ఏనుగు బయటికి వచ్చింది. చతుర్థంతములు మహాయము కైలాసముపలె తెల్లగా ఉంది. అది ఆ తీర్థమునుండి లేచి కక్షివముని సమీపమునకు వెళ్ళింది ఉదంకుడు చెప్పిన లక్షణములుగల ఆ వచ్చిన ఏనుగును చూచి, దానిని ఎక్కటానికి కక్షివుడు స్నానం చేశాడు ఆ తీర్థానికి నమస్కారం చేసి మాటిమాటికి దాన్ని పొగుడుతూ, చతుర్ధంతములు కల ఆమహాగజమును కక్షివుడు ఎక్కాడు నాలుదంతములతో కైలానపర్వతంవలె తెల్లగా ఉన్న ఆ ఏనుగు నెక్కి కక్షివుడు స్వనయుని నగరానికి వెళ్ళదలిచాడు .
తా నాలుగు దంతములుగల ఉత్తమమైన తెల్లని ఏనుగును ఎక్కిన ఆతనిని చూచి ఈతడు కక్షపంతుడు అని రాజు నిశ్చయించుకొనెను ప్రసన్నమైన హృదయముగలరాజు ఆతని సమీపమునకు వచ్చాడు. అట్లా సమీపమునకు వచ్చి రాజు కక్షివంతునితో ఇట్లా అన్నాడు. స్వనయుని మాట - ఓ బ్రహ! నీవు ఎవరిపుత్రుడవు, నీ పేరేమిటి నాకు చెప్పు. నీవు ఈ ఏనుగునెక్కి ఎక్కిడికి వెళ్ళ దలిచావు. స్వనయుడు ఇట్లా అనగానే కక్షివుడు ఇట్లా అన్నాడు. కక్షివుని మాట - నేను దీర్ఘతమసుని వుత్రుణ్ణి. కక్షివుడు అనీనా పేరు. స్వనయుడను రాజర్షి నగరానికి వెళ్తున్నాను అతనికూతురైన మనోరమను వివాహమాడుటకు ఇష్టపడుచున్నోను. నాలుకోరలుగల ఏనుగునెక్కిన అనే ఆమె ప్రతిజ్ఞను నెరవేర్చి స్వనయుని కూతురు పాణి గ్రహణాన్ని చేస్తాను అని అన్న అతని మాటలను విని, వీనులకు అమృతమునందించినట్లుగా ఆనందంతో విప్పారిననేత్రములుకలవాడై స్వనయుడు ఇట్లా అన్నాడు ఓ కక్షీవుడ ! నేను ధన్యడనైనాను. ఆన్వనయుడనునేనే. నీవు పెండ్లాడదలచిన మనోరమ తండ్రిని ఓ బాల:తావన! మునిశ్రేష ! కజ్జీవ ! నీకు స్వాగతము ఓ తపోధన ! నాకూతురైన ! కన్యయైన మనోరమను స్వీకరించు ఆమెతో కూడి ధర్మాన్నిచరిస్తూ గృహస్థ ధర్మాన్ని పరిపాలించు. రాజు ఇట్లు అనగా ఆ ధర్మతత్పరుడైన కక్షివుడు ఇట్లా అన్నాడు. సంతుష్టుడై మధురాపురవాసి యైన రాజైన స్వనయునితో ఇట్లా అన్నాడు. కక్షివుని వచనము. వేదారణ్యమందు దీర్ఘతముడు నా తండ్రి తపమాచరిస్తూ, నియమాచారతత్పరుడై, సౌమ్యుడైన వాడు ఉన్నాడు. ఓ రాజా ! ఆతని నమీపానికి నీవు ఒక బ్రాహ్మణుని పంపించు ఆ రాజు స్వనయుడు సంతోషించి అట్లాగే అని పలికి అప్పుడు అనేక సేనలతో నహ తన పురోహితుని పంపాడు వేదారణ్యానికి సుదర్శనుడను విప్రుని పంపాడు. స్వనయుడను రాజుతో అట్లా ఆజ్ఞాపింపబడ్డ సుదర్శనుడు వేదననమునకు చాలా పెద్ద సేనతో వెళ్ళాడు. అక్కడ వర్ణశాలలో కూర్చున్న దీర్ఘతమసుడనుమునిని వేదాటవీవతిని ధ్యానిస్తూ తపమాచరిస్తున్న వానిని, ఉత్తమ మంత్రాన్ని జపిస్తున్న వానిని పురోహితుడు చూచాడు ఆ సుదర్శనుడు ఆ మునికి నమస్కారము చేశాడు. మునిని దీర్ఘతమనుని సంతోష పెడుతున్నట్లుగా పలికాడు .
తా ॥ సుదర్శనుడిట్లనెను - ఓ బ్రహ్మన్! మీరు క్షేమమా మీతవస్సువర్ధిల్లుతోందా ! మీ ఆశ్రమంలో అంతా క్షేమమేనా. ధర్మం ఆచరణ సుఖంగా సాగుతోందా చెప్పండి సుదర్శనుడు ఇట్లా అడుగగా అప్పుడు దీర్ఘతమముని ఆర్ఘ్యముమొదలగు వానితో శాస్త్ర ప్రకారము పూజించి సుదర్శనునితో ఇట్లా అన్నాడు.దీర్ఘతముని వచనము - ఓ బుద్ధి మంతుడ సుదర్శన ! బ్రహ్మ ! అంతటా క్షేమము వేదాటవీనాథుని కృపతో నాడు అశుభమన్నది లేదు మీరు క్షేమమేనా , మీరు సుఖంగా ఇక్కడికి వచ్చారా. మీరు ఏ పని మీద ఈ ఆశ్రమానికి వచ్చారు. ఓ సుదర్శన నీవు స్వనయుని పురోహితునివి, వేదవిదులలో శ్రేష్ఠుడవు. మధురాపురంలో ఉండే రాజును వదలి పెద్ద సైన్యంతో సహా ఎందుకొరకు నీవిక్కడికి వచ్చావు. అని దీర్ఘతముడనగా అప్పుడు సుదర్శనుడు తేజస్సుతో వెలిగిపోతున్న మహాత్ముడైన మునితో ఇట్లా అన్నాడు. మీదయతో అంతా సుఖంగానే ఉంది నాకు. భగవాన్ ! స్వనయుడను రాజు సాష్టాంగ నమస్కారము చేస్తూ వినయపూర్వకమైన మాటలను మీకు చెప్పాడు. నా ద్వారా మీరు వినండి. స్వసయుని మాట - ఓ బ్రహ్మ ! కక్షివుడు మీ కుమారుడు గంధమాదన పర్వతమందు అగస్త్యతీర్థంలో స్నానంచేస్తూ ఇక్కడున్నాడు అతని రూపము, తపము, ధర్మము, వైదికాచారములు, వేదశాస్త్ర ప్రావీణ్యము, అందుకు తగిన ఉత్తమ వంశజాతత్వము. లోకోత్తరమైన వీటన్నిటిని మీ కుమారుని యందుచూచి ఓ ముని! మనోరము అను నాకుతురును నేను ఆతనికివ్వదలిచాను. వేటమీది కుతూహలంతో నేను గంధమాదన పర్వతానికి వచ్చాను. ఓ ముని! వచ్చి మీ కుమారుని దగ్గర ఉన్నాను మా తండ్రిగారి ఆజ్ఞ లేకుండా నీ కూతురును నేను వివాహమాడను. అని కక్షివుడు నీ కుమారుడన్నాడు అందువల్ల మీరు, నా కుమార్తెను ఆతనికిచ్చుటకు, నా యందను గ్రహించండి. సేనతో సుదర్శనుని మీదగ్గరకు పంపాను నుదర్శనుని మాట - అని సన్నురాజు మీ సన్నిధికి పంపాడు. అందువల్ల మీరు ఆ రాజు కోరికను అనుమతించండి శ్రీ సూతులిట్లనిరి - అని పలికి స్వనయుని పురోహితుడు విరమించాడు అప్పుడు దీర్ఘతముడు స్వనయునితో ఇట్లా అన్నాడు దీర్ఘతమునిమాట - స్వనయుడు చెప్పినట్లుగానే కానిమ్ము, ఈ మంగలమైన పాణిగ్రహణము నాకు చాలా ఇష్టమైనది నేను గంధమాదన పర్వతానికి వస్తాను. అని ఆ ముని చెప్పి, ఆతడు భక్తి పూర్వకమైన మనస్సుతో వేదాటవీవతికి నమస్కరించి సుదర్శనునితో కుడి సేతువునుద్దేశించి బయలు దేరాడు.ఆరురోజులు ముని పుణ్యమైన గంధమాదన మునకు బయలుదేరాడు. దీర్ఘతమముని అగస్తీ తీర్థ తీరమునకు వెళ్ళి, తన కుమారుడైన కక్షివంతుని ఆముని చూచాడు. కక్షివుడు తన తండ్రిని చూచి తన పేరును చెబుతూ నమస్కరించాడు పిదవ దీర్ఘతమముని తన కుమారుని తొడయందు కూర్చోబెట్టుకొని, స్నేహ పూర్వకముగా మూర్ధమాఘ్రాణించి పులకాంకితుడై ఆలింగనము చేసుకున్నాడు. అప్పుడు. దీర్ఘతమ ఋషి కుశల మడిగాడు. ఓ వత్స! నీవు అన్నివేదములను అభ్యసించావా (99) శాస్త్రములు వరించావా. అన్నీనాకు చెప్పు అని తండ్రి అడుగగా అంతవృత్తాంతమును తండ్రితో చెప్పాడు (100) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు అగస్తితీర్థప్రశంసయందు కక్షీవుని వివాహ ప్రయత్నమనునది వదునారవ అధ్యాయము సమాప్తము.
