స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
18వ అధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - మానవుడు ఈ అగస్త్యతీర్థమందు స్నానముచేసి పాపవిముక్తి కొరకు పిదప పుణ్యప్రదమైన రామగుండమునకు వెళ్ళాలి (1) రఘునాధ సరస్పు పుణ్యప్రదము పాపనాశకము. రఘునాథ నరస్సు తీరమందు అల్పదక్షిణలతో యజ్ఞము చేసినా (2) సంపూర్ణ ఫలాన్నిస్తుంది. స్వాధ్యాయజపములు కూడా అల్పములైనా పూర్ణఫలాన్నిస్తాయి. రఘునాథ సరసీరమందు పిడికెడు మాత్రమైనా (3) వేదమెరిగిన వారికి దానం చేస్తే అది అనంత ఫలితాన్నిస్తుoది. ఓ మునులారా ! ఆ రామతీర్థమును గూర్చి చెబుతున్నాను. (4) ఈ ఇతివనము పుణ్యప్రదము. పాతక నాశకము. సుతీక్ష్మడను పేరుగల బ్రాహ్మణుడు ముని మనోనిగ్రహము కలవాడు (5) అగస్త్యునకు శిష్యుడు రామపాద చింతకుడు. రామచంద్ర నరస్తీరమందు చాలా కఠినమైన తపమాచరించాడు. (6) రామచంద్రుడు అధిదేవతగాగల షడక్షరమంత్రమును జపిస్తూ ప్రతిరోజు ఐదువేలసార్లు జాగ్రత్తగా ఆమంత్రరాజాన్ని జపిస్తూ (7) రఘునాధ నరోజలంలో స్నానంచేస్తూ భిక్షాహారాన్ని భుజిస్తూ నియత ఆహారపరుడై క్రోధమును జయించి, ఇంద్రియముల జయించి (8) సుతీక్షుడు చాలా కాలమున్నాడు. ఆ ముని ఎల్లప్పుడు హృదయంలో రాముని ధ్యానిస్తూ, భక్తి పూర్వకముగా సీతతో కూడిన రాముణ్ణి సంతుష్టిపరచాడు (9) సుతీక్షుని వచనము - జానకీనాథ ! నమస్పులు. హనుమత్ ప్రియ ! నీకు నమస్కారము (10) కౌశికముని యాగరక్షణలో దీక్షితుడ నమస్పులు నీకు కౌసల్యాతనయ, విశ్వామిత్రునకు ప్రేమ పాత్రుడనమస్కారము (11) శివుని ధనస్సు విరచినవాడ ! దేవతలతో సేవించబడినవాడ ! నీకు నమస్కారము. మారీచుని సంహరించినవాడ ! రాజశ్రేష్ఠ! తాటకను సంహరించినవాడ! (12) కబంధశత్రువ దశరథ కుమార ! ఓవిష్ణు ! నీకునమస్కారము. జామదగ్నిని జయించిన వాడ, ఖరుని సంహరించిన . వాడ నీకు నమస్కారము (13) కుగ్రీవనాథ ! వాలి సంహార! నీకు నమస్కారము. విభీషణుని భయమును హరించినవాడ! మలములహరించేవాడ నీకు నమస్కారము. (14) అహల్యా దుఃఖమును తొలగించినవాడ! భరతుని అగ్రజ ! నీకు నమస్కారము. సముద్రగర్వమును హరించిన వాడ! సేతువును నిర్మించినవాడ (15) తారక బ్రహ్మ లక్ష్మణాగ్రజ ! నీకు నమస్కారము. రాక్షసులను సంహరించిన, రావణుని మర్దించిన నీకు నమస్కారము (18) కోదండధారి ! అన్నిరకముల రక్షణ నిచ్చే వాడ నీకు నమస్కారము అని రాత్రింబగళ్ళు సుతీక్ష ముని రాముని స్తుతిస్తూ (17) రాముని యందే మనస్సును నిలిపి ఎప్పుడూ కాలాన్ని గడిపేవాడు. ఈ విధముగా షడక్షరమైన రామమంత్రాన్ని జపిస్తున్న అతనికి కాలంగడిచేది (18) ఈ స్తోత్రముతో రామచంద్రుణ్ణి స్తుతిస్తున్న, రఘునాధ తీర్థమందు ప్రతిరోజు స్నానం చేస్తున్న ఆతనికి (19) రామచంద్రునిపై నిర్మలమైన భక్తి నిశ్చలంగా కలిగింది.
ప్రత్యగాత్మయే (ఒకే)' లక్షణంగా గల అద్వైత విజ్ఞానము కళింది (20) చదవకుండానే వేద వరిజ్ఞానము వినకుండానే విషయ పరిజ్ఞానము, పరకాయ ప్రవేశసామర్థ్యము కల్గింది (21) ఆకాశగమనశక్తి, కళలయందు పాండిత్యము విననిశాస్త్ర విషయములందు గురువు లేకుండానే విశేషజ్ఞానము (22) ఎదురులేకుండా నర్వలోకములకు వెళ్ళే శక్తి, గడచిన విషయాన్ని (తెలుసుకునే) చూచే శక్తి, దేవతలతో సంభాషణము (23) పిపీలికా దిజంతువులు మాట్లాడుకునే మాటల జ్ఞానము కూడా కలిగాయి. త్రిమూర్తుల లోకములకు వెళ్ళగల శక్తి {24) వదునాలులోకములకు తన ఇచ్చవచ్చిన రీతి వెళ్ళగల శక్తి ఇవి, ఇంతేకాక ఇతరములైనవన్ని యోగులకు లభించేశక్తులన్నీ (25) రామతీర్థమును సేవించుటవలన నుతీక్షునకు లభించాయి. ఇంతటి ప్రభావము కలది ఆ తీర్ధము. మహా పాతకముల నశింపచేసేది (26) మహానదులను ఇచ్చేది. పుణ్యకరము. అవ మృత్యునాశక ము భుక్తి ముక్తులనిచ్చేది. నరక క్లేశనాశకము 927) రామభక్తి నిచ్చేది. సంసార ఉచ్చేదమునకు కారకమైనది. దీని తీరమందు శ్రీరాముడు మహాలింగమును స్థాపించి, లోకములను అనుగ్రహించే కొరకు ఆ లింగమును పూజించసాగాడు (28) మహాపుణ్యకరమైన రామతీర్థమందు స్నానంచేసి ఆ లింగాన్ని దర్శించటం వలన నరులకు ముక్తి కలుతుంది అని అంటే ఇంకా ఇతర ఐశ్వర్యాల గూర్చి చెప్పటమేందుకు (29) అక్కడ స్నానం చేసి శివుని చూచీ పూర్వము ధర్మరాజు అబద్ధం చెప్పటం వల్ల వచ్చిన దోషం నుండి ముకుడైనాడు ఆక్షణంలోనే (30) ఋషులిట్లనిరి - ఓ సూతపుత్ర! ధర్మజుడు ఏకారణం వల్ల అబద్ధం చెప్పాడు. ఆ దోషశాంతికొరకు అతీపావనమైన రామతీర్థంలో స్నానం చేశాడు 31) శ్రీ సూతులిట్లనిరి - మోనంగా ధర్మజుడు యుద్ధమందు అబద్ధం చెప్పిన విషయాన్ని రామతీర్థంలో అది నష్టమవటం ఋషులారా! మీకు చెబుతాను.
పాండవులైన ధర్మపుత్రాదులు ధృతరాష్ట్రపుత్రులు దుర్యోధనాదులు పరస్పరము (33) రాజ్యము కొరకు గొప్ప వైరాన్ని పొంది గొప్ప సేనతో కురుక్షేత్రమునకు వచ్చి (34) యుద్ధంలో వెనకడుగు వేయకుండా వీరులు యుద్ధం చేశారు. పదిరోజులు యుద్ధము చేసి భీష్ముడు పడిపోయాడు (35) తరువాతి ఐదురోజులు ధృష్టద్యుమ్నునితో వీరుడైన మహాబలపరాక్రమములు కల ద్రోణాచార్యుడు యుద్ధం చేశాడు. (36) మహాబలవంతుడైన ద్రోణాచార్యుడు అనేక అస్త్రశస్త్ర ములను వదిలి పాండవ సైన్యాన్ని ఏడించసాగాడు (37) బలవంతుడు, వీరుడైన ధృష్టద్యుమ్నుడు, దివ్యాస్త్రవేది, బాణవరముతో ద్రోణ సైన్యమును అనేక విధముల ఛేదించాడు (38) ద్రోణుడు శరవర్షముతో ధృష్టద్యుమ్నుని విసిరేసాడు. ద్రోణుని బాణవర్షంతో బాగా పీడింపబడ్డ అర్జునుని సేన కూడా అట్లాగే చెదిరిపోయింది. (39) పదిదిక్కులకు భయాక్రాంతులై పరుగెత్తారు. రధులలో శ్రేష్టుడైన అర్జునుడు రణరంగంలో ద్రోణునితో యుద్ధం చేశాడు (40) యుద్ధవిశారదులైన్ల అర్శన ద్రోణుల రణమును చూచుటకు వచ్చిన దేవతలతో ఆకాశము వ్యవధి లేకుండా పోయింది (41) ద్రోణార్జునుల యుధ్ధమునకు పోల్బతగినది ఈ భూమి పై లేదు. కోపముతో కూడిన గురుశిష్యులకు యుద్ధమైంది (42) ద్రోణార్జునుల యుద్ధము ద్రోణార్జున యుద్ధమే. ద్రోణుడు అర్జునుని పరాక్రమాన్ని మనసులో మెచ్చుకున్నాడు. (43) పిదప ద్రోణుడు వరాక్రమశాలి, ప్రియశిష్యుడుఐన అర్జునుని వదలి పాంచాలబలంతో యుద్ధం చేశాడు (44) ఒక లక్ష ఇరువది వేల ఏనుగులను గుణములను యుద్ధంలో ఇతరరాజులకు చెందిన వానిని ద్రోణాచార్యుడు చంపాడు (45) ధృష్టద్యుమ్నుడు కోపగించి బాణములలో ద్రోణుని కొట్టాడు. ద్రోణుడు వట్టిశమును గ్రహించి ధృష్టద్యుమ్నుని కొట్టాడు (46) అగ్నిశిఖలతో సమానమైన తీక్షములైన బాణములతో ఆతనిని యుద్ధంలో కొట్టాడు. శరాహతుడై ధృష్టద్యుమ్నుడు అక్కడ వరాజ్ ముఖుడైనాడు (47).
మూ ॥
రథం లేకుండా వచ్చిన ధృష్టద్యుమ్నుని భీముడు తన రథం పై కూర్చోబెట్టుకొని ద్రోణాచార్యునితో ఇట్లనెను.
బ్రాహ్మణాధములు అస్త్ర శిక్షను పొంది తమ జాతికర్మల యందు అనంతుష్టులై క్రూరులైయుద్ధంచేయనటైతే రాజులు యుద్ధంలో మరణించేవారు కాదు (49) బ్రాహ్మణులకు అహింసయే ఎల్లప్పుడూ ఉత్తమ ధర్మంగా చెప్పబడింది. వ్యాధులు మొదలగు జాతులవారు హింనతో భార్యాపుత్రులను రక్షిస్తున్నారు (50) ఒక్క కొడుకు కొరకు యుద్ధంలో నిలబడి అనేకమంది రాజులను హింసించావు. ఆనీకొడుకు యుద్ధభూమీయందు చంపబడి నిద్రిస్తున్నాడు. (51) అట్లాగైనా నీకు సిగ్గులేదు. దుఃఖం కూడా కలగటంలేదు. అనే భీముని మాటను యుధిష్ఠిరుని ద్వారా నిజమని తెలుసుకొని (52) తన ఆయుధమును ఆతడు విడిచాడు. రథంమీద పడిపోయాడు. యోగమెరిగిన వానిలా ద్రోణాచార్యుడు అప్పుడు ఉండిపోయాడు. (53) ఆ సమయాన్ని గమనించి ద్రోణుని ప్రక్కకు, ఖడ్గమును ధరించి శిరస్సును ఛేదించుటకు యుద్ధరంగంలో పరుగెత్తాడు (ధృష్టద్యుమ్నుడు) (54) అర్జునుడు మొదలగువారు వద్దని వారిస్తున్నా ఆతని తలను తెగ కోయుటకు ఉద్యమించాడు. యోగవిదుడైనందువల్ల ద్రోణుని శిరస్సునుండి ఒక జ్యోతి పైకి న్వర్గానికి వెళ్ళింది. (55) కృష్ణ అరున కృప ధర్మపుత్రాదులు యుద్ధంలో చూచారు. ప్రాణంపోయిన ద్రోణుని శరీరం నుండి శిరస్సును ఖండించాడు. (56) యుద్ధంలో భారద్వాజుడు (ద్రోణుడు) మరణించాక కౌరవులు భయంతో పరుగెత్తారు. పాండవులు ధృష్టద్యుమ్నాదులు ఆనందించారు. (57) వరుగెత్తుతున్న సేనను చూచి అశ్వత్థామదుర్యోధనునితో ఇట్లా అన్నాడు. ఆయుధములను వదలి ఈ సైన్యం ఎందుకు పరుగెత్తుతోంది అని (58) అప్పుడు, రాజైన దుర్యోధనుడు స్వయంగా చెప్పటం చాతకాక యుద్ధంలో ద్రోణుని వధను గూర్చి చెప్పుటకు కృపాచార్యుని ప్రేరేపించాడు. అశ్వత్థామకు కృపాచార్యుడు గురువు వధను గూర్చి ఇట్లా చెప్పాడు. (59) కృవునిమాట - అశ్వత్థామ ! నీ తండ్రి యుద్ధంలో శత్రువులను బ్రహ్మాస్త్రంతో చంపి నూర్లకొలది బలవంతులను యముని భవనానికి చేర్చాడు (60) కేశవుడు అణచటానికి వీల్లేని ఆతని పరాక్రమాన్ని చూచి, మాటలనేర్పరియైన ఆతడు పాండవులతో ఇట్లా అన్నాడు. (61) కేశవుని మాట-యుద్ధంలో దుర్జయుడైన ద్రోణుని జయించుటకు ఉపాయముంది ఓ పాండవులారా ! (62) ఓ ద్రోణ ! ఇప్పుడు యుద్ధంలో నీకొడుకు చంపబడ్డాడు ప్రామాణికుడైనవాడు, నత్యవాదియైనవాడు ఇట్లా చెపితే (63) అప్పుడు ఆయుధాన్ని క్షణంలో వదలి ద్రోణుడు యుద్ధం నుండి విరమిస్తాడు. అందువల్ల అబద్ధమైన ఈ వార్తను ధర్మరాజు ఇప్పుడు చెప్పాలి. (64) ద్రోణుడు యుద్ధవిశారదుడు. మరోరకంగా ఆతనిని జయించలేము. ధర్మం ద్వారా జయించలేని పక్షంలో ధర్మాన్ని వదలియైనా శత్రువును జయించాలి (65).
అనే కృష్ణుని వాక్యాన్ని వృథానుతుడైన భీముడు విని, నీ తండ్రి దగ్గరకు వచ్చి అబద్ధం మాట చెప్పాడు. (66) ఓ ద్రోణ! అశ్వత్థామచంపబడ్డాడు. ఇక్కడ యుద్ధంలో ఇవ్వడు పడి ఉన్నాడు, అని ఆ వాక్యాన్ని ద్రోణాచార్యుడు కూడా యథార్థమని తలచాడు (67) మళ్ళీ విశ్వాసం కలగనందువల్ల ధర్మరాజు దగ్గరకు వచ్చి ఇట్లా అన్నాడు. ఓ ధర్మరాజ! ఇప్పుడు నాకుమారుడైన అశ్వత్థామ యుద్ధంలో హతుడైనాడా (68) నీవు నత్యవాదివని నమ్ముతారు. నీవు ఇప్పుడు చెప్పు అని అనగా ధర్మరాజు అసత్యంవల్ల భయపడుతూ, శత్రువును జయించాలని ఉత్సాహపడుతూ (69) ఇప్పుడు ఏం చేయాలని నేను అని ఆందోళిత మనస్కుడైనాడు. ఆతడు భీముడు చంపిన అశ్వత్థామ అను ఏనుగును చూచి (70) ఈ రోజు మహాయుద్ధంలో భీముడు అశ్వత్థామను చంపాడు. అని ద్రోణునితో ధర్మపుత్రుడు వెవంతో వలికాడు. (71) దాన్ని విని నీ తండ్రి శస్త్రమును వదలి యుద్ధము నుండి మరలాడు. ఆ పిదవ ధర్మసుతుడు ఏనుగు అని కూడా అన్నాడు. (72) అప్పుడు నీ తండ్రి వదలిన శస్త్రాన్ని తిరిగి గ్రహించనని, బలవంతుడైనా, ప్రతిజ్ఞ చేశాడు (73) ప్రతిజ్ఞ భంగమౌతుందనే భయంతో శస్త్రము స్వీకరించలేదు. నీ తండ్రి అప్పుడు ధృష్టద్యుమ్నుని చూచి తన మృత్యువుగా (74) భావించి యోగ విదుడైన ఆతడు ప్రాయోపవేశంతో రథం పై ఉన్నాడు. ప్రాణములను నిర్బంధించి నమాధి యందుండి నిద్రించాడు. [75) మాటవెడలే మార్గం నుండి తలను ఛేదించుకొని క్షణంలో అతని ప్రాణాలు వెడలి పోయాయి. అప్పుడు, చనిపోయిన ద్రోణుని శిరస్సును (78) కేశములను చేత బట్టి యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు ఖడ్గంతో ఖండించాడు. సైనికులందరు పారుడు మొదలగు వారు చంపొద్దు అని అన్నారు. అందరు వారిస్తున్నా నీ తండ్రిని ప్రక్కనుండి చంపాడు (77) శ్రీ సూతులిట్లనిరి - తండ్రి చనిపోయారని విని అశ్వత్థామ చాలా సేపు ఏడ్చి (78) చాలా కోపంతో మండిపోతూ ఇట్లా మాట్లాడాడు. అబద్దమాడి, శస్త్రము వదలునట్లుగా వా తండ్రిని చేసిన (79) ఆ పార్శని, ఇతర పాండవులను, వెంట్రుకలను పట్టుకొని శస్త్ర ము వదలిన నా తండ్రి శిరమును మోనంతో ఖండించిన (80) ఆ పార్శతుని (వెన్నుపోటుదారు) నేను త్వరలో చంపేస్తాను. కృష్ణునితో సహా పాండవులందరు నా పరాక్రమాన్ని చూడండి (81) అని అశ్వత్థామ అక్కడ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు.
సూర్యుడు అస్తమించాక రాజులందరు (82) (వెళ్లారు) ద్రోణుడు చంపబడ్డాక రెండు వర్గముల రాజులు పట మంటపాన్ని ప్రవేశించారు. ఈరకముగా పదునెనిమిది రోజులు యుద్ధం జరిగి ముగివింది (83) శల్యుని, కర్ణుని, అట్లాగే ఇతరులైన దుర్యోధనాదులను ధార్తరాష్ట్రులను చంపి యుద్ధంలో, ధర్మరాజు (84) తనవారికి, ఇతరులకు చచ్చిన వారందరికి శాస్త్ర ప్రకారము, దౌమ్యాది ఋషులతో కూడి వరేత కర్మలు ఆచరించాడు (85) పాండవులందరు ఏకమై ధృతరాష్ట్రునకు నమస్కరించి, ధృతరాష్ట్రుని అను పొంది, చావగా మిగిలిన పెద్ద వారందరితో కలిపి (88) హస్తినాపురికి వచ్చి తమ మందిరములో ప్రవేశించారు. కొన్ని రోజులు గడిచాక వగర ప్రజలు (87) ధౌమ్యాదిమునులతో కూడి మహాత్ముడైన ధర్మజుని రాజ్యాలి షేకముచేయుటకు ఆరంభించారు. (88) ధర్మ రాజ్యాభిషేకము ఆరంభముగా ధర్మసందునితో ఆరీరవాణి ఇట్లా వలికింది (89) ఓ ధర్మపుత్ర ! మహానుభావ! శత్రువుల యందును దయగలవాడ! నీవు రాజ్యాభిషేకము చేసుకోవదు. రాజ్యపాలనకు నీవు అరుడవు కావు. (90) నెపంతో నత్యాన్ని చెప్పి ఆచార్యుని, శస్త్రము వదలిన వానిని సిగ్గులేకుండా ఓ రాజ! యుద్ధంలో చంపావు గదా (91) అందువల్ల ధర్మనందన ! నీకు పావబాహుళ్యము ఉంది. ఈ వనికి ప్రాయశ్చిత్తం చేను కోకుండా, రాజ్యపాలన కర్మలో నీకు (92) అర్హత లేదుకనుక అందువల్ల ప్రాయశ్చిత్తం ఆచరించు. ఇట్లా వలికి ఆ ఆశరీరవాణి విరమించింది.
పిదప రాజైన ధర్మసుతుడు ఆ మాటకు మిక్కిలి చలించిన వాడై విని నేను మూఢుణి, సాహసిని, క్రూరుఢ, లోభిని,లోభంచే మోపాతు (94) తుచ్చమైన రాజ్యాభిలాషతో ఇలాంటి పాపాన్ని చేశాను. ఈ పాప విశుద్ధి కొరకు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి (95) ఏం దానం చేయాలి. ఎక్కడికి వెళ్లాలి. అని దుఃఖాతులుడై ఆ ధర్మరాజుండగా (96) కృష్ణ ద్వైపాయనుడైన వ్యాసుడు ఆతని దగ్గరకు వచ్చాడు. ఎదురేగి, చేతులు జోడించి ఆ వ్యాసునకు నమస్కరించి (97) భక్తితో నిండిన మనస్సుతో అర్యాదులతో పూజించి, ఆకాశవాణి చెప్పినదంతా పూర్తిగా (98) దుఃఖితుడైన ధర్మరాజు వ్యాసునకు వినిపించాడు. ఆ మహాముని ధర్మరాజు మాటలనన్నింటిని విని, చాలా పేవు ధ్యానించి పిదప ఇట్లా చెప్పనారంభించాడు. (99) వ్యాసుని మాట - ఓ రాజా ! నీవు భయపడకు నీకు ఉపాయం చెప్తాను. ఈ పాప శాంతి కొరకు చెప్పిన దానిని విని నీవు ఆచరించు (100) యుధిష్టురుని మాట - దాని వలన నా పాపం నశించని. ఇప్పుడు దాన్ని తొందరగా చెప్పండి. (101) అవి అనగా వ్యాసోక్తి ఇట్లా - దక్షిణ సముద్రమందు సేతువు యందు గంధమాదన పర్వతమందు (102) ఓ రాజ ! రామ సేతువుయందు రామ తీర్థమని ప్రసిద్ధమైన, మహాపాతకముల నశింపచేసే పుణ్యసరస్సు ఉంది (103) దానివి దర్శించుకున్న మాత్రమున మహాపాతకములు కోటులు నశిస్తాయి. సూర్యోదయమందు చీకట్లు నశించినట్లు (104) స్వయంగా రాముడు నిర్మించిన రామ తీర్థమును దర్శించినంత మాత్రమున వెంటనే బ్రహ్మ హత్య యొక్క పాపం కూడా నశిస్తుంది. అనుమానంలేదు (105) ముక్తినిచ్చే ఆరామతీర్ఘమునకు వెళ్ళి ఓ రాజా స్నానం చేయి. నీకు పాపశుద్ధి జరుగుతుంది. రాజ్యరక్షార్హత కూడా వస్తుంది. (106) దాని తీరమందు గోభూమి తిల వస్త్రములను దానం చేయి. ఓ యుధిష్ఠిర ! నువర్ణరజతముల దానం కూడా చేయి. ఈ పాపముల నుండి శుద్ధి నీకు త్వరగా లభిస్తుంది.
శ్రీ నూతులిట్లనిరి: ఓ ద్విజోత్తములార! వ్యాసుడు ధర్మపుత్రునితో ఈ విధంగా చెప్పాక (108) వెంటనే ధౌమ్యునితో, తమ్ములతో కూడా కూడి, రాజ్యంలో సహ దేవుని ఉంచి ధర్మరాజు (109) వాహనం లేకుండ రామ సేతువు నుద్దేశించి బయలుదేరాడు. కొద్దిరోజుల్లోనే రామ సేతువుకుచేరాడు. (110) ధౌమ్యునితో కూడి ధర్మరాజు రామతీర్థము చేరి, శాస్త్ర ప్రకారము పురోహితుడు చెప్పిన విధంగా సంకల్పంచేసి (111) పావనాశకమై వుణ్యప్రదమైన రామతీర్థమందు స్నానం చేసి, ఆచమించి విశుద్దాత్మకల ధర్మజుడు క్షేత్ర పిండమును కూడా ఇచ్చి (112) వ్యాసుడు చెప్పిన విధముగా అన్ని దానములను ఇచ్చాడు. ఆహారం లేకుండా ఉంటూ వెలరోజులు ఆధర్మరాజు అక్కడ స్నానం చేశాడు. (113) ప్రతిరోజు విత్తలోభము లేకుండా దానం చేశాడు. ఒక నెల రోజులు గడిచాక తరువాత ఒక రోజు (114) తిరిగి అశరీర వాణి ధరాత్మజునితో ఇట్ల అంది. ఓ రాజ నీ పాపమంతా నశించి పోయింది. (115) వైవం వల్ల, అసత్యపుమాటవల్ల, ఆచార్యుని వధచే వచ్చిన పూర్వవునీ దోషము నశించి పోయింది (116) రాజ ! నీ నగరావికి పో, పోయి రాజ్యాన్ని పాలించు. నీకు రాజ్య రక్షార్హత ఉంది. నీవు అభిషిక్తుడవుకము (117) అని ఆ అశరీరవాణి పలికి విరమించింది. పిదప ధర్మాత్మజుడు సంతుష్టుడై ఆ దిక్కునకు వమస్కరించి (118) ఆ అశరీరవాణికి నమస్కరించి అనుజులతో కూడి, వంతు సమైన మనస్సుతో హస్తినాపురికి బయలుదేరాడు (119) రాజ్యమందు అభిషిక్తుడై భూమిని పరిపాలించసాగాడు. ఈ విధముగా ధరాత్మజుడు రామతీర్థంలో మునిగినందువల్ల (120) పాపములన్ని పోయి విశుద్దాతుడై రాజ్యరక్షణకు యోగ్యుడైనాడు. ఈ విధముగా రామతీర్థ వైభవమును గూర్చి మీకు చెప్పాను. (121) ఇది సర్వపాపములను హరించేది. పుణ్యప్రదమైనది. భక్తి ముక్తులను ఇచ్చేది. ఇక్కడ స్నానం చేయటంవల్ల ధర్మరాజు అసత్య దోషమునుండి ముక్తుడైనాడు. (122) ఓ బ్రాహ్మణులార! ఈ అధ్యాయము చదివినవారు, ఈ అధ్యాయము విన్నవారు పాతకరహితులై, ఇతరులకు లభ్యముకానీ కైలాసమునకు వెళ్లారు. పోయి పిదప తిరిగి జన్మను పొందరు (123) అని శ్రీ స్కాంద మహావురాణ మందు ఏడాశీత వహస్ర సంఖ్యగల సంహితయందు తృతీయ బ్రహ్మండమందు సేతు మాహాత్మ్య మందు రామతీర్థ ప్రశంసయందు ధర్మజుడు అసత్యం పలకటంవల్ల కల్గిన దోషశాంతిని వర్ణించేది పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
