స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

23వ అధ్యాయము

శ్రీ సూతులిట్లనిరి - నర్వపాతకముల నశింపచేసే అగ్నితీర్థమందు స్నానం చేసి విశుద్ధాత్ముడై పిదప చక్రతీర్థమునకు వెళ్ళాలి (1) చక్రతీర్థంలో ఏఏ కోరికలతో స్నానం చేస్తారో ఆయా కోరికలను పొందుతారు. (2) ప్రతినిష్టుడై వూర్వం అహిర్భుధ్యుడను మహర్షి గంధమాదనమందు సుదర్శనాన్ని ఉపాసించాడు (3) అక్కడ తపస్సు చేస్తున్నముని ని ఫూరరూపులైన రాక్షసులు, తపోవిఘ్నమే పనిగా గలవారై ఎప్పుడూ బాధించారు (4) భక్తరక్షణ, వాంఛతో సుదర్శనము అప్పుడు వచ్చి, బాధిస్తున్న రాక్షసులను అవలీలగా చంపింది (5) నాటి నుండి ఆ చక్రము భక్తుల ప్రార్థనతో అహిర్భుధ్న్యుడేర్పరచిన తీర్థంలో ఎప్పుడూ సన్నిధిలో ఉంటుంది (6) అప్పటినుండి ఆ తీర్థము చక్రతీర్థమని పిలువబడుతుంది. సుదర్శనము అనుగ్రహంవల్ల ఆతీర్థంలో స్నానం చేసిన యెడల (7) రక్షః పిశాచాదుల వల్ల కలిగే వడలేనే లేదు. ఈ పావన తీర్థమందు స్నానం చేసి పూర్వము సూర్యుడు చేతులు విరిగినవాడై ఈతీర్థ వైభవం వల్ల హిరణ్యమయపాణిని పొందాడు (8) ఋషులిట్లనిరి - ఓ సూతనందన ఆదిత్యుడు చిన్నపాటి ఎట్లైనాడు. ఎట్లా బంగారు చేతులను పొందాడు. దాన్ని చెప్పండి (9) శ్రీ సూతుని వచనము - ఇంద్రాది దేవతలు పూర్వము ఎప్పుడూ రాక్షసులతో పీడింవబడుతూ (10) ఏం చేయాలని అందరు కలిసి ఆలోచించారు. బృహస్పతిని ముందుంచుకుని దేవతలు చాలా సేపు ఆలోచించి (11) ఇంద్రుణ్ణి ముందుగా పెట్టుకొని బ్రహ్మస్థానమునకు వెళ్ళారు. వారు బ్రహ్మను చేరి, చూచి, భక్తితో స్తుతించి (12) ఎదపై తామెందు కొరకు వచ్చారో ఆతనికి నివేదించారు. దేవతల మాట - భగవాన్ ! బారతీనాథ ! బలవంతులైన రాక్షసులు మమ్ములను (13) ఎప్పుడూ బాధిస్తున్నారు. ఓ దేవ! దీనికి ప్రతి క్రియను చెప్పండి. అని దేవతలనగా బ్రహ్మదయతో వారితో ఇట్లన్నాడు (14) బ్రహ్మోత్రి - ఓ విబుధులార! మీరు భయపడకండి అందుకు ఉపా యాన్ని నేను చెబుతాను. మాహేశ్వరమను మహాయజ్ఞము అసుర, నాశకము (15) ఓ దేవతలార! తత్వదర్శులైన మునులతో కూడి మారు ఆరంభించండి. దీన్ని దేవతలందరు కలిసి విధిలోభం లేకుండా చేయాలి (16) మహేశ్వర మహాయజ్ఞాన్ని గంధమాదనంలో చేయండి. ఇతరచోట ఈ యజ్ఞాన్ని చేస్తే ఓ విబుధులార! (17) దురాత్ములైన నురద్విషులు అప్పుడు యజ్ఞవిన్నుము నాచరిస్తారు. ఈ యజ్ఞాన్ని గంధమాదన పర్వతమందు చేస్తే (18) సుదర్శనము అనుగ్రహంవల్ల అప్పుడు యజ్ఞవిఘ్నము కాదు. అహిర్భుధ్న్యుడను పేరుగల మహర్షి పై అనుగ్రహంతో గంధమాదనంలో (19) ఆ తీర్థంలో సుదర్శనము నన్నిధిలో ఉంటుంది. అందువల్ల మీరు ఆ యజ్ఞాన్ని గంధమాదనంలో చేయండి (20) చక్రతీర్థమునకు కొద్దిదూరంలో అనురనాశకమైన యజ్ఞం చేయండి (201/2).

పిదవ వారు బ్రహ్మవాక్కుతో గంధమాదనమునకు (21) త్వరగా బృహస్పతిని ముందుంచుకొని యజ్ఞం చేయాలనే కోరికతో వెళ్ళారు. వారు మహాత్ముడైన అహిర్భుధ్యుమునీశ్వరునికి నమస్కరించి (22) ఆ ఆశ్రమానికి కొద్ది దూరంలో యజ్ఞవాటికను ఏర్పరచారు. యజ్ఞకర్మ యందు నిష్ణాతులైన తపోధనులతో కూడి (23) దేవతలు అసురనాశకమైన ఇష్టిని ఆరంభించారు. ఆ కర్మలో హోత స్వయంగా బృహస్పతే (24) పాకశానని కొడుకైన జయంతుడు మైత్రావరుణు డయ్యాడు. వసువులలో అష్టమవనువు అచ్ఛావాతుడైనాడు (25) శక్తి పుత్రుడు పరాశరుడు గ్రావస్తు తుడైనాడు. అధ్వర్యుభారమును మహాతేజస్వియైన అష్టావక్రుడు వహించాడు (26) విశ్వామిత్ర మహాముని ప్రతివ్రస్థాతా ఐనాడు. వరుణుడవేషాధవేశ్వరుడు ఉన్నతఐనారు (27) సవిత, యజ్ఞము యొక్క నగము భారాన్ని వహిస్తూ బ్రహ్మవినాడు. బ్రాహ్మణోత్తముడు వసిషుడు బ్రాహ్మణాచ్చంపి ఐనాడు. (28) శునః శేపుడు ఆగ్నీధుడైనాడు. వాయువు ఉద్గాత ఐనాడు. వరేతరాట్కు (యముడు) ప్రస్తోతైవాడు (29) కుంభసంభవుడు అగస్త్యుడు ప్రతిహర్త ఐనాడు. గొప్పవాడైన విశ్వామిత్రాత్మజుడు, సుబ్రహ్మణ్యుడు మధుచ్ఛందుడైనాడు. (30) దేవరాజు ఇంద్రుడు స్వయంగా యజమాని ఐవాడు. వ్యాసపుత్రుడు, ముని శుకుడు ఉపద్రష్ట ఐనాడు (31) పిదప ఆ ఋత్విజులందరు దేవరాజైన ఇంద్రుని ఆ మాహేశ్వర క్రతువునందు శాస్త్ర ప్రకారము దీక్ష వహింపచేశారు (32) ఈవిధంగా గంధమాదనంలో మహాయజ్ఞం ఆరంభమైంది. దుఃనహమైన సుదర్శన ప్రభావంతో అతిగా పీడితులై (33) యజ్ఞం నడుస్తుండగా రాక్షసులు ఆ యజ్ఞంలో దోషాన్ని కనుగొనలేక పోయారు. ఈ విధంగా ఏ అంతరాయము లేకుండ మహా యజ్ఞము నడిచింది (34) హరియైన అగ్నిభక్షిస్తూ బాగా వెలిగాడు. తొట్రుపాటు లేకుండా శాస్త్ర ప్రకారము అధ్వర్యుడు కర్మలనాచరించాడు (35) మంత్ర వూతమైన పురోడాశమును అగ్నిలో హోమం చేశాడు. హోమం చేయగా మిగిలిన వురోడాశాన్ని అధ్వర్యుడు విభజించి ఆదరంతో (36) ఋత్విక్కులకు హోతృముఖ్యులకు పాపనాశకమైన, ధానీని ఇచ్చాడు.

బ్రహ్మఐన సవితకు మిక్కిలి ఉగ్రతేజస్సుగల ఒక భాగమును (37) ప్రాశిత్రమను పేరుగల దానిని పురోడాశభాగమును ఇచ్చాడు. సవిత అప్పుడు ప్రాశిత్రమును చేతులతో గ్రహించాడు (38) సవిత తాకగానే ఆ చేరరాని ప్రాశిత్రము అందరు ఋత్విజులు చూస్తుండగా ఆతని చేతులను ఛేదించింది (39) ఉగ్రతేజస్సుగల ప్రాశిత్రములో పోయిన చేతులు గల సవిత ఇదేమిటని భయపడి విషణ్ణ వదనుడైనాడు (40) సవితఋత్విజులందరిని పిలిచి ఇట్లా అన్నాడు. సవితోక్తి - ఇది ప్రాశిత్ర మను పేరుగల పురోడాశము నాభాగము ఇది (41) ఇవ్వగానే, మీరు చూస్తుండగానే నా చేతులను ఛేదించింది. అందువల్ల మీరంతా కలిసి, ఋత్విజులందరు (42) ఈ చేతులను తిరిగి కల్పించండి లేదా ఈ యజాన్ని నాశనం చేస్తాను. సవిత వాక్యాన్ని వారందరు విని ఆలోచించారు (43) ఆ మునీంద్రుల, అందరు దేవతల మధ్యలో మహా తేజస్సు గల అష్టావక్రుడను ఋత్విజుడు వారితో ఇట్లా అన్నాడు (44) అష్టావక్రునిమాట - ఓ ఋత్విజులార! నా మాటను శ్రద్ధగా వినండి. నేను బ్రతికుండగానే నూరుగురు విరించులు గడిచిపోయారు (45) చతురాననుల సమూహములు పుడున్నారు చనున్నారు. వాటన్నిటిని చూస్తూనే నేను ప్రాణములను ధరించాను (48) లోకేశ్వరుడనే పేరుగల ప్రజాపతి ఉండగా శ్యామలాపురముందు.. హరిహరుడను పేరుగల బ్రాహ్మణుడు నివసించేవారు (47) అరణ్యంలో ఉండే వ్యాధుడు ఆ టకొరకు (తమాష) లక్ష్యాన్ని ఛేదిస్తుండగా, లక్ష్యమునకు మధ్యగా వచ్చి బాణములతో పాదములు పోగొట్టుకున్నాడు (48) ఆతడు మునులతో ప్రేరేపింపబడి గంధమాదనమునకు వచ్చి ఈ ముని తీర్థంలో స్నానం చేసి పాదములను తిరిగి పొందాడు (49) అప్పుడు వుణ్యమైన ఈ తీర్థము మునితీర్థమని చెప్పబడింది. ఇప్పుడు చక్రతీర్థమను పేరు గలిగి చక్రనామము పొందింది. (50) ప్రాశిత్రము వల్ల చేతులు విరిగిన కవిత ఇక్కడ స్నానం చేయాలి. మీకిష్టమైతే మునితీర్థంలో సవిత కూడా చేయాలి.

అష్టావక్రమహర్షి ఋత్విజులతో ఇట్లా అన్నాక, అందరూ ఆనందపడి పవితతో ఇట్లా అన్నారు. (52) సవిత నీవు ఈ తీర్థంలో స్నానం చేయి. నీకు చేతులు వస్తాయి. అష్టావక్రుడు ఎట్లా చెప్పాడో అట్లా శ్రద్ధతో చేయి అన్నాక (53) పిదప మహాత్తరమైన చక్రతీర్థమునకు వవిత వెళ్ళి చేతులు రావటం కొరకు ఇష్టాలను తీర్చే దానిలో అతడు స్నానం చేశాడు (54) భక్తి పూర్వకముగా స్నానము చేసి లేచినంతలో బంగారు చేతులతో కూడినవాడై కనిపించాడు. (55) బంగారు చేతులు కల అతనిని చూచి ఋత్విజులందరు ఆనందించారు. ఆ యమును ఏమాప్తి చేసి దైత్య పంతుముల జయించి (58) ఇంద్రాది దేవతలు అందరు సుఖంగా స్వర్గానికి వెళ్ళారు. అందువల్ల ఈ తీర్థమునకు వచ్చి, నరులందరు (57) తమ తమ అభీష్టసిద్ధి కొరకు ప్రయత్న పూర్వకముగా దీనిని సేవించాలి. అంధులు, చప్పిడి చేయివారు, మూగవారు, చెవిటి వారు, గూనివారు (58) తుంటి వారు, చప్పిడి తాలువారు అంగహీనులైనవారు, అట్లాగే ఇతరులు విరిగిన తొలు చేతులవారు, తెగిన ఇతర అవయవముల వారు (59) మనుష్యులు అట్లాగే ఇతరులు వికలాంగపూర్తి కొరకు, వర్వాభీష్ట ప్రదాయకమైన దీవివి సేవించాలి (60) ఈ విధముగా మీకు చక్రతీర్థవైభవమును చెప్పాను. ఓ బ్రాహ్మణులారా! ఎక్కడైతే వూర్వం, విరిగిన చేతులను, స్నానం చేసి ప్రభాకరుడు పొందారో (61) ఈ అధ్యాయాన్ని చదివినవారి శ్రద్ధగా విన్నవారి విఠలాంగములు వూర్ణమౌతాయి. అనుమానం లేదు (62) మోకామియైన, నరునకు ముక్తిలభిస్తుంది. ఇందులో అనుమానములేదు, (63) ఆవి నిస్కాంద మహా పురాణమందు ఏ వహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మండ మందు సేతు మాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంసయందు ఆదిత్యునకు బంగారు చేతులు రావటమనునది ఇరువది మూడవ అధ్యాయము.