స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

9వ అధ్యాయము

 తా ॥ పిదవ ఆ బ్రాహ్మణుడు తెల్లవారు ఝామున వుత్ర శోకంతో పీడింపబడుతూ, అశోకదత్తునితో, భార్యతో కూడి, దుఃఖించనారంభించాడు ఏడుస్తున్న గోవిందస్వామిని చూచి, బ్రాహ్మణులారా ! ఎముద్రదత్తుడనే వ్యాపారి తన ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకొచ్చి ఓదార్చి ఆ వణిక్ శ్రేష్టుడు దయగలవాడై తన ధనానికంతకు రక్షకునిగా నియమించాడు  ఆ సన్యాసి మాటలను స్మరిస్తూ పుత్రుని దర్శనం యందు ఆసక్తి గలవాడై వుత్రుడు, భార్య వీరితో కూడి ఆ వ్యాపారి ఇంట్లో ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు ఆశోకదత్తుడనే ఆ బ్రాహ్మణుని రెండవకొడుకు శస్త్రమందు శాస్త్రములందును ఏనవంతుడయ్యాడు అట్లాగే ఇతర విద్యలందును అతనితో సమానమైనవాడు భూమి పైన లేడు. విద్యలను పొంది బ్రాహ్మణ కుమారుడు నగరంలో ప్రఖ్యాతుడైనాడు

 తా ॥ ఈ మధ్యకాలంలో ప్రతాపము కుటుడనే రాజు దగ్గరకు కాశీదేశాధివుడు బలవంతుడైన ఒక మల్లుడు వచ్చాడు ప్రతాపముకుటరోజు ఈ మల్లుని జయించే కొరకు బలవంతుడైన ద్విజపుత్రుని తన భటుల ద్వారా పిలిపించాడు వచ్చిన ఆతనిని చూచి ప్రతా వము కుటుడు ఇట్లన్నాడు. అశోకదత్త ! బలవంతుడైన జయించరాని ఈ మల్లుని  తొందరగా యుద్ధంలో చంపు నీవు బలవంతులలో శ్రేష్ఠుడవు కదా! దాక్షిణాత్య మహామల్లవతియైన ఈతణి నీవు జయిస్తే నీవేదికోరితే అదంలో ఇస్తాను. అనుమానించడు. అనే అతని మాటలను విని బలవంతుడైన బ్రాహ్మణ కుమారుడు  దాక్షిణాత్యమహామల్ల నృపతిని కొట్టాడు. బ్రాహ్మణకుమారునితో కొట్టబడి ఆశక్తి శాలి మల్లుడు వెంటనే కళ్ళు తేలేసి ప్రాణాలు పోయి భూమి పై పడ్డాడు. దేవతలు కూడా చేయలేని, బ్రాహ్మణకుమారుని ఆ పనిని ప్రతాపముకుటుడు చూచి ప్రసన్న హృదయుడైనాడు. బహుధనము గ్రామములు ఇచ్చి సమీప మందుంచు కున్నాడు ఆమహారాజు బ్రాహ్మణకుమారునితో కలిసి సంధ్యాకాలమందు గుర్రముమీద నిర్జన ప్రదేశంలో తిరుగసాగాడు బ్రాహ్మణ పుత్రుడు తోడుగా గల ఆరాజు అక్కడే దీనంగా పల్కుతున్న మాటలను విన్నాడు. రాజ! నేను చాలా చిన్న తప్పు చేశాను అది కూడా శత్రువుల ప్రేరణవల్ల ఒక్కసారే దయలేని నీదండపాలుడు. నన్ను శూలమందుంచాడు. ఇది నాలుగవ రోజు శూలమందే జీవించటం. దుష్కర్మచేసిన వారి ప్రాణాలు సుఖంగాపోవు. నాడు దప్పిక ఔతోంది బాగా. దానిని వారించు ఓ రాజా! అనే దీనమైన మాటలను విని రాజు బ్రాహ్మణ పుత్రునితో ధైర్యవంతుడైన అశోకదత్తునితో ఇట్లా అన్నాడు  నీరవరాధమై శూలమందున్న ఈ ప్రాణికి దప్పిగొన్న దానికి ఓ బ్రాహ్మణకుమార ! నీవు నీరివ్వాలి అని రాజుతో ఆదేశించబడి వెంటనే బ్రాహ్మణ కుమారుడు కలశమును నీళ్ళతో నింపి తేవటానికి తొందరగా వెళ్ళాడు. భూతవేతాళములతో నిండిన ఆశ్మశానమునకు వచ్చి శూలమందున్న అతనికి నీరు ఇవ్వాలని ఉత్సహించాడు నవయౌవనం గల స్త్రీని అక్కడ నిల్చున్నదాన్ని చూచాడు. కాంతి గల రతీదేవి మూర్తిలాగ ఉన్నదాన్ని బ్రాహ్మణుడు చూచాడు .

 తా ॥ ఆమెను చూచి ధైర్యముగల ద్విజకుమారుడు ఇట్లన్నాడు. ఓ ఉత్తమ ఫ్రీ ! నీవెవరు, శ్మశానంలో ఒంటరిగా ఉన్నావు ఈ శూలప్రోతము క్రింద నీవెందుతున్నాను - అని అతడనగా విని అందమైనముఖం గల ఆమె ఇట్లా అంది ఈ పురుషుడు నా భర్త. రాజు ఈతనిని శూలమందుంచాడు. లోభి డబ్బును వదలనట్లు ఈతడు ప్రాణాలను వదలటం లేదు చావు దగ్గరకు వచ్చిన ఈతనిని అనుకరించి వెళ్ళటానికి నేనిక్కడున్నాను దప్పిగొని నీరు అడుగుతున్నాడు. ఇది నన్ను బాధిస్తోంది మాటి మాటికి. శూలప్రోతం పై ఎత్తిన తలగల చావటానికి సిద్దంగా ఉన్న ప్రాణనాయకునకు క్రింద ఉన్న వేను నీరు త్రాగించటానికి అసమర్ధురాలను ఈ మాటలను అశోకదత్తుడువిని దయగలవాడై ఆ సమయానికి తగినట్లు అవధువుతో అతడిట్లా అన్నాడు ఆశోకదత్తుని వచనం - ఓ తల్లి ! నీవు నా భుజముల పైకి ఎక్కి ఈతనికి చల్లనినీరు త్రాగించు. ఆమె అట్లాగేనని అతనితో వలికి ఆయువతి తొందరగా శరీరం వంచిన ఆ పురుషుని భుజమును పాదములతో ఆరోపించింది. బ్రాహ్మణకుమారుడు కొత్తగా వడుతున్న రక్తాన్ని చూచాడు ఆతడు తొందరగా ముఖమెత్తి ఇదేమిటని చూచాడు. ఆమె దాన్ని తినటం చూచిన బ్రాహ్మణ కుమారుడు ఆశోకదత్తుడు నూవురంతో కూడిన ఆమె పాదాన్ని పట్టుకున్నాడు. రత్నంతో కట్టబడ్డనూపురమును వదలి ఆమె వెళ్ళి పోయింది అనేక రత్నములు గల ఆ నూపురమును తీసుకొని ఆశోకదతుడు ఆ శ్మశానం నుండి రాజు సమీపానికి వెళ్ళాడు స్మశానవృత్తాంతాన్నంతా ఆరాజుకు నివేదించాడు. చాలవిలువైన రత్నములు పొదగబడిన నూపురమును రాజుగారికిచ్చాడు ఇతర వీరులు చేయలేని ఆవీర చరితమును విని అతనికి రాజు మదనలేఖ అను పేరుగల తన కూతురునిచ్చాడు.

తా ॥ మహారాజు ఒకసారి ఆ దివ్యమైన నూపురాన్ని చూచి ఈ నూపురంతో సమానమైన మరో నూపురం ఎట్లా లభిస్తుంది. అని ఆలోచించాడు. ఆశోకదత్తుడు రాజుగారి కోరికను తెలుసుకొని మరో నూపురం లభించే కొరకు మనసులో ఆలోచించాడు. నేను పూర్వం శ్మశానంలో ఈనూపురాన్ని ఎవరి నుండి పొందావో ఆమెను మరోనూవురం లభించే కొరకు ఇప్పుడెక్కడ చూడను. ఇట్లా చాలా ఆలోచించి ఆ బుద్ధిమంతుడు ఒక నిశ్చయానికొచ్చాడు శ్మశానమునకు వెళ్ళి మహా మాంసాన్ని అమ్ముతాను. రాక్షసవేతాల పిశాచాదులందరిని మంత్రములతో ఆహ్వానిస్తుంటే ఆ రాక్షసి కూడా వస్తుంది. ఆ వచ్చిన ఆమెను బలవంతంగా వటుకొని ఆ నూపురాన్ని తీసుకుంటాను వేయిమంది రాక్షసులు కాని వదివేల మంది పిశాచులుకాని కోటిమంది వేతాలురుని బలవంతుడవైన నోరు లెక్కకాదు అని మనస్సులో నిశ్చయించుకొని తొందరగా శ్మశానానికి వెళ్ళాడు. మంత్రములతో రాక్షసుల నాహ్వానించి మహా మాంసాన్ని అమ్ముతూ దిక్కుల్లో విన్పించేటు తీసుకోండి అని గట్టిగా అరుస్తూ తిరిగాడు. మహామాంసము అమ్మబడుతోంది తీసుకోండి తీసుకోండి అని అక్కడ రాక్షస వేతాలురు, కంఠాలురు, పిశాచములు ఇతర భూతముల సమూహములు ఆనందతో వచ్చారు  ఇష్టమమైన మాంసమును మన మందరము తిందాము అని అందరు అక్కడికి రాగా రాక్షస కన్య కూడా వచ్చింది మాంసంభక్షించాలనే ఆసక్తితో ఆ రాక్షసి కూడా వచ్చింది. వెతుకుతున్న ఆ బ్రాహ్మణుడు ఆ రాక్షసిని చూచి ఈమెను ఇంతకు ముందు చూచాను అనే ప్రత్యభిజ్ఞను పొందాడు (జాపకం) ఆమెతో ఇట్లా అన్నాడు నాకు ఆ రెండో నూపురం ఇవ్వు అని ఆమె అతని మాటను విని సంతోషపడి ఇట్లా అంది. ఓ వీర శ్రేష్ఠ ! ఇంతకు ముందు నీవే నా నూవురాన్ని తీసుకెళ్ళాను. రత్నంతో అందమైన రెండోనూపురాన్ని కూడా తీసుకో అని అంటూ రెండో నూపురాన్ని తనకిష్టమైన తన కూతురును ఆ బ్రాహ్మణునకిచ్చింది విద్యుత్ కేశితో ఇవ్వబడ. విద్యుత్పభ అను పేరుగల ప్రేయసిని రూపయౌవనవంతురాలిని పొంది బ్రాహ్మణుడు ఆనందపడ్డాడు విద్యుత్ కేశి తన అల్లునకు బంగారు తామర పువ్వును కూడా ఇచ్చింది. విద్యుత్ ప్రభను, కాలి అందెను, హేమాబ్దమును పొంది ఆతడు అత్తకు పోయివస్తానని చెప్పి తొందరగా తిరిగి రాజు దగ్గరకు వచ్చాడు., ఎదవ వ్రతానము కుటుడు, రాజు నూవురం లభించటంవల్ల ఆనందవది  శౌర్యధైర్యములతో కూడిన బ్రాహ్మణ కుమారుని ప్రశంసించాడు.

తొ ॥ పిదప విప్రుడు ఏకాంతమున తన ప్రియురాలైన విద్యుత్ర్పభతో ఇట్లా అన్నారు.  మా అమ్మగారికి హేమాంబుజము ఎట్లా లభించింది. దీనితో సమానమైనవి మరిన్ని ఎక్కడ లభిస్తాయి అని అన్న బ్రాహ్మణునితో (భర్తతో) విద్యుత్ర్పభరహస్యంగా ఇట్లా అంది. కపోటవిస్ఫోటుడను వాడు వేతాలురకురాజు అతనికి బంగారుతామ రలుగల దివ్యమైన సరస్సు ఉంది. అత్తగారు జలక్రీడలాడుతూ దీన్ని తీసుకువచ్చింది అని వింటూనే ఆతడు నన్ను అక్కడికి తీసుకవెళ్ళు అనిఅన్నాడు. ఆమె వెంటనే ఆబ్రాహ్మణుని ఆకాంచన సరస్సులు తీసుకవెళ్ళింది ఆ బ్రాహ్మణ కుమారుడు ఆ బంగారు తామరలను తీసుకునేంతలోనేదానికి విన్నంగా వచ్చిన వేతాలురనందరిని ఆతడు చంపాడు. సైన్యమంతాచనిపోయిఉన్నకపాలవిస్పోటునివేతాలవతినిన్వయంగా వచ్చినవాణి చూచి, ఆతనిని చంపుటకు ప్రయత్నించాడు బ్రాహ్మణుడు. విజ్ఞాపనచేయటానికి ఉత్సాహంకలమహాతేజుడను పేరుకలవిద్యాధర వతిఇంతలోవచ్చి విమానంలోఉండి ఈతనితోఇట్లాఅన్నాడు ఓబ్రహ్మణ! అశోకదత్త! సాహనంచేయొద్దు. ఆమాటలు విని విమాన మందు నున్న వెలిగిపోతున్న, విద్యాధరపతినిఆకాశంలో ఈబ్రాహ్మణ కుమారుడుచూచోడు ఆతనినిచూచినంతలోనే బ్రాహ్మణ కుమారుడుశావము నుండిముక్తుడైనాడు.

తా ॥ మనుష్య రూపాన్ని వదలి దివ్యరూపాన్ని పొందాడు. విమానమధిరోహించిన దివ్యాభరణములతో అలంకరించబడిన శాపవిముక్తుడైన ఆనుకరునితో, చెప్పాలనే కుతుహలంకొద్ది ఇట్లా విద్యాధరపతి అన్నాడు. సుకర్ణ ! ఈతడునీ అన్న గాలవముని యొక్క శావంవల్ల వేతాలుడైనాడు, ఆ కన్యను ముట్టిన పాపి. ఆ పాపాన్ని అనుమతించినందువల్ల ఆతడు నిన్ను కూడా శపించాడు నీ అల్పపాపమునకైన శాపము నా దర్శనంతో పోతుంది. అని ఆ ఋషి అన్నాడు. ఆతనికి శాపాంతాన్ని కల్పించలేదు  రా ! శావం నుండి ముడ్డుడవైనావు సుకర్ణ! స్వర్గమారోహించు. అప్పుడు సుకరుడు విద్యాధర కులాధివునితో ఇట్లా అన్నాడు ఓ విద్యాధరపతి ! ఇప్పుడు నా పెద్ద అన్నయ్య లేకుండా అన్ని భోగములతో కూడిన స్వర్గానికి పోవటానికి నేను ఇష్టపడటంలేదు మా అన్నకు శాపాంతము వచ్చే విధము చెవు. అని అనగా మహాతేజుడు చెప్పాలనే ఉత్సాహంతో ఆతనితో ఇట్లా అన్నాడు నివారింపశక్యముకాని ఈ శావమును ఇతరులెవ్వరు నివారిస్తారు. ఐనా చాలా రహస్యమైన ఒక విషయాన్ని ఇప్పుడు నీకు చెప్పెదను  బ్రహ్మననకాది మునులకు ఇది వరలో చెప్పాడు. నర్వతీర్థములకు ఆశ్రయమైన పుణ్యప్రదమైన దక్షిణ సముద్రం ఒడున చక్ర తీర్ధ న మీవంలో గొప్ప తీర్థ ముంది. మహాపాతక సమూహములు కూడా దాన్ని దర్శిస్తూనే నశిస్తాయి ఆక్షణంలోనే, అని అంటే స్నానంవల్ల వచ్చే ఫలితాన్ని తెలుసుకోలేం. అక్కడికి వెళ్ళి మీ అన్న స్నానం చేసిన యెడల  గాలవశావంవల్ల వచ్చిన వేతాలత్వాన్ని తప్పకుండా వదిలి పెడతాడు. నుకరుడు ఆ మాటలు విని, వేలరూపుడైన అన్నతో తూడి దక్షిణ సముద్రతీరానికి తొందరగా వెళ్ళాడు .

తా ॥ చక్రతీర్థమునకు దక్షిణ భాగంలో గంధమాదనమునకు ఉత్తర భాగంలో ఉన్న  బ్రహ్మ ననకాదులకు చెప్పిన తీర్థమునకు వెళ్ళారు.ఆ తీర్థము ఒడ్డునకు చేరి అన్నతో ఇట్లనెను ఓ అన్న వూరమైన ఈ గాలవ శావనివృత్తి కొరకు ఈ తీర్థంలో తొందరగా స్నానం చేయి. ఇది నర్వతీర్థ ఉత్తమోత్తమము ఓ బ్రాహ్మణులారా ! ఆ సందర్భంలో ఆ తీర్థము యొక్క నీటి తుంబురులు గాలితో తీసుకురాబడి అతని అవయవాల పై వడ్డాయి ఆ నీటి తుంపురుల స్పర్శ వల్ల వేతాల రూపాన్ని వదలి, అదే వూర్వమనుష్య రూపాన్ని ద్విజపుత్రరూపాన్ని పొందాడు పిదప సంకల్పం చేసి త్వరగా ఆ ఉత్తమోత్తమ తీర్థంలో మనుష్యత్వనివృత్తి కొరకు ఆ బ్రాహ్మణకుమారుడు మునిగాడు అందులోంచి లేస్తూనే దివ్యరూపాన్ని పొందాడు. శ్రేష్టమైన విమాన మధిరోహించి దేవర్రీలతో చుట్టబడి అన్ని అభరణములతో కూడి అన్నయైన సుదర్శనుడు తమ్మునితో కూడి, ఆ తీర్థాన్ని పొగుడుతూ మాటిమాటికి ఆ తీర్థానికి నమస్కరిస్తూ విజ్ఞప్తి కౌతుకుని ముందుంచుకొని స్వర్గానికి వెళ్ళాడు. నాటి నుండి ఆ తీర్ధమునే తాల వరదమని పిలువబడుతోంది. నీటి తుంపురుల స్పర్శ మాత్రం వల్ల వేతాలత్వం నశింపచేసిన చక్రతీర్థమునకు దక్షిణంలో ఉన్న ఈ తీర్థమునకు వచ్చి ఎప్పుడైనా స్నానం చేసిన వారు జీవన్ముక్తులౌతారు. ఈతీర్థముతో సమంగా పుణ్యప్రదమైంది. ఇది వరలో లేదు. ముందు ఉండదు వరమైన వేతాల రూపాన్ని వదలి దివ్యత్వాన్ని పొందాడు కదా. ఇక్కడ సంకల్పంచేసి శుభమైన ఈ వేడాల వరదంలో స్నానం చేసి నియమంగా పితరులకు పిండదానం కూడా చేయాలి ఓ బ్రాహ్మణులారా! ఆ తీర్థ వైభవాన్ని ఈ రకంగా మీకు చెప్పాను. వేతాల వరదమనే పేరు ఎట్లా వచ్చిందో చెప్పాను ఎవరీ అధ్యాయాన్ని చదువుతారో, లేదా వింటారో వారు ములౌతారు అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్క సహస్త్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు వేలాల వరద తీర్థ ప్రశంసయందు నుదర్శన నుకర్ల శాపమోక్షణ మనునది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.