స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

43వ అధ్యాయము

శ్రీ నూతులిట్లనిరి - పిదవ ఇప్పుడు రామనాథుని వైభవాన్ని వర్ణిస్తాను. మానవుడు భూమి పై దానిని విని సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు (1) రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని ఒకసారి చూచిన నరుడు శివ సాయుజ్య రూపమైన ముక్తిని పొందుతాడు (2) కృతయుగంలో పది సంవత్సరములలో చేయబడే పుణ్యమును త్రేతాయుగంలో ఒక సంవత్సరంలో ఆ పుణ్యమును సరులు సాధిస్తారు (3) ద్వాపరంలో ఆ పుణ్యాన్ని మాసంలోను, కలియుగంలో ఒక రోజులోనే సాధిస్తారు. నిమిష నిమిషంలో నరులకు ఆ ఫలము కోటి గుణితమౌతుంది (4) రామనాథుని చూచిన వారికి ని స్సందేహంగా ఇట్లా ఔతుంది. రామేశ్వర మహాలింగంలో సకల తీర్ధములు (5) సర్వదేవతలు, మునులు, పితరులు ఉన్నారు. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు లేదా ఎల్లప్పుడూ (6) ముక్తినిచ్చే రామనాథ మహాదేవుని స్మరించిన వారు లేదా కీర్తించిన వారు, ఆ బ్రాహ్మణులు పావ పంజరం నుండి ముక్తులౌతారు (7) నచ్చిదానందుడు అద్వైత స్వరూపుడు ఐన సాంబశివుని రుద్రుని చేరుతారు. రామేశ్వరుడను పేరు గల లింగాన్ని రామచంద్రుడు పూజించిన దాన్ని (8) స్మరించిన మాత్రం చేత యమపీడ కూడా కలుగదు. రామేశ్వర మహాలింగమును ఒకసారి అర్చించిన నరులు (9) మనుష్యులు కారు, పైగా రుద్రులు అనుమానంలేదు. రామేశ్వర మహాలింగమును భక్తితో అర్చించని నరుడు (10) చాలా కాలము దు:ఖ సంకులమైన సంసారంలో తిరుగుతాడు. రామేశ్వర మహాలింగాన్ని ఒక్కసారి చూచిన నరులకు (11) దానములతో, తపస్సులతో, అధ్వర్యములతో పనిలేదు. రామేశ్వర మహాలింగాన్ని క్షణకాలమైనా చింతించని నరుడు (12) అజ్ఞాని, పాపి, మూగవాడు, బధిరుడు. జడుడు, అంధుడు, అని గుర్తించాలి. ఆతనికి ఎల్లప్పుడూ ఆపదలే కలుతుంటాయి. (13) ఆతని ధనక్షేత్ర సంతానాదులకు అదే విధంగా హాని కలుతుంది. ఓ మునీశ్వరులార ! రామేశ్వర మహాలింగమును ఒకసారి చూశాక (14) కాశి, గయ, ప్రయాగలతో పనిలేదు. భూమి పై దుర్లభమైన మానుషరూపాన్ని పొందిన నరులు (15) రామనాథ మహాలింగాన్ని నమస్కరించి పూజించాలి. వారిజన్మ సఫలము. వారు కృతార్థులైనవారు. ఇతరులు కాదు. (16)

రామేశ్వర మహాలింగాన్ని పూజించాక, లేదా స్మరించాక విష్ణువుతో బ్రహ్మతో లేదా ఇంద్రునితో, మిగిలిన దేవతలతోనూ పనిలేదు (అవసరంలేదు). (17) నరులు భక్తి యుక్తులై రామనాథ మహాలింగాన్ని పూజించిన, లేదా అట్టి వారిని నమస్కరిస్తూ, పూజిస్తూ ఉన్నవారైనా (18) అట నరులు దు:ఖములు చూడరు. యమాలయమునకు వారు వెళ్ళరు. సహస్ర ముల కొలది బ్రహ్మహత్యలు, పదివేల సురాపానములు వీని పావములు (19) రామేశ్వర దేవుని చూచాక సంపూర్తిగా నశిస్తాయి. స్వర్గంలో భోగమును రాజ్యమును ఎల్లప్పుడూ కోరేవారు (20) రామేశ్వరలింగాన్ని ఒక్కసారి ఆనందంతో వారు నమస్కరించని, జన్మ కోటులలో చేసిన ఏ పావములైనా (21) రామేశ్వరుని చూడగానే ఎప్పటికీ అవన్నీ నశిస్తాయి. సహవానం వల్ల, కౌతూహలం వల్ల, లోభంవల్ల లేదా భయంవల్ల కాని రామేశ్వర లింగాన్ని స్మరించిన వారు (22) ఇక్కడ పై లోకంలోనూ దుఃఖమును పొందరు. రామేశ్వర మహాలింగాన్ని కీర్తిను, పూజిస్తూకాని (23) ఉన్నచో తప్పకుండా రుద్రసారూప్యాన్ని పొందుతారు. ఇందులో అనుమానంలేదు. మండుతున్న అగ్ని కట్టేలను క్షణంలో కాల్చినట్లు (24) ఆటాగే పాపములన్ని రామేశ్వరుని చూడటం వలన పోతాయి. రామేశ్వర మహాలింగళs ఎనిమిది రకములు (25) ఆతని భక్తజనుల యందు ప్రేమ చూపుట, ఆతని పూజించిన ఆనందపడుట, స్వయముగా తాను భక్తితో పూజించుట, ఈ శరీరంతో చేసే ప్రతి పని ఆతని కొరకే అని భావించుట (26) ఆతని మాహాత్మ్య కథలను వినటంలో ఆదరము చూపుట, స్వరమందు నేత్రములందు శరీరమందు అందుకు తగిన మార్పులు కలుట (27) ఎల్లప్పుడు రామేశ్వర మహా లింగ న్మరణము చేయుట, రామేశ్వర మహాలింగము నాశ్రయించి బ్రతుకుట (28) ఈ విధముగా ఎనిమిది విధములైన భక్తి కలిగినవాడు ఎంతటి పాపాత్ముడైనా ఆతడు ముక్తి క్షేత్రములకు భాగస్వామి అని చెప్పబడతాడు (29) అనన్య భక్తితో, బ్రహ్మ జ్ఞానముతో ముక్తి నిశ్చయము. యతులకు మునులకు వేదాంత శాస్త్ర శ్రవణము వలన ముక్తి (30) కాని అట్టి ముక్తి జ్ఞాన దర్శనశ్రవణములు లేకుండానే ఇక్కడ లభిస్తుంది. ఆశ్రమ నియమం లేకున్నా, విరక్తి భావం కలుగకున్నా (31) అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి, కేవలం రామేశ్వర మహా లింగ దర్శనం వల్లనే (32) ఆలస్యం లేకుండా పునర్జన్మ లేని ముక్తి కలుతుంది. కృమి కీటములు దేవతలు మునులు తపోధనులు (33) అంతా రామనాథుని ప్రసాదం వల్ల రామేశ్వర క్షేత్రంలో సమానులే.

నేను చాలా పాపం చేశాను అని భయపడకండి (34) జనులార ! నేను పుణ్యం చేస్తాను అని గర్వపడవదు. రామేశ్వర మహాలింగమైన సాంబరుద్రుణ్ణి చూశాక (35) తక్కువవారు ఎక్కువ వారు అని లేదు. అందరు జనులు నమానమే. భక్తి పూర్వకముగా రామేశ్వర మహాలింగమును చూచిన వారు (36) వారితో భూమి పై వాలుగు వేదముల నేరిగిన వాడు కూడా నమానంకాడు. రామేశ్వర మహాలింగమందు శ్వవ చుడైన భక్తునకు కూడా (37) దానములనివ్వాలి. త్రయోవిదుడైన వానికి ఇతరున కు ఇవ్వవదు. యోగయుక్తులైన ఊర్థ్వరేతస్కులైన మునులకు లభించే స్థానమే (38) రామేశ్వరుని చూచిన నర్వప్రాణులకు లభిస్తుంది. రామనాథ శివక్షేత్ర మందుండే నరులు బ్రాహ్మణులు (39) అందరు పంచ వడ్రులు, చంద్ర చూడులు నాగాభరణములు కలవారు, వృనభ ధ్వజులు (40) త్రినేత్రులు, శరీరం నిండా భన్మము గలవారు, కపాలాకృతిని శిరమందు గలవారు, సాక్షాత్తు సాంబమూర్తులు మహా దేవులు ఔతారు. ఇందులో అనుమానం లేదు (41) ఆనందంతో రామనాథ శివక్షేత్రమునకు వెళ్ళిన నరులు అడుగడుగున అశ్వమేథ పుణ్యఫలమును పొందుతారు. (42) రామ సేతువు నాశ్రయించి, సోమనాథుని సంతుష్టికొరకు భక్తితో బ్రాహ్మణునకు ఒక గ్రామమును దానము చేసిన (43) వారు శైలములు వన కాననములతో కూడిన నమస్త భూమిని దానం చేసిన వారౌతారు. రామనాథునకు వత్ర వే, పుష్పమో, ఫలమో, జలవే (44) భక్తి తో దానం చేసిన నరుని రామనాథుడు రాత్రింబగళ్ళు రక్షిస్తాడు. రామనాథ మహాలింగమందు, సాంబుని యందు, కారుణికుడైన శివుని యందు (45) భక్తి గలుట అత్యంత దుర్లభము. ఆతని పూజ కూడా అతి దుర్లభము. ఆతని స్తోత్రము దుర్లభము. స్మరణ కూడా అతి దుర్లభము. (46) రామనాథేశ్వరుని, లింగమును మహాదేవుని త్రిలోచనుని భక్తితో కూడిన మనస్సులో శరణు పొందినవారికి (47) లాభము, వారికి జయము ఈ లోకమందు పరలోకంలో కూడా రామనాథ మహాలింగ విషయకమైన బుద్ధి (48) రాత్రింబగళ్ళు కలిగిన నరుడు ఈ భూమి పై ధన్యతరుడు. రామనాధేశ్వరుడైన లింగమును శివుని పూజించని నరుడు (49) భుక్తి ముక్తిక రాజ్యారుడు కాడు. భక్తితో రామేశ్వర మహాలింగమును పూజించిన నరుడు (50) భుక్తికి ముక్తికి రాజ్యమునకు తగినవాడు. రామనాధార్చనతో సమానమైన, అధికమైన పుణ్యము. మరొకటి లేదు (51).

మోహమందున్నవాడై రామనాధేశ్వరుడైన లింగమును ద్వేషించిన నరుడు నరక కారణమైన పదివేల బ్రహ్మహత్యలను ఆతడు ఆచరించినట్లు ఔతుంది. (52) అట్టివానితో మాట్లాడినంత మాత్రం చేత మానవుడు నరకానికి వెళుతాడు. దేవతలందరు రామనాధుని వరమైన వారే. యజ్ఞములన్ని రామనాధుని వరమైనవే (53) అన్ని రామనాధుని వరమైనవే (చెందినవే). అతనికన్న వేరైనది మరొకటి లేదు. అందువల్ల అన్నింటిని వదలి రామనాధుని ఆశ్రయించాలి. (54) రామనాథ మహాలింగాన్ని శరణువేడిన నరునకు దుర్మతి కలుగదు. శివలోకానికి వెళ్తాడు. (55) పర్వయజ్జు తపోదాన, తీర్థస్నానముల వల్ల కలిగే ఫలముకన్న కోటిరెట్లు అధిక సలం రామనాధుని సేవవల్ల కలుగుతుంది. (58) రామనాథేశ్వరలింగాన్ని రెండు ముడియల కాలము చింతించిన నరుడు ఇరువది యొక్క కులములను ఉద్ధరించి శివలోకమందు వెలుగొందుతాడు (57) రామనాథుడైన మహేశ్వరుని ఒక రోజంతా చూచిన నరుడు ఇక్కడే ధనవంతుడై చివర రుద్రుడౌతాడు. (58) రామనాథుడైన మహేశ్వరుని ప్రొదున్నే లేచి స్మరించిన నరుడు ఈ శరీరంతోనే భూమి పై శివుడై సంచరిస్తాడు. (59) రామనాథ మహాలింగాన్ని చూచే వ్యక్తిని చూచినంత మాత్రం చేత ఇతరప్రాణుల పాపము ఆ క్షణంలోనే నశిస్తుంది (60) రామనాధేశ్వర లింగాన్ని మధ్యాహ్న కాలంలో చూచిన నరుని సురాపాన సహస్ర దోషములు ఆ క్షణంలోనే నశిస్తాయి. (61) సాయంకాలమందు భక్తితో రామనాధుని చూచిన నరుని యొక్క గురుస్తీ గమనం వల్ల వచ్చిన పాతకము నశిస్తుంది (62) సాయంకాలమందు మహాస్తోత్రములతో రామేశ్వరుని స్తుతించిన నరుని యొక్క స్వర్ణ సేయ సహస్ర పాపములు ఆ క్షణంలోనే నశిస్తాయి (63) ధనుష్కోటి యందు స్నానము రామనాథుని దర్శనము, ఇవి పురుషులకు లభిస్తే గంగా జల సేవనముతో వవేమి (64) రామనాథ మహాలింగము సేవతో లభించనిది ఇతరమైన ధర్మకార్యములతో ఎప్పుడూ లభించదు (65) రామనాథ మహాలింగాన్ని ఎప్పుడూ చూడని నరుని సంకరుడని గ్రహించాలి. తండ్రి బీజంతో పుట్టనివానిగా గ్రహించాలి (66) ప్రొద్దున్నే లేచి రామవాథ అను శబ్దాన్ని మూడుసార్లు ఉచ్చరించిన నరుని పూర్వదినము పాతకము క్షణంలో నశిస్తుంది (67) భక్త రక్షణ దీక్షితుడై రామవాథ మహాలింగముండగా ఇతరులను ప్రార్థించుట భోజనముండగా తిండికై ప్రయాన వటు (68) కరుణానిధియైన రామనాథ మహా లింగము ప్రసన్నమైన, సకల క్లేశములు నశిస్తాయి, సూర్యోదయంతో మంచు పోయినట్టు (69).

ప్రాణం పోయే సమయంలో రామనాథుని స్మరించిన నరుడు తిరిగి జన్మ నొందడు. శంకరత్వాన్ని పొందుతాడు. (70) ఓ రామనాధ! మహాదేవ ! ఓ కరుణానిధి ! నన్ను రక్షించు అని ఎల్లప్పుడూ వలిడే నరుడు కలితో బాధింపబడడు (71) రామనాధ ! జగన్నాధ! ధూర్జటి! నీలలోహిత ! అని ఎల్లప్పుడూ పలికే నరుడు మాయతో బాధింపబడడు (72) నీలకంఠ, మహాదేవ, రామేశ్వర, నదాశివ అని ఎల్లప్పుడూ పలుకుతూ ఉండే నరుడు కామంతో బాధింపబడడు (73) రామేశ్వర, యమారాతి, కాలకూట విషభక్షక, అని ఎల్లప్పుడూ పలికే నరుడు క్రోధంతో పీడింపబడడు (74) రామనాధాలయాన్ని కట్టెలతో నిర్మించే నరుడు త్రికోటి తులములతో కూడిన వాడై స్వర్గాన్ని పొందుతాడు (75) ఇటుకలతో నిర్మించిన నరుడు వైకుంఠము పొందుతాడు. రాతితో నిర్మించిన నరుడు బ్రహ్మ స్థానాన్ని చేరుతాడు (76) రామనాథుని ఆలయాన్ని స్పటికాదశిలా భేధములతో నిర్మించిన నరుడు శ్రేష్ఠమైన విమానము నధిరోహించి శివలోకమును పొందుతాడు (77) భక్తి పూర్వకముగా రామనాధాలయమును రాగితో నిర్మించిన నరుడు శివుని అర్జాననమందు ఉన్నవాడై శివసామీప్యమునకు చేరుతాడు (78) రామేశ్వరాలయమును ఆనందంతో, వెండితో నిర్మించిన నరుడు శివరూప్యమును పొంది ఎల్లప్పుడూ శివునివలె ఆనందిస్తాడు. (79) భక్తితో రామనాథాలయమును బంగారముతో నిర్మించిన నరుడు శివసాయుజ్య రూపమైన ముక్తిని పొందుతాడు (80) ధనాఢ్యుడైన నరుడు రామనాధాలయాన్ని బంగారంతో చేసినా, దరిద్రుడు మట్టితో చేసినా వారిద్దరికి పుణ్యము నమమని చెప్పబడింది (81) ఓ బ్రాహ్మణులార ! రామనాధ మహాలింగ స్నాన కాలమందు మూడు కొలములందు గేయ నృత్తములు, ముఖవాద్యములు, కాలము (82) ఇతర వాద్యములు భక్తితో ఉపయోగించిన నరుడు మహా పాతకముల నుండి ముక్తుడై రుద్రలోక మందు వెలుగుతాడు (83) శూలియైన రామనాధుని అభి షేక సమయమందు, రుద్రాధ్యాయమును చమకములను, పురుష సూక్తమును (84) అనువర్ణ మును, పంచశాంతిని, పవమానాది నూక్తములను, ప్రీతియుతుడై జపించిన నరుడు నరకమును పొందడు (85) ఆవుపాలతో పెరుగుతో వంచగవ్యముతో, నేయితో, రామనాథ మహాలింగానికి స్నానం చేయిస్తే నరకం నాశనమౌతుంది (86) రామనాథ మహాలింగాన్ని నేయితో స్నానం చేయించినచో నరుడు ఒక కలకాలము నందలి జన్మల్లో పొందిన పాపమును ఆ క్షణంలోనే పోగొట్టుకుంటాడు (87) రామనాథ మహాలింగాన్ని ఆవుపాలతో స్నానం చేయించిన నరుడు ఇరువది యొక్క కులములనుధరించి శివలోకంలో వెలుగుతాడు (88) రామనాధ మహాలింగాన్ని పెరుగుతో స్నానం చేయించిన నరుడు నర్వపాపముల నుండి ముక్తుడై విష్ణు లోకమందు గొప్పవాడౌతాడు (89).

రామేశ్వరశివునకునువ్వులనూనెతోఅభ్యంగస్నానముఒక్కసారిభక్తితోచేయించిననరుడుబేరగృహంలోఉంటాడు.(90)రామనాథమహాలింగమునకుచెరకురనముతోఒక్కసారైనాభర్తతోస్నానంచేయించిననరుడుచంద్రలోకంనుపొందుతాడు. (91) గజనిమ్మ మామిడిపండ్ల సారముతోరామనాథమవలింగమున తుస్నానంచేయించిన నరుడు, పితృలోకంపొందుతాడు. (92) రామనాథ మ పేశ్వరున కుబ్బరినీళ్ళతోస్నానం చేయించిననరుని బ్రహ్మహత్యాదీపావ ములునాశనమౌతాయని అన్నారు. (93) రామనాథమహాలింగమునుఅరటిపండ్లతోమర్థించిన, నరుని సకలపాపములు నశిస్తాయి. వాయులోకంలో ముఖ్యుడౌతాడు. (94) వస్రవూతమైననీటితోరామనాథమ హేశ్వరున తుస్నానంచేయించిననరుడు వరుణలోకమును పొందుతాడు (95) రామనాథమ హేశ్వరుని చందనపునీటతోస్నానంచేయించిననరుడుగాంథర్వలోకాన్ని పొందుతాడు. (96) పూలవాననతోకుడిననీటితో బంగారముతో కూడిన నీటితోపద్మమువాసనతో కుడిననీటితోరామేశ్వరు న తుస్నానంచేయిస్తే (97) మ హేంద్రవనమును అధిరోహించి అతనితో కూడి ఆనందిస్తాడు. పాటలము, కలువ, సౌగంధిక, పున్నాగ, కరవీరముల (98) వాసనతోనిండిననీటితో రామేశ్వర మహేశ్వరుని అభిషేకించిన పొరుమహాపాతకములనుండి విముక్తులౌతారు. (99) ఇతరములైన గొప్పవైనవాననగల పుష్పములువాని వాసనతో నిండి ననీటితో దయనిధియగు (100) రామేశ్వరమహాలింగమును అభిషేకించిననరుడుశివలోకంలో గొప్ప పొడౌతాడు. ఇలాచి, కర్పూరము, నీటి వట్టివేరు వీటివాసనతో కూడినపరిశుద్ధమైననీటితో (101) విశుధమైన బుద్ధిగలవాడైరామేశ్వర మహాలింగమును అభిషేకించిననరుడు ఆగ్నేయంలోకమును పొందిఅన్నికోరికలను పొందుతాడు. (102) రామనాథుని అభిషేకం కొరకు మట కుండను ఇచ్చిన నరుడు ఈలోకంలోనూరేళ్ళు బ్రతికిసర్వకామన మృదడౌతాడు.(103) రాగిపాత్రనిచ్చినచోదేవేంద్రత్వమును పొందుతాడు. వెండి కుండ నిచ్చినచో బ్రహ్మలోక మునుపొందుతాడు. (104) బంగారుపాత్రనిచ్చిన శివలోకంలో శైషుడౌతాడు. రత్నకుంభమును ఇచ్చినచో శివసామీప్యమును పొందుతాడు (105) ఓబ్రాహ్మణులారా ! రామనాధునిఅభి షేకంకొరకు వైవేద్యంకొరకు, పాలిచ్చేఆవునిచ్చిననరుడు అశ్వమేధఫలాన్నిపొందుతారు (106) శివవేషమునుపొందిదేహాంతమందుశివ లోకమును పొందుతాడు. రామ సేతువుయందుధనుష్కోటి యందురామనాథఅనిపలుకుతూ (107) ఎక్కడైనా స్నానమాచరించిన నరుడు సేతుస్నానఫలాన్ని పొందుతాడు.

రామనాధశివాలయమునునున్ననుపూతతో అలంకరించిననరుని (108) మణ్యము నుచెవుట కు నూరునంవత్స రాలకైనానే నుశక్తుణ్ణి కాను. రామనాథశివాలయమును కొత్తగా చేసిన పునరుద్ధరణ) నరుని (109) పుణ్యవలము సాధారణ వలముకన్ననూరురెట్లు అధికంఅనిగ్రహించాలి. చిన్నమైన భిన్నమైనరామనాధశివాలయాన్ని (110) భక్తితోమంచిగా చేసిన నరుని వడివేల బ్రహ్మహత్యలుదహించు తుపోతాయి. రామనాధుని ఎదురుగా నంతోషంతో దీపం పెట్టి ననరుని (111) అవిద్యా నమూహమునశించిఆతడుసనాతనబ్రహ్మవదాన్నిచేరుతాడు. నేయి, నూనె, శనగలు, శర్కర, తండులము, బెల్లము (112) వీటిని రామనాధునకిచ్చిన నరుడు దేవేంద్రవదాన్నిపొందుతాడు. రామనాధమహాలింగమునుచూడటం, పూజించటం, స్మరించటం, (113) లొకటంవీటి వల్ల ఆక్షణంలోనే పాపాలన్నీపోతాయి. రామనాధున తుమహావుంటను, దర్పణమును ఇచ్చిన నరుడు (114) విమాన (ఆకాశరథం లేదా, రాజభవనం) శతములలోనుఖినూ చాలాకాలము శివపురంలోవసిస్తాడు. భేరి, మృదంగ, (తప్పెట) వటహ (యుద్ధవాద్యం) నిఃసాణములు (చర్మవాద్యం) మురజ (మృదంగం) మొదలగు వాద్యములు (115) వేణువు, కంచుమొదలగువానితో చేసిన వాద్యములను (వాదిత్రం = 4రకాలు తతము = వీణ, ఆనద్దము = మద్దెల )= సుషిరము = వేణువు, మనము = తాళవాద్యము) అట్లాగే ఇతర వాద్యములను మహాదేవుడైన రామనాధునకు భక్తితో ఇచ్చిననరుడు (116) విమానములతో, మహాభోగములతోవాద్య వకోషముతోకూడి, అనేకయుగముల పర్యంతరము శివలోకమందు ముఖ్యుడౌతాడు. (117) రామనాధునిఉద్దేశించి ఆదరంతో ఇచ్చింది. కొంచమైనా అది దాతకు పరలోకంలో అనంతఫలమౌతుందినిశ్చయము (118) రామేశ్వర మహాక్షేత్రమందు రామనాధునిసన్నిధిలో నివసించిన వారు పునరావృత్తిలేని ముక్తిని పొందుతారు. (119) ఆయున్చుత్వరగా పోతుంది. యవ్వనముత్వరగాపోతుంది. నంపదలుత్వరగాపోతాయి. అట్లాగే దారపుత్రాదులు పోతారు (120) రాజులు మొదలగు వారితో ధనము బాధింపబడుతుంది గృహము పొలాలు మొదలగునవి అట్లాగే గృహోపకరణాదులు, అన్ని క్షణికము ఓ బ్రాహ్మణులార! (121) అందువలన సంసారాన్ని అతి ప్రేమతోచూడటంవదలినరులావ న్నుల ఆర్తి నివారించే రామేశ్వరమహాలింగాన్ని సేవించండి. (122) బుద్ధిమంతుడు ఆతనినిగూర్బివినాలి, కీర్తించాలి, న్మరించాలి. రామేశ్వర దేవున కు గ్రామములనిచ్చిన నరుడు (123) ఆరంభించిన దేహం ముగియగావే శివుడే ఔతాడు. దానయెగ్యులలోఉత్తమదానయోగ్యుడు రా వునా మహేశ్వరుడు (124) ఆతనికి ఇచ్చినన త్యవెన అనంతవెన ముఖాన్ని పొందుతారు. రామనాథ మహాలింగాన్ని దర్శించే వరకే పాతక ములు (125) ఆతనికికొంచమిచ్చిననరుడు సార్వభౌముడౌతాడు నిశ్చయము. విననకర్ర, ఛత్రము, చందనము, గుగ్గిలము (126) అట్లాగేరాగి, కంచుమొదలగుపాత్రలువెండి, బంగారు, రత్నమయమైనవటములను, రామనాధుని అభి షేకము కొరకు ఇచ్చిననరులు (127) మరుజన్మలో వారుభూమండలాధివతులౌతారు.

రామనాథుని పూజ కొరకు పూలను (తోటను) పెంచేవారు (128) అశ్వమేధాది యాగముల ఫలమును పొందుతారు. రామేశ్వర మహాలింగము పూజింపబడినా, నమస్కరింపబడిన స్మరింపబడినా (129) లింగమును చూచీన, లింగమును గూర్చి విన్నా ఓ బ్రాహ్మణులార ! దుర్లభమైనది ఏది లేదు. రామనాథ మహాలింగమును సేవించుటకు వెళ్ళిన నరు (130) ని చూచి ఆతని పాప సమూహములు త్వరగా భయపడి పోతాయి. రామనాథ మహాదేవుని నరులు చూశాక (131) వారికి వేదములతో శాస్త్రములతో తీర సేవతో పనిలేదు. చందనము, కుంకుమ కోష్ఠము కస్తూరి, గుగ్గిలము (132) మృగనాభి, నరలము (ధూపద్రవం) వీటిని రామేశ్వరునకిచ్చిన నరుడు ఈ భూమి పై ధనాఢ్యుడుగా వేదపారగుడుగా జన్మిస్తాడు (133) ముక్తాభరణ వస్త్రములను యోగ్యమైన గొప్ప వస్తువులను రామనాథదేవునికిచ్చిన నరుడు దుర్గతిని పొందడు. (134) తీసుకొని వచ్చిన గంగ తోయములతో రామనాథ మహాలింగమును అభిషేకించిన నరుడు శివునకు కూడా పూజనీయుడు సంశయములేదు (135) మరణం రాకముందే ముసలి తనం రాకముందే ఇంద్రియ వైకల్యం కలగక ముందే ఓ బ్రాహ్మణులార ! (136) అంతకు ముందే రామనాథుని మహాదేవుని శివుని ఎల్లప్పుడు ముముక్షువులైన వారు నమస్కరించాలి. పూజించాలి. మననం చేయాలి. స్తుతించాలి (137) రామేశ్వర మహాలింగ పూజతో నమానమైనది లేదు. నర్వవురాణములందు సర్వశాస్త్రములందు ఇదే ధర్మమనబడింది. (138) మహాకారు తుడైన ప్రభువైన మహారామేశ్వర దేవుని భక్తితో నిత్యం భజించేవారు భూలోకంలో సుఖం కలవారౌతారు (139) పుత్రదారయుతులై మిక్కిలి భోగములను, బహు సుఖములను అనుభవించి ఈ శరీరం పడిపోయిన తరువాత శాశ్వతమైన ముక్తిని పొందుతారు (140) శ్రీ సూతులిట్లనిరి - ఈ విధముగా మీకు ఓ బ్రాహ్మణులార ! రామనాథుని వైభవాన్ని చెప్పాను. దీనిని భక్తితో విన్నవారు, చదివినవారు (141) రామనాథుని సేవతో కలిగే ప్రధానమైన ఫలమును పొందుతారు. ధనుష్కోటి మహాతీర్థ స్నానము వల్ల కలిగే పుణ్యమును పొందుతారు (142) అని శ్రీ స్కాంద మహా పురాణముందు ఏకాశీతి నహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు రామనాథ ప్రశంసావర్ణన మనునది నలుబది మూడవ అధ్యాయము.