స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

12వ అధ్యాయము

 తా శ్రీ సూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులారా! మహాపుణ్యప్రదమైన సీతాకుండమందు నరుడు స్నానం చేసి ఆ పిదవ శ్రద్దతో మంగళ తీర్థానికి వెళ్ళాలి  అక్కడ లక్ష్మీదేవి సర్వదా ఉంటుంది. అలక్ష్మీ పరిహారం కొరకు ఆ సరస్పుడు దేవతలు ఇంద్రుడు. మొదలగు వారంతా నిత్యం వస్తూ ఉంటారు. లోక పావనమైన ఈ తీర్థాన్నుద్దేశించి ఋషులూ వస్తుంటారు :  పావనాశనమైన, వుణ్యప్రదమైన ఇతిహాసమును చెప్తాను. సోమవంశమందు మనోజవుడు అనే రాజు జన్మించి సాగరం హద్ధుగా గల ధరను ధర్మంతో పాలించసాగాడు. దేవతలను, యజ్ఞములతో బ్రాహ్మణులను భోజనముతో సంతృప్తి పరిచాడు  ప్రతి సంవత్సరము పితృదేవతలను కవ్యములతో తృప్తి పరిచేవాడు. ఎప్పుడూ వేదం చదివేవాడు. శాస్త్రములను ఆర్ధజ్ఞాన పూర్వకముగా చదివేవాడు శత్రువులను పరాక్రమంతో జయించాడు. ఈ శకేశవులను అధికంగా స్తుతించేవాడు నీతి శాస్త్రములందు రమించేవాడు. మహామనువులను చదివాడు. ఈ రకంగా ఆ రాజు ధర్మంతో భూమిని పాలించసాగాడు. ఈ రకంగా రక్షిస్తున్న రాజునకు శత్రువులు లేకుండా పోయారు ఆ రాజునకు పుత్ర సంపద్వినాశకమైన అహంకారము కలిగింది. అహంకారమున్న చోట లోభము మదము ఉంటాయి. కామము క్రోథము హింసా, అనూయ, మోహము ఇవన్నీ సంపదనాశనమునకు కారణమౌతాయి. ఇవి ఉన్న పురుషుడు నశిస్తాడు. క్షణంలో వుత్రపౌత్రులతో పాటు అఖిల సంపదతో పాటు నశిస్తాడు  జనములను ద్వేషించే అనూయ అతనికి కలిగింది. అసూయతో కూడుకున్న వానికి, వ్యర్థంగా అహంకరించే వానికి లుబ్ధునకు, కామదుష్మనకు వానికి బుద్ధి ఇట్లా మారింది. బ్రాహ్మణుల గ్రామంలో పన్నులు వసూలు చేయాలి అని నిశ్చయించిన వాడై  మనసులో అట్లాగే నిశ్చయించుకొని రాజు అట్లాగే చేశాడు. బ్రాహ్మణుల ధనధాన్యములను లోభంతో తీసుకున్నాడు రాగంతో శివ విష్ణ్వాది దేవతల ధనమును అపహరించాడు. శివవిష్ణ్వాది దేవతల, మహాత్ములైన బ్రాహ్మణుల క్షేత్రములన వహరించి, అహంకారంతో' మూఢుడైవాడు ఈ రాజు. ఈ రకంగా అన్యాయయుక్తుడైన దేవద్విజవిరోధియైన ఈతని  క్రూరమైన దుష్కర్మ పరిపాకం వల్ల, బలవంతుడైన వరదేశాధిపుడైన శత్రురాజు ఈతని వట్టణాన్ని ముట్టడించాడు .

తా ॥ గోలభుడనే రాజుచతురంగ బలములతోకూడివచ్చాడు. ఈదుర్మార్గునకు గోలభునకు ఆరునెలలుయుద్ధం జరిగింది. అహఃకారకుడైన మనోజవసృవతికి యుద్ధంజరిగి, యుద్ధంలో గోలభునితో అతడు జయింపబడి రాజ్యము నుండి పరిచ్యుతుడైనాడు మనోజవుడు వుత్రుడుభార్యతో కూడి అడవికి చేరాడు. మనోజవపురాన్ని చాలాకాలము గోలభుడు పాలిస్తున్నాడు చతురంగబలో పేతుడై యుద్ధంలో అతనిని తొలగించి బలవంతుడైన గోలభుడు పాలించ సాగాడు. మనోజవుడు కూడా భార్యపుత్రులతో కూడి దు:ఖినూ ఆకలితో కృశినూ తోట్రువడూ పెద్ద అడవిని ప్రవేశించాడు. కీచురాళ్ళ గుండుతో కూడింది, పులులు,హింపించే క్రూరజంతువులతో భయంకరవే నది ఏనుగులచీత్కారంతో నిండింది, అడవిపందులు, దున్నపోతులతోనిండింది అట అడవిలో మహావరమైనదానిలో ఆకలితో పీడింపబడుతూఉండగా మనోజవుని కొడుకు తండ్రిని అన్నంఅడిగాడు. అమ్మనాడు అన్నం పెట్టు నాకు బాగా ఆకలౌతుంది ఇట్లతనతల్లిని కూడ పిల్లవాడు ప్రార్థించాడు. అతని మాతాపితురులు కొడుతుమాటలు విని శోకంతో తిరస్కృతులై తొందరగా మోహాన్నిపొందారు. పిదపరాజు సుమిత్రఅను పేరుగల భార్యతో ఇట్లా అన్నాడు మాటి మాటిక వెహం పొందటంవల్ల కంము, పెదవులు, తొలువులు ఎండి పోగా సుమిత్రాఏంచేయాలివేను. ఎక్కడికి వెళ్ళాలి. నాకుదిక్కేదీ త్వరలో ఆకలితో బాధపడుతూ ఈనాకొడు కుచనిపోతాడు. బ్రహ్మదురదృష్టవంతుడైననన్నువృధాగా ఎందుకు సృజించాడు. ఈదుష్కర్మవల్లకలిగిన నాదు:ఖాన్ని తొలగించేవాడెవడు. నేను పూర్వజన్మలోశివునిగానివారినిగాని పూజించలేదా. అట్లాగే ఇతరదేవతలు నూర్యవిభావను ముఖులైనవారు పూజించబడలేదా. ఆపావంవల్లనే నేనుఈజన్మలో  అహంకారపూరితుజెనాను. బ్రాహ్మణులక్షేత్రాన్ని అవహరించాను. శివ విష్యాదిదేవతలధనాన్ని కూడనేను అవహరించాను. ఇట్లాదుష్కర్మఆధిక్యంవల్ల గోలభువీతో ఓడింవబడ్డాను. జనంలేని అడవికి నీతో కుమారునితో కలిసి వచ్చాను.  అన్నములేక,ధనములేక, దుఃఖిస్తూ, ఆకలితో, దప్పిగొని ఉన్నాను. ఆకలి గొన్ననానుతునకు అన్నం ఎట్లా పెడాను.

 తా ॥ ఓ శుచిస్మిత ! నేను బ్రాహ్మణులకు భోజనం పెట్టలేదు శివునిగాని విష్ణువునుగాని లేదా ఇతర దేవతలను గాని నేను పూజించలేదు ఆ పాపం కారణంగానే, నాకీవేళ ఈ దు:ఖం వచ్చింది. నేను ఇది వరలో అగ్నిలో హోమం చేయలేదు. ఏ తీర్థమును సేవించలేదు మాతృశ్రాద్ధము, పితృశ్రాద్ధము, పితరులు మరణించిన రోజున ఏ కోర్దిష్ట విధానంతో కాని లేదా పార్వణ విధానంతో కాని నేనా చరించలేదు. అధికంగా అన్నదానము చేయలేదు. ఆ పావం కారణంగానే నాకీవేళ ఈ దు:ఖం వచ్చింది చైత్రమాసంలో చిత్రానక్షత్రం రోజున పానకము, పనసపండ్లు, రుచికరమైన అరటిపండ్లుకొని, గొడుగు, దండముతో పాటు అందమైన చెవుల జత, తాంబూలములు, పుష్పములు, చందనము, అను లేవనములు చిత్రగుప్తుని సంతృప్తి కొరకు, వేదములెరిగిన వారికి నేను ఇవ్వలేదు. ఆ పాపం కారణంగా నాకీవేళ ఈ దుఃఖం కల్గింది అశ్వళ వృక్షమో (రాగి) మామిడో, న్యగ్రోథమో (మరి), చింతచెట్టో, వేపచెట్టో, వేలగచెట్టో, ఉసిరిచెట్టో లేదా  కొబ్బరిచెట్స్ బాటసారుల శ్రమశాంతి కొరకు నాటలేదు. ఆ పాపం కారణంగానే నాకివేళ ఈ దుఃఖం కలిగింది శివవిష్యాలయాలలో నేను ఊడ్వటం చేయలేదు. చేరువో, బావో, లేద ప్రాదమే తవ్వించలేదు. పుష్పవనాన్ని లేదా తులసివనాన్ని నాటించలేదు శివాలయంఠాని విష్ణ్వాలయంఠాని నేను కట్టించలేదు ఆ పావం కారణంగా వాకీవేళ ఈ దు:ఖం కల్గింది. పితృమాసంలో, పితరుల నుద్దేశించి మహాలయ శ్రాధమో, అసత్రాధమో వేను ఆచరించలేదు నిత్య శ్రాద్ధము, కొమ్య లౌధము కాని, నైమిత్తిక శ్రాద్ధముకాని నేనా చరించలేదు. శాస్త్ర ప్రకారము క్రతువులాచరించ లేదు. భూరి దక్షిణలను ఇవ్వలేదు.  మాసోవదానము చేయలేదు. ఏకాదశ్యువవాసము ఆచరించలేదు. ధనుర్మాన ముందు ఉషఃకాలంలో శివుడు, విషవు మొదలగు దేవతల మాజించి, శాస్త్ర ప్రకారము నైవేద్యమాచరించలేదు. ఆ పాపంఠారణంగా నాకీవేళ ఈ దుఃఖం కల్గింది విష్ణువు శివుల నామసంకీర్తనను నేను చేయలేదు. జాబాలి చెప్పిన ఏడు మంత్రములతో భస్మమును చల్లుకోవటము, త్రిపుండ్రధారణము నేను చేయలేదు నేను రుద్రాక్షలు. ధరించలేదు. రుద్రనూక్తముల జపము, పంచాక్షర జపము పురుష సూక్తజవము అష్టాక్షర జపమునే నాచరించలేదు. ఇతర ధర్మకార్యాలు చేయలేదు ఆ పాపం కారణంగా వాకీవేళ ఈ దు:ఖం కల్గింది. ఈ రకంగా రాజు దుఃఖిస్తూ భార్యతో చెప్పుచు, భిన్నమైన మనస్సు గలవాడై  ఆరాజు మూర్ఛ పోయాడు. భూమియందు పడిపోయాడు

 తా ॥ అతని భార్యసుమిత్ర పడిపోయిన తన భర్తను చూచి అధిక దుఃఖంతో భర్తను కౌగిలించుకొని వుత్రునితో పాటు ఏడ్చింది. వా వాథ! మహారాజ ! సోమవంశమందు సమర్థమైనవాడ! నిర్జనమైన వనంలో పుత్రునితో పాటు నన్ను వదలి ఎక్కడికి వెళ్ళాను. నాథుడులేని, నిన్నను వరించే నన్ను సంపామును చూచి భయపడే మృగము వలె ఉన్నదాన్ని వదిలావు ఒకవేళ నీవు చనిపోయినటైతే ఓరాజా! నేను నిన్ను శీఘ్రంగా అనువరిస్తాను. విధవగా క్షణకాలం కూడా ఉండలేను కుమార, చంద్రకాంత! భూమిపై పడిన మీవావును చూడు. అని తల్లి అనగా చంద్రకాంతుడు రాజుగారి కుమారుడు ఆకలితో బాధపడుతూ తండ్రిని కౌగిలించుకొని ఆతడు నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఓ బ్రాహ్మణులారా! ఇంతలో జడలు, వల్కలము కలిగిన శరీరం నిండా భస్మము కలిగిన, జొనట త్రిపుండ్రములు కల, రుద్రాక్షమాల ఆ భరణంగా తల, తెల్లనియజోపవీతముకల  పరాశరుడనే ముని అనుకోకుండా వచ్చాడు. సాధు వణనలడు ఇసుడైన ఆ ముని ఆరోదన శబ్దాన్ని లక్ష్యంగా చేసుకొని వచ్చాడు వచ్చిన పరాశరుని " మమిత్రచూచి, ఆ పతివ్రత పుత్రునితో కలిసి ఆతని పాదములకు నమస్కరించింది పిదప పరాశరునితో ఈ మమీత్ర ఓదార్చబడింది. ఓ భామిని ! దుఃఖించడు అనిముని అమ్మ అనునయించాడు. పిదప శక్తి వుత్రుడైన పరాశరుడు మునీ మమిత్ర విటా అడిగాడు పరాశరుని మాట - ఓ మలోజి ! నీవెవరు. ఈ ముందు వడిఉన్నవాడు ఎవరు ఈ పిల్లవాడు నీకే మౌతాడు. యథార్థమంతా వాడు చెవు. అవి ఈ రకంగా ముని అడుగగా ఆమునితో ఆమె ఇట్టా అంది సుమిత్రవచనము ఉతడు వార్త. ఈతని భార్యను వేను ఓ మునిశ్రేష ! చంద్రకాంతుడమ పేరుగల ఈ పిల్లవాడు మాకు కలిగిన సంతానము.

సోమవంశంలో జన్మించిన వాడు మనోజవుడనే పేరుగల వాడీరాజు. రాక్రమ వంతుని కుమారుడు. పరాక్రమ మందు విష్ణు నముడు. బలవంతుడు నుమిత్ర అను పేరుగల నేను అతని భార్యను భర్త ననుసరిస్తాను. ఈ రాజును యుద్ధంలో గోలభుడు జయించాడు  రాజ్యభ్రష్టుడై, ఆధారంలేని వాడైనాతో పుత్రునితో కలిసి, ఓ బ్రహ్మర్షి! క్రూరజంతువులతో భయంకరమైన అడవిలో ప్రవేశించాడు. ఆకలితో బాధింపబడి మా పుత్రుడు అన్నమడిగాడు. అన్నములేక వికలుడైన రాజు ఆకలిగొన్న వుత్రుని చూచి దుఖితుడై మూర్చపోయి భూమి పై వడివాడు. ఆ మాటలను శోకంతో నిండిన వానిని విని శక్తి వుత్రుడైన ఆముని పతివ్రతయైన ఆ నుమిత్రతో అగ్ని శిఖవలె వెలగుతోన్న మనోజవుడనే రాజు భార్యయైన ఆమెతో ఇట్లా అన్నాడు పరాశరుని వచనము - ఓ మనోజవుని భార్య ! నీకు ఏరకమైన భయమూ వద్దు. మీ అశుభము త్వరలో నాశం పొందుతుంది నిజము.

తా ॥ ఓ భద్ర ! నీ భర్త మూర్చను వదలి క్షణంలో లేస్తాడు. ఆ పిదన వరాశరుడను ఆ బ్రాహ్మణుడు తన చేతితో ఆరాజును తాకాడు. తాకేప్పుడు త్ర్యంబకుని స్మరిస్తూ మంత్రం జపించాడు. ఆ మనోజవుడనే రాజు మహాముని, చేతితో తాకగానే తమోమయమైన మూర్చనువదలి తొందరగా లేచాడు. పిదప పరాశరమునికి నమస్కరించి ఆ రాజు, చాలా సంతోషంలో చేతులు జోడించి ఇట్లా అన్నాడు మనోజవుని వచనం - ఓ పరాశరముని ! ఈ వేళ నీ పాద పద్మములను సేవించటం వలన నా మూర్చ వెంటనే పోయింది. వాపాతకం కూడా పోయింది. పుణ్యము చేయని వారికి నీ దర్శనము ఎప్పుడూ సిద్ధించదు  శత్రువులు వా పురము నుండి నన్ను తొలగించారు. కరుణా దృష్టితో నన్ను రక్షించండి ఇట్లా అనగానే ఆ ముని ఆ మనోజవరాజుతో ఇట్లా అన్నాడు పరాశర వచనం - ఓ రాజా! శత్రుజయము కొరకు నీకొక ఉపాయం చెప్తాను. రామ సేతువు నందు గంధమాదన

పర్వతమందు అన్ని ఐశ్వర్యములను ఇచ్చే మంగళతీర్థము ఉంది. లోకములకు ఉవతారం కొరకు ఆ పరస్పులో రాముడు  ఓరాజా! లక్ష్మియైన సీతతో కూడి ఎల్లప్పుడూ ఉంటాడు పుత్రుడు భార్యతో కలిసి నీవు అక్కడికి వెళ్ళి భక్తి పూర్వకముగా స్నానంచేసి దాని తీరమందు క్షేత్ర శ్రాద్ధాదికములనుగూడా ఆచరించు. ఇట్లా నీవు చేస్తే దుఃఖాన్ని కల్గించే అలక్ష్మి ఆ తీర్థం యొక్క ప్రభావంవల్ల నశించిపోతుంది. అనుమానం లేదు. పర్వమంగళములను త్వరలోనే పొందుతావు యుద్ధంలో శత్రువులను జయించి, తిరిగి రాజ్యాన్ని పొందుతావు. అందువల్ల ఓ మనోజవ! నీ భార్యతో పుత్రునితో కూడా  ఆ గంథమాదన పర్వతంలోని మంగల తీర్థానికి వెళ్ళు. నిన్ను అనుగ్రహించాలనే వాంఛతో నేను కూడా వస్తున్నాను. ఈ విధముగా పరాశరుడు పలికి ఆ ముగ్గురితో కూడి, మంగల తీర్థంలో స్నానం చేయటానికి సేతువునుద్దేశించి బయలుదేరాడు రాజు, అతని భార్య వుత్రునితో కూడిముని అనేకమైన అడవులను దాటి అడవి ప్రదేశములను దొంగలుగల అనేక గ్రామములను దాటి  గంధమాదన పర్వతంలోని మంగళ తీర్థానికి వెళ్ళాడు. అక్కడ సంకల్పముచేసి శాస్త్ర ప్రకారము ఆముని వుంగవుడు స్నానం చేశాడు శాస్త్ర ప్రకారము రాజు మొదలగు వారిని కూడా స్నానం చేయించాడు. పితరుల తృకొరకు రాజు శ్రాద్ధము చేశాడు.  రాజు, ఆతని భార్య కుమారుడు వారు అక్కడ మూడు నెలలు స్నానం చేశారు. పిదవ పరాశరముని శాస్త్ర ప్రకారము చేశాడు. ఈ విధముగా మూడు నెలలు వారితో పాటు ఆముని స్నానం చేశాడు. అన్ని అమంగళములనశింపచేసే పుణ్యప్రదమైన మంగలతీర్థమందు ఉన్నాడు.

 పిదప వరాశరముని అన్ని అనర్థములను నశింపచేసే రాముని ఏకాక్షరమంత్రాన్ని చివర ఉపదేశించాడు. ఆరాజు ఏకాక్షర మంత్రాన్ని నలుబది రోజులు మునీ చెప్పిన పద్ధతిలోనే ఆ తీర్థంలో జపించాడు ఈ రకంగా ఏకాక్షర మంత్రాన్ని జపిస్తున్న ఆతనికి ముని ప్రసాదంవల్ల ఎదురుగా దృఢమైన ధనువు ప్రత్యక్షమైంది అక్షయములైన అమ్ముల పొదలు, బంగారు వడిగల కత్తులు, డాలు, గద, రోకలి, గొప్ప ధనస్సు,శంఖము, గుణములతో కూడిన రథము. సారధితోపాటు జండ, తీర్థము నుండి ముందర నిలిచాయి. బంగారుమయమై, వైశ్వానరునిలా కాంతి గల కవచము, ముని ప్రసాదంవల్ల ఆ తీర్థం నుండి ప్రాదుర్భవించాయి. హారము కేయూరములు, ముకుటకటకాది ఆభరణములు ఆ శ్రేష్టమైన తీర్థము నుండి రాజుముందర నిలిచాయి వేలకొలది దివ్య వస్త్రములు ఆ తీర్థము నుండి ఉద్భవించాయి. వైజయంతి మాల బంగారుతామరలతో శోభిస్తున్నది వచ్చింది. వీటినన్నిటిని చూచి రాజు వీటిని మునికి అర్పించాడు. అప్పుడు పరాశరముని తీర్థము నుండి జలము తీసుకొని మంత్రపూతమైన జలముతో రాజును అభిషేకించాడు. మునితో అభిషేకింపబడిన రాజు శోభిస్తూ సన్నద్ధుడైక వచఖడ్గ చాప బాణముల ధరించి, యువతుడై, హారకే యూర ముకుటకటకాది భూషితుడై దివ్య వస్త్రముల ధరించి, గుణములు గల రథము పైకెక్కి మధ్యాహ్న భాస్కరునివలె ఆ రాజు మిక్కిలి ప్రకాశించాడు .

తా ॥ ఆ మహారాజునకు ఆ మహాముని బ్రహ్మాద్యస్త్రములను సాంగముగా రహస్యముతో సహా విడుచుట, ఉపసంహరించుటతో కూడా శక్తివంతుడైన పరాశరుడు సుమిత్ర భర్తయైన రాజునకు ఉపదేశించాడు. మనోజవుడు ఆశీర్వాద పూర్వకముగా మునితో ప్రేరేపింపబడి, మునికి నమస్కరించి, రథమధిరోహించి, ప్రదక్షిణమాచరించి మహర్షితో ఆజ్ఞ పొంది పత్నితో, పుత్రునితో కుడి విజయమునకై ఆతడు బయలుదేరాడు ఆతడు తన సగరికి వెళ్ళి శంఖమును పూరించాడు ఆ శంఖరసమును విని గోలభుడు సైన్యంతో కూడి తొందరగా యుద్ధమునకై బయలుదేరాడు. మనోజవ రాజుతో అతడు  మూడు రోజులు యుద్ధం చేశాడు. గోలభునకు రాజునకు మూడు రోజుల యుద్ధం తర్వాత నాలుగవరోజున సైన్యంతో కూడిన గోలభుని మనోజవుడు యుద్ధంలో బ్రహ్మాస్త్రంతో నశింప చేశాడు. పిదప భార్యపుత్రులతో కలిసి తన నగరికి రాజుచేరి  భూమిని పాలిస్తూ భార్యతో సహ సర్వము అనుభవించాడు. ఆరోజు నుండి ఈ రాజు అహంకరించలేదు అసూయాది దోషములను రాజు వదిలి పెట్టాడు. అహింసానిరతుడై దాంతుడై ఎవరూ ధర్మ వరుడైవాడు వేయి సంవత్సరములు ఆ రాజు ఇట్లా రక్షించాడు. పిదప రాజు వీరుడై పుత్రుని పై రాజ్యముంచి గంధమాదన పర్వతమందలి మగంలతీర్థమునకు వెళ్ళాడు. ఆతడక్కడ మనస్సున సదాశివుని ధ్యానిస్తు తప మాచరించాడు పిదప త్వరలోనే మనోజవుడు దేహమును వదిలి ఆ తీర్థమాహాత్మ్యమువలన రాజు శివలోకమునకు వెళ్ళాడు. అతని భార్య సుమిత్ర కూడా ఆతని శరీరమును కౌగిలించుకొని, చీతిని అధిరోహించి ఆమెకూడా అదే లోకమునకు చేరెను శ్రీ సూతులిట్లనిరి - ఆ మంగల తీర్థము ఇట్టి ప్రభావము కలది. మనోజవరాజు ఆ ఉత్తమ క్షేత్రంలో స్నానంచేసి, శత్రువుల జయించి, దేహంతమందు భార్యతో కూడా శివలోకమునకు వెళ్ళాడు. అందువల్ల అన్ని విధముల ప్రయత్నించి మంగలతీర్థాన్ని సేవించాలి ఈ తీర్థము అతి శోభనమైనది. శివప్రదము. నరులకు భుక్తి ముక్తి ప్రదము. పావరాశి అనే గడ్డి దూదికి అగ్నిలాంటిది కనుక బ్రాహ్మణులారా విముక్తి కొరకు దీన్ని సేవించండి అని శ్రీ స్కాంద మహాపురాణయందు ఏకాశీతి వహనసంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పేతుమాహాత్మ్యమందు మంగలతీర్థ ప్రశంవయందు మనోజవుని అలక్ష్మివాశ,వర్ణన మనునది పన్నెండవ అధ్యాయము సమాప్తము.