స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
51వ అధ్యాయము
తా ॥ శ్రీసూతుల వచనము - ఓ ద్విజులార! ఇక ఇప్పుడు ఇక్కడి నుండి సేతుయాత్రా క్రమమును వివరిస్తాను. ఈ విషయమును వినిన మానవుడు క్షణంలో అన్ని పాపముల నుండి ముక్తుడౌతాడు (1) స్నానం చేసి ఆచమించి విశుద్దాత్ముడై బుద్ధిమంతుడు నిత్యవిధి కూడా చేసి రామనాథుని సంతుష్టి కొరకు, రాఘవుని ప్రీతికొరకు (2) వేదపారగులైన బ్రాహ్మణులను శక్తి కొలది భుజింపజేసి, అన్ని అంగములందు భస్మము ధరించి, తలపై త్రివుండ్రములు ధరించి (3) తన ఫాలభాగమందు- గోపిచందనము ధరించియైనా, ఊర్థ్వపుండ్రము ధరించియైనా, రుద్రాక్షమాల ఆభరణముగా కలిగి చేత పవిత్ర(నీరు) ధరించి, శుచియై (4) నేను సేతు యాత్రను చేస్తాను. అని భక్తితో సంకల్పించి మౌనియై అష్టాక్షర మంత్రమును జపిస్తూ తన ఇంటి నుండి బయలుదేరాలి (5), వంచాక్షర నామ (పేరుగల) మంత్రాన్ని నియమితమైన మనస్సుతో జపించాలి. రోజు కొకసారి హవిష్యమును (హోమాన్నము) భుజిస్తూ క్రోథమును జయించి, ఇంద్రియముల జయించి (6) చెవులు గొడుగులేకుండా, తాంబూలమును వదలి, తైలాభ్యంగము వదలి స్త్రీ సంగమము మొదలగునవి వదలి (7) శుచిత్వము మొదలగు ఆచారములలో కుడి, సంధ్యోపాసన పరాయణుడై, మూడు సంధ్యలలో గాయత్ర్యుపాసన చేస్తూ, రాముని చింతిస్తూ (8) మార్గమధ్యంలో ఆదరంతో రోజు సేతుమావతాన్ని పఠిస్తూ లేదా రామాయణాన్ని పఠిస్తూ లేదా ఏ ఇతర పురాణమైన పఠిస్తూ (9) వ్యర్థ వాక్యములను వదిలి విశుద్ధి కొరకు సేతువునకు వెళ్ళాలి. దానమును స్వీకరించరాదు. ఆచారములను వదలరాదు (10) మార్గంలో శక్తి కొలది శివుడు, విష్ణువు మొదలగువారి పూజ చేయాలి. శక్తి కొలది వైశ్వదేవము మొదలగు కర్మలను ఆచరించాలి (11) బ్రహ్మయజ్ఞము మొదలుగా గల ధర్మములను, అగ్ని పూజనము చేయాలి. శక్తి కొలది అతిథులకు అన్నపానాదులు ఇవ్వాలి (12) ధనలోభమును వదలి యతులకు గూడా భక్షనివ్వాలి. శివవిష్ణ్వాది నామములను స్తోత్రములను మార్గంలో చదువాలి (13) ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించాలి. నిషిద్ధమైన వాటిని వదిలి పెట్టాలి. మొదలుగా గల నియమములు గలవాడై ఆ పిదప సేతుమూలమునకు వెళ్ళాలి (14).
తా ॥ అక్కడికి వెళ్ళి శ్రద్ధగా మొదట రాయిని వేయాలి. పిదప అక్కడ సముద్రుని ఆవాహన చేసి నమస్కరించాలి (15) పిదవ సముద్రునకు అర్ఘ్యమియ్యాలి. ఆ పిదప ప్రార్థించాలి. పిదవ అనుజ్ఞను వేడి, అనుజ్ఞ పొంది ఆ పిదప సముద్రమందు స్నానం చేయాలి (16) మనస్సులో హరిని స్మరిస్తూ మునులకు, దేవతలకు, వానరులకు, పితరులకు తర్పణమాచరించాలి, ఓ విప్రులార ! (17) పాషాణముల సంఖ్య - ఓ విప్రశేషులార ! ఏడురాళ్ళను ఇవ్వాలి సముద్రమునకు, లేదా ఒకరాయినై నా ఇవ్వాలి. పాషాణం ఇస్తేనే స్నానం సఫలమౌతుంది. లేకపోతే కాదు (18) పాషాణ దాన మంత్రము - పిప్పలాదుని నుండి పుట్టిన దాన ! ఓకృత్య, లోకభయంకరి, నీకు నేను పాషాణాన్ని ఇచ్చాను. దానిని ఆహారముగా వినియోగించు (19) సన్నిధిలో ఉండమని ప్రార్థించే మంత్రము - నీవు విశ్వాచి, నీవు నృతాచివి, విశ్వమునకు యానమును (వాహనము) విందతివి (రాజు) ఓ దేవ! నీవు ఈ ఉప్పు నీరు గల సముద్ర మందు వాడు సన్నిధిలో ఉండు (విశ్వాచి = విశ్వవ్యాపి, ఘృతాచి =అంతట నీరు గలది) (20) నమస్కారమంత్రము - విశ్వరక్షక ! నీకు నమస్కారము. ఓ అపాంపతి! విను! నీకు నమస్కారము హిరన్య శృంగుడవు, నదులకు నమస్కారము. ఓ నముద్రుడ! ఓ జ్ఞాన స్వరూపుడ నీకు నమస్కారము అని పలికి నమస్కరించాలి (21) అర్ఘ్య మంత్రము - సర్వరత్నమయుడ, శుభప్రదమైన సముద్రములన్నింటికి స్థానమైనవాడ, నీవు నర్వరత్నములకు ప్రధానమువు. ఓమహోదధి ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు (22) అనుజ్ఞాపన మంత్రము - అశేష జగత్తునకు ఆధారమైనవాడ, శంఖచక్రగదలను ధరించినవాడ, ఓ దేవ! నీ తీర్థమును సేవించే కొరకు నాకు అనుజ్ఞనివ్వు (23) ప్రార్థనా మంత్రము - తూర్పుదిక్కున సుగ్రీవుని దక్షిణపు దిక్కున నలుని స్మరించాలి (24) పడమర దిక్కున మైందుడను పేరుగల వానిని ఉత్తరమువై వున ద్వివిదుడను వానిని స్మరించాలి. రాముని, లక్ష్మణుని, యశస్వినియైన సీతను కూడా స్మరించాలి (25) అంగదుని, హనుమంతుని మధ్యలో విభీషణుని స్మరించాలి. పృథివి యందు ఎన్నితీర్థములు న్నాయో, ఓ మహోదధి ! నీలో ప్రవేశిస్తున్నాయో (26) అన్నిటి స్నానఫలములను నాకివ్వు. పాపములన్నింటి నుండి నన్ను రక్షించు “హిరణ్య శృంగం” ఇవి మొదలుగా గల ప్రధానమైన వానితో నారాయణుని స్మరించాలి (27) స్నానాది కర్మలలో కూడా దేవుడైన నారాయణుని ధ్యానించిన బ్రహ్మలోకమును చేరుకుంటాడు. ఇక్కడ తిరిగి జన్మించడు (28) పావములన్నింటికి ప్రాయశ్చిత్తమౌతుంది. పిదప ప్రహ్లాదుని, నారదుని, వ్యాసుని, అంబరీషుని, శుకుని, అట్లాగే ఇతరులైన భగవద్భక్తులను నిశ్చలమైన మనస్సుతో ధ్యానించాలి (29) స్నానమంత్రము - వేదములకు ఆది, వేద వసిష్ఠులకు స్థానము, సంతృతి, సాగరరత్నములకు పుట్టిల్లు, అగ్ని, తేజస్సు, భూమి ఇవన్ని తేజస్సు (శక్తి) గా గలవాడ రేతమునకు పొదుగులాంటి వాడ, విష, అమృతమునకు ప్రధానమైన వాడ (30) సముద్రంలో ప్రవేశిస్తున్న నీరు ఆ ఇతరమైన నీటితో సమానముకానిది అట్లనీకు ఈ (స్నానము). నాశరీరంతో ఇక్కడికి వచ్చి సర్పము జీర్ణమైన చర్మమును(కుబుసం) వదలినట్లు నా శరీరమునుండి పాపములను వదలుతున్నోను(31)
తా ॥ జ్ఞానమూర్తియైన సముద్రునకు నమస్కారము చేయాలి. మరల సర్వతీర్థమయుడు, శుదుడు, నదులకు పతియైన అంబుధిని నమస్కరించాలి. (32) ద్వౌనముద్రా రెండు సముద్రములు) అని మరల ఉచ్చరించి స్నానమాచరించాలి. ఓరవి! బ్రహ్మాండము మధ్యయందున్న తీర్థములన్ని నీకరములతో స్పృశింపబడ్డాయి (33) ఆజలముతో నాకు సేతువు యందు తీర్థమివ్వు, ఓదివాకర! తూర్పుదిక్కున సుగ్రీవుని అని మొదలుగా గల క్రమప్రకారము (34) మరల స్మరించి సేతువు యందు తృతీయ స్నానము చేయాలి. దేవీ వత్తనం నుండి మానవుడు ప్రయాణమారంభించి ముందుకు వెళ్ళేటైతే (35) అప్పుడు సేతువు యందు ముక్తినిచ్చే నవపాషాణ మధ్య మందు సముద్రమందు తనపాప ముల సమూహనివృత్తి కొరకు స్నానమాచరించాలి (38) “దర్భశయ్య” మార్గంలో ఉంటే ముక్తినిచ్చేఆ సేతువునకువెళ్ళాలి. అప్పుడు విముక్తి కొరకుఆక్కడిన ముద్ర మందేస్నానమాచరించాలి (37) ఇకతర్పణనిధి - పిప్పలాదుడు. శుక్రుడు, కణ్వుడు, జీవితేశ్వరుడైనయముడు, మన్యువు, కొలరాత్రి, విద్య, మార్యుడు, (38) వసిషుడు, వామదేవుడు, పరాశరుడు, ఉమాపతి, వాల్మీకి, నారదుడు, వాలఖిల్య మునులు (39) అట్లాగేనలుడు, నీలుడు, గవాక్షుడు, గవయుడు, గంధమదనుడు మైందుడు, ద్వివిదుడు, శరభుడు ఋషభుడు అట్లాగే (40) సుగ్రీవుడు, హనుమంతుడు వేగదర్శనుడు, రాముడు, లక్ష్మణుడు, మహాభాగ యశస్వినియైన సీత ఏళ్ళందరిని (41) న్మరించి, మంత్రములనుచెప్పి వరునగావీరందరికి మూడేని మార్లుతర్పణంవదలాలి. ఓద్విజులార! చతుర్థివిభక్యంతములుగా విభువుయొక్క, ఆయాఇతరుల యొక్క పేర్లు చెప్పితర్పణంవదలాలి. (రామాయ, సుగ్రీవాయాఇట్లు) (42) దేవతలను, ఋషులను, పితరులనుశాస్త్ర ప్రకారమునువ్వులు నీళ్ళతోతర్పణంచేతృప్తి పరచాలి. ఓద్విజులార! చతుర్థివిభక్తికపోతే ద్వితీయావిభక్తి అంతములుగానైనా పేర్లనుచెప్పి (రామం, సుగ్రీవం అనిగాని) తర్పణంవదలాలి (43) ప్రసన్నమైనబుద్ధితో పవిత్రధరించినీటియందునిలిచితర్పణం వదలాలి. తర్పణమాచరించటం వలననర్వతీర్థములందు స్నానమా చరించిన ఫలితాన్నిపొందుతాడు (44) ఈవిధముగావీరికి తర్పణం వదలి నమస్కరించి వీటి నుండి పైకిరావాలి. తడిసినవస్త్రాన్నివదలిపొడి వస్త్రాన్ని ధరించి (45) ఆచమించి, పవిత్రధరించి, శాస్త్ర ప్రకారముత్రార్ధమాచరించాలి. బియ్యము, నువ్వులతోకలిపి ఎండములను పితరులకివ్వాలి. (46) ఓద్విజులార! నేనుచెప్పిన ఈశ్రాధము అశక్తులైనవారి కొరకు ధనవంతుడు, షడ్రసములతోకూడినఅన్నముతో లౌధమాచరించాలి (47).
తా ॥ సమృద్ధిగా (ధనం) గలవాడు గో, భూ,తిల, హిరణ్యములు మొదలగు దానములు చేయాలి. రామచంద్ర ధనుష్కోటి యందు ఇట్లాగే ఆచరించాలి (48) పాషాణ దానము మొదలుగా తర్పణాంతము వరకు ఇట్లా సేతుమూలంలో వీనిని శాస్త్ర ప్రకారము ఆచరించినట్లు ఆచరించాలి (49) పిదప చక్రతీర్థమునకు వెళ్ళి అక్కడ కూడా స్నానం చేయాలి. సేతువునకు అధిపతియైన, దేవుడు నారాయణుడు ఐన వారిని చూడాలి (50) వశ్చిమ మార్గంగా వెళ్తూ అక్కడున్న చక్రతీర్థమందు స్నానం చేసి భక్తి పూర్వకముగా దర్బశయనుడైన దేవుని చూడాలి. (51) పిదప కవితీర్థమునకు వెళ్ళి అక్కడ కూడా స్నానం చేయాలి. పిదప సీతాకుండమునకు స్నానం చేయాలి (52) ఐదవ మహా ఫలమునిచ్చే ఋణమోచన గమునకు వెళ్ళి స్నానం చేసి జానకిరమణుడైన రామప్రభువును నమస్కరించి (53) లక్షణ తీర్షమునకు వెళ్ళాలి. కంఠం పై భాగంలో, అక్కడ ఔరం చేయించుకొని దుష్కృతములను కూడా చింతిస్తూ అక్కడి స్నానం చేయాలి (54) ఏదేవ రామతీర్థమందు స్నానం చేవ పిదప దేవాలయమునకు వెళ్ళాలి. పాపనివాళ(మందు)కమైన గంగయమునందు (55) సాలి, వరవ్వ, గాయత్రులందు స్నానం చేసి మహాలవంతమైన హనుమత్కండమందు ఆ పిదవ స్నానం చేయాలి. శాస్త్ర ప్రకారముగా పిదప బ్రహ్మకుండమునకు వెళ్ళి అక్కడ స్నానం చేయాలి (56) సర్వపాపనాశకమైన నాగరుండమునకు పిదప వెళ్ళి నరుడు స్నానం చేయాలి. ఓ పావులార! అది నరకమును నశింపచే సేది గంగాది అన్ని నదులు నర్వతీర్థములు కూడా (57) ఎల్లప్పుడు నాగకుండంలో ఉంటాయి. తమ,తమ పావ ముల శాంతి కొరకు అనంతాది మహా నాగములెనిమిదింటితో ఇది ఉత్తమమైనది (58) గా కల్పింబడినది. ముక్తినిచ్చే తీర్థమిది. రామ సేతువు యందు శివకరమైనది. పిదప అగస్త్య కుండమును చేరి ముఖ్యమైన స్నానం చేయాలి (59) సర్వదుష్కర్మలను నశింపచేసే అగ్ని తీర్థమునకు ఆవేదన చేరి స్నానం చేసి, తర్పణము చేసే శాస్త్ర ప్రకారము లొడ మాచరించాలి, పితృదేవతలను నరినూ (60) గోభూహిరణ్యధాన్యాదులు బ్రాహ్మణులకు, తనశక్తి కొలది అగ్ని తీర్థ తీరమందు ఇచ్చినవారు సర్వపాపముల నుండి ముక్తులౌతారు. (61) లేదా చక్రతీర్థము మొదలుగా ఎన్ని తీర్థములున్నాయో, దానిననుసరించి ఉన్న తీర్థములన్ని, అన్ని పాపములను హరించేవి. (62) వానిలో వరుసక్రమంలో స్నానం చేయాలి. లేదా తమతమ అభిరుచి ననుసరించి స్నానం చేయాలి. అన్ని తీర్థములందు స్నానం చేసి శ్రాద్ధాదులను ఆచరించాలి.(63)
తా ॥ ఆ తరువాత రామేశ్వరమునకుచేరి పరమేశ్వరుని సేవించి, అట్లాగే సేతుమాధవమునకువచ్చిరాముని, లక్ష్మణుని (64) సీతను, హనుమంతుని, అట్లాగేఇతరులైన కవులను సేవించి, అక్కడ ఉన్న అన్ని తీర్థ ములలో శాస్త్రవిది గాస్నానము చేసి (65) రామనాథునిరామచంద్రునిఅట్లాగేఇతరులను, నమస్కరించి, ఆపిదపనరుడున్నానము చేయుటకై ధనుష్కోటికి వెళ్లాలి. (66) అక్కడ పాషాణదానముదలగు ముందు చెప్పిన నియమములను ఆచరించాలి. తన కున్నఐశ్వర్యంన నువరించిధనుష్కో టియందుదానములివ్వాలి. (67) భూమీ, గోవులు, అట్లాగేఇతరములైనవస్త్రములు ఇంకాఇతరమైనవిఆదరంతో, వేదవిదులైన బ్రాహ్మణులకు తనదగ్గరున్నధనాన్నిబటదానంచేయాలి.(68)పిదపకోటితీర్థమునకువెళ్ళినియమపూర్వకముగాఅక్కడ స్నానం చేయాలి. పిదపవృషభధ్వజుడైనరామేశ్వరదేవునినమస్కరించాలి. (69) ఐశ్వర్యంకనుక ఉంటే బ్రాహ్మణులకు సువర్ణదక్షిణను ఇవ్వాలి. నువ్వులు, ధాన్యము, గోవులు, భూమి, వస్త్రములు ఇతరమైనవిబియ్యముమొదలగునవితనకున్న (70) ధనాన్ననుసరించి ధనలోభంలేనివాడై దానంచేయాలి. ధూవము, దీవము, నైవేద్యము, పూజోపకరణములు (71) మొదలగునవి విత్తముననుసరించిరామేశ్వరదేవునకివ్వాలి. రామేశ్వరదేవునిస్తుతించిభక్తితో నమస్కరించి (72) ఆతనిఅనుజపొంది పిదప సేతుమాధవుని సన్నిధికి వెళ్ళాలి. అతనికి ధూపాదులను ఇచ్చి, ఆమాధవుని అనుజ్ఞపొంది (73) ముందు చెప్పిననియమములు కలిగితిరిగితనఇంటికి రావాలి. షడ్రనములతోనిండినఅన్నములతో బ్రాహ్మణులనుభజింపచేయాలి. (74) దానితోరామనాధుడునంతుడైఈతనికోరికలను నెరవేరుస్తాడు. ఈతనికి నరకములేదు. దారిద్ర్యమునశిస్తుంది. (75) ఓబ్రాహ్మణులార! ఆవురుషునిసంతతి అభివృద్ధి చెందుతుంది. ఆతడు సంసారమును తిరస్కరించి త్వరగా సాయుజ్యమునకు కూడా వెళ్లాడు (76) ఇక్కడికి రావటానికి శక్తుడు కాకపోతే ప్రతినతి ఆ గమగ్రంథములలో ఉన్నదానిని, సేతు మాహాత్మ్య సూచకమైన పుణ్యప్రదమైన గ్రంధజాతమును (77) చదివింప చేయాలి. ఓ విప్రులార! అది మహాపాతక నాశకము. ఈ సేతు మాహాత్మ్యాన్నైనా భక్తి పూర్వకముగా చదవాలి (78) దానితో సేతుస్నాన వలవుణ్యమును పొందుతాడు, అనుమానము లేదు. ఇది గుడ్డివారు కుంటివారు మొదలగు వారి విషయంలో బుద్ధిమంతులు చెప్పారు (79) శ్రీ సూతులిట్లన్నారు. ఈ విధముగా మీకు సేతుయాత్రా క్రమాన్ని చెప్పాను. ఓ విప్రులార! దీనిని చదివిన వారు కాని విన్నవారు కాని అన్ని దు:ఖముల నుండి విముక్తులౌతారు (80) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏశీతి వహస్ర సంహితయందు మూడవదైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు యాత్రాక్రమ వర్ణనమనునది ఏబది ఒకటవ అధ్యాయము.
