స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
3వ అధ్యాయము
ఓ ముని! మీరు చెప్పిన ఇరువది నాలుగు తీర్థములలో, పాపవినాశకమైన సేతువు యందలి ఆ ప్రధాన తీర్థములలో (1) మొదటి తీర్థము యొక్క పేరు చక్రతీర్థము అని. దాని పేరు ఎట్లా వచ్చినదో మాకు చెప్పండి, అని ఋషులన్నారు.
శ్రీ సూతులు ఇట్లా అన్నారు -ఓ బ్రాహ్మణులారా! ప్రధానమైన ఇరువది నాలుగు తీర్థములలో మొదట చెప్పబడ్డ తీర్థము నర్వలోకములందు ప్రసిద్ధమైంది (3) ఆ తీర్థమును స్మరించుట వలన గర్భవానము (పునర్జన్మ) ఉండదు. లక్ష జన్మలందు చేసిన పాపములు కూడా నాశనమౌతాయి (4) ఆ తీర్థమందు ఒక్కసారి స్నానము, స్మరణము, కీర్తనము చేసిన యెడల సమస్త పాపములు నాశనమౌతాయి. ప్రపంచములో అంతకన్న గొప్ప తీర్థము, దానితో సమానమైన తీర్థము (5) మరొకటి లేదు. ఇది నిజము గంగ, నరన్వతి, రేప, పంప, గోదావరి, (6) కాళింది, కావేరి, నర్మద, మణికర్ణిక, ఇవేకాక ఇతరములైన తీర్థములు, పుణ్యప్రదమైన నదులు ఎన్ని ఉన్నాయో అవన్నీ (7) ఈ తీర్థము యొక్క కోటి అంశతో కూడా నమము కావు. దీనిని పూర్వజులు ధర్మతీర్థమని అన్నారు (8) దానికి చక్రతీర్థమనే పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడు చెపుతాను ఓమునులారా వినండి (9) అది సేతుమూలము, దాన్ని దర్భశయనము అని అంటారు. అక్కడే పావముల నశింపచేసే చక్రతీర్థము ఉంది (10) విష్ణు భక్తుడైన గాలవుడనే ముని, దక్షిణనముద్ర తీరంలో, హాలాస్య (ప్రాంతమునకు) మునకు దగ్గరలో (11) వుల్లగ్రామ సమీపంలో, క్షీరనరస్సుకి దగ్గరలో ధర్మపుష్కరిణి తీరంలో గొప్ప తపస్సు చేశాడు (12) పదివేలయుగాలకాలము సనాతనుడైన పరబ్రహ్మనామమును జపిస్తూ, దయగలవాడై, ఆహారం లేకుండా సత్యంమాట్లాడుతూ, ఇంద్రియముల జయించి (13) అన్ని ప్రాణులను తన ఆత్మవలె చూచుకుంటూ, విషయముల యందు నిస్పృహుడై, సర్వభూతముల ప్రాణుల హితము కోరుతూ, దాంతుడై (తవః క్లేశమును నహినూ), ద్వంద్వాతీతుడై (14) కొన్ని సంవత్సరములు వాడిన ఆకులను భుజిస్తూ గడిపాడు. కొన్నాళ్ళు నీరు మాత్రమే సేవించాడు. కొన్నాళ్ళు వాయు భక్షణ మాత్రమే చేశాడు (15) ఈ రకంగా ఐదువేల సంవత్సరాలు ఆ ఋషి, దేవతలు కూడా ఆచరించలేని ఘోరమైన తపస్సును తపించాడు. (చేశారు) (16) ఆ పిదప ఐదువేల సంవత్సరాలు ఆ ఋషి ఆహారములేక, కళ్ళతో చూడకుండా (వెలుగులేక) ఉచ్ఛ్వాసమును బంధించి, నిలకడైన స్థానం లేకుండా (17) వర్షఋతువులో వర్షధారను నహిస్తూ, చలికాలంలో నీళ్ళలో ఉంటూ, ఎండాకాలంలో ఐదగ్నుల మధ్య ఉంటూ, విష్ణుమూర్తిని ధ్యానిస్తూ, (18) అష్టాక్షరమంత్రాన్ని జపిస్తూ, మనస్సులో జనార్దనుని ధ్యానిస్తూ, గాలవ మహాముని తేజస్సంపన్నుడై తపస్సు చేశాడు.
ఈ విధముగా వదివేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మహర్షి తపస్సుతో తుష్టుడైన కమలావతి (20) ప్రత్యక్షమయ్యాడు. శంఖము, చక్రము, గద ధరించి, వికసించిన తామరరేకువంటి నేత్రములు కలవాడై, కోటిసూర్యుల కాంతితో సమానంగా వెలుగుతూ (21) గరుత్మంతుని అధిరోహించి, ఛత్రచామరములతో శోభిస్తూ, హారములు, కేయూరములు, శిరోభూషణములు, కటకములు (కడియం) మొదలగు ఆభరణములతో అలంకరింపబడి, (22) విష్వక్సేనుడు సునందుడు మొదలగు సేవకులతో చుట్టబడి, వీణ, వేణువు, మృదంగము మొదలగు వానిని వాయిస్తున్న నారదాది ఋషులతో (23) గానం చేయబడుతున్న తన విజయం గలిగినవాడై, పీతాంబరముతో వెలిగిపోతున్నవాడు, లక్ష్మిని వక్షస్థలమందు గల, నీలమేఘవంతో సమానమైన శరీరకాంతిగల (24) ఒక చేతిలో వద్మమును ధరించిన మధుసూదనుడు (విష్ణువు) సనకాది మహాయోగులు రెండు ప్రక్కల సేవిస్తుండగా, (25) తన చిరునవ్వుతో ముల్లోకాలను మోహింపచేస్తూ, తన కాంతితో అన్ని దిక్కులను వెలిగింపచేస్తూ (28) కంఠంలో ఉన్న కౌస్తుభమణితో శోభిస్తూ, బంగారు బెత్తములను ధరించిన అనేకమంది అంతః పురవుకావలివారు, (27) ఇతరులకు దుర్లభమైన, చింతించ వీలులేని ఆతని అద్భుతములను గానంచేస్తుండగా, సుభక్తులకు సులభుడైన దేవుడైన లక్ష్మీకాంతుడైన హరి (28) మహామునివైన గాలవుని ఎదుట ప్రత్యక్షమైనాడు. శ్రీవత్స చిహ్నము ఉరస్సు యందు గలహరిని ప్రత్యక్షమైన వాణ్ణి అప్పుడు చూచి (29) పీతాంబరధరుడైన ఆ దేవుణ్ణి చూచి ఆ మహాముని సంతోషమును పొందాడు. మిక్కిలి భక్తితో కూడిన వాడై ఆ జగదీశ్వరుణ్ణి స్తుతించాడు. (30)
గాలవుడు ఇట్ల స్తుతించాడు - శంఖచక్రములను గదను ధరించిన దేవాది దేవునకు నమస్కారము. నిత్యునకు, శుధనకు నచ్చిదానందరూపునకు నమస్కారము (31) భక్తుల ఆర్తిని తొలగించేనీకు, హవ్యకవ్యస్వరూపుడవైన నీకు నమస్కారము. త్రిమూర్తి స్వరూపుడవైననీకు, సృష్టి స్థితి సంహార కారకుడవైన నీకు నమస్కారము. (32) వరులందరికి ప్రభువైన నీకు నమస్కారము. విశేష స్థలమందు వసించే నీకు నమస్కారము. సృష్టికర్తవైన, లక్ష్మీవతివైన నీకు నమస్కారము. సూర్యచంద్రులను నేత్రములుగా గల నీకు నమస్సులు. బ్రహ్మ మొదలగు వారితో నమస్కరింపబడే నీకు నమస్కారము (33) నామము జాతి మొదలగు వికల్పములు లేనివాడు, నమస్త దోషములు లేనివాడు, నమస్తే సంసార భయమును వారించేవాడు, దైత్య నాశకుడు ఐనవానికి (నీరు) నమస్కారము(34) వేదాంతములతో తెలుసుకోదగినవాడు, రమకుఈశుడు, వైకుంఠనివాని, విధాతకు తండ్రి, సత్వ జనుల బాధను హరించేవాడు. అమిత విక్రమ సంపన్నుడు ఐన నారాయణునకు (నీకు) నమస్సులు (35) భగవంతుడైన, వాసుదేవుడైన శార్థమును ధరించిన నీకు నమస్కారము ఆదిశేషుని వడక యందు వవళించే వీరు మరి మరి నమస్కారములు (36) అని విషవును పుతించి గాలవుడు మౌనముగా నిలుచొనెను. శ్రుతి సుఖమైన ఆతనిస్తుతిని విష్ణువు విని (37) శంఖచక్రగదలను ధరించిన విష్ణువు చాలా సంతోషమును పొందెను. పిదప విషవు నాలుగు చేతులతోను ఆమునిని కౌగలించుకొని (38) సంతోషపడి ఇట్లా అనెను. వరముకోరు, అని ఓ గాలవ! నీ తపస్సుతో, వీ స్తోత్రముతో వేను ఈ వేళ చాలా సంతోషపడ్డాను (39) నీ నమస్కారముతోను పంతుష్ఠుడపై నీకు వరము ఇచ్చుటకై వేను వచ్చాను, అని (39 1/2)
గాలవుడు ఇట్లా అనెను. నారాయణ! రమానాథ! పీతాంబర! జగన్మయుడ! (40) జనార్ధన, జగత్తు స్థానంగా కలవాడ! గోవింద, నరకుని చంపినవాడా! నీ దర్శనం వల్ల నేను కృతార్థుడనైనాను. అందరికన్న గొప్పవాడినైనాను (41) అధర్మవరులు నిన్ను చూడలేరు ఎందువల్లనంటే నీవు ధర్మాన్ని పాలించే వాడివి. శివుడు, బ్రహ్మ వేదములు తెలుసుకోలేని (42) నిన్ను పరమాత్మను, వేను తెలుసుకున్నాను. ఇంత కన్నా వరం ఏం కావాలి. యోగులు, కర్మతులు చూడలేని (43) పరమాత్మను నేను చూస్తున్నాను ఇంతకన్న ఇంకేం వరం కావాలి దీనితోవేను కృతార్ధుకైవాను. ఓ జనర్ధాన! ఓ జగత్పతి! (44) ఎవనీ నామస్మరణమాత్రమున మహా పాత తులు, మునులు కూడా ముక్తిని పొందుతారో అట్టి జవార్డునుని నేను చూస్తున్నాను (45) మీ పాద పద్మములందు నాకు నిలభక్తి ఉండనీ, అని అప్పుడు విష్ణువు ఇట్లా అన్నాడు . నా మిద నీతు భక్తి దృఢంగా ఉండనీ. ఓ గాలవ ఇప్పుడు నిష్కామమైన భక్తి కల్గిన (46) నేను చెప్పే మరో మాటకూడా విను ఓమునీ! వా ధ్యానపరుడవై,వాయందే ఆసక్తి కలవాడవై నా కోసం పనులు చేస్తూ ఉంటే (47) ఈ ఆరంభమైన (ప్రారబ్ధం) దేహాంతమందు వా స్వరూపమును పొందుతావు. ఓ మునిశ్రేష! ఈ ఆశ్రమంలోనే నివసించు (48) ఇది పాపములను నశింపచేసేది, పుణ్యప్రదమైనది ఇది ధర్మనుష్కరిణి. దీని తీరంలో తపస్సు చేస్తూ తపసిద్ధిని పొందాలి (49) పూర్వము ధర్మమువచ్చి దక్షిణ నముద్రం యొక్క ఒడ్డు యందు, మనస్సులో మహాదేవుణ్ణి స్మరిస్తూ తపస్సు చేసింది. అప్పుడు (50) స్నానం కొరకు ధర్మము ఒక తీర్థాన్ని కూడా ఏర్పరచుకుంది. ధర్మము ఏర్పరచింది కనుక అది ధర్మపుష్కరిణి అని ప్రసిద్ధమైంది. (51) ఓ ముని నత్తమ నీవు ఇప్పుడు ఎట్లా తవన్పు చేశావో అట్లాగే ధర్మము శివుణ్ణి సేవిస్తూ తపస్సు చేశాడు .(52) శూలపాణియైన మహేశ్వరుడు ఆ తపస్సుతో సంతుష్టుడై తనకాంతితో వదిదిక్కులను ప్రకాశింపచేస్తూ ప్రత్యక్షమయ్యాడు (53). తన ఆశ్రమానికి వచ్చిన కృపానిధియైన పరమేశ్వరుని చూచి ధర్మము చాలా సంతోషపడి (పొగిడాడు) స్తుతించాడు. (54) ధర్ముడు ఇట్లా అన్నాడు - జగన్నాధుడవైన, అందరికి ప్రభువు ఐన ప్రణవన్వరూపుడవైన నిన్ను నమస్కరిస్తున్నాను. నమస్త దేవతా రూపుడవు. ఆది మధ్యాంతములు లేని వాడవు (55) ఊర్ధ్వ రేతుడవు (బ్రహ్మచర్యము) విరూపాక్షుడవు (త్రినేత్రుడు) విశ్వరూపుడవు నీకు నమస్కారము. సమస్తే జగత్తునకు ఆధార భూతుడవు, అనంతుడవు, వుటుకలేనివాడవు, నాశములేనివాడవు (56) యోగీంద్రులు ఎవనిని తెలుసుకుంటారో ఆ పుష్టివర్ధనునకు (శుభకారకుడు) నీకు నమస్కారము. లోకాధినాధునకు నమస్కారము. తేజస్విని, మిక్కిలి తేజస్విని నీకు నమస్కారము (57) నీలకంఠునకు నమస్కారము. వశువతికి నమస్కారము. కల్మషములు నశింపచేయువానికి నమస్కారము. మీడుష్టమునకు నమస్కారము. (58) రుద్రునకు దేవునకు, క ద్రుఁదునకు ప్రచేతసునకు నమస్కారము (గొప్ప మనముకల) ఎవాక ధనువు చేత ధరించిన వానికి, శూలము హస్తమున ధరించిన వానికి నీకు నమస్కారము (59) చైతన్య రూపునకు, వుషులకు పతియైన వానికి నమస్కారము. ఐదు ముఖములు గల దేవునకు, క్షేత్రములకు పతియైన వానికి నమస్కారము (60) అని మహాదేవుని ధర్ముడు స్తుతించగా శంకరుడు, లోకములకు క్షేమము కూర్చువాడు ధర్మునినుండి పరమానందమును పొందినవాడై ఆతనితో ఇట్లనెను (61).
మహేశ్వరుడు ఇట్లనెను - ఓధర్మ మహామతి, ఈ నీ స్తోత్రంతో వంతోషపడ్డాను. నా నుండి వరం కోరుతో, ఆలస్యం చేయరు (62) అని ఈశ్వరుడనగానే ధర్ముడు ఈశ్వరునితో ఇట్లనెను. ఓ పార్వతీపతి ! ఎల్లప్పుడు నేను నీకు వాహనమౌతాను (63) ఓ త్రిపురాంతక! ఈ వరాన్నే నాకు ఇవ్వాలి. నిన్ను మోయటంతోనే నేను కృతార్థుణ్ణౌతాను. (64) ఈరకంగా ధర్ముడనగానే ఈశుడు ధర్మునితో ఇట్లనెను. ఈశ్వరుని మాట - ఎల్లప్పుడు లోకములతో పూజింపబడుతూ ఓథర్ముడ! నాకు వాహనంకా (65) నమ్నమోయటంలో నీకు శక్తి అమోఘంగా ఉంటుంది. నిన్ను సేవించే వారికి ఎల్లప్పుడూ నాయందు భక్తి ఉంటుంది. అనుమానం లేదు. (66) శంకరుడు ఇట్లా చెప్పిన ఎదవ ధర్ముడు కూడ వృషభరూపమును ధరించి అప్పటి నుండి వరమేశ్వరుని మోస్తున్నాడు. ఓ గాలవ (67) మహాదేవుడు ఆ వృషభరూపుడైన ధర్మునెక్కి, మిక్కిలి శోభిస్తూ పరమ అమృతమైన ధర్మమును వలికెను (68) ఈశ్వరుడిట్లనెను - నీవు దక్షిణ సముద్రతటమందు నీవు ఏర్పరచిన తీర్థమేదైతే ఉన్నదో అది ధర్మపుష్కరిణి అని లోకంలో ఖ్యాతిని పొందుతుంది (69) దీని తీరమందు జపము హోమము దానము స్వాధ్యాయము, ఇతరములైన ధర్మకార్యములు నరులు చేసిన (70) అనంత ఫలమును ఇస్తాయి అని తెలుసుకో. ఇక్కడ సంశయించాల్సిందిలేదు. అని ధర్మతీర్థమునకు వరమిచ్చి శంకరుడు (71) ధర్మ వృషభము నెక్కి కైలాస పర్వతమునకు వెళ్ళెను. ఓ గాలవ! నీవు ఇప్పుడు ధర్మపుష్కరిణి తీరంలో (72) మరణించేవరకు శ్రద్ధతో తప్పస్సు చేస్తూ ఉండు. తర్వాత నన్ను తప్పకుండా పొందుతావు (73) నీకు భయం కల్గినప్పుడు నేను దాన్ని నాశనం చేస్తాను. క్షణంలో, నేను ప్రేరేపించిన, నా చక్రాయుధంతో భయం నశింపచేస్తాను (74) అని చెప్పి భగవంతుడైన విష్ణువు అక్కడే అదృశ్యమయ్యాడు. సూతుడిట్లనెను - విష్ణువు అంతర్హితుడైవా క గాలవముని (75).
ధర్మపుష్కరిణీ తీరమందు విన ధ్యాన పరాయణుడై ముక్తినిచ్చే శాల గ్రామమందు విష్ణువును మూడు కాలములందు పూజిస్తూ (76) విరక్తుడై, ఇంద్రియములను జయించినవాడై, ధీరుడైన, బుద్ధిమంతుడైన గాలవుడు నివసించెను. ఒకసారి మామననం శుక్లపక్షం హరివానరమందు (77) ఉపవసించి, జాగరణచేసి రాత్రి యందు విష్ణువును పూజించెను. తర్వాతి రోజు ధర్మపుష్కరిణీ జల మందు ద్వాదశిన స్నానం చేసి (78) సంధ్యావందన పూర్వకమైన నిత్యకర్మలను కూడా ఆచరించాడు. ఆ ఎదవ విష పూజను ఆచరించుటకు ఆరంభించాడు (79) ఆగాలవుడు తులసి మొదలగు వుష్పములను తీసుకొని వచ్చి విష్ణుపూజ చేసి ఈ స్తోత్రమును వరించెను (80) గాలవుని వాక్కులు - సహస్త్ర శిరస్పులు గల విష్ణువును, మత్స్య రూపధారియైన హృషీకేశుని నమస్కరిస్తున్నాను (81) నారసింహుని, వామనుని, పరుశురాముని, రాముని, బలరాముని, కృష్ణుని, కల్కిని విష్ణువును నేను నమస్కరిస్తున్నాను (82) వాసుదేవుని, ఆధారము అవసరంలేని వానిని, ప్రణుతులైన వారి బాధలను తొలగించే వానిని నర్వభూతములకు ఆధారభూతమైన వానిని ఐన జనార్ధనుని నమస్కరిస్తున్నాను. (83) నర్వజుని, అన్నింటికి కర్తఐన వానిని, నతిచిత్ ఆనందస్వరూవుని, ఊహించవీలుకాని వానిని, నిర్దేశించవీలుకాని వానిని, జనార్దనుని నమస్కరిస్తున్నాను. (84) ఈరకముగా మహాయోగి, మునిశ్రేష్ఠుడైన గాలవుడుస్తుతిస్తూ, ధ్యాన వరాయణుడై ధనుః పుష్కరిణి తీరమందుండెను (85) ఇంతలో ఒక వరమైన రాక్షసుడు గాలవమునిని భక్షించుటకు మిక్కిలి ఆకలిగొన్నవాడై వచ్చెను (86) ఆ రాక్షసుడు గాలవుని వేగంగా వటుకొనెను. ఆ రాక్షసుడు వేగంగా పట్టుకోగానే, ఆ గాలవుడు (87) దయానముద్రుడు, ఆ పన్నులయందు ఆసక్తి కలవాడు, చక్రపాణి, ఐన నారాయణుని రక్షించు రక్షించు అని ప్రార్థించాడు. (88) వరేశ! పరమానంద స్వరూప! శరణాగతుల రక్షించేవాడా! దయా నముద్ర! రాక్షసాధీనుడనైన నన్ను రక్షించు (89) లక్ష్మీకాంత! హరి! విష్మ! వైకుంఠవాన! ధ్వజమందు గరుత్మంతుని గలవాడా! స్వామి, రాక్షసునిచే ఆక్రమించబడనన్ను మొసలిచే ఆక్రమించబడ్డ గజమును రక్షించినట్లు రక్షించు. (90) దామోదర! జగన్నాథ! హిరణ్యాసురుని శిక్షించినవాడా! రాక్షసునిచే బాగా పీడింపబడనన్ను ప్రహ్లాదుని రక్షించినట్లు రక్షించు (91) ఈ రకంగా స్తుతిస్తున్న తన భక్తుడైన ఆ గాలవుని యొక్క భయమును తెలుసుకొని వృషాకవ! చక్రపాణి! (92) భక్తుని రక్షించేకొరకు తన చక్రమును పంపించేను. ప్రభవిషువైన విష్ణువుతో వంవబడ ఆ విషచక్రము (93) ధర్మపుష్కరిణి తీరమునకు వేగంగా వచ్చింది. ఆ చక్రము ఆనంతములైన సూర్యులతో సమానకాంతిగలది. అనంతములైన అగ్నులతో నమమైందీ (94) గొప్ప జ్వాల, గొప్పశబ్దము గలది, రాక్షసుని సంహరించగలది. విష్ణువు యొక్క సుదర్శనమును చూచి రాక్షసుడు పరుగెత్తెను (95) వేగంగా పరుగెత్తుచున్న ఆ రాక్షసుని యొక్క శిరమును ఆ సుదర్శనము ఖండించేను. జ్వాలా వరంపరతో ఆ చక్రము దరిచేరవీలులేనట్టిది (96) భూమి యందు వడిన ఆ రాక్షసుని గాలవుడు చూచి చాలా సంతోషపడినవాడై సుదర్శనమును స్తుతించెను (97).
గాలవుడు ఇట్లా అనెను - ఓ విష్ణు చక్రమ నీకు నమస్కారము. ప్రపంచమును రక్షించుటకు దీక్షవహించిన దాన నారాయణుని కరకమలములకు భూషణమైన నీకు నమస్కారము (98) గొప్ప శబ్దం కలదానా! యుధములందు రాక్షస సంభారమందు సమర్థమైన దాన! భక్తుల ఆర్తివి నశింపచేసే ఓ సుదర్శనమా! నీకు నమస్కారము (99) భయముతో కూడిననన్ను అన్ని పావముల నుండి రక్షించు. ఓ పుదర్శన విభు! ఈ ధర్మ తీర్థ మందు ఎల్లవ్వడూ నీవు (100) ముక్తిని కోరే లోకముల క్షేమం కొరకు ఉంటాడు. గాలవుడు ఇట్లా అనగా ఆ మదర్శనము అతన్ని సంతోషపరుస్తున్నట్లుగా ప్రేమతో అతనితో ఇట్లనెను (101) సుదర్శనము ఇట్లా అనెను. ఓ గాలవ! ఇది పుణ్యకరమైన, అత్యుత్తమమైన ధర్మతీరమిది. (102) లోకములక్షేమము కొరకు ఎల్లప్పుడూ ఇందులో ఉంటాను దుర్బుద్ధి గల రాక్షసులు నిన్ను పీడించటం చూశాక నేను ఉండదలిచాను (103) వసువుచే వంపబడి తొందరగా వచ్చాను. వేను ఈ రాక్షసాధముణ విన్ను పీడించేవాణ్ణి చంపాను (104) ఈ భయంనుండి నీవు ముక్తుడవైనావు. నీవు నర్వదోహరి భక్తుడవు. ఓ మునిశ్రేష! ధర్ముని యొక్క ఈ పుష్కరణి యందు నేను (105) ఎల్లప్పుడూ లోక రక్ష కొరకు నివసిస్తాను. ఇందులో నేను ఉండటంవల్లనీరు, ఇతరులకు కూడా (106) ఇక ముందు భూతములు, రాక్షసులనుండి సంభవించే పీడ ఉండదు. ఈ ధర్మపుష్కరిణి అన్ని పాపములను నశింపచే పేది (107) ధర్ముడు దేవీపట్టణ పర్యంతము దీన్ని చేశాడు. ఇక్కడ అంతటా ఎల్లప్పుడూ ఉంటాను. (108) ఇందు వేను ఉండటం వల్ల దీనికి చక్రతీర్థమని ప్రసిద్ధి వస్తుంది. ముక్తినిచ్చే చక్రతీర్ధమందు స్నానం చేసినవారు (109)వారి పుత్రులు, వారి పౌత్రులు, వారి వంశజులందరు పాపములను పోగొట్టుకున్నవారై విష్ణువు యొక్క పరమ పదమును చేరుకుంటారు (110) ఇక్కడ ఏతరులనుద్దేశించి పిండము నచ్చిన వారు అందరు స్వర్గానికి వెళ్ళుతారు. పితరులు కూడా తర్పితులై స్వర్గమునకు వెళ్లారు (111) ఈ విధముగా ఆ విష చక్రము చెప్పి గాలవుడు చూస్తుండగానే, మిగిలిన వారందరు చూస్తుండగా (112) ఆ పావవాశినియైన ధర్మనుష్కరిణి యందు ప్రవేశించెను. శ్రీనూతులు ఇట్లనిరిధర్మతీర్థమునకు చక్రతీర్థమనే ప్రసిద్ధి (113) ఎట్లా వచ్చిందో అదంతా మీకు నేను ఎంతోషంతో చెప్పాను. చక్రతీర్థము వంటి తీర్థము ఇదివరలోలేదు. భవిష్యత్తులో కలగబోదు (114) ఇక్కడ స్నానము చేసిన వరులు బ్రాహ్మణులు ముక్తినందుతారు. అనుమానంలేదు. ఈ అధ్యాయమును చదివినా, ఏకాగ్రతతో విన్నాను (115) చక్రతీర్థ అభిషేకము వల్ల కలిగే ఉత్తమ ఫలమును పొందుతారు ఈ లోకంలో సుఖం పొంది పరమందు సుఖం పొందుతారు (116) ధర్మక్షమును, మిక్కిలి కఠోరమైన సమాధిని పొందేగాలవమునిని, రాక్షవనాశకమైన సుదర్శనమును ఒక్కసారైనా వరించిపవారు పావభాజనులు కారు.
అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది యొక్క వేల నంపాతమందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు గాలవ చరితమందు ధర్మతీర్థమునకు చక్రతీర్థమను ప్రసిద్ధి వచ్చిన విధమును వర్ణించుటయనువది తృతీయోధ్యాయము.
