స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
11వ అధ్యాయము
తా ॥ శ్రీ సూతులిట్లనిరి - అన్ని పాపములను తొలగించే పావనాశనమందు నరుడు స్నానంచేసి, నియమపూర్వకముగా స్నానం చేయటానికి పిదప సీతాసరస్సుకు వెళ్ళాలి. బ్రహ్మాండా తర్గతములై ఉన్న కొన్ని పుణ్యప్రదములైన గంగాది తీర్థములు తమ పావ పరిశుద్ధి కొరకు పాతకనాశకమైన సీతాసరస్సుయందు ఉంటున్నాయి. యోగ్యమైన కాశ్యాదిక్షేత్రములు కూడా రాత్రింబగళ్ళు తమ తమ కల్మషశాంతికొరకు ఇక్కడ సీతా సరస్సును సేవిస్తున్నాయి. ఈ సరస్సులోని సంగీత, గుణంవల్ల ఆకర్షించబడి సింహము పిల్ల కూడా ఇక్కడ ఉంటోంది. ఇది పంచపాతకనాశకము. ఈ తీర్థమునకు వచ్చి శ్రద్ధతో స్నానంచేసి ఇంద్రుడు ఇదివరలో బ్రహ్మ హత్యాపాతకం నుండి ముక్తుడైనాడు ఋషులిట్లా అన్నారు ఓ ముని! పూర్వము ఇంద్రుడు బ్రహ్మ హత్య ఎందుకు చేశాడు. సీతా సరస్సులో స్నానం చేసి ఆ పావం నుండి ఎట్లా ముక్తుడైనాడు శ్రీ సూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులారా ! పూర్వం కపాలా భరణుడనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మవరం వల్ల వాడు నర్వదేవతలకు అవధ్యుడైనాడు. ఆతని శపభక్షణుడు అని మంత్రి ఉండేవాడు గుఱ్ఱములు ఏనుగులు రధములు వీనితో వానికి నూరు అక్షౌహిణుల సైన్యముండేది. కానీ నగరము వైజయంతము అని బలవంతుడైన కపాలాభరణుడు ఈ పురంలో ఉండేవాడు. మంత్రియైన శవభక్షకు పిలిచి ఇట్లా అన్నాడు. ఓ శవభక్షక, పరాక్రమవంతుడ మంత్రశాస్త్ర మెరిగినవాడ! దేవతల నగరానికి మనం వెళ్ళి యుద్ధంలో దేవతల జయించి సైనుకులతో సహా అందమైన ఇంద్ర భవనంలో ఉందాము. రంభాద్యపరనలతో కలసినందనవనంలో రమిద్దాం కపాలా భరణుని ఈ మాటలను విని శవభక్తుడు ఇట్లా అన్నాడు. సరే! అట్లాగే కానీ అని పిదప కపాలా భరణుడు బలవంతుడు గొప్పమేధస్సంపన్నుడు, ఐన శూరుణ్ణి తన కొడుకును వట్టణమందుంచి సేనతో కూడి దేవతలతో యుద్ధం చేయాలని తలచి అమరావతికి వెళ్ళాడు. ఏనుగులు గుఱ్ఱములు రథములు పదాతి సైన్యములతో కూడి విపరీతంగా దుమ్మురేగగా అది సముద్రాన్ని ఎండగొడ్తుండగా, వర్వతములను చూర్ణముచేస్తూ, నిస్పాణముల ధ్వని రోదసిని ధ్వనింపచేస్తుండగా గుఱ్ఱముల నకిలింపు గజముల బృంహితము, రధముల చక్రముల చప్పుళ్ళు, వదాత సైన్యము సింహనాదములు దిగ్గజముల కర్ణ రంధ్రములను కూడా చెవిటివానిగా చేసినవి. ఇట్లా ఆతడు దేవతలతో యుద్ధం చేయదలచి దేవనగరికి వెళ్ళాడు.
తా ॥ ఏదపి ఇంద్రాది దేవతలు సేవా -కలకల ధ్వనిని విని యుద్ధం చేయదలచి పట్టణం నుండి బయలుదేరారు. ఫిదవ దేవతలకు రాక్షసులతో సహా యుద్ధం జరిగింది. జగత్తులో ఇంతకు ముందు చూడబడనిది ఇంద్రాది దేవతలు రాక్షసులను యుధమందు చంపారు. యుద్ధమందు జయించదలచి రాక్షసులు దేవతలను చంపారు. దేవతలకు రాక్షసులకు అన్యోన్యము ద్వంద్వ యుధము జరిగింది. యుద్ధమందు కపాలా భరణనితో ఇంద్రుడు యుద్ధం చేశాడు యమునితో శవభక్షకుడు వరుణునితో కౌశికుడు, కుబేరుడు రుధిరాక్షునితో యుద్ధం చేశారు. మాంన ప్రియుడు, మద్య సేవి, క్రూరదృష్టి, భయావహుడు ఈ నలురు వరాక్రమ వంతులు, తపాలా భరణుని తమ్ములు అశ్వినులతో అగ్ని వాయువులతో యుద్దమందు పరస్పరం యుద్ధంచేశారు. పిదప మహా పరాక్రమవంతుడైన యముడు కాలదండంతో వేగంగా యుద్ధంలో శవభక్తుని చంపి యమసదనానికి పంపాడు. ఆతని ముప్పదీ అక్షౌహిణుల సైన్యాన్ని యుద్ధంలో యముడు చంపాడు. వరుణుడు ప్రాసముతో యుద్ధములో కౌశికుని శిరమును హరించాడు. కుబేరుడు తుంతముతో రుధిరాప్తుని శిరము హరించాడు అశ్వినులతో అగ్నివాయువులతో కపాలా భరణుని అనుజులు యుద్ధంలో చంపబడ్డారు. యను సదనమునకు వెళ్ళారు. దేవేంద్రుడు యుద్దమందు నూరు అక్షౌహిణుల సైన్యాని ఆరజములో చంపాడు. వారు యమునదనమునకు వెళ్ళారు అవ్వడు కపాలాభరణుడు చనిపోయిన తన సేనను చూసి, ధనను తీసుకొని వేగము గల తీనమైన బాణములను తీసుకొని యుద్దానికి వచ్చి, ఇంద్రునితో నిలు, నిలు, అని కూడా అన్నాడు. పిదప ఐదు బాణములతో ఇంద్రుని తలపై కొట్టాడు. ఇంద్రుడు ఆ బాణములు తనను చేరకముందే తన బాణములతో యుద్ధమందు వానిని ఛేదించాడు. పిదప తపాలా భరణుడు శూలము తీసుకొని యుద్ధంలో ఇంద్రుని పై విసిరాడు. ఆతడు శక్తితో దానిని కొట్టాడు. పిదప కపాలా భరణుడు నూరు హస్తములవైశాల్యము గల గదను ఉక్కుతో చేసిన దానిని, ఐదువేల తులముల బరువుతో తయారు చేసిన దానిని తీసుకొని, యుద్ధంలో ఇంద్రుని రొమ్ముపై కొట్టాడు. పిదప ఇంద్రుడు మూర్ఛపోయి రథంలోనే కూర్చున్నాడు. బృహస్పతి మృతసంజీవినీ విద్యను జపించి యుద్ధంలో ఇంద్రుణి అద్భుతంగా బ్రతికించేశాడు. అప్పడు ఐరావతావెక్కి కపాలా భరణుని దగ్గరకు వచ్చి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. పాకశాసనుడైన ఇంద్రుడు ఒకే దెబ్బతో యుద్ధంలో వజ్రాయుధంతో, రధము గుణములు, ధనుస్సు, ధ్వజము, అమ్ములపొది, కవచము వీటన్నిటితో కూడి కపాలాభరణువి కోపంతో పొడిగా చేశాడు. తిలలుతీలుగా, కణకణములుగా చేశాడు. యుద్ధముందు ఆ మహావీరుడైన కపాల భరణుడు చంపబడగా.
తా ॥ చాలానాళ్ళనుండి దు:ఖిస్తున్నలోకానికంతా సుఖమేర్పడింది. రాక్షస వధవల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకము భయంకరమై ధ్వనిచేస్తూ ఇంద్రుని అనుసరించింది. అతడు వదోదిక్కులకు పరుగెత్తాడు ఋషులిట్లనిరి - ఓ సూతముని! కపాలా భరణుడు వివ్రుడుడు రాక్షసుడు. అందువల్ల బ్రహ్మహత్య ఇంద్రుని, ఆ రాక్షసుని చంపటంవల్ల ఎందుకు అనుసరించి పరుగెత్తింది. శ్రీ నూతులిట్లం - మిక్కిలి రహస్యమైన మిక్కిలి అద్భుతమైన దానిని ఓమునులారా ! చెపుతాను మీమీమనస్సులను ఏకాగ్ర పరచుకొని మీరు శ్రద్ధగా వినండి. పూర్వం వింద్య ప్రదేశమందు తిపత్రుడనే రాక్షసుడు ఉండేవాడు అతని భార్య గుణవంతురాలు సౌందర్య,గుణములు కలది. మర్రోణి అన్ని శుభ లక్షణములు కలది. నుశీల అనునది పేరు ఆమె అందమైన అవయవములు కలది, మంచి వేషము కలది, అందమైన నవ్వు కలది, విలాసిని వింధ్య పర్వత అరణ్యములో ఒకసారి తిరుగసాగింది. ఆ వసంలో శుచి అనే పేరుగల మహాముని ఉండేవాడు. తప్పమాధి కలవాడు. వేదాధ్యయనమందు ఆసక్తి కలవాడు.ఆవరవర్షిని అతని ఆశ్రమ సమీవమునకు వెళ్ళింది. ఆమెను చూచి ఆముని మన్మధ ఏడితుడై ధైర్యాన్ని వదిలాడు. వరారోహానుచేరి ముని సత్తముడు ఇట్లా అన్నాడు. శుచి అనుమునీ మాట - ఓలలన ! నీకు స్వాగతము. ఓ స్వచ్చమైన చిరునవ్వుగలదానా ! నీవు ఎవరి అతి భీషణమైన ఈ వనంలోకి నీవు ఎందుకొరకు వచ్చాను. ఓ వరారోహ! చాలా అలసినట్టున్నావు. నా ఈ వర్గశాలలో ఉండు ఆమె అట్లా చెవృఐడి ఆ పుణి ఆమునితో ఇట్లా అంది. త్రివత్రుడను రాక్షసుని భార్యను సుశీల అని నా పేరు. పూలు తెంపాలనే కోరికతో ఈ అడవికి వచ్చాను. ఓ ముని! సంతానములేని వేను, పుత్రునికొరకు భర్తతో ప్రేరేపింవబడ్డాను రుచి అనుమునిని సేవించి అతని నుండి పుత్రుని పొందు, అని భర్తతో ఏమాధానం చెప్పబడి నీ దగ్గరకొచ్చాను. నీవువాడు కొడుకును కళించు. ఓముని నామీద దయచూపు. ఈ రకంగా చెప్పబడి ఆ బుచి అనుమునీ ఆ మశీలతో ఇట్లా అన్నాడు. ఉచివాడునిన్నుచూచి ఓ సుశీల! ఇవ్వడు నాకు ప్రీతి కలుతోంది. నాకోరిక అనే నముద్రాన్ని నీవు పూర్తిచేయి అని చెప్పి ఆముని ఆమెతో మూడు రోజులు రమించాడు. సుందరాకృతిగల ఆమెతో సంతోషంగా మునీ ఇట్లా అన్నాడు. నీ గర్భమందు మహాపరాక్రమ వంతుడు తపాలా భరణుడను పేరుగలవాడు జన్మిస్తాడు. చాలాకాలము భూమిని రాజ్యాన్ని పాలిస్తాడు. వేయి సంవత్సరాలు రవమ్పచేసి బ్రహ్మను తన వమ్పుతో మెప్పించును. ఇంద్రుడు తప్ప ఇతర దేవతల చేతుల్లో ఇతనికి చావులేదు. ఈ విధంగా నీకొడుకు ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడౌతాడు, అవి ముని ఆ డ్రితో చెప్పి శివవురిపైన తాకి వెళ్ళాడు .
తా ॥ ఆ సుశీల కపాలాభరణుడనే పుత్రుని కనెను. యుద్దమందు ఇంద్రుడు వజ్రంతో ఆతనిని చంపాడు శుచి అనుముని బీజంవల్ల కల్గిన వానిని ఇంద్రుడు చంపాడు కనుక ఇంద్రుడు బ్రహ్మహత్యతో పట్టుబడ్డాడు భయాకులుడై ఇంద్రుడు అన్ని లోకములకు పరుగెత్తసాగాడు పరుగెత్తుతున్నవాని వెంట పరుగెత్తుతూ బ్రహ్మహత్య అతనిని అనుసరించింది. ఈ ఇంద్రుడు బ్రహ్మహత్యతో అనుసరింవబడుతూ మిక్కిలి పరితపించి బ్రహ్మగృహమునకు చేరాడు బ్రహ్మకు ఇంద్రుడు బ్రహ్మహత్యను నివేదించాడు. ఓలోకనాథ! ఈ బ్రహ్మహత్య మిక్కిలి భీషణమైంది ఓ ప్రజానాథ ఇది నన్ను బాధిస్తోంది. దాని నాశనాన్ని గూర్చినాకు చెప్పు. ఇంద్రుడు ఇలా చెప్పగా బ్రహ్మ ఇంద్రుని గూర్చి ఇట్లా అన్నాడు. బ్రహ్మవాక్కు - గంధమాదన పర్వతంలోని సీతాకుండమునకు వెళ్ళు. సీతాకుండముతీరంలో నీవు యాగములతో శివుని పూజించి సర్వపాపహరమైన శుభకరమైన ఆ నరస్పులో స్నానంచేయి. ఆ పిదప బ్రహ్మహత్య నుండి ముక్తిని పొంది పవిత్రుడవుకమ్ము, ఓ ఇంద్ర! అన్ని దుఃఖములను వదలి దేవలోకమునకు తిరిగి పొమ్ము. సీతాకుండము అన్ని పాపములను తొలగించేది. ముక్తినిచ్చేది. పుణ్యప్రదమైంది పాతక సంఘములను నశింపచేసేది. మిక్కిలి అమృతమైంది. అన్ని దుఃఖములను నశింపచేసేది. దారిద్ర్యాన్నం నశింపచే సేది ధనధాన్యములనిచ్చేది శుద్ధమైనది. వైకుంఠాదేవదములనిచ్చేది. అందువల్ల అక్కడ సీతాసరస్సుయందు ఇష్టినిచేయి. ఓ ఇంద్ర అవి చెప్పబడిగా ఇంద్రుడు గంధమాదనమునకు వెళ్ళాడు. సీతాసరస్సును చేరి స్నానం చేసి అక్కడ ఇష్టిచేసి తిరిగి తన పురికి బ్రహ్మహత్యనుండి విముక్తుడై వెళ్ళాడు. ఆ ఉత్తమమైన సీతాకుండము తీర్థము ఇటువంటి ప్రభావము కలది రామునకు నమ్మకం కలిగే కొరకు అగ్నిలో ప్రవేశించి జనకుని కూతురైన మైథిలి దేవలందరి ఎదుట తిరిగి అగ్ని నుండి బయటికి వచ్చి సర్వావయవ మందరముగా నిలిచింది. లోకరక్షణ కొరకు తన పేరుతో ఈ ఉత్తమ తీర్థాన్ని ఏర్పరిచింది. ఆక్కడ సీత స్వయంగా స్నానం చేసింది. కనుక సీతావరమని పేరైంది. అక్కడి స్నానంచేసినవారు అన్ని కోరికలను పొందుతారు అక్కడ స్నానం చేసి, రకరకాలైన దానములుచేసి, అవేత దక్షిణలతో యజ్ఞములను చేసిన నరులు పరమేశ్వరలోకానికి వెళ్తారు. ఈరకంగా ప్రసిద్ధమైన ఏతావరోవైభమున మీకు చెప్పాను. వినువారు, చదివినవారు. ఇక్కడ భోగముల వనభవించి వరమందును. సుఖం పొందుతారు అవి శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది. ఒక్క వహస్రముల వంతయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పేరు మాహాత్మ్యమందు సీతాపరః ప్రశంసయందు ఇంద్రువి బ్రహ్మహత్యావిమోచమను పేరుగల పదునొకండవ అధ్యాయము సమాప్తము.
