స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
4వ అధ్యాయము
ఋషులు ఇట్లా అన్నారు- ఓ సూత! పౌరాణిక శ్రేష్ఠ! ఆరాక్షసుడెవడు. మహాత్ముడైన ఆ విషభక్తుని బాధించిన వాడెవడు (1) శ్రీ సూతులు ఇట్ల నిరీ - ఓ విప్రులారా! ఆక్రూరుడైన రాక్షసుని గురించి చెప్తాను.ఆదరంతో వినండి. మునుల శాపశక్తి వల్ల ఆ రాక్షసుడు ఎట్లా పుట్టాడో చెప్తాను (2) పూర్వము కైలాస శిఖరంలో హలాస్యంలో శివమందిరమందు ఇరవైనాలుగువేల మంది మహర్షులు బ్రహ్మవాదులు (3) వసిష్ఠుడు అత్రి మొదలగువారు గొప్పతేజస్సు గలిగిన శివభక్తులందరు, శరీరం నిండా భస్మంధరించిన వారు లలాట మందు త్రిపుండ్రములు ధరించినవారు (4) రుద్రాక్షమాలలు ఆభరణముగా గలవారు, పంచాక్షరి జపమందు ఆసక్తి గలవారు, హలాన్య నాథుని భూతేశుని, చంద్రచూడుని, ఉమావతిని (5) మధురాపురవాసులు ముక్తికొరకు ఉపాసించసాగారు. ఒకసారి విశ్వావసుసుతుడైన,బలవంతుడైన గంధర్వుడు (6) దుర్గముడనువాడు, విటగోఫీవరాయణుడు, నూరుగురుస్త్రీలతో కూడినవాడై వివస్త్రుడై నలిలాశయమందు (నీటి మడుగు) (7) వివస్త్రలైన స్త్రీలతో కూడి, సంతోషంగా క్రీడించసాగాడు. వసిష్ట మహర్షి మునులతోకూడి హాలాన్య తీర్థమునకు (8) మధ్యాహ్నకాలమందలి సంధ్యాదినిధులను చేయదలచి శంకరమందిరమునుండి వచ్చాడు. ఆ ఋషులను చూచి భయపడినవారై ఆ స్త్రీలు (9) వస్త్రములను కప్పుకొవ్నారు. సాహసుడైన ఆ దుర్గముడు మాత్రం వస్త్రంధరించలేదు. కుపితుడైన వసిష్టుడు సిగ్గులేని వీనిని శపించెను.
వసిష్ఠులు ఇట్లనిరి - ఓ గంధర్వ! దుర్గమ! మమ్ములను చూచి, సిగ్గుపడి నీవు వస్త్రములను ధరించిలేదు కనుక నీవు రాక్షసుడవుకమ్ము (11) ఆని, ఆ స్త్రీలతో వసిష్టుడు ఇట్లనెను - ఓ ఉత్తమత్రీలారా! మమ్ములను చూచి వస్త్రములను ధరించినారు కనుక (12) మిమ్ములను శపించను. మీరు స్వర్గమునకు వెళ్ళండి. ఈ విధముగా వారితో అనగానే ఆ స్త్రీలు జోడించి (13) నమస్కరించి, భక్తితో వినమ్రమైన హృదయము కలవారై మహర్షుల నమూహం మధ్యలోనున్న వసిష్ఠునితో ఇట్లనిరి (14) స్త్రీలమాట- బ్రహ్మపుత్రుడ! అన్ని ధర్మములు తెలిసిన వాడ! భగవాన్! దయా సముద్ర! మమ్ములను చూచైనా కోపగించవద్దు (15) ఆడవారికి పతియే ఆభరణము భర్తలేనటువంటి స్త్రీ నూరుగురు సంతానముకలదైనా (16) విధవ అని లోకంలో పిలువబడుతుంది. అది వారికి మరణముతో నమానము. అందువలన దయతో మా భక్తియందు అనుగ్రహం చూపండి (17) తత్వదర్శులైనమునులు ఒక అపరాధమును క్షమించాలి ఓ దయాన ముదని! మీ శిష్యుడైన దుర్ధముని క్షమించండి (18) ఈ విధముగా దుర్గమువి స్త్రీలతో ప్రార్థింపబడ్డ వసిష్టుడు ప్రసన్నుడై మళ్ళా ఈ విధముగా పలికాడు (19) నామాట అబద్దoకాదు, ఎవడైనా చక్కనికనుబొమలు కల ఓ స్త్రీలారా! నేనొక ఉపాయమును చెప్తాను శ్రద్ధగా వినండి (20) మీ భర్తకు పదహారు సంవత్సరముల వరకు ఈ శాపం ఉంటుంది. ఈ వదహారు సంవత్సరములలో రాక్షసాకృతి గల ఈ దుర్గముడు (21) అనుకోకుండానే చక్రతీర్థమునకు వెళ్ళుతాడు. ఓ దేవతాస్త్రీలారా! విష్ణుభక్తుడైన మహాయోగియైన గాలవుడు అక్కడ ఉంటాడు. (22) ఈ రాక్షసుడు, ఆమునిని భక్షించుటకు వెళ్తాడు . అప్పుడు గాలవుని రక్షణ కొరకు విష్ణువుచే పంపబడ్డ చక్రము (23) ఈతని శిరస్సును హరిస్తుంది అనుమానంలేదు. పిదప తనరూపమును పొంది శాపముక్తుడైన దుర్గముడు (24) మీ భర్త, తిరిగి స్వర్గమునకు వెళ్ళగలడు అనుమానము లేదు పిదప, త్రి దినమునకు చేరిన దుర్గముడను పేరు గల మీ భర్త (25) సుందరవేషమును ధరించి సుందరులైన మిమ్ములను ఆనందింపచేస్తాడు. 251/2
శ్రీ సూతులిట్లనిరి - దుర్దముని యొక్క ఉత్తమ స్త్రీలను గూర్చి వవసులు ఇట్లా వలికి (28) హాలాస్యేశ్వరుని యందు భక్తిగలవాడై వేగముగా తన ఆశ్రమమునకు వెళ్ళారు. పిదప ఆ స్త్రీలు దుర్గముడనే పేరు గల తమవతిని కౌగిలించుకొని (27) దుఃఖసాగరమున తేలుతూ శోకమగ్నులై ఏడ్చారు. వారు చూస్తుండగానే దుర్గముడు రాక్షసుడైనాడు. (28) పెద్ద పెద్ద కోరలు, పెద్ద శరీరము, ఎర్రని మీసములు, ఎర్రని తల వెంట్రుకలు కలవాడైవాడు. అతని చూచి భయపడినవారై అస్త్రీలు వ్వర్గమునకు వెళ్ళారు (29) రాక్షన వేషము భయంకర ఆకారము గల ఈ దుర్గముడు అన్ని ప్రాణులను భక్షిస్తూ దేశమునుండి, దేశమునకు ఒక వసమునుండి మరో వనమునకు (30) తిరుగుతూ నాయువేగం గల ఈతడు ధర్మతీర్థమునకు వెళ్ళాడు. ఈ విధంగా పదునారు సంవత్సరాలు తిరుగుతూ గడిపాడు (31) పిదప, వదహారవ సంవత్సరంచివర ఈ రాక్షసుడు ధర్మతీర్థంలో ఉండే గాలవమువిని మ్రింగుటకు (32) వాయువేగంతో పరుగెత్తాడు. అతడు జనార్ధనుని స్తుతించాడు. గొలునితో సుతింపబడిన విషవు, చక్రమును పంపాడు (33) రాక్షసునితో పీడింపబడే గాలవుని రక్షించుటకు ఆ విషు చక్రము వచ్చి రాక్షసుని శిరస్సును హరించింది (34) ఎదవ ఆతడు రాక్షన దేహమును విడిచి దివ్య శరీరం కలవాడై విమాన శ్రీసమునెక్కి పూలవర్షము కురువుండగా దుర్గముడు (35) చేతులు జోడించి ప్రణతుడై ఆసుదర్శనమును నమస్కరించాడు. ప్రతిరమ్యములైన మాటలతో ఆదరంతో స్తుతించాడు (36) దుర్దముడు ఇట్లా అన్నాడు –
ఓ సుదర్శనమా! నీకు నమస్కారము. విను హస్తమునకు భూషణమా ! రాక్షసుల సంహరించే దావా వేయి సూర్యుల తేజన్పుగల దాననమప్పులు (37) నీకృపాలేశంవల్లవేను రాక్షస రూపము వదలి, వానిజరూపమును పొందాను. ఓ విష్ణుమూర్తి యొక్క చక్రాయుధమ! నీకు నమస్కారము (38) విష్ణువునకు ప్రియమైన దాన! నేను స్వర్గమునకు వెళ్ళటానికి నన్ను అనుమతించు. విరహాతురమైన మనస్సులు గల నా భార్యలు దు:ఖిస్తూ ఉంటారు (39) బ్రతికి ఉన్నంతకాలమునీ యందు మనస్సు నిలిపి ఉండేటుగా నాయందు నీవు దయ చూయ ఓ చక్రమ! నమవ్పులు (40) ఈ విధముగా భక్తితో తుడి దుర్గమునీలో విషచక్రముస్తుతింపబడగా అట్లాగే కానిమ్మని మునీశ్వరులందరు అనగా సుదర్శనము అనుగ్రహించెను (41) చక్రాయుధముతో అనుజ్ఞపొందిన దుర్గముడు గాలమునికి నమస్కరించి అతని ఆజ్ఞను పొంది ఆ గంధర్వుడు త్రిదివమునకు వెళ్ళెను (42) దుర్గముడు స్వర్గమునకు వెళ్ళాక గాలవమునీ, ఉత్తమమైన ఆ విష్ణ్వాయుధమును (చక్రమును) ప్రార్థించెను (43) మహా అసురుణ్ణి సంహరించిన ఓ చక్రమ! నిన్ను నమస్కరిస్తున్నాను దేవీపట్టణము వరకు అత్యుత్తమమైన ధర్మతీర్థమందు (44) ప్రవేశించిఉండు అది సర్వపాపనాశకము. నీవు సన్నిధిలో ఉండి స్నానముచేపిన పావులందరి (45) పావమును నశింపచేసి, శాశ్వతమైన మోక్షమును ప్రసాదించు. చక్రతీర్థమనే పేరును లోకమందు కల్పించు (46) నీవు సన్నిధిలో ఉండటంవల్ల ఇక్కడున్న మునుల భయం ఇక ముందు పోని ! పూజ్యమైన చక్రాయుధమ! నీకు నమస్కారము (47) భూతప్రేత పిశాచములనుండి భయము కలుగకుండుగాక అని గాలవుడు చక్రమును ప్రార్థించగా (48) అట్లాగే కానిమ్మని పలికి ఆ చక్రము ఆ ధర్మ తీర్ధమందు కన్పించకుండా పోయింది శ్రీ మాతులు ఇట్లు పలికారు - ఈ విధముగా రాక్షసుని పుట్టుకను గురించి నేను మీకు చెప్పాను (49)
మలములనవహరించే చక్రతీర్థము యొక్క మాహాత్మ్యము చెప్పాను. మానవులు దీనిని విని నర్వపాపముల నుండి విముక్తులౌతారు. (50) ఋషులు ఇట్లనిరి - ఓ బుద్ధిమంతుడ! పౌరాణిక శ్రేష! వ్యాసుని శిష్యుడ! ఓ నూత! దర్భశయనం మొదలుకొని దేవి వటణం వరకు (51) చాలా దీర్ఘంగా ఉన్న ఉత్తమమైన దృకతీర్థము మధ్యలో ఎందుకు విచ్చిన్నమైందో చెప్పండి (52) మా మనస్సులోని ఈ అనుమానాన్ని నివృత్తిచేయండి, అవి అనగా శ్రీ మతులు ఇట్లనిరి - పూర్వము పర్వతముల కన్నిటికి రెక్కలుండేవి. అవి మనోవేగం కలవి. (53) సరిహద్దు వర్వతములతో సహా ఆకాశమార్గమున వెళ్తూ నగరములందు రాష్ట్రములందు గ్రామములందు వనములందును (54) దుముకుడు,దుముకుడు పర్వతములు, భూమియంతట ఉండేవి. పర్వతములు ఆక్రమింకిమించినచోట (55) నరులు గోవులు ఇతర ప్రాణులు, పర్వతములతో పీడింపబడుడు తొందరగా మరణించేవి (58) ఆ ఎదవ బ్రాహ్మణాది వర్షములు నష్టమైన పిదప యజ్ఞాదులు లేకపోవటం వలన దేవతలు వ్యవనము నొందిరి. (57) ఇంద్రుడు బాగా కోపగించినవాడై వజ్రమునెత్తి వేగంగా వేగముగల పర్వతముల రెక్కలను విరుగగొను (58) ఇంద్రునితో రెక్కలు విరగొటబడ్డ పర్వతములన్ని నురొక రక్షణ లేక భయం వల వముద్రంలో ప్రవేశించాయి. (59) పర్వతములన్ని నముద్రమందు పడుతూ ఉంటే కొన్ని చక్రతీర్థమును సముద్రమునుకొని ఇందులో వడ్డాయి (60) మధ్యలో వ వర్వతములతో ఉదరభాగం పూరింబడ్డదై మహా పుణ్య ప్రదమైన చక్రతీర్థము మధ్యలో విచ్పేదాన్ని పొందింది (81) పర్వతములు పార్వము లందు పడలేదు. అందువల్ల దర్భశయనమందు దేవీపురమందును (62) మధ్యభాగము విచ్చినంది అదీ రెండు భాగములుగా విభక్తమైనట్లు కన్పిస్తోంది. మధ్యలో పడ సర్వోతాలవల్ల చకతరము లంగా చేయబడింది. (63) శ్రీ నూతులిట్లనిరి. ఈ తీర్థము మధ్యలో భూమిగా ఎట్లా ఐందో మీకు చెప్పాను ఇందులో ఇంద్రునితో రెక్కలు విరగొట్టబడి పర్వతములు ఎలా పడిపోయాయో చెప్పాను (84) అని.
శ్రీ స్కాంద మహా పురాణమందు ఎనుబది యొక్క వేల పంపితయందు తృతియ ఖండమందు సేతు మాహాత్మ్యముందు దుర్దముడను గంధర్వుని శాపమోచన మనునది చతుర్దోధ్యాయము.
