స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
25వ అధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - బ్రహ్మ హత్య విమోక్షమైన శివతీర్థమందు వరుడుస్నానం చేసి స్వపాన జాలశాంతి కొరకు ఏడవ శంఖ తీర్థమునకు వెళ్ళాలి (1) అక్కడి స్నానం చేస్తే కృతఘ్నుడు కూడా ముక్తుడౌతాడు. తల్లి తండ్రి గురువులను మోహితులై గౌరవించనివారు (2) కృతఘ్నులు, ఎగులేనివారు ఇతర విధములైన దుర్మార్గులు, వారందరు ఈ శంఖ తీర్థంలో స్నానం చేసేందువలన శుద్ధులౌతారు (3) వూర్వము శంఖుడు అనుముని గంధమాదన పర్వతమందు తపమాచరిస్తూ శ్రద్ధగా విష్ణువును ధ్యానిస్తూ ఉండేవాడు (4) ఆతడు స్నానం కొరకు అక్కడ ఉత్తమ తీర్థాన్ని కల్పించాడు.శంఖుడు నిర్మించిన తీర్థము శంఖ తీర్థమని పిలువబడుతోంది (5) అక్కడ ఒక్కసారి స్నానం చేసిన నరుడు కృతఘ్నుడైనా ముక్తుడౌతాడు. ఇక్కడొక ప్రాచీనమైన పావనాశకమైన ఇతి హానమును చెబుతాను (6) దానిని విన్నంత మాత్రమున నరుడు ముక్తినందుడు. పూర్వము విప్రశ్రేషుడు మహాముని వత్సనాభుడని ఉండేవాడు (7) సత్యవంతుడు, శీలవంతుడు అన్ని భూతముల పై దయ కలవాడు. యుక్తముగా మాట్లాడువాడు శత్రుమిత్రులందు సమభావన కలవాడు, తపః క్లేశాన్ని సహించేవాడు. ఇంద్రియముల జయించిన తపస్వి (8) వరబ్రహ్మ జ్ఞానమందు నిష్ణాతుడు తత్వ బ్రహ్మనే ఆశ్రయించిన వాడు. ఇట్టి ప్రభావము గల ఆ ముని తన ఆశ్రమంలో తపమాచరించాడు (9) ఆతడు సర్వాంగములను నిశ్చలంగా ఉంచి అక్కడే భూమి పై ఉండి, పరమాణ్వంత కూడా తన స్థానం నుండి కదల కుండ ఉన్నాడు (10) ఒకేచోట ఉండి అనే కశతవత్సరములు తపస్సు చేస్తున్న ఆతనిని పుట్ట ఆక్రమించింది. ఆతని శరీరాన్ని కప్పి వేసింది. (11) పుట్ట తన శరీరాన్ని ఆక్రమించినా వత్సనాభ మహాముని తపస్సు చేస్తూనే ఉన్నాడు. పుటను గమనించలేదు. (12) ఆతడు తపస్సు చేస్తుండగా ఓ మునులార! ఇంద్రుడు మేనుములను వదిలి వేగంగా వర్షించసాగాడు. (13) ఈ విధముగా ఏడు రోజులు అంతరాయంలేకుండ వర్షించాడు. మిక్కిలి పెద్దదైన వర్షంతో వర్షిస్తున్నా, ఆముని (14) కళ్ళు మూసుకొని ఆవర్షాన్ని స్వీకరించాడు అప్పుడు పెద్ద గర్జనతో తొందరగా చెవులను చెవిటివిగా చేస్తూ (15) వుట్ట పైన పెద్ద పిడుగు పడింది. చలిగాలితో అతి దుఃనహమై అట్లా మేతుం వర్షింస్తుండగా (16) పిడుగు తాకిడికి పుట్టయొక్క శిఖర భాగము ధ్వంసమైంది. పుట్ట ఏడుగుతో, తాకబడి శిఖరం లేనిది కాగా (17) వత్సనాభుడు అతి దు:న హమైన వర్షాన్ని బాగా చింతిస్తూ సహించాడు. వర్షధారలతో మహర్షి రాత్రింబగళ్ళు పీడింపబడగా (18) మిక్కిలి ఎక్కువగా ధర్మం యొక్క హృదయంలో దయ కలిగింది. వత్సనాభుడు తపస్సు చేస్తుండగా ధర్ముడు ఇట్లా ఆలోచించాడు.
బాగా వర్షం పడుతున్నా ఈతడు తపస్సు నుండి విరమించటం లేదు. ఈ వత్సనాభుని ధర్మైకమైన చిత్తము ఆశ్చర్యకరముగదా! (20) ఇట్లా ఆలోచిస్తున్న అతనికి ఇటువంటి ఆలోచన వచ్చింది. చాలా పెద్దదైన మనోహరమైన మహిషరూపాన్ని నేను ధరించి, (21) వర్షధారను వహించగల కఠినమైన చర్మము గలిగి మహిషరూపంతో యోగి యొక్క పై భాగాన ఉంటాను (22) వర్షం ఎంత వేగంకలదైనా బాధించదు. ధర్ముడు ఇట్లా నిశ్చయించి వర్షధారలను దృష్టము పై ధరించి (23) వత్సనాభుని పై తన శరీరాన్ని కప్పి ఉన్నాడు. ఏడు రోజుల తరువాత ఆ వర్షం ఆగిపోయింది (24) మహిష రూపియైన ఆ ధర్మము మీక్కిలి దయగలిగి ఆ పుట్టను వదలి కొద్ది దూరంలో నిలిచింది (25) వర్షం వెలిశాక వత్సనాభమహాముని తపస్సు నుండి త్వరగా విరమించి చుట్టు వక్కల చూచాడు (28) వర్షం పడుతుండగా గొప్ప తపస్సు చేస్తూనే నున్నాను. అన్ని దిక్కుల భూమి నీటితో తడిసి కన్పిస్తోంది.
పర్వత శిఖరాలు, వనములు ఉపవాణలు, మహర్షుల ఆశ్రమాలు కొత్త నీటితో తేలుతున్నాయి (28) వీటన్నిటిని చూచి ఆనందపడ్డాడు. ధర్మాత్ముడైన వత్సనాభమహాముని చింతంచసాగాడు (29) ఈ మహా వర్షంలో నేను ఎవరితోనో రక్షింపబడ్డాను. నిశ్చయము. ఈ మహావర్షము ఇట్లా కురుస్తుండగా జీవితం మరోరకంగా ఎట్లా ఉంది (సుఖంగా) (30) ఇట్లా ఆలోచించి ముని శ్రేషుడు అంతటా చూచాడు. గొప్ప శరీరాన్ని దగ్గరలో ఎదురుగా ఉన్నదానిని చూచాడు (31) తపోధనుడైన వత్సవాభుడు నీలవర్ణముగల మహిషమును చూచాడు. ఆ మహిషమును గూర్చి మనస్సులో ఇట్లా అనుకున్నాడు. (32) తిర్యక్ యోనులందు కూడా ధర్మశీలత కన్పిస్తోంది. ఆశ్చర్యము. ఎందుకంటే నేను మహావర్షం నుండి మహిషముచే రక్షింపబడ్డాను. (33) ఇక్కడ నన్ను రక్షించింది కనుక దీనికి దీర్ఘమైన ఆయుస్పు కలగని. అని మొదలుగా ఇట్లా చింతించి తిరిగి తపస్సు చేయటం ఆరంభించాడు (34)
తిరిగి తపస్సు చేస్తున్న ఆతనిని చూచి మహిషరూవధారి నర్వాంగములందు రోమాంచమును పొంది మిక్కిలి ఆనందాన్ని పొందాడు (35) తిరిగి తపస్సు చేస్తున్న వత్సనాభమునికి మనస్సు పూర్వం వలే వరబ్రహ్మయందు ఏకాగ్రం కాలేదు. (36) ఆ వత్పవాభుడు విషణ మాననుడై చింతించసాగాడు. నైర్మల్యములేకపోతే మనస్సు చంచలమౌతుంది (37) పావబాహుల్యముంటే మనస్సు విర్మలం కాదు. వాడు పావలేశం కూడా లేదు ఎందుకు మనస్సు చంచలమౌతోంది (38) దోషకారణమును వత్సనాభుడు మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు. ఆలోచించి నిశ్చయించుకొని త్వరగా తన్నుతాను నిందించుతున్నాడు (39) దురాత్ముడవైన వారు ధిక్కారము నేను మిక్కిలి మూడుడను. కృతవ్నుత గొప్పదోషము. అది నాకు చేరింది (40) ఇటువంటి ఇన్ని వర్షములనుండి నన్ను రక్షించిన మహిషోత్తమమును పూజించకుండానే కూర్చున్నాను. అందువల్లనే నాడు కృతన్నుత కళింది (41) కృతఘ్నత గొప్ప దోషము. కృతఘ్నతకు నిష్కృతి లేదు. కృతన్నునకు పుణ్యలోకాలులేవు. బంధువులు లేరు. (42) కృతన్నుతా దోషబలము వలన నా చిత్తము మలినమైంది. విశ్వాస పతులు, కృతన్నులు నరకానికి పోతారు (43) కృతఘ్నులకు ఏ విధమైన నిష్కృతి కన్పించటం లేదు. ధర్మజుల మాట ప్రకారం ప్రాణవరిత్యాగం తప్ప మరొకటి లేదు (44) పితరుల ఋణముక్తుడు కాకుండ, గురుదక్షిణ ఇవ్వకుండ, కృతన్నుతను పొందిన వీరులకు మరణములోనే నిష్కృతి (45) అందువల్ల ప్రాణములను వదలి ప్రాయశ్చిత్తమాచరిస్తాను. అని మనసులో నిశ్చయించుకొని వత్సనాభ మహాముని (48) తన ప్రాణములను తృణముగా భావించిని: సంగమైన అంతరాత్మతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే అభిప్రాయంతో మేరు పర్వత శిఖరాన్ని అధిరోహించాడు (47) ఆమేరుశిఖరం నుండి వడటానికి ముని ప్రయత్నించాడు. ఆతడు పడటానికి సిద్ధంగా తొందరపడకు అని పలుకుతూ మహిష రూపమును విడిచి ధర్మమే ఇట్ల వారించింది. (48) ధర్మోక్తి - ఓ వత్సనాభ. మహా ప్రాజ, అనేక సంవత్సరాలు జీవించండి (49) నీదేహ త్యాగం చేయటమనే అభిప్రాయంతో నేను చాలా ఆనందిస్తున్నాను. నీకుభధ్రము. నీధరరొంకతో సమానమైన వాడు లోకంలో మరొకడు లేదు (50) ప్రాణసంతాగము కృతన్నుతకు నిష్కృతీఐనా ధర్మశీలుడవు కనుక నీరు మరో నిష్కృతిని చెప్తాను (51) గంధమాదనంలో శంఖ తీర్థమనే తీర్థం ఉంది. ఈ పాపశాంతి కొరకు శ్రద్ధగా అక్కడ స్నానం చేయి (52) దానితో విగత కల్మముడవై నీవు చిత్తశుద్ధిని పొందుతావు. పిదప విజ్ఞానాన్ని పొంది శాశ్వత వదాన్ని పొందుతావు (53) ఓ యోగి వేను ధర్మాన్ని నిజం చెబుతున్నాను అనే ధర్ముని మాటలను విని వత్సనాభముని (54) శంఖతీర్థంలో స్నానం చేయదలచి గంధమాదనానికి వెళ్ళాడు. శంతీర్థమునకు వచ్చి ఆ ముని! అక్కడ స్నానం చేశాడు (55)
పిదప పాపం పోయి మనస్సు నిర్మలమైంది. తర్వాత త్వరలోనే ముని బ్రహ్మస్థానమునకు వెళ్ళాడు (58) ఈ విధంగా మీకు శంఖ తీర్థ వైభవాన్ని చెప్పాను. అక్కడ స్నానం చేసినంతలోనే కృతన్నుడు కూడా ముత్తుడౌతాడు. (57) మాతృద్రోహి, పితృద్రోహి, గురు ద్రోహి, ఇతర విధములైన కృతఘ్నులు ఇక్కడస్నానం చేసిముక్తులౌతారు. (58) అందువల్ల కృతఘ్నులైనమనుజులు ఈ తీర్థాన్ని సేవించాలి. కృతన్నుడు కూడా ముత్తుడయ్యే ఈ తీర్థము ఎంత గొప్పది (59) మాతా పితరుల ఋణం తీర్చని, గురుదక్షిణ ఇవ్వని, కృతన్నుతను పొందిన వానికి నిష్కృతి మరణంతోనే (60) ఇక్కడ స్నాన మాత్రం వల్లనే కృతఘ్నునకు కూడా నిష్కృతి. కృతఘ్నత కూడా ఆ తీర్థమందు స్నాన మాత్రంవల్ల నశిస్తుంది. (61) ఇతరమైన తుచ్ఛపావ ముల విముక్తి గురించి చెప్పేదేముంది (62) భక్తితో ఈ అధ్యాయాన్ని చదివిన కృతఘ్నుడైన నరుడు కూడా పావము నుండి ముక్తుడౌతాడు. విశుద్ధ అంతరాత్మకలవాడై నత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మతో సహ మోక్షమును కూడా త్వరగా పొందుతాడు (63) అని స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు శంఖతీర్థప్రశంన మందు వత్సవాభుని కృతఘ్నతా దోషశాంతి వర్ణనమనునది ఇరువది ఐదవ అధ్యాయము నమాప్తము.
