స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
35వ అధ్యాయము
యజ్ఞదేవుడడిగాడు - వరావరవిచక్షణడ! మహాప్రాణదుర్వావఋషి ఈదుర్వినీతుడనువాడెవడు. గురువు భార్యను పొందినవాడెవడు (1) ఎవనికొడుకీ తడుధనుష్కోటిలోస్నానంవలనఆబ్రాహ్మణుడుఆక్షణంలోనే ఎట్టా ముక్తుడైనాడు. గురుగ్రీ గమనంభవమైనపావంనుండి. శ్రద్ధగలిగినవాడుదీనిని విస్తరంగాచెప్పవలసినది అని అనగా (2) దుర్వానుడిట్లాఅన్నాడు. పూర్వం పాండ్యదేశంలోబహుశ్రుతుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు (3) అతని పేరు ఇధవాహుడు. ఆతనిభార్యరుచి. ఆతవి కుమారుడు దుర్వినీతుడని పేరుగలవాడు ఉండేవాడు (4) ఈతనిచిన్నవయసులోనే ఈతనితండ్రి చనిపోయాడు. దుర్వినీతుడు తనతండ్రిఔర్వదైహికకర్మలునిర్వర్తించి (5) కొంతకాలంవిధవలైనతల్లితోఇంట్లో ఉన్నాడు. వర్నాలులేనందు వల్ల వన్నెండు సంవత్సరాలుదుర్భిక్షమేర్పడింది. (6) ఓద్విజోత్తమ ! ఆతడుతల్లితోపాటువేరెవ్రదేశానికి వెళ్ళాడు. ధాన్యరాశులతో సుభికమైన గోకర్ణమునతడుచేరి (7) విధవలైనతల్లితోపాటుచాలాకాలమునివసించాడు. పిదపబహుతిథులతో కూడిన కాలంగడిచాక దుర్వినీతుడు (8) పూర్వదుష్కర్మవరిపాకంవల్ల మూడబుద్ధిగలవాడు మన్మధబాణములతోకొటబడిన శరీరంకలవాడైరాగంతో వికృతమైనవనముకలవాడై (9) పాతక,వదువద్దంటున్నతల్లిని బలవంతంగాగికామమోహితుడై మిధునర్మద్వారా అనుభవించాడు. (10) రేతఃవతనమైనతరువాతఖిన్నుడైన ఆదుర్వినీతుడు, మనన్ళులోపానంగురించి ఆలోచివమిక్కిలి దుఃఖంతోఏడ్చాడు (11) మిక్కిలిపావంచేవనవాణినేను మహాపాతకులలో శ్రేష్ఠుడనునేను. మన్మథబాణము నకు అధీనుడనై తల్లినిపొందినవాణి (12) మనసులో ఆలోచించి, ఆతను మునులవన్నిధియందు తననుతానుఅనహ్యించు కుంటూ ఆ మునులతో ఇట్లా అన్నాడు (13) గురుగ్రినిపొందినపాపివైనవారుప్రాయశ్చిత్తంచెప్పండి ద్వీజలార ! శాస్రతత్వ పెరిగిన పెద్ద లారా! వామీదదయతోమాత్రమే ప్రాయశ్చిత్తంచెర్పండి. (14) మరణంవల్లనిష్కృతిలభిస్తే మరణిస్తాను అనుమానం లేదు. మీరు వాడు ఇవ్వడు చెప్పేప్రాయశ్చిత్తాన్ని (15) ఆచరిస్తాను ఓద్విజులారాసత్యమిది. మరణమైవాన రేదైవాచేస్తాను (15 1/2).
తా ॥ అతని మాటలను విని అక్కడకొందరుమునీశ్వరులు (16) ఈతనితోకూడా మాట్లాడటం కూడా దోషమేఅని నిశ్చ యించుకొని కొందరువనంగాఉవ్నారు. మరికొందరు మునులు వేగంగా (17) దుషాత, పూతృగామినీవువువోపాత తులలో మొదటి వాడవువెళ్ళు వెళ్ళు అనిఅనేకసార్లు అన్నారు. (18) వారందరినివారించిదయగలనాడు నర్వజ్ఞుడు కరుణానిధి కృష్ణద్వై పాయనుడుఅక్కడదుర్వినీతునితో ఇట్లాఅన్నాడు. (19) నీవురామ సేతువునకు ధనుష్కోటికిమీతల్లితోపాటుత్వరగావెళ్ళు. మాఘమాసంలో వూర్యుడు మకరరాశియందుండగాఒకవెలరోజులు నిరంతరముగా (20) జితేంద్రియుడవై, క్రోధమును జయించినవాడవై వరద్రోహాన్నివదలి ఒకవెలరోజులు ఆహారంలేకుండా మీతల్లితో కూడిస్నానమాచరించు (21) గురు- స్త్రీగమనదోషంనుండి పవిత్రుడవౌతావు. సేతుస్నానంతోనశించనిపాతకములేదు. (22) బ్రతివృతివురాణములలోధనుష్కోటి ప్రశంసచాలాసార్లు చెప్పబడింది. పంచమహాపాతకములనశింపచేసేది (23) అందువల్లనీవునీతల్లితోకలిసి ధనుష్కోటికి త్వరగావెళ్ళు. వేదవాక్యమువలె వామాటను ప్రెనూణంగా వ్వీకరించు (24) ఓ బ్రాహ్మణపుత్ర ! శ్రీరామధనుష్కోటియందు స్నానంచేసినవానికి మహాపాతకకోటులు కూడా లక్ష్యంకావు అనిగదా అంటారు (25) వృతియందువ్వాదిసృతులలోమరొక ప్రాయశ్చిత్తముచెప్పబడింది. అందువల్ల మహాపాతకనాశినియైన ధనుష్కోటికి నీవు వెళ్ళు (26) అని వ్యాసుడు చెప్పగా దుర్వినీతుడు వ్యాసునకు నమస్కరించి తల్లితో సహ ధనుష్కోటికి వెళ్ళాడు (27) సూర్యుడు మకరరాశి యందుండగా మానవవనందు వెలరోజులు విరంతరము తల్లితో కూడి విరాహారుడు జితక్రోధుడు జితేంద్రియుడి (28) శ్రీ రాధనుణ్కిటి యందు సంకల్ప పూర్వకముగా స్నానం చేశాడు. రామనాథుని మూడు కాలములందు భక్తి పూర్వకముగా నమస్కరిస్తూ (29) వెలచివర పారణ చేసితల్లివహ శుద్ధమైన బుద్ధి కలవాడై వ్యాసునతుతనవృత్తాంతాన్ని తెలువడానికై తిరిగి అతని దగ్గరకు వచ్చాడు (30) అతడు వ్యాసునకు నమస్కరించి ఆ దుర్వినీతుడు ఇట్లా అన్నాడు (31)
తా ॥ దుర్వినీతుని మాట -ఓ ద్వైపాయన! మహత్తమ ! దయాసముద్ర ! ఓ భగవాన్ ! ఏదయవల్ల రాను ధనుష్కోటి యందు నాతల్లితో పాటు మానుమాసంలో నిరాహారుడవై వెలరోజులు కునికిపాట్లు లేకుండ (32) మహేశ్వరుని నమస్కరిస్తూ నేను స్నానం చేశాను. ఇక ముందు ఓ వ్యాన! భక్తవత్సల ! (33) భగవాన్! నేనేమి చేయాలో ఓముని! యథార్థాన్ని ఉన్నదున్నట్లుగా నాకువదేశించండి, అవే ఆ దుర్వినీతుని మాటలను విని ఆ ముని నారాయణాంశుడైన వ్యాసుడు ఆ దుర్వినీతునితో ఇట్లా అన్నాడు (34) వ్యానవచనము - మాతృసంగమంవల్ల కళిననీపాతకముఈరోజుపోయింది, ఓదుర్వినీత (35) నీ సంగతితో కళినట్టి నీతల్లి పాతకం కూడా పోయింది. ఇందులో అనుమానించాల్సింది లేదు. నేను నీకు నిజం చెప్పాను (36) బాంధవులు, నీ వ్వజనులందరు, ఇతర బ్రాహ్మణులు అందరూ నిన్ను స్వీకరిస్తున్నారు. నీ తల్లితో సహ ఓ దుర్వినీత ! (37) వా అనుగ్రహంవల్ల ధనుష్కోటిలో స్నానం చేయటం వల్ల నీవు విశుద్ధుడవైవావు. భార్యమ సంగ్రహించి (పెండి) గృహష్ఠ ధర్మానాచరించు (38) ప్రాణ హింసను వదలు. సనాతన ధర్మాన్ని సేవించు. భక్తితో కూడిన మనస్సుతో ఎప్పుడూ నఖనులను సేవిస్తూ ఉండు (39) నంధ్యోపానన మొదలైన ముఖ్యమైన నిత్య కర్మలను వదలడు. ఇంద్రియ నమూహమును అరికటు శివకేశవులను పూజించు (40) ఇతరుల అపవాదాన్ని చెప్పడు. ఎప్పుడూ అసూయపడకు. ఇతరుల అభివృద్ధిని చూపి వ్యర్థంగా నంతావ వడలు (41) ఇతరుల భార్యలను నీ తల్లివలె నీవు నిత్యం గౌరవించు చదివిన వేదముల నన్నిటిని ఎప్పుడూ మరువకు (42) అతిధులను అవమానపరచడు. పితృదినమందు శ్రాద్ధంచేయి. కలలో కూడా ఇతరుల కొండెడి లక్షణాన్ని నీవు ఏవిధంగాను చెప్పవద్దు (43) ఇతిహానవురాణములు, ధర్మశాస్త్రములు ఎల్లప్పుడు చదువుతూ ఉండు. అట్లాగే వేదాంతము, వేదాంగములు కూడా (44) హరి శంకరుల వామములను ఎగువడకుండా కీర్తించు. బాలో వనిషనంత్రములతో త్రిపుండ్రమును పైకితీయి (45) ఎవ్వడు రుద్రాక్షలను ధరించి శోచోచార వరుడవుకము, తులసితో బిల్వపత్రములతో నారాయణ హరులను ఇద్దరిని (48) ఒకసారి రెండు సారులు, లేదా త్రికాల మందు పూజించు శంభునారాయణుల ఎదుట తులసి దళముతో కూడిన భగవత్ పాదోదకముతో తడిపిన (47) నైవేద్యాన్నమును ఎప్పుడు భుజించు అన్న విశుద్ధికొరకు వైశ్వదేవమను ఐలిని నీవు ఆచరించు (48) ఇంటికి వచ్చిన బ్రహ్మనిషులైన యతీశ్వరులను, అన్నములతో తృప్తి పరచు వృద్ధులైన ఇతర అనాథలను రోగులను బ్రహ్మచారులను అన్నముతో తృప్తి పరచు (49) నీవు మృతులాషను చేయిపాసన పరుడవు కమ్ము, ప్రణవముతో కూడిన వంచాక్షర మహామంత్రాన్ని (50) అట్లాగే అక్షరమంత్రాన్ని ఇతర మంత్రములను కూడా, మంత్రాధి దేవతలను కూడా ధ్యానం చేస్తూ పరిశుద్ధుడవై వీవు జపించు. (51) ఈ విధముగా సుతులలో చెప్పబడిన ఇతర ధర్మములను కూడా ఎప్పుడూ ఆచరించు. ఈ విధంగా చేస్తే వీడు దేహాంతమందు ముక్తి లభిస్తుంది. ఇక చాలు (52).
తా ॥ అవి వ్యాపము చెప్పగా దుర్వినీతుడు ఆతవికి నమస్కరించి, అతడు చెప్పినదంతా చేసి దేహాంతమందు ముక్తిని పొందాడు (53) ఆతవితల్లి కూడా ధమష్కాటి యందు స్నానమాడి మరణమురాగానే మరణించి, మరల పుటుకరానటువంటి వరమమైన ముక్తిని పొందింది (54) దుర్వాసుడు ఇట్టవ్నడు - ఈ విధముగా దుర్వినీతునికి మరి అతని తల్లికి ధనుష్కోటి స్నానం వల్ల ముక్తి లభించటం గూర్చి ఓ యదేవ ! వేమ నీకు చెప్పామ (55) నీవు కూడా ఈ కుమారుని బ్రహ్మహత్య నుండి విశుద్ధి తొరకు తొందరగా విచవాన్ని చ్చే ధమష్కాటకి తమకొని వెళ్ళు, ఓ బ్రహ్మన్! (56) ఎంధు ద్వీపుడిట్లా అన్నాడు అని, దుర్వాసుడనగా యజ్ఞదేవుడు తన కుమారుని తీసుకొని విముక్తినిచ్చే రామ ధమడ్కిటికి వెళ్ళాడు (57) వెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణుడు ఆరునెలలు వివావమువ్నాడు. ఓ పృగాల ప్లవంగములార ! కొడుకుతో పాటు వియమముగా ఉన్నాడు (58) కొడుకుతో పాటు ఆతడు ధనుష్కోటి యందు ఆరునెలలు స్నానం చేశాడు కూడ. ఆరునెలల చివర అశరీరవాణి యదేవునితో ఇట్లా అంది (59) యదేవుని బ్రహ్మహత్య విముక్తమైంది. నీ వుత్రివి యొక్క బంగారపు దొంగతనము, మరాపానము, కిరాతీ వంగమము వల్ల వచ్చిన పాపము విముక్తమైంది (60) నీతుమారుడు ఇతర పావములమండి ముక్తుడైనాడు. ఓ బ్రాహ్మణన ! యదేవ ! నీవు అనుమానించొదు (61) అని పలికి ఆ అశరీరవాణి విరమించింది. అశరీరవాణి వాక్యమున ఆ యదేవుడు విప్నాడు (62) పంతుష్టుడై అతడు కొడుకుతో పాటు రామనాథుని సేవించి ధనుష్కోటికి నమస్కరించి కుమారునితో కూడినవాడై (63) సంతోషంతో తన దేశమునకు తన గ్రామమునకు తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. కొడుకుతో భార్యతో కూడి చాలా కాలము (ఆరట) చక్కని ప్రశాంతితో సుఖంగా ఉన్నారు (64) సింధు ద్వీపుని వచనము - ఓ గోమాయు వానరులార ! మీరు వేమ యదేవుని సుతుడైన ఈ పనుతి పరిక్షలమున చెప్పాను (65) ధమడ్కిట పానం వల్ల గొప్ప పాపములనుండి ముర్తులేశారు. అందువల్ల మీరు పాపబుద్ధి కొరకు ధనుణ్కిటికి వెళ్ళండి. మరోరకంగా పదివేల ప్రాయశ్చిత్తములాచరించి వా పావశుద్ధికాదు (66) శ్రీమాతులిట్టవిరి - అవిన సింధుద్వీవువి వచనమును వివి ఓ బ్రాహ్మణులార ! (67) మృగాల వానరులు త్వరగా మహావథములను లంఘించి ప్రయావలో ధనుష్కోటి వెళ్ళి ఆ జలమందు కూర్చొని దేవతలుపూలవాన కురిపిస్తుండగా, తేజశ్వంతులై (69) హారకేయూర ముకుటకటకాది ఆ భరణములచే నలంకరింపబడి, దేవతాస్త్రీలు చామరాలు విసురుతుండగా ప్రకాశిస్తూ రమ్యమైన దేవపురికి వెళ్ళి ఇంద్రుని అర్థసింహానవాన్ని పొందారు(70) శ్రీ పతులిట్లనిరి - మీకు ఈ విధముగా సృగాల కవుల విషయం చెప్పాను (71) ధనుష్కోటి స్నానం వల్ల పాపవిమోక్షణ మౌతుంది భక్తితో ఈ అధ్యాయాన్ని విన్నవారు, చదివిన వారు (72) ధనుష్కోటి. స్నానం వల్ల కలిగే ఫలాన్ని పొందుతారు. యోగులకు కూడా నులభ సాధ్యంకాని ముక్తిని కూడా త్వరగా పొందుతారు (73) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి వహన సంహితయందు మూడవ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ మందు ధనుష్కోటి ప్రశంసయందు నృగాల వానర విమోక్షణ వర్ణనమనునది ముప్పది ఐదవ అధ్యాయము.
