స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

26వ అధ్యాయము

 శ్రీ సూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులార! నరులు శంఖ తీర్థమందు స్నానముచేసి, పిదవ క్రమముగా యమున, గంగ, గయలకు వెళ్ళాలి (1) మహా తీర్థమైన యమున అత్యుత్తమమైన గంగాతీర్థము, గయాతీర్థము ఇవి నరుల పాపముల నశింపచేసేవి (2) ఈ మూడు తీర్థములు పుణ్యప్రదమైనవి సర్వలోకములలో ప్రసిద్ధమైనవి. నర్వవిఘ్నముల నశింపచే సేవి. సర్వరోగముల తొలగించేవి (3) ఈ మూడు తీర్థములు సమస్త అజ్ఞానముల తొలగించేవి. అవిద్య నశించగా జ్ఞానము నిచ్చేవి కూడా (4) జ్ఞానశ్రుతి అనే మహారాజు పూర్వం ఈ తీర్థములలో స్నానం చేసి రైత్వుడను బ్రాహ్మణ శ్రేషుని నుండి ఉత్తమమైన జ్ఞానాన్ని పొందాడు (5) ఋషులిట్లనిరి - సూత! సర్వార్థముల తత్వమెరిగిన వాడ ! వ్యాసుని శిష్యుడ! మహామతి ! యమున,గంగ, గయ అని ప్రసిద్ధమైన (6) ఇవి గంధమాదన వర్వతం పైకి ఎట్లా వచ్చాయి. జ్ఞానశ్రుతి అనే రాజర్షి మూడు తీర్థములలో స్నానం చేయటం వల్ల రైత్వుని నుండి జావాన్ని ఎట్లా పొందాడు. సూత ! మాకు చెప్పండి (7) శ్రీ సూతులిట్లనిరి - రైత్వుడను పేరు గల మహర్షి వూర్వం గంధమాదనంలో (8) చాలా కఠినమైన తపస్సు నాచరిస్తూ ఆతపోనిధి ఉండేవాడు. దీర్ఘకాలము ఆ రైక్వమహాముని తపస్సు చేస్తూ (9) గొప్పతపోబలంతో దీర్ఘాయుస్సును పొందాడు. రైత్వుడను ఈ మునీజన్మ చేత వంగువు (ఈచబోయిన కాలువాడు) (10) వంగువైనందువల్ల ఈ ముని తీర్థములకు వెళ్ళుటకు అసమర్థుడైనాడు. గంధమాదన పర్వతంలోని తీర్థాలను (11) దగ్గరలో ఉండటం వల్ల బండిమీదనే తిరుగుతూ వెళ్ళేవాడు. ముని వరుడైన రైత్వుడు బండితో సహా ఉండేవాడు (12) తవన్వి, లోకంలో వైదికులు ఈతనిని సయుగం అని పిలిచేవారు. యుగ్వమనగా బండి. ఆతడు దానితో కూడి ఉంటారు (13) ఈ విధంగా మునీ శ్రేష్టుడు నయుగ్వ అను పేరుగల ముని, గంధమాదన పర్వతంలో షార్వజనము కలవాడై తపమాచరించాడు (14) గ్రీష్మ ముందు పంచాగ్ని మధ్యమందుండి గొప్పతపమాచరించాడు. వర్షాకాలంలో కుత్తుక బంటి నీటిలో ఉండి తపమాచరించాడు (15) తపస్పు వల్ల శరీరం కృశించిపోగా అతనికి దురద (గోకుడు) పుట్టింది. ఆ ముని రాత్రింబగళ్ళు అతడు గోళుడును గోరేవాడు (16) గోకుడును గోకుతూనే తవస్సును మాత్రం వదలలేదు. ఆ యుగ్వమునికి మనస్సులో ఇట్లా అనిపించింది. (17)

యమున, గంగ, గయ వీటి యందు ఇవ్వడే ఈ మూడు పుణ్య తీర్థములలో నేను స్నానం చేయాలి అని (18) ఆలోచించి ఆముని మరి ఇట్లా ఆలోచించాడు. నేను జన్మతో కాళ్ళు లేనివాడను. అందువల్ల స్నానం చేయటం కష్టం (19) బండి మీద ఎక్కువ దూరం నేను వెళ్ళలేను. ఇప్పుడేం చేయాలి అని ఇట్లా ఆ మహామతి. ఆలోచించి (20) మూడు తీర్థములలో స్నానం చేయాలని నిశ్చయించుకొని, నాతవశక్తి సంపాంచరానిది, తీరస్కరించరానిది (21) ఆతవశ్శక్తితోనే ఆ మూడు తీర్థములను ఆ వాహన చేస్తాను ఇక్కడే. అని మనస్సులో నిశ్చయించి తూర్పు ముఖంగా ఉండి ఇంద్రియములను అరికట్ట (22) మూడుసార్లు ఆచమనం చేసి నయుగ్వుడు క్షణఠాలము నిశ్చలంగా ధ్యానం చేశాడు ఆతని మంత్ర ప్రభావముతో ఆ మహానది యమున (23) జహ్ను తనయమైనగంగ, పాపనాశిని గయ, భూమిని ఛేదించి మూడు కూడా పాతాళమునుండి తొందరగా పైకి వచ్చి (24) మానుష రూపము ధరించి, సయుగుని దరికి వచ్చి చాలా ఆనందపడి, ఆమునిని ఆనందపరుస్తూ ఇట్లా ఉన్నాయి. (25), నయుగ్వ ! రైక్వ! క్షేమమా. ఈ ధ్యానం నుండి విరమించు. నీమంత్రంతో ఆకర్షింపబడి మేము ఇక్కడికి వచ్చాము (26) నీ కోసం మేం ఏం చేయాలో చెప్పు. ఓ మునీశ్వర ! అని అన్నవారి మాటలను విని మహాముని సయుగ్వుడు (27) ధ్యానం నుండి త్వరగా విరమించాడు. ముందర ఉన్నవారిని చూచాడు. ఆతడు శాస్త్ర ప్రకారము వారిని పూజించి రైత్వుడు ఇట్లా అన్నాడు. (28) ఓ యమున ! ఓ గంగ ! ఓ పావనాశిని గయ ! ఈ గంధమాదన పర్వతమందు మీరు వాడు సన్నిధిలో ఉండండి. (29) ఎక్కడ భూమిని ఛేదించి మీరు ఇక్కడ పైకి వచ్చారో, అవి మీ పేరుతో పుణ్యతీర్థములు కావాలి (30) అట్లాగే కానిమ్మని వలికి అక్కడ వారు తొందరగా అంతర్థానమైనారు. నాటినుండి ఆ తీర్థములు మూడు భూమియందు (31) వారి వారి పేర్లతో ఎప్పుడూ జనులతో పొగడబడుతున్నాయి. ఎక్కడ భూమిని ఛేదించుకొని యమున బయటకి వచ్చిందో అప్పుడు (32) ఆ ప్రదేశము జనులతో యమునా తీర్థమని పిలువబడుతోంది. ఏ వృథివీరంధ్రమునుండి గంగ త్వరగా పైకి వచిందో (33) ఆది లోకంలో పాపనాశకమైన గంగా తీర్థముగా ప్రసిద్ధి చెందింది. ఎక్కడి నుండి గయ మనుష్యరూపధారియై పైకి వచ్చిందో (34) ఆ భూవి వరమే గయా తీర్థమని చెప్పబడుతోంది. ఈ విధముగా మహా పుణ్యప్రదమై, ఉత్తమమైన ఈ తీర్థములు మూడు (35).

రైత్వుని మంత్ర ప్రభావముతో వృథివి పై తొందరగా లేచిన ఈ తీర్థత్రయమందు స్నానం చేసిన నరుల (36) అజ్ఞానము నశించి, వారికి జ్ఞాన ముదయిస్తుంది. తన మంత్రంతో నమాకృష్టమైన ఆ తీరత్రయ మందు ఆముని (37) రోజు స్నానం చేస్తూ ఆతడు కాలాన్ని గడిపాడు. ఈ కాలంలోనే జానశ్రుతి అనే గొప్పరాజు, (38) పుత్రుడను పేరుగల రాజర్షి పౌత్రుడు ధర్మైక బుద్ధి గలవాడు, శ్రద్ధతో యాచకులకు అన్నాదులను ఇవ్వతగిన వానిని ఇస్తూ ఉండటం వల్ల (39) ఈతనిని జనులు లోకంలో శ్రద్ధాదేయుడు అని అన్నారు. ఎక్కువ మాటలు, అన్నంకంటే గూడా రాజు (40) ఆకలిగొన్న అతిథుల తృప్తి కొరకు మాట్లాడేవాడు. అందువల్ల అర్శలందరు బహువా క్యుడని అన్నారు. (41) ఆ పౌత్రాయణరాజు, జనశ్రుతని నుతుడు బలవంతుడు ప్రియాతిథి) అతిథి (ప్రియుడైనాడు. బహదాయి కూడా ఐనాడు. (42) నగరములందు రాష్ట్రములందు గ్రామములందు వనములందు, అన్ని నాలుగు మార్గముల కూడలిలో, అన్ని మరో మార్గములలో (43) బహు అన్నపానములతో కూడి నూ వశాణాదులతో కూడి, అర్థిజనుల తృప్తి కొరకు ఆతిథ్యాన్ని కల్పించాడు. (44) ఇక్కడ అర్శులు అన్న పానాదికము అంతా ఉపయోగించండి. అని ఆ రాజు అక్కడక్కడ జనులున్నచోట చాటింపు వేయించాడు (45) ఆప్రియాతిథి, బహు దాయి యాచకులకు దానశెండుడైన రాజుగుణములు అంతట ప్రసిద్ధమైనాయి (46) గుణ నమూహముగల ఈ పౌత్రాయణుని అనుగ్రహమును కాంక్షించి మహా భాగులైన దేవరులు (47) హంసరూపమును ధరించి ఎండాకాలంలో రాత్రిపూట, రమణీయమైన శ్రేణులుగా ఏర్పడి ఆకాశమార్గంగా (48) మేదకిటికీ వద్ద ఉన్న ఆ రాజుగారి పై భాగంలో ఎగిరి ఎగిరి వేగంగా ఇంకా పైకి పోయారు (49) వేగంగా ఎగురుతున్న ఆ హంసల వెనుకవెళ్తూ, ఒక హంన, ముందు వెళ్తున్న హంసను నంబోధిస్తూ (50) వెక్కిరిస్తూ రాజు వింటుండగా ఇట్లా పలికింది. ఓ భల్లాక్ష ! ఓ భల్లాక ముందుకెళ్తున్న మరాళమ (51) ముందు సౌథం మధ్య జానశ్రుతుని నుతుడు రాజు, ఉన్నాడు. ఈతడు పూజనీయుడు, గుడిదానివలె చూడటం లేదా ఏమి (52) ఆ బ్రహ్మ భవనము నుండి ఇది ఈతని తేజస్పు తీరన్కరించరానిది. అనంత ఆదిత్యుల వెలుగువలేనున్నట్టిది ముందట బాగా వెలుగుతోంది. (53) ఆ రాజర్షిని అతిక్రమించి నీవు పైన వేగంగా పోవదు. ఒక వేళపోయిన యెడల ఆ తేజస్సు ఇప్పుడు నిన్ను శాసించగలదు (54) అని పలుకుతున్న ఆ హంనతో ముందున్న హంస ఇట్లా పలికింది. (541/2)

నీవు తెలిసిన వాడివి. వండితులతో పొగడబడే దానివి (55) శ్లాఘించతగని మోసగానిని ఈతనిని ప్రశంసిస్తున్నావు. అల్పమైన ఈతనిని నీవు ఎందుకు ప్రశంసిస్తున్నావు (58) ఎత్తివలె, వశువువలె కేవలం శ్వాసధారియైనది ఈతని ప్రశంస. ఈ పృథివీపతి ధర్మముల రహస్యాన్ని ఎరుగడు (57) సయుగుడు బ్రాహ్మణోత్తముడు రైత్వుడు ఎంత బ్రహ్మజ్ఞానో ఈతకంతకాదు. రైత్వుని మహాజ్యోతి రహస్యము దేవతలు కూడా తెలుసుకోలేదు (58) ప్రాణ మాతృడైన ఈతని తేజను అటువంటిది కాదు. రైత్వుని వుణ్యరాశులు ఇంత అని చెప్పవీలుకానివి (59) భూమియందలి ధూళి రేణువులను లెక్కించవచ్చు, అకాశంలో తారకలను లెక్కించవచ్చు. రైత్వుని పుణ్యమనే మహామేరు నమూహమును లెక్కించలేము. (60) నశ్వరమైన ఈ ధర్మములుండనీ. ఆముని బ్రహ్మజ్ఞానము అధ్యము అందుకే ఆతడు పొగడబడుతున్నాడు. (61) జానశ్రుతికి అటువంటి ధర్మమే లేదు. యోగీంద్రులకే దుర్లభమైన ఆ జ్ఞాన వైభవము ఈతనికెక్కడ లభిస్తుంది. (62) దురాత్ముడైన వరాతుడైన ఈ మనిషిని వదలండి. నయుగుని రైత్వుని మునిని మీరు పొగడండి (63) జన్మతో తుంటివాడైనా తను స్నానం చేయటం కొరకు మునీశ్వరుడు గంగయమున గయ నదులను (64) మంత్రంతో నిజ ఆశ్రమ సమీపానికి పిలిచాడు. ఆబ్రహ్మవిదుడైన రైత్వుని ధర్మసంచయమందు (65) త్రైలోక్యం మధ్యభాగంలో ఉండేవారి ధర్మసమూహములు అంతర్భవిస్తాయి. రైత్వుని ధర్మకక్ష మాత్రము త్రిలోకములందుండే (66) ప్రాణుల ధర్మక క్షయందు మాత్రము అంతర్బవించదు. అని ముందున్న హంస వలికి విరమించాక (67) హంసరూపులైన మునీంద్రులు తిరిగి బ్రహ్మలోకమునకు వెళ్ళారు (671/2)

ఆరింద ముడు పౌత్రాయణుడు రాజు ఐన జానశ్రుతి (68) పరమావధియైన రైత్వుని గూర్చి అత్యంత ఉత్కరతో విని పాచి కలలో ఓడిన వరాకునిలా మిక్కిలి విషణ్ణ వదనుడైవాడు (69) మాటిమాటికి విశ్వసిస్తు ఆరాజు ఆలోచించసాగాడు. హంస రైత్వుని గొప్ప చేస్తూ నన్నుని కృష్ణుడని అంది (70) రైత్వుని మహత్తు ఎంత గొప్పది. వక్షులు గూడా అతన్ని ప్రశంసిస్తున్నాయి. అందువల్ల ఈ సంసారాన్ని వదలి రాజ్యాన్నంత వదలి ఇవ్వడు (71) సయుగ్వుడైన మహాత్ముని శరణు వేడుతాను. దయగల ఆ రైత్వుడు శరణు అని వచ్చిననన్ను (72) స్వీకరించి తన విజ్ఞానాన్ని నాకు బాగా ఉపదేశిస్తాడు. అని అతడు ఆలోచిస్తూనే ఏదో ఒకరకంగా (73) నే ఉద్వేలమైన ఆ రాత్రిని గడిపాడు. రాత్రి చివరరాగానే వంది బృందము చేసిన (74) మంగలరవమును తూర్యముల ఘోషతో కూడా విన్నాడు దానిని విని మహారాజు వడక మీద ఉంటూనే (75) సారథిని తొందరగా ఏలిచి సాదరంగా ఇట్లా అన్నాడు. సారథి తొందరగా వెళ్ళి రథమెక్కి వేగంతో (76) మహరుల ఆశ్రమాల్లో పుణ్యమైన అడవులలో, ఒంటరి ప్రదేశాలలో సజ్జనుల నివాస స్థానాలలో (77) తీర్థముల నదుల ఒడులలో, ఇసుక ప్రదేశములలో ఇతర ప్రదేశములలో మునులున్న చోట (78) ఆ అన్ని చోట్ల యోగీంద్రుడు, పంగుపు, శకటమందున్నవాడు ధర్మములన్నింటికి ఒకే ఆ ధారము ఐన రై ర్వుడను పేరుగలవానిని (79) బ్రహ్మజ్ఞానమునకు నిలయమైన వానిని సయుగుని వెతుకు. తొందరగా వెతికి నా సంతోషం కొరకు తిరిగి రా ఓ సారధి! అనీ చెప్పగా (80) ఆతడు అట్లాగే అని చెప్పి బయలుదేరి వేగముగల రథమందధిరోహించి బ్రహ్మవిదుడైన రైక్వమునిని అంతటా వెతకసాగాడు. (81) పర్వత గుహలలో మునుల ఆశ్రమాలలో, అక్కడక్కడ వెతుకుతు భూమి అంతా తిరిగాడు. (82) వివిధ దేశములను సారధి వేగంగా వెతికి క్రమంగా మహర్పులతో నిండిన గంధమాదనమునకు వెళ్ళాడు (83) అక్కడ కూడా వెతుకుతూ ఆతడు ఆ మునీశ్వరుని చూచాడు. దురదను గోక్కుంటున్న, బండ్లుండేచోట ఉన్న (84) నిష్కలమైన అద్వైత బ్రహ్మను గూర్చి ఎవ్వడూ చింతించే సయుగ్వుని మహామునిని అక్కడ చూచి సారధి (85) ఈతడు రైక్వుడని గ్రహించి అతని దరికి చేరి నమస్కరించి ఆతని సమీపమందు కూర్చొని వినయంతో మునిని అడిగాడు (86).

సయుగ్వుడు రైత్వుడు అను పేరుగల వారు ఓ బ్రహ్మ! మీరేనా అని అనగా అతని మాటలను విని ఆ మునీ ఇట్లా సమాధానము చెప్పాడు (87) నేను సయుగుణి, రైత్యుణి కూడా అని అనగా ఆ ముని మాటలను విని, అనేకమైన గుర్తులను బట్టి కూడా గ్రహించి (88) కుటుంబ పోషణ కొరకు ఈతనికి ధనేచ్ఛ కలదని గ్రహించి గంధమాదనం నుండి తిరిగివచ్చి అంతారాజుగారికి చెప్పాడు (89) సారధి మాటలను జానుతి ఆదరంతో విని ఆరునూర్ల గోవులను నిష్కభారము ధనము (90) అశ్వతరితో కూడిన రథమును తీసుకొని వేగంగా పౌత్రాయణ రాజర్షి ఆ రైత్వుని గూర్చి బయలు దేరాడు (91) వెళ్ళి ఆ రైత్వునితో రాజు ఇట్లా అన్నాడు - భగవాన్ రైక్వ! సంయుగ్వ! నేనిచ్చేదాన్ని స్వీకరించు (92) గోవులు షట్ శతము, నిష్కభారము (108వడలు) ధనము కంచరగాడితో కూడిన రథము నావాటిని స్వీకరించు (93) వీటన్నిటిని స్వీకరించి ఓ బ్రహ్మనన్ను ఆనుశాసించు. నాకు అద్వైత బ్రహ్మవిజ్ఞానాన్ని ఉపదేశించు (94) అనే ఆతని మాటలను విని స్పృహ కలవాడై తొట్రుపడుతూ, సయుగుడు రైత్వుడు అరిందముడైన జానశ్రుతితో ఇట్లా అన్నాడు (95) రైక్వోక్తి - ఈ ఆవులు నిష్కభారము రధమునీకే ఉండని. బహంకల్పములలో జీవించే నాకు ఈ అల్పమైన దానితో నేమి (96) కుటుంబ పోషణకు ఇది సరిపోదు. దీనికి వందరెట్లు నీవు నాకిచ్చినా (97) అది కుటుంబపోషణకు సరిపోదు ఓ రాజ ! అనే రైత్వుని మాటలను విని జానశ్రుతి ఇట్లా అన్నాడు (98) జానశ్రుతి మాటలు - నీవు ఉపదేశం చేసే బ్రహ్మ జ్ఞానమునకు ఇది మూల్యముకాదు, గోధసముఠాని రథముకాని ఓ బ్రహ్మ (99) నా ఈ గోవులు మొదలగు వానిని స్వీకరించినా స్వీకరించకపోయినా ఓ బ్రహ్మ నిష్కల అద్వైత విజ్ఞానమును నాకు ఉపదేశించు. అతని మాటలను విని సయుగ్వుడు ఇట్లా అన్నాడు (100).

రైత్వునిమాట - సంసారమందు నిర్వేదము కల్గిన వాడు పుణ్యపాపముల యందు నిర్వేదము కలవాడు (101) ప్రారబ్దములు నశించినవాడు జ్ఞానోపదేశమును పొందుటకు ఆరుడు. నీకు సంసారమందు నిర్వేదము కలిగినా (102) పుణ్య పాపముల నాశము కలుగలేదు. పుణ్యపాపముల నంమములు పునర్జన్మకు కారణములు (103) అనుభవము లేకుండా వాటికి నాశముండదు. ఓ మహారాజ ! ఐనా నీకు వాటినా శోపాయమును ఈ వేళ నేను చెబుతాను (104) నన్ను శరణు వేడావు కనుక శ్రద్ధతో విను. ఇక్కడ అభీష్టములనిచ్చే పుణ్యప్రదమైన మూడు తీర్థములున్నాయి (105) మోక్షంకోరే వారందరి నర్వప్రారబ్ధములను నశింపచే సేవి. ఇవి యమునా తీర్థము, గంగా తీర్థము (106) గయాతీర్థము త్వరగా వీనిలో స్నాన మాచరించు. అప్పుడు ప్రారబ్ధమంతా నశిస్తుంది. ఇందులో అనుమానం లేదు (107) పిదప శుద్ధచితుడవైన నీకు జ్ఞానాన్ని కూడా ఇస్తాను. అని రైక్వముని అనగా ఆనందంతో విప్పారిన కళ్ళు కలిగి (108) త్వరగా వచ్చి మూడు తీర్థములలో ఆతడు స్నానం చేశాడు. ఆ తీర్థ స్నానమాత్రం చేతనే రాజు శుద్ధచిత్తుడైనాడు (109) గురువైన నయుగ్వుని రాజు సమీపించాడు. నయుగ్వుడైన రైత్వుడు కూడా మునీంద్రులకు కూడా దుర్లభమైన (110) జ్ఞానమును జనశ్రుతికి దయతో ఉపదేశించాడు. ఆతడు బ్రహ్మ స్వరూపమైన విజ్ఞానాన్ని ఉపదేశించగానే (111) రాజు సుఖకరమైన అనుభవం కలవాడైనాడు. రైక్వయోగి అనుగ్రహంవల్ల బ్రహ్మరూపమును పొందిన ఈ రాజునకు (112) కుండ గోడకు నూలము (గరిసె) మొదలగు స్వరూపము గల ఈ ప్రపంచము స్పురించలేదు. మాయను ఛేదించుకొని కేవలం బ్రహ్మయే ఐనాడు (113) ఈ విధముగా మూడు తీర్థములలో స్నానం చేయటంవలన జానశ్రుతిరాజు యోగి బృందములకు దుర్లభమైన బ్రహ్మ భూయత్వమును పొందాడు (114) ఆ మూడు తీర్థముల వైభవాన్ని ఈ విధంగా మీకు చెప్పాను ఓ బ్రాహ్మణులార ! ఈ అధ్యాయమును చదివిన వారు మూడు తీర్థముల వైభవమును విన్నవారు (115) అజ్ఞాన తిమిరము నశించి బ్రహ్మ భూయంతో సమానమౌతారు (116) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు యమున గంగ, గయ తీర్థ ప్రశంస యందు జనశ్రుతికి జ్ఞానం రావట మనునది ఇరువది ఆరవ అధ్యాయము 26.