స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

50వ అధ్యాయము

తా శ్రీ సూతులిట్లనిరి - ఇక ఇక్కడి నుండి సేతు మాధవుని వైభవాన్ని చెబుతాను. మిక్కిలి పుణ్యప్రదమైనది పాపమును హరించేది ఐన దీనిని ఓ మునులార! భక్తితో వినండి. (1) పూర్వం పుణ్యనిధి యను రాజు సోమకులమందు వుట్టినవాడు హాలాస్యేశ్వరునిలో అలంకరించ బడ్ఢ మధురను పాలించసాగాడు (2) ఒకసారి ఆరాజు చతురంగ బలముతో కూడినవాడై అంతఃపుర పరివారముతో కూడి మధుర యందు తన కుమారుని (3) ఉంచి స్నానం చేయట మందు కుతూహలము కలవాడై రామ సేతువునకు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి ధనుష్కోటి యందు సంకల్ప పూర్వకముగా స్నానం చేసి (4) అక్కడ ఉన్న ఇతర తీర్థములందు ఆ మహారాజు స్నానం చేశాడు. భక్తి పూర్వకముగా రామేశ్వర దేవుని సేవించాడు కూడా (5) ఈ విధముగా ఆతడు చాలా కాలము సుఖముగా అక్కడే నివసించాడు. పుణ్యప్రదమైన గంధమాదన పర్వతమందు రామ సేతువు యందు (6) ఉంటూ ఒకసారి రాజు విష్ణువునకు ప్రీతికరమైన యజ్ఞమాచరించాడు. యజ్ఞము యొక్క అవసానమందు ఈ రాజు సంతోషంతో అవభృథస్నానము యందు కుతూహలము కలవాడై (7) ఆదరంతో, పరివారంతో కూడి, రామ ధనుష్కోటి యందు స్నానం చేశాడు. రామనాథుని సేవించి ఆతడు తన గృహాన్ని ప్రవేశించాడు. ఓ ద్విజులార ! (8) ఈ విధముగా ఈ వుణ్యనిధియైన రాజు నివసిస్తుండగా అప్పుడు ఒకసారి లక్ష్మి విష్ణువుతో వినోదమునకైన తగాదాతో వ్యాకులమై (9) విష్ణువుతో ఒప్పందము చేసి రాజు భక్తిని పరీక్షించుటకై లక్ష్మి కమలాలయ వైకుంఠమునుండి విష్ణువుతో పంపబడి (10) ఎనిమిది సంవత్సరముల వయస్సు కలిగిన రూపం కలదై గంధమాదనమునకు బయలుదేరింది. అక్కడికి వచ్చి ఆకమలాలయ ధనుష్కోటి యందు నివసించింది. (11) ఓ ద్వీజులార ! ఆ సందర్భముయందు గుణ నిధి యైన ఆరాజు రామధనుష్కోటి యందు స్నానం చేసి భార్యతో సైనికులతో కూడి వెళ్ళాడు (12) అక్కడికి వెళ్ళి ఆ రాజు నియమ పూర్వకముగా స్నానం చేసి తులా పురుషము మొదలగు ముఖ్య దానములన్ని సంపూర్తిగా చేసి (13) భవనమునకు వెళ్ళ ధలచిన ఆతడు ఒక కన్యను చూచాడు. మంచి రూపం కలది ఎనిమిది సంవత్సరములు కలది స్వచ్ఛని చిరునవ్వు గలది (14) రాజు ఆమెను అందమైన కళ్ళు గలదానిని కన్యను, అందమైన చిరునవ్వు గల దానిని, చక్కని పలువరున గలదానిని, దొండపండు వంటి పెదవి గల దానిని, సన్నని నడుము గల దానిని చూచి ఇట్లా అడిగాడు (15)

తా పుణ్యనిధి వచనము - ఓకన్య! నీవెవరు. ఎవరి కూతురవు. ఎక్కడి నుండి నీవు ఇక్కడికి వచ్చావు. ఓ బాలిక, స్వచ్చమైన నవ్వు గలదాన, నీవిక్కడికి ఏమి పనికై వచ్చావు (16) ఈ విధముగా ఆ రాజు ఆ కన్యను కలువకన్నుల దానిని అడిగాడు.ఇట్లా అడుగబడి అప్పుడు ఆ కన్య రాజుతో ఇట్లా అంది (17) నాడు తల్లి లేదు. తండ్రిలేడు. నాకు బంధువులు లేరు. ఓ మహారాజా నేను అనాధను నేను నీ కూతురునౌతాను (18) ఓ తండ్రి నిన్నెప్పుడు చూస్తూ నీ ఇంట్లోనే వుంటాను. నన్ను బలవంతంగా ఆకర్షించిన నా చేతిని గ్రహించిన వానిని నేను స్వీకరిస్తాను. (19) ఓ రాజ, నీ వు శాసిస్తే నేను నీ ఇంట్లో నీ కూతురునై ఉంటాను. చాలాకాలము, ఓ గుణనిధి, ఓ తండ్రి (20) అని ఆమె అనగా అప్పుడు ఆ కన్యతో గుణ నిధి రాజు ఇట్లా అన్నాడు. ఓ కన్యక, శుభమైన దాన, నీవు చెప్పినదంతా నేను చేస్తాను. (21) నాకొక కొడుతున్నాడు, కులముద్ధరించేవాడు కానీ నాకు కూతురులేదు. ఓ భద్రప్రదురాల, నీకిష్టమైన వానికి నిన్ను నేనిచ్చి వివాహం చేస్తాను. (22) ఓ కన్య నా ఇంటికి రా నా అంతః పురంలో నివసించి ఓ అనిందిత, నా భార్యకు కూతురుపై స్వేచ్చగా ఉండు (23) అని రాజనగా ఆ కమలలోచనియైన కన్య అట్లాగే కానిమ్మని రాజుతో పలికి అతనితోపాటు ఇంటికి వెళ్ళింది (24) శుభమైన ఆ కన్యకను రాజు తన భార్యచేతికిచ్చాడు. అప్పుడు రాజు వింధ్యావలియను తన భార్యతో ఇట్లా అన్నాడు. (25) ఓ శుభ! వింధ్యావలి, రాణి ఈమే మన కన్యక, ఓ ప్రియ, నీవు ఇతర వురుషుల నుండి అన్ని విధముల ఈమెను రక్షించు (26) అని రాజువలుకగా ఆ భార్య వింధ్యావలి అప్పుడు అట్లాగే, నరే అని అంగీకరించి ఆ కన్యను వుత్రిగా చేతితో స్వీకరించింది (27) రాజుతో ఆకన్యక కూతురులాగ పోషింపబడి పాలింపబడి, రాజు భవనంలో ఎప్పుడు లాలించబడుతూ చాలా నుఖంగా వరించింది.(28) పిదప జగన్నాథుడైన విష్ణువు ఆదరంతో లక్ష్మిని వెదురుటకు గరుడుని అధిరోహించి వైకుంఠమునుండి బయలుదేరాడు, ఓ ద్విజులార ! (29) ఆతడు వైకుంఠమునుండి బయలు దేరి దాటి ఆకాశమార్గమును దాటి, అనేక దేశములు తీరిగాడు.కాని అక్కడ లక్ష్మిని చూడలేదు (30) గంధమాదన పర్వతమందు రామ సేతువునకు వచ్చాడు. రామ సేతు వంతట ఇందిరను వెతుకుతు తిరిగాడు (31).

తా ॥ ఈకాలంలోనే ఆమెమాలుతేవాలనే కోరిక తన ఖులతో కూడి ఆకన్యకభవనోద్యానంలోని పాద వ ములనుచేరింది. (32) చెలులతోపాటు అడవిలో పూలుతెంచసాగింది. ఓద్విజులారా! ఆపిదప విషవు వివరూపము ధరించి అక్కడికి వచ్చి (33) భుజము పైగంగాజలమునువహించిచేతియందుఛత్రము ధరించి,గంగాస్నానంచే సేద్విజునివలేతనరూపాన్నిధరించి (34) కుడిచేతి యందు కుశ గ్రంథులవవిత్రనుధరించి, శరీరంనిండా న్మమువనునిత్రిషుండ్రములతో శోభి నూ (35) శివనామములు జవ నూ రుద్రాక్షమాలను ధరించి, ఉత్తరీయముకలిగిశుచియైుజనార్దనుడువచ్చాడు, ఓవిప్రులారా! (36) వచ్చిన ఆబ్రాహ్మణుని చూచి ఆకన్యకస్తబ్దురాలైనిలబడింది. పుష్పములనుతెంపుతున్న, మనోహరమైన ఎనిమిది సంవత్సరములవయస్సుగల ఆమెను చూచాడు (37) చూచి ఆవిప్రుడు త్వరగామధురభాషిణియైన ఆకన్యనుబలవంతము చేసి ఈగరుడధ్వజుడు చేతితో గ్రహించాడు (38) అవ్వడు కన్యక చెలులతోపాటు అడవిలోఆక్రోశించింది. ఆఆక్రోశము ను వినిరాజువచ్చాడు. (39) కొద్ది మందిభటులతో పరివేష్టించబడిభవనోద్యానమునకు వెళ్ళాడు. వెళ్ళి, ఆకన్యను, ఆమెచెలి కత్తెనురాజుఅడిగాడు (40) ఓకన్యక చెలులతో కూడినీవిప్పుడు ఎందుకు ఏడ్చావు నీవుభవనఉద్యానవనంలోదు:ఖించేకారణంచేవ. (41) పట్టుదలలోలాగబడి, ఓనాకూతుర! ఎవరితోఅవమానింపబడ్డావు. అని అడుగగా ఆకన్య ఆగుణధియునురాజుతో బాష్పములు నిండి నముఖము గలదైన్నురాలై కోపంతో మిక్కిలిభయపడుతూఇట్లవలికింది (42) కన్యక వచనములు :- ఓపాండ్యనాథ నన్ను బ్రాహ్మణుడు బలవంతంగా వటుకున్నాడు. (43) ఒతండ్రిఈచెట్టు మొదట్లో ఆతడు ఏమాత్రం భయం లేకుండా కూర్చున్నాడు. ఆమె మాటలనుబుద్ధిమం తుడైనగుణనిధిరాజువిని (44) ఆతని బలంతెలుసుకోకుండా త్వరగా ఆవిప్రునిపట్టుకున్నాడు. రామనాథాలయమునకు తీసుకొనిపోయి బలవంతంగా వటుకొని (45) నంకెలతోళ్ళతో బంధించి ఆతనినిమండపమునకుతీసుకు వచ్చాడు. తన కూతురును ఓదార్చిరాజు ఆమెను అంతఃపురమున కుతీసుకువెళ్ళాడు (46) రాజున్వయముగాతనఅందమైన భవనమున కువెళ్ళాడు. అక్కడ రాత్రి నిద్రపోయి రాజుకలలోఆవిప్రునిచూచాడు (47)

తా ॥ శంఖచక్రగదాపద్మవనమాలలతో అలంకరింపబడినవానిని, కౌస్తుభమణితోఅలంకరింపబడినవక్షఃన్తలముకలవానిని పీతాంబరముధరించినవానినిహరిని (48) ప్రళయకాల (వర్షాకాల) మందలిమేఘమువంటకాంతిగలవానిని, మనోహరమైన వానిని, గరుడుని పై కూర్చున్నవానిని అందమై ననవ్వు, అందమై నవలువరునకలవానిని, మకర కుండలములతో ప్రకాశించు వానిని (49) విష్వక్సేనుడు మొదలగుకింకరులతో సేవించబడుతున్నవానిని, ఆదిశేషునిపడకయందునిద్రించినవానిని నారదాదిమునులతోపొగడబడు వానిని, (50) వికసించినకమలమందున్నతన కూతురునుచూచాడు. చేతతామరపూవును ధరించినదానిని, నల్లనివంకరతిరిగినశిరోజములు కలఆమెను (51) విష్ణువు యొక్కవక్ష:నలముస్థానముగాకలదానిని, ఎతైన ఉరోజు ములుకలదానిని, దిగ్గజములలోఅభి షేకింవబడే శరీరము కలదానిని శ్యామలవర ముకలదానిని పీతాంబరముక వ్పబడిన దానిని (52) బంగారు తామరలతో కూర్చబడి నమాలతో అలంకరింబడినశిరోజములుకలది, దివ్యమైన ఆభరణములశోభతో కూడినది, అందమైనహారములతో అలంకరించబడినది (53) అమూల్యమైనరత్నములతో కూర్చబడినముక్కెరతోశోభించునది.బంగారువతకముల ఆభరణముగలది, మొలనూలు, కొలి అందెలతో వెలుగొందునది (54) అగు మహాలక్ష్మిని తన కూతురును ఈరాజురాత్రియందుచూచాడు. ఈవిధముగారాజుకలలో ఆబ్రాహ్మణునితన కూరుతురును కూడాచూచి (55) త్వరగావడకనుండిలేచికన్యాగృహమునకుచేరాడు. కలలోఆమెను ఎట్లాగైతేచూచాడో అట్లాగే ఉన్నకన్యనుచూచాడు (56) సూర్యోదయంగానే రాజుఆకన్యనుతీసుకొని, బ్రాహ్మణుడున్నరామనాథాలయమునకువచ్చాడు. (57) ఆతడుమండవంలో హరిరూపియైన విప్రుని చూచాడు. వనమాలా దిచిహ్నములు కలిగి కలలో చూచినట్టి ఆతని రూపాన్నే చూచి విడువని తెలుసుకొనిరాజుఈశ్వరుడైనహరినిస్తుతించాడు. (58) పుణ్యనిధివచనము - కమలాకాంత నమస్కారము గరుడధ్వజ అనుగ్రహించు (59) శార్ణపాణినీరునమస్కారము. అవరాథమునుక్షమించు. ఓచక్రపాణి, శ్రీయ:వతి, వుండరీకాక్ష నమస్కారము. (60) కౌన అలంకార ముచిహ్నముగాగల, శ్రీవత్సముచిహ్నముగాల నీ కునమస్కారము. బ్రహ్మను షుత్రునిగా గల, దైత్యసంఘమునునాశన మొనర్చిననీకునమస్కారము (61) అశేషభువనములకు వాసస్థానమైన నాభియందు తావురపూవును కలిగినవాడ, మధుకైటభనంహారి, రావణనాశకనీరునమస్కారము (62) ప్రహ్లాదుని రక్షించినవాడ, ధరిత్రికభర్తయైనవాడనీకునమస్కారమునీరుణ, అప్రమేయ, విషు బుద్ధిసాక్షినమస్కారము (63) శ్రీనివాన, పరమాత్మ జగత్తునునృజించేవాడ, నారాయణ, దేవ, కృష్ణ, మధుద్వేషి (64) వంకజనాభ నీ తు న ముస్కారము. వంకజముల వంటి కన్నులు కలవాడనమస్కారము. వకంజ ములను హస్త ముందు గలలక్ష్మికిపతియైనవాడ, వంకజములవంటి పాదములు గలవాడనీకు నమస్కారము. (65) జగన్నాథవంకజములను మాలగాగలవాడ మరల మరల నమస్కారము. ఓదయామూర్తి నీకునమస్కారము. నాఅవరాధమును క్షమించు (66) ఓమధుసూదననేను సంకెలలతో త్రాళ్ళతోనిన్నుబంధించాను. నయహీనుడనైనీస్వరూపమునుగుర్తెరుగకచేశానుప్రభూ! (67) అందువల్లఓమధుసూదననా అవరోధాన్ని క్షమించు. అనిఈవిధంగా పుణ్యనిధియైనరాజుమహావిష్ణువును స్తుతించి, ఓద్విజులార !

తా ॥ నమస్త ప్రాణుల ఆనందము కొరకు లక్ష్మిని స్తుతించాడు ఇట్లా - జగత్తులను ధరించేదాన, విష్ణువుయొక్క వక్షః స్థలము స్థానముగా కలదాన, దేవి నమస్కారము (69) నముద్రమందు ద్భవించినదాన, మహాలక్ష్మి, వారికి ప్రియమైన దాన, నీకు నమస్కారము. నిధి,పుష్టి (ఈడేర్చుదాన, సమృద్ధి కలిగించుదాన) న్వధ, స్వాహ నీకు ఎల్లప్పుడు నమస్కారము (70) సంధ్య, ప్రభ, ధాత్రి రూపిణి, ఐశ్వర్యకారి నీకు నమస్కారము శ్రీధ, మేధ, సరస్వతి ఐనదాన నీకు నమస్కారము (71) యజ్ఞ విద్య, మహావిద్య,గుహ్యవిద్య, ఆతీశోభన, ఆత్మవిద్యఐనదానసర్వప్రాణులకు ముక్తి నిచ్చుదాన, ఓదేవేశి (72) త్రయిరవ, జగన్మాత జగద్రక్షణచే సేదాన, సృష్టిస్థిత్యంతఠారి, నీవుకృపాదృష్టితోనన్నురరక్షించు (73) బ్రహ్మనుగన్న తల్లి, మహేశ్వరి నీకు మరి మరి నమస్కారములు అని మహాలక్ష్మిని ప్రార్థించి మాధవుని ప్రార్థించసాగాడు (74) ఓ విషు! అజ్ఞానం వల్ల నేను నీ విషయంలో ఇప్పుడు చేసిన దోషాన్ని పాదమందు నంకెలలు వేసిన ఆ ద్రోహాన్ని నీవు క్షమించు (75) ఈ లోకములన్ని నీకు సంతానము. ఓ సారి ఈ జగత్తునకు నీవు తండ్రి.. ఓ మధుసూదన ! కొడుకుల అపరాధాన్ని తండ్రులు క్షమించాలి (78) అపరాధులైన రాక్షసులకు నీరూపాన్ని కూడా ఇచ్చావు. ఓ వీష్ము! నీవు నా ఈ అపరాధాన్ని కూడా క్షమించు (77) ఓ భగవాన్ ! చంపటానికి వచ్చిన పూతనను నీ పాదాంబుజములందు చేర్చుకున్నావు. అందువల్ల ఓ కృపానిధి నన్ను రక్షించు. ఓ లక్ష్మీకాంత, కేశవ నీ కృపాదృష్టిని నా మీద ప్రసరింప చేయి (78) శ్రీ నూతులిట్లన్నారు - ఓద్విజులార ! ఆ రాజు విష్ణువును ఇట్ల ప్రార్థించాక విషువు గంభీరమైన మాటలతో వుణ్యనిధి అనురాజుతో, ఇట్లా అన్నాడు. (79) విషువచనము - ఓ రాజ! నన్ను బంధించిన కారణముగా నీవు భయపడొదు. (80) నీ విప్పడు భక్తి వశుడవు. నీవు నాకు దగ్గరి వాడవైనావు. నీవిక్కడ నాకానందదాయకమైన యజ్ఞం చేశావు (81) కనుక, ఓ పుణ్యనిధి రాజా ! ఇప్పుడు నీవు నా భక్తుడవైనావు. అందువల్ల నేను భక్తి పాశముతో బంధింపబడి నీవుడనైనాను (82) ఓ శత్రునాశక ! నేను భక్తుల అపరాధమును ఎల్లప్పుడు క్షమిస్తాను. నీ భక్తిని తెలుసుకునే కొరకు నేను ఈమెను ప్రేరేపించాను (83) ఓ రాజ! లక్ష్మీనాడు ప్రియమైనది. ఇప్పుడు నీవు ఆమెను రక్షించావు. అందువల్ల నేను నీ విషయంలో సంతుష్టడనైనాను. ఈమె ఎల్లప్పుడు నా స్వరూపమే (84).

తా ॥ ఈమె యందు భక్తి కలవాడు నా భక్తుడుగా చెప్పబడుతాడు. ఈమె యందు విముఖుడైన వాడు నా ద్వేషిగా ఎల్లప్పుడు న్మరింపబడుతాడు. (85) నీవు ఈమెను భక్తితో పూజించావు కనుక నా పూజ కూడా చేసిన వాడివైనావు. ఎందుకంటే ఈమె నాకన్నా భిన్నమైంది కాదు కనుక (86) అందువల్ల ఓ మహారాజ! నా విషయంలో నీవు అపరాధం చేయలేదు. పైగా ఆమెను నీవు పూజించటంవల్ల నా పూజ చేసినట్లైంది. (87) నీవు నా భార్యతో మొదట చేసిన ఒప్పందం ప్రకారము ఆ ఒప్పందాన్ని రక్షించే కొరకు నన్ను బంధించావు (88) కనుక ఓ రాజా! నీ వినయంతో సంతుష్టుడనైనాను. నీవు ఇప్పుడు లక్ష్మిని రక్షించావు. ఆ లక్ష్మి నా స్వరూపురాలు. జగన్మాత, వేదమయి (89) ఓ భూవ! నీవు ఆమెను రక్షించటం కొరకు నాకు వేసిన ఈ బంధనము ఇష్టమైంది. ఓ రాజేంద్ర నీవు భయపడవదు (90) ఈ లక్ష్మి నీ కూతురు ఈవిషం సత్యమే. అనుమానం లేదు. అని విష్ణువు చెప్పాక, లక్షీభూవతితో ఇట్లా అంది. (91) లక్ష్మివచనము - ఓ రాజ! నీ విషయంలో నేను సంతుష్టురాలనైనోను. నీ గృహంలో నీవు రక్షించావు కనుక. నీ భక్తిని పరీక్షించే కొరకు నేను విష్ణువు ఇద్దరము కూడ (92) ప్రణయ కలహం నెవంగా ఇక్కడికి వచ్చాము, ఓ భూపతి ఓ వరంతవ ! నీ సహవానంతో, భక్తితోను మేమిద్దరము నంతుషులమైనాము (93) ఓ రాజ! మా దయవల్ల ఎల్లప్పుడు నీకు సుఖం కలగనీ. సర్వ భూమండల ఐశ్వర్యము నీకు తప్పకుండా ఎల్లప్పుడు కలగని (94) మా పాదయుగళమందు నీకు శాశ్వతమైన భక్తి కలగని. దేహాంతమందు పునరావృత్తిలేని నా సాయుజ్యము (95) ఓ రాజనీకు ఎప్పుడు కలగని అట్లాగే నీరు పావబుద్ధి కలగకపోని. విష్ణుభక్తి కలిగి నీబుద్ధి ఎల్లప్పుడు ధర్మమందు ఉండనీ (96) ఇట్లా రాజుతో వలికి లక్ష్మి విష్ణువు యొక్క వక్ష స్థలమునకు వెళ్ళింది. ఓ ద్విజ శ్రేషులార ! పిదప విష్ణువు రాజుతో ఇట్లా అన్నాడు (97) ఓ రాజ! నీవు నంకెలలతో నన్నిక్కడ బంధించావు గదా అదే రూపంతో సేతు మాధవుడను పేరు గలిగి ఇక్కడ ఉంటాను. (98) ఓరాజ! ఈ సేతువును నేను ఏర్పరచాను. దాన్ని రక్షించే కొరకు నేను ఉంటాను. భూతరాక్షన నంనుములనుండి భయము ఉపశమించే కొరకు నేను ఉంటాను (99) బ్రహ్మ కూడా రాత్రింబగళ్ళు సేతురక్షయందు నివసిస్తాడు శంకరుడు రామనాథుడను పేరుతో ఎల్లప్పుడు సేతువుయందు నివసిస్తాడు. (100) ఇంద్రాది లోకపాలురు ఆనందంతో ఇక్కడ నివసిస్తున్నారు. అందువల్ల నేనిక్కడ సేతుమాధవుడను పేరుతో నివసిస్తాను (101).

తా ॥ సేతు సంరక్షణ కొరకు, నర్వ ఉపద్రవముల ప్రశాంతికొరకు, అందరి ఇష్టసిద్ధి కొరకు సర్వపాపముల ప్రశాంతి కొరకు వేనిక్కడుంటాను (102) నీవు సంకెలతో బంధించిన నారూపాన్ని సేవించిన మానవులు వా సాయుజ్యాన్ని పొందుతారు. ఓ నృవ! అన్ని అభీష్టములను వారు పొందుతారు (103) నాయొక్క, లక్ష్మియొక్క నీ యొక్క చరిత్రను చదివిన వారు దారిద్ర్యాన్ని పొందరు. అంతేకాక, వారు ఐశ్వర్యాన్ని పొందుతారు (104) ఓ రాజ! నీవు చేసిన, లక్ష్మి యొక్క నాయొక్క ఈ స్తోత్రాన్ని చదివిన వారికి విన్న వారికి సంతోషంతో వ్రాసినవారికి (105) నా లోకం నుండి పునరావృత్తి ఎప్పుడు కూడా కలగదు. అని పుణ్యనిధి యను రాజుతో అప్పుడు ఆ హరి అక్కడ వలికి (106) అక్కడే పూర్వరూపంతో ఎల్లవ్వడు నన్నిధానంలో ఉంటారు. పుణ్యనిధియను ఆ రాజు సేతుమాధవ రూపమైన (107) ఆ విష్ణువును భక్తితో నమస్కరించి, మహాపూజను ఆచరించి, రామనాథుని సేవించి తన భవనమునకు వెళ్ళాడు (108) ఈతడు ఉత్తమమైన ఆ సేతువు యందు జీవితాంతము నివసించాడు. మధుర యందు తన పుత్రుని పాలకునిగా ఉంచాడు (109) అక్కడే ఉండి రాజు దేహాంతమందు ముక్తిని పొందాడు. అతని భార్య వింధ్యావలి కూడా అతనితో పాటు మరణించింది. పతివ్రత, వతియే ప్రాణముగా గలది, ఆమెకూడా సద్గతిని పొందింది. (110) శ్రీ నూతులిట్లన్నారు - భక్తియుక్తులై ఎల్లప్పుడు ఇక్కడ సేతుమాధవుని సేవించిన వారికి (111) కైలాసము నుండి పునరావృత్తి ఎప్పుడూ కలగదు. ఇక్కడ సేతుమాధవ సేవను చేయని నరులరు (112) రామనాథుని సేవ ఫలవంతముకాదు. సేతువు ఇసుకను విడిగా తీసుకొని గంగలో వేసిన యెడల (113) ఆ నరుడు మాధవ వురమందు, వైకుంఠ మందు ఉంటాడు. గంగకు వెళ్ళాలనుకునే విప్రులు సేతుమాధవుని సన్నిధియందు (114) సంకల్పము చేసి గంగకు బయలుదేరిన ఆయాత్ర నఫలమౌతుంది. గంగా సలిలమును తీసుకొచ్చి రామేశ్వరుని అభిషేకించి (115) సేతువు యందు ఆ భారమును ఉంచిన యెడల పరబ్రహ్మను పొందుతాడు, అనుమానం లేదు. అని ఓ విప్రులార ! మీకు సేతు మాధవ వైభవాన్ని చెప్పాను (116) దీనిని విన్న చదివిన వైకుంఠంలో స్థానాన్ని పొందుతారు (117) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతుమాహాత్మ మందు సేతుమాధవ ప్రశంస యందు పుణ్యనిది చరిత కథన మనునది ఏబదవ అధ్యాయము.