స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
46వ అధ్యాయము
తా ॥ శ్రీరాముల వచనము - ఓ వానరపుంగవ! పంపారణ్యమందు దీనులమైన మేము సుగ్రీవునితో స్నేహం నీచే చేయించబడి ఆశ్వాసింపబడినాము (1) నిన్ను చూచి తండ్రిని, బంధువులను తల్లియైన కౌసల్యను, వారందరిని మేము స్మరించటం లేదు. నీవు చాలా ఉపకారం చేశావు (2) నీవు బహు యోజనమైన నముద్రాన్ని మా కొరకు దాటావు. న గోత్తమమైనమైనాకుడు అరచేతి దెబ్బతో కొట్టబడ్డాడు (3) నాగమాతయైన నురనను నాకో నంనీవు జయించావు. మహాక్రూరమైన ఛాయాగ్రహాన్ని రాక్షసిని నీవు చంపావు (4) సాయంకాలమునకు సువేలను చేరి చేతితో లంకిణిని చంపి, ఓ మహాకపి ! నీవు వా కొరకు రావణ గృహానికి వెళ్ళావు (5) భయం లేకుండా నీవు రాత్రి యందు లంకలో సీతను వెదకి, సీతను కానక పిదప అశోకవనానికి వెళ్ళావు (6) సీతకు నమస్కరించి, అభిజ్ఞానమును ఇచ్చి నా కొరకు జానకి చేతి ద్వారా చూడామణిని తీసుకొని (7) ఓ మహాకవి! అశోక వనమందలి వృక్షములను విరగగొట్టావు నీవు. పిదప ఎనుబదివేల కింకరులను పేరుగల రాక్షసులను (8) రావణునితో సమానమైన వాళ్ళను, పదాతి అశ్వగజరథములతో కూడిన వారిని, మహాబల పరాక్రమములు కలవారిని నా కొరకు నీవు చంపావు (9) పిదప వచ్చిన ప్రహస్తుని కొడుకైన జంబుమాలిని, అగ్నివంటి వర్చస్సుగల మంత్రి తనయులను ఏడుగురుని (10) పిదవ ఐదుగురు సేనా పతులను నీవు యమ మందిరానికి పంపావు. పిదవ యుద్ధంలో నీవు అక్షయ కుమారుని చంపావు (11) పిదప ఇంద్రజిత్తు నిన్ను శుభమైన రాక్ష సేంద్ర నభకు తీసుకువెళ్ళాడు. అక్కడ లంకేశ్వరుని మాటలతో తృణీకరించి, అవమానపరచి (12) నా కొరకు నీవు వాయునందన లంకానగరాన్ని ధ్వంసం చేశావు. తిరిగి ఋష్యమూక మహాపర్వతానికి వచ్చావు (13) ఈ విధముగా నా కొరకు మహాదు:ఖాన్ని నీవను భవించావు. నా దు:ఖాన్ని అధికం చేస్తూ నీవిక్కడ భూమి పై నిద్రిస్తున్నావు. (14) ఓ వాయుజ! ఒకవేళ నీవు చనిపోతే నేను ప్రాణములను వదులుతాను. సీతతోగాని అనుజుడైన లక్ష్మణునితో గాని నాకేమివని (15).
తా ॥ భరతునితో కాని శత్రుఘ్నునితో కానీ శ్రీ తో కాని వనిలేదు. వారు రాజ్యంతో కూడా పనిలేదు. ఓ కవి! నీవు మరణిస్తే (16) వత! హనుమాన్ ! లే. ఇవ్వాళ్ళ భూమి పై పడుకున్నావేమి. ఓ మహాబాహు ! వానర! నిద్ర కొరకు నన్ను వడకగా చేసుకో (17) నా కొరకు కందమూల ఫలములు నీవు ఆహారంగా తీసుకురా. ఈ వేళ స్నానానికి వెళ్తాను త్వరగా కలశం తీసుకొనిరా (18) జింక చర్మము, వస్త్రములు, దర్భలు తీసుకునిరా. నేను బ్రహ్మాస్త్రంతో కట్టుబడిగా ఓ హరి! (కవి) నీవు నన్ను విడిపించావు (19) ఔషధంతీసుకు రావటం ద్వారా భ్రాతయైన లక్ష్మణునితో పాటు నేను విడిపించబడ్డాను. లక్ష్మణునకు ప్రాణమిచ్చినవాడవు నీవు. పౌలస్త్యుని మదమును నశింపచేసిన వాడవునీవు (20) యుద్ధంలో నీ సహాయంతో రావణాది రాక్షసులను అతి బలవంతులను వీరులను చంపి సీతను నేను పొందాను (21) అంజనాసూను హనుమాన్! సీతాశోకవాశక ! ఈవిధంగా నన్ను లక్ష్మణుని జానకిని వదలి (22) అయోధ్యకు మమ్మల్ని చేర్చకుండానే నీవెందుకు వెళ్లావు. మహారాక్షనులకు ముల్లులాంటివాడవైన మహావీర ఎక్కడికి వెళ్ళాను. (23) అని వానరుని ముఖంచూస్తూ రఘునందనుడు మాట్లాడకుండా, ఏడుస్తూ కన్నీళ్ళతో హనుమంతుని తడువసాగాడు (24) ఓ ద్విజులార! ఆ పిదప వాయుపుత్రుడు మెల్లగా మూర్చను వదలి, పౌలస్త్యుని భయముతో బాగా భయపడిన లోకములను రక్షించుట కొరకు వచ్చిన (25) మానుష భావాన్ని ఆశ్రయించిన నారాయణుని, ఆజనీ, విభుని, జానకి లక్ష్మణులతో కూడిన వానిని వానరులతో చుట్టబడిన వానిని (26) ప్రళయకాల మేఘమువలె నున్న వానిని యుద్ధవు ధూలి బాగా, పైన గల వానిని జటామండల శోభ గల వానిని, పుండరీకమువలె విశాలమైన కన్నులు గల వానిని (27) అనేక మార్లు యుద్దమందు భిన్నమైన వానిని రమునందనుని చూచాడు. దేవర్షి పితృకిన్నరులతో పొగడబడుతున్న శత్రుసంహారకుడైన (28) కృపాబాహుల్యము గల మనసు గల దశరథ రాముని చూచి రఘునాధుని కరస్పర్శతో పరిపూర్ణమైన శరీరము గల ఆ వానరుడు (29) ఓ ద్విజులార ! చేతులు జోడించి దండమువలె భూమి పై బడి చెవులకి పైన స్తోత్రములతో జానకీ వాథుని స్తుతించాడు (30) హనుమంతుని వాక్యము రామరూపుడైన హరునకు, విష్ణువునకు ప్రభవిష్ణువునకు, ఆది దేవునకు, పురాణ (ప్రాచీనమైన) దేవునకు, గదాధారికి నమస్కారము (31) వైకుంఠ మందు ఎల్లప్పుడు పుష్పకముందు ఉండే మహాత్మునకు, ఆనందించిన వానరుల నమూహంతో సేవింవబడే పాదాంబుజములు కలనీకు నమస్కారము (32).
తా ॥ రాష్ట్ర సేంద్రుని పొడిగా చేసిన, జగత్తుకు ఇష్టమును చేకూర్చిన, సహస్ర శిరస్పులు గలిగిన సహస్ర చరణములు కలిగిన నీకు నమస్కారము (33) సహస్రాక్షుడు, శుదుడు విష్ణువు రానువునకు నమస్సులు. భక్తుల ఆర్తిని హరించే సీతాపతియైన నీకు నమస్కారము (34) దైత్యరాజును చీల్చిన నరసింహుడైన హరికి, కోరతో భూమిని పైకెత్తిన వరాహుడవైన నీకు నమస్కారము (35) బలియజ్ఞమును భేదించిన త్రివిక్రముడవైన నీకు వామనరూపుడైన వానికి నమస్సులు. మందరమును ధరించిన వానికి నమస్పులు (36) మత్స్య రూపమును ధరించి వేద రక్షణకు కారణమైన నీకు నమస్సులు. క్షత్రియులనంతమొనర్చిన పరశురాముడవైన నీకు నమస్కారము (37) రాక్షసులను చంపిన రాఘవ రూపుడవైన నీకు నమస్సులు. మహాదేవుని మహా భయంకరమైన మహా ధనస్సును భేదించిన (38) క్షత్రియాంతకుడైన క్రూర భార్గవునకు భయకారణమైన అహల్యా సంతాపమును హరించిన, ధనస్సును హరించిన నీకు నమస్కారము (39) పదివేల ఏనుగుల బలము గల తాటక దేహమును హరించినవాడ రాయివలె కఠినమైన విశాలమైన తొలి పక్షమును ఛేదించినవాడ, (40) మాయామృగమును సంహరించినవాడ, అజ్ఞానమును హరించినవాడ, రావణుడనే దుఃఖ సముద్రము ఎండుటకు అగస్త్యరూపియైన వాడ (41) అనేక అలలతో కదులుతున్న సముద్ర మదమును హరించినవాడ, మైథిలి మనస్సనే తామరపువ్వునకు సూర్యుడైన వాడ, లోకసాక్షి (42) జానకీపతి, హరి, రాజేంద్ర ! నీకు నమస్కారము. రాజీవలోచన ! (తామర) తారకబ్రహ్మ నీకు నమస్కారము(43) రామునకు, రామచంద్రునకు, శేషునకు, సుఖమైన ఆత్మకలవానికి, విశ్వామిత్రునకు ప్రియమైనవానికి, ఖరనంహారికి, నీకిదే నమస్కారము (44) భక్తులకు అభయమిచ్చువాడ, దేవదేవేశ అనుగ్రహించు ఓ కరుణా సింధు నన్ను రక్షించు (45) వేదవాక్కులకు గూడా గోచరము కానివాడ, రామవ నన్ను రక్షించు రామ దయతో నన్ను రక్షించు నేను నిన్ను శరణు వేడుతున్నాను (46) రఘువీర ! వా మహా మోహమును ఇప్పుడు తొలగించు స్నానమందు ఆచమనమందు భుక్తి యందు మెలకువ యందు న్వప్నమందు సుషుప్తియందు (47) అంతట అన్ని అవస్థలయందు నన్ను రక్షించు ఓ రఘునందన నీ మహిమను స్తుతించుటకు ముల్లోకములలో ఎవడు వమరుడు (48) ఓ రఘునందన నీ మహత్తును నీవే గుర్తెరుగ గలవు అని వాయువుత్రుడు దయానిథియైన రామచంద్రుని స్తుతించి (49) భక్తితో కూడిన మనస్సుతో సీతను కూడా స్తుతించాడు.
తా ॥ ఓ జానకి ! నర్వపాప ప్రణాశినియైన నిన్ను నమస్కరిస్తున్నాను (50) దారిద్ర్యమనే యుధమును ఉపసంహరించే దానిని, భక్తుల అభీష్టమును ఇచ్చే దానిని, విదేహ రాజతనయను రామువునకు ఆనందముకల్గించు దానిని (51) భూమికి కూతురైన దానిని, విద్యను, మంగళకారిణిని, ప్రకృతి రూపిణిని నమస్కరిస్తున్నాను. రావణుని ఐశ్వర్యమును నశింపచేసిన దానిని భక్తులకు ఇష్టమైన దానిని నరస్వతిని (52) పతివ్రతలలో అగ్రగామియైనదానిని, జనకాత్మజను ఐన నీకు నమస్కరిస్తున్నాను. అనుగ్రహపరురాలను సమృద్ధి కలదానివి, పుణ్యాత్మురాలివి, హరివల్లభను (53) ఆత్మవిద్యను వేదత్రయరూపిణిని, ఉమారూపిణిని, నేను నమస్కరిస్తున్నాను. అనుగ్రహమునకు అభిముఖమైన దానిని లక్ష్మిని, క్షీరాబ్ది తనయను, శుభకరమైన దానిని (54) చంద్రునకు సహోదరిని, సర్వాంగము లందు సౌందర్యము కలదానిని, ఐన సీతను నమస్కరిస్తున్నాను. ధర్మమునకు నిలయమైన దానిని కరుణారూపిణిని, వేదమాతను నమస్కరిస్తున్నాను. (55) పద్మాలయను, పద్మహస్తను, విష్ణు వక్షః స్థనిలయను, సువర్ణస్థానమును, చంద్రునికాంతి వంటి ముఖము కలదానిని, ఐన సీతను నమస్కరిస్తున్నాను. (56) ఆనందస్వరూపిణిని, సిద్ధిని, శివను, శివకారిణిని, నతిని, విశ్వజననిని, రామచంద్రునికి ఇష్టమైన భార్యను నమస్కరిస్తున్నాను. తను అన్ని ఉత్తమమైన అవయవములు కలదానిని ఎల్లప్పుడు మనస్సులో భజిస్తాను (57) శ్రీ సూతులిట్లనినారు - ఈ విధముగా హనుమంతుడు సీతారామచంద్రులను భక్తితో స్తుతించి (58) ఆనంద బాష్పములతో తడిసి పోతూ మౌనంగా ఉన్నాడు. ఓ ద్విజులార ! వాయుపుత్రుడు చెప్పిన పావనాశకమైన ఈ (59) శ్రీరామ చంద్రుని మరియు సీతయొక్క స్తోత్రమును ప్రతిరోజు చదువులోగో ఆ నరుడు, ఎల్లప్పుడు మహదైశ్వర్యమును వాంఛితమును పొందుతాడు (60) అనేక క్షేత్రములను, ధాన్యమును ఈనిన పాలిచ్చే ఆవులను, ఆయుస్సును, విద్యను, పుత్రులను, మనోరమమైన భార్యను పొందుతాడు (61) ఈ స్తోత్రమును ఒక్క సారి చదివిన, పైవన్ని పొందుతారు అనుమానం లేదు. ఈ స్తోత్రాన్ని చదవటం వలన నరకమునకు వెళ్ళడు (62) గొప్పవైన బ్రహ్మహత్యాది పాపములు కూడా నశిస్తాయి. అన్ని పాపములనుండి నిర్ముక్తుడై దేహాంతమందు ముక్తిని పొందుతాడు (63) అని హనుమంతుడు జగన్నాథుని రామువుని స్తుతించగా సీతతో కూడి రాఘవుడు హనుమంతునితో ఇట్లనినాడు (64).
తా ॥ శ్రీరాముడిట్లనెను - ఓ నరశ్రేష్ఠ అజ్ఞానం వల్ల నీవీ సాహనం చేశావు. బ్రహ్మకాని విష్ణువుకాని ఇంద్రాది దేవతలు కాని (65) నేను స్థాపించిన ఈ లింగాన్ని పెకిలించటం సాధ్యం కాదు. మహాదేవునికి అపరాధంచేసిన కారణంగా ఈవేళ నీవు మూర్చితుడవైనావు (66) ఇక ముందు శూలియైన సాంబునకు ద్రోహమాచరించొద్దు. వేటి నుండి ఈడుండము నీ పేరుతో ముల్లోకములందు (67) ఖ్యాతి నొందని. ఓవానరోత్తమ నీవువడ్డ ఈ చోట స్నానం చేస్తే మహాపాతక సంఘములు నాశనమౌతాయి (68) మహాదేవుని జడనుండి పుట్టిన నరిత్శ్రేష్టమైన గౌతమి తనలో స్నానం చేసిన నరులకు అశ్వమేథ సహస్రముల ఫలమిచ్చేది (69) అంతకంటే నూరురెట్లు ఆధికమైనది గంగ, యమున, సరస్వతులు, ఓకపి! ఈ మూడు నదులు ప్రవహించిన చోటకన్న (70) అవీ కలిసినచోట స్నానము చేయుట వేయిరెట్లు ఎక్కువ ఫలాన్నిస్తుంది. ఓకపి! ఈ నదులలో స్నానం వల్ల నరులకు లభించే ఫలము (71) నీ ఈ కుండంలో స్నానం వల్ల నరులకు లభిస్తుంది. అనుమానంలేదు. దుర్లభమైన నరజన్మను పొంది హనుమత్కుండ తీరమున (72) భక్తి గల మనస్సుతో శ్రాద్ధం చేయని నరుని పితరులు కోపంతో నీరాశులై వెళ్ళి పోతారు (73) మునులు, ఇంద్రుడు అదీగా దేవతలు చారణులు ఇతని పై కోపగిస్తారు. హనుమంతుడి తీరమందు దానం చేయనీ, హోమము చేయని వాని (74) జీవితము వ్యర్థము. ఆతడు ఇక్కడ పరలోకంలో దుఃఖభాజనుడౌతాడు, హనుమత్కుండము ఎదుట తిలోదకమిచ్చిన వాని పితరులు ఆనందిస్తారు. వారు నేతిలువను తాగుతారు. (75) శ్రీ సూతులవచనము - ఓ విప్రులార ! రాముడు చెప్పిన ఈ మాటను విని హనుమంతుడు (76) ఆంనందంతో తాను తెచ్చిన లింగాన్ని రామనాధునకు ఉత్తర భాగంలో రామచంద్రుని ఆజ్ఞతో వాయుడు స్థాపించాడు (77) అందరి ఎదురుగా కపిలాంగూలము చుట్టబడినది. శివుడు కూడా ఆతోక వలన ఏర్పడిన మూడు రేఖలను వహిస్తున్నాడు. దానికి ఉత్తరదీగాగముందు ఆనందంతో గౌరిని స్థాపించాడు. (78) శ్రీ నూతులవచనము- ఈవిధముగా మీరు రానవుడు నరులకు భక్తి ముక్తినిచ్చే సేతు యందు లింగము నెందుకు స్థాపించారో చెప్పాను (79) ఈ అధ్యాయమును చదివినవారు, చక్కగా విన్నవారు ఇక్కడ పాపములన్ని పోగొట్టుకొని శివలోకంలో వెలుగొందుతారు (80) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏశీతి సహస్ర నంతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాపాత మందు రామనాధలింగప్రతిష్ఠా కారణ వర్ణవ మనునది నలుబది ఆరవ అధ్యాయము.
