స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

10వ అధ్యాయము

తా శ్రీసూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులారా! వేతాల వరదతీర్థమందు నరులు స్నానం చేసి, పిదప మెల్లమెల్లగా గంధమాదన పర్వతమునకు వెళ్ళాలి. నముద్రమందు సేతురూపంగా! గంధమాదనముంది. ఆ మార్గమును, బ్రహ్మలోకమునకు విశ్వకర్త నిర్మించాడు.  లక్ష కోటి సహస్రముల సరస్సులు నదులు పుణ్యప్రదమైన సముద్రములు, వనములు, ఆశ్రమాలు పవిత్రమైన క్షేత్ర సమూహములు, వేదార్య దికములు, వసిష్ఠాదిమునులు, సిద్ధచారణ కిన్నరులు లక్ష్మి భూదేవిలతో కూడిన విష్ణుమూర్తి, సావిత్రి సరన్వతులతో కూడిన బ్రహ్మ  గణపతి కుమారస్వామి ఇంద్రుడు మొదలుగా గల దేవతలు, ఆదిత్యాది గ్రహములు, ఎనిమిది మంది వనువులు పితరులు, లోకపాలురు, ఇతర దేవతాగణములు, మహాపాతక సంఘములను నశింపచేసే, లోకపావనమైన  గంధమాదన పర్వతమందు రాత్రింబవళ్ళు నివశిస్తున్నారు. ఇక్కడ గౌరీదేవి శివునితో కూడి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఎవ్వడూ కిన్నర కాంతల క్రీడ జరుగుతూ ఉంటుంది. దానిని చూచినంత మాత్రంలోనే నరులకు బుద్ధి సౌఖ్యం కలుతుంది దాని మూర్ధమందు సిద్ధ పౌరణ స్త్రీలు నివసిస్తూ గిరిజాపతియైన శంకరుని ఎల్లకాలము పూజిస్తూ ఉంటారు కోట్ల కొలది బ్రహ్మహత్యలు, కోట్లకొలది చేయరాని అక్రమ సంబంధాలు వీటి పావం, గంధమాదనపు గాలులు శరీరానికి తగిలినంతలో పోతుంది  ఇది అత్యధికంగా కల్లోలమైన సముద్రం మధ్యలో ఉండి, పూర్వం ఈ గంధమాదనము మునిగణములతో సేవింపబడుతుండేది పిదప నలుడు సేతువు నిర్మించాక దాని మధ్య కన్పిస్తూ రామాజ్ఞతో సమస్త మనుజులతో కూడా సేవించతగిందిగా ఉంది .

 తా ॥ సేతురూపైన ఆగంధమాదన పర్వతాన్ని ప్రార్థించాలి. ఓ క్షమాధర! మహాపుణ్య ! నర్వదేవతలచే నమస్కరింపబడేదాన ! వీష్ణ్వాది దేవతలు కూడా శ్రద్ధతో సేవించే నిన్ను నేను పాదములలో అక్రమిస్తున్నాను. ఓ పర్వత శ్రేష్టమా! పావ చేతనుడవైన నా పాదఘాతాన్ని దయతో క్షమించు. నీ శిరమందు నివాసమున్న శంకరుని నాకు చూపించు ఈ విధముగా సేతురూపమైన వర్వతశ్రేష్ఠమును నరుడు ప్రార్థించి, పిదప అడుగులు మెల్లగా వేస్తూ పవిత్రమైన గంధమాదనం పై వెళ్ళాలి గంధమాదన పర్వతమందలి సముద్రపు నీటిలో నరుడు స్నానం చేసి ఆవగింజమాత్రమైనా పిడదానం చేయాలి. యుగాంతమువరకు పితరులు తృప్తి నొందుతారు. శమీదలంతో సమానమైన వానినైనా పిండములను పితరుల గూర్చి ఇవ్వాలి స్వర్గమందున్న వారు మోక్షానికి వెళ్తారు. నరకమందున్న వారు స్వర్గానికి వెళ్తారు. పిదప దాని పైన లోకంలో ప్రసిద్ధమైన గొప్ప తీర్థము సర్వ తీర్థములలో ఉత్తమమైనది పుణ్యప్రదమైనది పాపనాశనమను పేరుగలది పుణ్యతమమైనది పవిత్రమైన గంధమాదనంలో ఉంది దావిని స్మరించిన మాత్రం చేతనే గర్భవాసము జన్మ ఉండదు. తమదేహమలాన్ని నశింపచేసే అక్కడికి వెళ్లి నరుడు స్నానమాచరించాలి. అక్కడ స్నానం చేసి నరుడు వైకుంఠాన్ని పొందుతాడు అనుమానం లేదు.

తా ఋషులిట్లనిరి - ఓ సూత! పాపవినాశమనే పేరు గల తీర్థముయొక్క వైభవాన్ని చెప్పండి. మీ వ్యాసుడు అన్ని బోధించారు. ఓ ముని మీకంతా తెలుసు. అని  శ్రీ సూతులిట్టవ్నారు - హిమవత్ పర్వతం యొక్క పార్వ భాగంలో బ్రహ్మ ఆశ్రమపదంలో జరిగిన శుభమైన కథను మీరు చెబుతున్నాను ఓ బ్రాహ్మణఋషులారా ! వినండి హిమవంతుని పార్శ్వ భాగంలో బ్రహ్మ ఆశ్రమ వదంలో ఈతని ఆశ్రమము పవిత్రమైంది అనేక వృక్షముల సమూహంతో నిండింది అనేక పొదలతో తీగలతో నిండింది. మృగములతో ఏనుగులతో సేవింపబడేది వదులతో చారణలతో కూడింది. అందమైనది పూలతోనిండిన అడవి కలది ఎన్న తగినవారెందరితోనో కూడింది. తాపసులతో శోభిస్తుంది. సూర్యుని వెలుగులా ఉండే మహానుభావులైన బ్రాహ్మణులతో నిండింది  నయమవ్రతములు గల తపస్వులతో నిండింది. యాగకారణంగా దీక్షితులైన వారితో స్థిరమైన ఆత్మకలవారితో నియతమైన ఆహారం కలవారితో నిండింది  వేదాధ్యయనముతో కూడిన వైదికులతో చుట్టబడింది. బ్రహ్మచారులు గృహనులు వానప్రస్తులు, భక్తులు తమ తమ ఆశ్రమములకు తగిన ఆచారములందు ఆసక్తి గలవారు, తమ వర్ణములకు చెప్పిన దానిని ఆచరించేవారు, వాలఖిల్యమునులు, మరీచులు వీరందరితో తుడింది ఈ ఆ ఆశ్రమ పదము ఆ ఆశ్రమంనకు పూర్వము ఒక శూద్రుడు దృఢమైన నిశ్చయం కలవాడు, సాహసి, సంతోషంతో బ్రాహ్మణుల దగ్గర ఏదైనా కొంచెం తెలుసుకోవటానికి వచ్చాడు. ఆశ్రమ ప్రాంతమునకు వచ్చి తపస్వులతో పూజింపబడి దృఢమతి అను పేరు గల ఆ చూద్రుడు వారికి సాష్టాంగ ప్రణామము చేశాడు ఆ మునులను దేవతలతో సమానమైన వారిని, గొప్ప తేజస్సు కలవారిని చూచి రకరకాల యజ్ఞాలను చేస్తున్న వాళ్ళను చూచి సంతోషించాడు. ఆ శూద్రుడు పిదప ఆతనికి గొప్ప తపస్సు చేయాలనే కోరిక కలిగింది. అప్పుడు ఆశ్రమ వదతులవతియైన తావనుని సమీపించి ఆమునితో ఇట్లా అన్నాడు .

తా దృఢమతి ఇట్లా అన్నాడు - ఓతపోధన ! నీకు నమస్కారము. ఓ దయానిధి! నన్ను రక్షించు. నీ దయవల్ల ధర్మాన్ని ఆచరించటానికి ఇష్టపడుతున్నాను అందువల్ల మీదగ్గరకు వచ్చిన నన్ను యాగమందు దీక్షితునిగా చేయండి! ఓ బ్రహ్మన్ ! వేను క్రింది వర్ణము వాడిని చూద్రుడను జాతివల్ల నేను శుబ్రష చేయదలిచాను. శరణువేడి నన్ను అనుగ్రహించండి. ఈరకముగా చూద్రుడు అన్నాక ఆ బ్రాహ్మణుడు అతనితో ఇట్లా అన్నాడు. కులవతి ఇట్లా అన్నాడు. హీన జన్మను పొందిన శూద్రుడు యాగదీక్షకుశక్తుడుకాడు వీడు నిజంగానే జ్ఞానం ఉంటే విను, ఓషా నత్తరవుడా జాతి హీనుడైనవానికి ఏరకంగానైనా ఉపదేశం చేయరాదు. ఉపదేశించినచో ఉపాధ్యాయునకే గొప్ప దోషము బుధుడు ద్రునకు ఉపదేశంచేయరాదు. ఆతనితో యజ్ఞం చేయించరాదు శూద్రునకు వ్యాకరణాది శాస్త్రములను చెప్పరాదు కావ్య నాటక అలంకారములు, పురాణేతి హాసములు, రద్రునకు చెప్పరాదు ఒకవేళ విశ్రుడు శూద్రునకు ఇవన్నీ ఏదోరకంగా ఉపదేశించినచో బ్రాహ్మణులతో కూడిన ఆ గ్రామము మండి ఆ బ్రాహ్మణుని వదిలి పెట్టాలి  శూద్రునకు ఉపదేశం చేసే బ్రాహ్మణుని చండాలునివలె వదిలిపెట్టాలి. చదువుకున్న. శూద్రుని దూరం నుండే వదిలి పెట్టాలి. అందువల్ల బ్రాహ్మణులకు శ్రద్ధతో శుబ్రషచేయి. నీకు భద్రం కలుగుతుంది. శూద్రులకు బ్రాహ్మణ ఓట్రాష్ మన్వాదులతో చెప్పబడింది. వై సర్గికమైన నీకర్మను నీవు వదిలి పెట్టరాదు. ఈరకంగా మునితో చెప్పబడి ఆ శూద్రుడు ఇట్లు ఆలోచించాడు నేనిప్పుడేం చేయాలి. వ్రతమందు శ్రద్ద నాకు ఎప్పటినుండో ఉంది. నా విజ్ఞానము పెరిగేటట్లుగా ప్రయత్నిస్తాను ఇప్పుడు అని వనస్సులో నిశ్చయించుకొని దృఢమతి అనే ఆ శూద్రుడు, ఆశ్రమానికి దూరంగా వెళ్ళి శుభమైన వర్ణశాలను ఏర్పరచుకున్నాడు .

             తా॥ అక్కడ ఒక దేవాలయాన్నిషుణ్యవె నగృహములను,మాలతోటలువెదలగునవి, చెరువు త్రవ్వించటంవగైరా తనతవఃసిద్దికొరకు శ్రద్ధతో చేయించాడు. అభిషేకములను ఉపవాసాది నియమములను కూడా బలికూడా చేసి హోమం చేసి దేవతలను పూజించాడు. సంకల్ప నియమములు కలవాడై ఫలహారుడై ఇంద్రియములజయించి  రోజు కందములతో మూలములతో పుష్పవలములలో, ఇంటికి వచ్చిన అతిథులను శాస్త్ర ప్రకారం పూజించసాగాడు ఈ విధంగా ఆతనికి ఎంతో కాలంగా గడిచిపోయింది. అతని ఆశ్రమమునకు, సుమతి అను పేరుగల బ్రాహ్మణుడు వచ్చాడు. గర్గ కులంలో పుట్టిన బ్రాహ్మణుడాతడు సత్యవాది, జితేంద్రియుడు. స్వాగత పూర్వకంగా మునిని పూజించి వేలాదులతో సంతోషపరచి పుణ్యకథలు వినిపిస్తూ కుశలమడిగాడు. ఈ విధముగా నమస్కారము మొదలగు ఉపచారములతో పూజింపబడి ఆశీర్వాదములతో ఈతనిని అభినందించి సత్కారమును స్వీకరించి, పోయి వస్తానని చెప్పి ఆనందంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఈ విధముగా ప్రతిరోజు ఈ బ్రాహ్మణుడు శూద్రుని యందు వక్షపాతము కలవాడై ఆ శూద్రుణ్ణి చూడటానికి ఆతని ఆశ్రమానికి వచ్చేవాడు ఈ బ్రాహ్మణునకు చాలాకాలము. ఆ చూద్రునితో సహవాసం ఏర్పడింది. స్నేహమునకధీనుడై ద్రుడు చెప్పిన దానికి అతిక్రమించలేదు.

తా ॥ వచ్చిన బ్రాహ్మణునితో శూద్రుడు స్నేహవశుడై ఇట్లా అన్నాడు. ఓ మునీశ్వర! నారు పావ్యకవ్య విధానమంతా చెప్పు పితృకార్యం చేసే కొరకు దేవకార్యం చేసే కొరకు నీవు నాకు మాంత్రాల నుపదేశించు అట్లాగే మహాలయ విధిని కూడా చెప్పు. అష్టకాలౌధమును, ఇంకొవైదికమైనవన్ని ఈ రహస్యమంతా నాకు చెవు. నీవే నాకు గురువువు.  ఈ రకంగా శూద్రునితో చెప్పబడి బ్రాహ్మణుడు ఇదంతా ఉపదేశించాడు. అట్లాగే శూద్రుని పితృకార్యాదికమును చేయించాడు కూడా పితృకార్యం చేయించాక ఆ శూద్రుడు వదిలితే ఈ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఈ విధముగా చాలా కాలము శూద్రునితో పోషింపబడి బ్రాహ్మణ నమూహముతో విడువబడి ఈ బ్రాహ్మణుడు చనిపోయాడు. యమభటులతో తీసుకుపోబడి నరకంలో వేయబడ్డాడు కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు నరకములు అనుభవించి వాటి చివర స్థావరమైనాడు  ఆ పిదప గాడిదగా పిదప అడవిపందిగా కుక్కగా కాకిగా జన్మించాడు. పిదప చండాలుడై శూద్రయోనిలో జన్మించాడు. వైశ్యుడైనాడు వేదవ క్షత్రియుడైనాడు. బలవంతులతో బాధింపబడి ఆ పిదప బ్రాహ్మణుడైనాడు. గర్భాష్టమందు తండ్రితో ఉపనయనం చేయబడి  తండ్రి దగ్గర ఉంటూ తన ఆచారములను అభ్యసిస్తూ ఉండగా, ఒకసారి అడవిలో ప్రయాణిస్తూ బ్రహ్మరాక్షసిచే, పట్టుకోబడ్డాడు ఏడుస్తూ, తిరుగుతూ, పడుతూ నవ్వుతూ, దుఃఖిస్తూ ఈతడు ఎప్పుడూ కాల్చు అని అంటూ వైదికకర్మను ఈతడు వదిలాడు కొడుకు అట్లా అవటం చూచి తండ్రి దు:ఖంతో బాధపడుతూ, స్నేహంగా వుత్రుణి తీసుకొని అగస్త్యుని శరణువేడాడు.

తా ॥ ఆ పిల్లవాని తండ్రి భక్తితో మువికి నమవ్కరించి, తన కొడుకు చేష్టలను ఆతనికి నివేదించాడు ఆగస్త్యమునితో ఆ బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడు.. ఓ బ్రహ్మ ఈ వారుమారుడు బ్రహ్మరక్షముచే వటుబడ్డాడు ఆ పిల్లవానికి ముఖం లేకుండా పోతోంది. దయా దృక్కులతో ఆతనిని రక్షించండి. పితరుల ఋణవిముక్తి కొరకు వారు మరోకుమారుడు కూడాలేడు ఓ కుంభజ! ఈతని ఏరానివృత్తికొరకు ఉపాయం చెప్పండి. నీతో నమానుడైన తవఃశీలుడు ముల్లోకములలో మరొకడు లేడు శివభక్తులలో నీవు మొదటివాడివి. ఈమాట మహరులు చెప్పారు. నీవుశాక వా పుత్రునకు దీని నుండి రక్షకుడు మరొకడు లేడు తండ్రి మీద దయ చూపండి (వామీద) సాధువులు దయాశీలురుగదా. శ్రీ హేతులిట్లనిరి. ఈ విధముగా బ్రాహ్మణుడు చెప్పగా కుంభwడు కొంత సేపు ధ్యానంలో ఉన్నాడు చాలాసేపు ధ్యానించి పిదప బ్రాహ్మణునితో ఇట్లా అన్నాడు. అగస్త్యుని వాక్కు - ఓ మహామతి! ఈ పిల్లవాడు పూర్వజన్మలో ఏడుమారుడే  సుమతీ అను పేరుగల బ్రాహ్మణుడు తన బుద్ధిని శూద్రునికిచ్చాడు. వైదికకర్మలనన్నిటిని ఈతడువదేశించాడు. అందువల్ల ఈతడు నరకములను కల్పకోటి సహస్రముల కాలము అనుభవించి వాని చివర ఈతడు భూమి పై స్థావర యోనులలో జన్మించాడు. ఇవ్వడు కర్మశేషం వల్ల నీకుమారుడు బ్రాహ్మణుడైనాడు. యముడు. ఇక్కడికి పంపగా వచ్చి బ్రహ్మరక్షన్నుతో పట్టుబడ్డాడు పూర్వజన్మలో చేసిన కరపాతకంవల్ల వటు బడ్డాడు. బ్రహ్మరక్షవాశనం కొరకు వీరు ఉపాయం చెప్తాను శ్రద్ధతో కూడివిను. మనస్సును సమాధానపరచుకో. దక్షిణ వముద్రంలో పేతురూపమైన పెద్ద పర్వతముంది దేవతలతో సేవింపబడుతూ వవిత్రమైనది ఆగంధమాదన పర్వతము. దాని పై భాగంలో పాపవినాశనమనే తీర్థం ఉంది. అది పుణ్యప్రదము ప్రసిద్ధమైనది. పాతకముల నశింపచే సేది. భూత, ప్రేత పిశాచములకు వేల బ్రహ్మరక్షసులకు చెందిన పావవాశకము  గొప్ప రోగములను నశింపచే పేది ఆ తీర్థము. సేతు మధ్యంలో ఉన్న ఆ తీర్థమునకు నీవు వీకుమారుని తీసుకొని వెళ్లు పాపవినాశన తీర్థమందు నీకొడుకును ప్రయత్న పూర్వకంగానైతో స్నానం చేయించు. మూడురోజులు అక్కడ స్నానం చేస్తే బ్రహ్మరక్షము నాశనమౌతుంది. దాని పాశనండు భూమి పై మరో ఉపాయం లేదు. అందు వల్ల ముక్తినిచ్చే రామ సేతువునకు నీవు త్వరగా వెళ్ళు  అక్కడ పాపవినాశం అనే పేరుగల తీర్థంలో నీకొడుకును స్నానం చేయించు. ఇక్కడ ఆలస్యం చేయకు. ఓ బ్రాహ్కడ! తొందరగా వెళ్ళు అని అగస్త్యునితో చెప్పబడ్డ ఆ బ్రాహ్మణుడు ఆతవికి దండమువలె నమస్కరించి అనుజ్ఞ తీసుకొని గంధమాదనమునకు ఈతడు వెళ్ళాడు.

తా ॥ విప్రేంద్రుడు కొడుకుతో పాటు పాపవినాశనమునకు పోయి సంకల్ప పూర్వకముగా మూడు రోజులు కొడుకును స్నానం చేయించి పాపవినాశమునందు తండ్రి స్వయంగా స్నానం చేసేవాడు. అతని కుమారుడు బ్రహ్మరక్షసునితో విముక్తుడై రోగరహితుడై, ఆరోగ్యవంతుడై సుందరరూపధారియై ఆవిర్భవించాడు. నర్వసంపత్సమృదుడై అనేక భోగములను అనుభవించి పావవినాశస్నానం వలన దేహంతమందు ముక్తిని పొందాడు తండ్రి కూడా అక్కడ స్నానం చేయటం వల్ల దేహాంతమందు ముక్తిని పొందాడు. అతనితో ఉపదేశం పొందిన ఆ శూద్రుడు క్రమముగా నరకములను అనుభవించి కుత్సితమైన యోనులందు అనేకమైన వాటిలో జన్మించి గృధ్రజన్మ పొందాడు. పిదప గంధమాదన పర్వతమందు, పాపవినాశన తీర్థమందు ఒకసారి నీరు తాగటానికి వచ్చి నీరు త్రాగాడు. తన శరీరాన్ని తడువుకొన్నాడు. వెంటనే దివ్యదేహధారియై, అన్ని ఆభరణములతో అలంకరించే బడి దివ్యమాలలు వస్త్రములను ధరించి రక్తచందనము వూనుకొని దివ్య విమానాన్ని అధిరోహించి, ఛత్రచామరములతో శోభితుడై ఉత్తమ స్త్రీలతో చుట్టబడి స్వర్గలోకమునకు వెళ్ళాడు శ్రీ సూతులిట్లనిరి - ఇటువంటి ప్రభావము కలదీ ఈ తీర్థము పావనివాశతీర్థము స్వర్గాన్నిచ్చేది, మోక్షాన్నిచ్చేది పుణ్యప్రదమైంది ప్రాయశ్చిత్తకరమైనది కూడా. బ్రహ్మవిష్ణు మహేశ్వరులతో సేవించబడేది దేవతలతో సేవించబడేది పాపములను నాశనం చేయటంవల్ల పాప నాశమని దానికి పేరు. శ్రేయస్సు కోరుకునే నరుడు పాప వినాశనంలో అందుకే స్నానం చేయాలి. ఈ విధముగా పాప వినాశనము యొక్క రహస్యమైన వైభవమును చెప్పాను. నింద్యకృత్యములు గల బ్రాహ్మణుడు, శూద్రుడు అక్కడ స్నానం చేసి తొందరగా ముర్తులైనారు. అని శ్రీ స్కాందమహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సంహితయందు మూడవదైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు గంధమాదన ప్రశంవ యందు పాపవినాశ ప్రభావకథన మనునది పదవ అధ్యాయము.