స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
21వ అధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - నర్వపాతకనాశకమైన జటాతీర్థమను పేరుగల తీర్థంలో స్నానముచేసి విశుద్దాత్ముడై పిదప లక్ష్మీ తీర్థమునకు వెళ్ళాలి (1) లక్ష్మీతీర్థంలో ఏ ఏ కోరికల నుద్దేశించి స్నానం చేస్తారో వారు ఆయా ఆయా కోరికలను పొందుతారు (2) మహా దారిద్ర్యాన్ని తగ్గించేది మహా ధాన్యసమృద్ధి నిచ్చేది మహా దుఃఖమును శమింపచే సేది మహా సంపదను వృద్ధి పొందించేది (3) ఇక్కడ ధర్మరాజు స్నానం చేసి మహదైశ్వర్యాన్ని పొందాడు. ఇంద్రప్రస్థంలో ఉంటూ శ్రీ కృష్ణునితో ప్రేరేపించబడి లక్ష్మిని పొందాడు (4) ఋషుల మాట - లక్ష్మీతీర్థంలో స్నానం చేయటంవల్ల ధర్మపుత్రుడు కృష్ణుని మాటవల్ల ఐశ్వర్యం పొందిన విధాన్ని మాకు చెప్పండి ముని అని (5) శ్రీ సూత వచనం - ధృతరాష్ట్రునితో పంపబడి ఇంద్రప్రస్థంలో పాండవులు మహా బలవరాక్రమవంతులు ఐదుగురు ఉండేవారు (6) వాళ్ళను చూడటానికి ఒకసారి కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. వచ్చిన ఆతనిని చూచి పాండవులు ఉత్సాహము కలవారై (7) పరమానంద భరితులై తమ ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆ వట్టణంలో కొంతకాలము ఈ కృష్ణుడున్నాడు (8) ఒకసారి ధర్మరాజు కృష్ణుని ఆహ్వానించి పూజించి వాసుదేవుని జగత్పతిని, పుండరీకాక్షుని ఇట్లా అడిగాడు (9) యుధిష్ఠిరోక్తి - ఓ కృష్ణ ! ఏ ధర్మంతో మనుష్యుడు మహాదైశ్వర్యాన్ని పొందుతున్నారోదాన్నీ నాకు చెప్పండి. అని ధర్మరాజు అనగానే కృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు (10) శ్రీ కృష్ణోక్తి - ఓ మహాభాగ! ధర్మపుత్ర ! గంధమాదన పర్వతమందు (11) ఐశ్వర్యమునకు కారణమైన లక్ష్మీతీర్థమని ప్రసిద్ధిగల తీర్థముంది. నీవక్కడ స్నానం చేయి. నీకు ఐశ్వర్యం లభిస్తుంది. (12) అక్కడ స్నానం చేయటంవల్ల ధనధాన్య సమృద్ధి పెరుగుతుంది. పాలివారు నశిస్తారు. వీరిజాత్రం పెరుగుతుంది (13) లక్ష్మి అను పేరు గల పుణ్యప్రదమైన తీర్థమందు పూర్వం దేవతలు స్నానం చేశారు. ఆ పుణ్యంతో అన్ని ఐశ్వర్యములు పొందారు (14) మహా పరాక్రమవంతులైన రాక్షసులను తొందరగా యుద్ధంలో చంపారు. భూమి లక్ష్మి ధర్మము ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి (15) త్వరలోనే కల్గుతుంది. ఇందులో అనుమానం వదు. తవన్పుతో, యజ్ఞములతో, దానములతో, ఆశీస్సులతో (16) ఐశ్వర్యం లభించినట్లుగా లక్ష్మీతీర్థంలో స్నానం చేయటంవల్ల పాపములన్ని నశించి, విఘ్నములన్ని లయమౌతాయి (17) వ్యాధులు నశిస్తాయి. లక్ష్మీ తీర్థ స్నానం వల్ల లోకంలో విపులమైన శ్రేయస్సు లభిస్తుంది అనుమానం లేదు 918) ఈ లక్ష్మీతీర్థంలో స్నానం చేసినందువల్లనే అవధరాజు శ్రేష్టమైన రంభ అనే అప్సరసను పొందాడు (19) ఈ తీర్థంలో స్నానం చేసి నరవాహానుడైన కుబేరుడు మహా పద్మం మొదలుగా ముఖ్య నిధులకు నాయకుడైనాడు (20) అందువల్ల ఓ రాజేంద్ర! నీవు కూడా శుభప్రదమైన లక్ష్మీతీర్థంలో స్నానం చేసి, భీముడు మొదలగు తమ్ములతో కూడి ఉండి (21) గొప్ప లక్ష్మిని పొందుతావు. శత్రువులను జయిస్తావు. ఇందులో అనుమానంలేదు. ఓ ధర్మజ! ఓ మేనత్త కొడుకl (22) అని అద్భుత దర్శనంకల ధర్మపుత్రుడు కృష్ణునితో చెప్పబడి, తమ్ములతో కూడి త్వరగా గంధమాదన పర్వతమునకు వెళ్ళాడు (23).
మహదైశ్వర్య కారణమైన లక్ష్మీతీర్థమునకు వెళ్ళి తమ్ములతో కూడి నియమము కలవాడై ధర్మరాజు అక్కడ స్నానం చేశాడు (24) నర్వపాతకముల నశింపచేసే లక్ష్మీతీర్థము నీటియందు తమ్ములతో కూడి నియమ పూర్వకముగా నెల రోజులు స్నానం చేశాడు (25) అనేకముగా గోభూతిలహిరణ్యాదులను బ్రాహ్మణులకిచ్చాడు. పిదప తమ్ములతో కూడి ధర్మపుత్రుడు ఇంద్రప్రస్థమునకు వెళ్ళాడు (26) పిదప యుధిష్ఠిరుడు రాజనయక్రతువును చేయటానికి ఇష్టపడ్డాడు. ధర్మరాజు యజ్ఞంచేయదలచి కృష్ణుని పిలిపించాడు. (27) కృష్ణుడు ధర్మరాజు దూతతో పిలువబడి, త్వరగా, వేగముగలనాలు గుఱ్ఱములతో కూడిన రథమెక్కి (28) నత్యభామతో కూడినవాడై ఇంద్రప్రస్థమునకు వచ్చాడు. వచ్చిన ఆతనిని చూచి ఆనందంతో ధర్మరాజు (29) కృష్ణునకు రాజసూయ ప్రయత్నమును గూర్చి చెప్పాడు. కృష్ణుడు కూడా సరే అట్లాగే కానిమ్మని అంగీకరించాడు (30) యుక్తితో కూడిన మాటలను ధర్మరాజుతో ఇట్లా అన్నాడు బావ (మేనత్తకొడుక) ధర్మరాజ! నామేలైన మాటను విను (31) ఈ రాజసూయము దుష్కరమైంది రాజు లందరికి కూడా. అనేకనూర్లపదాతి, రథముంజర, వాజుల సైన్యముగలవాడైన (32) రాజు ఈ యజ్ఞం చేయటానికరుడు - ఇతరులు కాదు. బలవంతుడవైన నీవు పది దిక్కులను జయించాలి (33) ఓడినరాజల నుండి ఉత్తమమైన పన్నును గ్రహించాలి. (33) ఆ బంగారముతో ఈ ఉత్తమ క్రతువును ఆచరించాలి (34) యుక్తి ఎరగిన నేను నీకు రుచిస్తున్నానా. నేను నిన్ను భయ పెట్టటం లేదు. అందువల్ల క్రతు ఆరంభంకన్న ముందు దిగ్విజయమాచరించు (35) కృష్ణుని హితమైన మాటను ధర్మాత్మజుడు వీని కృష్ణుని ప్రశంసిస్తూ తన తమ్ములను పిలిచాడు (36) ధర్మజుడు నలుగురు తమ్ములను పిలిచి సంతోషంగా వలికాడు. మహాబాహువులు కల భీమ, బహుపరాక్రమము కల ధనంజయ (37) శత్రుసంహారదీక్షితులు, సుకుమారాంగములు కలకవలలారా, ఉత్తమమైన రాజసూయయుజమును చేయదలిచాను (38) రాజులందరిని యుద్ధంలో జయించి అది ఆచరించాలి. అందువల్ల రాజులను జయించటానికి నలుగురూ సైనికులతో కూడి (39) నాల్గు దిక్కులకు వెళ్ళండి. మీరు పరాక్రమవంతులు. మీరు తెచ్చిన ద్రవ్యంతో మహా యజ్ఞాన్ని చేస్తాను. (40)
అని ధర్మరాజు చెప్పగా వృకోదరుడు మొదలగువారు సాదరంగా ప్రసన్న వదనులై ధర్మపుత్రానుజులు వురంనుండి (41) పాండవులు రాజుల జయించే కొరకు అన్ని దిక్కులకు వెళ్ళారు. వారు రాజులందరిని జయించి నాలు దిక్కులందున్న వారిని చాలా మందిని (42) రాజులను పాండవులు తమ యధీనమందుంచుకొని, వారిచ్చిన లెక్కలేని చాలా ధనమును ఉత్తమమైన దానిని (43) తీసుకొని కృష్ణుని ఆశ్రయించి త్వరగా తమ నగరానికి వచ్చారు. మహాబల పరాక్రమవంతుడైన భీముడు (44) శతభార నువర్గములను
తీసుకొని తన నగరాని కొచ్చాడు. నువర్గముల నహస్ర భారమును తీసుకొని అర్జునుడు (45) మహాబలపరాక్రమశాలి శక్రప్రస్థానికి వచ్చాడు. శత భారసువర్ణముల గ్రహించిన నకులుడు కూడా (46) తేజశ్శాలి శక్రప్రస్థ వురమునకు వచ్చాడు. విభీషణుడిచ్చిన బంగారు తొలములను వదునాళిటిని (47) దక్షిణ దేశపురాజుల ధననంచయముతీసుకొని, సహదేవుడు కూడా తన నగరానికి త్వరగా వచ్చాడు (48) లక్షకోటి సహస్ర ములు, లక్షకోటి శతముల సువర్ణ ములను యాదవకృష్ణుడు ధర్మపుత్రునికిచ్చాడు (49) తమ్ములు తెచ్చిన అనంఖ్యాత ధనముతో, కృషుడిచ్చిన అనంఖ్యాత ధనముతో ధర్మజుడు (50) కృషుని ఆశ్రయించి రాజసూయాన్ని పాండవుడైన ధర్మరాజు యజించాడు. ఆయాగమందు యథేష్టంగా బ్రాహ్మణులకు ద్రవ్యమిచ్చాడు (51) యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు అన్నదానం చేశాడు. వస్త్రములు, గోవులు, భూమి భూషణములు ఇచ్చాడు. (52) ఎంత ద్రవ్యమిస్తే యాచకులు సంతృప్తి చెందుతారో, అంతకంటే రెట్టింపు ధనాన్ని ధర్మరాజు వారికిప్పించాడు (53)
ఏవిధములైన ధనములు ఇంతగా యాచకులకు ఇచ్చాడు, అని ఇంత అని నిర్ణయించుటకు శక్యము కాదు. బ్రహ్మకోటులు (54) అర్మలకు ఇవ్వబడే ధనములను చూచి రాజు నర్వస్వము ఇచ్చాడని జనులన్నారు (55) అనంతమైన కోశాగారమును అనంతమణికాంచనములను చూచి (56) అర్ధులకు స్వల్పమే ఇచ్చాడని అప్పుడు జనులన్నారు. ఈ విధముగా రాజసూయ యజ్ఞముచేసి ధర్మపుత్రుడు తమ్ములతో కలసి (57) బహువిత్త నవృద్ధికలవాడై ఆ పట్టణంలో ఆనందించసాగాడు. లక్ష్మీతీర్థ మహాత్మ్యంవల్ల ధర్మపుత్రుడు యుధిష్కరుడు (58) ఇదంతా పొందాడు. ఓ విప్రులారా! ఇది తీర్థవైభవము. ఈ తీర్థము మహాపుణ్యప్రదము. మహాదారిద్ర్యనాశనము (59) ధనధాన్యప్రదము, మహాపాతక నాశకము మహా నరకాన్ని నంహరించేది, మహాదు:ఖనివర్తకము (60) మోక్షాన్నిచ్చేది, స్వర్గాన్నిచ్చేది, నిత్యమైనది, మహాఋణ విమోచకమైనది, సుకలత్రమునిచ్ళేది, నువుత్రుల నిచ్చేది కూడా (61) ఈ తీర్థముతో నమానమైన తీర్థము గతంలోలేదు, భవిష్యత్తులో కలగదు. ఈ లక్ష్మీతీర్థవైభవమును మీకు చెప్పాను (62) దుః స్వప్ననాశకము, పుణ్యమైనది, అన్ని అభీష్టములు నెరవేర్చేది. ఈ అధ్యాయమును చదివినవారు భక్తితో వినినవారు (63) ధనధాన్యసమృద్ధి కలిగి ఉంటారు. అనుమానము లేదు. ఈ లోకమున సకలలోకములను అనుభవించి దేహాంతమందు ముక్తిని పొందుతాడు (64) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి నహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మండమందు సేతుమాహాత్మ్యమందు లక్ష్మీ తీర్థప్రశంసయందు ధర్మసుత్రునకు నిరతిశయ సంపద లభించడమనేది ఇరువదొకటవ అధ్యాయము.
