స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

42వ అధ్యాయము

శ్రీ నూతులు ఇట్లన్నారు - ఇక ఇక్కడి నుండి నర్వతీర్థముల వైభవాన్ని, సేతుమధ్యంలో ఉన్న, ఇంతకు ముందు చెప్పని సర్వతీర్థముల గూర్చి నేను చెప్తాను. ఓ మునీశ్వరులార! వినండి (1) మహాపుణ్యప్రదమైన ఋణమోచనమను పేరుగల తీర్థముంది. ఇక్కడ మునగటం వల్ల నరుల మూడు ఋణములు ముక్తమౌతాయి (2) బ్రాహ్మణుడుగా పుట్టినవానికి మూడు ఋణములుంటాయి. ఋషుల దేవతల, పితరుల, ఋణములు (3) బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించనందువల్ల ఋషుల ఋణంలో పడతాడు. యజ్ఞాదులు చేయనందువల్ల దేవతల ఋణంలో పడతాడు (4) సంతానాన్ని పొందనందువల్ల పితరుల ఋణంలో పడతాడు. బ్రహ్మచర్యం లేకుండ, యాగం లేకుండ, సంతానం లేకుండ (5) ఋణమోక్షమను ఈ తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేత నరులు ఋషి దేవ పితరుల ఋణముల నుండి ముక్తిని పొందుతారు (6) బ్రహ్మ చర్యంతో యజ్ఞంతో సంతానోత్పత్తితో ఋషులు దేవతలు పితృగణాలు అంత సంతోష పడరు (7) కాని ఋణమోక్షంలో స్నానం చేయటం వల్ల అంతులేని ఆనందాన్ని పొందుతారు. ఇంక ఈ తీర్థంలో స్నానం చేయటంవల్ల దరిద్రులు, అప్పుతీసుకొన్న వారు (8) అన్ని ఋణముల నుండి ముక్తులై ధనవంతులౌతారు అనుమానంలేదు. ఇక్కడ స్నానం చేయటం వలన నరులకు ఋణ ముక్తి కలుగుతుంది. (9) కనుక ఈ తీర్థాన్ని ఋణమోచన తీర్థమని అంటారు. అందువల్ల ఇక్కడ ఋణము కల అందరు ఆ విముక్తి కొరకు స్నానం చేయాలి (10) ఈ తీర్థంతో సమానమైన తీర్థము గతంలో లేదు. భవిష్యత్తులో కలగదు. ఇక్కడ పాండవులు ఏర్పరచిన మరొక గొప్ప తీర్థముంది (11) ధర్మపుత్రాదులు పాండవులు ఐదుగురు పూర్వము ఈ తీర్థాన్నుద్దేశించి యాగం చేశారు. ఇది భుక్తిముక్తి ఫలముల నిచ్చేది (12) ఈ తీర్థము కంటే వేరైన ఉత్తమమైన దశకోటి సహస్ర తీర్థములు, ఈ వంచపాండవ తీర్థంలో ఎవ్వడూ నన్నిధిలో ఉంటాయి. (13) ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, మరుద్గణములతో పాటు సాధ్యులు పాండవుల మహాతీర్థంలో ఎల్లప్పుడు నన్నిహితులై ఉంటారు (14) ఇక్కడ స్నానం చేసి పితృదేవతలకు తర్పణ చేసిన వారు అన్ని పాపముల నుండి ముక్తులై బ్రహ్మలోకంలో పూజింపబడుతారు (15) ఈస్వచ్ఛమైన తీర్థ తీరమందు ఒక బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. దీని వలన ఈ లోకంలో పరలోకంలో ఆనంద పడతారు (16).

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఇతరులైనా ఈ శ్రేష్ఠ తీర్థమందు స్నానం చేసిన వివిధ యోనులను (జన్మలను) పొందడు (17) పాండవుల మహాతీర్థమందు పుణ్య దినములలో స్నానం చేసిన నరుడు మనుజ శ్రేషుడు నరకాన్ని చూడడు (18) పాండవుల మహాతీర్థాన్ని ప్రాతః సాయం నమయములందు స్మరించినవాడు అన్ని తీర్థములలో గంగాదులలో స్నానం చేసినట్లే అనుమానంలేదు (19) దైత్యుల శాంతి కొరకు ఇంద్రాది దేవతలు యజ్ఞము చేసినది దేవతీర్థమను పేరుగలది గంధమాదనంలో మరొకటుంది. (20) నరుడు దేవ తీర్థంలో స్నానం చేసి నర్వపాపముల నుండి విముక్తుడై అన్ని కోరికలతో కూడిన అక్షయ లోకములను పొందుతాడు (21) పుటక నుండి స్త్రీ గాని పురుషుడుగాని చేసిన పాపము ఈ దేవడుండంలో స్నానం చేయటం వల్ల వెంటనే నశిస్తుంది (22) దేవతలందరికి మధు సూదనుడు తొలివాడైనట్లే నర్వతీర్థములకు ముఖ్యమైన దేవతీర్ధము అట్లాగే ఆది (23) నూరు సంవత్సరములు నిండుగో అగ్ని హోత్ర ఉపాసన చేసిన వాడు, ఈ దేవకుండంలో ఒక్కసారి స్నానమాచరించిన వాడు (24) ఈ ఇద్దరికి పుణ్యము నమానంగానే లభిస్తుంది. ఇందులో అనుమానంలేదు. ఈ దేవతీర్థంలో దానము, నివానము దుర్లభము. (25) దేవతీర్థమునకు వెళ్ళటం స్నానం చేయటం కూడా మిక్కిలి దుర్లభము. దేవ తీర్థమునకు వచ్చి దేవర్షి పితృదేవతలను సేవించినవాడు (26) అశ్వమేధ పలాన్ని పొందుతాడు. విష్ణులోకమునకు వెళ్తాడు కూడా. రెండు రోజులు, మూడు రోజులు ఐదు లేదా ఆరు రోజులు కాని (27) నరక నాశకమైన దేవతుండ తీర్థ తీరమందుండిన వారు మాతృయోనిని పొందరు (జన్మించరు). ప్రధానమైన సిద్ధిని పొందుతారు (28) ఇక్కడ మూడు రోజులు స్నానం చేయటం వలన వాజపేయ ఫలము లభిస్తుంది. దేవతీర్ధన్మరణం వల్ల వెంటనే పాపముల నుండి నరుడు ముక్తుడౌతాడు (29) ఈ తీర్థతట ముందు నరుడు పితరులను దేవతలను పూజించిన సర్వకామములతో నిండిన వాడౌతాడు. నర్వ యజ్ఞముల ఫలితాన్ని పొందుతాడు (30). ఈ తీర్థముతో సామానమైన పుణ్య తీర్థము గతంలో కాని భవిష్యత్తులో కాని లేదు ఉండదు. మోక్ష కాములు అందువల్ల తప్పకుండా ఈ తీర్థంలో స్నానం చేయాలి. (31) ఐహికాముష్మిక వలప్రాప్తి కాములైన నరులు కూడా స్నానం చేయాలి. దేవ తీర్థ మాహాత్మ్యాన్ని సంక్షేపంగా చెప్పాను. ఓ బ్రాహ్మణులార ! (32) దీని మహాత్మ్యాన్ని గురించి వివరించి చెప్పటం నాకు సాధ్యం కాదు.

రామ సేతువు యందు ముక్తినిచ్చే సుగ్రీవ తీర్థాన్ని గూర్చి చెప్తాను (33) భక్తితో ఇక్కడ స్నానం చేసిన నరుడు నూర్యలోకాన్ని పొందుతాడు. సుగ్రీవ తీర్థంలో స్నానం వల్ల అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు (34) బ్రహ్మహత్యాది పాపముల నుండి నిష్కృతి కలుతుంది. సుగ్రీవ తీర్థానికి వెళ్ళటం వలన గోనపానముల దాన ఫలము లభిస్తుంది. (35) దానిని న్మరించటం వలన వేద పారాయణ ఫలము లభిస్తుంది. ఆ తీర్థ తీరంలో ఒక రోజు ఉపవాసం చేయటం వలన (36) ప్రాయశ్చిత్తం లేకుండానే మహా పాతకముల నాశం సంభవిస్తుంది. ఓ బ్రాహ్మణులార ! అక్కడ స్నానం చేసిన వారు పితృదేవతల తర్పణ కూడా చేయాలి (37) స్నానం వల్ల యామకాల యజ్ఞం వల్ల కలిగే ఫలం కన్న ఎనిమిదింతల ఫలం ఎక్కువ లభిస్తుంది. సుగ్రీవ తీర్థ స్నానం వల్ల నరమేధ ఫలం లభిస్తుంది (38) సుగ్రీవ తీర్థ స్నానం వల్ల నరుడు పూర్వజన్మ నృతి కలవాడౌతాడు. అందువల్ల ఓ విప్రులార! అభీష్ట సిద్ధి కొరకు సుగ్రీవ తీర్థానికి వెళ్ళండి (39) ఓ విప్రులార ! ఈ విధంగా మీకు సుగ్రీవ తీర్థ మాహాత్మ్యాన్ని చెప్పాను. ఇప్పుడు మీకు నల తీర్థ మాహాత్మ్యాన్ని చెప్పుచున్నాను. (40) నరుడు నల తీర్థంలో స్నానం చేసిన స్వర్గలోకం పొందుతాడు. నల తీర్థంలో ఒక సారి స్నానం చేయటం వలన అన్నిపాపముల నుండి విముక్తుడై (41) అగ్నిజోమ అతిరాత్ర మొదలగు యజ్ఞముల ముఖ్య ఫలాన్ని పొందుతాడు. మూడు రాత్రులు అక్కడ ఉండి పితృదేతల తర్పణ చేస్తే (42) సూర్యుని లాగా వెలిగి పోతాడు. వాజిమేధ ఫలాన్ని పొందుతాడు. ఇప్పుడు మహాపాతక నాశకమైన నీల తీర్థాన్ని గూర్చి చెప్తున్నాను (43) ఈ తీర్థము అగ్ని పుత్రుడైన నీలుడు సేతువు యందు నిర్మించాడు. ఇది ముక్తినిచ్చేది. నీల తీర్థంలో నరుడు స్నానం చేసిన సర్వ పాపముల నుండి విముక్తుడై (44) బహు వర్జ్య యాగ ఫలం కన్న నూరింతలెక్కువ ఫలాన్ని పొందుతాడు. సర్వాభీష్టముల తీర్చే నల తీర్థంలో నరుడు స్నానం చేసి (45) నర్వకామ నమృదుడై అగ్నిలోకానికి చేరుకుంటాడు. గంధమాదన పర్వతమందు గవాక్షుడు చేసిన తీర్థము (46) ఉంది. అక్కడ స్నానం చేసిన మాత్రం చేతనే నరుడు నరకానికి పోడు. సేతువు యందు ముక్తినిచ్చే అంగదుడేర్పరచిన తీర్థముంది. (47) ఇక్కడ స్నానం చేయటం వలన దేవేంద్ర వదవిని పొందుతాడు.

గజుడు, గవయుడు, శరభుడు, మహాజనుడు (48) కుముదుడు, హరుడు, బలవంతుడైన వననుడు వీరందరు ఏర్పరచిన తీర్థములలో అట్లాగే ఇతరులైన వానరులందరితో (49) మహాపుణ్యమైన గంధమాదన పర్వతమందలి రామ సేతువు యందు ఏర్పరచిన తీర్థములలో స్నానం చేసినవారు అమృతత్వాన్ని పొందుతారు (50) విభీషణుడేర్పరచిన పాప విమోచకమైన తీర్థముంది. అది మహాదు:ఖములను శమింపచేసేది. మహారోగములను తొలగించేది (51) మహాపాతక నమూహములకు అగ్నిలాంటిది. ఉత్తమమైనది. కుంభీపాకాది నరకముల క్లేశములను నశింపచేయగలిగేది (52) దుఃస్వప్నముల నశింపచేసేది. ధన్యమైనది. మహా దరిద్రమును తొలగించేది. అక్కడ స్నానం చేసిన నరునకు ఇక్కడ పాతకం లేదు (53) పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని ఆతడు పొందుతాడు. విభీషణుని మంత్రులు నాల్గు తీర్థముల నేర్పాటు చేశారు (54) అక్కడ స్నానం చేయటం వలన నరుడు నర్వ పాపముల నుండి ముక్తుడౌతాడు. గంధమాదన పర్వతమందు సరయూనది (55) రామనాథుడైన మహాదేవుని సేవించుటకు ఎల్లప్పుడూ ఉంటుంది. అక్కడ నరులందరు స్నానం చేసి పాతకములన్ని తొలగినవారై (56) సర్వయజ్ఞ తవః తీర్థముల సేవా ఫలాన్ని పొందుతారు. ఓ బ్రాహ్మణులార ! దశకోటి సహస్ర తీర్థములు (57) ఈ పుణ్యమైన గంధమాదన పర్వత మందున్నాయి. గంగాది సర్వసరిత్తులు అట్లాగే నప్త సాగరములు (58) పుణ్యమైన ఋష్యాశ్రమములు అట్లాగే పుణ్యవనములు అట్లాగే హరిశంకరుల ప్రధానక్షేత్రములు (59) గంధమాదన పర్వతమందు ఎప్పుడూ సన్నిధిలో ఉంటాయి. బ్రహ్మతీర్థమును మరొక యజ్ఞోపవీతముగా చెప్పాడు. (60) ముప్పది మూడు కోట్ల దేవతలు పితృగణములతో నహమునులు యక్షులు సిద్ధులు కిన్నెరులందరు దేవుడైన రామచంద్రుని ఆజ్ఞతో సేతువు యందున్నారు (61) సూతుని వచనము - ఓ బ్రాహ్మణులార! ఈ విధముగా తీర్థముల వైభవాన్ని నేను మీకు వినిపించాను. (62) దీనిని విన్నవారు, చదివినవారు దుఖ సంతుముల నుండి విముక్తులౌతారు. పునరావృత్తి రహితమైన కైవల్యమును పొందుతారు (63) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి నహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు నకల తీర్థ ప్రశంన యందు ఋణమోచనాది తీర్థమాహాత్మ్య వర్ణనమనునది నలుబది రెండవ అధ్యాయము.