స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
27వ అధ్యాయము
శ్రీ సూతులిట్లనిరి - యమున, గంగ, గయ వీని యందు నరుడు ఆనందంతో శాస్త్ర ప్రకారము స్నానం చేసి పిదప కోటి తీర్థమునకు వెళ్ళాలి (1) కోటితీర్థము మహా పుణ్యప్రదము నర్వలోకములందు ప్రసిద్ధమైంది. నర్వ సంపదల నిచ్చేది, శుధము, సర్వపాపనాశకము (2) చెడు స్వప్నముల నశింపచే సేది, మహా పాతక నాశకము.మహా విష్నుములు శమింపచే సేది, మహా శాంతి నిచ్చేది (3) న్మరణ మాత్రం చేత పురుషుల సర్వ పాపముల సంహరించేది. ఎలానంగా ధనస్సు యొక్క కోటితో స్వయంగా రామునితో నిర్మించబడింది (4) పూర్వం దశరథ రాముడు యుద్ధంలో రావణుని చంపి బ్రహ్మహత్యనుండి విముక్తి కొరకు గంధమాదన పర్వత మందు (5) లోకములనను గ్రహించేకొరకు ఒక లింగాన్ని ప్రతిష్టించాడు. ఈ లింగాన్ని అభిషేకించే కొరకు శుద్ధమైన నీటిని వెతుకుతూ (6) ఆ ప్రక్కలో రాముడు నీటిని కనుగొన లేదు. లింగాభి షేకమునకు యోగ్యమైన జలమేదని ఆలోచిస్తూ (7) కొత్త నీటితో లింగానికి స్నానం చేయించాలి నేను అని రాముడు మనస్సులో నిశ్చయించి ధనుష్కోటితో (8) భూమిని శీఘ్రంగా ఛేదించాడు. మనస్సులో గంగను స్మరించాడు. రామ కార్ముకకోటి అప్పుడు రసాతలాన్ని చేరింది (9) ధన్వులలో శ్రేషుడైన రాముడు అక్కడినుండి తన ధనస్సును పైకి లేపాడు. రాఘవుడు భూమినుండి ధనస్సును పైకి తీస్తుండగా (10) గంగను స్మరించాడు. ఆ రంధ్రము నుండి గంగ పైకి వచ్చింది. ఆ నీటితో రాముడు లింగాన్ని అభిషేకించాడు (11) రామ కొర్ముక కోట్లతో నిర్మించబడింది కనుక అది. ఆ తీర్థము ముల్లోకములలో కోటి అని ప్రసిద్ధమైంది (12) ఈ గంధమాదనంలో ఏఏ తీర్థాలున్నాయో మొదట ఆయా తీర్థములలో స్నానం చేసి విగత కల్మషుడై (13) మిగిలిన పాప విముక్తి కొరకు సరుడు కోటి యందు స్నానం చేయాలి. తీర్థాంతరములందు స్నానం వల్ల సశించని పాపములు (14) అనేక జన్మ కోటులలో సంపాదించిన అనులలో ఉన్నది అంతా కోటి స్నానం వల్ల నశిస్తుంది. అనుమానంలేదు (15) ఒకవేళ మొదటనే ఈ కోటియందు నరుడు స్నానం చేసిన యెడల ఆ ముఠుడైన వానికి ఇతర తీర్థములన్ని వ్యర్థములే. (16) ఋషులిట్లనిరి - సూత ! నర్వార్థములనెరిగినవాడ! వ్యాన శిష్య ! మునీశ్వర ! పౌరాణికోత్తమ ! మా ఒక చిన్న అనుమానాన్ని ఛేదించు (17) కోటిలో స్నానం చేసిన వానికి ఇతర తీర్థములు వ్యర్థమైన యెడల ధర్మతీర్థాది తీర్థములందు నరులు ఎందుకు స్నానం చేస్తున్నారు (18) ఆ తీర్థములనన్నీ వదలి నరులు ఈ కోటిలోనే ఎందుకు స్నానం చేయటంలేదు దానిని చెప్పండి అని అనగా (19).
శ్రీ సూతులిట్లనిరి - ఓమునులార! మీరు రహస్యాన్ని అడిగారు. వారదుడడుగగా పూర్వంశంభుడు చెప్పాడు (20) దానినే చెప్తాను ఓ మునిశ్రేష్టులార ! శ్రద్ధగా వినండి. అనుకోకుండాగాని, తీర్థ యాత్రావరుడైకాని (21) ఓ ద్విజులార! మార్గమధ్యంలో తీర్థంకాని దేవాలయం తాని ఉన్నదని విని చూచి మోహం వల్ల సేవించని నరాధము (22)నరు నిష్కృతి లేదని వరమర్పులు చెప్పారు. సేతువునకు వేళూ మానవుడు ఇతరమైన వాటిలో స్నానం చేయనియెడల (23) తీర్థాతి క్రమ దోషంతోఆతనిని బహిష్కరించాలి అంత్యజునివలె అని అన్నారు. అందువల్ల ఈ చక్రతీర్థం మొదలైన వాటిలో బ్రాహ్మణులు స్నానం చేయాల్సిందే (24) ఈ తీర్థములలో స్నానం చేసి శేష పాపవిముక్తి కొరకు మనుజులు ప్రయత్న పూర్వకముగా కోటి తీర్థములో స్నానం చేయాలి (25) కోటిలో స్నానం చేసి గంధమదనంలో ఉండకూడదు. నిష్పావుడై వెంటనే గంధమదనం నుండి మరలాలి (26) పూర్వం రాముడు కూడా కోటి తీర్థంలో పుట్టిన నీటితో రామనాథుని అభిషేకించాక తాను కూడా స్వయంగా స్నానం చేసి అక్కడ (27) బ్రహ్మ హత్య నుండి విముక్తుడై ఆ క్షణమందే తమ్మునితో కుడి వుష్పక మధిరోహించి వానరులతో కూడా అయోధ్యకు వెళ్ళాడు (28) అందువల్ల నరుడుకోటియందు స్నానంచేసి పావంశేషంనుండి విముక్తుడై దశరథరామునివలె వెంటనే మరలి పోవాలి (29) ఇది తీర్థములలో శ్రేష ము పర్వలోకములందు ప్రసిద్ధము రామనాథుని అభిషేకముకొరకు రాముడు నిర్మించాడు (30) ఇక్కడ భగవతి జాహ్నవి స్వయంగా సన్నిధిలో ఉంటుంది. తారక్ డైన రాముడు ఆదరంతో స్నానం చేశిన (31) కోటి తీర్థమహిమను గూర్చి ఎవడు చేవగలడు. లోక క్షేమము కొరకు పూర్వం కృషుడు స్నానం చేసి (32) మతుల వథ, కంసవథ వల్ల వచ్చిన దోషం నుండి ముక్తుడైనాడు. అట్టి కోటి తీర్థ మహిమను ఎవరు చెప్పగలరు (33) ఋషులిట్లనిరీ - యదునందనుడు తన మామను కంసుని ఎందుకు చంపాడు. ఓ సూత ! ఏ దోష శాంతి కొరకు మహా మనస్సు గల కృష్ణుడు కోటిలో స్నానం చేశాడు (34)
శ్రీ సూతులిట్లనిరి - యదుకులంలో శూరుని పుత్రుడు వనదేవుడని ప్రసిద్ధి చెందినవాడు ఉండేవాడు. ఆతడు దేవుని సుతను దేవకి అని ప్రసిద్ధి చెందిన దానిని వివాహమాడి (35) రథమథి రోహించి తన నగరానికి బయలుదేరాడు. ఆనక దుందుభికి కంసుడు సూతుడైనాడు (36) అవ్వడు అశరీరవాణి సారథియైున కంసునితో ఇట్లా అంది. రథముందు, భగినిని, భామను తీసుకుపోతున్నావు (37) ఓ అరిందమ ! రథంమీద నీవు ఎవరిని తీసుకుపోతున్నావో, ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపుతుంది అనుమాసంలేదు. (38) అనేదివ్యవాణిని విని కంసుడు ఖడ్గం తీసుకొని తన చెల్లెలును చంపుటకు ప్రయత్నించాడు (39) పిదప వసుదేవుడు అతనిని ఓదారుస్తూ ఆ కంసునితో ఇట్లా అన్నాడు. వనదేవోక్తి - ఓ కంస ఈమె ప్రసవించిన కొడుకులను నీకు నేను ఇస్తాను (40) ఈ నీ చెల్లెలును హింసించాదు. ఈమె భయము నీ కొదు. అని అనిన ఆ మాటలను కంసుడు విని. ఆమెను చంపటం మానేశాడు (41) దేవకీ వసుదేవులతో కూడి వ్వపురమునకు వెళ్ళాడు. దేవకీ వసుదేవులకు కాలియందు బేడీలు తగిలించి (42) దుష్యాత్ముడైస కంసుడు కారాగృహంలో ఉంచాడు. చాలా కాలమునకు వసుదేవునివలన దేవః (43) క్రమంగా ఆరుగురుపుత్రులను కనిసరి. పుట్టిన వారిని వసుదేవుడు కంసునతీయగా అతడు వారిని చంపాడు (44) దేవకి గర్బంలో జన్మించిన ఆరుగురు పుత్రులను కూరబుద్ధిగల, దయలేని కంసుడు చంపాక (45) దేవకి ఏడవ గర్భమందు శేషుడు జన్మించాడు. మాయాదేవి ఆ గర్భమును విష్ణువుచే ప్రేరితురాలై (46) నంద గోవుని ఇంటియందున్న రోహిణికి చేరింది. దేవకి యొక్క నక్షమగర్భము జతరము నుండి వడి పోయిందనీ (47) లోకంలో గొప్ప ప్రసిద్ధి ఏర్పడింది. విపరీలవలన పిదపదేవకీటతరమందు విష్ణువు గర్భముగాఐనాడు. (48). పిదప పదినెలలు గడిచాక అవ్యయుడైన హరి దేవకీ జతరము నుండి కృష్ణుడను పేరుగలవాడై జన్మించాడు (49) శంఖ చక్ర ఖడ్గములతో ప్రకాశించు వాలు భుజములు కలవాడు, కిరీటి వనమాలి, ఏతరుల శోకాన్ని నశింప చేసేవాడు (50) ఈశానుని, హరిని చూచి ఆనక దుందుభి ఆనందివడ్డాడు (51).
వసుదేవోక్తి - ఈ ప్రపంచం నీవు, విశ్వవతివి నీవు విశ్వమునకు యోనివి. నీలో ఈ విశ్వముంది. మహాన్, ప్రధానుడవు, విరాట్, స్వరాటు, సమ్రాట్టు ఓ భగవాన్ సమస్తము నీవే (52) జగత్తునకు కారణ భూతమైన స్థానమా, నారాయణ, అమిత పరాక్రమశాలి శ్రీ శార్ఖచక్ర అసిగదాధారి, కృత్రిమ మనుష్య రూపధారి నీకు నమస్కారము. (53) ఈ విధముగా శారినిస్తుతిస్తున్న ఆ వసుదేవునితో హరీ అవ్వడు దేవకి వసుదేవులను సంతోషపరుస్తూ ఇట్లా అన్నాడు (54) హరి వచనము - నేను కంసుని వథిస్తాను. తల్లిదండ్రులార ! మీరు భయపడకండి. నందగోపుని గృహిణి యశోద పూర్వదినమున పుత్రికను ప్రసవించింది. అది నామాయ సర్వలోక విమోహిని (55) ఆమె వడకయందు నన్నుంచి యశోదనుతమైన ఆమెను తీసుకొని ఓయదూత్తమ ! దేవకి పడక యందు జేర్చు. (56) ఆ కృష్ణుడు ఇట్లా చెప్పగానే ఆతడు అట్లాగే చేశాడు. దేవకి వడక యందున్న ఆ మాయ అను కన్య ఏడ్చింది (57) బాల ధ్వనిని విని కంసుడు. సంకుల మనసుడై సూతికాగృహమునకు వచ్చి ఆ కన్యను తీసుకొని (58) నిర్ణయుడై, ఏమాత్రం సిగ్గులేకుండా శిల పై కొట్టాడు. పిదప ఆమె హస్తము ఛేదించుకొని, ఎనిమిది మహా భుజములతో మహాదేవి కంను సంబోధించి అతి కోపంతో ఇట్లా అంది (59) మాయ వచనము - అరే ! కంస ! పాపాత్మ ! దుర్బుద్ధి ! మూఢచేతసుడ ! (60) నీ ప్రాణాన్ని హరించే నీ శత్రువు ఎక్కడో ఒక చోట ఉన్నాడు. ఓ కంన! మృత్యువైన ఆ నీశత్రువును వెతుకు. ఆలసించవదు. (61) అని పలికి ఆదేవి దివ్యస్థానములను చేరి మనుష్యుల నుండి పూజలను పొంది కోరికల నిచ్చేదిగా ఐంది (62) ఆ దేవీ వచనమును విని కంసుడు కూడా మిక్కిలి వ్యాకుల వడి తన అంతకుని, రిపువును బాధించుటకు బాల గ్రహాలను పూత వాదులను (63) దేశములందు పంపించాడు ఇతర శిశువులను బాధించుటకు పంపాడు. ఆ బాల గ్రహములన్ని నందగోకులమునకు వెళ్ళాయి (64) కృష్ణుడు వాటిని చంపాక అవి యనమందిరానికి వేళ్ళాయి. ఓ బ్రాహ్మణులార ! కొన్ని రోజులు గడిచాక (65) గోకులంలో ఆ బాలకులు రామ కృష్ణులు పెరిగారు. శత్రు మర్ధనులైన వారు అనేక బాలక్రీడలతో ఆడుకున్నారు (66) కొంతకాలం దూడలను పాలిస్తూ వేణునాదమును చేశారు. గుంజ, తాపింఛములతో అలంకరించుకొని కొన్నాళ్ళు గోవులను పాలిస్తూ (67) చాలా కాలము వారు రామ కేశవులు గోకులంలో (సుఖించారు) క్రీడించారు. (671/2 )
ఒకసారి కంసుడు గోకులంలోని రామకేశవులను (68) త్వరగా తీసుకురావటానికి అక్రూరుని పంపాడు. గోకులంనుండి రామకృషలను అక్రూరుడు తీసుకు వచ్చాడు. (69) కంసుని ఆదేశాన్ననునరించి స్వర్ణ తోరణములతో వెలిగే మథురకు వారిని తెచ్చాడు (70) రామకేశవులను తీసుకొనివచ్చి గాందీనిజుడు (ఆక్రూరుడు) నగరమునకు వెళ్ళి, ఎదురుగా కంసుని చూచి ఆతనికి కార్యాన్ని నివేదించి పిదప తన ఇంటికి వెళ్ళాడు (71) తరువాతి రోజు మధ్యాహ్నముస వసుదేవ పుత్రులు ఇషలైన గోవవుత్రులతో ఇళ్ళు, కందకములు, గోపురము రాచనగరులు గల మథురావురిని వారు ప్రవేశించారు (72) వురమందలి యువతుల స్తోత్రములు ఏంటూ రామునితో సహా కృష్ణుడు వెళ్ళి ధనుశ్శాలను చూచాడు దృఢమైన అల్లి ప్రొడు గల ధనస్సును చూచాడు (73) ధనన్పును రక్షించే వారినందరిని పరుగెత్తించి ఆతడు తొందరగా అవలీలగా ధనస్పును తీసుకొని అల్లత్రాడును ఎక్కు పెట్టుటకు పంచినంతలో ఆ ధనస్సు రెండు ముక్కలైంది (74) ధనస్సు భంగమైనందువల్ల కలిగిన ధ్వనినివీని వచ్చిన బలవంతులను చంపుటకు ధనుస్సు ముక్కలను తీసుకొని బలవంతులైనవారు ధను:రక్షకులను చంపారు (75) పిదప కువలయాపీడమను పేరు గల ఏనుగును ద్వారంలో ఉన్నదానిని మహా బలవరాక్రమవంతులైన ఆ రామకృష్ణులు చంపి (76) దాని కోరలను వీరికి వారు వాటిని తమ చేతులలో ధరించి, ఆ దంతములను భుజము యందు పెట్టుకొని క్షణంలో రంగమునకు వెళ్ళారు (77) మల్లురైన చాణూర, ముష్టిక, తోశలులను చంది ఇతర మల్లుర శ్రేషులను కూడా యమసదనమునకు పంపారువారు. (78) త్వరగా వారు ఎత్తైన మంచను ఎక్కారు. ఎత్తైన ఆసనం పైన కూర్చున్న కంసుని వారున మీపించి, సింహముక్షుద్రమృగములను తృణీకరించి నిలిచినట్లు కంసుని తృణీకరించి వారు నిలిచారు (79) మంచం పైనున్న కంసుని లాగి కృష్ణుడు వాని పాదములను బట్టి వేగంగా ఆకాంలో తీవ్పసాగాడు (80) ప్రాణం పోయిన ఆ కంసుని కృష్ణుడు భూమి పై విడిచాడు. తన ముష్టితో కంసుని భ్రాతలను ఎనిమిది మందిని బలరాముడు చంపాడు (81) ఈ విధముగా వరబలమును నశింపచే సే కృష్ణుడు ఆకంసుని చంపి, ఆతి దుఃఖితులైన తలిదండ్రులను బేడీలనుండి విడిపించాడు (82) తన బలంతో మాధవుడు అందరిని నిలువరించాడు. కృష్ణుడు కంసుని చంపాడనివిని అప్పుడు నగరానికి బంధువులు వచ్చారు (83) వీరంతా పూర్వం కంసునితో బాధింవబడ్డవారు, మధురలో ఉన్నవారు. కేశవుడు ఉగ్రసేనుని రాజ్యంలో ఉంచాడు (84) తలిదండ్రులకు ఈ విధంగా అవకారంచేసిన కంసుని సహించనివారై దేవ బ్రాహ్మణ కంటకుడైన మతులుడైన కంసుని చంపారు (85) పిదప ఒకసారి కృష్ణుడు తనను చూడటానికి వచ్చిన వారదాది మునులను ఇట్లా అడిగాడు. (86).
శ్రీ కృష్ణుడిట్లనిరి - ఓ విప్రులార! అతి పాపకారియైన కంసుడు మా మాతులుడు ఈతనిని నేను చంపాను. శాస్త్ర మెరిగినవారు మాతులుని చంపిన పాపమని అంటారు (87) ఆ దోష నివృత్తి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి. అద్భుత పరాక్రమము కల కృష్ణునితో నారదుడు. భక్తి ప్రేమ నిండారగా తీయని మాటలతో ఇట్లా అన్నాడు. (88) నారదుని మాట - నీవు నిత్యశుదునివి, ముత్తునివి, భద్రునివి (89) వచ్చిదానంద రూపునివి, పనాతనునివి, పరమాత్మను. నీకు పుణ్య పాపములు లేవు ఓ కృష్ణ ! యాదవ నందన (90) ఐనా ఓ గరుడధ్వజ ! లోకములకు తెలిపే కొరకు, విధాన పూర్వకముగా ఓ మాధవ ! నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి (91) నీవిప్పుడు లోక హాంగ్రహణము చేయాలి. గంధమాదన పర్వతమందలి మహాపుణ్యప్రదమైన రామ సేతువు యందు (92) రాముడు స్థాపించిన రామనాధుడను పేరుగల లింగం యొక్క అభిషేకం నీటి కొరకు ధనుష్కోట యందు రాముడు (93) భూమిని ఛేదించి తీర్థమును పుట్టించాడు. దానివి కోటి అని అంటారు. నీ పూర్వావతారమైన రాముడు సులభతరంగా (94) బ్రహ్మహత్య నుండి విశుద్ధి కొరకు స్వయంగా నిర్మించాడు. ధర్యమైన పాపనాశకమైన దానిలో నీవుస్నానం చెయ్యి (95) దాని వల్ల నీకు కల్గిన మాతుల పధ దోషము తొందరగా నశిస్తుంది. కోటి తీర్థంలో హరిస్నానము బ్రహ్మహత్య దోషమును తొలగించేది (96) స్వర్గమోక్షములను, ఆయురారోగ్యమును ఇచ్చేది. అనే ముని వాక్యములను విని మాధవుడు (97) ఆ క్షణంలో ఆ ఋషులందరిని వదలి తన దోష పరిశుద్ధి కొరకు రావు పేతువునకు వెళ్ళాడు. (98) కొద్ది రోజులలో కోటి తీర్థమునకు వెళ్ళి కృష్ణుడు నంకల్ప పూర్వకముగా స్నానం చేసి అనేక దానములు చేసి (99) మాతుల వధవల్ల కళిన దోషం నుండి క్షణంలో ముఢుడై వాడు రామనాథుని సేవించి తన నగరమైన మథురకు వెళ్ళాడు (100) శ్రీ సూతుని వచనము - ఇట్టి ప్రభావము కలది పుణ్యమైనది కోటి తీర్థము ఓ మునులార ! మానవుడు బ్రహ్మహత్యాది దోషములనుండి వెంటనే ముత్తుడౌతాడు. ఈ భూమి పై ఈ తీర్థముతో సదృశమైన తీర్థము మరొక్కటి లేదు (101) ఇక్కడ బ్రహ్మవిష్ణువులు త్రిమూర్తులు స్నానం చేసి సంతోషించారు. ఇతర దేవతలు కూడా ఇక్కడ విచారించాల్సింది లేదు (102) కోటి తీర్థ వైభవాన్ని చిత్రమైన దాన్ని మీకు చెప్పాను. దీనిని విని మానవుడు పర్వపాపములనుండి ముత్తుడౌతాడు (103) ఈ పుణ్యమైన అధ్యాయమును విని చదివి బ్రహ్మహత్యా దిపాతకములనుండి నరుడు ముక్తుడౌతాడు సత్యము. (104) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు కోటితీర్థ ప్రశంనయందు కృష్ణుని మాతులవధ దోషశాంతిని వర్ణించుట అనునది ఇరువది ఏడవ అధ్యాయము.
