స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

19వ అధ్యాయము

శ్రీ సూతులిట్లనిరి - తారక బ్రహ్మతీర్థంలో స్నానం చేసి ఓ బ్రాహ్మణులార ! శ్రద్ధతో లక్ష్మణ తీర్థమునకు ఆ పిదప వెళ్ళాలి (1) లక్ష్మణ తీర్థంలో స్నాతులై పాపవిముక్తులై మళ్ళీ పునర్జన్మ అంటూ లేని విమలమైన ముక్తికి వెళ్లారు (2) లక్ష్మణ తీర్థంలో స్నానమువలన సమస్త దరిద్రము నశిస్తుంది. ఆయుష్మంతుడు, గుణవంతుడు, విద్వాంసుడు ఐన పుత్రుడు జన్మిస్తాడు (3) లక్ష్మణ తీర్థము తీరమందు ఆ మంత్రం జపించిన వారు సర్వశాస్త్ర వేత్తలు, చతుర్వేదవిదులు ఔతారు. (4) దాని తీరమందు లక్ష్మణుడు మహా లింగమును స్థాపించాడు. ఆ తీర్థంలో స్నానం చేసి లక్ష్మణేశ్వరుని సేవించినవారు (5) ఇక్కడ దారిద్ర్య రోగములనుండి సంసారము నుండి ముక్తులౌతారు. లక్ష్మణ తీర్థంలో స్నానం చేసి లక్ష్మణేశ్వరుని సేవించి పూర్వము బల రాముడు బ్రహ్మహత్య నుండి ముక్తుడైనాడు (8) ఋషులమాట - ఓ సూతజ ! బలరామునకు బ్రహ్మహత్యదోషం ఎట్లా నంభవించింది. అది ఇక్కడ ఎట్లానన్దమైంది ఓ మహాముని! మాకు చెప్పండి (7) శ్రీ సూతులిట్లనిరి - పూర్వము బలరాముడు, శేషావతారుడు (8) అతడు కౌరవపాండవుల యుద్ధ ప్రయత్నాన్ని చూసి బంధువుల చావును నహించుటకు అ మరుడై (9) బుద్ధిమంతుడైన బలభద్రుడు ఇట్లా ఆలోచించాడు. నేనోకవేళ కురురాజునకు సహాయం చేసినట్లైతే (10) భయంకరమైన తొలగించరాని కోపం నా పై పాండవులకు కలుతుంది. ఒకవేళ పాండవులకు నేను ఉపకారం చేసినట్లైతే (11) దుర్యోధనునకు కోపం వస్తుంది. అని హలాయుధుడు భావించి, తీర్థయాత్రా నెపంతో మధ్యనుడై వెళ్ళి పోయాడు. అప్పుడు (12) ప్రధాన తీర్థమునకు వెళ్ళి సంకల్ప పూర్వకముగా స్నానం చేసి దేవతలకు, ఋషులకు పితృగణములకు నీటితో తర్పణం చేశాడు. (13) పిదప ప్రతీచి అభిముఖమైన సరస్వతీనదికి వెళ్ళాడు. హలి, వృథూదకము గల బిందు సరస్సు, ముక్తినిచ్చే బ్రహ్మతీర్థము (14) గంగ, యమున, సింధు, శతద్రు, సుదర్శనములను చేరి ఈ బలరాముడు ఆయా తీర్థములలో ధర్మము ప్రకారము స్నానంచేసి (15) మునీంద్రులతో సేవింపబడే నైమిశారణ్యము చేరాడు

వచ్చిన ఆతనిని నైమీష ముందలి తనన్వులు. చూచి (16) దీర్ఘనత మందున్నవారు ధర్మతత్పరులు, చక్కని శ్రద్ధకలవారు, ఆసనముల నుండి లేచి ఎదురేగి యదుశేషునకు నమస్కరించి (17) కంద మూల ఫలములతో అట్లాగే ఆసనము కల్పించుట ద్వారాను పూజించారు. పూజింపబడి ఈతడు ఆవనమును స్వీకరించి పురఃసరుడై (18) ఉన్నత ఆననమందు కూర్చున్న, నమస్కరించని, లేచి నిలబడని సూతుని, చేతులు జోడించని వానిని, వ్యాన శిష్యుని చూచి ఈతడు (19) వచ్చిన తను చూచియు నమస్కరించని విప్రులను చూచి, పౌరాణికోత్తముడైన సూతుని రోహిణి నూనుడు కోపగించాడు (20) మునుల మధ్యలో నింద్యుడు. అనులోమజుడైన ఈ సూతుడెందుకు. ఉన్నత ఆననమందు అధివసించి ఉన్నాడు. ఇది యుక్తమైంది కాదు (21) ధర్మసంరక్షకులమైన మమ్ములను ఈతడు చాలా అవమానం చేసి, లేచి నిలవకుండా, భీతిలేక, నమస్కరించకుండా ఉన్నాడు (22) ద్వైపాయనుని నుండి ఈతడు పురాణములు చదివి అన్ని ధర్మశాస్త్రములను, అనేక ఇతి హాసములు మొదలగు వానిని చదివి (23) నన్ను చూచి కూడా నమస్కరించటం లేదు. ఆసనం నుండి లేవటంలేదు. ద్వైపాయనుని గొప్ప గొప్ప. శిష్యులు, పైలాది బ్రాహ్మణులు (24) ఈతడు చేసిన విధంగా ఇటువంటి అధర్మమును వారు చేయనే చేయరు. దురాత్ముడు, అచేతనుడు ఐన ఈతనిని వధిస్తాను (25) దుషుల నిగ్రహము కొరకే నేను భూలోకమునకు వచ్చాను. నాతో చంపబడి ఈ దుష్టాత్ముడు శుద్ధిని పొందుతాడు అనుమానం లేదు (26) అని పలికి భగవంతుడైన హల ధరరాముడు బలవంతుడు ముసలధారి, చేతి యందలిరు శాగ్రముతో కోపంతో ఆతని శిరస్సును ఛేదించాడు (27) అక్కడున్న మునులందరు అయ్యో! కష్టము అని ఆక్రోశించారు. బ్రహ్మవాదులైన మునులు రామునితో అప్పుడు ఇట్లా అన్నారు (28) ఓ సంకర్షణ ప్రభు ! రాము! కష్టమైన అధర్మం: నీవు చేశావు. ఈ సూతునకు బ్రహ్మాసనాన్ని మేమే ఇచ్చాము (29) ఓహలాయుధ! అక్షయమైన ఆయుష్యాన్ని అతనికి మేమిచ్చాము.నీవు. దీన్ని తెలుసుకోకుండానే ఈ రోజు గొప్ప బ్రహ్మవథ చేశావు (30) యోగేశ్వరుడవైన నిన్ను నియమించువాడొక్కడూలేడు. ఈ బ్రహ్మహత్యకు నివృత్తిగా ఏంచేయాలో విచారించి దాన్ని చేయండి (31) లోకసంగ్రహణ కొరకు నీవే ప్రాయశ్చిత్తం ఆచరించు. ఓ రామ! ఇతరులు చెప్పకుండానే ప్రాయశ్చిత్తమాచరించు. అని అనగా భగవాన్ రాముడు ! ఆమునులను గూర్చి ఇట్లా అన్నాడు. (32).

రాముడిట్లనెను - ఓ ఆస్తి కులార ! పాపమును శుద్ధి చేసే ప్రాయశ్చిత్తమును ఆచరిస్తాను (33) ఇవ్వడు లోక సంగ్రహణముకొరకు మరొక కోరికతో కాదు. మనం ఎలాంటినీయమాన్ని పావశాంతికొరకు ఆచరించాలో (34) అటువంటి నియమాన్ని నాకు మీరు ఈ వేళ చెప్పండి. మీరు ఈ నూతునకు ఇచ్చిన అక్షయమైన ఆయుష్యాన్ని, ఇంద్రియములను, నత్త్వమును యోగమాయతో నే నేర్పరుస్తాను (35) మునులిట్లన్నారు. ఓ ప్రభు! పరాక్రమ వంతుడవైన నీ అస్త్రము యొక్క మృత్యువునకు మాకు నత్యవచనము - కలిగేట్లుగా ఓరామ! నీవు ఆచరించాలి (36) రామోక్తి :- ఆత్మయే పుత్రరూపముగా ఔతుందనేది ఎల్లప్పుడూ వేదము (37) ఉదోషిస్తోంది. అందువల్ల ఈతని శరీరమునుండి దీర్ఘాయువు గల నత్వఇంద్రియబలోర్జితుడైన పుత్రుడు జన్మించని (38) ఆతడు ప్రతిరోజు మీకు పురాణాదులు చెప్తాడు. నా యోగమాయాబలము వల్ల వర్వజ్ఞుడై జన్మిస్తాడు (39) ఈ విధముగా బలరాముడు వారితో అని మళ్ళీ ఈ విధముగా పలికాడు. మీరు ఏ కోరికను చేయాలి వేను (40) చెప్పండి ఓ మునులార! నేను చేస్తాను అనుమానం లేదు. అజ్ఞానం వల్లనేను చేసిన ఈ పాపానికి కూడా నివర్తకమిది. ఓ మునులార! నాకు ప్రాయశ్చిత్తాన్ని మీరు చెప్పండి  అని రాముడనగా (41)

మునులిట్లనిరి - ఇల్వలుని కుమారుడు బల్వలుడను పేరుగలవాడు ఒక రాక్షసుడున్నాడు (42) ఓ రామ! వర్వసమయంలో ఆతడిక్కడికి వచ్చిమాయాగాన్ని పాడు చేస్తున్నాడు. లోకకంటకుడు దుష్టుడు ఐన ఆ పావ రాక్షసుని చంపు (43) దీనివల్ల నీవు మాకు ఇప్పుడు పూజచేసినట్లైతుంది. ఎముకలు విభూతములు రక్తము నురామాంసములు మా యాగమందు ఆ (44) రాక్షసుడు ఇక్కడికి వచ్చి ఎవ్వడూ వర్షిస్తుంటాడు. ఈ భారత భూభాగంలో ఎన్ని తీర్థములున్నాయో (45) వాటన్నిటియందు శ్రద్ధతో ఒక సంవత్సరము నీవు స్నానం చేయి. దానివల్ల నీ పాపశాంతి ఔతుంది. ఇక్కడ విచారించాల్సింది లేదు (46) శ్రీ నూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులార ! వర్వకాలమందు మునీ క్రతువు ఆరంభం అయ్యాక భయంకరమైన రజోవర్షము, భయంకరమైన రంగవతము (47) పూయరక్తముల వర్షము కలిగింది. విషమయమైన వర్షమును బల్వలుడు కళించాడు కూడా (48) యజ్ఞశాలయందు క్షణంలో శూలముచేత ధరించిన రాక్షసుని మహాబలపరాక్రమవంతుని ఈ బలభద్రుడు చూచాడు (49) మహా దేహముకల దగ్ధమైన అద్రిలా ఉన్న వానిని చూచి, కాల్చిన రాగిలా ఉన్న మీసాలు, కోరలు వీనితో భయంకరమైన ముఖముగల (50) వానిని చూచి బలరాముడు వరులను చీల్చేశక్తి గల ముసలమును స్మరించాడు. దానవులను చంపే నాగలిని, దైత్యులను విచారించే శక్తి గల గదను (51) ఇతర ఆయుధములు ఆతడు స్మరించినవి ఆతనిని చేరాయి. నాగలి చివరతో ఆకాశంలో సంచరించే బల్వలుని లాగి (52) కోపంతో తల పై వేగంగా ముసలంతో కొట్టాడు. రక్తాన్ని కక్కుతూ ముక్కలైన నొసలు గలవాడై భూమి పై పడిపోయాడు (53) దీనమైన వాక్కు గలవాడై వజ్రంతాకిడిని పోందిన వర్వతంలా బల్వలుడు వడిపోయాడు. మునులు రాముని స్తుతించి స్వచ్ఛమైన (మంచి) ఆశీస్సులను వలికి (54) శుభమైన నీటితో, వృతశత్రువును సురలు అభి షేకించినట్లు బలరాముని అభిషేకించారు. అంబుజములతో శోభిల్లే వైజయంతిమాలనిచ్చారు (55) మాధవునకు శుభప్రదమైన వస్త్రములను భూషణములను ఇచ్చారు. వాటన్నిటిని ధరించి బలవంతుడైన రౌహిణేయుడు (56) పుష్పించిన వృక్షములతో కూడిన కైలాస పర్వతమువలె ఉన్నాడు. ఓ బ్రాహ్మణులార! మునులతో అనుజ్ఞ పొంది అన్ని తీర్థములందు (57) నియమాచారములతో కూడి ఒక సంవత్సరం తిరుగుతూ స్నానం చేశాడు (571/2).

పిదవ సంవత్సరకాలం నిండాక కాలిందీ భేదనుడైన బలరాముడు (58) తీర్థయాత్రను నమాప్తి చేసి తననగరానికి వెల్లుటకు ప్రారంభించాడు. పిదప నల్లగా ఉన్న నీడను వెనుక అనునరిస్తున్న దాన్ని కృశించిన దానిని (59) గట్టిగా అరుస్తున్న దానిని ఈ బలదేవుడు చూచాడు. పిదప ఆకాశం నుండి విన్పిస్తున్న మాటలను విన్నాడు (60) తెల్లని కాంతిగలవాడ, రౌహిణేయ, రామ, మహాబాహు! నీ వాచరించిన ఈ తీర్థాభిగమనంతో ఈ వేళ (61) ఓ రోహిణీ నుతా ! నీ బ్రహ్మ హత్యా దోషము ని శేషంగా నశించలేదు అనే మాటను విని బలరాముడు ఇట్లా చింతించాడు (62) తీర్థ సేవతో ఒక సంవత్సరకాలము నేను ప్రాయశ్చిత్తమాచరించాను. ఐనా ఆ బ్రహ్మహత్యాపాపము నశించలేదనే మాటను విన్నాను. (63) ఏమి చేయాలని ఆలోచిస్తూ నైమిశారణ్యమునకు వెళ్ళాడు. రిందముడైన రాముడు అక్కడికి వెళ్ళి మునులకు ఆ విషయం చెప్పాడు (64) ఆకాశంలోంచి విన్న మాటను, చీకటిమయంగా కన్పించిన దానిని అంతా మునులకు రోహిణీ నుతుడు నివేదించాడు. దానిని విని మునులంతా రామునితో ఇట్లా అన్నారు. (65) మునులమాట - ఓ రామ! పూర్తిగానీ బ్రహ్మహత్యా పాతకం నశించని పక్షంలో (66) ఓ మహాభాగ! గంధమాదన పర్వతానికి వెళ్ళు. మహా దు:ఖములను తగ్గించేది, మహా రోగముల నశింపచే సేది (67) రామ సేతువు యందు మహా పుణ్యప్రదమైన గంధ మాదన పర్వతమందు పాపనాశకమైన లక్ష్మణ తీర్థమను పేరుగల నరస్సు ఉంది (68) నీవక్కడ స్నానం చేయి ఆ లింగానికి నమస్కారము చేయి. దానితో నీ బ్రహ్మహత్యా పావము ఏమి మిగలకుండా పూర్తిగా నశించిపోతుంది. అనుమానం లేదు (69) శ్రీ సూతులమాట - ఇట్లా చెప్పగానే, రాముడు గంధమాదన పర్వతమునకు వెళ్ళి లక్షణ తీరమునకు చేరాడు. ఓ మునులార ! (70) ఆ తీర్థంలో హలాయుధుడు సంకల్ప పూర్వకముగా స్నానంచేసి బ్రాహ్మణులకు, ధనము, ధాన్యము, ఆవుతో, భూమిని, దానం చేశాడు (71) ఆ సందర్భంలో రామునితో అక్కడ అశరీరవాణి ఇట్లా అంది. ఇప్పుడు ఇక్కడ ఓరామ! నీ బ్రహ్మహత్య పూర్తిగా నశించి పోయింది (72) ఇక్కడ అనుమానించాల్సింది లేదు. నీ పట్టణానికి సుఖంగాపో అని అనగా దానిని విని బలభద్రుడు ఆ తీర్ధాన్ని ప్రశంసించాడు. (73) పిదప అక్కడ ఉన్నటు వంటి తీర్థాలన్నింటిలో మాధవుడు స్నానం చేసి ధనుష్కోటియందు స్నానం చేసి, రామనాథుని సేవించి, పాతకములన్నీ నశించగా తననగరమైన ద్వారకకు వెళ్ళాడు. (74) శ్రీ సూతులిట్లనిరి - ఓ విప్రులారా! ఈ విధముగా అమలమైన లక్ష్మణ సరస్సును గురించి మీకు చెప్పాను (75) పుణ్యమైనది, పవిత్రమైనది, పాపముల నశింపచేసేదీ, బ్రహ్మహత్యాదులనుండి శుద్ధిచేసేది. ఈ అధ్యాయమును చదివినవారు శ్రద్ధతో విన్నవారు (76) పునరావృత్తిలేని ముక్తిని పొందుతారు (77) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు లక్ష్మణ తీర్థ ప్రశంస యందు బలభద్రుని బ్రహ్మహత్యా విమోక్షణమనునది పందొమ్మిదవ అధ్యాయము నమాప్తము.