స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

30వ అధ్యాయము

శ్రీ సూతులిట్లనిరి - అతి పావనమైన నర్వతీర్థమందు స్నానం చేసిన నరుడు పిదప బ్రహ్మహత్యాది పాపములను నశింపచే సే ధనుష్కోటికి పిదవ వెళ్ళాలి (1) దానిని స్మరించి నంతమాత్రమున మానవుడు భూమియందు ముక్తుడౌతాడు. ధనుష్కోటిని చూచినవారు, అందుస్నానమాడినవారు, దాన్ని గూర్చి చెప్పినవారు (2) పదునెనిమిది రకములైన నరకములను అనుభవించరు. తామిస్రము, అంధతామిస్రము, మహారౌరవ రౌరవములు (3) కుంభీపాకము, కాల సూత్రము, అసి వత్రవనము, కృమిభక్షణము, అంధకూపము, పందంశం, శాల్మలి (4) సూరి వైతరిణి, ప్రాణరోధము, విశసనము, లాలా భక్షణము, అవీచి, సారమేయ భక్షణము (5) వజ్రకణకము, క్షారకర్ధమపాతనము, రక్షోగణ భక్షణము, శైల ప్రోతము, వితోదనము (6) దంద చక అశనము, పర్యావర్తనము, తిరోధానము, సూచీముఖము (7) వూయశోణిత భక్షణము, విషాగ్ని ఏడ, ఈవిధముగా ఇరువది ఎనిమిది రకముల నరకములు (8) ధనుష్కోటి యందు స్నానం చేయటం వలన మనుజుడు వీటికి పోడు. ఇతరుల డబ్బు, పంతానము, భార్య వీరిని అపహరించువోడు (9) భయానకమైన యమదూతలతో కాలపాశబదుడై చాలా సంవత్సరాలు వరమైన తామిస్ర నరకంలో వేయబడతాడు (10) ధనుష్కోటి యందు స్నానం చేసినచో అందులో వడవేయబడడు. భర్తను చంపి ఆతని ధనం మొదలగువాటిని అనుభవించే (11) శ్రీ మహాదు:ఖంతో నిండిన ఆంధతామిస్రంలో పడవేయబడుతుంది. ధనుష్కోటియందు స్నానం చేసిన యెడల ఈమె అందులో వడవేయబడదు (12) ఇతర ప్రాణులకు అవకారం చేసి తనతుంటుంబాన్ని పోషించేవాడు. వారినిక్కడే వదలి పోతాడు త్వరలో గౌరవమందోతడు వేయబడతాడు (13) అతిగా విషముగలిగిన మహావరములు గల రౌరవముందు యమ పురుషులు వేస్తారు. ధనుష్కోటి యందు స్నానం చేస్తే అతడు దీనియందు పడవేయబడడు (14) భార్య వుత్రులు లేకుండ తన దేహమును పోషించుకునే నరుడు, వరమైన మహారౌరవమందు వడవేయబడతాడు. తన మాంసాన్ని తానే తింటాడు. (15) ధనుష్కోటి యందు స్నానం చేస్తే దానియందు ఈతడు పడవేయబడడు (151/2).

ప్రాణంలో ఉన్న పశుపక్షులను ఇబ్బంది పెట్టేవాడు (18) దయలేనివాడు, ఈవ్యాదులచేత కూడా నిందింపబడే వాడు కుంభీపాకమందు తాగిన నూనెలో యమభటులచే వేయబడతాడు (17) ధనుష్కోటిలో స్నానం చేస్తే అందులో వేయబడడు. తల్లి దండ్రులను బ్రాహ్మణులను ద్వేషించే న రాధముడు (18) విస్తృతమై అయుత యోజన విస్తీర్ణమైన కాల నూత్ర నరకముందు వేయబడి, క్రింద అగ్నితో తపింవబడుతూ, పైన సూర్య కిరణాలతో తపింవబడుతూ, (19) ఆకలితో బాధపడుతూ తామ్రమయమైన ప్రాంతమున వేయబడతాడు. ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడడు (20) వేదమార్గాన్ని వదలి చెడుమార్గంలో నడిచే వరుడు యమకింకరులతో ఘోరమైన అవినత్రవనంలో వేయబడతాడు (21) ధనుష్కోటి - లో స్నానం చేస్తే అందులో వేయబడడు. రాజుకొని, రాజ భృత్యుడు తొని శిక్షించతగని వానిని శిక్ష ప్లే (22) విప్రునకు శరీర దండన విధించినవాడు సూళరముఖమందు వేయబడతాడు. నూరమైన వరథమందు యంత్రంలో పీడింపబడే చెరుకు గడవలె బాధింపబడుతాడు (23) ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందువేయబడడు. ఈశ్వర అధీనమైన వృత్తులలో తిరిగే ప్రాణులను హింసించిన నరుడు (24) తాను ఏడించిన జంతువులతోనే పీడింపబడుతూ యమకింకరులతో మహా భయంకరమైన అంధ కవమందు వేయబడతాడు (25) అంధకారం అధికంగా ఉన్న అక్కడ నిద్రలేక ఊరటలేక తిరుగుతాడు. ధనుష్కోటిలో స్నానం చేస్తే అందులో వేయబడడు (26) ధావ్యము సవము మొదలగు వానిని పంక్తి భేదంతో తినినవాడు, వంచయజ్ఞం చేయకుండా మోహంతో తినినవాడు (27) యమభటులలో కృమిటోజనమవే నరకంలో వేయబడతాడు. కృమిశతములతో తినబడుతూ కృషి సమూహములను తింటూ (28) తాను కృమిగా మారి పాపవశమయ్యేవరకు ఉంటాడు. ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడడు (29) బ్రాహ్మణుల విత్తమును దొంగతనంగా లేదా బలవంతంగా హరించిన, ఇతరుల సొమ్మును హరించిన రాజుగాని, రాజ పురుషుడు గాని (30) ఉత్కుమయమైన అగ్ని గుండములలో వేయబడి నందశములలో (పటుతారు) బాగా ఏ నంద నరక మందు వేయబడతాడు (31) ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడడు. పొందతగని స్త్రీని పొందిన పురుషాఢముడు (32) పొందతగని పురుషుని పొందిన స్త్రీ ఉత్కుమయమైన ప్రిని, అట్లాగే ఉక్కుమయమైన పురుషుని (33) కొల్పబడిన వివివి కౌగిలించుకొని సూర్యచంద్రులున్నంతకాలము ఉంటారు. సూర్య అనే నరక మందు వూరమైన బహు కంటకమయమైన దాని యందు వేయబడతారు (34) ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడరు. రకరకాలైన ఉపాయములతో ఉపద్రవములతో అన్ని జంతువులను బాధించే వరుని (35) బహుకంటకమైన శాల్మలి నరక మందు వేస్తారు. ధనుష్కోటి యందు స్నానం చేసిన వావిని అందువేయరు (36)

రాజుకాని రాజభృత్యుడుకొని పాషండ ముననునరించినవాడు, ధర్మమార్గమును భేదించినవాడు వైతరణి యందు వడవేయబడతాడు (37) ధనుష్కోటి యందు స్నానం చేస్తే ఆతడందులో, వడవేయబడడు. శూద్రస్త్రీ సహవానంతో దుష్పడైనవాడు శౌచాద్యాచారములు లేనివాడు (38) సిగ్గులేనివాడు,వేదముల వదలినవాడు, పశువులా సంచరించువాడు, చీము, మలము మూత్రము రక్తము శ్లేష్మము పిత్తము మొదలగు వానితో నిండిన (39) అతి బీభత్సమైన నరకమందు యమకింకరులతో వడవేయబడుతాడు. ధనుష్కోటిలో స్నానం చేస్తే అందు ఆతడు వేయబడడు. (40) వేటగాడు మృగములను రాళ్ళతో కొట్టి లేదా బాణములతోనైనా బాధించి చంపిన యెడల పరలోకంలో యమకింకరులు బాణముల నమూహంతో బాధిస్తుండగా (41) యమకింకరులు ప్రాణరోధమవే నరకమందు వేస్తారు. ధనుష్కోటిలో స్నానం చేస్తే ఆతడందు వేయబడడు (42) విధివత్ అనుషానములేక దాంభితుడై యజమందు పశువులను చంపుతాడో ఆతడు పరలోకంలో వైశననరకమందు (43) చేదింపబడుతు యమభటులతో దు:ఖ సంతులమందు వేయబడుతాడు. ధనుష్కోటి యందు స్నానం చేసిన యెడల ఆతడందు వేయబడడు. (44) నవరురాలైన తనభార్యతో రేతః సును తాగించేవాడు. పరలోకంలో రేతః పాయిఔతూ రేతః కుండంలో వేయబడుతాడు (45) ధనుష్కోటిలో స్నానం చేస్తే అందు ఆతడు వేయబడడు. దొంగల మార్గముననునరించి గ్రామదాహతుడై, విషమిచ్చువాడై (46) వణిక్ ద్రవ్యవహరించినవాడు ఓ బ్రాహ్మణులారా ! పరలోకంలో చాలాకాలము వజ్ర దంప్రాపాక అనే నరకంలో వేయ బడుతాడు (47) ధనుష్కోటిలో స్నానం చేస్తే అందు ఆతడు వేయబడడు. ఇవి వీనికన్న ఇతరములైన నరకములను పరలోకంలో ఉన్నవానిని (48) ధనుష్కోటిలో స్నానం చేస్తే మనుష్యుడు పొందడు. ధనుష్కోటిలో ఒకసారి స్నానం చేస్తే అశ్వమేథ ఫలము లభిస్తుంది. (49) ఆత్మవిద్యసాక్షాత్కరిస్తుంది. నాల్గు విధములముక్తిలభిస్తుంది. పావముయందుబుద్ధిరమించదు. దు:ఖంగానికలగదు (50) ధనుష్కోటి స్నానం వల్ల బుద్ధికి మంచిగా ప్రీతి లభిస్తుంది. తులా పురుష దానంవల్ల నరుడు పొందే ఫలాన్ని (51) ధనుష్కోటిలో స్నానం వల్ల పురుషులు పొందుతారు. నహస్ర గోదానంవల్లనరులకులభించే పుణ్యము (52) ధనుష్కోటిలో స్నానంవల్ల లభిస్తుంది. ధర్మార్థ కామమోక్షములలో వరుడు కోరేదానిని (53) ధనుష్కోటి స్నానం వల్ల వెంటవే పొందుతాడు (531/2)

మహా పాతకముక్తుడైనా నర్వపాతకములతో కూడినవాడైవా (54) ధనుష్కోటి స్నానం వల్ల వెంటనే రవిత్రుడౌతాడు ప్రజలకి యశము నంపద, జ్ఞానము ధర్మము విరక్తి (55) మనః. శుద్ధి ఇవన్ని ధనుష్కోటి స్నానం వల్ల నరులకు కలుతాయి. పదివేల బ్రహ్మహత్యలు, పదివేల సురాపానాలు (58) పదివేల గురుదారగమనము, పదివేల సువర్ణస్తేయము, అట్టివారిలో శోట్లకొలది నంపర్గము ఇవన్నీ పాపకారణాలు (57) ధమష్కోటి స్నానం వలన ఇవన్ని తొందరగా నశిస్తాయి. బ్రహ్మహత్యతో సమానమైనవి. సురాపానం వచనము (58) గురుప్తి గనునంతో నవనమైనవి, బంగారం దొంగిలించటం వచనసనం, తం నరంలో సమానమైనవి (59) అవన్నీ ఆస్తి తులార ! ధనుష్కోటి స్నానం వల్ల నశిస్తాయి. ఈ చెప్పిన వాటి విషయంలో ఎవ్వరూ పందేహించాల్సిన పనిలేదు (80) కావలిస్తే నాలుకచివర కాలిన గొడ్డలివి ధరిస్తాను, అనుమానంలేదు. ఇదంతా మతి కోవం చెప్పిందని అనే వాడు నరకానికి పోతాడు (61) వాడు నంథరుడని తెలుసుకోవాలి. అన్ని కర్మలలో వావిని బహిష్కరించాలి. ఓ బ్రాహ్మణులాడి ! ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము (62) అన్ని పాపముల నశింపచేపే ధనుష్కోటి మందు, అద్వైత నావ్నిచ్చే పురుషులకు భుక్తిని ముక్తిని ఇచ్చే (63) రోజు ఇష్టమైన కోరికలనిచ్చి, దాన్ని నశింపచేసే తీర్థముండగా కూడా దానిని వదలి ఈ జనుడు వేరేచోట ఆనందపడుతున్నాడు శ్రీడిస్తున్నాడయ్య ఎంత మూరము (64) అయ్యో ! మోహమాహాత్మ్యాన్ని నేను ఎప్పలేను ధనుష్కోటిలో స్నానం చేసిన వానికి ఆతంక (వ్యాధి) భయములేదు (65) ధనుష్కోటిని చూసి అక్కడ స్నానం చేసినవారు స్తుతించినవారు, ప్రశంసించిన వారు, పుళించినవారు, నమస్కరించినవారు వారు తిరిగి మాతృప్తన్యమును తాగరు ఓ బ్రాహ్మణులార ! (66) ఋషులిట్టావ్నారు. పూత! దానికి ధనుష్కోటి అవే పేరు ఎట్లా వచ్చింది (67) ఓ మునిపుంగవ ! విశదంగా, యథార్థంగా అదంతా చెప్పండి. నైమిషం యందలి ఋషులడుగగా మాతుడు తిరిగి వారితో ఇట్లా అన్నాడు (68)

శ్రీ నూతులిట్లనిరి- లోకకంటకుడైన రావణుడు యుద్ధంలో రామునితో చంపబడ్డాక, విభీషణుని లండో రాజ్య మందుంచాక (69) వైదేహలక్ష్మణులతో కూడిన దశరథాత్మజుడైన రాముడు షుగ్రీవ ప్రముఖులైన వీరులతో, వానరులతో కూడా కూడి (70) సిద్ధ చారణ గంధర్వ దేవ విద్యాధర ఋషులతో అప్పరవలతో నిరంతరము తన అద్భుత కార్యాలు పొగడబడుతూ (71) విలాసముగా ధరించిన కోదండము గలవాడై త్రిపురా మర సంహారకుడైన శివునివలె అందంతో పరివృతుడైన రాముడు గంధమాదనమునకు వెళ్ళాడు (72) అక్కడున్న మహాత్ముడైన రావువువి రావణాంతకుని ధర్మడైన విభీషణుడు చేతులు జోడించి ప్రార్థించాడు (73) ఈ సేతువు ద్వారా రాజులందరు బలోద్రిక్తులై వచ్చి వా నగరాన్ని ఏడిస్తారు (74) అందువల్ల ఓ రఘూద్వహా! ధనుష్కోటితో ఈ సేతువును ఛేదించు. అని విభీషణుడు ప్రార్థించగా ఆ రాముడు (75) తన పేతువును ధనుష్కోటితో భేదించాడు. అందువల్ల ఓ బ్రాహ్మణులార ! వాటి నుండి తీర్థము ధనుష్కోటి అని ప్రసిద్ధమైంది (76) శ్రీరామ ధనన్పు కోటితో చేయబడ్డ రేఖను చూచినవారు అనేక క్లేశములతో నిండిన గర్భ వావమును చూడరు (77) రాముడు ధనుష్కోటి ఉప్పు సముద్రములో చేసిన రేఖను చూస్తే ముక్తి లభిస్తుంది. స్నానం వల్ల కలిగే ఫలాన్ని చెప్పవలసిందిలేదు. (78) వరద్ర తీరంలో తపస్సు చేసిన మహాపాకములు నశిస్తాయి. గంగాతీరమందు మరణిస్తే మోక్షం లభిస్తుంది (78) లుందు దానము చేస్తే బ్రహ్మహత్య పావము నుండి శుదుడౌతాడు. ధనుర్కిట యందుపమ మదము దానము చేసిన నరులు (80) మహా పాతకములు నశింపచేసుకొని ముక్తి కొరకు, అభీష్ట వద్ధి కొరకు సమర్శలౌతారు. ఇందులో విచారించాల్సింది లేదు (81) ప్రాజ, ముక్తినిచ్చే రాశు ధనుష్కోటిని చూడనంతవరకు పాతకములతో ఉపపాతకములలో ఏడింపబడుతాడు (82) హృదయ గ్రంధి భేదింపబడుతుంది. అన్ని అనుమానాలు ఛేదింపబడుతాయి. ధనుష్కోటిని చూచినవారికి పాప కర్మలు క్షీణిస్తాయి (83) దక్షిణ సముద్రమందు సేతువు యందు రామచంద్రుడు విర్మించిన విభీషణుని హితమువడైన ధనస్సుతోటితో చేసిన రేఖ (84) కైలాన వంపదవిస్తుంది. వైకుంఠ బ్రహ్మలోకములకు మార్గము స్వర్గలోకమునకు మార్గము ఇక్కడ చర్చించాల్సిందిలేదు (85).

ధనుష్కోటిలో స్నానం చేయటం పుణ్యమైన యజ్ఞవలములతో సమానము. సర్వమంత్రములకన్న అధిక పుణ్య ప్రదము. సర్వదానముల ఫలాన్నిచ్చేది. (88) శరీరానికి క్లేశాన్ని కల్గించే తవన్పులు, యజ్ఞములు ఎందుకు. ధనుష్కోటిని చూచిన వానికి వేదములతో గాని శాస్త్రములతో గాని వనియేమి (87) రామ చంద్రుని ధనుష్కోటిలో నరులకు స్నానం లభిస్తే గంగయమున నదుల పుణ్యజలముతో ప్రయోజనమేమి (88) రామ చంద్రుని ధనుష్కోటి దర్శనం లభిస్తే, కాశీయందు మరణం వల్ల ముక్తిని ప్రార్థిస్తారెందుకు వ్యర్థంగా నరులు (89) ధనుష్కోటి యందు స్నానం చేయక మూడు రోజులు ఉపవాసముండక, బంగారమును, గోవును దానం చేయక ఉంటే దరిద్రుడౌతాడు, అనుమానంలేదు (90) ధనుష్కోటి స్నానం వల్ల లభించే ఫలము, అగ్నిష్టోమాది యజ్ఞములు బహం దక్షిణలతో హోమం చేసినా (91) ఆ ఫలితం లభించదు సత్యము సత్యము చెప్తున్నాను. ధనుష్కోటి అను పేరు గల తీర్థము అన్ని తీర్థముల కన్న అధికమైనది (92) ఈ భూమి పై వదికోట్ల వేల తీర్థములున్నాయి. అవన్ని ఈ ధనుష్కోటిలో సన్నిధిలో ఉన్నాయి. ఓ బ్రాహ్మణులార ! (93) అష్ట వసువులు, ఆదిత్యులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, సాధ్యులు, నదులు, విద్యాధరులు (94) వీరేకాక ఇతర దేవతలు కూడా ఎప్పుడూ నన్నిధిలో ఉంటారు. ఈ ధనుష్కోటి యందు ఎల్లప్పుడు బ్రహ్మ (95) సన్నిధిలో ఉంటాడు, శివుడు, విష్ణువు, ఉమ, లక్ష్మీ, సరస్వతి, దేవతలు, ఋషులు, ధనుష్కోటిలో తవన్పుచేసి (96) ఓ మునులార ! ఆ ఫలంతో విపులమైన సిద్ధిని పొందారు. ఇక్కడ స్నానం చేసిన, పితృ దేవతలను తృప్తి పరచిన నరుడు (97) సర్వపాపములనుండి ముక్తుడై బ్రహ్మలోకమందు ప్రకాశిస్తాడు. భక్తితో ఒకరికి భోజనం పెట్టిన నరుడు (98) ఈ లోకంలో పరలోకమందు ఆతడు అనంత సుఖాన్ని పొందుతాడు. శాకము, మూలము, ఫలము వీనితో జీవనం గడవని నరుడు (99) ఆ ఫలసిద్ధి కొరకు ధనుష్కోటి యందు స్నానం చేయాలి. అశ్వమేధక్రతువు చేయటానికి శక్తి లేని నరుడు (100) ధనుష్కోటిలో స్నానం చేస్తే ఆ ఫలితాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఎవరైనాకాని ఓమునులార ! (101) ధనుష్కోటి స్నానం వలన నింద్యయోని యందు జన్మించరు (101 1/2).

తా ॥ సూర్యుడు మకరరాశియందుండగా మాఘమాసమందు ధనుష్కోటియందు (102) స్నానం చేసిన నరుని పుణ్యం చెప్పటానికి వేను మరుణి తాను. మనమావ మందు ధనుష్కోటి యందు స్నానం చేసిన నరుడు (103) పర్వ తీర్థములలో గంగాదులలో స్నానం చేపిన వాడౌతాడు. అక్షయలోకములను పొందుతాడు. మోక్షాన్ని కూడా పొందుతాడు (104) పుటుక నుండి పురుషుడుని శ్రీ తాని చేసిన పాపమంత మానుమానంలో ఇక్కడ స్నానం చేయటం వల్ల పోతుంది (105) దేవతలందరికి రాముడు ఉత్తముడైనట్లే ధనుష్కోటి సర్వతీర్థములలో ఉత్తమము (106) మాఘమాసంలో అక్కడ స్నానము పర్వభీష్టములను తీర్చేది. ముప్పది రోజులు మావుమాసంలో వియమంగా జితేంద్రియుడైన (107) నరుడు మళ్ళీ జన్మరాఠుండుకొరకు ధనుష్కోటి యందు స్నానం చేయాలి. ఏక భుక్తం కలవారై క్రోధం జయించి ఇక్కడ మనుమవంలో స్నానం చేపిన నరుడు (108) బ్రహ్మహత్య నుండి ముత్తుడౌతాడు. శ్రీరాముని ధనుష్కోటియందు మాఘమాసంలో వరుడు (109) స్నానం చేసి శివరాత్రికి నిరాహారుడై, జితేంద్రియుడై రాత్రికి జాగరణ చేసి, ప్రతి రమమందు విశేషంగా (110) మహాదేవుడైన రామనాధుని విధి పూర్వకముగా పూజించి తరువాతి రోజు సూర్యోదయమయ్యాక ధనుష్కోటి యందు స్నానం చేవ (111) ఇతర తీర్థములందు కూడా నియమంగల మనము కలవాడై స్నానం చేసి నిత్యకర్మలాచరించి, రామనాధుని సేవించి (112) శక్తికి తగినట్లు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, భూమి, ఆవును తిలలను, ధాన్యమును విత్తమును శక్తి కొలది ఇచ్చి (113) బ్రాహ్మణుల అనుణను పొంది మటనియమం కలిగి తాను భోంచేయాలి. ఇట్లా చేసిన నరుని మహేశ్వరుడైన రామనాధుడు (114) సర్వపాపములనుండి విముక్తుని చేపి ఆతనికి భుక్తిముత్తుల విస్తాడు. అందువల్ల అన్ని విధముల ప్రయత్నించి ఓ మునులార ! మాఘమాసమందు (115) ముక్తికో పరులు. ఇక్కడ ధనుష్కోటి యందు స్నానం చేయాలి. అరోదయమందు సేతువు యందలి ధనుష్కోటి యందు స్నానం చేసిన నరుని (116) పాపములు క్షణంలో నశిస్తాయి ఓ ద్విజులార ! మహోదయ మందు ఇక్కడ స్నానము భుక్తిముక్తి ఫలములనిచ్చేది (117)

తా ॥ అక్టోదయ మహోదయ మందు ధనుష్కోటి యందు స్నానం చేసిన వానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు వశ్యులౌతారు (118) అక్టోదయ మహోదయమందు ధనుష్కోటి స్నానము, అద్వైత విజ్ఞానము లేకుండానే సాయుజ్య ప్రాప్తికి కారణమౌతుంది (119) అధోదయ మహోదయ మందు అక్కడ స్నానం చేయటం, మన్వాదులు చెప్పినట్లు ప్రాయశ్చితం చేయకున్నా పావులకు నిజమైన ప్రాయశ్చిత్తమౌతుంది (120) అక్టోదయమహోదయ మందు ధనుష్కోటిలో స్నానం చేస్తే నిజమైన యజ్ఞం చేయకున్నా (121) ఆతడు సంపూర్ణముగా యజ్ఞముల ఫలాన్ని పొందుతాడు అనుమానంలేదు. చంద్రసూర్యుల గ్రహణమందు ఇక్కడ స్నానం చేసిన మానవుని (122) పుణ్యఫలమును శేషుడు కూడా చెప్పలేడు. చంద్ర సూర్య గ్రహణములలో ధనుష్కోటి స్నానము (123) బ్రహ్మహత్యాది పాపములకు ప్రాయశ్చిత్తమని చెప్పబడింది. చంద్ర సూర్య ఉపరాగమందు శ్రీరామ ధనుష్కోటి (124) స్నానము సాయుజ్యము నిచ్చేది. సర్వతీర్థఫల ప్రదమని చెప్పబడింది. అక్టోదయ మహోదయమందు చంద్ర సూర్యగ్రహణమందు (125) భుక్తి ముక్తి ఫలమును కోరే నరులు స్నానం చేయాలి. అందువల్ల ఓ మునులార ! అన్నింటిని వదలి వెళ్ళండి. (126) భుక్తి ముక్తి వలప్రదమైన మహా పుణ్యమైన ధనుష్కోటికి. అక్కడికి వెళ్ళి పితరులకు పిండ ప్రదానము చేయుండి (127) ఇక్కడ ఎండనిర్వాపణము వలన ఆ కల్పము పితృతృప్తి కల్గుతుంది. పితరులకు తృప్తినిచ్చేస్థానములను మూటిని రాముడు నిర్మించాడు (128) సేతు మూల మందు, ధనుష్కోటి యందు గంధమాదన పర్వత మందు పితరులకు పిండమునిస్తే ఋణము నుండి ముక్తుడౌతాడు (129) సేతు మూలము, ధనుష్కోటి, గంధమాదనము, దేవ నిర్మితమైన ఈ మూడు స్థానములు ఋణ మోక్షకారకమని ప్రసిద్ధమైంది. (130) అందువల్ల అన్ని ప్రయత్నములతో ధనుష్కోటిని సేవించండి. ఇక్కడికి వచ్చి ధనుష్కోటి యందు నియమ పూర్వకముగా స్నానం చేసి (131) ద్రోణాచార్యుని సుతుడైన శ్రీమాన్ అశ్వత్థామ నిద్రిస్తున్న వారిని చంపిన దోషం నుండి వరమైన దాని నుండి క్షణంలో ముక్తుడైనాడు (132) ఈ విధముగా మీకు ధనుష్కోటి వైభవాన్ని చెప్పాను, ఓ బ్రాహ్మణులార ! భుక్తిముక్తులనిచ్చేది. నరుల అన్ని పాపములను తొలగించేది (133) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమంగు ధనుష్కోటి ప్రశంసయందు ధనుష్కోటి వైభవం చెప్పటమును వర్ణించటమనునది ముప్పదవ అధ్యాయము సమాప్తము.