స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

38వ అధ్యాయము

తా ఋషులిట్లవిరి - ఓనూత! కద్రువ క్షీర కుండి నిమజ్జనము వలన ఎట్లా ముతురాలైంది. పావ నిశ్చయురాలై సవతి యందు కపటమెట్లా ఆచరించింది (1) ఆ కద్రువ ఎవరి కూతురు, ఎవరికి సవతి. తన వవతిని వెవంతో కద్రువ ఎందుకు జయించింది. సూత ! కృపానిధి! శ్రద్ద గలిగిన మారు దీనిని చెప్పండి (2) అనగా శ్రీ సూతులిట్లవారు . ఓమునులారా ! మీరంతా మహా ఫలమునిచ్చే ఈ ఇతిహాసాన్ని వినండి. పూర్వం కృతయుగమందు ప్రజావతి సుతులు ఇద్దరు (3) కద్రువ వినత అని అర్కొచెల్లెండ్రు ఉండేవారు. కద్రువ వినత వారిద్దరు కశ్యపునకు భార్యలుగా ఉండిరి (4) వినత అరుణుని, గరుడుని ప్రవర్షించింది. భర్త దగ్గర నుండి కద్రువ సర్పములను చాలా మంది సుతులను పొందింది (5) అనంత వాసుకి మొదలుగా గల విషదర్ప సమన్వితులైన వారిని పొందింది. ఒకసారి అక్కాచెల్లెండ్రైన ఆ కద్రువినతలు (6) నమీపం నుండి వస్తున్న ఉచ్చైశ్రవ మను గుర్గాన్ని చూచారు. కద్రువ గుజాన్ని చూచి వినతతో ఇట్లా అంది (7) ఓ వినత! గుముతోక తెలుపా నలుపా విజంగా చెప్పు అని అనగా ఓ విప్రులార! వినత కద్రువతో ఇట్లా అంది (8) ఓ సుమధ్య ! గుణముతోక తెల్లగా నాకు కన్పిస్తోంది. మరి ఓ కద్రువ ! నీవేమను కుంటున్నావు. అని ఆమెను వినత అడిగింది (8) కద్రువ ఇట్లా వినతను అడిగి ఆమె తన అభిప్రాయాన్ని ఇట్లా చెప్పింది. ఓ నిందిత ! ఈగు ముతోక నల్లనిదని నేను భావిస్తాను అని (10) పిదప ఓడినచో దాసీ భావము పణముగా పరస్పరము ఏర్పరచుకొని ఆ నవతులు ఉన్నారు. ఓ బ్రాహ్మణులార ! (11) పిదప కద్రువ కానుకి ప్రముఖులైన సర్పములను తన సుతులను పిలిచి, ఓ పుత్రులార ! ఆమెకు నేను దానీకుండా చూడండి అని కోరింది (12) తన అభీష్ట సిద్దికొరకు మిక్కిలి ఆతురురాలై ఇట్లా అంది మీరు ఉచ్చైః శ్రవము యొక్కతో కనుకప్పండి, అని (13) ఆమె అభిప్రాయమును పాములు అంగీకరించలేదు. అప్పుడు కద్రువ కోపంతో, మండిపోతూ రోషపూరితమై శపించింది (14) పారీక్షితుని నత్రయూగమందు మిరంలో చావండి అని తల్లి కర్కోటకుడపుడు (15) కద్రువ పాదములకు నమస్కరించి దీనుడై ఇట్లా అన్నాడు. నేను ఉచ్చైః శ్రవము యొక్క తోకను కాటుకవలె మెరిసేటట్లుగా చేస్తాను (16) ఓ అమ్మ! నీవు భయపడొదు. అని శాపమునకు భయపడి పలికాడు. తెల్లనైన ఉచ్చైః శ్రవముతోకను కర్కోటకుడను పాము (17) తన వడగతో కప్పి కాటుక కొంతి కలిగేటుగా చేశాడు.

తా ॥ పిదప ఆ వినత కద్రువలు ఇద్దరు దాన్యము పణంగా గలిగి (18) దేవతల రాజు గుఅన్ని చూడటానికి తొందరగా వెళ్ళారు. చంద్రుడు, శంఖము, మాణిక్యములు, ముత్యములు, ఐరావతము వీటికి కారణమైన (19) యోగనిద్ర యందున్న హరికి యుగాంతకాలమందు పడకయైన సరితృతియైన సముద్రమును కద్రూవి నతలు దాటి (20) వెళ్ళి దేవరాజు వాహనమైన గుళమును చూచారు. నల్లని తోక గల గుర్రాన్ని చూచి వినత దు:ఖిత ఐంది. (21) దు:ఖితమైన వినతను కద్రువ దాసీ కృత్యమందు నియోగించింది. ఇంతలో తార్క్ష్యుడు గుడును ఛేదించుకొని అగ్నివలె (22) జన్మించాడు. ఓ బ్రాహ్మణులార ! ఆతని శరీరం ఒక పర్వతమంత ఉంది. అతని దేహ మాహాత్మ్యాన్ని చూచి ముల్లోకములు భయపడ్డాయి. (23) ఆ పిదప దేవతలు వక్షులలో శ్రేషుడైన ఆ గరుడునిస్తుతించారు. ఆతని దేహమాహాత్మ్యాన్ని చూచి ముల్లోకములు భయపడ్డాయి. (24) అని ఆలోచించి అత్యంత భయంకరమైన తన దేహాన్ని ఉపసంహరించుకొని అరుణున్ని వీపు పై కుర్చో పెట్టుకొని తల్లి దగ్గరకు వచ్చాడు (25) అప్పుడుకద్రువ నమస్కరిస్తున్న మిక్కిలి చలించిపోతున్న వినతతో ఇట్లా అంది. ఓ చెలి! నాకు నాగాలయం పోవాలనే ఆలోచన ఉంది (26) అందువల్ల నీ పుత్రుడైన గరుడుడు నన్ను నా పుత్రులను మోయాలి అని. అప్పుడు వినత, పుత్రుడైన గరుడునితో ఇట్లా అంది. (27) నేను ఈ కద్రువను మోస్తాను. ఆమె కొడుకులైన నర్పములను నీవు మోయి అని. అట్లాగే అని గరుడుడు తల్లి మాటలను అంగీకరించాడు. (28) వినత కద్రువను మోస్తోంది. మిగిలిన అందరిని గరుడుడు మోసాడు. అప్పుడు సూర్యుని నమీవం నందున్న నరములు ఆతని కిరణాలతో కొట్టబడినారు (29) కొడుకుల తావశాంతి కొరకు కద్రువ ఇంద్రుని స్తుతించింది. దేవరాజు అందరి తావమును నీటి ధారతో శమింపచేశాడు (30) బలవంతుడైన గరుడుడు సర్పములను తీసుకు వెళుతుంటే ఆ పాములు వినతాసుతునితో అన్నాయి. ఆ దేశమునకు తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళు (31) మేము ద్వీపాంతరం వెళ్ళటానికి, అందరం చూడటానికి తొందరపడుతున్నాము. నీవు మమ్ములను క్షణంలో మోయి ఓగరుడ! చేటీ సుత! అని (32) అప్పుడు గరుడుడు తన తల్లియైన వినతను అడిగాడు. నేను వీరిని ఎందుకు మోస్తున్నాను. నీవు ఈమెను ఎప్పుడూ మోస్తున్నావు. ఎందుకొరకు. (33) ఈ పాకేవాళ్ళు నన్ను చేటీ వుత్ర అని ఎందుకంటువ్నారు. నిజంగా అడుగుతున్న నాకు నీవు ఇదంతా చెప్పి తల్లి,అనీ (34).

తా ॥ గరుడుడు తల్లిని ఇట్లా అడుగగా తల్లి నుతునితో ఇట్లా అంది. ఓవుత్ర!. క్రూరురాలైన సోదరితో నెపంతో "ఓడింవబడ్డాను కు దాసీనయ్యను. నీవు అందుకే చేటి వుత్రుడవైనావు. అందుకే నీవు సర్పాలను మోస్తున్నావు. ఎప్పుడూ ఈమెను నేను చేస్తున్నాను (36) అని మొదలుగా వృత్తాంతాన్నంతా మొదటి నుండి ఈతనికి నివేదించింది. పిదప ఆ తల్లితో వినతాసుతుడైన గరుడుడు ఇట్లా అన్నాడు (37) ఈ దాన్యం నుండి విముక్తి కొరకు నీకు నేను ఇప్పుడేం చేయాలి అని సుతుడడుగగా వినత ఆతనితో ఇట్లా అంది. (38) ఓ గరుడ! నేను మరి నాతల్లి విమోక్షణ కొరకు మీరు, మరి మీతల్లికి నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి అని నర్పములనడుగు (39) అని తల్లి చెప్పగా గరుడుడు పాముల దగ్గరకు వెళ్ళి అడుగగా, ఆపాములు అప్పుడు అతనితో ఇట్లా అన్నాయి (40) నీవు అమరాలయంనుండి అమృతమును త్వరగా తెచ్చిన వెంటనే నీతల్లి దాస్యం నుండి ముత్తురాలౌతుంది. ఓ వైనతేయ అని (41) పిదప తల్లి దగ్గరకు వచ్చి గరుడుడు, నమస్కరించి ఇట్లా అన్నాడు. ఓతల్లి ! అమృతాన్ని తేవటానికి పోతున్న (42) అని అనగా తల్లి ఆ వినతాసుతినితో ఇటు అంది. ఓ కుమార! సముద్రమధ్యంలో కొందరు శబరులున్నారు (43) ఆ శబరులను తిని అమృతాన్ని నీవు ఇక్కడికి తీసుకురా అక్కడ శబరస్త్రీ సంగమమందు ఉత్సాహం కల మీద్విజుడు ఎవడైనా ఉంటే (44) వానిని తన బ్రహ్మతేజస్సుతో కంఠమును కాలుస్తున్న వాళ్లు ఆ బ్రాహ్మణుని విడిచి పోటు. రెక్కలు మొదలగు నీ అవయవములను మరుత్తు మొదలగు దేవతలు రక్షించని (45) అని తల్లి ఆశీస్సులు పొంది గరుడుడు పెద్దగా పెరిగి వెళ్ళాడు శబరాలయమునకు వచ్చి భుజిస్తున్న ఆతని ముఖంలోకి (46) తెరచిన నోటిలో వ్యాధులు ప్రవేశించారు. ఓ మునిశ్రేష్ఠులార ! (47) కంఠంను కాలుస్తున్న విప్రునితో వినతాను తుడిట్లన్నాడు. బ్రాహ్మణుడు పాపియైనా చంవతగనివాడు. అందువల్ల నీవు బయటికిరా (48) అని అనగా అవ్వడు బ్రాహ్మణుడు గరుడునితో ఇట్లా అన్నాడు. నాతో పాటు నా భార్యయైన కిరాతీ కూడా బయటికి రావాలి అని (49) అట్లాగే కానిమ్మని ఆ బ్రాహ్మణునితో వక్షిరాజు అన్నాడు. అప్పుడు గరుడుడు భార్యతో కూడా ఆ బ్రాహ్మణుని వదిలాడు (50) ఏప్రుడు కూడా తన కిష్టమైన ప్రదేశములకు నిషాదితో కూడా వెళ్ళాడు. వక్షవరుడైన గరుడుడు శబరులను తిని పిదప (51) తన తండ్రియైన కశ్యపుని దగ్గరకు వేగంగా చేరాడు.

తా ॥ ఎక్కడికి వెళుతున్నావని తండ్రి అడుగగా గరుడుడు ఆతనితో ఇట్లా అన్నాడు. (52) తల్లి దాస్య విమోచనం కొరకు అమృతం తేవటానికి వచ్చాను. అనేకమంది కిరాతులను తిని కూడా నాకు తృప్తి కలగటంలేదు (53) నన్ను రాత్రింబగళ్ళు ఎడతెగని ఆకలిబాధిస్తోంది. ఓ బ్రహ్మన్ ! తపోధన! దానిని తొలగించగలిగే ఆహారమును నాకు సమర్పించు (54) దానితో నేను సమర్థుడనై తేజస్సుతో అమృతమును తెస్తాను. అని సుతుడనగా కశ్యపుడు వినతోద్భవునితో ఇట్లా అన్నాడు (55) కశ్యప వచనము తమ్మునితో డూడి విభావసువను పేరుగల ముని ఉండేవాడు. అతనికి సుప్రతీకుడని సోదరుడు ఉండేవాడు. వాళ్ళిద్దరు వంశ శత్రువులు (56) వారు వరన్సరము శపించుకున్నారు. సుప్రతీకుడు ఏనుగుదినాడు. విభావసువు తాబేలు ఐనాడు. (57) ఈ రకంగా ధనమూలకమైన వివాదం వల్ల ఆ అన్నదమ్ములు వరన్సరం శపించుకున్నారు. గజము ఆరు యోజనముల ఎత్తురెట్టింపు పొడవు గలది (58) తాబేలు మూడు యోజనములు ఎత్తు వదియోజనముల విస్తృతి గలది. ఈ రెండు బద్ధవైరము గలవై ఈ సరస్సులో ఉన్నాయి. ఓ విహంగమ (59) పూర్వవైరాన్ననుసరించి జయించాలని కోరికతో కొట్లాడుతున్నాయి. ఆ రెంటినీ నీవుడిని తృప్తి మంతుడవై అమృతాన్ని తీసుకురా (60) ఈ విధముగా తండ్రితో చెప్పబడి వక్షిరాజు గజకచ్చవముల నమివమునకు వెళ్ళి పెద్ద కాయము, మహాబలపరాక్రమము గల వాటిని ఎత్తి (61) గోళ్ళతో వాటిని ధరిస్తూ విలంబమను పేరుగల నంతీర్థమునకు వెళ్ళాడు. అక్కడికి వచ్చిన పక్షిరాజును చూచి (62) దానీ తీరంలో ఉండే ఎత్తైన రోహిణమను పేరుగల మహా వృక్షము మహా బలపరాక్రమ వంతుడైన వైనతేయునితో ఇట్లా అంది (63) శతయోజనమాయతమైన నా ఈశాఖను అధిరోహించు. ఇక్కడ ఉండి ఓ ఖగరాజ ! నీవు గజకూర్మములను భక్షించు (64) అనీ అనగా మనోవేగముగల ఆ తరుణపక్షి అక్కడ ఉంది. ఓ బ్రాహ్మణులార ! ఆతని భారముతో ఆ చెట్టు యొక్క కొమ్మ విరిగింది (65) ఆ కొమ్మకు వేలాడుతున్న అధోముఖులైన వాలఖిల్యమునులను చూచి వారు పడిపోతారనే అనుమానంతో ఆ కొమ్మను గరుడుడు గ్రహించాడు (66) గజ కూర్మములను ఆ శాఖను తీసుకొని ఆకాశంలో వెడుతున్న అతనిని చూచి అవ్వడు అతని తండ్రి వినతాసుతుడైన గరుడునితో ఇట్లా అన్నాడు (67) ఓ వినతోద్భవ! ఈ కొమ్మను నిర్జనమైన శైలమందు పదులు అని అనగా అతడు అట్లాగే వెళ్ళి కొమ్మను నిష్పరుషనగమందు (68) ఉంచి అప్పుడు ఆ గజకచ్ఛపములను ఆ పక్షిరాజు భక్షించాడు. అప్పుడు ఆ సందర్భమందు దేవలోకమందు ఉత్పాతము కలిగింది (69).

తా ॥ ఇంద్రుడు ఉత్పాతమును చూచి తన పురోహితుని అడిగాడు. ఓ జీవ! (గురు) ఇక్కడ ఉత్పాతమునకు కారణమేమిటని మాటిమాటికి అడిగాడు. ఓ బ్రాహ్మణులార ! బృహస్పతి అప్పుడు ఇంద్రునితో ఇట్లా అన్నాడు (70) బృహస్పతి వచనము - ఓ ఇంద్ర! పూర్వం కాశ్యవముని క్రతువుతో పూజ చేశాడు (71) అందరు ఋషులను, సురలను, సిద్ఛలను, యక్ష గంధర్వకిన్నరులను ఆతడు యజ్ఞ సంభారసిద్దికొరకు పంపాడు (72) పొట్టిగా అంగుష్ఠమాత్రులై సంభారములతో కూడిఉన్న వాలఖిల్యులను గోష్పద జలమందు స్నాన మాడుతున్న వారిని చూచి నీవు నవ్వావు (73). ఓ ఇంద్ర! నీతో అవమానించబడి క్రుదలైన వాలఖిల్యులు అప్పుడు కోపంతో జ్వలించిన ముఖాలుగల వారు యజవహ్ని యందు హోమం చేశారు (74) దేవేంద్రునకు భయం కల్గించే శత్రువు కశ్యపునకు సుతుడుగా కలగని అని ఆతని కొడుకే ఈ వేళ గరుడుడు అమృతమును తీసుకుపోవాలనే ఉత్సాహముతో (75) వస్తున్నాడు. ఆ కారణంగానే ఈ ఉత్పాతము వచ్చింది. అని అనగా అగ్ని మొదలుగా గల దేవతలతో ఇంద్రుడు ఇట్లా అన్నాడు. (76) ఆ పక్షి అమృతమును, ఎత్తుకు పోవటానికి వస్తున్నాడు. దానిని రక్షించండి. అని ఇంద్రునితో ప్రేరేపింపబడి దేవతలు సాయుధులై అమృతమును రక్షించారు (77) వక్షిరాజు అప్పుడు ఆయుధములను ధరించిన దేవతలను సమీపించాడు. మహాబలుడైన ఆ గరుడుని చూచి దేవతలు వణికారు (78) గరుడునకు దేవతలకు గొప్ప యుద్ధం జరిగింది. అమృతపాలకుడైన విశ్వకర్మను పక్షి తన తుండంతో (ముక్కు) ఖండించింది (79) అప్పుడు దేవతలు శస్త్రములతో అనేక విధములుగా గరుడుని కొట్టారు. శస్త్ర పాణులైన దేవతలు అధికంగా గరుడుని బాధించారు (80) అగ్ని మొదలగు దేవతలను రెక్కల ద్వారా దూరంగా పారవేశాడు. అతని రెక్కలతో పారవేయబడిన దేవతలు అప్పుడు వరమకోవనులై (81) వారు నారాచములను భింది వాలములను నానాశస్త్రములను విసిరారు. వెదవ గరుడుడు వేగంగా దేవతల దృష్టిలోపించునట్లుగా (82) తనరెక్కలతో వినతోనుతుడు దుమ్మును లేపాడు. త్రిదశోత్తములు ఆ దుమ్మును గాలితో శమింపచేశారు (83) రుద్రులను వసువులను ఆదిత్యులను మరుత్తులను అట్లాగే ఇతర దేవతలను కూడా గరుడుడు రెక్కలతో ముక్కుతో బాధించాడు (84) దేవతలు పరుగెత్తాక ఆతడు తన ఎదుట అగ్నిని (మంటను) చూచాడు). చుట్టూ మండుతున్న అగ్నిని చల్లార్చటానికి ప్రయత్నించాడు (85) ఆతడు సహస్రముఖుడై ఆ ముఖములతో నూర్ల కొలది నదులనీరుతాగి, ఆ నీటితో వేగంగా ఆ అగ్నిని నశింపచేశాడు (86) తీవమైన అంచులు గల తిరుగుతున్న చక్రాన్ని సమీపంలో అమృతాన్ని రక్షిస్తున్న దాన్ని చూచి ఆ చక్రము రంధ్రముగుండా శరీరమును నంక్షేపించుకొని లోపలికి ప్రవేశించాడు. (87) పిదప నోరు తెరచి ఉన్న భీషణ ఆకారము గల రెండు పాములను చూచాడు. అవి అతనిని చూడగానే ఆ నర్పములు భస్మమైనాయి. గరుడుడు అప్పుడు (88) పక్షతుండములతో కప్పి అమృతమును తీసుకొని పైకి ఎగిరాడు.

యంత్రమును పెకిలించి పై కెగురుతున్న గరుడునితో మాధవుడిట్లన్నాడు (89) ఓ వక్షీశ ! నీవల్ల సంతోషం కలిగింది. ఓ సువ్రత ! వరం కోరుకో. కమలానాయకుడైన హరితో పక్షిరాజు ఇట్లా అన్నాడు. (90) మీ పైన నేనుండాలి (ధ్వజంలో జరమృతి కలగకూడదునారు నాకీపరం ఇమ్ము అని అనగా అట్లాగే కానిమ్మని హరి అన్నాడు (91) అని పలికి హరి అతనితో ఇట్లన్నాడు. నాకు నీవు వాహనం కమ్ము ఓ వినతానుత ! నారథంమీద జండాలో కూడా నీవే (92) అట్లాగే కానిమ్మని వక్ష కూడా కమలాపతియైన అచ్యుతునితో పలికింది. అమృతమును ఖగము తీసుకువెళ్ళిందని విని పిదప ఆఖండలుడు వేగంగా (93) పరుగెత్తి తొందరగా వజ్రాయుధాన్ని పక్షిరెక్కల పై విసిరాడు. పిదప గరుడుడు నవ్వి పాకశాననునితో ఇట్ల అన్నాడు. (94) ఓ ఇంద్ర వజ్రాయుధం వేయటం వలన నాకు బాధలేదు. ఓ నురనాయక! నీ వజ్రపాతం కూడా నవలమౌతుంది కూడా (95) అని పలుకుతూ తన రెక్కనుండి ఒక ఈకను వదిలాడు. శోభనమైన రెక్కలు (పర్ణము) ఈతనివి అని ఆతడు నువరుడైనాడు (96) బంగారుమయమైన ఆ నువరుని చూచి అందరు ఆశ్చర్యపడ్డారు. ఓ బ్రాహ్మణులార ! అప్పుడు గరుడుడు శత్రునితో ఇట్లా అన్నాడు. (97) మీతో పాటు ఈ చరాచరమైన జగత్తునంతాను ఎప్పుడూ మోయటానికి అమోముమైన శక్తి ఉంది నాకు. ఓ దేవేంద్ర ! (98) ఓ ఇంద్ర! యుద్ధంలో వేయిమంది ఇంద్రులు నాడు ఈడుఠారు. అని పలుకుతున్న గరుడునితో పాకశాననుడి అన్నాడు. (99). అమృతంతో నీకేం పని ఉంది. అమృతంను నాకు ఇచ్చేయి. అని ఓ వినతపుత్ర ఈ అమృతమును నీవు ఎవరికిస్తావో వారిప్పుడు (100) ఈ అమృతాన్ని తాగి జరామరణ వర్షితులై మాకన్న అధిక పరాక్రమ వంతులౌతారు. అట్లాగే దేవతలను బాధిస్తారు (101) అని పలుకుతున్న దేవేంద్రునితో గరుడుడు ఇట్లా అన్నాడు. నేను దీన్ని ఎక్కడ పెడతానో అక్కడికి నీవు వచ్చి దీనిని (102) త్వరగా తీసుకో అని అనగా గరుడునితో వృత్రహా (వృత్రహంత) ఇట్లన్నాడు. నేను సంతోషించాను. నీకు వరమిస్తాను. ఓ మహామతీ! వరం కోరుకో (103) అని , అనగా, గరుడుడు ఇంద్రునితో ఇట్లన్నాడు. నరీనృవములు వాతల్లి దాన్య విషయంలో స్థలాన్ని ప్రయోగించారు (104). ఓ పాకశాసన ! వృతహంత! వారు నిత్యము నాకు ఆహారంకాని అని ఆతడనగా అట్లాగేఠాని అని ఇంద్రుడు అతనితో అన్నాడు (105) పిదప ఈ గరుడుడు అమృతమును తీసుకొని వెళ్ళాడు. వెళుతున్న ఆ గరుడుని ఇంద్రుడు అనుసరించసాగాడు (106) ఓ ద్విజశ్రేష్టులార ! అతడు వేగంగా అమృతాన్ని తీసుకుపోదలచి తల్లి దగ్గరకు వచ్చి ఆ పక్షిరాజు సర్పములతో ఇట్లన్నాడు. (107) ఓ సర్పములార !. ఇప్పుడు నేను అమృతాన్ని కుశములపై ఉంచుతున్నాను. స్నానం చేసి శుచులై నిశ్చలబుద్ధి గలవారై అమృతాన్ని భుజించండి (108) ఓ వన్నగులార ! దాసీ భావం నుండి నా తల్లికి ముక్తి కలగని అని అనగా పాములు వినతానుతుడైన గరుడునితో అట్లాగే కానిమ్మని అన్నాయి (109) ఓ బ్రాహ్మణులార! దానీ భావం నుండి అప్పుడే వినత ముత్తురాలైంది. ఆ నరములు అమృత భక్షణ కొరకు స్నానం చేయటానికి అప్పుడే అన్ని వెళ్ళాయి (110) ఆ సందర్భంలో ఆ అమృతమును తీసుకొని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. పాములు స్నానం చేసి వచ్చి అక్కడ అమృతమును కానక (111) నాలుకలతో దర్భలను నాకాయి. వీటి పైనే గదా అమృతం ఉంచాడు అని.

నాటినుండి సర్పముల నాలుకలు దర్ఫాగ్రములతో చీలిపోయాయి (112) ఓ మునిశ్రేష్టులార ! రెండుగా ఐనాయి. అందువల్ల అవి ద్విజిహ్వలనబడ్డాయి. నుధానం యోగం వల్ల దర్భలు వవిత్రతను పొందాయి. (113) గరుడుడు తన తల్లిని దాసీభావం నుండి విడిపించి నెపంతో జయించిన తల్లిని కద్రువను కోపంతో శపించాడు (114) ఓ కద్రువ! నీవు నా తల్లిని మోసంతో జయించావుగదా. అందువల్ల నీవు భర్తపరిచర్యయందు అరురాలవు కావు (115) ఈ విధముగా గరుడుడు కద్రువను శపించి యధేచ్చగా వెళ్ళి పోయాడు. కద్రువినతలు ఇద్దరు తమ భర్త సమీపానికి వెళ్ళారు. (116) విముఖుడైన కశ్యపుడు కద్రువతో కోపంగా ఇట్లా అన్నాడు. ఓ కద్రువ! వినతను మోనంతో జయించావు కాబట్టి (117) ఓ దురాత్మిక ! నా వరిచర్యకు నీవు యోగ్యురాలవు కావు. స్త్రీని వురుషుడు కాని స్త్రీనిని పురుషునికాని (118) చలంతో జయించిన యెడల వాడు మహాపాతకి ఔతాడు, ఛలంతో జయించిన వానితో సంభాషించిన వాడు బ్రహ్మ హంతకుడు ఔతాడు. (119) దొంగ, నురతాగే వాడు, గురదారరతుడుగా ఆతనిని గ్రహించాలి. మునులు అతనిని సంసర్గ దోష దుష్మనీగా చెప్పారు (120) నీతో మాట్లాడటం వల్ల నాకు నరకమునిచ్చే దోషం కలుతుంది. కనుక ఓ కద్రువ! దారుణమైన దాన! నీవు నా దగ్గర నుండి పో (121) చలజేతతో నపంక్తిలో భోజనం చేసిన నరునితో సంభాషణ వల్ల వెంటనే నరకార్ణవంలోపడతాడు (122) ఛలజేతను చూచిన పావశాంతి కొరకు సూర్యుని గాని నీటిని గాని అగ్నిని కాని చూడాలి (123) ఛలజేత ఉన్న ఆశ్రమంలో కాని గృహంలో కాని ఇతరులుండరాదు. ఒకవేళ ఉంటే నరకాన్ని పొందుతాడు (124) అందువల్ల నా దృష్టి మార్గం నుండి తొలగిపో తొలగిపో వా ఆశ్రమంనుండి నరళ స్వభావురాలైన ఈ వినతను జయించావు (125) అని త్వరగా ఆ కద్రువను ధిక్కరించి, కశ్యపుడు అప్పుడు ఆ మహామతీ ! స్వచ్చశీలురాలైన ఆ వినతను స్వీకరించాడు. (126) ఈ విధముగా కఠినంగా కశ్యపుడు కద్రువతో అనగా ఆమె ఏడుసూ మిక్కిలి దు:ఖంతో బాధపడుతూ ఆతని పాదముల పై పడింది (127). పాదముల యందు పడిన ఆమెను చూచి మునిపుంగవుడు కశ్యపుడు ఆమె చేసిన పాపాన్ని స్మరించి ఆమెను స్వీకరించలేదు (128) అప్పుడు వినత కశ్యపునకు నమస్కరించి ఇట్లా అంది. ఓ కృపానిధి ! భగవాన్! ఈ నా సోదరిని స్వీకరించు (129) అజ్ఞానం వల్ల, అమాయకురాలైన కద్రువ చేసిన పాపాన్ని అంతా మీరు క్షమించండి. సాధువులు దయాశీలురు కదా (130) గరుడుని తల్లి ఈ విధంగా అనగా కశ్యపముని ఈమె పాపమునకు విముక్తి లేకుండా ఓ వినత! ఈమెను గ్రహించను అని అన్నాడు (131) దురాచారులైన నిన్ను నేను మూడుసార్లు శపిస్తున్నాను. కశ్యపుని మాటలను విని వినత తిరిగి ఇట్లా అంది. (132) నా సోదరి యొక్క పావమునకు నిష్కృతిని ఓ బ్రహ్మన్! మీరు చెప్పండి. దాని వల్ల ఈమె మీ పరిచర్యలో యోగ్యురాలౌతుంది (133) ఆమె ఇట్లా అనగా మారీచుడైన కశ్యపుడు మనస్సులో ముహూర్తకాలము ధ్యానం చేసి పిదప ఇట్లా అన్నాడు (134).

దక్షిణ సముద్ర తీర మందు ముక్తినిచ్చే పుల్లగ్రామమందు పాపనాశకమైన క్షీరనరమను పేరుగల తీర్థముంది (135) ఆ తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేత ఈమె దోషం నశిస్తుంది. ఆ తీర్థంలో స్నానం చేయకుండా వదివేల ప్రాయశ్చిత్తములు చేసినా (136) ఈమె ఈ దోషం నశించదు. అందువల్ల ఈమె ఆ సరస్సుకు వెళ్ళాలి. భర్త ఇట్లా చెప్పగా కద్రువ ఆ ద్విజోత్తమునకు నమస్కరించి (137) వెంటనే పుత్రుల సహాయంతో క్షీర సరస్పునకు బయలుదేరింది. ఆ కద్రువ పుత్రులతో కలసి కొద్దిరోజులు ప్రయాణించి (138) పుణ్యమైన క్షీర నరమునకు చేరి, శుచియై, ఇంద్రియముల జయించి సంకల్పించి క్షీర కుండ మందు నియమ పూర్వకముగా స్నానం చేసింది (139) ఆ చోట మూడు రోజులు ఉపవాసముండి ఆ క్షీర సరోజలమందు స్నానం చేసింది. నాల్గవ రోజు ఆమె ఆదరంగా స్నానం చేస్తుండగా శరీరం లేని ఆకాశవాణి విన్పించింది. ఓ బ్రాహ్మణులార ! (140) అశరీరవాణి మాట - ఓ కద్రువ నీవు ఇక్కడ స్నానం చేయటం వల్ల ఛలజేతృత్వ దోషంనుండి (141) విముక్తురాలవై భర్తృ శుశ్రూషకు యోగ్యురాలైనావు. అనుమానం లేదు. ఇక్కడ స్నానం చేయటం వలన గరుడుడు చెప్పిన నీ శాపం కూడా లయంది (142) నీవు నీ భర్త సకాశమునకు పో ఆతడు కూడా నిన్ను స్వీకరిస్తాడు. అని అశరీరవాణి ఆకాశవాణి పలికి విరమించింది. (143) ఆమాటకు కద్రువ నమస్కరించి సంతుష్టమానసయై తీర్ణమునకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి పుత్రులతో కూడి (144) భర్త సమావమునకు వెళ్ళింది. ఆతనికి శుశ్రూష చేయాలనే కుతూహలంతో వచ్చిన ఆమెను క్షీరనరోజలమందు స్నానమాడిన దానిని చూచి (145) సమాధిలో పావములు తొలగిన దానినిగా ఆమేను గ్రహించి కాశ్యపుడు ఆమెను తనకు కులాష చేయుటకు తగిన దానినిగా ఆ భార్యను అంగీకరించాడు (146) ఈ విధంగా మీకు కద్రూ పాపవిమోక్షణము గురించి చెప్పాను ఓ విప్రులార! పుణ్యమైన క్షీర సరోజలమందు స్నానం వల్ల ముక్తి లభిస్తుంది (147) ఈ అధ్యాయమును విన్న లేదా చదివిన నరుడు క్షీర కుండ స్నానం వల్ల కలిగే ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. (148) అశ్వమేధాది యజ్ఞముల సంపూర్ణ ఫలాన్ని పొందుతాడు. గంగాదీ నర్వతీర్థములందు అతడు స్నానం చేసిన వాడౌతాడు నిశ్చయము (149) ఈ ఓరతుండ ప్రశంన రూపమైన అధ్యాయాన్ని చదివినవాడు సహస్ర గోవులను దానం చేసిన వారి సశించని ఫలమును పొందుతాడు. (150) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి నహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు క్షీర కుండ ప్రశం నయందు కద్రువ చేసిన ఛలదోష శాంతి కథ వర్ణసమనునదీ ముప్పది ఎనిమిదవ అధ్యాయము.