స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

6వ అధ్యాయము

ఋషులిట్లనిరి - పౌరాణిక శ్రేష్ఠ! ద్వైపాయన శిష్య ! ఓ సూత ! నీవు ఉత్తమమైన చక్రతీర్థము దేవీవత్తన పర్యంతమని (1) ఇంతకు ముందు మాతో అన్నాను అందువల్ల కొంచం అడగాలనుకున్నాము. చక్రతీర్థంచి వరనున్న ఆ దేవీ పురము ఎక్కడుంది. (2) దానికి దేవీవత్తనమనే పేరు ఎట్లా వచ్చింది. శ్రీరామ సేతు మూలమందు స్నానం చేసిన పాపులకు గూడా (3) ఎటువంటి పుణ్యం లభిస్తుంది. చక్రతీర్థంలో వచ్చేవుణ్యం కూడా. వీటిని ఇతర విశేషాలను కూడా చెప్పండి ఓ పౌరాణిక శ్రేష్ఠ అని (4) శ్రీ నూతులిట్లనిరి - ఇదంతా చెప్తాను ఓ మునిశ్రేష్ఠులారా ! వినండి చదివే వారికి వినేవారికి కూడా ఈ ఆఖ్యానము పాపనాశకము (5) శ్రీరాముడు తొమ్మిది రాళ్ళను స్థాపించి నముద్రమందు మొదట సేతువును బంధించాడు (6) అక్కడే దేవీపురం ఉంది. దాని చివర చక్రతీర్థము. దానికి దేవీ వత్తనం అనే పేరు ఎట్లా వచ్చిందో (7) దాన్ని చెప్తాను. మునులార ! శ్రద్ధగా వినండి (71).

పూర్వము దేవాసురుల యుద్ధంలో దేవతలతో సంతానం పోగొట్టుకున్న దితి (8) శోకమోహితురాలై తన పుత్రికతో ఇట్ల అంది. దితి మాటలు - ఉత్తమమైన తపోవనమునకు తపస్సు చేయుటకు ఓ బిడ్డ పొమ్ము (9) తప్పకుండా ఇంద్రియముల నిరోధించి పుత్రునికొరకు తపించు. ఆ వుత్రునితో దేవతలు ఇంద్రాదులు కూడా మిగులరు (10) ఇట్లా తల్లితో చెప్పబడ్డ బిడ్డ తల్లికి నమస్కరించి, మాహిషరూపం ధరించి, అడవికి వెళ్ళి, పంచాగ్నుల మధ్యనిలిచి, (11) ఆమె ఘోరమైన తపమాచరించింది దానితో లోకములు కంపించాయి. ఆమె తపస్సు చేస్తుండగా ముల్లోకములు భయకంపితమైనాయి (12) ఇంద్రాది దేవతలు ద్వీజశ్రేష్ఠులు మోహాన్ని పొందారు. ఆమె తపస్పుతో బాధపడిన సుపార్శ్వడనే ముని ఆమెతో ఇట్లా అన్నాడు (13) నుపార్శ్వనీ వాక్కు - ఓ సుశ్రోణి! నేను సంతోషించాను. నీకు కుమారుడు జన్మిస్తాడు. ముఖము మహిష రూపము శరీరము నరరూపము (14) మిక్కిలి పరాక్రమవంతుడై నీకు మహిషుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆతడు స్వర్గాన్ని సైన్యంతో కూడిన ఇంద్రుణ్ణి కూడా పీడిస్తాడు. (15) సుపార్శ్వుడు ఆమెతో ఇట్లా చెప్పి తపస్పునుండి ఆమెను విరమింపచేసి, ఆ తపస్వినిని ఓదార్చి తనలోకానికి తిరిగి వచ్చాడు.

బ్రహ్మ ఇదీవరలో చెప్పినట్లు మహిషుడు జన్మించాడు. పూర్ణిమనాడు సముద్రంలా ఆ పరాక్రమవంతుడు పెరిగాడు (17) విప్రచిత్తి కుమారుడు విద్యున్మాలి అనే రాక్షస శ్రేష్టుడు, ఓ ద్విజులారా! ఇతర రాక్షసులు ఈ భూమియందున్న వారు (18) వారంతా మహిషునికి ఇవ్వబడ్డ వరాల గూర్చివిని ఆనందించి, (మునిశ్రేష్టులారా) వచ్చి మహిషాసురునితో ఇట్లా అన్నారు.

ఓ మహామతి ! మనకు స్వర్గాధిపత్యము ఇది వరలో ఉండేది. దేవతలు విష్ణువు నాశ్రయించి తమ పరాక్రమంతో మనరాజ్యాన్ని తీసుకున్నారు (20) కనుక ఓ మహిషాసుర, నీ బలంతో మన ఆ రాజ్యాన్ని తీసుకురా నీ ప్రభావాన్ని నీ పరాక్రమాన్ని ప్రకటించు ఇవ్వడు (21) బ్రహ్మచే ఇవ్వబడ వరములచే ఉద్దతుడవు సాటిలేని పరాక్రమములు కలవాడవు. దేవగణములతో కూడా ఇంద్రుడిని యుద్ధంలో జయించు (22) రాక్షసులతో ఈ విధముగా కోరబడిన ఈతడు దేవతలతో సహా యుద్ధంచేయదలచి, మహాపరాక్రమవంతుడైన ఈతడు అమరావతి మీదకు బయలుదేరాడు (23) దేవతలకు రాక్షసులకు నూరు సంవత్సరాలు యుద్ధం జరిగింది. అది ఘూరమైనట్టిది, రోమహర్షకము కూడా (24) దేవతల నమూహం భయంతో ఇంద్రుడు మొదలుకొని అంతా పారిపోయారు. బ్రహ్మను చేరారు (25) బ్రహ్మ ఆ దేవతలనందరిని తీసుకొని విశ్వపాలకులైన శివనారాయణులున్న చోటికి వెళ్ళాడు (26) అక్కడికిచేరి నమస్కరించి అనేక విధముల స్తోత్రములతో స్తుతించి మహిషాసురుని చేష్టలను బ్రహ్మవారికి నివేదించాడు. (27) శంభుకృషలకు, రాక్షసులవల్ల దేవతలకు కల్గిన పీడను నివేదించాడు. ఇంద్ర ఆగ్నేయము నూర్య, చంద్ర కుబేరవరుణాది దేవతలను (28) అధికారముల నుండి తొలగించి అందులో వీడే ఉన్నాడు. ఇతర దేవతల అధికారమందును వీడే ఉన్నాడు (29) దేవతలు స్వర్లోకము నుండి భూమికి తొలగించబడ్డారు. మహిషాసురునితో బాధించబడి దేవతా సమూహము మనుష్యులలాగా సంచరిస్తోంది (30) ఇది మీ ఇద్దరికి చెప్పటానికి నేను వచ్చాను. దేవగణములతో సహ వచ్చిన వారిని మీరిద్దరు రక్షించండి. (31)

బ్రహ్మ మాటలను విన్న రామ, మహేశ్వరులు కోపంతో భయంకరమైన ముఖాలు కలవారై చూడశక్యము కానివారైనారు (32) మిక్కిలి కోపంతో వెలిగిపోతున్న విష్ణువు ముఖంనుండి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చింది. శంభువు, బ్రహ్మల ముఖములనుండి అట్లాగే వచ్చింది. (33) ఇతరదేవతల శరీరాల నుండి, ఇంద్రుని శరీరం నుండి, ఒక ట్రూరమైన తేజన్పు వెలువడింది. అదంతా ఏకమైంది (34) వారందరి తేజస్సులరాశి మండుతున్న వర్వతంలా ఉంది. జ్వాలలతో దిగంతములకు వ్యాపించిన దానిని దేవతలంతా చూశారు (35) ఈ తేజసమూహము ఒక స్త్రీ రూపంగా మారింది. శివుని తేజస్సు ముఖముగా విష్ణువు తేజస్పు భుజములుగా (36) బ్రహ్మతేజస్పు పాదములుగా ఇంద్ర తేజస్సు మధ్యభాగముగా, యమ తేజస్సు కేశములుగా, చంద్రశేజన్పుకుచములుగా (37) వరుణ తేజస్సు జంను ఊరు భాగములుగా, వృధివీ తేజన్పు ఏరుదు భాగములుగా నూర్య తేజస్పు పాదాంగుళులుగా (38) వస్తువుల తేజసుక రాంగుళులుగా, కుబేరలేజన్పు వాసికగా (39) తొమ్మిది మంది ప్రజాపతుల తేజను పలువరునగా, అగ్ని తేజస్సు రెండుకళ్ళుగా (40) రెండు సంధ్యలు కనుబొమలుగా, వాయుతేజన్పు చెవులుగా, ఇతర దేవతల మిక్కిలి భయంకరమైన తేజన్పులు (41) ఇతర అవయవములుగా కల్పివంబడి మిక్కిలి తేజస్సు గల దుర్గ అను పేరుగల నారి, దేవ దానవులందరితో కూడా ఎదిరింపశక్యము కానిది ఏర్పడింది (42) నర్వదేవతల సమూహములచే తేజః నమూహము నుండి పుట్టిన ఆమెను చూచి మహిషబాధితులైన ఆ దేవతలు ఆనందం పొందారు (43).

ఆ పిదప రుద్రాది దేవతలు తమ నుండి ఆయుధములను తీన, శూలము మొదలగు ఆయుధములను ఆమెకిచ్చారు (44) వస్త్రమాల్యచందనములు భూషణములు ఆమెకిచ్చారు. ఆమె కూడా వస్త్రభూషణ చందనాదులతో (45) పూలు ఆయుధములు హారములతో, పరిచారకులతో అలంకరించబడి, భయంకరమైన స్వరముగలదై అట హాపముచేస్తూ ఆ భైరవి (46) రోదసి బాగమును కంపింపచేస్తూన్నట్లు దేవతలతో సేవించబడుతూ నాదం చేసింది. ఆమె, భయంకర వాదముతో నమస్త జగత్తు కదిలిపోయింది (47) సింహవాహనారూఢయైన ఆదేవిని అమరులు మునులు సిద్ధగంధర్వులు జయ శబ్దంతో పొగిడారు. (48) ఆమె భీషణనాదముతో ముల్లోకములు క్షోభించాయి. దేవతల శత్రువులైన దైత్యులు ఇదిచూచి ఆయుధములు ధరించి సిద్ధమైవారు (49) మహిషుడు కూడా కోపంతో ఆయుధము ధరించి పెద్దమైవాడు. రాక్షసులతో చుట్టబడి ఆ శబ్దాన్ని గురిగా చేసుకొని బయలుదేరాడు (50) తన తేజస్సుతో ముల్లోకములలో వ్యాపించిన ఆ దేవిని చూచాడు. ఆయుధములుగల అనంత బాహువులతో కూడిన దానిని తన ధ్వనితో భూమినంతా వణికింపచేస్తున్నదానిని (51) క్షోభించిన వమస్తములైన శేషాదినాగ వరంవరగల దానిని ఆ దేవిని రాక్షసులు చూచీ ఆయుధములనెత్తి సమీపించారు (52).

ఆదేవితో అసురులకు అస్త్రములతో శస్త్రములతో బాణములతో చక్రములు గదలతో ముసలములతో యుద్ధం జరిగింది. (53) గజశ్వరథ పదాతులు అసంఖ్యేయములైన వానితో కూడిన మహాబలవంతుడైన మహిషుడు శత్రునాశరుడైనవాడు దేవితో యుద్ధం చేశాడు (54) ప్రధాన రాక్షసనాయ కులు లక్షకోటి సహస్రములు. ఒక్కొక్క సేన యొక్క సంఖ్య తెలియదు (లెక్కింపరాదు) (55) వాళ్ళందరూ ఒకేసారి శక్తి గలిగి శస్త్రములలో దేవిని ఆవరించారు. అదేవి కూడా అంతకన్నా భయంకరమైనదై రాక్షసులు వదలిన బాణములను (58) తన ధనన్పు నుండి వెలువడిన బాణములతో అవలీలగా భేదించింది. రాక్షసుల శరీరములందు అనేకములైన బాణసమూహములను సృష్టించింది (57) దేవి యొక్క ఆశ్రయబలంవల్ల దేవతలు రాక్షసుల సమూహం నుండి నిర్భయులైనారు. యుద్దమందు శస్త్ర అస్త్రములతో ఇతర ఆయుధములతో యుద్ధం చేశారు. (58) ఆ పిదవ దేవతలు బలవంతులై దేవీ శక్తితో తుడినవారై రాక్షసులందరిని ఆయుధములతో నిర్మూలించారు. (59) తన సైన్యం నశించగా క్షోభించిన మహిషాసురుడు వేగంగా ధనస్పును తీసుకొని, గోవువాదం చేస్తూ (60) బాణముల సంధించి దేవతల సైన్యంపై వదిలాడు. ఇంద్రుని పై వదివేల బాణాలు, యముని పై ఐదువేల బాణాలు (81) వరుణుని పై ఎనిమిది వేల బాణాలు, కుబేరునిపై ఆరువేల బాణాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వస్తువులు, అశ్వినులు (82) ఇతర దేవతలు వీరందరిపై దానవరాజైన మహిషుడు, బలవంతులలో శేషుడు ఒక్కొక్కరిపై వదివేల బాణములను వదిలాడు (63) మహిషాసురునితో మర్దించబడి దేవతలు పరుగెత్తారు. రక్షించు, రక్షించుఅని అరుస్తూ దేవిని శరణువేడారు (64) అప్పుడే దేవి భూతవేతాళాది తన గణములను, మీరు తొందరగా రాక్షస బలాన్ని నాశనం చేయండి అని ఆదేశించింది. (85) వేను బలోద్దతుడైన మహిషునితో యుద్ధం చేస్తాను అని అంది. అప్పుడు దేవి యొక్క గణములతో రాక్షసులందరు తొందరగా హతమైనారు. (86) సైన్యం అంతా వాశనమయ్యాక, దేవి వంపిన గణములతో యుద్ధం చేయదలచిన ఆ మహిషుడు తన గణములతో నిల్చున్నాడు (67) ఇంతలో మహావాదుడు, సుచక్షుడు, మహాహనుడు, మహాచండుడు, మహాభక్తుడు, మహోదర, మహోత్కటలు (88) వంచార్యుడు, పాదచూడుడు, బహువేత్రుడు, ప్రబాహు తుడు, ఏకాక్షుడు, ఏకపాదుడు, బహుపాదుడు, అపాదకుడు (89) వీరు ఇతరులు అవే తులు మహిషాసురుని మంత్రులు యుద్ధం చేయదలచి యుద్ధమందు దేవి ఎదుట నిల బడ్డారు.(70).

మనోవేగంగల సింహవాహనాన్నధిరోహించి దేవి, ప్రళయ కాలమందలి మేఘధ్వనివంటి ధ్వనిగల భయంకరమైన ధనస్సు తీసుకొని (71) వజ్రవేగముగల బాణములను యుద్ధంలో విడిచింది. దశలక్ష గజములు శత లక్ష గుఱ్ఱములు (72) శత లక్ష రథములు, వది లక్షల పదాతులు వీటన్నిటితో కూడిన మహాహనుడను రాక్షసుడు యుద్ధంలో దేవీచే చంపబడ్డాడు. (73) దేవిబాణములతో ఆతని సైన్యములు చంపబడ్డాయి. లక్షకోటి సహస్రముల ప్రధాన అసురవాయకులు (74) మహిషునకు గూడా మహా బలపరాక్రమవంతులు ఉన్నారు. ఒక్కొక్క ప్రధానునకు చతురంగబలం కూడా. (75) మహాహనువునకు ఎంత బలంఉందో అంతబలం సైన్యం ఉంది. బంగారు పొదగబడిన చివరలుగల బాణములతో ఆ సైన్యం అంతా చంపబడింది. (76) జాము మాత్రంలో ఇదంతా ఒక అద్భుతంలాగా జరిగింది. ఓ బ్రాహ్మణులారా ! (76 1/2) (77)

అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంస యందు దేవీపురమనే పేరును గూర్చిన కథయందు దేవీ మహిషాసుర యుద్ధవర్ణనమనునది ఆరవ అధ్యాయము.