స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

32వ అధ్యాయము

తా శ్రీ నూతులిట్లనిరి - నైమిషారణ్య వాసులార! ధనుష్కోటి వైభవాన్ని ఇంతా చెప్తాను మీకు ఆదరంతో (1) సోమ వంశమందు పుట్టిన నందుడను మహారాజు సాగరమేహదుగా గల ఈ భూమిని ధర్మంలో పాలించసాగాడు (2) అతనికి ధర్మగుప్తుడని పిలువబడు పుత్రుడు కలిగాడు. రాజ్యరక్షాభారమును నందుడు తన కొడుకు యందుంచి (3) జితేంద్రియుడు, ఉతాహారుడు ఆరాజు తపోవనమునకు వెళ్ళాడు. తండ్రి తపోవనమునకు వెళ్ళాక ధర్మగువుడను పేరు గల రాజు (4) ధర్మజుడై నీతి తత్పరుడై భూమిని పాలించసాగాడు. ఇంద్రుడు మొదలగు దేవతలను బహువిధ యజములతో పూజించాడు. (5) బ్రాహ్మణులకు విత్తమును బహుక్షేత్రములను ఇచ్బాడు. ఆ రాజు పరిపాలిస్తుండగా అందరు తమతమ ధర్మములందు ఆసక్తితో ఉన్నారు. (6) దొంగలు మొదలగు వారితో కలిగే పీడలు కలుగలేదు. ఒకసారి ఈ ధర్మగుప్తుడు ఉత్తమమైన గుణాన్ని అధిరోహించి (7) వేటాడుట యందు ఆసక్తి కలవాడై అడవిలోకి ప్రవేశించాడు. దిక్కులన్ని తమలతాల మాంతాల కురవవృక్షములతో నిండి ఉన్నాయి (8) సింహ వ్యాఘ్రుములతో భయానకమైన ఆ అడవి యందు తిరుగసాగాడు. దిక్కులన్ని మదించిన తుమ్మెదల ధ్వనితో నిద్రిస్తున్నాయి. (9) వద్మకళార కుముదనీలోత్పల వనములతో నిండిన తటాకములతో పూర్ణమై - తపస్విజనులతో అలంకరింపబడి ఉంది (10) ఆ అరణ్యంలో తిరుగుతున్న ధర్మగుప్తరాజునకు రాలైంది. దిక్కులన్ని చీకటితో కప్పబడ్డాయి (11) రాజు కూడా పశ్చిమ సంధ్యను ఉపాసించి నియమం కలవాడై వేదమాతయైన గాయత్రిని ఆ అడవిలో జపించాడు (12) సింహ వ్యాఘ్రముల భయముతో ఈ రాజు ఒక చెట్టు నెక్కగా, సింహ భయంతో బాధపడుతూ ఒక ఎలుగు బంటు రాజుదరికి వచ్చింది (13) అడవిలో తిరిగే ఒక సింహము ఆ ఎలుగుబంటును అనుసరించి పరుగెత్తసాగింది. సింహంవెనుకపరుగెత్తిరాగాభయంతో ఎలుగుబంటు చెట్టెక్కింది (14) ఆ ఎలుగు బంటు చెట్టునెక్కి రాజును చూసింది. మహా బలపరాక్రమములు గల మహాత్ముడైన చెట్టుయందున్న (15) రాజును చూచి అడవిలో కన్పించే ఆ ఎలుగుబంటు ఇట్లా అంది. ఓ రాజేంద్ర భయపడొదు. ఇక్కడ ఈ రాత్రి ఉందాము (16) గొప్పబలము, గొప్పశరీరము, గొప్ప కోరలు కలిగిన ఈ భీషణమైన ఎంహము చెట్టు మొదటికి వచ్చింది (17) నేను మొదటినుండి నిన్ను రక్షిస్తుండగా నీవు నగము రాత్రి వరకు నిద్రపో. ఓ మహామతి ! మిగిలిన సగమురాత్రి నిద్రపోయే నన్ను రక్షించు నీవు (18) ఆ మాటను అంగీకరించి నందనుతుడు నిద్రపోగా అప్పుడు సింహము ఎలుగుబంటుతో ఇట్లా అంది. ఈ రాజు నిద్రపోయాడు. ఈతనిని వదులు అని (19)

తా ॥ ఓ బ్రాహ్మణులార ! ధర్మమెరిగిన ఆ ఋక్షము ఆ సింహంతో ఇట్లా అంది. వనంలో తిరిగే మృగరాజ ! నీకు ధర్మం తెలయదా (20) విశ్వాపపతులకు లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి. మిత్రద్రోపాలైన వాని పాపము పదివేల యజ్ఞములు చేసినా నశించదు. (21) బ్రహ్మహత్యాది పావములకు ఏదో రకంగా నిష్కృతి ఉంది. విశ్వాస ఘాతుల పావ ము కోటి జన్మలలోను నశించదు (22) ఓ వంచాస్యము ! ఈ భూమి మీద మేరువును మహాభారమైన దానినిగా భావించటం లేదు. విశ్వాస వూతకుడే లోకంలో మహా భారమైన వాడుగా వేను భావిస్తాను (23) ఇట్లా ఎలుగుబంటు అనగానే సింహం మౌనంగా ఉండి పోయింది. ధర్మగుప్తుడు మేల్కొనగానే ఎలుగుబంటుచెట్టు పై పడుకొంది (24) అప్పుడుసింహంఇట్లాఅంది రాజుతో ఈ ఎలుగుబంటును నాకు వదలు అని. ఇట్లా అనగానే రాజు ఏ మాత్రం శంకలేకుండా నిద్రిస్తున్న (25) తన తొడపై తల ఆన్చి నిద్రిస్తున్న ఆ ఎలుగుబంటును భూమి పైకి విడిచాడు. రాజు. దానిని పడవేస్తుండగా, అది తన గోళ్ళతో చెట్టును పట్టుకొని {28) అదృష్టవశాత్తు ! పుణ్యం భూమి పై వడలేదు. ఆ ఎలుగు గోడు రాజు దగ్గరకు వచ్చి కోపంతో ఇట్లా అంది. (27) ఓ రాజ ! నేను భృగు కులంలో పుట్టినవాళి. కామరూపధారిని నా పేరు ధ్యాన కాషాభిధుడు. ఎలుగుగోడు రూపం ధరించాను (28) ఓ రాజ ! తప్పులేని, నిద్రిస్తున్న నన్ను నీవు వదిలావు కనుక ఇక్కడి నుండి నా శాపం వల్ల త్వరగా ఉన్మత్తుడవై తిరుగు ఓ రాజ ! (29) అని ముని రాజును శపించి వేదవ సింహంతో ఇట్లా అన్నాడు. నీవు నృసింహుడవు. మహా యక్షుడవు పూర్వం కుబేరుని పచివుడవు (30) హిమవత్గిరికి ఒకసారి నీవు నీ భార్యతో కూడా వచ్చి, అజ్ఞానం వల్ల గౌతముని ఆశ్రమముందు సంతోషంతో విహరించావు (31) గౌతముడు కూడా దైవవశాత్తు నమిదలు తెచ్చే కొరకు పర్ణశాల మండి బయటికి వచ్చి వస్త్ర ములులేని నిన్ను చూచి శపించాడు. (32) నా ఆశ్రమంలో ఈ వేళనీవు వివస్త్రుడవుగా ఉన్నావు కనుక ఇప్పుడే పింహమువైపోదువుగాక అనుమానంలేదు అని (33) అని గౌతమ శాపం వల్ల వూర్వం సింహమువైనావు. కుబేర వచీవుడవు భద్రుడను పేరుగల యక్షుడవు పూర్వంలో నీవు (34) కుబేరుడు ధర్మశీలుడు ఆతని భృత్యులు. తడ అలాంటివారే. అందువల్ల అడవిలో కన్పించిన ఋషివైన నన్ను నీవు ఎందుకు హింసిస్తావు (35) ఓ మృగాధివ ! ఇదంతా నేను ధ్యానం వల్ల తెలుసుకున్నాను. (35)

తా ॥అవిధ్యాన కొవుడు చెప్పాక త్వరగా ఆతడు సింహరూపాన్ని వదలి (38) కుబేర సచివాత్మకమైన దివ్యమైన యక్షరూపాన్ని పొందాడు. అతడు చేతులు జోడించి నమస్కరిస్తూ ధ్యాన శాస్త్రమునితో ఇట్లా అన్నాడు (37) ఓ మహాముని! పూర్వ వృత్తాంతమంత రోజా వేమ లుముకున్నాను. గౌతముడు వా పతాలమందు వారు ప్రాంతాన్ని కూడా చెప్పాడు (38) ధ్యానఠాషునితో నీరు రూపంలో ఉండగా సంవాదం జరిగితే అప్పడు నీవు ఎంపిత్వం వదలి యక్షరూపాన్ని పొందుతావు (39) అని ముని వుంగవుడు, బ్రహయైన గౌతముడు నాతో అన్నాడు. ఈ రోజు వారు ఎంహత్వం పోయింది కనుక తెలుపుతుహ్నాను. (40) ధ్యాన కొషుడను పేరుగల వానిగా, శుదునిగా, కామరూపధరునిగా తెలుసుకున్నాను. అని పలికి ఆయక్షరాజు ఆ ధ్యానమునకు నమస్కరించి (41) శ్రేష్టమైన విమానమువెక్కి అలకాపురికి వెళ్ళాడు ఆ యక్షేశుడు వెళ్ళాక ధ్యాన కాష్ఠమహాముని (42) ఆడులేని స్వేచ్ఛాగమనం కలవాడుకనుక భూమి పైన యథేష్టముగా వెళ్ళాడు. కామరూపధరుడైన ధ్యానఠాష్ఠముని వెళ్ళాక (43) ముని శాపం వల్ల ధర్మగుపుడు ఉన్మత్తుడై తననగరికి బయలుదేరాడు. ఉన్నత్త రూపుడైన రాజును చూపి మంత్రులు (44) మనోరమమైన రేవాతీరంలో నున్న ఆతని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆతనితో నీ కొడుకును మతి భ్రంశమైనదని చెప్పారు. (45) ఆతని తండ్రి నందుడు కొడుకు వృత్తాంతమును తెలుసుకొని అవ్వడు కొడుకును తీసుకొని త్వరగా జైమిని దగ్గరకు వెళ్ళాడు. (46) ఆతనికి మొదటినుండి పుత్రుని వృత్తాంతాన్ని తెలిపాడు ఓ జైమిని ! భగవాన్ ! నా కొడుకు ఈవేళ ఉన్మత్తుడైనాడు (47) ఓ మహాముని ! వీని ఉన్మాదము తొలగిపోయే కొరకు ఉపాయం చెప్పండి. అని అడుగగా జైమిని ముని పుంగవుడు చాలా సేపు ధ్యానం చేశాడు. (48) చాలా సేపు ధ్యానించి నంద నృవునితో ఇట్లన్నాడు. ధ్యానకాముని శాపంవల్ల నీ కొడుకు ఉన్మత్తుడైనాడు (49) ఆ శాపం నుండి ముక్తి కొరకు నీకు ఉపాయం చెప్తాను.

తా ॥ పాపనాశనమైన పుణ్యప్రదమైన దక్షిణ సముద్రమందు సేతువుయందు (50) మహత్తరమైనది ప్రసిద్ధమైనది ధనుష్కోటి అనే తీర్థం ఉంది. పవిత్రమైన వాటికన్న పవిత్రమైంది. మంగళకరమైన వాటికి మంగళకరము (51) శ్రుతి విధమైనది, మహాపుణ్యప్రదమైనది. బ్రహ్మహత్యాదుల నుండి పరిశుద్ది చేపేది. ఓ రాజ! నీ కొడుకును అక్కడికి తీసుకువెళ్ళి ఈ వేళ స్నానం చేయించు (52) ఆతని ఉన్మాదము ఆ క్షణంలోనే నశిస్తుంది. అనుమానం లేదు. అనిచెప్పగా ఆజైమిని మునిపుంగవుని ఈతడునమస్కరించి (53) నందుడు కొడుకును తీసుకొని ధనుష్కోటికి అప్పుడే వెళ్ళాడు. అక్కడ కొడుకును నియమపూర్వకముగా స్నానం చేయించాడు (54) వెంటనే స్నానమాత్రం చేతనే కొడుకునకు ఉన్మాదము నష్టమైంది. ధనుష్కోటి యందు భక్తి పూర్వకముగా ఆనందుడు కూడా స్నానం చేశాడు (55) కొడుకుతో పాటు తండ్రి అక్కడ ఒకరోజు ఉండి రామనాధునీ, దయగల సాంబమూర్తిని పేవించి (58) కొడుకుతోపోయివస్తానని చెప్పినందుడు తపస్సు కొరకు వనమునకు వెళ్ళాడు. తండ్రివెళ్ళి పోయక పుత్రుడైన ధర్మగుప్తరాజు (57) భక్తిపూర్వకముగా రామనాధునకు అనే కధనముల నిచ్చాడు. బ్రాహ్మణులకు ధనము, ధాన్యము, త్రములు ఇచ్చాడు (58) మంత్రులతో కూడి ఆ పదవ తన నగరమునకు వెళ్ళాడు. శత్రువులు లేకుండా ధర్మంగా రాజ్యమును పాలించసాగాడు. (59) అతిధార్మికుడైన ధర్మగువుడు పితృపై తామహమైన రాజ్యాన్ని పాలించసాగాడు. ఉన్మాదములతో అపస్మారములతో, దుష్టగ్రహములతో ఏడింపబడిన నరులు (80) వారు కూడ ఇక్కడ స్నానం చేయటం వలన ధనుష్కోటి వలన పాపవిముక్తులౌతారు. వేను సత్యాన్ని చెబుతున్నాను. (81) ధనుష్కోటి ఉరమును వదలి ఇంకొక చోటికి పోయినవారు సిద్ధంగా ఉన్న ఆవుపాలను వదలి (బ్రహ్మ జెముడు చెట్నుపాలను యాచించినట్లే (62) ధనుష్కోటి ధనుష్కోటి ధనుష్కోటి అని మూడుసార్లు వరించి నరులు ఏ జలాశయంలోనైనా (83) స్నానం చేస్తే అనరులందరు బ్రహ్మ అనే పదమునకు చేరుతారు. ఈ విధముగా మీకు శుభమైన ధర్మగుప్రకథను చెప్పాను. ఓ బ్రాహ్మణులారా! (64) దానిని విన్న మాత్రముననే బ్రహ్మహత్యనశిస్తుంది. స్వర్ణస్తేయము మొదలగుఇతరములైనపావపంచయములు నశిస్తాయి (65) అని శ్రీ స్కాందమహాపురాణమందు ఏకాశీతి నహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మండమందు పేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంసయందు ధర్మగువుని ఉన్మాద విమోక్షణ వర్ణనమనునది ముప్పది రెండవ అధ్యాయము